శ్రీ గీతామృత తరంగిణి/శ్రద్దాత్రయవిభాగ యోగము
శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) |
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
---|---|---|
అర్జున ఉవాచ| |
అర్జును వాక్యము . |
అర్జును డడిగెను .
ఓ కృష్ణా ! ఎవరు శాస్త్రోక్తవిధానమును విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని పూజాదుల నొనర్తురో వారియొక్క స్థితి సాత్త్వికమా , లేక రాజసమా , లేక తామసమా ? ఏదియై యున్నది ? |
శ్రీభగవానువాచ| |
శ్రీ భగవానుల వాక్యము . |
శ్రీ భగవంతుడు చెప్పెను .
ప్రాణులయొక్క స్వభావముచే ( పూర్వజన్మ సంస్కారముచే ) గలిగిన ఆ శ్రద్ధ సాత్త్వికమనియు , రాజసమనియు , తామసమనియు మూడు విధములుగా నగుచున్నది . దానిని గూర్చి వినుము . |
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! సమస్త జీవులకును వారి వారి ( పూర్వజన్మ సంస్కారముతో గూడిన ) యంతఃకరణము ననుసరించి శ్రద్ధ ( గుణము , సంస్కారము ) కలుగుచున్నది . ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగ కలిగియున్నాడు . ఎవడెట్టి శ్రద్ధ గలిగియుండునో అత డట్టి శ్రద్ధయే యగుచున్నాడు . ( అట్టి శ్రద్ధనే గ్రహించును ) ; తద్రూపుడే అయి యుండునని భావము . |
అ. |
తేటగీతి . |
సత్త్వగుణముగలవారు దేవతలను , రజోగుణము గలవారు యక్షులను , రాక్షసులను , తమోగుణముగలవారు భూతప్రేతగణములను పూజించుచున్నారు . |
అ. |
ఉత్పలమాల . |
ఏ జనులు శరీరమందుననున్నట్టి పంచభూతసముదాయమును లేక ఇంద్రియసమూహమును( ఉపవాసాదులచే ) శుష్కింపజేయువారును , శరీరమం దంతర్యామిగనున్న నన్నును కష్టపెట్టువారును , దంభాహంకారములతో గూడినవారును , కామము , రాగము , ( ఆసక్తి ) , పశుబలము కలవారును ( లేక కామబలము , రాగబలము గలవారును ) అవివేకులును అయి శాస్త్రమునందు విధింపబడనిదియు , తమకును ఇతరులకునుగూడ బాధాకరమైనదియునగు తపస్సును జేయుచున్నారో , అట్టివారిని అసుర స్వభావము గలవారినిగ తెలిసికొనుము . |
అ. |
కందము. |
ఆహారముకూడ సర్వులకును ( సత్త్వాది గుణములనుబట్టి ) మూడు విధములుగ ఇష్టమగుచున్నది . అలాగుననే యజ్ఞము , తపస్సు , దానముకూడ జనులకు మూడువిధములుగ ప్రియమై యుండుచున్నది . ఆ యాహారాదుల ఈ భేదమునుగూర్చి ( చెప్పెదను ) వినుము . |
అ. |
కందము. |
ఆయుస్సును , మనోబలమును , దేహబలమును , ఆరోగ్యమును , సౌఖ్యమును , ప్రీతిని బాగుగ వృద్ధినొందించునవియు , రసము గలవియు , చమురుగలవియు , దేహమందు చాలకాలముండునవియు , మనోహరములైనవియునగు ఆహారములు సత్త్వగుణముగలవారికి ఇష్టములై యుండును . |
అ.కట్వమ్లలవణాత్యుష్ణ |
కందము . |
చేదుగాను , పులుపుగాను , ఉప్పగాను , మిక్కిలి వేడిగాను , కారముగాను , చమురులేనివిగాను , మిగుల దాహము గలుగజేయునవిగాను ఉండునవియు , ( శరీరమునకు ) దుఃఖమును , ( మనస్సునకు ) వ్యాకులత్వమును గలుగజేయునవియునగు ఆహారపదార్థములు రజోగుణముగలవానికి ఇష్టములై యుండును . |
అ. |
కందము. |
వండిన పిమ్మట ఒక జాము దాటినదియు ( లేక బాగుగ ఉడకనిదియు ) , సారము నశించినదియు , దుర్ఘంధము గలదియు , పాచిపోయినదియు , ( వండిన పిదప ఒక రాత్రి గడచినదియు ) , ఒకరు తినగా మిగిలినది ( ఎంగిలి చేసినది ) యు , అశుద్ధముగా నున్నదియు ( భగవంతునకు నివేదింపబడనిదియు ) అగు ఆహారము తమోగుణము గలవారి కిష్టమైనది యగును . |
అ. |
కందము . |
' ఇది చేదగినదియే ' యని మనస్సును సమాధానపఱచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేనివారిచేత చేయబడుచున్నదో అది సాత్త్వక యజ్ఞ మనబడును. |
అ. |
అడియాస దవిలి , ఫలముల్ |
భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఫలమును గోరియు , డంబము కొఱకును గావింపబడు యజ్ఞమును రాజసమైన దానినిగా నీవు తెలిసికొనుము . |
అ. |
కందము . |
విధ్యుక్తము కానిదియు , అన్నదానము లేనిదియు , మంత్ర రహితమైనదియు , దక్షిణ లేనిదియు , శ్రద్ధ బొత్తిగ లేనిదియునగు యజ్ఞము తామసయజ్ఞమని చెప్పబడును . |
అ. |
కందము . |
దేవతలను , బ్రహ్మనిష్ఠులను , గురువులను , జ్ఞానులను ( మహాత్ములను బ్రహ్మజ్ఞానముగలపెద్దలను ) పూజించుట , బాహ్యాభ్యంతరశుద్ధి గలిగియుండుట , ఋజుత్వముతో గూడియుండుట ( కుటిలత్వము లేకుండుట , మనోవాక్కాయములతో ఏకరీతిగ వర్తించుట ) , బ్రహ్మచర్యవ్రతమును పాలించుట , ఏప్రాణిని హింసింపకుండుట , శారీరక ( శరీర సంబంధమైన ) తపస్సని చెప్పబడుచున్నది . |
అ. |
కందము . |
ఇతరుల మనస్సునకు బాధగలిగింపనిదియు , సత్యమైనదియు , ప్రియమైనదియు , మేలు గలిగించునదియునగు వాక్యమును , వేదాదులయొక్క అధ్యయనమును అభ్యసించుట, ( వేదము , ఉపనిషత్తులు , భగవద్గీత , భారత భాగవత రామాయణాదులు మున్నగువానిని అధ్యయనము చేయుట , ప్రణవాది మంత్రములను జపించుట ) వాచిక తపస్సని చెప్పబడుచున్నది . |
అ. |
కందము . |
మనస్సును నిర్మలముగా నుంచుట ( కలత నొందనీయక స్వచ్ఛముగా నుంచుట ) , ముఖప్రసన్నత్వము ( క్రూరభావము లేకుండుట ) , పరమాత్మను గూర్చిన మననము ( దైవధ్యానము ) గలిగియుండుట { లేక , దృశ్యసంకల్పము లెవ్వియు లేక ఆత్మయందే స్థితిగలిగియుండుట అను ( వాఙ్మౌనసహిత ) మనోమౌనము } , మనస్సును బాగుగ నిగ్రహించుట , పరిశుద్ధమగు భావము గలిగియుండుట ( మోసము మున్నగునవి లేకుండుట ) అను నివి మానసిక తపస్సని చెప్పబడుచున్నది . |
అ. |
తేటగీతి . |
ఫలాపేక్ష లేనివారును , నిశ్చలచిత్తులును , ( లేక , దైవభావనాయుక్తులును ) అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ ( పైన దెలిపిన శారీరక , వాచిక , మానసికములను ) మూడు విధములైన తపస్సును సాత్త్వికమని ( సాత్త్వికతపస్సని ) ( పెద్దలు ) చెప్పుదురు . |
అ. |
కందము . |
ఇతరులచే తాను సత్కరింపబడవలెనని , గౌరవింపబడవలెనని , పూజింపబడవలెనని డంబముతో మాత్రమే జేయబడు తపస్సు అస్థిరమై , అనిశ్చితమైనట్టి ఫలము గలదై ( లేక చపలమైనట్టి రూపముగలదై ) ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది . |
అ. |
తేటగీతి . |
మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును ( శుష్కోపవాసాదులచే ) బాధించుకొనుటద్వారాగాని , లేక ఇతరులను నాశనము చేయవలెనను ఉద్దేశ్యముతో గాని చేయబడు తపస్సు తామసిక తపస్సని చెప్పబడినది . |
అ. |
తేటగీతి . |
ఈయవలసినదేయను నిశ్చయముతో ఏదానము పుణ్యప్రదేశమందును , యోగ్యుడగువానికి మఱియు ప్రత్యుపకారముచేయ శక్తి లేని వానికొఱకు ఈయబడుచున్నదో అది సాత్త్వికదానమని చెప్పబడుచున్నది . |
అ. |
ఆటవెలది . |
ప్రత్యుపకారముకొఱకుగాని , లేక ఫలము నుద్దేశించిగాని , లేక మనఃక్లేశముతో ( అతికష్టముతో ) గాని ఈయబడు దానము రాజసదానమని చెప్పబడుచున్నది . |
అ.అదేశకాలే యద్దాన |
తేటగీతి . |
దానమునకు తగని ( అపవిత్రములగు ) దేశకాలములందును , పాత్రులు ( అర్హులు ) కానివానికొఱకును , సత్కారశూన్యముగను , అమర్యాదతోను ఈయబడిన దానము తామస దానమని చెప్పబడుచున్నది . |
అ. |
కందము . |
పరబ్రహ్మమునకు ' ఓమ్ ' అనియు , ' తత్ ' అనియు , ' సత్ ' అనియు మూడువిధములగు పేర్లు చెప్పబడినవి . ఈ నామత్రయమువలననే ( దాని యుచ్ఛారణచేతనే ) పూర్వము బ్రాహ్మణులు ( బ్రహ్మజ్ఞానులు ) , వేదములు, యజ్ఞములు, నిర్మింపబడినవి . |
అ. |
తేటగీతి . |
అందువలన , వేదములను బాగుగ నెఱిఁగినవారియొక్క శాస్త్రోక్తములగు యజ్ఞ దాన తపః క్రియలన్నియు ఎల్లప్పుడును ' ఓమ్ ' అని చెప్పిన పిమ్మటనే అనుష్ఠింపబడుచున్నవి . |
అ. |
తేటగీతి . |
అట్లే ' తత్ ' అను పదమును ఉచ్చరించియే ముముక్షువులు ఫలాపేక్షలేక పలువిధములైన యజ్ఞ , దాన , తపః కర్మలను చేయుచున్నారు . |
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! ' కలదు ' అనెడి అర్థమందును, ' మంచిది ' అనెడి అర్థమందును ' సత్ ' అను పరబ్రహ్మ నామము ప్రయోగింపబడుచున్నది . అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ ' సత్ ' అను పదము వాడబడుచున్నది . యజ్ఞమునందును , తపస్సునందును , దానమునందుగల నిష్ఠ ( ఉనికి ) కూడ ' సత్ ' అని చెప్పబడుచున్నది . |
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! అశ్రద్ధతో చేయబడిన హోమముగాని , దానముగాని , తపస్సుగాని , ఇతర కర్మలుగాని ' అసత్తని ' చెప్పబడును . అవి ఇహలోకఫలమును ( సుఖమును ) గాని , పరలోక ఫలమును ( సుఖమును ) గాని కలుగజేయవు . |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు |
ఓం తత్ సత్ |
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రద్ధాత్రయవిభాగ యోగమను పదునేడవ అధ్యాయము . ఓమ్ తత్ సత్ . |