శ్రీ గీతామృత తరంగిణి/దైవాసురసంపద్విభాగ యోగము
శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) |
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
---|---|---|
శ్రీభగవానువాచ| |
శ్రీ భగవానుల వాక్యము . |
ఓ అర్జునా ! 1. భయము లేకుండుట 2. అంతఃకరణశుద్ధి 3. జ్ఞానయోగమునందుండుట 4.దానము 5.బాహ్యేంద్రియనిగ్రహము 6. (జ్ఞాన) యజ్ఞము 7.( వేదశాస్త్రముల ) అధ్యయనము 8.తపస్సు 9.ఋజుత్వము 10.ఏప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట ( అహింస ) 11. సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక , నిజము పలుకుట (సత్యము), 12.కోపము లేకుండుట 13.త్యాగబుద్ధిగలిగియుండుట 14. శాంతిస్వభావము 15.కొండెములు చెప్పకుండుట 16. ప్రాణులందు దయగలిగియుండుట 17.విషయలోలత్వము లేకుండుట 18.మృదుత్వము (క్రౌర్యము లేకుండుట) 19. (ధర్మ విరుద్ధ కార్యములందు) సిగ్గు 20.చంచల స్వభావము లేకుండుట 21.ప్రతిభ (లేక, బ్రహ్మతేజస్సు )22. ఓర్పు(కష్ట సహిష్ణుత) 23. ధైర్యము 24.బాహ్యాభ్యంతర శుచిత్వము 25.ఎవరికిని ద్రోహముచేయకుండుట (ద్రోహచింతనము లేకుండుట) 26. స్వాతిశయము లేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను నీ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నది . (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము). |
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! డంబము, గర్వము, అభిమానము ( దురభిమానము ), కోపము, ( వాక్కు మున్నగువానియందు )కాఠిన్యము, అవివేకము అను నీ దుర్గుణములు అసురసంపత్తియందు పుట్టినవానికి కలుగుచున్నవి .( అనగా అసురసంపత్తిని పొందదగి జన్మించినవానికి కలుగుచున్నవని భావము ) |
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! దైవీసంపద పరిపూర్ణ (సంసార) బంధనివృత్తిని ; అసురీసంపద గొప్ప (సంసార) బంధమును గలుగ జేయునని నిశ్చయింపబడినది . నీవు దైవీసంపదయందే (దైవీసంపదను పొందదగియే) జన్మించినాడవు కావున శోకింపనవసరము లేదు . |
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! ఈ ప్రపంచమున దైవసంబంధమైన గుణము కలది యని అసురసంబంధమైన గుణము కలదియని రెండు విధములగు ప్రాణులు సృష్టులు కలవు . అందు దైవసంబంధమైన దానినిగూర్చి నీకు విస్తరముగ తెలిపితిని . ఇక అసురసంబంధమైనదానినిగూర్చి నావలన వినుము . |
అ. |
చంపకమాల . |
అసుర స్వభావముగల జనులు ధర్మ ప్రవృత్తినిగాని అధర్మప్రవృత్తినిగాని యెఱుంగరు. వారియందు శుచిత్వముగాని ఆచారము(సత్కర్మాచారము) గాని సత్యముగాని యుండదు . |
అ. |
చంపకమాల . |
వారు జగత్తు అసత్యమనియు ( వేదాదిప్రమాణరహితమనియు ) , ప్రతిష్ఠ ( ధర్మాధర్మవ్యవస్థలు ) లేనిదనియు, ( కర్తయగు ) ఈశ్వరుడు లేనిదనియు, కామమే హేతువుగాగలదై స్త్రీపురుషులయొక్క పరస్పరసంబంధముచేతనే కలిగిన దనియు, అదిగాక ఈ జగత్తునకు వేఱుకారణమేమియు లేదనియు చెప్పుదురు . |
అ. |
తేటగీతి . |
( వారు ) ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి , చెడిన మనస్సు గలవారును , అల్పబుద్ధితో గూడియున్నవారును , క్రూరకార్యములను జేయువారును , ( జగత్తునకు ) శత్రువులును ( లోకకంటకులును ) అయి ప్రపంచముయొక్క వినాశము కొఱకు పుట్టుచున్నారు . |
అ. |
ఉత్పలమాల . |
వారు తనివి తీరని కామము నాశ్రయించి , డంబము , అభిమానము , మదము గలవారై , అవివేకము వలన చెడుపట్టుదలల నాశ్రయించి , అపవిత్రములగు వ్రతములు
( నీచ వృత్తులు ) గలవారై ప్రవర్తించుచున్నారు . |
అ. |
కందము . |
మఱియు వారు అపరిమితమైనదియు , మరణమువఱకు ( లేక , ప్రళయకాలమువఱకు ) విడువనిదియునగు విషయచింతను ( కోరికలను ) ఆశ్రయించినవారును , కామోపభోగమే పరమపురుషార్థముగ దలంచువారును , ఇంతకుమించినది వేఱొకటి లేదని నిశ్చయించువారును , పెక్కు ఆశాపాశములచే బంధింపబడినవారును , కామక్రోధములనే ముఖ్యముగ నాశ్రయించినవారును , అయి కామముల ననుభవించుట కొఱకు గాను అన్యాయమార్గములద్వారా ధనసమూహములను కోరుచున్నారు . |
అ. |
కందము . |
"ఈ కోరికను ఇపుడు నేను పొందితిని , ఈ కోరికను ఇకమీదట పొందగలను ; ఈ ధనము ఇపుడు నాకు కలదు ; ఇంకను ఎంతయో ధనము నేను సంపాదింప గలను ; ఈ శత్రువును నేనిపుడు చంపితిని ; తక్కిన శత్రువులను గూడ చంపగలను ; నేను ప్రభువును ; సమస్త భోగములను అనుభవించువాడను ; తలంచిన కార్యమును నెర వేర్ప శక్తి కలవాడను ; బలవంతుడను ; సుఖవంతుడను ; ధనవంతుడను ; గొప్ప వంశమున జన్మించినవాడను ; నాతో సమానమైనవాడు మఱియొకడెవడు కలడు ? నేను యజ్ఞములఁ జేసెదను ; దానముల నిచ్చెదను ; ఆనందము ననుభవించెదను" - అని ఈ ప్రకారముగ అజ్ఞానముచే మోహము ( భ్రమ ) నొందినవారును , అనేకవిధములైన చిత్త చాంచల్యముతో గూడినవారును మోహము ( దారాపుత్రక్షేత్రాదులందు అభిమానము ) అను వలచే బాగుగ గప్పబడినవారును , కామముల ననుభవించుటయందు మిగుల యాసక్తి గలవారును అయి , ( వారు అసుర ప్రవృత్తి గలవారు ) అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు . |
అ. |
తేటగీతి . |
తమ్ము తాము గొప్పగా దలంచువారును , వినయము ( మర్యాద ) లేనివారును , ధనము కలదని అభిమానముతోను , మదముతోను గూడియుండువారును , అహంకారమును, ( పరపీడాకరమగు ) బలమును , గర్వమును , కామమును , క్రోధమును బాగుగ ఆశ్రయించినవారును , తమశరీరములందును , ఇతరుల శరీరములందును ( సాక్షిగ ) నున్న నన్ను మిగుల ద్వేషించువారును , అసూయాపరులైయుండు వారు నగు (అసురసంపదగల ) వారు డంబముతో శాస్త్రవిరుద్ధముగ నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు . |
అ. |
చంపకమాల . |
( ఆ ప్రకారము ) సమస్త ప్రాణులలో గల ఆత్మయగు నన్ను ద్వేషించు వారును , క్రూరులును , అశుభ ( పాప ) కార్యములను జేయువారును నగు అట్టి మనుజాధములను నేను మరణ రూపములగు ఈ సంసార మార్గములందు అసురసంబంధమైన నీచజన్మలందే యెల్లప్పుడు త్రోచివై చెదను . ఓ అర్జునా ! అసురసంబంధమైన ( నీచ ) జన్మమును పొందినవారలగు మూఢులు ప్రతి జన్మయందును నన్ను పొందకయే , అంతకంటె ( తాము పొందిన జన్మకంటె ) నీచతరమైన జన్మమును పొందుచున్నారు . |
అ. |
తేటగీతి . |
కామము , క్రోధము , లోభము అను నీ మూడును మూడువిధములగు నరక ద్వారములు . ఇవి తనకు ( జీవునకు ) నాశము కలుగజేయును - కాబట్టి ఈ మూడిటిని విడనాడవలెను . ( లేక , కామము , క్రోధము , లోభము అను మూడు విధములగు ఈ అసురసంపద నరకమునకు ద్వారము - అనియు చెప్పవచ్చును ) . |
అ. |
తేటగీతి . |
ఓ అర్జునా ! ( కామక్రోధలోబములనునట్టి ) ఈమూడు నరక ద్వారములనుండి బాగుగ విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు . అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు . |
అ. |
ఉత్పలమాల . |
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన యిష్టమువచ్చినట్లు ప్రవర్తించునో , అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని , సుఖమునుగాని , ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరడు . |
అ. |
తేటగీతి . |
కావున నీవు చేయదగినదియు, చేయరానిదియు నిర్ణయించునపుడు శాస్త్రము ప్రమాణమైయున్నది . శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలిసికొని దాని ననుసరించి నీ వీ ప్రపంచమున కర్మమును జేయదగును . |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు |
ఓం తత్ సత్ |
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మ విద్యయు , యోగశాస్త్రమును ,
శ్రీకృష్ణార్జున సంవాదమునగుశ్రీ భగవద్గీతలందు దైవాసుర సంపద్విభాగ యోగమను పదునాఱవ అధ్యాయము సంపూర్ణము. |