గురుజాడలు
గురుజాడలు
(మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం)
ప్రధాన సంపాదకులు
పెన్నేపల్లి గోపాలకృష్ణ
సహ సంపాదకులు
డాక్టర్ కాళిదాసు పురుషోత్తం
ఎం.వి.రాయుడు
మనసు ఫౌండేషన్
8 - 2 - 611/3, నిషాన్-ఇ-ఇక్బాల్, గ్రౌండ్ ఫ్లోర్, రోడ్ నెం. 11.
బంజారాహిల్స్, హైదరాబాద్ - 500034. ఫోన్ : 040 2332 3760.
GURUJAADALU
(Compendium of all available works of Mahakavi Gurajada Apparao)
Publishers
Manasu Foundation
8-2-611/3, Nishan-E-Iqbal,
Ground Floor, Road No. 11,
Banjarahills, Hyderabad - 500 034,
Phone : 04023323760.
Cover Page :
Bapu
Cover Design :
Siva Sai Graphics, Hyderabad.
First Edition :
21st September, 2012.
D.T.P.
R.V.Ramana, 9247361401.
Printing :
Kalajyothi, Hyderabad.
Distributors :
Pallavi Publications,
Dr. A. Prem Chand Complex,
Ist Lane, Ashok Nagar,
Vijayawada - 10,
phone :9866115655.
All Branches of Visalandhra,
Navodaya Book House, Hyderabad.
Price : Rs. 375/-
ప్రకాశకుల మనవి
మనసు ఫౌండేషన్ పేరిట ఇంతవరకూ రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, శ్రీశ్రీ, బీనాదేవి గార్ల లభ్య రచనల సర్వస్వాలు ప్రజలకు అందజేసాం. 'చెప్పులు కుడుతూ.. కుడుతూ', 'సర్ అర్థర్ కాటన్ జీవితం-కృషి' అనువాద రచనలు ప్రచురించాం. ఇవన్నీ ప్రజలు చదవాలన్న కోరికతో పుస్తకం తయారీ ధర కన్నా చాలా తక్కువ ధరకే అందించాం.
గురజాడ సర్వస్వమైన ఈ గ్రంథంలో వారి లభ్యరచనలను అనువాదం చేయకుండా యథాతథంగా ఇందులో చేర్చాం. సాధ్యమైనంత వరకు తొలి ముద్రణలను ప్రామాణికంగా చేసుకున్నాం. ఈ పుస్తకానికి ప్రధాన కారకులు పెన్నేపల్లి గోపాలకృష్ణగారు. వీరు ఈ గ్రంథాన్ని చూడకుండానే కన్నుమూయటం ఒక పూడ్చలేని విషాదం. వీరు రచించి ప్రచురించిన 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ' చాలా మందిని అలరించింది. వీరు 2009లో ఆంగ్లంలో ప్రచురించిన Diaries of Gurajada కు సంపాదకత్వం వహించారు. వీరి కృషికి మనసు ఫౌండేషన్ కృతజ్ఞతలు.
గోపాలకృష్ణ గారు అప్పగించిన బాధ్యతను అందుకుని చివరి వరకూ నిర్వహించిన డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు. గురజాడ రచనల సేకరణతో పాటు అనేక విధాలుగాను సహాయపడిన వెలుగు రామినాయుడు, పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావుగార్లకు కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి సహనంతో సమర్థతతో డి.టి.పి. నిర్వహించిన రంగిశెట్టి వెంకటరమణగారికి, ప్రూఫులు దిద్దటంలో సహకరించిన వేణుగారికి, అన్ని విధాలుగా సహాయపడిన మహమ్మద్ రసూల్‌గారికి, శ్రీ పి.ఎల్.ఎన్. ప్రకాశంగారికి, శ్రీ కాళిదాసు గిరిధర్ Scientist, LAM గారికి, చిర్రా ఎలక్ట్రానిక్స్ సిబ్బందికి, ఇతర మిత్రులకు అభినందనలు.
ముచ్చటైన ముఖచిత్రం అందించిన బాపుగారికి కృతజ్ఞతలు.
కవర్ డిజైన్ చేసిన శివసాయి గ్రాఫిక్స్‌వారికి, మా పుస్తకాల ముద్రణలో మొదటి నుంచీ సహకారం అందిస్తున్న కళాజ్యోతి బాపన్నగారికి, వారి సహచరులకు ధన్యవాదాలు. ఈ పుస్తకం సకాలంలో రావడానికి కృషి చేసిన మనసు ఫౌండేషన్ సలహామండలి సభ్యులు పల్లవి వెంకటనారాయణ, శ్యామ్‌నారాయణ, బాలాజీ (దాము) గార్లకు ప్రత్యేక అభినందనలు.
-మనసు ఫౌండేషన్
శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ
(1937-2011)
శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ జర్నలిజంపైన మక్కువతో న్యాయవాదవృత్తిని విడిచిపెట్టి, నెల్లూరులో యూత్ కాంగ్రెస్ వారపత్రిక సంపాదకులుగా, జమీన్ రైతు సహాయ సంపాదకులుగా దాదాపు పదిహేనేళ్ళు పనిచేశారు. పదేళ్ళు ఆకాశవాణి జిల్లావిలేకరిగా ఉన్నారు. తను నెల్లూరులో 'వర్ధమాన సమాజం' కార్యదర్శి అయిన తర్వాత ఆ సమాజం నిర్వహించే ప్రాచీన కవుల జయంతులతో పాటు వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు జయంతులు నిర్వహించారు. కావలి 'జవహర్ భారతి' అధ్యాపకులు కే.వి.రమణారెడ్డి, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.పట్టాభిరామిరెడ్డి గార్ల స్నేహం, నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారి సాన్నిహిత్యం గోపాలకృష్ణ దృష్టిని చరిత్ర, సాహిత్యంవైపు మరల్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడుగా ఎన్నిక కావడం కూడా ఇందుకు దోహదపడింది.
వర్ధమాన సమాజ సభల్లో మహాపండితులు ఏటా కవిత్రయం మీద ఉపన్యాసాలు చేసేవారు. వారి ఉపన్యాస పాఠాలు సేకరించి, గోపాలకృష్ణ "కవిత్రయ కవితా వైజయంతి" పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడది ఒక రెఫరెన్సు గ్రంథం. వర్ధమాన సమాజం తరఫున ఆయన కావలి రామస్వామి "డెక్కన్ పోయెట్సు"ను పునర్ముద్రించారు; పఠాభి "ఫిడేలు రాగాల డజన్", "కయిత నాదయిత" కవితా సంకలనాలను వెలువరించారు.
నెల్లూరు సాంస్కృతిక జీవితంలో గోపాలకృష్ణ క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 'యువభారతి' సంస్థను నిర్వహించి, నెల్లూరులో లలితకళలపట్ల స్పృహ కలుగజేశారు. అభ్యుదయ వేదిక, ప్రోగ్రెసివ్ ఫిల్మ్ సొసైటి తదితర సమాజాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఆయన సినిమాల మీద, నాటకాలమీద చిరకాలం గుర్తుంచుకోదగిన మంచి సమీక్షలు చేశారు. జమీన్ రైతు పత్రికలో వారం వారం 'మాటకచేరి' శీర్షికలో స్థానిక విషయాల నుంచి, గొప్ప గ్రంథాల పరిచయం వరకు వైవిధ్యంగల విషయాలమీద చర్చించారు.
డాక్టర్ ఎం.పట్టాభిరామిరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థను ప్రారంభిస్తున్నప్పుడు ఆయనకు అండగా నిలబడ్డారు. గోపాలకృష్ణ ఏ.పి. హిస్టరీ కాంగ్రెస్ ఫౌండర్ మెంబర్స్‌లో ఒకరు. గోపాలకృష్ణ తిరుపతిలో 'ఉదయం' దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్న రోజుల్లో "గురజాడ అధ్యయన కేంద్రాన్ని" నెలకొల్పారు. త్రిపురనేని మధుసూదనరావు, భూమన్, సాకం నాగరాజు మొదలైన మిత్రులతో కలిసి కన్యాశుల్కం నూరేళ్ళపండుగ ఏడాది పొడవునా నిర్వహించారు.
గురజాడమీద ఒక వర్గం దారుణంగా విమర్శలు చేసినపుడు కే.వి.ఆర్. ప్రోత్సాహంతో గోపాలకృష్ణ ఆ విమర్శలకు అరుణతారలో సమాధానం రాశారు. ఆయన గురజాడమీద రాసిన వ్యాసాలు జమీన్ రైతు, ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త తదితర పత్రికల్లో అచ్చయ్యాయి.
సౌత్ ఆఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భారతీయుల పాత్రను వివరిస్తూ గోపాలకృష్ణ రచించిన "ఇంద్రధనుస్సు ఏడోరంగు" ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.
గురజాడ సాహిత్యంమీద, ప్రత్యేకంగా కన్యాశుల్కం మీద తన అధ్యయన సారాన్ని గోపాలకృష్ణ "మధురవాణి ఊహాత్మక స్వీయచరిత్ర"గా రచించారు. ఈ పుస్తకం పరిశోధనకు, కాల్పనిక రచనకు మధ్య ఉన్న సరిహద్దును చెరిపివేసి తెలుగుసాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియకు దారి చూపించింది. గురజాడ ఇంగ్లీషులో రాసుకున్న దినచర్యలు మొట్టమొదటిసారి గోపాలకృష్ణ సంపాదకత్వంలోనే ఇంగ్లీషులో అచ్చయ్యాయి.
గోపాలకృష్ణ ఎప్పుడూ గంభీరంగా, హుందాగా వ్యవహరించేవారు. మితభాషి, హాస్యప్రియులు. ఆయన వచన రచనలో గొప్ప పరిణతి, నైపుణ్యం సాధించారు. ఆయన్ను ఎరిగినవారు "గోపాలకృష్ణ పెర్ఫెక్షనిస్టు" అంటారు.
గురజాడ సమగ్ర సాహిత్యం - 'గురుజాడలు' కు సంపాదకులుగా శ్రమించి, ఆ సంపుటం ఆవిష్కరించబడుతున్న వేళ, ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటు - గొప్ప విషాదం.
గోపాలకృష్ణ ఆత్మీయ మిత్రుడిగా ఆయన స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ పరిచయాన్ని ముగిస్తున్నాను.
-డాక్టర్ కాళిదాసు పురుషోత్తం
Introduction
IN THE CAUSE OF THE PEOPLE
Pennepalli Gopalakrishna
Gurajada Venkata Apparao (1862-1915) was the harbinger of the modern era - Telugu literature. He was a pioneer and a crusader in the cause of people, simultaneously in more than one field. Renowned scholars, writers and historians have lauded him as a revolutionary in his thought and in his influence. He represents not merely a break away from the traditional thinking and writing, but also as one who brought a distinct change in direction.1 He “brought out bloodless revolution in both the literary and social spheres”.2 He “revolutionized theme and treatment, he rescued language from the learned and gave it back to people, the ultimate creators of language. He looked ahead of his time, with an outlook amounting to vision.” 3
K.V.R., who can be called the Boswell of Gurajada, in his well-researched and comprehensive biography, said that Gurajada became great not by being ahead of his times and being different from others, but because his thinking transcended his contemporary milieu. Such a man is called a universal writer whose writings are applicable to all nations and people. Even while retaining the characteristics particular to his people, he achieved universality. They are relevant even today.4
(Translation from Telugu by the Editor)
Reaffirming his unflinching faith in spoken Telugu, Gurajada in a letter to his disciple, as well a good friend, Ongole Munisubrahmanyam wrote :
“My cause is the cause of the people and I have cultured opinion at my back. I do not mind if those, who are incapable of understanding the subject, array themselves against me. Their conversion can do no good to the language. They are so hopelessly wedded to the old, highly artificial literary dialect.”5
Since Gurajada did not explicitly propagate his reformist views, some critics feel that he was not a votary of social reform.6 No doubt he viewed the reforms critically; yet he should not be construed as an opponent of social reform. He was however dissatisfied with contemporary reforms. A few superficial changes, he opines, will not transform society in totality 7 The basic structure of society should be changed paving way for a new society of individual liberty, social equality and economic justice. But he never openly aired his views. “Gurajada was a firm advocate of social and religious reforms. Indeed, he would have welcomed humanism replacing all religions. What he liked in Auguste Comte (1798-1857) was Comte’s humanism, and what he turned his face against was the religious gloss put on humanism by Comte. It is therefore, wrong to maintain as it is done sometimes, that Gurajada ridiculed social and religious reform. In reality, what he ridiculed was pretence of such reform. He had contempt for those who made religion a cover of means and chicanery; he hated those who, in the name of religion and social reform, tried to gain worldly advantage. His over-zealousness in holding up to ridicule such imposters did create in some minds the impression that he was against all reform. In fact, what he wanted was more than reform; he wanted a change in our thinking and being so that mankind as a whole could scale new heights and score new triumphs”. 8
Gurajada was intrinsically an artist. He viewed the world with a painter’s brush and writer’s creative pen. Through his artistic work he wakes up the reader to social evils. He neither propagates nor resorts to did acticism. But his social views and his personality reflect abundantly in his work. He says, “I paint life artistically, idealizing of course. Though art is my master I have a duty to society.”9 He was modern to the core. His dream and vision were of a new social system. His attitude towards women’s education, social equality and love as the basis of marriage are all surprisingly modern. His concern was with every basic problem that has a bearing on life, the thought of his generation and the generations to come.
The writings of Gurajada should be taken as a whole to assess his personality and his message. His creative writings alone will not suffice. His other works – the diaries, letters and notes should be taken into account. How far these can be treated as literature depends upon their quality and substance. It is the task of the critic to analyze and classify them. 1911 Diary – lost or not written?
Unfortunately, not all of his diaries are available. The diaries from 1895 to 1915 are available covering only two decades in the short span of his life of fifty three years. Again, among these 20 years the diaries from 1907 to 1912 are missing. What we miss is a very valuable period of his life. It was during that time he published a revised edition of ‘Kanyasulkam’ (1909). The 1911 diary raises a question – was it lost or not written at all? The year is significant in the history of modern Telugu literature as the movement for spoken dialect was started by Gidugu and Gurajada in that year. Opposing spoken dialect, the Andhra Sahitya Parishad was started by the champions of classical literature and 10,000 signatures were collected in support of the classical dialect to submit a memorandum to Government.
The controversy of Muddupalani’s Radhika Santwanam too erupted in this period, when Bangalore Nagaratnamma, the icon of Carnatic music and a relentless champion of the cause of Devadasis, published a complete edition of Radhika Santwanam in which she gave a powerful rejoinder to Kandukuri Viresalingam for his derogatory remarks on Muddupalani in his ‘Kavula Charitramu'. Viresalingam’s followers promptly complained to Government that Radhika Santwanam contained obscene descriptions. Government immediately seized the copies and initiated prosecution. Meanwhile, a meeting of learned Telugu and Sanskrit scholars was held in Madras and passed resolutions requesting Government to withdraw prosecution and bring out expurgated editions of Telugu classical works where there were objectionable passages. It is quite obvious that the meeting did not condemn the ban on the book. This meeting was presided over by Gurajada who sent the resolutions to the Chief Secretary to Government.10 Burra Seshagirirao, a young contemporary of Gurajada, claimed to have discovered the 1911 diary and quoted from it, “Viresalingam was undoubtedly a great man.” But the said diary has neither seen the light of the day nor is there any evidence to corroborate Seshagirirao’s claim.
Peculiar scribbling
The diaries are more elaborate with regard to the research of history. As an epigraphist of the Vizianagaram Samsthanam, Gurajada acquainted himself with the old Telugu script in lithic records. He wanted to write the history of Kalinga region and seems to have collected material for this, but his notebooks were lost in a journey. Hence the history of Kalinga region never saw the light of the day.
The manner in which Gurajada scribbled the diaries was peculiar to him. Important events were cryptically noted. Even the death of Ananda Gajapati, an event that caused enormous grief and personal loss to him, was given only one sentence (May 1897). Again at the end of the year he wrote something like a homage to the Maharajah. Gurajada briefly noted even the tragic and sudden death of his father, the marriage of his daughter and nowhere did he mention the death of his brother. (Did it happen in the year when the diary was not written?) He scribbles R.S. cryptically for the courtesan Ramaswamy, for whose details we have to depend on his notes. His conversations with prominent people like William Miller, Principal of Madras Christian College, Justice S. Subramania Iyer, Madan Mohan Malaviya, founder of Benares Hindu University, and eminent Bengali scholars like Gurudas Banerjee also found only a passing mention each. In the diary of 1897, the year in which the first edition of Kanyasulkam was published, nothing about the event finds place, except that it was presented to the Joint Manager of the Samsthanam.
George Sampson writes, “Diaries as a form of expression suited to certain natures have been common in many ages and they have been used normally as the material for reminiscences, autobiographies and biographies. A few have been printed in full and of these few, the greatest are the diaries of John Evelyn and Samuel Pepys, the first personal record of events and the record of a personal revelation of the frankest kind”.11 Anandarangam Pillai’s diaries during the early period of East India Company in Madras Presidency are a source of history for scholars. Anne Frank’s diaries are a treasure by themselves. Diaries thus also contribute a solid base for personality assessment. The tradition of writing diaries is not exclusive to Western culture. Even though the coinage of word might differ and vary, the records of many historical, political and literary works can be called diaries. In Bengal this tradition seems to have started in the beginning of the twentieth century. In Andhradesa, this genre was taken up by two contemporary stalwarts, Gurajada and Kandukuri,12 quite unwittingly at the same time, in the late nineteenth century. Gurajada’s diaries, as evidenced in the earliest publication, can be traced to 1889, whereas Kandukuri started writing diaries the following year.
Unfortunately, not all the diaries and manuscripts Gurajada’s are available with the State Archives, A.P. Diaries prior to 1895 are not found either with the State Archives Hyderabad or elsewhere. Yet, the first edition of the Telugu version of Gurajada’s diaries published in 1954 by Visalandhra Publishing House, Vijayawada, includes the slim diaries of 1889, 1891, 1892 and 1893. Since the manuscripts were in the possession of Visalandhra for a long time before they were handed over to the State Archives, the genuineness of the diaries published by them need not, rather dare not be questioned. Visalandhra is a pioneer in the publication of not only the diaries, but the entire literature of Gurajada with great zeal and commitment. Moreover, writers like K.V.R. and Arudra who perused the manuscripts when they were with Visalandhra Publishing House had quoted from the diaries extensively in their writings.
The diaries, letters and notes of Gurajada go a long way in reevaluating his revolutionary ideas and reforms. They help to assess and understand his multifaceted personality, the graphic growth of his wisdom, vision and intellect and bring to light the high pedestal he occupies in the social and literary realm. “We have still ‘miles to go’ before we reach the goals, which Gurajada has set for us. And until we reach those goals, he would be unto us ‘a shaft of light’ guiding our steps and lightening for us the weariness of the long journey by his friendly jests, his good honoured drollery and his hilarious laughter”.13
“Never does land
Mean clay and sand
The people, the people, they are the land”
(Gurajada’s 'Desabhakti' translated by Sri Sri)
- V.R. Narla : Father of Modern Telugu Literature: Gurajada centenary souvenir. New Delhi (1962).
- Ronanki Appalaswami : Gurajada commemorative volume, South Delhi Andhra Association, New Delhi (1976)
- M. Chalapati Rao : Gurajada commemorative volume, South Delhi Andhra Association, New Delhi (1976)
- K.V. Ramana Reddy (K.V.R.) : Mahodayam: (1969)
- Gurajada’s letter to Ongole Munisubrahmanyam
- Prof. Velcheru Narayanarao : Girls for sale – Kanyasulkam, Indiana University Press, Indianapolis, U.S.
- Rachamallu Ramachandra Reddy: Samvedana, monthly magazine from Cuddapah (now Kadapa) July 1968.
- V.R. Narla : Gurajada- Kendra Sahitya Academy, New Delhi.
- Gurajada’s letter to Ongole Munisubrahmanyam, dt. May 21, 1909.
- V. Sriram : The Devadasi and the Saint – The life and times of Bangalore Nagaratnamma, Chennai, 2007.
- George Sampson : Cambridge History of English Literature.
- Viresalingam Diareelu, edited by Dr. Akkiraju Ramapati Rao, Visalandhra Publishing House, Hyderabad.
- V.R. Narla : Gurajada, Kendra Sahitya Academy, New Delhi.
*****
PREFACE
Gurajada Venkata Apparao's diaries, letters and notes, all in English, should be viewed as one unit that provides an accurate assessment of his life and the contemporary literary and social movements. In fact, they are more helpful than his poems, short stories and plays to get a comprehensive picture of his varied activities and versatile genius. Such invaluable material has been in the dark for over a century.
I believe that Prajasakti Publishing House acquired the manuscripts from the successors of Gurajada in 1946 and got them translated into Telugu by Avasarala Surya Rao, a well-known writer. Subsequently the translated version of the diaries was published by Visalandhra Publishing House, Vijayawada, a premier publisher in Andhra Pradesh. Deciphering the scrawl of Gurajada, leave alone the translation, is a Herculean task, however expert the translator may be. Surya Rao fulfilled this task with great perseverance and zeal. A few lapses might have been committed in deciphering the script. Such lapses cannot mitigate the magnitude of his work.
After nearly four decades, the manuscripts, I trust most of them, were handed over by Visalandhra Publishing House to the Andhra Pradesh State Archives, Hyderabad obviously for safe custody and proper preservation. My friend Dr. Kalidasu Purushotham, who is deeply interested in the literature of Gurajada, and I visited the State Archives several times to study these records. It appears by the time Gurajada's papers reached the Archives, many of the important documents, were lost. Kanyasulkam manuscript, manuscripts of his poems etc. were also lost. It was sad to say that even the pages from the diaries are also lost and got mixedup and jumbled. We approached Prof. Jayadhir Tirumala Rao, the then Director of A.P. Government Oriental Manuscripts Library and Research Institute, Hyderabad and explained the importance of the Gurajada papers. Subsequently he took steps to secure the digitized copies of the Gurajada collection of manuscripts from the A.P. State Archives and Research Institute. I am thankful to the Director, A.P. State Archives & Research Institute and Prof. Jayadhir Tirumala Rao for providing the Diaries and other papers of Gurajada in original (digital) form.
I owe my first interest in the diaries of Gurajada to S. Raminaidu of Velugu, Vijayanagaram, who sent me a typed script in 1993. A few years ago Sri Chalasani Prasad of Virasam sent me a suitcase of typed copies of the manuscripts of diaries, letters and notes and also the manuscript of Kondubhattiyam, the incomplete play of Gurajada, and encouraged me to go ahead with publication. The love of my friends has sustained me with encouragement and enthusiasm. My thanks are due to Sri Bapu for the meaningful art piece on Gurajada. I am thankful to my close friend Dr. Kalidasu Purushotham for sharing the responsibility of editing Gurajada's works. My profound thanks are due to Sri M.V. Rayudu garu, Manasu Publications, Bangalore who readily volunteered to bring out the complete works of Gurajada.
–Pennepalli Gopalakrishna
Notes on Minute of dissent
Minute of dissent : A historical document of great importance was presented by Gurajada to the Madras University on the resolution passed by majority numbers of the sub-committee on Telugu composition in 1913 and in 1914. Though the purpose of the said document was to protest against the University decision, rejecting 'Modern Telugu' as medium for writing Telugu composition, the same turned out to be the Magna Carta of 'The Modern Telugu Language' in particular and of Indian education system, in general. Gurajada opined that a highly artificial and archaic poetic dialect was altogether unsuitable to modern Telugu prose had strongly observed that "The education of the masses was no part of the orthodox tradition." He added, "learning and literature were no monopoly of the Brahmin to whom Sanskrit precedent was sacred and inviolable."
He said, "Telugu poetry appealed to a narrow cult" and that scholars wrote only for those few and as time went on, unintelligibility was felt to be high literary merit. Brushing aside all the criticism on the local variations of spoken Telugu dialect, he asserted that 'they were insignificant' and that 'it was easier to learn modern Telugu than the poetic forms.' He argued that literary cultivation of modern Telugu necessitates a study of it, and that the study of 'refined living vernacular has great cultural value.'
Even the present day system of education should realize that "if school books are written in modern Telugu, vernacular education will improve at one bounce. Gurajada categorically condemned the argument of the protagonists of literary dialect as 'a narrow cult'. In this context he quoted Prof. Whitney that "scholars might be developed and sustained on the old literatures, but not the people." The 'Minute of Dissent' is a relevant document since it aims at 'rescuing the Telugu language from the learned and give it back to the people, the ultimate creators of language. (M. Chalapati Rao : Gurajada Commemorative Volume, New Delhi.)
This Dissent Note of Gurajada was first published in 1914 by Vavilla Venkateswara Sastri.
While publishing this present edition, the editors who had painstakingly and meticulously screened through the 1914 edition had felt it right to correct few printing errors, make few changes in the font and subjoin some missing nomenclature; all these changes without hurting the original text of Gurajada, for the better understanding of the readers.
In the Dissent Note, Gurajada had referred certain persons; some of their surnames, some by their short or pet names and some by their second names. The Editors of this edition preferred to give the complete names of those persons referred for the clearer understanding of the readers.
Sri Gurajada quoted some of Butterworth's inscriptions in his dissent note in support of his views. The editors on verification with the original text of Butterworth's inscriptions found that some of those inscriptions were printed incorrectly in the first edition of 1914. The editors corrected those errors in this edition.
At many places in the 1914 edition, the editors found many paragraphs printed in italics for no obvious reason they could conceive. They were restored to normal font.
In fine, it is assured that the editors had put in their best efforts to make this edition of Gurajada's Dissent Note, flawless, plain and clearly understandable for the readers even while retaining the original letter and spirit of Gurajada.
The Publishers and the editors wish to express in this connection, their sincere gratitude to Prof. B. Kesavanarayana, Visakhapatnam who had provided them with a copy of 1914 edition of Gurazada's Dissent Note and helped in completing this stupendous work.
- K. Purushotham
యవనిక వెనుక
మహాకవి, యుగకర్త గురజాడ వెంకట అప్పారావుగారి 150వ జయంతిని పురస్కరించుకొని ఆయన రచనల సర్వస్వం 'గురుజాడలు' తెలుగుజాతికి అంకితం చేస్తున్న సందర్భం ఇది. చిరకాలం ఆనందంగా స్మరించుకోదగిన రోజిది.
2010లో శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ గురజాడ ఉత్తర ప్రత్యుత్తరాల రాతప్రతులను పరిశీలించి, ఇంగ్లీషులో ఉన్న ఆ లేఖలను ఇంగ్లీషులోనే ప్రచురించాలనే ఆలోచనతో కృషి మొదలుపెట్టారు. ఈ సందర్భంలోనే గురజాడ లేఖలను ప్రచురించే అవకాశం ఉంటుందా? అని మనసు ట్రస్టు అధిపతి శ్రీ ఎం.వి.రాయుడు గారిని సంప్రదించారు. ఒక రచయిత సమస్త సాహిత్యాన్ని కలిపి ప్రచురించే సంప్రదాయాన్ని మనసు ట్రస్టు నెలకొల్పిందని, గురజాడ సాహిత్యాన్నంతా సేకరించి ఒక సంపుటంగా ప్రచురించే ఆలోచనలో తాము ఉన్నామని ఆ సంపుటానికి సంపాదకులుగా ఉండమని రాయుడుగారు గోపాలకృష్ణను కోరారు.
గురజాడ రచనలన్నింటిని ఏకఖండంగా భావించి, దాని అన్ని పార్శ్వాలనూ లోతుగా, క్షుణ్ణంగా బేరీజు వేసుకోవలసిన అక్కర ఇంకా తీరలేదని భావించిన గోపాలకృష్ణ మనసు ట్రస్టువారి ప్రతిపాదనను అంగీకరించారు. గురజాడ తెలుగుజాతికి అందించిపోయిన అక్షరసంపదను ఒక కుదురుకు తెచ్చుకొని, మొత్తంగా మరొకసారి మదింపు వేసుకోవలసిన చారిత్రక సందర్భం ఇది అనీ, "ట్రంకుపెట్టె"ల్లో, చీకటిగదుల్లో అజ్ఞాతంగా ఉండి, చెల్లాచెదరై పోయినవి పోగా గురజాడ స్వహస్తాలతో రాసిపెట్టిపోయిన ఈ రచనాశకలాలను ఒకచోట చేర్చి, సమగ్రంగా కాకపోయినా, ప్రయత్నలోపంలేని కృషితో, ఈ సాహిత్య సంపదను భావితరాల వారికి అందజేయాలన్న సదాశయంతో గోపాలకృష్ణ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
మా ఇద్దరి అభిరుచుల్లో సారూప్యత ఉండడంచేత, నెలకొని ఉన్న గాఢమైత్రిచేత, గోపాలకృష్ణ కోరిన వెంటనే నేను ఆయనతో కలిసి పని చెయ్యడానికి అంగీకరించాను. ఒక సుడిగాలిలా రాష్ట్రమంతా తిరిగి ముఖ్యమైన గ్రంథాలయాలలో గురజాడ రచనలకోసం శోధించాము. కన్యాశుల్కం 1897 ప్రతి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్‌లోను, చెన్నైలోని జి.ఓ.ఎం.ఎల్.లోనూ కూడా ఉంది. ఆంధ్రభారతిలో అచ్చయిన కథలు సేకరించాము. గురజాడ డిసెంట్ నోట్ కోసం విశ్వప్రయత్నం చెయ్యవలసి వచ్చింది. చివరకు ప్రొఫెసర్ బి.కేశవనారాయణగారు (ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు) ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌కు తెచ్చి ఇచ్చారు. జి.సి.వి. శ్రీనివాసాచార్యుల హరిశ్చంద్ర నాటకానికి గురజాడ ఇంగ్లీషులో రాసిన 'ప్రిఫేస్'ను విజయనగరం నుంచి మిత్రులు డాక్టర్ ఉపాధ్యాయుల నరసింహమూర్తిగారు పంపించారు. భాగవతుల లక్ష్మీనారాయణశాస్త్రి శ్రీరామ విజయవ్యాయోగానికి గురజాడ రాసిన పరిచయాన్ని అమెరికానుంచి ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావుగారు పంపించారు. జార్జిదేవచరితకు గురజాడ సమకూర్చిన ఉపోద్ఘాతం లేకుండానే 'గురుజాడలు' వెలువరించవలసి వచ్చిందనే అసంతృప్తి మాత్రం నాకు మిగిలిపోయింది.
గోపాలకృష్ణ గురజాడ లేఖలకు ఒక కాపీ తయారుచేశారు.
ఒక గురజాడ చేతిరాతను మాత్రమే కాదు, గురజాడకు జాబులు రాసిన వారందరి రాతపద్ధతులను అవగాహన చేసుకొని, ఆ లేఖలన్నీ ఆయన చదవగలిగాడు. ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు. నెలల తరబడి శ్రమించి, ఆ కార్యాన్ని సాధించగలిగారు. ఉత్తరాలను అచ్చుకు సిద్ధం చేస్తున్న సమయంలోనే ఆయన తీవ్రంగా అస్వస్థులయ్యారు. రెండు మూడు పర్యాయాలు నన్ను హైదరాబాదుకు పిలిపించుకొని, కంప్యూటర్ ఆపరేటరును పక్కన కూర్చో బెట్టి నాచేత ఉత్తరాలను డిక్టేట్ చేయించారు; ప్రూఫులు దిద్దించారు. 2011 ఏప్రిల్ మాసాంతానికి లేఖలకు ఒక రూపం ఏర్పడింది.
చివరిసారి నేను, నా శ్రీమతి గోపాలకృష్ణగారిని చూడడానికి 2011 మే 18న హైదరాబాదు వెళ్ళాము. ఇంటినిండా బంధువులు, పరిచయస్తులు. ఆయన నన్ను గదిలోకి పిలిపించుకొని, ఆక్సిజన్ మాస్కు తీసివేసి, గంటసేపు మాట్లాడారు - ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూనే. గురజాడ లేఖలు, ఇతర రచనలు సమగ్రంగా పూర్తి చెయ్యడానికి అవసరమైన సూచనలిచ్చి, నన్ను మిగిలినపని పూర్తి చెయ్యమన్నారు. ఆయనకు పూర్తిగా నమ్మకం కుదిరింది, నేను ఈ బాధ్యతను నిర్వహించగలనని.
కన్నీళ్ళు బలవంతాన ఆపుకొని వీడ్కోలు తీసుకొని గదిలోంచి వచ్చేశాను.
గోపాలకృష్ణగారు 2011 మే 27వ తేదీన తుదిశ్వాస విడిచారు.
***
శ్రీ ఎం.వి. రాయుడుగారు నన్ను సంపాదక బాధ్యత తీసుకొని ప్రాజెక్టును పూర్తిచేయమని కోరారు. సహ సంపాదకులుగా ఉండి సహకరించమని వారిని నేను కోరాను. ఆయన అంగీకరించి, గురజాడ రచనలు మొట్టమొదటిసారి ప్రచురించబడిన పత్రికలను, పుస్తకాలను సాధించి తెచ్చారు. రీస్ అండ్ రయ్యత్‌లో అచ్చయిన గురజాడ సారంగధరను, గురజాడ తమ్ముడు శ్యామలరావు రచన "తాంతియా ది భిల్"ను తెప్పించారు. శ్రీ రాయుడుగారు ముందుగా గురజాడ తెలుగు రచనలు అచ్చుకు సిద్ధం చెయ్యడానికి పూనుకోవడం వల్ల నాపరిశ్రమకు చాలా సమయం లభించింది. మొదట 1914లో అచ్చయిన డిసెంట్ నోట్‌లో గురజాడ ఇచ్చిన బట్టర్‌వర్తు నెల్లూరుజిల్లా శాసనపాఠాలను మూలంతో సరిచూసి అచ్చుతప్పులు సవరించడం మాత్రమేగాక, పాఠకుల సౌలభ్యం కోసం ఆయా తాలూకాల పేర్లన్నీ అకారాది క్రమంలో ఏర్పాటు చేశాను. 1914 ప్రతిలో ఇంగ్లీషు పుస్తకాలు, రచయితల పేర్లలో వచ్చిన ముద్రారాక్షసాలను సవరించగలిగాను. ఈ ప్రతిలో వీరేశలింగం, జయంతి రామయ్య పంతులు మొదలైన వాళ్ళ పేర్లు రకరకాలుగా కన్పిస్తాయి. రాబోయే తరాల పాఠకులను దృష్టిలో ఉంచుకొని ఆయా వ్యక్తుల పూర్తిపేర్లను ఇచ్చాను. ఇటువంటివే, చిన్న చిన్న సవరణలు తప్ప పాఠాన్ని (text) ఎక్కడా మార్పు చెయ్యలేదు.
గురజాడ రాసిన జాబులు, ఆయనకు ఇతరులు రాసిన జాబులు, లభించినవన్నీ ఈ సంపుటంలో చేర్చాము. పుస్తకం అచ్చుకు వెళ్ళే వరకు అలా చేర్చుతూనే వచ్చాము. ఒకటో రెండో ఉత్తరాలు పూర్తిగా జిలుగు రాతలో ఉండి బోధపడకపోవడం చేత వాటిని విడిచిపెట్టవలసి వచ్చింది. మరికాస్త సమయం ఉండి ఉంటే అవి కూడా ఈ సంపుటంలో చేరి ఉండేవి. గురజాడ ఇంగ్లీషు లేఖలలో తెలుగు లేఖలు కూడా చేర్చాము - పాఠకులకు లేఖలన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయనే ఆలోచనతో. ఏట్సు, హంటర్, గిడుగు రామమూర్తి మొదలైన ఆత్మీయులు గురజాడ రామదాసుకు పంపిన సంతాపసందేశాలను కూడా గురజాడ లేఖల్లో చేర్చాము. 1929లో గిడుగు రామమూర్తి గురజాడ రామదాసుకు రాసిన రెండు ఉత్తరాలను కూడా ఇందులో చేర్చాము. గురజాడ వ్యక్తిత్వానికి, రచనలకు సంబంధించిన విషయాలు వీటిలో ఉన్నాయి.
ఎఫ్.హెచ్.స్క్రిని (F.H.Skrini, ICS) రీస్ అండ్ రయ్యత్ సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ జీవిత చరిత్రను, ఉత్తరాలను ఒక పుస్తకంగా అచ్చువేశాడు. ఏభై ఏళ్ళ క్రితమే ఇందులో ఒకటి రెండు ఉత్తరాలు తెలుగులోకి అనువదించబడ్డాయి కూడా. ఇందులోని గురజాడకు సంబంధించిన ఉత్తరాలన్నింటినీ పాఠకుల సౌలభ్యం కోసం 'గురుజాడలు'లో యథామాతృకంగా చేర్చాము.
జూనియర్ వేదం వెంకటరాయశాస్త్రి తమ తాతగారు వేదం వేంకటరాయశాస్త్రి జీవితచరిత్రను తెలుగులోను, ఇంగ్లీషులోను రచించారు. ఆ రచనల్లో గురజాడ వేదం వేంకటరాయశాస్త్రికి రాసిన లేఖలను ఆయన ఉదహరించారు. ఆ లేఖలు ఊడా ఈ సంపుటంలో చేర్చబడ్డాయి. 1969-70 ప్రాంతంలో ఆర్నెల్లపాటు నార్ల వెంకటేశ్వరరావుగారి పర్యవేక్షణలో పాటిబండ్ల సుందరరావుగారు, గొల్లపూడి మారుతీరావుగారు, కె.వి.రమణారెడ్డిగారు, తుమ్మల వెంకట్రామయ్యగారు పనిచేసి గురజాడ డైరీలను చదివి "మళ్ళీ రాయించటం, టైపు చేయించడం", "క్షాళన కార్యక్రమం" నిర్వహించారు. (పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మధురవాణి ఇంటర్వ్యూలు, పుటలు 10, 129). ఈ విషయాన్ని కే.వి.ఆర్. కూడా ప్రస్తావించారు. (మహోదయం, పుట. 435, 2012 ప్రతి).
ఇటీవల శ్రీ గొల్లపూడి మారుతీరావుగారిని కలిసినప్పుడు, వారు తాము గురజాడ రాతప్రతులను చదివి శుద్ధప్రతులను తయారు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నట్లు ధ్రువీకరించారు. ఆ మాటే కే.వి.ఆర్. నాతో (1976లో) అన్నారు. ఈ విధంగా చదివి, టైపు చేయించిన దినచర్య, ఇతర నోట్సు వగైరాల కాపీ, భమిడిపాటి రాధాకృష్ణ తనకు ఇచ్చిన, గురజాడ స్వహస్తాలతో రాసుకొన్న కొండుభట్టీయం ప్రతి - అన్నీ కే.వి.ఆర్. గారివి శ్రీ చలసాని ప్రసాద్ గారికి అందాయి. చలసాని ప్రసాద్‌గారికి అందాయి. చలసాని ప్రసాద్‌గారు ఆ పత్రాలన్నీ 2006లో పెన్నేపల్లి గోపాలకృష్ణకు పంపించారు.
గురజాడ దినచర్య, ఇతర నోట్సు ఇంగ్లీషులో టైపు చేయించిన వాళ్ళు ఆ ప్రతిలో తమకు బోధపడనిచోట, తెలుగు, సంస్కృత పదాలు వచ్చినచోట తరచుగా (...) గుర్తు పెట్టారు.
1895 సంవత్సరానికి గురజాడ రెండు డైరీలను వాడారు. ఒకటి Hoe and Co. వారి డైరీ. రెండోది ఒక మామూలు రూళ్ళ నోట్‌బుక్. ఆ ఏడాది గురజాడ ఈ రెండు పుస్తకాల్లో దినచర్య రాసుకొన్నారు. రూళ్ళ నోట్‌బుక్‌లో మద్రాసులో నాటక ప్రదర్శనలు, బెంగుళూరు సందర్శన వగైరా విషయాలు రాశారు. ఈ నోట్‌బుక్ పేజీలు విడిపోయి, గజిబిజిగా కలగలసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నాయి. మొత్తం గురజాడ దినచర్యలో ఒక్క 1895 దినచర్యే సగభాగంపైగా ఆక్రమించింది.
గోపాలకృష్ణ గురజాడ దినచర్య రాతప్రతులన్నీ మళ్ళీ మళ్ళీ చదివి, తన సంపాదకత్వంలో అచ్చయిన 2009 ప్రతికి ఎన్నో సవరణలు, మార్పులు చేశారు. ఈ దినచర్యకు, గురజాడ లేఖలకు ఆయనే ఒంటిచేతిమీదుగా నోట్సు సమకూర్చారు.
గోపాలకృష్ణ సిద్ధం చేసిన దినచర్య దగ్గర ఉంచుకొని రాతప్రతులతో మరొకమారు నిమ్మళంగా సరిపోల్చి చూశాము. ఈ కృషిలో నాతోపాటు శ్రీ సర్వోదయ కళాశాలలో పనిచేసిన డాక్టర్. ఎం.శివరామప్రసాదు సహకరించారు. గురజాడ జిలుగు రాతను బోధపరుచుకొని మళ్ళీ దినచర్య రాతప్రతులను (Digital Copies) చదివాము. పూర్వం బోధపడక విడిచిపెట్టబడిన కొన్ని పుటలను, వాక్యాలను, పదాలను చదివి, గుర్తించి ఆ విషయాలన్నీ చేర్చాము. వ్యక్తుల పేర్లు, పుస్తకాల పేర్లు, అనేక విషయాలను శోధించి గురజాడ దినచర్య గ్రంథానికి మరింత నిండుతనాన్ని తెచ్చామని భావిస్తున్నాము. మాకు ఒక పదమైనా, వాక్యమైనా, ఒక పేజీ మొత్తమైనా బోధపడకపోతే (...) గుర్తుతో సూచించాము లేదా not legible అని పేర్కొన్నాము. దినచర్యలో ఒకటి రెండు చోట్ల రైళ్ళ రాకపోకల వివరాలో, రూపాయనోట్ల నంబర్లో, షేర్ మార్కెట్లకు సంబంధించిన సంఖ్యలో అచ్చువెయ్యకుండా విడిచిపెట్టాము.
My Own Reflections, Observations, Remarks etc.కు సంబంధించి ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గురజాడ తన అనుభవాలను, అనుభూతులను, పరిశీలనలను నోట్సుగా రాసుకున్నారు. వీటన్నిటికీ ఇప్పుడు లభిస్తున్న టైపు ప్రతి తప్ప రాత ప్రతి లేదు. అట్లాగే గురజాడ ఆనందగజపతి మహారాజుతో తన అనుభవాలను కూడా నోట్సుగా రాసుకున్నారు. టైపు ప్రతిలో M.0. అని, H.H. అని వీటికి శీర్షికలు పెట్టారు. టైపు ప్రతుల్లో (కే.వి.ఆర్.వి) ఆయా శీర్షికలతోపాటు కాగితం పైన ఒక కొనలో M.O. అని, H.H. అనీ ఉంది. ఒక కాగితం మధ్య భాగంలో M.O. = My Own Reflections, Observations, Remarks etc. అని మాత్రమే టైపు చేసి ఉంది. బాలికా పాఠశాల, భట్రాజుగారబ్బాయి, వెలగాడ కొండమీది నుంచి దృశ్యం వగైరా శీర్షికలన్నీ M.O. కు సంబంధించినవే.
M.O. కు సంబంధించిన కొన్ని రాతప్రతుల పుటలు మాత్రం ఇప్పుడు A.P. State Archives, Hyderabad లో భద్రపరచబడి ఉన్నాయి. బాలికా పాఠశాల, భట్రాజుగారబ్బాయి, వెలగాడ కొండమీది నుంచి దృశ్యం వగైరాల రాతప్రతులు ఇప్పుడు లభిస్తున్నాయి. కనుక దీన్ని బట్టి మిగతా శీర్షికలకు సంబంధించిన మాతృకలు కూడా ఉండేవని, ఆ రాత ప్రతుల ప్రాముఖ్యాన్ని ఎరగకపోవడంవల్ల, వాటిని handle చేసిన వ్యక్తుల అజాగ్రత్తవల్ల ఆ పుటలన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని మనం భావించవచ్చు.
గోపాలకృష్ణ వీటన్నింటిని, ముట్టుకుంటే పొడిపొడి అవుతున్న టైపుకాగితాలను శ్రద్ధగా కాపీ చేసి, అచ్చుకు ఒక ప్రతిని తయారు చేసి ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత, వాళ్ళ అబ్బాయిలు ఇంట్లో దొరికిన కాగితాలన్నీ సేకరించి నాకు చేర్పించారు. ఆ టైపు కాగితాల మీద ఆయా శీర్షికలకు సంబంధించినంతవరకు పుటల సంఖ్య ఉందిగాని, మొత్తం M.O, H.H. శీర్షికలను గురజాడ ఏ క్రమంలో రాసి పెట్టారో తెలుసుకునే అవకాశం లేక పోయింది. శీర్షికల సారూప్యతనుబట్టి నాకు స్ఫురించిన వరుసలో అమర్చడమే చేయగలిగినది. మరికొన్ని M.O., H.H. కు సంబంధించిన టైపు పుటలు జారిపోయి లేదా misplace అయి నా దృష్టిలోకి వచ్చిఉండకపోవచ్చు కూడా. గోపాలకృష్ణ దృష్టి నుంచి తప్పించుకొన్న కొన్ని శీర్షికలు ఇందులో చేర్చడం జరిగింది. గురజాడ అసంపూర్ణ రచనలు (1) Rev and the Hero, (2) A Novel - few scenes (3) రక్షస తంగడి యుద్ధం నేపథ్యంలో గురజాడ రాయతల పెట్టిన నవల / నాటకం తాలూకు నోట్సు (4) చిత్రాంగి పేరుతో గురజాడ రాసిన ఇంగ్లీషు నాటకంలో ఇప్పుడు మిగిలిన కొన్ని పుటలు (5) మరికొన్ని అసంపూర్ణ వ్యాసాల టైపు పుటలు కూడా ఉన్నాయి. వీటిలో 3, 4 అంశాలకు సంబంధించి గురజాడ స్వహస్తాలతో రాసి పెట్టుకున్న కాగితాలు A.P. State Archives, Hyderabadలో గురజాడ ‘సంచయం'లో ఉన్నాయి. సౌకర్యం కోసం వీటన్నిటినీ M.O. లో చేర్చి 1. M.O., 2. H.H. 3. Creative Writings 4. Miscellaneous Works అని నాలుగు శీర్షికలుగా విభజించాము. గురజాడ దినచర్యల్లో ఖాళీపుటల్లో రాసుకొన్న నోట్సు కూడా M.O.లో చేర్చాము. Unilit (1963) గురజాడ విశేషసంచికలో ప్రచురించిన వ్యాసాలను కూడా M.O. లోనే చేర్చాము.
సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన “గురజాడ రచనలు - కవితల సంకలనం”లో “ఎమరాల్డ్సు' పేరుతో రెండు ఇంగ్లీషు పొయెము ఉన్నాయి. ఇందులో ఒకటి ఒక పార్సీ గీతానికి అనువాదంలాగుంది. కే.వి.ఆర్. సంపాదించిన టైపు ప్రతిలో ఈ గీతం ప్రతిపైన ఒక మూల H.H. అని గుర్తుగా టైపు చేసి ఉంది. అందువల్ల ఈ కవితను H.H. శీర్షికలో చేర్చాము. ఈ 'ఎమరాల్డ్సు' పోయమ్స్ తర్వాత అదే పుటలో 'How he did it' అనే కవిత ఉంది. ఇందులో కొన్ని పాదాలు జారిపోయినట్లనిపించింది. దీన్ని ఎటువంటి మార్పులు చెయ్యకుండా అనుబంధంలో చేర్చాము.
1912లో గురజాడ హిందూపత్రికకు రాసిన రెండు సంపాదకీయ లేఖల్లోంచి కొన్ని భాగాలు మాత్రం ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఆ భాగాలను కూడా M.O. లో చేర్చాము.
1908 డిసెంబరు 27, 28, 29 తారీకుల్లో మద్రాసులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు గురజాడ హాజరయ్యారు. ఆ సభల నిర్వహణమీద, ఉపన్యాసాల మీద ఆయన హిందూపత్రికలో హాస్యం, వ్యంగ్యం కలగలిపి ఒక వ్యాసం రాశారు. అవసరాల సూర్యారావు, సెట్టి ఈశ్వరరావు ఇద్దరూ ఈ వ్యాసాన్ని తెలిగించారు. ఈ వ్యాసం మధ్యలో గురజాడ ఒక పేరడీ కవితను చేర్చారు. అవసరాల ఈ కవితను తన అనువాదంలో యథాతథంగా ఇవ్వబట్టి ఈ కవితైనా మనకు దక్కింది, మిగతా వ్యాసం మటుకు గురజాడ అలబ్ధ రచనల జాబితాలో చేరిపోయింది - ప్రస్తుతానికి.
ఆంధ్రభారతిలో అచ్చయిన కథలు మినహాయిస్తే, గురజాడ మిగతా కథలు ఏ పత్రికల్లో అచ్చయ్యాయో తెలీదు. "Stooping to raise" కథ ఆనాటి ఇంగ్లీషు కథల పత్రికల్లో ప్రచురించబడి ఉండవచ్చనే ఆశతో గోపాలకృష్ణ లండన్‌లో మిత్రుల ద్వారా ప్రయత్నం చేశారు. కాని, ఫలితం లేకపోయింది. ప్రసిద్ద చిత్రకారులు, రచయిత శ్రీ అబ్బూరి గోపాలకృష్ణ గారు ఈ కథకు సంబంధించి ఒక ముచ్చట చెప్పారు. శ్రీ పోతుకూచి సాంబశివరావుగారు గురజాడ శతజయంతి సందర్భంగా Unilit విశేష సంచిక (1963)ను వెలువరిస్తున్న సందర్భంలో విజయవాడలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగి ఒకరు Stooping to raise కథను ఎనిమిది వందల రూపాయలకు అమ్మజూపాడట. అంత పెద్దమొత్తం సమకూడక ఆ అవకాశాన్ని సాంబశివరావుగారు వదులుకోవలసి వచ్చిందట! వేపా రామేశం చేత తన కథకు పరిచయ వాక్యాలు రాయించుకొన్నట్లు గురజాడ దినచర్యలో రాసుకొన్నారు. ఆ కథ ఏమయిందో తెలీదు.
అవసరాల సూర్యారావు సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన గురజాడ కథా సంపుటంలో పెద్దమసీదు, మెటిల్డా రెండు కథలున్నాయి. ఈ రెండు కథలు అంతకుముందే, అంటే 1950లో వావిళ్ళ ప్రచురణ సంస్థ అచ్చువేసిన “మహాకవి అప్పారావు గారి చిన్న కథలు” సంపుటంలో కన్పిస్తాయి. వావిళ్ళవారి పుస్తకంలో “మతము-విమతము” పేరుతో ఉన్న కథ విశాలాంధ్ర ప్రచురించిన పుస్తకంలో “పెద్దమసీదు” పేరుతో ఉంది. ఈ మార్పు కే.వి.ఆర్.కు తెలియకపోలేదు. ఆయన కూడా మహోదయంలో “పెద్దమసీదు” పేరుతోనే ఈ కథను పేర్కొన్నారు. గురజాడ ఇంగ్లీషులో M.O. నోట్సులో స్పష్టంగా ‘భట్రాజుగారబ్బాయి' అని పేర్కొంటే అవసరాల 'భ' గారబ్బాయిగా మార్చారు. హిందూ మహమ్మదీయ సంస్కృతుల మధ్య వైరుధ్యాల నేపథ్యంలో కథ రాయాలని గురజాడ M.O. లో రాసుకున్నారు. మతము-విమతము కథా వస్తువు అదే. ఈ కథలో భాషను గమనిస్తే గ్రాంథికభాషాస్పర్శ అధికంగా ఉన్నట్లు తోస్తుంది. ఇదే గురజాడ తొలికథేమో?
మద్రాసులో వంటమనిషి చెప్పిన కథ గురజాడ వివరంగా దినచర్యలో రాసుకున్నారు. ఈ సంఘటనే మెటిల్డా కథకు ప్రేరణ అయి ఉండవచ్చని కే.వి.ఆర్. భావించారు.
ఈ సంపుటం తయారుచెయ్యడంలో ఎందరో సహాయ సహకారాలు అందించారు. డిసెంట్ నోట్లో, శ్రీరామ విజయ వ్యాయోగం పీఠికలో గురజాడ ఉదాహరించిన శ్లోకాలపాఠాన్ని నిర్ణయించి సహకరించిన వారు ప్రొఫెసర్ రామకృష్ణమాచార్యులవారు (కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి). మనుస్మృతి శ్లోకాన్ని సరిచూసి పంపిన మిత్రులు డాక్టర్ శ్రీరంగాచార్య (హైదరాబాద్), సారంగధర, ఇతర ఇంగ్లీషు కవితలు చదివి కొన్ని సూచనలు చేసినవారు శ్రీ వేదం వెంకటరామన్ (నెల్లూరు వి.ఆర్. కళాశాల విశ్రాంత ఆంగ్ల అధ్యాపకులు), శ్రీ మైదవోలు సత్యనారాయణ (నెల్లూరు). గురజాడ దినచర్యలు చదివి గోపాలకృష్ణ మిత్రులు వి.ఏ.కె. రంగారావు గారు కొన్ని సవరణలు సూచించారు. ఏ పుస్తకం కావాలన్నా కాకితో కబురుచేస్తే క్షణాల్లో పంపించారు శ్రీ లంకా సూర్యనారాయణ గారు (గుంటూరు). ఆచార్య మొదలి నాగభూషణశర్మ గారు, డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ గారు, డాక్టర్ కడియాల రామమోహనరాయ్‌గారు అవసరమైన సమాచారం, సూచనలు అందించారు. నాపోరు తట్టుకోలేక శ్రీ చలసాని ప్రసాద్ గారు తన వద్ద ఉన్న గురజాడ పత్రాల సూట్ కేస్‌లు పెన్నేపల్లి గోపాలకృష్ణకు పంపించారు, “మహాకవి గురజాడ అప్పారావుగారి గేయములు” (వావిళ్ళ వారి ప్రచురణ, 1950) జెరాక్సు చేసుకోడానికి అంగీకరించారు. శ్రీశాసపు రామినాయుడుగారు (వెలుగు, రాజాం) నీలగిరి పాటలు కాపీ పంపించారు. డాక్టర్ పోరంకి దక్షిణామూర్తిగారు, డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుగారు, ఇతర మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. బాపు ఈ సంపుటాన్ని ముఖచిత్రంతో అలంకరించారు.
కన్యాశుల్కం 1909 ప్రతి మనదేశంలో ఎక్కడా లభించలేదు. శ్రీ ఎం.వి. రాయుడుగారి కుమారులు చిరంజీవి ‘జెన్' ఇంగ్లాండు నుంచి ఈ పుస్తకం డిజిటల్ కాపీ పంపి సహకరించారు. శ్రీ ఎం.వి. రాయుడుగారు మనసు ట్రస్టు అధిపతులుగా, ఈ సంపుటం సహ సంపాదకులుగా మాకు సంపూర్ణ సహకారం అందించారు. ఎప్పుడు, ఏ సమాచారం అవసరమైనా క్షణాల్లో పంపించారు.
ఈ 'గురుజాడలు' సమగ్ర రచనల సంపుటాన్ని తయారు చెయ్యడానికి రెండు సంవత్సరాల పైనే పట్టింది. అన్ని అడ్డంకులు అధిగమించి, మనసు ట్రస్టువారు గురజాడ 150వ జయంతి రోజు ఈ సంపుటాన్ని విడుదల చెయ్యడం ఆనందించదగిన సంగతి. మా కృషిలో లోపాలు లేవని అనుకోడం లేదు. అయితే గురజాడ రచనలన్నీ ఒకేచోట, ఒక సంపుటంగా తీసుకొని రావడంలో ఒక అడుగు ముందుకు వేశామని మాత్రమే వినయంగా విన్నవించుకొంటూ సెలవు తీసుకొంటున్నాము.
- డాక్టర్ కాళిదాసు పురుషోత్తం
(సంపాదకవర్గం పక్షాన)
గురజాడ నేటి అవసరం
మహాకవి గురజాడ అప్పారావు జన్మించి 150 ఏళ్ళు. మరణించి ఇంచుమించు వంద ఏళ్లు. ఆయన మిగిల్చినవి దాదాపు పాతిక కవితలు, మూడు నాటకాలు, నాలుగున్నర కథలు, కొన్ని వ్యాసాలు, కొన్ని ఉత్తరాలు, కొన్ని ఏళ్ల దినచర్యలు వగైరా. తెలుగుజాతి వందేళ్లుగా వీటిని చదువుకుంటూనే ఉంది. వారి ఆలోచనా జీవితాన్ని గురజాడ సృజన ప్రభావితం చేస్తూనే ఉంది. ఇకపై కూడా ప్రభావితం చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఆయన రాసినదానికన్న ఆయన మీద తెలుగుజాతి రాసుకున్నది చాలా ఎక్కువ. ఆ రాతలో గురజాడ రచనలలోని సూక్ష్మాంశాల వివరణ ఉంది. లోతయిన విశ్లేషణ ఉంది. పరిశోధన ఉంది. పరవశంతో కీర్తించడం ఉంది. వీటితోబాటు అభిశంసన కూడా హెచ్చుగానే ఉంది.
ఆ కీర్తనకైనా, అభిశంసనకైనా ప్రేరణ ఏమిటి? అది వ్యక్తమైన రూపాలు ఏమిటి?
మనం వాటినన్నింటినీ గుర్తించి ఒక పట్టీ వేయవచ్చు. అనేక విధాల విశ్లేషించ వచ్చు. అందులో తెలుగుజాతి ఉద్వేగాలను, ఆవేశకావేశాలనూ పోల్చుకోవచ్చు. వాటి నన్నింటినీ క్రోడీకరించి, ఒకే ఒక అంశాన్ని గుర్తించడానికి ప్రయత్నించితే నాకు కనిపించిందొక్కటే.
అది గురజాడ వారి నిలువు (stand). ఆ నిలువు ఏమిటి?
2
మహాకవులెవ్వరికైనా వారు జీవించిన కాలంలో, సమాజంతో అనివార్యమైన అసంతృప్తి ఉంటుంది. అసమ్మతి ఉంటుంది. దానిని వారు తమ రాతలతో పట్టుకోజూస్తారు. రూపం కట్టజూస్తారు. దానిని జనానికి చూపెట్టజూస్తారు. జనం మనసును ఆకట్టుకోజూస్తారు. వారి మస్తిష్కాలను పట్టజూస్తారు. ఆ అసంతృప్తి, సాహిత్యరూపంలో దాని ఆవిష్కరణ విశ్వమానవుడిని చూపించే క్రమానికి ఒక వెలుతురు ఇస్తుంది. స్థూల దృష్టితో చూస్తే మహాకవుల నిలువు ఒక్కటే అవుతుంది. అయితే -
వారు జీవించిన కాలం ప్రత్యేకమైనది. సమాజం ప్రత్యేకమైనది. వ్యక్తిగత జీవితం ప్రత్యేకమైనది. వారి అనుభవాలు ప్రత్యేకమైనవి. వారి మెదడునూ, హృదయాన్ని రూపొందించిన పుట్టుక, పెంపకం, ఎదుర్కొన్న సమస్యలూ, వాటి పై చేసిన ఆలోచనలూ, కలిగిన ఉద్వేగాలూ, తేల్చుకున్న అంశాలూ, తీసుకున్న నిర్ణయాలూ వేటికవే ప్రత్యేకమైనవి.
ఈ సూక్ష్మాంశాలు పట్టుకుని పరిశీలించితే -
వారి నిలువులోని ప్రత్యేకత అర్థమవుతుంది. ఆ నిలువుకిగల సానుకూల, ప్రతికూలాలు గ్రహించగలుగుతాం. ఆ సానుకూలతను ఆకట్టుకోటానికి ప్రతికూలతలను తట్టుకోడానికి వారు నిర్మించుకున్న సాహిత్య పరికరాలు స్పష్టమవుతాయి. అవి మొత్తం సాహిత్యానికి సమకూర్చిన కొత్తదనాలు కంటబడతాయి. నేర్పరితనం ఎలా సానబట్టుకున్నదీ చూడగలుగుతాం.
ఈ దృష్ట్యా చూస్తే -
గురజాడ నాటి పరిస్థితులేంటి? వాటి నుంచి రూపొందిన వారి నిలువు ఏంటి?
వారి కాలానికి ప్రపంచంలో భావ విస్తరణకి దారులు విస్తరించాయి. భావ విస్తరణకి పట్టేకాలం తగ్గించి. శతాబ్దాలుగా రాజకీయంగా ఒక్కటిగా లేని భారతదేశం భావాలలో, నమ్మకాలలో ఒక్కటిగా ఉంది. ఆచారాలలో, సాంప్రదాయాలలో, ఆలోచనలలో ఒక సారూప్యత కలిగి ఉంది. ఈ దేశానికి దూరం నుంచి వచ్చిన ఆంగ్లేయుల పాలన రాజకీయంగా ఒక్కటి చేస్తోంది. అంతకుముందు ఈ దేశానికి వచ్చిన వారు దాదాపు ఇక్కడే స్థిరపడి, ఇక్కడి సంస్కృతితో ప్రభావితమైన ఈ సంస్కృతిని ప్రభావితం చేసి దానిలో భాగమైపోయినవారు.
అయితే;
పడమటి ప్రపంచం కేవలం లాభార్జన కోసం ప్రపంచమంతా విస్తరించే కార్యక్రమంలో భాగంగానే భారతదేశానికి వచ్చింది. వారిలో వారికి కోట్లాటలలో ఈ దేశంలో ఆంగ్లేయులు విజయం సాధించి పాలన ఆరంభించారు. వారిపై స్థానికులు తిరగబడగా దానిని అణచి వేసి వ్యాపార కంపెనీ పాలన స్థానంలో రాజపాలన ఆరంభమయింది. పడమటి ప్రపంచం నమ్మకాలలో (faith) దాదాపు ఒక్కటే మతమూ, గ్రంథమూ, దేవుడూ కలిగి ఉన్నా, లాభార్జనలో, సంపద పెంపులో మాత్రం ఎవరి జాతి వారిదే అన్న దృష్టికి అలవాటు పడింది. క్రైస్తవంలోని 'పొరుగువాడు' అన్న భావన తమ జాతివారికి మాత్రమే పరిమితం చేసుకున్నారు. జాతి పేరుతో ఏకం అయినా, లాభాలు వ్యక్తులకే దక్కినా, సంపదను జాతి పేరుతో లెక్కగట్టటం (Nation's Wealth) పడమటి ప్రపంచం అలవరచుకొని, మిగిలిన ప్రపంచానికి కూడా అలవాటు చేస్తోంది. ఇలా జాతి సంపద పెరగటం అన్న భావనకు, దానికి అవసరమైన పద్ధతులను రూపొందించుకుంటున్న పడమటి ప్రపంచం లోనే, ఆ కాలంలోనే ఒక తాత్వికమైన ప్రశ్న ఉదయించింది.
జ్ఞానోదయమంటే ఏమిటి అన్నది ఆ ప్రశ్న.
దీనికి ఇమాన్యుల్ కాంట్ చేసిన నిర్వచనం చాలా ప్రధానమైనదిగా భావిస్తారు.
Enlightenment is man's emergence from his self-imposed nonage. Nonage is the inability to use one's own understanding without another's guidance. This nonage is self-imposed if its cause lies not in lack of understanding but in indecision and lack of courage to use one's own mind without another's guidance. Dare to know! (Sapere dude.) "Have the courage to use your own understanding", is therefore the motto of the enlightenment (తనకుతాను విధించుకున్న వయో అపరిపక్వత (సంరక్షకత్వం) నుంచి మనిషి బయటపడటమే జ్ఞానోదయం. ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన అవగాహనను ఉపయోగించుకోలేని అసమర్థతే వయో అపరిపక్వత. ఈ వయో అపరిపక్వత స్వయంగా విధించుకున్నదే. ఎందుకంటే దీనికి కారణం అవగాహనారాహిత్యంలో లేదు. ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన మస్తిష్కాన్ని ఉపయోగించుకోటానికి ధైర్యం లేక పోవటంలోనూ, నిర్ణయాలు తీసుకోకపోవటంలోనూ ఉంది. తెలుసుకోటానికి ధైర్యం చెయ్! “నీ అవగాహనను ఉపయోగించుకునే ధైర్యం అలవర్చుకో”, అన్నది జ్ఞానోదయానికి నినాదం)
ఈ ప్రశ్న వెలువడటమూ, వ్యక్తులు సంపద పోగుచేసుకునే కార్యక్రమం ముమ్మరం కావటమూ, దానికి రక్షణ కోసం జాతి సంపద అన్న భావం పెంపొందించటమూ ఇంచు మించు ఒకే కాలంలో, ఒకే సమాజంలో జరగటం యాదృచ్ఛికం కాదు. అలాగని మానవజాతి అభివృద్ధిలో వీటి పాత్ర తక్కువది కాదు. వ్యక్తులు స్వతంత్రంగా ఆలోచించటం వల్ల ప్రభుత్వ పునాదులు ప్రభావితమవుతాయని, అది అంతిమంగా రాజ్యానికే ప్రయోజన కారి అవుతుందని వివరిస్తాడు కాంట్. ఈ వివరణలో తాత్వికత, రాజకీయం రెండూ కలసి ఉండటంతో - అంటే వ్యక్తి ఏం చెయ్యాలీ, ప్రభుత్వం దానితో ఎలా వ్యవహరించాలన్నది-ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బహిరంగంగా పౌరుల స్వేచ్ఛా వాదనా, ఆంతరంగికంగా వారి రాజ్య విధేయతా ప్రతిపాదిస్తాడు కాంట్. ఈ అవగాహన పై పడమటి ప్రపంచం రెండు శతాబ్దాలుగా తర్జనభర్జనలు పడుతూనే ఉంది. జర్మన్ ఆదర్శవాదం కాంట్ అవగాహన పరిమితులు చర్చించి దానిని దాటి గురజాడ కాలానికే చాలా ముందుకు వెళ్లింది. వ్యక్తి వివేచన యొక్క ఆవశ్యకత అందరూ అంగీకరించినా దానికి బౌద్ధిక సంకల్పం ఎంత అవసరమో అంతకన్న భౌతిక అవసరాలు తీరటం అవసరమన్న అవగాహన ఆ చర్చల సారాంశం. అయితే ఆ వాద ప్రతివాదాలు పడమటి ప్రపంచం దానిలో భాగమైన ఆంగ్లేయుల పాలననూ, పౌరులతో వ్యవహరించవలసిన తీరునీ ప్రభావితం చేస్తాయి. వారితో బాటు భారతదేశానికి చేరిన ఈ భావన వ్యక్తి వివేచనకి పురికొల్పింది. రాజ్యం కన్న ఎక్కువగా సమీప స్వసమూహాల (కులం, వర్ణం) అదుపులో ఉన్న భారతీయ మేధావికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించటంలో ఇది తోడ్పడింది.
గురజాడ వారి నిలువు దాదాపు దీని నుంచే ప్రభావితమైనది.
కన్నుగానని వస్తుతత్వము
కాంచనేర్పరు లింగిరీజులు
కల్లనోల్లరు; వారి విద్యల
కరచి సత్యము నరసితిన్
అని తన హేతుబుద్ధి వికసనానికి మూలం చెప్పుకున్నా,
హేలీ తోకచుక్క అన్న ఆ కాలపు సంఘటన మీద అది నష్టం కలిగిస్తుందన్న మూఢ విశ్వాసానికి వ్యతిరేకంగా “తలతు నేనది సంఘసంస్కరణ పతాకగన్” అని ప్రకటించినా,
చూడు మునుమును మేటివారల
మాటలనియెడి మంత్రమహిమను
జాతి బంధములన్న గొలుసులు
జారి, సంపదలుబ్బెడున్.
యెల్లలోకము వొక్కయిల్లె,
వర్ణభేదములెల్ల కల్లె,
వేలనెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియు.
మతములన్నియు మాసిపోవును,
జ్ఞానమొక్కటి నిలచి వెలుగును;
అంత స్వర్గసుఖంబులన్నవి
యవని విలసిల్లున్.
అంటూ మానవజాతికి ఉండవలసిన ఆకాంక్షలకు ఉదాత్తరూపం దిద్దినా,
మధురవాణి, గిరీశం వంటి పాత్రలతో నాటకం నడిపించినా,
గురజాడను నడిపింది స్వంత వివేచనే.
అదే వారి నిలువు.
3
గురజాడ వారి నిలువుని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే అది రూపొందిన స్థల, కాలాలపై దృష్టి పెట్టాలి.
అప్పటికి
1) భారతదేశంలో ఒక ఆలోచనా వర్గం ఏర్పడింది. దానికి ఆరంభకునిగా చాలా మంది భావించే వ్యక్తి రాజారామమోహన్ రాయ్. ఆయన తన సమూహంలోని కొన్ని సంప్రదాయాల పట్ల, మతం పేరిట ఆచరించుతున్న దురాచారాల పట్ల తన స్వంత వివేచనతో, ధైర్యంతో ధ్వజం ఎత్తాడు. తన పోరాటానికి ఆంగ్లేయుల శాసనాధి కారాన్ని వినియోగించుకున్నాడు. తన సమాజంలోని ఒకనాటి తాత్వికతను పునరు జ్జీవింప చేసి, మధ్యలో వచ్చిన అవాంఛిత ఆచారాలను వదిలింపజేయటానికి బ్రహ్మ సమాజం నెలకొలిపాడు. ఆంగ్లవిద్య సంస్కరణలకి అవసరమని భావించాడు. ఈ ఆలోచనా వర్గం సంఖ్యాపరంగా చిన్నదైనా దాని శక్తి పెద్దది.
2) మారటానికి ఇష్టం లేని, ధైర్యంలేని అసంఖ్యాక సమూహం ఉంది. సహజంగానే ఈ మార్పుల ప్రయత్నానికి అది సమ్మతించదు. సంఖ్యాబలం ఉన్నా, దాని శక్తి ప్రదర్శనకి ప్రధాన అవరోధం భారతదేశపు ప్రత్యేక పరిస్థితి. ఈ పరిస్థితి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల ఫలితం. అచింత్యుడూ, నిర్గుణుడూ, నిరాకారుడూ అంటూ ఎంతో పైస్థాయికి చెందిన అమూర్త (నైరూప్య, అరూప) భావనలతో ఈశ్వరుడిని ఏకదైవం చేసే ఎన్నో తాత్విక భావాలు వచ్చినా, సామాజిక అసమానతలను ధార్మిక పరిధిలోనే తొలగించటానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా ఈ రెండు వ్వవస్థలూ సృష్టించిన సామాజిక అంతరాలను అవి గట్టిగా తాకలేక పోయాయి. భారతదేశపు సమూహాలకుగాని, వ్యక్తులకు గాని కష్టసుఖాలను ఒకే విధంగా అనుభవించే వీలు ఇవ్వలేక పోయాయి. ఒక సమూహంలోని దురాచారమనే దానితో తతిమ్మా సమూహాలకు వాస్తవిక సంబంధం లేకపోయింది. ఓ సమూహంలో రావలసిన మార్పులూ, దాని పట్ల వ్యతిరిక్తతా ఆ సమూహానికే సూక్ష్మస్థాయిలో పరిమితమై పోయాయి. స్థూలస్థాయిలో అది మొత్తం సమాజానికి చెందిన సంస్కరణగా చెప్ప బడినా, సూక్ష్మస్థాయిలో అది అనేకానేక సమూహాల దైనందిన కార్యకలాపాలకు సంబంధం లేనిదయింది. ఈ పరిస్థితి మార్పు వ్యతిరేకుల శక్తిని పెంచలేకపోయింది.
3) ఈ మార్పు వ్యతిరేకులు పొందిన విజయం ఏదైనా ఉందా అంటే వెలి వంటివి అమలు చేయటంతో పాటు, వారి స్మృతులు, శృతులు, వేదాలూ, ఉపనిషత్తులూ వంటి గ్రంథాల పరిధిలోనే మార్పు కోరేవారు వాదనలు చేయవలసి రావటం. ఆ భావనలూ, భాషా పరిధిలోనే రాజారామమోహన్ రాయ్ నుంచి, అంబేద్కర్ వరకూ తమ వాదనలు చేసారు. సమాజంలో అమలులో ఉన్న అనేక దురాచారాలు ఆ గ్రంథంలో లేవని చూపించటానికి తమ కాలమంతా వినియోగించవలసి వచ్చింది.
4) కందుకూరి వీరేశలింగం ఈ వాదనా విధానంలోనే పనిచేస్తూ, విధవా వివాహాలు జరిపించటానికి కొత్తగా పెరుగుతున్న ‘అక్షరాస్యుల'ను ప్రభావితం చేయటానికి సాహిత్య మార్గం చేపట్టాడు. కార్యకర్త అయిన ఈయనకు సాహిత్యం ఒక ప్రచార సాధనంగా కనిపించింది. ఈయన సాహిత్య సృజన హేళన ప్రధానంగా సాగింది. ఆనాటి చదువరి అయిన వెంటే సాగుతూ, దురాచారాలు లేదా మూఢవిశ్వాసాలతో బాటు అవి కలిగి ఉన్న వారిని హేళన చేయటం ద్వారా తాము ఇతరుల కన్న అంతో ఇంతో అధికులమన్న మానసిక ఆధిక్యతా భ్రమకు లోనవటానికి అవకాశం ఏర్పడింది. ఇది కందుకూరి వారి ఆచరణ రంగానికి అతికినట్లు సరిపోయింది.
5) గురజాడది విజయనగరం. ఈ నగరం ఒక సంస్థానం. దీని పాలకుడు ఆనంద గజపతి రాజు, పడమటి గ్రంథాలు, పత్రికలూ అప్పటిలో భారతదేశానికి చేరటానికి సంస్థానాలే ద్వారాలు. దానికి సంస్థానాధీశుల అభిరుచులూ కారణం కావచ్చును. ఆంగ్ల పాలకుల ప్రోత్సాహమూ కారణం కావచ్చును. 17, 18, 19 శతాబ్దాలు ప్రపంచ తాత్విక చరిత్రలో ప్రధానమైనవి. ఆ పుస్తకాల ద్వారా నూతన భావాలూ, భావనలూ భారతదేశానికి చేరటానికి పట్టే కాలం 20, 30 సంవత్సరాలకు గణనీయంగా తగ్గింది. రాజుచేత గుర్తింపబడిన అప్పారావు గారికి అవి వెంటనే అందే వీలుకలిగింది.
6) సంస్థానాలను ఆశ్రయించుకుని జీవించేవి కళావంతుల కుటుంబాలు. వారివల్ల నాశనమైపోతున్న సంసారాలు కందుకూరి వారి దృష్టికి వస్తే వారు ఆరంభించినది ఏంటీనాచ్ ఉద్యమం. ఆనాటి పత్రికలను పరిశీలిస్తే వేశ్యల వివాహ ప్రయత్నాలు, వారే తమ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల గురించి ప్రశ్నించడాలూ కనిపిస్తాయి. ఇలాంటి వాతావరణంలో వేశ్యల అసలు సమస్య గురించి ఆలోచించటానికి, పరిశీలించటానికి విజయనగర వాతావరణం, రాజప్రాపకం గురజాడకి ఉపకరించాయి.
ఈ పై చెప్పబడిన పరిస్థితులలో గురజాడ నిలువు రూపొందింది.
దానిని రెండింటిగా విభజించి అవగతం చేసుకోవచ్చు.
సమాజంలో మార్పులు అవసరం. దానికి సాహిత్యం వినియోగపడాలి - ఇది సమాజ సంబంధి.
సాహిత్యంలో కూడా మార్పులు అవసరం. అది వాస్తవికతను ప్రధానం చేసుకోవాలి. భాష కృతక స్థితి నుంచి వాస్తవికం కావాలి. అంటే వాడుకభాషలో రచన సాగాలి. వస్తువు, పాత్రలు వాస్తవ జీవితం నుంచి ఎంచుకోవాలి. అంటే అవి రచయిత భావాలు, నిలువు చెప్పే కీలుబొమ్మలు కారాదు. రచన మాత్రమే రచయిత హృదయం ఎటు మొగ్గి ఉన్నదీ చెప్పాలి. ఆ హృదయం ఎప్పుడూ మనిషిమీద కరుణ కలిగి ఉండాలి. - ఇది సాహిత్య సంబంధి.
ఇదీ గురజాడ నిలువు.
దీనివల్ల ఆయన సమాజంలోని మార్పులను సమర్ధించటంతో బాటు ఆ మార్పుల పేరిట పబ్బం గడుపుకునే స్వార్ధపరులనూ, కబుర్లరాయుళ్లనీ చూడగలిగాడు. తెలిసిన వాళ్లు ఎంత అవకాశవాదులుగా ఉండగలరో చూపగలిగాడు. తద్వారా ఆయన సాహిత్యానికి ఒక కొత్త సామాజిక బాధ్యత సూచించగలిగాడు. సమాజంలో వస్తున్న ధోరణులకు ఒక కాపలాకుక్కలా వ్యవహరించి, ఏ పెడధోరణి కనిపించినా, తన స్వంత వివేచనతో పసిగట్టి అరచి, గోలచేసి, తలపడి జనాన్ని జాగృతం చేయటం దాని బాధ్యత. - ఇది సమాజ సంబంధమైనదైతే -
సాహిత్యంలో ఆయన నిలువు - కొత్తపాతల మేలుకలయిక, క్రొమ్మెరుంగుల జిమ్మగా - అంటూ వ్యక్తం అయింది. కొత్తపాతల మేలు ఎవరు నిర్ణయిస్తారు? కొత్తలోని మేలునీ, పాతలోని మేలునీ తూచేది ఎవరు? ఎలా? స్వంత వివేచన.
ఈ స్వంత వివేచన అన్నది వ్యక్తి ఇచ్ఛమేరకు ప్రవర్తించే లక్షణంగా పొరబడరాదు. సమాజ నియమాలను, ధోరణులను వివేచించి తన బుద్ధి మేరకు తనను తాను నడుపు కునే శక్తి అది. అలాగే అది సాహిత్యంలో స్వీయమానసిక ధోరణిగా కూడా పొరబడరాదు. అది సాహిత్యంలో వ్యక్తియొక్క సామాజిక ప్రతిఫలనమేనని గ్రహించాలి. అది సమాజంపై వ్యక్తిలో నిబిడీకృతమైన బాధ్యతగా అర్థం చేసుకోవాలి.
4
గురజాడ మీద ప్రశంస, అభిశంసనల చరిత్ర అంతా ఆయన నిలువు పట్ల సమర్థన, వ్యతిరిక్తతల చరిత్రే. ఒక విధంగా ఇది దాదాపు వందేళ్ల తెలుగు జాతి బౌద్దిక, తాత్విక చరిత్రగా కూడా భావించవచ్చు. ఈ చరిత్రను కొన్ని దశలుగా విభజించి క్లుప్తంగా పరిశీలించ వచ్చు. ఆరంభదశలోని సమర్ధన, వ్యతిరిక్తతలు తరవాత కాలాలలో అదే విధంగా లేవు. అవి స్వభావంలోనూ, స్వరూపంలోనూ మారుతూ వచ్చాయి.
గురజాడ నిలువుపై ఆరంభ సమర్థన, వ్యతిరిక్తతలు ఏమిటి? ఎందుకు?
వారి తొలి సమర్థకులు అనేక రకాలు. సామాజిక నిలువుతోనూ, సాహిత్య నిలువు తోనూ పూర్తి ఏకీభావం కలవారు కొందరు. ఆయన సాహితీ సామర్థ్యానికి ముగ్ధులై పోయినవారు ఇంకొందరు. తమ చుట్టూ మసిలే మనుష్యులలో కనిపించే అవతత్వాలను పోల్చుకోటానికి కావలసిన జీవిత పరిశీలనను అద్భుతంగా అక్షరబద్ధం చేసిన సామర్థ్యానికి తాదాత్మ్యం చెందినవారు మరికొందరు.
వ్యతిరేకులలో గురజాడ సామాజిక నిలువుతో అంటే సంస్కరణల సమర్ధనతో ఏకీభవించనివారు కొందరైతే సాహిత్య నిలువుతో అంటే వాడుక భాషతో విభేదించనివారు మరికొందరు. ఈ కారణంతో దాన్ని, ఆ కారణంతో దీన్ని వ్యతిరేకించినవారు ఇంకొందరు. స్వకులాన్ని రచ్చకీడ్చిన కులద్రోహి అని భావించిన వారు కొందరైతే, శాఖాభేదాలతో ఆగ్రహించిన వారు కొందరు. వారిలో సాంప్రదాయ నిరాకరణను సాంప్రదాయ పతనంగా ఎంచినవారిని మరింతగా పరిశీలించాలి. అప్పటికి ఆంగ్లవిద్య కొత్త ఉపాధి మార్గాలను తెరిచిందన్నది బ్రాహ్మణ కుటుంబాలకు పూర్తిగా తెలుసు. ఆ విద్య వేషభాషలను మార్చింది. ఆ ఉపాధులు డబ్బు అన్నదాని శక్తిని అర్థమయేట్టు చేసాయి. అదే సమయంలో అంత వరకూ ఆయాచితంగా పదవితో సంబంధం లేకుండా, పుట్టుకతో సంక్రమించిన ఆధిక్యతతో అనుభవించిన తోటి మనుష్యుల ‘విధేయత' తగ్గుముఖం పట్టటం వారిని అభద్రతకి గురి చేసింది. దానికి కారకులైన స్వసమూహంలోని గురజాడ, కందుకూరి వంటి ఈ ద్రోహులను ఎలా ఎదుర్కోవాలి? సామాజిక దోషాలుగా వారు ఎత్తిచూపుతున్న వాటిని కాదని, అవి ఎలా సమాజానికి అవసరమో వారి మార్గంలో - అంటే పత్రికలలో, సాహిత్యంలో, తర్కంతో వాదించాలి. ఆనాటి పత్రికలలో శారదా చట్టానికి (వివాహ వయోపరిమితిపై 1930-34) కనిపించిన పాటి వ్యతిరిక్తత, కన్యాశుల్కం, విధవా వివాహం వంటి సంస్కరణల విషయంలో కనిపించదు. వ్యతిరిక్తత ఉండకుండా ఉండే అవకాశం లేదు కనుక, దానిని బట్టి అది వ్యక్తం కాలేదు అని అర్థం చేసుకోవచ్చు. దానిని గురించి రాసినవారు కాని, పత్రికలు పెట్టినవారుగానిచాలా అరుదుగా కనిపిస్తారు. కారణం ఆనాటి 'అక్షరాస్యుల'లో వారి సంఖ్య తక్కువ. దాంతో వీరి వ్యతిరిక్తత చెవికొరుకుళ్ల (Scandals) రూపంలో ఎక్కువగా వ్యక్తమయింది. చాలా వరకూ దానికే పరిమితమయింది. గురజాడ విషయంలో ఆయన రాజ విధేయత, జీవనశైలి, ప్రవర్తన వంటి వ్యక్తిగత అంశాల నుంచి అనేక లైంగికనీతి పతనాలను వదంతులకు సరుకుగా తయారు చేసుకున్నారు.
ఇక సాహిత్య విషయానికి వస్తే గురజాడ, గిడుగుల వాడుకభాషా ప్రతిపాదనకు వ్యతిరిక్తత చాలా గట్టిగానే బహిరంగమయింది. విశ్వవిద్యాలయాలలో గ్రాంథిక భాషను నిలబెట్టటానికి చాలాకాలం వరకూ ప్రయత్నాలు సాగాయి.
మోడర్న్, ప్రోగ్రసివ్ అన్న ఆంగ్ల పదాలకు సమానార్థకంగా వాడుతున్న ఆధునిక, అభ్యుదయ పదాలకు పర్యాయ పదంగా గురజాడను ప్రశంసించటం ఆరంభమయి, క్రమంగా బలపడింది. ఆధునికతను ఒక మలుపుగానూ, అభ్యుదయాన్ని ఒక మార్గం గాను భావించేవారు. కాలక్రమంలో ఆ రెండూ గతం పట్ల కించాదృష్టినీ, అవహేళననూ వ్యక్తం చేస్తున్నాయన్న భావన బలపడ్డాక గురజాడ అభిమానుల ధోరణిని, 'అతి'నీ ఎదుర్కొనే క్రమంలో గురజాడను అభిశంసించేందుకు కొందరు ప్రయత్నించారు. గురజాడకీ, వీరేశలింగానికి మధ్య భేదం, దానిని పరాస్తం చేయటానికి ఆయన డైరీలో ప్రక్షిప్తాలూ వంటివి రాతలకు ఎక్కాయి. ఆరంభ వ్యతిరిక్తత సృష్టించిన చెవికొరుకుళ్లు రాతలకు ఎక్కాయి. కన్యాశుల్కం కర్తృత్వం కూడా గురజాడది కాదన్న వివాదం సైతం వచ్చింది. సెట్టి ఈశ్వరరావు, అవసరాల సూర్యారావు, కట్టమంచి రామలింగారెడ్డి, నార్ల, శ్రీశ్రీ, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి వంటి వారి కృషి, ఆరాధనల వల్ల గురజాడ సృజన తెలుగు వారి గుండెలకు హత్తుకుంది. రచనల సేకరణ, పరిశీలన, వివరణలతో వారి కృషి ప్రతి ఫలించింది. కె.వి.ఆర్, ఆరుద్రల నిశితమైన పరిశీలనలలో వివరాల సేకరణ, విశేషాల వివరణ తెలుగు ఆలోచనా పరులకు గురజాడను నిత్యనూతనం చేసాయి. గొప్ప పరిశోధనా లక్ష్యంతో బ్రౌన్‌నీ, గురజాడనీ పరిశోధించిన బంగోరె (బండి గోపాలరెడ్డి)ని 'సత్య' ఆరాధకునిగానే గాని, 'వ్యక్తి' లేదా 'ఆదర్శ’ ఆరాధకునిగా నేను భావించలేను. ఆయన కృషితో మొదటి కన్యాశుల్కం తిరిగి వెలుగులోకి వచ్చింది..
ఒక దశలో గురజాడకి లభించిన గుర్తింపు, ప్రచారం కమ్యూనిస్టులు పనిగట్టుకుని చేసిందన్న వారు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కమ్యూనిస్టుల ప్రవేశానికి ముందు గురజాడపై వచ్చిన వ్యాసాలను విడిగా పరిశీలించి ఆ భావాన్ని గట్టిగా ఖండించటం జరగలేదు. ఆయనపై అవిరళ కృషి చేసిన వారు ఆ వ్యాసాలను పరిశీలించినా, ఈ విమర్శను చూసీచూడనట్టు ఉపేక్షించారు.
ఆ తరువాత దశలో గురజాడ, కందుకూరిలను కాట్రేడ్లుగా కమ్యూనిస్టులు గౌరవించడం కొత్త వ్యతిరేకులను తయారు చేసింది. వారు ఏదో ఒక నెపంతో గురజాడపై ధ్వజం ఎత్తిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారిని ఆంగ్లేయుల బానిసలుగా, దేశభక్తి లేనివారిగా, లైంగికనీతి బాహ్యులుగా చూపెట్టటానికి ప్రయత్నించారు. ఈ కాలమంతా ఇవేవీ పట్టించుకోకుండానే చదివే జనం గురజాడను చదువుతూనే ఉన్నారు. నేర్చేది నేరుస్తూనే ఉన్నారు. ఆనందించేది ఆనందిస్తూనే ఉన్నారు. 5
ఇటీవలి దశలో వచ్చిన విమర్శ అన్ని విధాలా భిన్నమైనది. ఇది సాహిత్యంలో అస్తిత్వ వాదాలు దూసుకు వచ్చిన దశ. ఈ విమర్శకు లోతూ, గాఢతా ఉన్నాయి. దీనికి గురజాడ నిలువుతో విభేదం లేదు. స్థూలస్థాయిలో గురజాడదీ, వీరిదీ నిలువు (stand) ఒక్కటే. సాహిత్యానికి సామాజిక బాధ్యత ఉంది. జీవిత చిత్రణలోనూ, భాషలోనూ కూడా అది వాస్తవికంగా ఉండాలి.
పోతే -
వారి పరిశీలనకు కేంద్ర బిందువు గురజాడ పుట్టుక. మనిషి ఎక్కడో ఒకచోట పుడతాడు. అతని భావ వైశాల్యం వల్ల విస్తరిస్తాడు. ప్రపంచమంతటికీ చెందుతాడు. స్థలకాలాలను అధిగమిస్తాడు. దానికి అతని సామర్థ్యం చాలావరకు పనిచేస్తుంది. కొంత వరకూ అతని జాతి స్వభావం, వారి కృషీ పనిచేస్తాయి. భారతీయ సమాజంలో అధిగమించవలసిన వర్ణం, కులం, భాష వంటివి అధికంగా ఉన్నాయి. అవి పుట్టుక తోనే లభిస్తాయి. గురజాడ వెంకట అప్పారావు అనే మనిషి బ్రాహ్మణ అనే కులంలో, వర్ణంలో ఆయన ప్రమేయం లేకుండా పుట్టాడు. అది ఈ సమాజంలో పుట్టిన ప్రతి ఒక వ్యక్తికి సాధారణ పరిస్థితి. అస్తిత్వ వాదుల పరిశీలన ప్రకారం ఆయన కృషి ఆయన పుట్టిన కులం బాగుకే వినియోగింపబడింది. దాదాపు 70-80 ఏళ్లుగా గురజాడ అభిమానులూ, వ్యతిరేకులూ దాదాపు అగ్ర కులాల వారు. ఆ కులాల బయటివారు ఇపుడు ఈ ప్రశ్న లేవనెత్తారు. గురజాడను ఆధునికతకూ, అభ్యుదయానికీ తర్వాత కమ్యూనిజానికీ విగ్రహం చెయ్యబోతే వాటివల్ల మాకేం ఒరిగిందని ఆలోచిస్తున్న వారు లేవనెత్తిన ఈ ప్రశ్న చర్చనీయమైనది.
భారతదేశపు ప్రత్యేక పరిస్థితుల సమగ్ర అధ్యయనానికి ఎంతయినా దోహదం చెయ్యగల ప్రశ్న ఇది. ఇది సరిగ్గా చర్చించబడలేదు. మాకొద్దీ తెల్లదొరతనమని అగ్ర కులాల వారు ప్రకటిస్తే మాకొద్దీ నల్లదొరతనమని తతిమా కులాల వారు స్పష్టం చేస్తున్న తరుణం ఇది. ఆత్మగౌరవం అంతిమ లక్ష్యమంటున్న అణచబడిన, బడుతున్న సమూహాలు వేసిన ఈ ప్రశ్న ఒక మీటింగ్ పాయింట్ ఏర్పరచింది. దీనిలో సమాజం అంతా పాల్గొనే అవకాశం, పరిస్థితి ఉంది. ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇది ప్రస్తుతం బీజ ప్రాయంలో ఉన్న ప్రశ్న. రేపటి తాత్వికత దీని నుంచే పుట్టే అవకాశం ఉంది. మాకేమిటి అన్న రాజకీయ డిమాండ్ నుంచి మేమేమిటి అన్న తాత్విక ప్రశ్నవైపు భారతీయ సమాజంలోని అశేష సమూహాల ప్రయాణం ఇప్పుడిప్పుడే ఆరంభమయింది.
ఈ దశలో అడుగడుగునా గిరీశాలు ఎదురవుతుంటారు. వీరివద్ద పదిమందినీ చుట్టూ తిప్పుకోగల సామర్థ్యమేదో ఉంటుంది. మాటకారితనం ఉంటుంది. తాము మాటలాడుతున్న దానికి జవాబ్దారీలేనితనం ఉంటుంది. ఈ క్షణం పబ్బం గడవటం కోసం ఎంతకైనా తెగించగలతనం ఉంటుంది. వీరు అభ్యుదయ చింతకుల వేషంలో ఉంటారు. తమ వ్యక్తిగత సామర్థ్యాలను ఆ వేషం రక్తికట్టటానికే ధారపోస్తారు. అమాయకులైన బుచ్చమ్మలను ఉద్దరించటానికే పుట్టామంటారు. తోలుబొమ్మలాటలో కేతిగాడు, బంగారక్కల లాగ వచ్చి నిద్రపోతున్న జనాన్ని లేపటానికన్నట్లు కబుర్లు చెప్పటమే గిరీశాల పాత్ర. చప్పట్లే వారి లక్ష్యం. చడీచప్పుడూ లేకుండా సొమ్ము చేసుకునేవారి కన్న, చప్పుడు చేస్తూ దృష్టి నిలవకుండా మరల్చే గిరీశాలే సమాజంలో అయోమయం సృష్టించటంలో ముందుంటారు.
ఈ గిరీశాలు సాహిత్యంలో, ఉద్యమాలలో ప్రతి కార్యాచరణ రంగంలో, భావ రంగంలో తారసపడుతూనే ఉంటారు. తన కాలపు గిరీశంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అనిపించగలిగాడు గురజాడ. ఈనాటి, రేపటి గురజాడలు తమ చుట్టూ ఉండే, తమలోనే ఉండే గిరీశాలతో ఆ మాట అనిపించవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆ గిరీశాలు లేని సమాజం మానవజాతి రూపొందించుకునే వరకూ ఆ అవసరం ఉంటూనే ఉంటుంది.
6
రాబోయే పాతిక ముప్ఫై ఏళ్ల కాలం భారతీయ సమాజానికి, అందులోని తెలుగు సమూహానికీ ముఖ్యమైన దశ. సమాజంలో అన్ని సమూహాలూ కలసి కష్టసుఖాలు కలబోసుకుంటూ, ఒకరి సమస్యలను ఒకరు తెలుసుకుంటూ, చర్చించుకుంటూ ముందుకు వెళ్లగల సందర్భం శతాబ్దాల బహుశా సహస్రాబ్దాల తర్వాత తొలిసారి ఏర్పడింది. ఆలోచనా పరుల సంఖ్య పెరుగుతోంది. దాంతో రాసేవారూ, అసంఖ్యాకంగా చదివేవారూ పెరుగు తున్నారు. ఈ సామాజిక సందర్భాన్ని సాహిత్యంలో ప్రతిఫలించవలసిన రచయితలు స్వంత వివేచనతో, బాధ్యతతో రాయటమే కర్తవ్యం. అనేక సమూహాలకు చెందిన వీరు గురజాడ వంటి వారిని కొత్తగా పరిశీలిస్తారు. వ్యక్తులుగా, సమాజ చలనంలో పాల్గొన్న శక్తులుగా వారిని గురించి ఆలోచిస్తారు. తమ ముందున్న కర్తవ్యాలను, ఆచరణలను ప్రోదిచేసుకోటానికి వెనకటి వారిలో ముందు చూపున్న వారి కోసం వెదికినపుడు గురజాడ తప్పక కంటబడతాడు. పుట్టుకనుబట్టి వేరు సమూహానికి చెందిన వారైనా, వారి అనుభవాలు, వారి వ్యక్తీకరణ విధానాలు, వారి వ్యక్తిగత చిత్తశుద్ధి అయినా, మూటగట్టుకున్న తిట్లైనా, మెప్పులైనా తమకు ఉపయోగిస్తాయా లేదా అన్న దృష్టితో చూస్తారు.
ఇది భవిష్యత్తుపై నా అంచనా.
ఈ అంచనా ఏమాత్రం నిజమైనా ఈ పుస్తకం ఈ రూపంలో తెచ్చిన కృషి ఫలిస్తుంది.
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్తులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
అన్న గురజాడ వేడికోలుతో అందరం కలసి ఆలోచించుకోవాలన్న ప్రేరణ నయినా పొందుతాం!
మతమునెన్నడు మరవనీకుము
మంచిగతమేనని భ్రమించనీయుము
జ్ఞానమొక్కటి కలియనీకుము
అంటున్న వ్యాపార ప్రపంచ పాలనలో మనం జ్ఞానోదయం కోసం ధైర్యం తెచ్చుకుంటే
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటై నిలచి వెలుగును - అన్న గురజాడ ఆకాంక్షని మానవుని ఆకాంక్షగా గుర్తించగలుగుతాం!
అందుకోసం మా ఉడతాభక్తి ప్రయత్నం ఈ గ్రంథం.
- మీ మనసు వివిన మూర్తి
గురజాడ జీవితంలో ప్రధాన సంఘటనలు
జననం (తండ్రి రామదాసు, తల్లి కౌసల్యమ్మ) - 21-9-1862
ప్రాథమిక విద్య చీపురుపల్లిలో - 1869 - 1872
హైస్కూలు విద్య విజయనగరంలో - 1872 - 1882
మెట్రిక్ : మహారాజా హైస్కూలు - 1882
ఎఫ్.ఎ. మహారాజా కళాశాల - 1882 - 84
ఇంగ్లీషులో 'కుక్కూ' గేయం - 1882
'సారంగధర' ఇంగ్లీషు గేయం ప్రచురణ - 1883
'ఇండియన్ లీజర్ అవర్', విజయనగరం
'సారంగధర' ప్రచురణ కలకత్తా నుంచి వెలువడే రయస్ అండ్ రయత్ జర్నల్‌లో - ఆగస్టు 11 & 18, 1883
బి.ఎ. పట్టా మహారాజా కళాశాల నుండి - 1884 - 1886
అప్పల నరసమ్మతో వివాహం - 1886
డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్కు ఉద్యోగం - 1886
మహారాజా కాలేజీలో ఉపన్యాసకులు - 1887
కుమార్తె లక్ష్మీనరసమ్మ జననం - 1887
డిబేటింగ్ క్లబ్‌కు ఉపాధ్యక్షుడు - 1889
కుమారుడు రామదాసు జననం - 12-10-1890
మూడవ స్థాయి ఉపన్యాసకులుగా పదోన్నతి - 1891
తమ్ముడు శ్యామలరావు మరణం - 1890-92(?)
'కన్యాశుల్కం' మొదటి ప్రదర్శన (జగన్నాథ విలాసినీ సభ) - ఆగస్టు 1892
మద్రాసుకు వైద్య సహాయం కోసం పయనం, "ట్రీటీ" ప్రచురణ - 1895 జనవరి 9 నుండి జులై 3
ఎస్టేట్ ఎపిగ్రాఫిస్ట్‌గా నియామకం - జూన్ 5, 1896
'ప్రకాశిక పత్రిక' డిక్లరేషన్ - 1896
'కన్యాశుల్కం' మొదటి కూర్పు; ముద్రణ - జనవరి 1897
ఆనంద గజపతి మరణం - మే 23, 1897
'హరిశ్చంద్ర' ఇంగ్లీషు నాటకానికి పీఠికా రచన - 1897
కుమార్తె వివాహం - మే 12, 1898
రేవా రాణీగారికి ఆంతరంగిక కార్యదర్శిగా నియామకం - జూన్, 1898
మద్రాసులో పరిశోధన - 1899
ఎస్టేటు కేసులపై సలహా కోసం కలకత్తా ప్రయాణం - 1900
మద్రాసులో భాష్యం అయ్యంగారితో సమావేశం - డిసెంబరు 18, 1900
రెండవ కుమార్తె జననం - 1902
వారసత్వ దావా; ఎస్.శ్రీనివాస అయ్యంగారితో స్నేహం - 1903
ఇంగ్లీషు కథా రచనా కాలం (Stooping to raise) - 1903
తండ్రి రామదాసు మరణం - ఏప్రియల్ 24, 1905
'కొండుభట్టీయము' నాటక రచన - మే 1906
వ్యావహారిక భాషోద్యమం - 1906
'నీలగిరి పాటలు' ప్రచురణ - 1907
'కన్యాశుల్కం' మలికూర్పు; ముద్రణ - 1909
ఆంధ్రభారతిలో 'దిద్దుబాటు' కథానిక ప్రచురణ - ఫిబ్రవరి 1909
బరంపురంలో భిన్నకులాల సహపంక్తి భోజనం - నవంబర్, 1909
'బిల్హణీయం' మొదటి భాగం ప్రచురణ ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో - 1910
'మీపేరేమిటి' పెద్దకథ ప్రచురణ, ఆంధ్రభారతి - ఏప్రిల్-జూన్ 1910,
'ముత్యాలసరము' గేయం ప్రచురణ, ఆంధ్రభారతి - జులై 1910
'కాసులు' గేయం ప్రచురణ, ఆంధ్రభారతి - ఆగస్టు 1910
'డామస్ పితియస్' గేయం ప్రచురణ, ఆంధ్రభారతి - సెప్టెంబరు 1910
'లవణరాజు కల' గేయం, ప్రచురణ ఆంధ్రభారతి - నవంబర్ 1910
'బిల్హణీయం' రెండవ భాగం ప్రచురణ ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలో - 1911
మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యత్వం - 1911
కలకత్తాలో రవీంద్రనాథ్ టాగోర్‌తో భేటీ - జనవరి 23, 1912
'కన్యక' గేయం ప్రచురణ, ఆంధ్రభారతి - అక్టోబరు 1912
'పూర్ణమ్మ' గేయం రచన - 1912
రేవారాణి మరణం - డిసెంబరు 1912
మద్రాసు విశ్వవిద్యాలయం - ఫెలోషిప్ - జనవరి 1913
వారసత్వ దావాలో రాజీ - 1913
'సుభద్ర' పద్యకావ్య రచన - 1913?
పదవీ విరమణ - 1913
'దేశభక్తి గేయం' ప్రచురణ; కృష్ణాపత్రిక - ఆగస్టు 9 1913
'డిసెంటు పత్రం' (ఇంగ్లీషు) ప్రచురణ - 1914
'దించు లంగరు' గేయప్రచురణ, కృష్ణాపత్రిక - ఏప్రియల్ 1914
అనారోగ్యం - నవంబర్ 19, 1914
వైద్య పరీక్షలు - 1915
'లంగరెత్తుము' గేయ రచచ - సెప్టెంబర్ 1915?
గృహప్రవేశము - 1915
మరణం - నవంబర్ 30, 1915.
విషయసూచిక
1-122 |
3 |
18 |
20 |
21 |
22 |
23 |
24 |
25 |
26 |
27 |
28 |
29 |
30 |
31 |
36 |
39 |
50 |
67 |
69 |
76 |
77 |
80 |
82 |
83 |
88 |
89 |
91 |
107 |
109 |
111 |
112 |
113 |
114 |
119 |
120 |
122 |
2. నాటకములు
123 - 522
కన్యాశుల్కము (మలికూర్పు)
......
211-422
3. కథానికలు
523 - 552
4. వ్యాసములు
553 - 624
మాట, మంతి - 1 : గ్రామ్య శబ్ద విచారణము
......
555
మాట, మంతి - 2 : ఆకాశరామన్న ఉత్తరాలు
......
563
ఆంధ్ర కవితాపిత – 1
......
570
ఆంధ్ర కవితాపిత – 2
......
572
ఆంధ్ర కవితాపిత – 3
......
575
ఆంధ్ర కవితాపిత – 4
......
578
కన్యాశుల్కము
......
581
ప్రఫుల్ల లేక రాణీ చౌదరి (బంకించంద్రుని నవలారచన)
......
583
కావ్యము నందు శృంగారము
......
587
మాటా - మంతీ - 3 : ఆంధ్ర సాహిత్య పరిషత్
......
592
మాటా - మంతీ - 4 : వాడుక భాషలు : గ్రామ్యము
......
595
మాటా - మంతీ - 5 : యిద్దరు రాజులు
......
600
కవిత్వము : వర్డ్సు వర్తు
......
604
వంగీయ సాహిత్యపరిషత్తు
......
608
విద్యా పునరుజ్జీవనము
......
608
ఆంధ్ర కవితాపిత
......
611
ఇతర యుద్ధమల్లులు
......
614
ముత్యాల సరాల లక్షణము
......
615
భట్టకలంకుడు (కన్నడ వ్యాకరణములు)
......
620
Diaries
......
625-824
My own Thoughts
......
825-984
Correspondence
......
985-1250
Minute of Descent
......
1251-1396
అనుబంధం
......
1 – 72