Subject for An Extravaganza
A young man makes love to a girl whom he often sees on a terrace of a house. She notices his attentions signs & c. She is in her పుట్టిన యిల్లు.
On Moon-light nights he goes along that street and listens to her music.
He sings snatches in the same tune. She replies.
She makes enigmatical appointments leading him into all kinds of escapades ending in embracing the దాసి.
At last She hatches a plot with the hero's wife, so that on a certain night the wife and the hero meet.
1
He చదలెల్ల వెదకెనే కొదమ చకోరము
కుదురైన రేవెల్గు కుదిసెనో యేమొ.
2
She ఏగాలి విసరెరా మగడ నిను యీ వంక
He తనువుకు తనువుకు తగులదె లంక.
3
She తనువుకు తనువుకు తగులొక లంకా?
తగులన్న వగలన్న తలపోయు మింక.
4
He నేడేల కల్గెనె నెలత నీకీ శంక
(విను) మనుసుకు మనుసుకు మరులెగా లంక.
5
She మనుసుకు మనుసుకు మరులు వక లంకా?
మరులన్న చెరలన్న మరవబోకింక.
6
He మగువల మాటలు మగువరో వింత
తగులము వగయని తగవొక కొంత?
7
She మగవారి బాటలు మరి మరి వింత
మగనాలిపైగాని మరులు కోరెంత.
8
He మాటలు కావిదె మనసిత్తు జూర
She మనసొక్క టేయైతె మరి రాకుపోర.
9
He చెంతకు చేరిన చెనకుట మేలె?
వంతలబెట్టకు వనజాక్షి యేలె.
10
She నీ కాంత నేనైన నెనరుంతువేమో!
పరకాంత పొందంటె XXXX
11
He నాకాంత వీవైతె నా భాగ్యమెంత?
She నీకాంత నయ్యెద నిదె చూడు వింత.
(గురజాడ రామదాసు పంతులు ఈ గేయాన్ని, విజయనగరం నుంచి 1940 ప్రాంతంలో వెలువడిన 'విజయ' అనే పత్రికలో ప్రచురించారు. ఈ గేయాన్ని సేకరించిన బంగోరె దక్షిణ ఢిల్లి ఆంధ్రసంఘం వెలువరించిన గురజాడ సంస్మరణ విశేషసంచికలో ప్రచురించారు. సం!!)