వికీసోర్స్ చర్చ:తెవికీసోర్స్-సీఐఎస్ వార్షిక ప్రణాళిక జులై 2015 - జూన్ 2016

తాజా వ్యాఖ్య: Final comments/ముగింపు వ్యాఖ్యలు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

ప్రత్యేక ప్రణాళిక మార్చు

వికీసోర్స్ కి ప్రత్యేక ప్రణాళిక తయారుచేయటం ఆహ్వానించదగ్గ పరిణామం. కందుకూరి విరేశలింగం కృతుల ప్రాజెక్టు ద్వారా 1000పేజీలు వికీసోర్స్ లో చేరటం వాటికి విద్యార్ధులతో కలిపి 56మంది కృషి చేయటం వికీసోర్స్ కృషిలో మైలు రాయి. దీని కి కృషిచేసిన user:రహ్మానుద్దీన్ గారికి మరియు పాల్గొన్న ఆంధ్ర లయోల విద్యార్ధులకు, తోడ్పడిన సహసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:37, 31 మార్చి 2015 (UTC)Reply

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు అర్జున గారు. ప్రస్తుత సంవత్సరపు తెలుగు ప్రణాళికలో వికీసోర్స్ కు ప్రతేకంగా స్థానం కల్పించకపోయినా మన తెవికీ సముదాయ సభ్యుల అభ్యర్థన మేరకు వికీసోర్సుపై కృషి చేయడం జరిగింది. ఆశించినదానికంటే మెరుగ్గా ఫలితాలు సాధించాము. ప్రతీ కార్యక్రమం లాగే వికీసోర్సులో చేపట్టిన కార్యక్రమాలాకు తెవికీ సభ్యుల సహాయసహకారాలు మెండుగా అందాయి. వచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా తెవికీసోర్సుపై కృషి చేయడానికి ఈ ముసాయిదా ప్రణాళిక ఉపయోగపడుతుందని సీ.ఐ.ఎస్-ఏ.2.కె ఆశిస్తుంది. ఆచరణ విభాగంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేర్చవచ్చో సూచించగలరు.--విష్ణు (చర్చ) 10:31, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply

గత కృషిలో లోటుపాట్లు మార్చు

గత కృషిలో లోటుపాట్ల విశ్లేషణ ప్రణాళికలో కనబడలేదు. సహసభ్యులు గమనించిన లోటుపాట్ల గురించి ఎకో సూచనలు లేక చర్చాపేజీలలో వ్యాఖ్యల ద్వారా తెలియపరచిన వాటిగురించి వికీలో సి.ఐ.ఎస్ సభ్యుల స్పందనలు కూడా లేకపోవడం నిరాశ కలిగించింది. వాటి వివరాలు

  • సయ్యద్ నశీర్ అహ్మద్ రచనలు యంత్ర పాఠ్యీకరణలో ఎక్కువ దోషాలు(వ్యాఖ్య 1,
  • సయ్యద్ నశీర్ అహ్మద్ పాఠ్యీకరణ పేజీల నాణ్యతని అచ్చుదిద్దబడినదిగా చూపడంలో దోషం.(వ్యాఖ్య2)
  • సయ్యద్ నశీర్ అహ్మద్ రచనల పిడీఎఫ్ రూపంలో పొడవు వెడల్పు ల నిష్పత్తిలో దోషాల వలన, క్రాప్ ఇమేజితో చేర్చి న బొమ్మల పొడవు వెడల్పుల నిష్పత్తిలో దోషం (వ్యాఖ్య 3)

వాటిగురించి స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:47, 31 మార్చి 2015 (UTC)Reply

మీరు పైన సూచించిన లోటుపాట్లు ప్రవీణ్ గారి కృషిలోనివే. ప్రవీణ్ గారు కొత్త వాలంటీయరుగా ఈ తప్పులను చూసుకోలేకపోయారు. సీ.ఐ.ఎస్-ఏ.2.కె నుండి కూడా వారికి ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే వారు ప్రస్తుతం స్వంత పనుల వత్తిడి వలన వీటిని ఇప్పట్లో సరిచేయలేనని తెలిపారు. అయితే ఈ లోటుపాట్లను మనందరం కలిసి సరిచేయవలసిన అవసరం ఎంతైనావుంది. దీనికై సీ.ఐ.ఎస్-ఏ.2.కె నుండి వీలైనంత సహకారం ఉంటుంది. ఇక పిడీఎఫ్ దోశాన్ని రచయితను సంప్రదించి త్వరలోనే సరిచేయడానికి ప్రయత్నిస్తాము.--విష్ణు (చర్చ) 10:41, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
 
సరిలేని యూనికోడ్ మార్పిడితో గూగుల్ లో వెతికినపుడు కనిపించే దోషాలు
 
ఇద్దరు అచ్చుదిద్దినా మిగిలిపోయే దోషాలు చూపు ఉదాహరణ
మీ స్పందనకు ధన్యవాదాలు.ప్రవీణ్ దిద్దుబాట్లని పరిశీలిస్తే రచయిత:సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి రచనలను పాఠ్యీకరణం చేయడంలో ప్రధానంగా కృషి చేశారని తెలుస్తుంది.తొలిపేజీకూర్పులను యంత్ర పాఠ్యీకరణతో చేర్చారని, ఇదంతా బాట్ స్క్రిప్ట్ వాడి చేసినదిగా అనిపించింది.ఇది సిఐఎస్-ఎ2కె ప్రాజెక్టు. వికీపీడియా రచ్చబండలో మీరే ప్రవీణ్ సిఐఎస్-ఎ2కె ఇంటర్న్ గా చేరినట్లుఆలస్యంగా ప్రకటిస్తున్నట్లు 21 ఆగష్టు 2014న తెలిపారు. ఈ దిద్దుబాట్లు 2014నాలుగవ త్రైమాసికంలో జరిగినట్లు తెలుస్తుంది (మూల దత్తాంశం క్వెరీ). ఇప్పుడు మీరు ప్రవీణ్ కొత్త వాలంటీరని పేర్కొనడం సరికాదు. సాధారణంగా కొత్త వాడుకరుల కృషి పరిమితం కాబట్టి వారు చేసే కృషిలో లోపాలుంటే సహ సభ్యులు దిద్దగలుగుతారు. ఈ వాడుకరి బాట్ తో ఇలా చేయడం వలన బాట్ నైపుణ్యం గల వ్యక్తులు మాత్రమే వీటిని త్వరగా సరిచేయటమో , తొలగించడమో చేయకలుగుతారు. వికీసోర్స్ సముదాయంలో కృషి చేసే సభ్యుల సంఖ్య వికీపీడియా కన్నా చాలా తక్కువ కాబట్టి, దోషాలు కనుగొనటానికే కష్టం మరియు సరిచేయడం ఇంకా కష్టం(బొమ్మ మరియు చర్చ ఉపవిభాగంచూడండి]).ఇంకొక ప్రధానమైన సంగతేమిటంటే, పుస్తకాలను విపరీతమైన అచ్చుతప్పులతో వికీసోర్స్ లో చేరిస్తే , వికీసోర్స్ విలువ గణనీయంగా తగ్గిపోతుంది (బొమ్మ చూడండి). మరియుపుస్తకాలు దానం చేసిన రచయితల కృషిని అగౌరవపరచినట్లవుతుంది మరియు కొత్త రచయితలు తమ పుస్తకాలు వికీసోర్స్ లో చేర్చుటను నిరుత్సాహపరుస్తుంది.కనుక మీరు ఈ లోటుపాట్లని వేగంగా సరిచేయడానికి త్వరిత ప్రణాళిక రూపొందించి అమలు పరచి తరువాత కొత్త కార్యక్రమాలు చేపట్టటం మంచిది.--అర్జున (చర్చ) 01:21, 13 ఏప్రిల్ 2015 (UTC)Reply
ప్రవీణ్ ఏ.2.కె ఇంటర్న్ కాదని అనలేదు. ఈ పని ప్రవీణ్ యొక్క స్వఛ్ఛంద కృషి అని మీరు గమనించాలి. అదే విధంగా తెవికీలో అతను కొత్త వాడుకరి కూడా. ఈ లోపాలను వీలున్నంత త్వరగా సరిచేయడానికి కృషి మొదలు పెట్టడం జరిగింది. ఉత్సుకత ఉన్న సభ్యులు ఈ పనిలో సహకారాన్ని అందించవచ్చు.--విష్ణు (చర్చ) 11:42, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించినందులకు ధన్యవాదాలు. ఇకపోతే ప్రవీణ్ కృషి స్వచ్ఛంద కృషి అని ఎలా అనుకోమంటారు? సిఐఎస్ సభ్యులు ఒకటే ఖాతా వాడుతున్నందున ఏది సిఐఎస్ ఉద్యోగిగా కృషో, ఏది స్వచ్ఛందమో తెలియుటలేదు. ఇకముందైనా ఉద్యోగి పాత్రలో చేసే కృషిని గుర్తించడానికి వేరే ఖాతా వాడడం గురించి మరల పరిశీలించండి.--అర్జున (చర్చ) 09:00, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

సయ్యద్ నశీర్ గారి పుస్తకాల పేజీ నాణ్యతా స్థితి మరియు లోపాలు మార్చు

2014-04-13నఅన్ని పేజీల నాణ్యత క్వెరీ ఫలితం
cl_to pagecount
1 అచ్చుదిద్దబడని 950
2 అచ్చుదిద్దబడినవి 823
3 ఆమోదించబడ్డవి 348
2014-04-13న ఒక రూపమే (revision) గల పేజీల నాణ్యత క్వెరీ
cl_to pagecount
1 అచ్చుదిద్దబడని 925
2 అచ్చుదిద్దబడినవి 741

అనగా మొత్తం 2121పేజీలలో 348(16.4%) ప్రాజెక్టు పేజీలు చేర్చడం ముగిసిన మూడు నెలల తర్వాత 'ఆమోదించబడ్డవిగా' వున్నవి.యాంత్రిక దోషాలు మిగిలే అవకాశం ఎక్కువవున్నందున వీటన్నిటిని మిగిలిపోయిన దోషాలకోసం మరోసారి పరిశీలించి సరిచేయాలి. ఇక మిగిలిన 1773 పేజీలు ఎక్కువ దోషాలతో వున్న పేజీలు కాగా వాటిలో 741పేజీలు' అచ్చుదిద్దబడినవి' గా తప్పు నాణ్యత సూచికతో వున్నవి.ఇలాంటి దోషాలు ప్రాజెక్టులో యాంత్రికంగా మార్చిన చాలా పేజీలలో వున్నందున తెలుగు వికీసోర్స్ నాణ్యతా గణాంకాలను తప్పుగా చూపెడుతుంది, కావున ఇటువంటి పనిని సత్వరమే సరిచేయాల్సిన అవసరం వుంది. --అర్జున (చర్చ) 06:29, 13 ఏప్రిల్ 2015 (UTC)Reply

పైన చెప్పిన విధంగా దీనిమీద సత్వరమే కృషి చేద్దాం.--విష్ణు (చర్చ) 11:42, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
గణాంకాలు మరల పరిశీలించితే తప్పునాణ్యతా సూచికని సరిచేయుటకు బాట్ తో సత్వరమే జరగవలసిన కృషి ఇంకా ప్రారంభించినట్లు కనబడలేదు. సిఐఎస్-ఎ2కే దీనికి తగినంత ప్రాధాన్యత ఇవ్వనందుకు బాధగా వుంది.--అర్జున (చర్చ) 09:05, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఇతరులనుండి సహకారం వివరాలు? మార్చు

ఇతరులనుండి సహకారం లో

1 PD x 5% ** కు 40,800,
వికీ సభ్యులకు సహకారం 50,000రూపాయలు,
డిజిటైజేషన్ బడ్జెట్ గా 2,00,000 రూపాయలు కేటాయించారు.

ఇటువంటివి ఎలా అంచనా వేశారు. గత సంవత్సరంలో లభించిన విలు వ ఎంత? దీని గురించి మరిన్ని వివరాలు తెలపండి.--అర్జున (చర్చ) 04:51, 31 మార్చి 2015 (UTC)Reply

గత సంవత్సర ప్రణాళిక, బడ్జెట్ చూడండి. తెలుగు ప్రణాళికలో భాగంగా ఇప్పటికే (జులై - డిసెంబరు 2014 వరకు) సి.ఐ.ఎస్.-ఏ.2.కె ఇతరులనుండి దాదాపు 2,50,000/- విలువ చేసే సహకారం సంపాదించగలిగింది. దానిని బేరీజు వేస్తూ ఈ సారి బడ్జెట్ అంచనా వేయడం జరిగింది. ఉ.దా. Program Director వేతనంలో దాదాపు 1/3 భాగం సీఐఎస్ ఇతర వనరులనుండి అందించింది. ఇది ఇక ముంది కూడా అందించడానికి సీఐఎస్ ప్రయత్నిస్తుంది. అలాగే సి.ఐ.ఎస్.-ఏ.2.కె ఒక సంస్థాగత భాగస్వామ్యం వారి సహకారంతో దాదాపు 50 వేల పైచిలుకు పేజీలను (2,00,000 విలువ చేసే) డిజిటైజేషను (స్కానింగ్) చేసి తెవికీసోర్సుకు అందించడానికి వచ్చే సంవత్సరంలో ప్రయత్నిస్తుంది. ఈ మా ప్రయత్నం సఫలీకృతమవుతుందని ఆశిద్దాం. --విష్ణు (చర్చ) 11:00, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
మీరు పేర్కొన్న గత సంవత్సర ప్రణాళికకి పైన నేను లింకు చేర్చాను. అలాగే సిఐఎస్ గత కృషి గురించిన లింకులకు సమగ్రపేజీ కూడా చేర్చాను.వీటన్నిటిలో నాలుగైదు గంటలు సమయం వెచ్చించి వెతికినా నాకు, మీరు ఇతరులనుండి పొందిన సహకారం వివరాలు కనబడలేదు. మీరు సరియైన లింకులు చేర్చితే మరింత చర్చకు వీలవుతుంది.--అర్జున (చర్చ) 00:15, 13 ఏప్రిల్ 2015 (UTC)Reply
ఇలాంటివి ఏలా అంచనా వేశారు అన్నందుకుగాను గత ప్రణాళిక బడ్జెట్ చూడమన్నానండీ. ఇక ఇతరుల నుండి సహకార వివరాలు ప్రతి త్రైమాసికం మేము అంతర్గతంగా చేస్తున్నా రిపోర్టులలో మాత్రమే ఉంది. అన్ని భాషా ప్రాజెక్టులలో సమిష్టిగా ఇతరుల నుండి సహకారం అందిన విలువ ప్రతి ఎఫ్.డి.సి. త్రైమాసిక రిపోర్టులలో వెళ్ళడించడం జరిగింది. మొదటి త్రైమాసిక|, రెండవ త్రైమాసిక రిపోర్టులు చూడగలరు. మీ సమయం వృధా అయినందులకు క్షంతవ్యుడను --విష్ణు (చర్చ) 11:56, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
లింకులు తెలిపినందులకు ధన్యవాదాలు. అయితే ప్రణాళికలో ప్రాజెక్టు గురించి వివరమైన బడ్జెట్ ఇచ్చి, ఖర్చులలో వివరంగా ఎందుకు తెలుపలేకపోతున్నారో తెలియదు. పారదర్శకతకు మారుపేరైన సిఐఎస్ లో అంతర్భాగంగా పనిచేస్తున్న సిఐఎస్-ఎ2కె నుండి ఇటువంటి సమాధానం సంతృప్తికరంగా లేదు. ఇటువంటి స్థితి ప్రణాళికని సరిగా సమీక్షించుటకు సహాయపడదు.--అర్జున (చర్చ) 09:12, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

పటం గురించి సందేహం మార్చు

పటంలో ఆంధ్ర లొయోల కళాశాల విద్యార్థుల జరిపిన కృషికి గుర్తులే అలా పై స్థాయికి చేరిన గ్రాఫ్ బిందువులని తెలిపారు.ఇవి ఎలా సేకరించారు? కందుకూరి విరేశలింగం కృతి మొత్త 1000 పేజీలలోపు కాబట్టి ప్రతి నెల వెయ్యి పేజీలు పైగా చేరినట్లుగా చూపిస్తున్నది అర్ధం కాలేదు. --అర్జున (చర్చ) 05:01, 31 మార్చి 2015 (UTC)Reply

అర్జున గారు మీరు వీరేశలింగం కృతి గురించిన కృషి మాత్రమే చూసినట్టున్నారు. ఆ 1,000 పేజీలు ఒక ఎత్తైతే మిగతా పుస్తకాలపై కృషి ఇంకో ఎత్తు. ఈ ప్రాజెక్టు పేజీ చూడండి.--విష్ణు (చర్చ) 11:12, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
ప్రాజెక్టు పేజీ లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీనితో పేజీల సంఖ్య గురించి స్పష్టత చేకూరింది.మీ గణాంకాల సేకరణ వివరాలు ఇవ్వనందున, నేనే కొంత పరిశోధన చేశాను.దానిప్రకారం మీ ప్రతిపాదన పటంలో పేర్కొన్న వివరము యదార్ధమనిపించటం లేదు.నా గణాంకాల పరిశోధన వివరాలు క్రింద ఇస్తున్నాను.
పై వివరాల ప్రకారం, 20 సభ్యులు గల ఆంధ్ర లయోల ప్రాజెక్టు విద్యార్ధుల కృషి 10.65శాతం మాత్రమే.మిగతా 17 సభ్యులు (IPసభ్యులందరిని ఒకరిగా భావించి) 89.35శాతం కృషి చేశారు. దానిని బట్టి చూస్తే పటం వివరణ సరికాదు.--అర్జున (చర్చ) 00:41, 13 ఏప్రిల్ 2015 (UTC)Reply
మీరు చేసిన డేటాబేస్ క్వెరీ లో లోపం ఉంది. ఇది జరిగిన కృషిని తప్పుడు అంచనా వేస్తుంది. ఉదాహరణకు పుట:Srivemanayogijiv00unknsher.pdf/3, పుట:2030020025431_-_chitra_leikhanamu.pdf/14 లాంటి పేజీలు ఏ విషయమూ లేకుండా సృష్టించబడినవి. ఇక పోతే పుట:AndhraRachaitaluVol1.djvu/13, పుట:Abaddhala_veta_revised.pdf/350 లాంటి పేజీలు మీరు చెప్పిన త్రైమాసిక కాలంలో సృష్టించబడినా తరువాత పూర్తి చేయబడినవి. ఈ క్వెరీ కేవలం ఎన్ని కొత్త పేజీలు సృష్టించబడ్డాయో మాత్రమే తెలుపుతుంది. పటం రూపొందించినపుడు వాడిన క్వెరీ ఆయా నెలలలో పూర్తి అయిన పేజీలు. ఇవి మానువల్ గా లెక్కించబడ్డాయి. ఆంధ్ర లొయోల కళాశాల నుండి అన్ని పేజీలు ఆయా నెలలలో పూర్తి స్థాయిలో టైపు చేయబడ్డాయి ఇది క్వెరీ ద్వారా పుష్టి చేయడం కష్టమే, ఆ పుస్తకాల చేరికననుసరించి ఈ విషయం వెల్లడి చేయటం జరుగుతోంది. ఆ విధంగా పటంలోని వివరణ సబబే అని గమనించగలరు. --విష్ణు (చర్చ) 12:03, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
మీ వివరణ సంతృప్తికరంగా లేదు. పటంలో చూపబడినది కొత్త పేజీలనిమాత్రమే, వాటి లోని విషయం మరియు నాణ్యతా స్థాయికి సంబంధించినది కాదు. ఇవ్వబడిన గణాంకాలలో నాల్గవ త్రైమాసికం మొత్తం పేజీల సంఖ్య(3347+399=3746) మీ పటంలోని చివరి మూడునెలల పుటలసంఖ్య కూడి(1331+1219+1196=3746) పోల్చిచూసితే క్వెరీ మీరు పటములో ఇవ్వబడిన వివరముతో సరిపోయినదని తెలుస్తుంది. ఈ పటంలో తెలిపిన ఖచ్చితత్వం చూస్తే మానవీయంగా చేశారన్నది నమ్మశక్యంగా లేదు.--అర్జున (చర్చ) 09:27, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

లక్ష్యాలలో స్పష్టత మార్చు

లక్ష్యాలు ప్రతిపాదించిన ప్రాజెక్టులకి సంబంధించినవైతే బాగుంటుంది. ప్రస్తుత వికీసోర్స్ సాధారణ గణాంకాలు వ్యాసాల సంఖ్య, క్రియాశీలక సభ్యుల సంఖ్య లాంటివి కాబట్టి సిఐఎస్ ప్రాజెక్టుల విలువని ప్రత్యేకంగా చూపించలేదు. అలా చేయకపోతే వికీసోర్స్ అంటే సిఐఎస్ ప్రాజెక్టు అనే అనుమానం తలెత్తవచ్చు. ప్రాజెక్టు పరంగా చేర్చబడిన పుస్తకాల సంఖ్య లాంటి గణాంకాలు వున్నవి కాబట్టి , వికీసోర్స్ మొత్తానికి సంబంధిన గణాంకాలను తొలగించడం మంచిది.--అర్జున (చర్చ) 05:07, 31 మార్చి 2015 (UTC)Reply

వికీసోర్సులో తెలుగు సమాచారం అందుబాటులోకి అనే నా గ్రాంట్ ప్రాజెక్టులో దొరకగా రాజశేఖర్ గారి గట్టి ప్రయత్నంతో గత సంవత్సరం సగం నుంచి ఈ సంవత్సరం ప్రస్తుతం వరకూ దాదాపుగా 45 వరకూ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాక విడిగా రాజశేఖర్ గారే ఎక్కడ నుంచో వెతుక్కుని చేసిన పుస్తకాలూ ఉండనే వున్నాయి. అదే కాక వికీసోర్సులో రాజశేఖర్ గారు చేరుస్తున్న పుస్తకాల విషయంలో ప్రాధాన్యతలు నిర్ధారించుకోవడానికి కాపీహక్కులు లేని పుస్తకాలను ప్రచురించిన ప్రచురణకర్త, అటువంటీ పుస్తకాలు ప్రచురించేవారికి గతంలో వెతికి మరీ కాపీలు అందజేసిన వ్యక్తి, తెలుగు సాహిత్యంపై అపారమైన అవగాహన కలిగిన ఓ వ్యక్తిని నేను రాజశేఖర్ గారి లాబ్ కి తీసుకువెళ్ళీ అక్కడ మాట్లాడుకున్నాము. తద్వారా ఆయనకు, నాకూ పుస్తకాల ప్రాధాన్యతలు, ప్రాధమ్యాల నిర్ధారణ వంటీ వాటీలో లోతైన అవగాహన కలిగిగ్ది. ఇటువంటి ప్రయత్నాలు సీఐఎస్-ఎ2కె వారికి సంబంధం లేని కృషిగా చెప్పవచ్చు. నేరుగా తెలిసే 45 పైచిలుకు పుస్తకాల వివరాలనైనా విడదీసి వ్రాసుకోవాలి.--Pavan santhosh.s (చర్చ) 10:54, 31 మార్చి 2015 (UTC)Reply
అర్జున గారు తెవికీసోర్సు సమగ్ర అభివృధ్ధి ఇంకా ప్రాజెక్టు స్థాయి అభివృధ్ధి గణాంకాలు రెండూ అవసరమే. అవి రెండూ ఇవ్వడం జరిగింది. ఏ వికీ ప్రాజెక్టులోనైనా సీ.ఐ.ఎస్-ఏ.2.కె సహకారం కొంత వరకే. తెవికీ సముదాయం కృషే ఎక్కువ. సీ.ఐ.ఎస్-ఏ.2.కె ప్రాజెక్టుల ద్వారా వచ్చే వాడుకరులు కూడా సముదాయమే కదా! సీ.ఐ.ఎస్-ఏ.2.కె నుండి తెవికీసోర్సుకి కేవలం అర మనిషి కూడా లేడు. కాబట్టి వికీసోర్స్ అంటే సీ.ఐ.ఎస్-ఏ.2.కె అనే అనుమానం తలెత్తే అవకాశమే లేదు. ఏ వికీ ప్రాజెక్టు అభివృధ్ధి ఒక సంస్థపై కాని వ్యక్తి మీద కాని ఆధారపడి ఉండదనేది వికీమీడియా మూవ్‌మెంట్‌లో అందరికీ తెలిసిందే, దీనికై చింతపడవలసిన అవసరం లేదనుకుంటా.--విష్ణు (చర్చ) 11:26, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
కేవలం అరం మనిషి కూడా కృషి చేయనప్పుడు ప్రత్యక్ష కృషికి గణాంకాలుగా మీరు సముదాయపు మొత్తం గణాంకాలను చూపడం సమర్ధనీయం కాదు. మీ ప్రతిపాదన లోని పటంలో కూడా అలాగే జరిగింది.ఇంకొక చర్చ లో తెలిపినట్లు దానివలన సముదాయంలో బాగా కృషి చేస్తున్న వారిని గుర్తించడంకూడా వీలవదు. కనుక మీ ప్రత్యక్షకృషిగణాంకాలనే లక్ష్యంగా చేసుకుంటే మంచిది. --అర్జున (చర్చ) 01:44, 13 ఏప్రిల్ 2015 (UTC)Reply
Pavan santhosh.s గారు ఏ వికీ ప్రాజెక్టు అభివృధ్ధికైనా డాక్యుమెంటేషను చాలా అవసరం. ఇది నేను మొదటినుండి మన తెవికీ సముదాయానికి విన్నవించుకుంటున్నదే. ఒక IEG గ్రాంటీగా ఇది మీకు తెలిసిన విషయమే. మీరు ఆ 45 పుస్తకాల జాబితా, తెవికీసోర్సులో వాటి ప్రస్తుత స్థితిని ఒక ప్రాజెక్టుపేజీగా మొదలు పెట్టగలరు. మచ్చుకు ఈ ప్రాజెక్టు పేజి చూడండీ.--విష్ణు (చర్చ) 11:31, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
విష్ణు గారూ ఈ కృషి ప్రస్తుతం రాజశేఖర్ గారి ఉత్సాహంతో జరుగుతోంది. ఇది ఒకరకంగా ఊహించని కోణం నుంచి దక్కిన మంచి విజయం. గత జనవరి వరకూ నేను ఆయనకు ఎప్పటికప్పుడు ప్రాధాన్యతల గురించి అవగాహన కల్పిస్తూ, దొరికిన ప్రతి విలువైన పుస్తకాన్ని గురించి సమావేశాల్లోనూ, చర్చపేజీల్లోనూ చర్చిస్తూ పోయినా ఇన్ని పుస్తకాలు చేరినాయన్న విషయం నాకు ఈ ఫిబ్రవరికే తెలిసింది. ప్రస్తుతం దీని ఫలితాలు, ఫలాలు ఎలావున్నాయన్న విషయంపై గణాంక విశ్లేషణ జరుగుతోంది. వీటన్నిటినీ గుర్తించేందుకు ప్రాజెక్టు మూస రూపొందించి దాని ద్వారా గుర్తించాము. డాక్యుమెంటేషన్ పనులు ప్రస్తుతానికి తెవికీపీడియాలోని డాక్యుమెంటేషన్ పూర్తయ్యాకా ఇక్కడా జరుగుతాయి. గణాంక విశ్లేషణలు, డాక్యుమెంటేషన్, చర్చలకు సమాధానాలు వంటివాటికి సమయం పడుతుందన్నది మీకూ తెలిసిన సంగతే. ఐతే అర్జున గారు చెబుతున్నది సముదాయం అభివృద్ధికి మాత్రమే కాక గత సంవత్సరం సీఐఎస్ వల్ల జరిగిన కృషిని కూడా విడిగా గణాంక విశ్లేషణ ద్వారా చూపమని కావచ్చు.--Pavan santhosh.s (చర్చ) 12:49, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply

సముదాయాన్ని సంప్రదించాలి మార్చు

వికీసోర్సు సముదాయం, పరోక్షంగా వికీపీడియా సముదాయాలను ముందుగా సంప్రదించి పరిశీలించి కొన్ని ప్రతిపాదనలు మెరుగు పరుచుకోవాల్సివుంది.

  • కాశీయాత్ర చరిత్ర పుస్తకం నుంచి గత సంవత్సరం నేను వికీపీడియాలో చేసిన కృషిలో ఎన్నెన్నో గ్రామాల వ్యాసాలు నాణ్యత పరంగా అభివృద్ధి చెందడాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రయత్నాలు మీకు ఇప్పటికే తెలిసివుండాలి అలాంటప్పుడు ఆ పుస్తకాన్ని చక్కగా యూనీకోడులోకి వచ్చేలా ప్రయత్నాలు చేసివుంటే మరింతగా లాభించేది. అలాగే వీరేశలింగం గారి కృతులన్నీ డిజిటైజ్ చేయడం మంచి ప్రయత్నమే. అందరూ అంగీకరించే విషయమే అది. కాకుంటే ఉత్తమమైన ప్రయత్నం, లోతైన ఆలోచనతో కూడిన ప్రయత్నం కాదు. ఈ విషయమై సముదాయాన్ని ముందుగా ఆన్-వికీ సంప్రదించి వుంటే మీకు వేరే విలువైన సూచనలు అందేవి. నా వరకూ నన్నే అడిగితే ఆయన రచనల కన్నా గిడుగు రామమూర్తి పంతులు గారి రచనలు ఎంచుకోమని చెప్పేవాణ్ణి. సంస్కరణోద్యమంలో కందుకూరి గట్టివారైతే, వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు అనితరసాధ్యులు. కాకుంటే గిడుగు రచనల వల్ల వికీపీడియా లాభించేందుకు, ఇంకా గట్టిగా చెప్పాల్సివస్తే విక్ష్నరీ కూడా లాభించేందుకు కూడా అవకాశాలున్నాయి. గిడుగు పేరు చాలామందికి సుపరిచితమే. ఆయన అనుయాయులూ వికీవంక చూస్తారు. ఇక మీకు గ్లామరైజ్డ్ కవి, రచయితలే అక్కర్లేదనుకుంటే వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి మౌలిక, ప్రామాణిక పరిశోధనలు, విమర్శ రచనలు చేసినవారున్నారు.(వేటూరి వారు నాగబు అన్నది తొలి తెలుగు శాసనపదంగా గుర్తించడం మొదలు అన్నమాచార్య కీర్తనల వరకూ ఎన్నింట్లోనో గొప్ప పరిశోధనలు చేశారు). ఐతే ఇక్కడ మీ ఎంపిక గురించి కాదు నా ప్రశ్న.. అసలు సమాచారం ఇవ్వకపోవడాన్ని గురించే. ఇప్పుడూ అదే ప్రాజెక్టును పరిపూర్తి చేసేందుకే మీరు నిశ్చయించేసుకున్నట్టున్నారు. లేదంటే మరిన్ని విలువైన పుస్తకాలను సూచించగలను.(అవి విలువైనవి కాదని అర్థం చేసుకుని దానిపై వివాదం చేస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు).
  • ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాలను తెవికీసోర్సులో చేర్చారు. ఆ పుస్తకాల పేజీలు వికీలో అభివృద్ధి చేస్తే జరిగిన తీవ్రచర్చలు వంటివి మీరిక్కడ చూడొచ్చు.(ఆ చర్చలో పుస్తకాలు ఉంచాలని సమర్థనగా నేను చేసిన వ్యాఖ్యలు చూస్తే నేనేమీ ఇందు జ్ఞానవేదికతో సహానుభూతితోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని గుర్తించవచ్చు). ప్రస్తుతం ఈ పుస్తకాలు, కార్యక్రమం అన్నిటి వల్లా తయారైన వ్యాసాల్లో తెవికీలో మూడంటే మూడు మిగలగా, రెంటికి ప్రస్తుతం తొలగింపు మూస వుంది. మూడో వ్యాసంలోనూ వికీశైలికి వ్యతిరేకమైన భాష నిండివుంది. వికీసోర్సు పుస్తకాలకు వికీలో వ్యాసాలు అభివృద్ధి చేయడం మాత్రమే ఏకైక మౌలిక ప్రయోజనం కాదు అది ఓ గ్రంథాలయం అంటే ఒప్పుకుంటాను. కాకుంటే ఈ పుస్తకాల రీడబిలిటీ ఎలా ఉంది వంటివి ముందుగా పరీక్షించి చూశారా? అంతర్జాలంలో ఈ విషయంపై ఎన్ని హిట్లున్నాయి వంటి విషయాలు లేదా సాహిత్య వ్యాసాల్లో ఈ పుస్తకాల గురించి చర్చలు జరుగుతున్నాయా అన్న విషయాలు ముందస్తుగా గమనించారా? ఈ పుస్తకాల విడుదల కార్యక్రమంలో 50 పుస్తకాల పునర్విడుదల అని తెలుగు సాహిత్య లోకాన్ని ఆకర్షించాము అనుకుంటే గనుక తెలుగు పత్రికల్లో వెబ్జైన్లు, సాహిత్య పేజీలు వంటివి ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం పట్టించుకున్నాయి. ఏ ఇతరమైన కార్యక్రమానికైనా పత్రికల వారు సర్వసాధారణంగా ఇచ్చే కవరేజి మాత్రమే దక్కింది. సంచలనం సృష్టించేందుకు, పలువురు రచయితలను, సాహిత్యకారుల్ని ఆకర్షించేందుకు ఐతే మీరు చేసిన ప్రయత్నం దానికి వేల యోజనాల దూరంలో ఉండడం దురదృష్టకరం. ఏ కార్యక్రమానికైనా లోటుపాట్లుంటాయి కనీసం ప్రతిపాదన స్థాయిలో ఐనా ఆ విజయాన్ని ఆశించి తయారు చేసినట్టు కనిపించాలి కదా. అటు రీడబిలిటీ, ఇటు వ్యాసాల అభివృద్ధి, మరో వైపు కవరేజీ కాకుండా ఏం సాధిద్దామన్న ప్రయత్నం ఇది? ఇందులో మరో మానవీయ కోణమూ ఉంది. నేను ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఇందు జ్ఞానవేదిక వారు, భక్తుల స్థితికి చాలా బాధపడ్డాను. వారి కృషిలో ఏ లోటూ లేదు. నిజాయితీ కల ప్రయత్నం వారిది. పైగా ఏదో చక్కని ప్రయత్నం చేయబోయి ఇలాంటి విమర్శల్లో పరోక్షంగా చిక్కుకున్నట్టైన వారి పరిస్థితి నాకు చాలా ఇబ్బందినీ, బాధనీ కలిగిస్తోంది. వారి విశాల దృక్పథానికి, వికీ ఆశయానికి దగ్గరగా ఉన్న వారి లక్ష్యాలకు నేను చాలా చాలా అభినందిస్తున్నాను. కానీ సరైన ప్రణాళిక లేకుండా చేసిన ఈ ప్రయత్నం వల్ల వారినీ గాయపరిచినట్టైంది, చివరకు వికీలో సాధించిందీ ఏమీ కనిపించడంలేదు. సీఐఎస్ ఎందుకు కార్యక్రమాన్ని ఏ ప్రాతిపదికన స్వీకరించిందన్నదీ, ప్రకటన స్థాయికి రాకముందు ఎందుకు చర్చకు పెట్టలేదన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న.
  • రాబోయే పుస్తకాల విషయంలోనూ ఇందూ జ్ఞానవేదిక విషయంలో జరిగినదే జరిగేట్టైతే చక్కగా కాపీహక్కులు ఐపోయిన పుస్తకాలను డిజిటైజ్ చేసుకోవడంలో ప్రయత్నాలు చేయడమో, మరేవైనా కొత్త ఆలోచనలు రూపొందించుకోవడమో మంచిది. ఎందుకంటే ఎందరో రచయితలను ఆహ్వానించి చేసే ఈ ప్రయత్నం చివరకు ఇందూ జ్ఞానవేదిక వారిలాగా వారంతా మానసికంగా గాయపడి, వికీ పట్ల ఒక వర్గమే విముఖులయ్యేట్టైతే ఆ ప్రయత్నాలు ప్రమాదకరమే కాక చివరకు బాధాకరం కూడా అవుతాయి.
  • ఓసిఆర్ వంటి వాటికి సీఐఎస్ వంతుగా ఏదైనా చేయలేదా? ఈ విషయంలో తెలుగు చాలా దగ్గరలో ఉందని రెహ్మాను పలుమార్లు పెద్ద పెద్ద సాంకేతిక నిపుణుల ముందే ఉద్ఘాటించారు కదా. మరేమైనట్టు? సీఐఎస్ ఆ దిశగా కృషిచేస్తే తెలుగుకు వేలాది పుస్తకాలు ఎక్కించిన పెట్టు.--Pavan santhosh.s (చర్చ) 12:13, 31 మార్చి 2015 (UTC)Reply
Pavan santhosh.s గారు మీరు చేసిన వ్యాఖ్యలపై కొన్ని వివరణలు మీరడిగిన క్రమంలోనే క్రిందపొందుపరిచాను.
  • తెవికీసోర్సులో పుస్తకాల విలువను బట్టీ ప్రాధాన్యత నిర్ణయించి (తెవికీపీడియాకు కూడా పనికొచ్చే విధంగా) కనీసం 100 పుస్తకాలపై పనిచేయాలని 2013లోనే సీనియర్ వికీపీడియన్ రాజశేఖర గారుఇంకా ఇతర సభ్యులతో హైదరాబాదులో జరిగిన ఒక మాసిక సమావేశంలో చర్చించడం జరిగింది. ఆ చర్చ ఆధారంగా రాజశేఖరగారు తెవికీ రచ్చబండలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పుస్తకాలకై సభ్యుల సూచనలు కోరడం జరిగింది. కాని దానికి సరైన స్పందన లభించలేదు. అప్పటికి మీరు తెవికీలో ఉదయించ లేదు, అందుకని మీరు ఆ చర్చ చూసి ఉండరు. ఆ చర్చను ఇప్పటికైనా ముందుకు తీసుకువెళితే ఆనందదాయకమే! ఆ చర్చను తిరిగి ప్రారంభించి మీకు తోచిన పుస్తకాలను కూడా అందులో సముదాయ పరిశీలనకు ఉంచండి. ఇకపోతే మీరు సూచించన విధంగా గిడుగు వారి రచనలు తెవికీసోర్సులో తేవడానికి సీ.ఐ.ఏస్-ఏ.2.కె ప్రయత్నాలు చేస్తూనే వుంది. బహుశా మీకు తెలిసివుండక పోవచ్చు... తెలుగు అకాడమీ వారు ఇప్పటికే గిడుగువారి సమగ్ర రచనలను టైపు చేయించి ఉన్నారు. ఆ సాఫ్ట్ కాపీనీ సంపాదించడానికి సీ.ఐ.ఏస్-ఏ.2.కె సంస్థాగత భాగస్వామ్యం ద్వారా ప్రయత్నిస్తోంది. అలా చేయడం వలన తెవికీసోర్సులో ఉన్న వాలంటీయర్ల సమయం మరింత మెరుగైన కార్యక్రమాలకు ఉపయుక్తమవుతుంది. కాదంటారా? అలాగే వేటూరి ప్రభాకరశాస్త్రి గారి రచనలు తి.తి.దే వారు గత 10 సంవత్సరాలుగా ఒక ప్రాజెక్టుగా చేపట్టారు. అది మనం సంపాదిస్తే సరిపోతుంది అని అనుకున్నదే. ఇక కందుకూరి వీరేశలింగం గారి రచనలపై కృషి చేయాలనేది తెవికీసోర్సు రచ్చబండలో సముదాయానికి తెలిపే మొదలుపెట్టిన కృషి. బహుశా అప్పటికి మీరు తెవికీసోర్సులో క్రియాశీలకంగా లేరనుకుంటా. పాత చర్చల్లో ఉంటుంది. మీరు పాత చర్చలు చూడనంతమాత్రాన సీ.ఐ.ఏస్-ఏ.2.కె సమాచారం ఇవ్వలేదనడం ఏమంత బాగోలేదండీ, పవన్ గారు. ఒక వేళ మీకు సమాచారం కావలన్నా మీరు అడిగినదే తడవుగా మళ్ళీ ఇచ్చేవాళ్ళము. అదికాకుండా మీరు తెవికీసోర్సులో క్రియాశీలకంగా అయ్యి సంవత్సరమయ్యింది... ఈ సంవత్సరకాలంలో మీరు సీ.ఐ.ఏస్-ఏ.2.కె టీంతో ముఖాముఖి 10 సార్లన్నా కలిసుంటారు... అనర్ఘళముగా ఎన్నో విషయాలపై చర్చించుకున్నాం కూడా...అప్పుడైనా అడిగివుంటే ఈ సమాచారం మీకు ఇచ్చేవాళ్ళము కదా. ఏమైనా మీరు ఈ విధంగా అనడం నాకు కొంత బాధను కలిగించింది. ఇలాంటి స్టేట్‌మెంట్లు మిగతా సభ్యులను, ప్రణాళికపై జరగాల్సిన చర్చను తప్పుదోవపట్టించవచ్చు.
  • ఇక ఇందూజ్ఞానవేదిక పుస్తకాల విషయానికొస్తే వారిని సంప్రదించి వారి పుస్తకాలను తెవికీసోర్సులో చేర్చాలన్న ప్రతిపాదన చిరకాల సముదాయసభ్యుడైన రహ్మతుల్లా గారి నుండి వచ్చిందే. ఆ ప్రతిపాదనను అర్జునగారు సీ.ఐ.ఏస్-ఏ.2.కె కు పంపడం జరిగింది. రహ్మతుల్లా, వైజాసత్య, అర్జున గార్ల మధ్య ఈ చర్చ చూడండీ. మీరు అప్పుడే తెవికీలో వికసిస్తున్నారనుకుంటా  :) ఈ విషయమై సీ.ఐ.ఏస్-ఏ.2.కె కు రిక్వెస్ట్ పెట్టటం జరిగింది. తదనంతరం ఇందూజ్ఞానవేదిక సభ్యులతో చర్చలు ఫలించిన పిదప వారి పుస్తకాలను CC-BY-SA 3.0 లో రిలీజు చేస్తూ తెవికీసోర్సులో పెట్టడానికి గాను సముదాయానికి తెలియజేస్తూ తెవికీపీడియా రచ్చబండలో, తెవికీసోర్సు రచ్చబండలో ప్రకటణ చేయడం జరిగింది, అలానే సమావేశం పేజి చేయడం జరిగింది. ఆ సమావేషానికి మీతోపాటే దాదాపు 15 మంది తెవికీపీడియనులు కూడా హాజరయ్యారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం సీ.ఐ.ఏస్-ఏ.2.కె వారు విడుదల చేసిన పుస్తకాల నాన్-యూనీకోడ్ ప్రతులను యాంత్రికంగా యూనీకోడికరించి తెవికీసోర్సులో చేర్చాలి. ఆ పని టెక్నికల్ గా ఎంతో శ్రమతో కూడుకున్నది. వారు రకరకాల ఫార్మాట్లు మరియు ఫాంట్లు వాడడం వలన దాదాపు రెండు నెలల పాటు ప్రతీ రాత్రి సీ.ఐ.ఏస్-ఏ.2.కె జట్టు (ఆఫీసు తదనంతరం) దీనిపై కృషి చేసింది. అలాగే కామన్స్ లో ఎన్నో ఇబ్బందులు సీ.ఐ.ఏస్-ఏ.2.కె జట్టుఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందులు, సీ.ఐ.ఏస్-ఏ.2.కె సహకారం ఇందూజ్ఞానవేదిక సభ్యులు ప్రత్యక్షంగా చూసారు. ఇక ఈ పుస్తకాలపై తెవికీలో వ్యాసాలు వ్రాస్తే బాగుంటుందనే సూచన, సమావేశానికి హాజరైన కొందరు సభ్యులు ఇచ్చిందే. సీ.ఐ.ఏస్-ఏ.2.కె ఉత్సుకత చూపించిన ఇందూజ్ఞానవేదిక సభ్యులకు తెవికీపై శిక్షణ మాత్రమే ఇచ్చింది. ఇక వారు గాయపడ్డారంటే దానికి కారణం తెవికీలో పాలసీలపై స్పష్టత లేకపోవటం అని మనందరం గమనించాలి. ఇది మనందరికీ ఒక పాఠం అని నా నమ్మకం. ఇంత చెప్పినా దీనికంతటికీ సీ.ఐ.ఏస్-ఏ.2.కె మాత్రమే కారణం అని మీరు నమ్మితే చేయగలిగిందేమి లేదు. ఈ కార్యక్రమ ఆచరణలో వైఫల్యాలనుండి నేర్చుకుని ముందుకు వెళ్ళడం ద్వారా తెవికీసోర్సు త్వరిత పురోగతికి దోహదపడగలుగుతాం.
  • సీ.ఐ.ఏస్-ఏ.2.కె లీడ్ తీసుకొని తీసుకొచ్చిన పుస్తకాలు (ఉదాహరణకు ఇవి చూడండి) వాటి విలువ బహుశా మీరు చూడదలచుకోలేదేమో. కొత్త పుస్తకాలను CC-BY-SA 4.0 లైసెన్స్ లో తేవడంతో పాటు పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయవస్తువును కూడా చేరుస్తూ తెవికీసోర్సు ఇంకా అభివృధ్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇది సాధించడానికి తెవికీ సముదాయానికి సీ.ఐ.ఏస్-ఏ.2.కె తనవంతు సహకారాన్ని అందిస్తుంది. తెవికీసోర్సు అభివృధ్ధి దిశగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీరు ప్రస్పుటంగా కార్యాచరణకు సంబందించి సూచనలు ఇవ్వండి.
  • తెలుగు ఓ.సీ.ఆర్ పై ప్రస్తుతమున్న రిసోర్సెస్ తో సీ.ఐ.ఏస్-ఏ.2.కె పని చేయలేదు. దీనిపై ఇప్పటికే అనేక సంవత్సరాలు పనిచేస్తున్న వారిని సంప్రదించి సముదాయానికి పనికివచ్చే ఓ.సి.ఆర్ ని తీసుకురావడానికి ప్రయత్నాలు కన్నడలో ఇప్పటికే మొదలయ్యాయి. తెలుగులోనూ ప్రయత్నిస్తున్నాము. కాకపోతో ఇదొక పాలసీ పై కృషి లాంటిది. సఫలీకృతమయ్యే సూచనలు లేనంతవరకు ప్రణాళికలో ఉంచడం ఇబ్బందికరం. తెలుగు ఓ.సీ.ఆర్ పై కశ్యప్ గారు కృషి చేస్తున్నానన్నారు. వారి సహకారం కూడా తీసుకొని తెవికీసోర్సును ముందుకు తీసుకెళదాం --విష్ణు (చర్చ) 13:43, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
విష్ణు వీలు చూసుకుని స్పందించినందుకు ముందుగా ధన్యవాదాలు. క్షమించాలి నిరాధారమైన ఆరోపణలు చేసే అలవాటు కానీ, సముదాయాన్నీ, చర్చనీ తప్పుదోవ పట్టించే ఉద్దేశం గానీ నా వ్యాఖ్యల్లో లేవనే నమ్ముతాను. ముఖ్యంగా మీరు బాధపడిన వీరేశలింగం కృత రచనల విషయానికే వస్తే నేను ఈ వ్యాఖ్య చేయడానికి ముందు రచ్చబండ పాత పుటల్లో వెతకకపోలేదు. నాకైతే కనిపిస్తూన్నది ఇదొక్కటే, వెతకడం కూడా తెలియనంత న్యూబీని కాదు కనుక తెవికీసోర్సు రచ్చబండలో సముదాయానికి చెప్పినదెక్కడో మరి తెలియట్లేదు. పోనీ నేను వెతకలేకపోయాననే అనుకున్నా, నేనూ అలాగే భావించి ఇప్పుడు మొత్తం వికీసోర్సు రచ్చబండ పాతపుటలన్నీ తిరగేశాను మళ్ళీ. దురదృష్టవశాత్తూ తెలుగు వికీసోర్సు రచ్చబండ పుటల్లో ప్రతిపాదనల స్థాయిలో సభ్యుల స్పందన కోరుతూ ఏమీలేవు. కాకుంటే ఇలా చేస్తున్నామన్న విషయాన్ని ప్రకటించే వ్యాఖ్యలు మాత్రం ఉన్నాయి. రెంటికీ చాలా తేడావుండడం తెలియనిది కాదు. ఒకే ఒకచోట(పైన లింకిచ్చాను) వేరే చర్చలో భాగంగా కందుకూరి వీరేశలింగం పుస్తకాలు దొరికాయి, థీంగా తీసుకుని కొత్తవాళ్ళని ప్రోత్సహిస్తానన్న రెహమాన్ వ్యాఖ్య(అది ఆ డిస్కషన్ కంటెంట్ కాదు, వేరే చర్చలో ఆ ముక్క పెట్టారు) ఉంది. దానిలో సీఐఎస్-ఎ2కె ఈ స్థాయిలో చేయనుందని, దానికి ఈ పుస్తకాలను ఎంచుకుంటామని ముందస్తుగా తెలియజెప్పే నేచర్ లేదు. వాలంటీర్ల సమయం మరింత మెరుగుగా ప్రయోజనకరంగా ఉపయుక్తం కావడానికే గిడుగు వంటివారివి ఇప్పటికే తయారుగా ఉన్న పాఠ్యాలు స్వీకరిస్తామంటున్నారు. నేను మీరు గిడుగుపై ప్రయత్నించలేదని నేనడంలేదు, వికీసోర్సులో వాలంటీర్లచే పాఠ్యాన్ని టైప్ చేయించే కార్యకలాపాలకు ముందు వికీసోర్సు రచ్చబండలో చర్చించవచ్చు కదాని మాత్రమే. ఇక మీరు 2013లో మీరూ, రాజశేఖర్ గారూ చొరవతీసుకుని చర్చపెట్టిన వంద పుస్తకాల జాబితా గురించి మాట్లాడారు. చాలాసేపు వెతికి నేనూ ఇప్పుడు పట్టుకోగలిగాను. మంచి ప్రయత్నమే. మీరు 2014 జూన్, జూలై సమయంలో దీన్ని మళ్ళీ చర్చకు తీసుకువచ్చివుంటే బావుండేది. నేనూ, స్వరలాసికగారూ సచేతనమై సాహిత్యానికి సంబంధించి అనేక కార్యకలాపాలు నిర్వహించాము, వ్యాసాలు, ప్రాజెక్టులు తీర్చిదిద్దాము. ఆయన బహుగ్రంథకర్త, నేను కొన్ని విమర్శరచనలు చేశాను. మీకు తెలియనదేమీ కాదు. మీరు పాత చర్చలు చూడనంతమాత్రాన సీ.ఐ.ఏస్-ఏ.2.కె సమాచారం ఇవ్వలేదనడం ఏమంత బాగోలేదండీ, పవన్ గారు. అన్నారు. సరే కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టినప్పుడు ప్రతిపాదించాల్సిన అవసరం లేదంటారా? వచ్చినవారంతా పాతచర్చలు చదువుకోవాలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను మీతో అనర్గళంగా మాట్లాడినప్పుడు ప్రస్తావించలేదన్నారు, సరే అదే సమయంలో సీఐఎస్-ఎ2కె ఎన్నో కార్యక్రమాలకు రీసోర్సు పర్సన్లుగా అధికారికంగా వచ్చినప్పుడు ప్రతిపాదన సమావేశాల్లోనైనా చేసి, ఆన్-వికీ చర్చించవచ్చు కదా ఇలా ఫలానా పుస్తకాన్ని టైపింగ్ చేయించే ప్రయత్నాలు ప్రారంభిస్తామని, అటుంటి దాఖలాలేవీ మీరన్నట్టుగా వికీసోర్సు రచ్చబండలో కనిపించట్లేదు. ఇక మీరు బాధపడినందుకు నేను కారణం కావడం వల్ల చాలా నొచ్చుకున్నాను. నా వ్యాఖ్యలేమీ కఠినంగా లేవు. నేను ఇంతకన్నా కటువైనవీ, దుర్వ్యాఖ్యానాలూ ప్రోత్సహించాల్సిన బాధ్యతలోవున్నవారి(స్వచ్ఛంద సభ్యులు కాదు) నుంచి ఎదుర్కొని మరీ వికీలో ముందుకుసాగుతున్నాను. అలాగని అకారణంగా మిమ్మల్ని బాధించేందుకు తయారవ్వలేదు. ఇందు జ్ఞానవేదిక పుస్తకాలను వికీసోర్సులో చేర్చడంపై నేనేమీ వ్యతిరేకంగా వ్యాఖ్యానించట్లేదు. అవి చేర్చవచ్చునన్నంతవరకూ ఓకే, అంతపెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసేప్పుడు ఇలాంటి పుస్తకాలనే ఎందుకు ఎంచుకోవాలన్నది ప్రశ్న. కార్యక్రమం ప్రొడక్టివిటీ గురించి, ప్రణాళికాసమయంలో దానిని ఏ దిశగా మీరు ఎక్కుపెట్టిన సంగతీ చర్చిస్తున్నాను నేను. కార్యక్రమం వైఫల్యం కాకూడదనేమీ లేదు, ఒకవేళ విఫలమైతే విఫలమైందని, లేదూ వాలంటరీ మూమెంట్లో వైఫల్యమనే పదం సరికాదనుకుంటే అనుకున్న ఫలితం ఏమిటో, దాన్నెలా అందుకోలేకపోయామో, దాని నుంచి నేర్చుకున్న పాఠం ఇదనీ రాయడం పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని, మన పరిణతినీ సూచిస్తుంది. అటువంటి ప్రయత్నమేదీ లేకపోవడమే నేనిలా రాసే ధైర్యం చేయడానికి కారణం. సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి పుస్తకాల విలువ నేనూ గుర్తించాను, వాటిపట్ల నేనేమీ వ్యతిరేకంగా వ్యాఖ్యానించలేదు. ప్రస్తావన లేదు అని మీరంటే ఒప్పుకుంటాను-ఈ చర్చ నేను చేస్తోంది నాకున్న సమయంలో కొంత వెచ్చించి సీఐఎస్ ప్రణాళికలోని లోపాలని నాకనిపించినవి తెలియజెప్పి, చర్చించి మెరుగుచేసుకునే ప్రయత్నంలో పాలుపంచుకునేందుకు మాత్రమే. పాలసీపై సమస్యలను సముదాయం పరిష్కరించుకుంటుంది, నేననేది రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కొందరు రచయితలను ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వారిలో కొందరికి వికీపై వ్యతిరేకత ఉండొచ్చు అప్పుడు ప్రోగ్రాం ఆఫీసర్ వారి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించి వారితో వివాదపడి మరోసారి ఏదోక సమావేశానికి వారు హాజరుకాకూడదని మొదలుపెడితే ఏంచేయాలన్నది. ఎంత సంస్థ అయినా వ్యక్తులతోనే నడుస్తుంది, ఇలాంటి సమస్యలున్నప్పుడు రాష్ట్రస్థాయి కార్యకలాపాలు రాష్ట్రస్థాయి వ్యతిరేకత సంపాదించిపెడతాయి. మీరడిగినట్లుగా కార్యాచరణపరంగా సూచనలు ఇవ్వడానికి నా ప్రయత్నం ఇది. ఈ అనుభవమంతా నేనూ, రాజశేఖర్ గారూ వికీసోర్సులో పుస్తకాలు చేర్చేప్పుడు చేసుకున్న వ్యక్తిగత చర్చల సారంతో పాటు, నాకు పుస్తకాలపైనా, వాటి విలువపైన ఉన్న విస్తృతమైన అవగాహన కూడా కలిసివుంది. :
  • వికీపీడియాలోని వ్యాసాలు మెరుగుపరిచే వీలుకు వీటి లక్ష్యాలను జతచేస్తే స్పష్టంగా ఉంటుంది. అంటే ఏ పుస్తకాన్నైనా దాని ప్రామాణికత, ప్రాసంగికత, దానికి విజ్ఞానసర్వస్వపరంగా ఉన్న విలువ మొదట లెక్కించాలి. ఐతే ఇవి మాత్రమే పుస్తకాలకున్న ఏకైక విలువ కాదని నాకూ తెలుసు. ఒకవేళ మనం స్వీకరించే(అంటే మన పనిగంటలు వెచ్చించి, శ్రమించి, చిన్నపాటి కార్యక్రమాలు ఏర్పాటుచేసుకుని తీసుకునే) పుస్తకాలకు వేరేవిధమైన విలువ ఉంటే దాన్ని మనం స్పష్టంగా అంచనావేసుకునే ఆ పనులు చేయాలి. ఆయా అరుదైన ఇతర పుస్తకాలకు ఇక్కడ సూచించినలాంటి విలువలు ఉంటే బావుంటుంది-చారిత్రికంగా విలువైనదో, సాహిత్య చరిత్రలో కీలకమైనదో, జనాకర్షకమైనదో, వికీసోర్సులో వైవిధ్యం పెంచేందుకు ఉపకరించేదో. ఐతే ఇవి ఎక్సెప్షన్లే తప్ప రూల్స్‌గా భావించరాదు. ఇంత చెప్పేది ఎందుకంటే భవిష్యత్తులో ఓసీఆర్ రావడం ఆలస్యమైనకొద్దీ ఆయా పుస్తకాలపై వికీసోర్సు వాలంటీర్లు పనిచేస్తారు, లేదూ కొన్ని అచ్చుతప్పులు వంటివి సరిజేసుకునేందుకైనా వారు పనిచేసితీరతారు వారి శ్రమకు విలువనిచ్చినట్టవుతుంది.
  • కార్యక్రమం జరుగుతున్నట్టు ప్రకటన చేసేకన్నా చేయదలుచుకుంటున్నామని ప్రతిపాదన చేస్తే మేలు. ఎందుకంటే ఇదేమీ చిన్నస్థాయిలో చేసేపనులూ కావు, సముదాయానికి సంబంధం లేని విషయాలూ కావు. సంవత్సరం పాటుగా వికీలో చాలా ఉత్సాహంగా పనిచేసి, దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ(ఆఫ్-వికీ కూడాను) పాల్గొన్న నాకు కూడా మీరు కొత్త కాబట్టి తెలిసివుండదు, ఎప్పుడో వికీపీడియన్‌గా ఉదయించకముందు చర్చలు చదువుకుని రిలవెన్స్ అవగాహన చేసుకొమ్మని చెప్తున్నారంటేనే పరిస్థితి తెలుస్తోంది.
  • వ్యక్తిగతంగా రచయితల నుంచి పుస్తకాలు స్వీకరించేందుకు కృషిచేసేప్పుడు కాపీహక్కులు వదులుకోవడమనే అంశంలో అందరూ అనుకూలంగా ఉండరని అర్థం చేసుకుని, అందుకు సిద్ధపడే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో సానుకూలమైన, అవసరమైతే మొత్తం ప్రయత్నాన్ని వదులుకోవడమనే ధోరణిలో పనిచేయాల్సివుంటుంది. సాఫ్ట్ స్కిల్స్ తో వ్యవహరించక వికీ పట్ల ఓ వర్గానికి వ్యతిరేకత ఏర్పడే ధోరణిలో తత్సంబంధిత వ్యక్తులు పనిచేయరాదు. వికీ అనే ఈ మహాసముద్రంలో ప్రతివారికీ ఎక్కడో దీనితో రిలవెన్స్ కుదురుతుంది, అందరూ వికీసోర్సుకు అనుకూలంగా ఉండాలని లేకుంటే వికీకే వ్యతిరేకమని అనుకుని ముందుకుసాగే ధోరణులు ఉండరాదు. దీన్ని ఇక్కడ నేనింతకన్నా విస్తరించలేను. విషయం మీకు అర్థమయ్యేవుంటుంది.
ఈ సూచనలన్నీ మీ సమర్థతపై సందేహంతో చేసినవి కాదు. మీ పర్యవేక్షణ లేని సమయంలో జరగబోయే అనర్థాలకు కొన్ని ముందస్తు సూచనలు కనిపిస్తున్న దృష్ట్యా ఇక మౌనంగా ఉంటే సాధ్యం కాదని ప్రారంభించాను. అందుకని ఇప్పుడు నేనింత సమగ్రమైన చర్చ ప్రారంభించడం వ్యక్తిగతంగా మీ నాయకత్వానికి కితాబే. --Pavan santhosh.s (చర్చ) 14:32, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply
పవన్ గారు సూచనలు ఎల్లప్పుడూ స్వాగతించదగినవే. సంప్రదింపులకే కదా ఈ ముసాయిదా ప్రణాళికను సముదాయం ముందు ఉంచినది. సముదాయంతో సంప్రదింపులు ఇప్పుడే కాదు 2013 నుండి వికీలోను, వికీ బయట సముదాయ సమావేశాలలోను సీ.ఐ.ఎస్-ఏ.2.కె ఇప్పటి వరకూ చేస్తూ వచ్చింది. ఇక ముందు కూడా కొనసాగిస్తుంది.
మీరు పైన చెప్పిన దాంట్లో ముఖ్యమైన సూచన: సీ.ఐ.ఎస్-ఏ.2.కె సముదాయంతో ఇప్పుటివరకు జరిపిన దానికన్నా ఇంకా విస్తృతంగా సంప్రదింపులు జరపాలి అంటే- సరే అలాగే తప్పకుండా మెరుగు పరచుకోవాలి అని నేనంటాను. కొన్ని పనుల్లో సముదాయంతో సంప్రదింపులలో లోటుపాట్లు ఉన్నాయీ అంటే - సరే వాటిని మునుముందు జరగకుండా జాగ్రత్త పడాలి అని నేనంటాను...... అదే ఎవరైనా సీ.ఐ.ఎస్-ఏ.2.కె సముదాయంతో సంప్రదింపులు అసలు జరుపనేలేదు అంటే - లేదు మళ్ళీ పాత చర్చా పేజీలు చూడండి అని నేనంటాను, అది వారు పాత వికీపీడియను అయినా కొత్త వికీపీడియను అయినా.
మొదటిది మనం చేస్తున్న పని మెరుగుకై సూచనలు, రెండవది అభియోగంగా తప్ప తెవికీ ప్రగతికై మనం చేస్తున్న కృషికి ఉపకారిగా ఉండదు అని నేను వేరే చెప్పనక్కరలేదు. మీరు నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. ఇలాంటి అభియోగానికి మనం చేయగలిగింది పాత చర్చలు చూడమని చెప్పడం మాత్రమే. ఇలాంటివి (నేను చూసిన అనేక వికీలలో, మెయిలింగ్ లిస్టులలో) సముదాయాన్ని, చర్చను పక్కదోవపట్టిస్తాయి.
మరిన్ని చిన్న వివరణలు
వీరేశలింగం కృతులపై కృషి తెవికీసోర్సులో అప్పటివరకు క్రియాశీలంగా ఉన్న చాలా మందికి తెలిసే జరిగింది. కాని మీరన్నట్టు దానిని రచ్చబండలో ఇంకా విస్తృతంగా చర్చించగలిగితే బాగుండేది. ఇలాంటి ఓవర్ సైట్ జరగకుండా మునుముందు తప్పకుండా జాగ్రత్త పడవలిసిన అవసరం ఉంది.
//వంద పుస్తకాల జాబితా...2014 జూన్, జూలై సమయంలో దీన్ని మళ్ళీ చర్చకు తీసుకువచ్చివుంటే బావుండేది// కాని 2014 ప్రణాళికలో తెవికీసోర్సుపై ఇంత కృషి చేస్తమనే ఆలోచనలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా తెవికీసోర్సుకు సంబందించి ప్రణాళిక అనుకుంటున్నాం కాబట్టి దీనిపై చర్చను తప్పక కొనసాగిద్దాం.
//నేననేది రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కొందరు రచయితలను ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వారిలో కొందరికి వికీపై వ్యతిరేకత ఉండొచ్చు అప్పుడు ప్రోగ్రాం ఆఫీసర్ వారి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించి వారితో వివాదపడి మరోసారి ఏదోక సమావేశానికి వారు హాజరుకాకూడదని మొదలుపెడితే ఏంచేయాలన్నది. // మరోసారి ఇలా జరగకుండా చూసుకోవలసిన బాద్యత మనందరిపైనా ఉంది. సీ.ఐ.ఎస్-ఏ.2.కె ప్రోగ్రాం డైరెక్టరుగా నాకు దీనిపై ఇ-మెయిల్ లో ఇదివరకే సందేశం వచ్చింది, దానిపై నేను సత్వరమే స్పందించాను కూడా, ఆక్షను కూడా తీసుకోవడం జరిగింది. ఆ మెయిలు మీకు కూడా కాపీ చేయబడి ఉంది. ఇది నా వైఫల్యంగా మీరు కాని తెవికీ సముదాయంగాని తలిస్తే నేను క్షమార్ధిని.
ప్రణాళిక మెరుగుకై మీరిచ్చిన మూడు సూచనలు చాలా బాగున్నాయి. మొదటిది, మూడవది తప్పకుండా ఆచరణలో పెట్టవలసిందే. రెండవది వీలున్నంతవరకు ప్రయత్నిద్దాము - ఎందుకంటే ఒక్కోసారి మనకు సంస్థాగతంగా వచ్చే అవకాశాలపై మనం సత్వరంగా ముందుకు కదాలాల్సి ఉంటుంది, అలాంటి సమయంలో ప్రతిపాదనలు చేసి వాటిపై సమగ్రంగా చర్చలు చేసే సమయం దొరక్కపోవచ్చు. నేను చెప్పేది ఎక్సెప్షన్ మాత్రమె, ఇంకా సీ.ఐ.ఎస్-ఏ.2.కె పూర్వనుభవం కూడా.
నేను వ్యక్తిగతంగా సీ.ఐ.ఎస్-ఏ.2.కె ప్రోగ్రాం డైరక్టరుగా మునుముందు లేకున్నా భవిష్యత్తులో వచ్చే వారు ఈ సూచనలన్నీ పరిగణలోకి తప్పకతీసుకోవలసిందే. గత రెండు సంవత్సరాలలో మన తెవికీలో మీలాంటి ఆల్ రౌండర్ సభ్యుల చేరిక వలన తెవికీ సత్వర ప్రగతికి చక్కని ఫౌండేషన్ పడిందని నా గట్టి నమ్మకం. Let us be optimistic about the future. (: --విష్ణు (చర్చ) 19:05, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply
కొత్తకలం: ఈ విషయంపై నేను ఇప్పుడే రాజశేఖర్ గారితోనూ, రాజశేఖర్ గారి సలహామేరకు స్వరలాసిక గారితోనూ మాట్లాడాను. మీరన్నట్టుగా స్పష్టమైన సూచనలు చేయాలన్నా, నేను చెప్పినట్టుగా ప్రాధాన్యత అత్యంత విలువైన పుస్తకాలు గుర్తించాలన్నా దానికి ముందుగా చర్చించి వాటిని నిర్ధారించడం బావుంటుందని రాజశేఖర్ గారూ అన్నారు. ఈ నేపథ్యంలో మేము చొరవతీసుకుని అటువంటి ప్రతిపాదనలు, జాబితా వంటివి తయారుచేయనున్నాము. ఈ విషయంపై సాహిత్యంపై అవగాహన, లోతైన ఆసక్తివున్న మరికొందరు వికీమీడియన్లను, వీలుంటే ఇతరులను కూడా సంప్రదించి వీలైనంత త్వరలోనే ఈ పనిని పూర్తిచేస్తాము. ఇటువంటి వీలు కల్పించినందుకు విష్ణుగారికి ధన్యవాదాలు.--Pavan santhosh.s (చర్చ) 17:23, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply
పవన్ గారు మీరు ఇంత క్రియాశీలకంగా దీనిపై చొరవతీసుకొని సభ్యులతో చర్చించి ముందడుగు వేస్తున్నందుకు ధన్యవాదాలు. దిగ్విజయోస్తు --విష్ణు (చర్చ) 19:42, 10 ఏప్రిల్ 2015 (UTC)Reply

వివరమైన నివేదికలేవి? మార్చు

Pavan santhosh.s గారు లేవనెత్తిన అంశం గత కృషిలో లోపాన్ని తెలియచేస్తున్నది. వికీసోర్స్ రచ్చబండ, వాడుకరుల చర్చాపేజీలు పరిశీలిస్తే సిఐఎస్ కృషి కి సంబంధించి సరియైన పూర్తి వివరాలు విస్తృత సముదాయానికి తెలియుటలేదనిపిస్తుంది. కేవలం భౌతిక సమావేశాలే సమాచారం తెలపడానికి ప్రధానంగా వాడుతున్నట్లుగా వుంది. వికీసోర్స్ ఆన్లైన్ ప్రాజెక్టు కాబట్టి భౌతిక సమావేశాలు, ఆన్లైన్ చర్చలకు తోడ్పడాలి కాని అవే ప్రధానం కాకూడదు.ఇప్పటివరకు చేర్చిన ప్రాజెక్టు పేజీలలో (ఉదా:వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక) కేవలం గణాంకాలు,లింకులు కనబడుతున్నాయి కాని ప్రాజెక్టు సాధకబాధకాలు, నేర్చుకున్న సంగతులు తెలియటం లేదు. గత సంవత్సరము గుర్తించిన ముఖ్యమైన పని యూనికోడ్ మార్పిడిని లోపరహితంగా చేయటం (నా కలం - నా గళం యూనికోడ్ పాఠ్యీకరణ వివరాలు,నా కలం-నాగళం యాంత్రికదోషాలు సరిచేసిన వివరాలు, చర్చలో విష్ణు గారి అంగీకారం) గురించి ఈ దిశగా గత కృషికి సంబంధించి పై చర్చలో విష్ణు ప్రస్తావన " వారు రకరకాల ఫార్మాట్లు మరియు ఫాంట్లు వాడడం వలన దాదాపు రెండు నెలల పాటు ప్రతీ రాత్రి సీ.ఐ.ఏస్-ఏ.2.కె జట్టు (ఆఫీసు తదనంతరం) దీనిపై కృషి చేసింది. అలాగే కామన్స్ లో ఎన్నో ఇబ్బందులు సీ.ఐ.ఏస్-ఏ.2.కె జట్టుఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందులు, సీ.ఐ.ఏస్-ఏ.2.కె సహకారం ఇందూజ్ఞానవేదిక సభ్యులు ప్రత్యక్షంగా చూసారు." ఈ కృషిని ముందు మరింత మెరుగుగా చేయడానికి ఉపయోగపడదు.కనుక వివరమైన నివేదికలు చేర్చవలసినది.--అర్జున (చర్చ) 02:07, 13 ఏప్రిల్ 2015 (UTC)Reply

అర్జున గారు మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అన్న విషయం మీరు గ్రహించే ఉంటారు. కృషిలో జరిగిన సాధక బాధకాలు ప్రాజెక్టు పూర్తి అయిన పిదప తప్పక చేర్చడం జరుగుతుంది. ఓ.టి.ఆర్.ఎస్ వాలంటీయర్ గా మీరందించిన సహకారానికి ధన్యవాదాలు.--విష్ణు (చర్చ) 12:15, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
ప్రతిస్పందన లో స్పష్టత లోపించింది. సిఐఎస్-ఎ2కె మొదలు పెట్టిన ప్రాజెక్టులు నడుస్తూనే వున్నాయి అన్న అర్ధం తీసుకొని నా స్పందన చేరుస్తాను. ఇందూజ్ఞాన వేదిక ప్రాజెక్టుఅభివృద్ధి చేయాల్సిన పద్ధతి ఎప్పుడో ఖరారైనట్లుంది. దానిలో సాంకేతికాలగురించి కొత్తగా తెలియవలసినది ఇంకా వుందనుకోను. ఇటువంటి సాంకేతికాలపైన నివేదికలు సత్వరమే తెలియపరచితే ప్రాజెక్టు అభివృద్ధి ఇంకే వేగంగా జరిగే అవకాశముంది.వికీపీడియా సాధారణంగా నడిచే ప్రాజెక్టులకి ముగింపు తేదీ వుండదు, అలా అనుకున్నా త్రైమాసిక నివేదికలు రూపొందిస్తే తదుపరి త్రైమాసికంలో మరింత అభివృద్ధికి అవకాశం వుంటుంది. కనుక సిఐస్-ఎ2కె ప్రాజెక్టు నివేదికలపై దృక్పధాన్ని మార్చుకుని, ఇకముందైనా వివరమైన నివేదికలు కనీసం త్రైమాసికంగా తెలిపితే బాగుంటుంది.ఇక నేను OTRS తరపున అందించిన సహకారాన్ని గుర్తించినందులకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 09:38, 24 ఏప్రిల్ 2015 (UTC)Reply

Final comments/ముగింపు వ్యాఖ్యలు మార్చు

ఉప విభాగాలలో తెలుగులో వ్యాఖ్య చేర్చిన తరువాత వీలైతే దాని ఆంగ్లానువాదం చేర్చ, ఆంగ్లానువాదాన్ని మెటా లో నకలు చేయండి.--అర్జున (చర్చ) 10:47, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

User:Arjunaraoc/‌వాడుకరి:అర్జున మార్చు

In Telugu/తెలుగులో మార్చు

వికీసోర్స్ లో గత సంవత్సరంలో చేసిన కృషికి తోడ్పడిన, సిఐఎస్ చేసిన కృషిని లోతుగా విశ్లేషించిన మరియు సిఐఎస్ చేయబోయే కృషిని చర్చించిన వ్యక్తిగా నా ముగింపు వ్యాఖ్యలు క్రింద ఇస్తున్నాను.

  1. గత సంవత్సరం కృషిలో భాగంగా చాలావరకు సులభంగా లభించే రచనలను మాత్రమే చేపట్టింది. ఇందుజ్ఞానవేదిక పుస్తకాలు ఆ సంస్థ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్వేచ్ఛానకలుహక్కులలో ఒక రచనని వికీసోర్స్ లో చేర్చడాన్ని విని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందచేసింది. సయ్యద్ నశీర్ అహమ్మద్ తన పుస్తకాలను ఇప్పటికే స్వచ్ఛందంగా ఈమెయిల్ ద్వారా పంచిపెట్టిన వ్యక్తి . ఇక ఆంధ్రలయోల ప్రాజెక్టు ద్వారా కందుకూరి విరేశలింగం కృతులలో 1000పేజీలు చేర్చబడినవి. దీనివలన తెలుగు వికీసోర్స్ గురించి కొంతమెరుగైన అ‌వగాహన కలగటం ఆహ్వానించదగ్గ సంగతి. అయితే .నాణ్యమైన యూనికోడ్ మార్పిడి కొరకు వాడే సాఫ్టువేర్ ని మెరుగుచేయటం గుర్తించినా అటువంటిది చేయలేదు. అందువలన నాణ్యత లోపాలున్న కృషి జరిగి, వికీసోర్స్ నాణ్యత పై భారీ మచ్చ పడింది. వీటిని సవరించడానికి స్వచ్ఛంద సభ్యులపై తలకి మించిన భారం పడింది.
  2. ఇక మొత్తం ప్రాజెక్టు గణాంకాలనే లక్ష్యంగా తీసుకుంటే స్వచ్ఛంద సభ్యుల కృషి ఎలా మరుగునపడుతుందో గత కృషికి వాడిన పటంలో లోపాలను ఎత్తి చూపినా సిఐఎస్-ఎ2కె అంగీకరించే స్థితిలోలేదు.
  3. ప్రాజెక్టు సంప్రదింపులు, నివేదికలు, సమస్యలు ఎదుర్కోవడంలో లోపాలున్నాయి.
  4. ప్రణాళికలో ఇతరులనుండి పొందే సహాయాన్ని వేరుగా చూపించినా, నివేదికలలో ప్రాజెక్టు స్థాయిలో అటువంటి సమాచారం ఇవ్వకపోవడం ప్రణాళిక బలంగా లేకపోవటాన్ని సూచిస్తుంది.
  5. కొత్త ప్రణాళికలో తెలుగు పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్స్ లో విడుదల, కందుకూరి వీరేశలింగం రచనలు, అన్నమాచార్య రచనలు ప్రాజెక్టు వున్నాయి. తెలుగు పుస్తకాలు స్వేచ్ఛాలైసెన్స్ లో విడుదలకు గత కృషిని బట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉపకరణం అభివృద్ధి చేయకుండా నాణ్యతగల పనిచేయలేదు. కందుకూరి వీరేశలింగం రచనల మానవీయంగా చేయవలసినవికాబట్టి దీనికి సిఐఎస్ ప్రత్యేక సంస్థగత సహకారం అవసరంలేదు. అన్నమాచార్య రచనలు ఇప్పటికే వర్గం:అన్నమయ్య పాటలుప్రకారం 1553 ‌వున్నాయి. వీటిని విస్తరించడం ఒక ప్రత్యేకమైన ఆసక్తిగలవారికే ఉపయోగపడతాయి. సంస్థాగతంగా చేస్తున్నప్పుడు చాలామందికి ఆసక్తి కలిగించే పుస్తకాలు చేపడితే మెరుగు.
  6. అందువలన ఈ ప్రణాళిక వలన పెద్దగా తెలుగు వికీసోర్స్ కి ఉపయోగపడదు. కావున ప్రణాళికని వ్యతిరేకిస్తున్నాను. --అర్జున (చర్చ) 05:42, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

In English/ఆంగ్లములో మార్చు

As a contributor to last years Telugu Wikisource work, and as a person who has analysed last year's CIS work and their plan for next year, I give my final comments below.

  1. CIS took up low hanging fruit kind of work during last year. Based on community work of one book, Indu Gnana vedika came forward to release some of their publications under CC-BY-SA. Syed Naseer Ahmed has already distributed his books to over 3000 people by email. As part of Andhra Loyola project, Sri veeresalingam books, 1000 pages have been added .As a result of these, better awareness of Telugu Wikisource is a positive development. Though the need for better unicode conversion software tool was identified, CIS-A2K did not develop it. Moreover, their work is marked by poor quality as highlighted in the previous sections, which impacted the Wikisource brand adversely.This resulted in lot of undesirable workload on community,
  2. Volunteer wikisourcers work is hidden by CIS-A2K approach of presenting total wikisource statistics. Though the mistakes were identified clearly, CIS-A2K is not in a position to accept the same.
  3. Gaps were identified in project discussions, reports and dealing with challenges.
  4. CIS-A2K provides break up of funds from WMF/FDC and others in their detailed plans, but its unwillingness to share the same level of detail for actuals may indicate the poor quality of proposal.
  5. The projects identified for the next year include, release of Telugu books under copyleft licenses, Adding more pages of Kandukuri Veeresa lingam book and Annamacharya compositions.Without improving Unicode conversion software , quality work can not be expected for books in digital code format .Kandukuri Veeresalingam books are typed manually and as a begining is made, there is not much that is needed from CIS-A2K. There are already 1553 compositions of Annamacharya (వర్గం:అన్నమయ్య పాటలు) on Telugu wikisource.Enhancing this will be useful only for small group of people . For Institutional projects, it may be better to target works that will be of interest to large number of people .
  6. Due to the above, the proposed project is not largely useful for Telugu Wikisource. Hence I object to the proposal. --అర్జున (చర్చ) 05:42, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

పవన్ సంతోష్ మార్చు

తెలుగు మార్చు

  1. సీఐఎస్ వారు గతంలో చేసిన కృషి ద్వారా స్వేచ్ఛానకలు హక్కుల్లో పునర్విడుదల అయిన పదుల సంఖ్యలో పుస్తకాలు ఇందూజ్ఞానవేదిక వారివి. తెవికీలో వ్యాసాలుగా రూపొందేందుకు కూడా నోటబుల్ కాని ఈ పుస్తకాలను పునర్విడుదల చేసేందుకు పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. తీరాచూస్తే ఇటు పుస్తకాలు వికీ ప్రాజెక్టులకు అంతగా ఉపకరించలేదు, అటు సాహిత్య వర్గాల ఆసక్తి కూడా దీనికి లభించలేదు. కనీసం కార్యక్రమానికి మేగజైన్లు, దినపత్రికలు, వెబ్జైన్లలో ప్రాచుర్యమూ పెద్దగా లభించలేదు. ఈ ప్రణాళికలో దాదాపు 50మంది రచయితల పుస్తకాలు చేరుస్తున్నట్టు వ్రాశారు. పై విషయం నుంచి సీఐఎస్ ఏమీ నేర్చుకోలేదని, పైగా సమర్థించుకుంటోందని వారి వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. ఇక ఇదే విధంగా పెద్ద ఎత్తున చేసే కృషి అప్రధానమైన పుస్తకాలవే అయితే అదేమంత విలువైన కృషి కాకపోగా ఇందూజ్ఞానవేదిక వారిలాగా వికీపీడియాపై వ్యతిరేకత కూడా కల్పించుకునే వీలుంది.
  2. సంస్థాగత భాగస్వామ్యంలో భాగంగా పెద్దఎత్తున విద్యార్థుల చేత టైప్ చేయించే పుస్తకాలను ఎంపిక చేసేందుకు కనీసం వికీపీడియా సముదాయాన్ని సంప్రదించలేదు. రానున్న కృషిలో భాగం చేసుకోవాలని ఈ ప్రణాళిక రూపొందిన తర్వాత నాతో సహా ఐదుగురు వికీపీడియన్లు చొరవతీసుకుని మరీ తయారుచేసిన ప్రాధాన్యత కలిగిన పుస్తకాల జాబితాను తమ రానున్న సంవత్సర కృషిలో పరిగణిస్తామని గానీ, కనీసం పరిశీలించామని గానీ తెలియపరచలేదు. అహ్మద్ నశీర్ గారి పుస్తకాలను పునర్విడుదల చేయించడం గుర్తించదగ్గ కృషి, వీటికి మూలాలగానూ విలువ ఉన్నది, కానీ ఈ పుస్తకాల విషయంగా తలెత్తిన సాంకేతిక సమస్యల విషయంలో తెవికీ సముదాయం తలమునకలు కావాల్సివచ్చింది.
  3. కార్యక్రమాన్ని నిర్వహించే ముందు వికీసోర్సు సముదాయాన్ని సంప్రదించకపోగా, సగం సగం పూర్తైన పుస్తకాలు నాణ్యత దెబ్బతీస్తున్నాయంటే సముదాయమే సరిజేసుకోవాలని బాధ్యత వేస్తున్నారు. సముదాయంతో కలిసి పనిచేస్తే వారు బాధ్యత తీసుకోవడంలో అభ్యంతరపెట్టరు, కానీ ఇలా తమకు తోచినవి చేసుకుపోతూ సముదాయాన్ని ఉపయోగించుకోవాలనుకోవడాన్ని చాలామంది వికీమీడియన్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రవీణ్ జి.రావు గారు స్వచ్ఛంద కార్యకర్త అని, వారికి సముదాయం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రవీణ్ సీఐఎస్ ఇన్టర్న్ అనీ అర్జునరావు నిరూపించినారు.
  4. పైన అర్జునరావు గారు చేసిన SQL క్వైరీని, పటాన్ని పరిశీలించిన మీదట అర్జున గారు పేర్కొన్నట్టు సీఐఎస్ చేర్చిన పటం వాస్తవాల్ని వక్రీకరిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది. కానీ సీఐఎస్ వారు ఏకపక్షంగా, ఆధారాలు చూపకుండా క్వైరీనే తప్పు అని చెప్పడం తప్పు సరిదిద్దుకోదలచుకోని తత్త్వం నిరూపిస్తోంది. ఇది రిపోర్ట్ చేస్తున్న విషయాలకు, వాస్తవాలకు ఉన్న దూరాన్ని ధృవీకరిస్తోంది.
  5. గత పనితీరు ఆధారంగానూ, ప్రస్తుత ప్రణాళికను పరిశీలించాకానూ, జరిగిన చర్చల ద్వారానూ ఈ ప్రణాళిక సముదాయానికి అంతగా ఉపకరించదనే అభిప్రాయపడుతున్నాను. కనుక ఈ ప్రణాళిక ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను.--Pavan santhosh.s (చర్చ) 17:13, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

english మార్చు

  1. Last year CIS A2K contributed their efforts to re-releasing Books of Indu gnana vedika in CC BY SA. CIS conducted a meeting celebrating the event of re-release but the irony is the books are not even notable to have an article in telugu wikipedia. So, these books couldn't help other wiki-projects anymore and even program also couldn't get good reception from telugu literature field. There is no good coverage in media too. Now coming to this plan, It has been written that they will be making same efforts towards 50 other authors to make their books re-release. I could see CIS not being learnt from the above failure and even supporting their stand on the program. So, I could see same mistakes(considering not so useful books) are going to happen in a large scale, It may not add value to wikisource, Even some of those authors may turn against to the project just like Indu gnana vedika people.
  2. CIS A2K didn't contact and consider the suggestions of wiki-community when they've taken up large scale typing program by students of Andhra loyola college (institutional partner with A2K). In this background, Now by my initiative and the efforts of community we made a priority list for books to be considered for typing and CIS A2K didn't responded & they didn't announce that they'll consider it. Re-releasing Naseer ahmad's books into CC BY SA is a good initiative by CIS A2K. These books will be useful as references, in citations for tewiki articles. But these books are having lots of errors upon which tewiki community is striving to maintain quality.
  3. Tewiki community is refusing to correct the mistakes arose in the books re-released, celebrated and added to wikisource without prior discussion and considering views of wikimedians. Wikisource community is concerned towards declining quality due to addition of the uncleared books by CIS professionals. Community is said to support the new wikipedian Praveen G.Rao, but later Arjunarao questioned and confirmed he is not just volunteer and is a intern of CIS.
  4. In the telugu discussion page, Arjuna rao challenged the graph produced in the proposal by results of SQL query. It seems CIS graph is manipulating facts. CIS unilaterally arguing that the query is wrong without supporting it by any data. It reflects their attitude towards the whole concept of developing through analysing mistakes. This may stand an example on how the actual ground reality is varying from reports.
  5. By analysing the performance, present work plan and discussions taken place I conclude that this plan may not helpful to telugu wiksource. So, I oppose this proposal.--Pavan santhosh.s (చర్చ) 18:14, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply
Return to the project page "తెవికీసోర్స్-సీఐఎస్ వార్షిక ప్రణాళిక జులై 2015 - జూన్ 2016".