శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

ఛందోబందో బస్తు లన్నీ

ఛట్‌ :ఫట్‌ ఫట్‌ మని త్రెంచి

damn it : ఏమిట్రా ఇ ? దంటే

Pray : it's poetry అందాం.

అర్ధాన్నిఅధానపు అడవిలోవదలి

గద్యాన్ని పద్యానికి పెళ్ళిచేదాం.

కాదన్నమాదన్నయెవడన్నా ఉంటే

వేమన్నయేమన్నాడోచూడమందాం.

హాష్‌ హూష్‌, హూష్‌ హాష్‌ అని కేకలువేసి

కావ్‌ కావ్‌ మ్యావ్‌మ్యావ్‌ అందాం గమ్మత్తుగా.

న...న...న.... న.... ..నత్తిమాటలు కూడా

మ.....మ.....మ....మ...మనవ్రాతల్లోఉండొచ్చు

అచ్ఛా : సేచ్ఛాజీవీ :

ఐతే, కైతే నీ వ్రాతని

argument కోసం ఒప్పుకున్నా,

పానుగంటివారు ఒప్పుకోరు.

పానుగంటివారు ఒప్పుకోకపోతే

పామువంటి దానికి విరుగుడుంది.

ఇంద్రకంటివారినడిగితే

ఏమిటంటారోతెలుసునా

"పులికి పిలక లేదనడం

చలికి తెలుగు రాదనడం ;

శ్రీనివాసరావు వ్రాస్తున్నది

మానిషాదగీతంలోఉన్నది."

కటకటా! లొటిపిటా చస్తే

కృ. శా. విషాదకావ్యం వ్రాయాలా ?

Sex లో x కర్ధం తీస్తూ

చలం కలం పట్టుకోవాలా ?

జీబ్రాకి algebra చిహ్నాల

లాంకోటూ పాంకోళ్ళూ తొడిగి

సాహిత్య పౌరోహిత్యం ఇస్తే

వెర్రికాదు surrealism రా సోదరా