వికీసోర్స్:తెవికీసోర్స్-సీఐఎస్ వార్షిక ప్రణాళిక జులై 2015 - జూన్ 2016
- ఈ ప్రణాళిక ఆంగ్లంలోని మూలానికి అనువాదం. మూలం కోసం ఇక్కడ చూడండి.
తెలుగు వికీసోర్స్ నిరుడు సీఐఎస్-ఏ2కె వారి తెలుగు భాషా ప్రణాళికలో భాగంగా ఉంది. అయితే గత సంవత్సరాంతానికి విడిగా వేరే ప్రణాళిక తెవికీసోర్స్ కు తయారు చేయాల్సిన అవసరం సీఏస్-ఎ2కె కు కలిగింది. రచయితలు, ప్రచురణకర్తల ద్వారా విరివిగా పుస్తకాలు వచ్చి చేరడం, సంస్థాగత భాగస్వామ్యాల వలన ఇది అవసరమయింది. ఏప్రిల్ 2014 నుండి సీఐఎస్-ఎ2కె తెవికీసోర్స్ సభ్యుల సహకారంతో చేసిన పనులను ఇక్కడ చూపించడం జరిగింది. ఈ పనులను దృష్టిలో ఉంచుకొని జులై 2015 నుండి జూన్ 2016 వరకూ చేపట్టబోయే విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. మరిన్ని వివరాల కోసం ఆచరణ విభాగాన్ని చూడగలరు.
ఇప్పటి వరకూ జరిగినది
మార్చుతెవికీసోర్స్ తొలినాళ్ళలోనే తెవికీ సభ్యుల ద్వారా మంచి ఆదరణ పొందింది. తెవికీలో ఏ ఏ విధాలలో పుస్తకాలు చేర్చవచ్చో, ఉదా: కాలం చెల్లుబాటు అయిన పుస్తకాలు, ఇతిహాసాలు, వేదాలు, ఇట్టి వాటి అనువాదాలు మొ॥. అయితే సమకాలీన సాహిత్యం తెవికీసోర్స్ లో అందుబాటులోకి రాలేదు. రెండేళ్ళ క్రితం అర్జున గారు ప్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్ ను స్థాపించాక, కురాన్ భావామృతం, ఆపైన తెవికీ దశాబ్ది సందర్భంలో నా కలం- నా గళం లాంటి పుస్తకాలు రావడంతో ఒక కొత్త పంథాలోకి తెవికీసోర్స్ ప్రయాణం మలుపు తీసుకుంది. అక్కడ మొదలు సభ్యులు డీఎల్ఐ లాంటి వనరుల ద్వారా ఎన్నో పుస్తకాలను చేర్చారు. సీఐఎస్-ఎ2కె చొరవ వలన ఇందూ జ్ఞాన వేదిక వారి పది పుస్తకాలు, సయ్యద్ నశీర్ అహ్మద్ గారి పది పుస్తకాలు వెంటవెంటనే తెవికీసోర్స్ కి విరాళంగా సంబంధిత నకలుహక్కుల యజమాని అందించారు. వీటిపై పని జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఆంధ్ర లొయోల కళాశాల తో జరిగిన సంస్థాగత భాగస్వామ్యం ద్వారా తెవికీసోర్స్ లో ఆ కళాశాల తెలుగు విభాగం విద్యార్థులు చురుగ్గా పని చెయ్యడం మొదలుపెట్టారు. ఎందరో విద్యార్థులు ఇప్పుడు తెవికీ, తెవికీసోర్స్ సభ్యులు కూడా.
ఈ ఏడాది కూడా మరిన్ని పుస్తకాలను వికీసోర్స్ కి రచయితలు అందించేలా చర్యలు తీసుకుంటాము.
ఆచరణ
మార్చుతెలుగు పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్సులో విడుదల
మార్చు- ఆలోచన
తెలుగు రచయితల ద్వారా వారి పుస్తకాలను స్వేచ్ఛా లైసెన్సు ద్వారా విడుదల చేయించి తద్వారా ఆ పుస్తకాలను తెవికీసోర్స్ లో చేర్చడం
- ఆచరణ
- రచయితలకు అవగాహన ఇచ్చి, వారి ద్వారా అనుమతి పొందడం
- అనుమతి పత్ర సమర్పణను చిన్నపాటి కార్యక్రమం ద్వారా నలుగురికీ తెలిసేలా చెయ్యడం
- తెవికీసోర్స్ లో చేర్చే విధానం పై సరియయిన ప్రాధాన్యతను గుర్తించి టైప్ చేయించడం లేదా యాంత్రికానువాదం చేయడం
- పీడీఎఫ్ దస్త్రాలను కామన్స్ కు ఎక్కించడం
- అతి ఎక్కువ ప్రాధాన్యత (విజ్ఞాన సర్వస్వ విషయవస్తువు) ఉన్న పుస్తకాలను తెవికీసోర్స్ పై చేర్చడం
- అంచనా
1. కనీసం 50 తెలుగు పుస్తకాలు తెవికీలో చేరుతాయి
2. వికీపీడియా లో కనీసం 50 మంచి నాణ్యత గల వ్యాసాలు రూపొందుతాయి.
కందుకూరి వీరేశలింగం పంతులు రచనలు
మార్చుకందుకూరి వీరేశలింగం పంతులు గురించి తెలుగు వారికి వేరే పరిచయం అవసరం లేదు. తెవికీసోర్స్ ద్వారా కందుకూరి వీరేశలింగం పంతులు రచనలను అందించాలన్నదే ఈ ప్రణాళిక ఆలోచన.
- ఆలోచన
కందుకూరి వీరేశలింగం రచనలు సమగ్రంగా తెవికీసోర్స్ లో అందుబాటులోకి తేవడం
- ఆచరణ
సీఐఎస్-ఎ2కె ఆంఢ్ర లొయోల కళాశాలతో చేసుకున్న సంస్థాగత భాగస్వామ్యం వలన తెవికీసోర్స్ కు కళాశాల నుండి విద్యార్థులు వికీసోర్స్ సభ్యులుగా వచ్చి చ్చేరారు. ఇప్పటికే వీరి ద్వారా పంతులు గారి 60 లోని 24 కృతులు, అంటే 10,000 పేజీలలో 1000 పేజీలు తెవికీసోర్స్ లో వచ్చి చేరాయి. ఇవి పూర్తి చేయడం ఈ సంవత్సరపు ప్రణాళిక
- అంచనా
- దాదాపు పుట పేరుబరిలో 10000 పేజీల సృష్టి
- వీరేశలింగం సాహిత్యంపై ఆసక్తి ఉన్న ఎందరో కొత్త చదువరులకు వికీ వేదికను పరిచయం చెయ్యడం
- వికీసోర్స్ వేదికగా రచయితల పుస్తకాలు అందుబాటులోకి అన్న నినాదంతో రచయితలను ఆహ్వానించడం
అన్నమాచార్య సంకీర్తన ప్రాజెక్టు
మార్చుఅన్నమాచార్య రచించిన 32,000 సంకీర్తనలలో దాదాపు 15,000 ఈవేళ అందుబాటులో ఉన్నాయి.
- ఆలోచన
ఈ 15,000 వరకూ ఉన్న అన్నమాచార్య సంకీర్తనలను తెవికీసోర్స్ ద్వారా అందుబాటులోకి తేవడం
- ఆచరణ
- ఈ సంకీర్తనలను వివిధ కాలాలలో వీవిధ రూపాలలో తితిదే వారు అందించారు. ఎందరో ఔత్సాహికులు ఈ కీర్తనలను యూనికోడ్ తో సహా పలు విధాలలో అందించారు. కొద్ది కాలం క్రితం విష్ణు ఈ ఔత్సాహికులతో మాట్లాడి ఆయా కీర్తనలను తెవికీసోర్స్ లో అందుబాటులోకి తెచ్చేలా మార్గం సుగమం చేసారు.
- యూనికోడ్ లోకి టైప్ అయిన సంకీర్తనలను ఔత్సాహికుల ద్వారా పొందడం, వాటిని తెవికీసోర్స్ లో చేర్చడం
- అకారాది క్రమం లో ఇవి చేర్చబడతాయి
- వివిధ వర్గాలూ, ఉపవర్గాలూ, తెలుగు-సంస్కృతం-రాగం-రేకు-తితిదే వాల్యూం-దేశీ-ఆధ్యాత్మిక-శృంగార మొదలగు పేజీల వారీగా ఎక్కించిన సంకీర్తనలను అందించడం
- అంచనా
- దాదాపు 15000 పుట పేరుబరి పేజీలు
- సరికొత్త వీక్షకులకు తెవికీసోర్స్ పరిచయం
- వికీసోర్స్ వేదికగా అన్నమాచార్య సంకీర్తనలు
లక్ష్యాలు
మార్చుజులై 2015 - జూన్ 2016 కు గాను లక్ష్యాలు
అంశం | ఫిబ్రవరి 28, 2015 నాటి లెక్క | జూన్30, 2016 నాటి లక్ష్యం | జూన్ 30, 2016 నాటి స్వప్నం |
---|---|---|---|
వాడుకరుల సంఖ్య | 101 | 150 | 200 |
కొత్త వాడుకరుల సంఖ్య | 53 (నిరుడు) | 100 | 200 |
క్రియాశీల వాడుకరుల సంఖ్య | 39 | 50 | 100 |
వ్యాసాల సంఖ్య | 10,891 | 12,000 | 15,000 |
కార్యక్రమాలు | 5 | 5 | 10 |
అందిన పుస్తకాలు | 50 | 100 | 500 |
పుటలు | 6,000 | 50,000 | 100,000 |
సంస్థాగత భాగస్వామ్యాలు | 2 | 3 | 7 |
చర్యలవారీగా లక్ష్యాలు
మార్చుచర్య | అందే పుస్తకాలు | వ్యాసాల సంఖ్య | కార్యక్రమాల సంఖ్య | సంస్థాగత భాగస్వామ్యం |
---|---|---|---|---|
సంస్థాగత భాగస్వామ్యం (విషయవస్తువు కోసం) | 50 | 50,000 (పేజీలు) | 2 | 3 |
తెవికీసోర్స్ పై టైపింగ్ స్ప్రింట్ | 1,000 (పేజీలు) | |||
రచయితల ద్వారా పుస్తకాలు | 200 | 20,000 | 2 | 1 |
మొత్తం | 251 | 71,000 | 4 | 4 |
బడ్జెట్
మార్చువ్యయాంశం | వికీమీడియా ఫౌండేషన్ నుండి సహాయం (రూపాయిల్లో) | వికీమీడియా ఫౌండేషన్ నుండి సహాయం (అమెరికా డాలర్లలో) | ఇతరుల నుండి సహకారం (రూపాయిల్లో) | ఇతరుల నుండి సహకారం (అమెరికా డాలర్లలో) |
---|---|---|---|---|
1 PO x 30% * | 232,848/- | 3,762.82 | - | - |
1 PD x 5% ** | 79,200/- | 1,279.87 | 40,800/- | 659.33 |
రవాణా, వసతి *** | 50,000/- | 808.00 | 50,000/- | 808.00 |
వికీ సభ్యులకు సహకారం | 30,000/- | 484.80 | 50,000/- | 808.00 |
కార్యశాలలు/కార్యక్రమాలు/సమావేశాలు | 100,000/- | 1,616.00 | 50,000/- | 808.00 |
ఉపకరణాలు/అనుమతి/లైసెన్సులు | 30,000/- | 484.80 | - | - |
డిజిటైజేషన్ | - | - | 2,00,000/- | 3,232.00 |
ముద్రణ/స్టేషనరీ/స్వాగ్ | 50,000/- | 808.00 | - | - |
ఇతర ఖర్చులు | 5,000/- | 80.80 | - | - |
మొత్తం | 577,048/- | 9,325.10 | 390,800/- | 6,315.33 |
వివరణ:
* 30% సమయం - ప్రోగ్రాం ఆఫీసర్ రహ్మానుద్దీన్ మొత్తం సమయం నుండి. సీఐఎస్ నుండి ఇతను ఈ ప్రణాళికను ఆచరణలో పెడతారు.
** 5% సమయం, ప్రోగ్రాం డైరెక్టర్ సీఐఎస్-ఎ2కె సమయం నుండి
*** ఈ ప్రణాళిక ఆచరణలో సీఐఎస్ సిబ్బంది ఖర్చులు
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చుఆమోదం
మార్చుమీ ఆమోదం ఇక్కడ తెలుపగలరు.
--Nrgullapalli (చర్చ) 11:52, 29 మార్చి 2015 (UTC)
- నా సంపూర్ణ మద్దతు తెలియ జేస్తున్నాను[[Bhaskaranaidu (చర్చ) 02:08, 1 ఏప్రిల్ 2015 (UTC)]]
- ఈ ప్రాజెక్టుకు నా అంగీకారం తెలుపుతున్నను. ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి అంగీకరిస్తున్నాను. --T.sujatha (చర్చ) 16:58, 6 ఏప్రిల్ 2015 (UTC)
- నా సంపూర్ణ మద్దతు తెలియ జేస్తున్నాను--శ్రీరామమూర్తి (చర్చ) 09:56, 7 ఏప్రిల్ 2015 (UTC)