కోరుకొండ
కనుల పండువయ్యె నగరు కాంత కంటివే
విజయరామ నిర్మితమై
విమల ప్రభా వర్మితమై
విబుధ బలము కలిమి విజయ
శ్రీల నలరుచూ||
కొండ యిదా గోపురమా
దండి నృపతి కాపురమా
రండు, కండు, ఆనందమొండు
కలదె యింత మెండు||
కోరుకొండ, కోర్కొండ, కోరకుండ నిత్తు
వరము లూరకుండ వలదు రండు
రండనె నట నృపవరుండు||
శుభ విభవము లభయదాత ఇభరాట్
శ్రీ విజయరామ విభువరున కొసంగి
లలితలక్ష్మి బ్రోవగా||
మాట మర్మ మెరిగినట్టి మేటి కవుల
జాడలరసి బోటి
అప్పకవి యమర్చె మాటల ముత్యాల పేటll
This work is in the public domain in the United States because it was published before January 1, 1929. It may be copyrighted outside the U.S. (see Help:Public domain).