వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు

విషయసూచిక

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
305
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
318
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
329
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
343
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
375

చంద్రవదన రాజ్య రక్ష ఉడతా భక్తి చివరి రోజులు శివాజీ అఫల్ ఖాన్ నాలుగు దారులు కేశరక్ష సంప్రదాయాలు

మధుర ప్రియ

నాచీ

(జనశృతి సమాహృతే ఆధారం - ఆచారాలు ఆనాటివే - దేశం త్రిలింగం - కాలము 15వ శతాబ్ది)

(జ్యోతిర్విద్‌గృహ ప్రాంగణము - దైవజ్ఞుడు ఏలేశ్వరుడు)

దైవజ్ఞుడు : ఉపాధ్యాయా! ఈ విషయంలో దైవజ్ఞులకు ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. అంతా ఫల నిర్ణయంలో ఏకీభవించారు. ఈ హోరా శాస్త్రాన్ని బట్టి కించిత్తయినా మనకు అనుకూలించేటట్లు లేదు. స్త్రీ జాతకంలో ప్రత్యేకానుభవం వున్న మైథిలి శంభునాథుడు కూడా అదే ఫలం చెప్పాడు. ఇంకా ఏ ఇతరమైనా అనుకోవచ్చు. కానీ - మాంగల్య స్థానంలో శని. అంతే కాకుండా పాపాధిపత్యంతో పాపార్ధళ పట్టిన శుభదృష్టి (భిన్నముఖము).... సర్వజ్ఞులు తమ రెరుగని దేమున్నది? కన్యకు వివాహాన్ని కట్టిపెట్టి శివాజీవిగా ఉంచితే బాగుంటుందేమోనని నా...

ఏలేశ్వరుడు : స్వామీ! అంతేనా?... అన్యోపాయం లేదంటారా? (గద్గదస్వరము) భాగ్య కోశాధిపత్యము నుండి పంచమకోణస్థితి వున్న గురుదృష్టి అష్టమాని కున్నదిగా?.... మరి చాలదూ?...

దైవజ్ఞుడు : ఏమిలాభం ఆ గురుడు అస్తంగతుడైనాడు.

ఏలేశ్వరుడు : (దుఃఖము) నా ఆశలడుగంటాయి. నా పాపం పండింది.... నలుగురిలో నగుబాట్లు కావలసివచ్చింది. నా బ్రతుకు... జైముని ఆస్థాన పురోహితుణ్ణి ఆవహించాయి పంచ మహా పాతకాలు. కన్యాత్వం వచ్చిన కన్యకు వివాహం చేద్దామా అంటే ఒకవైపు శాస్త్రరీత్యా వైధవ్యం కనిపిస్తుంటే ఎలా చేస్తాను. చేతులెట్లా ఆడుతాయి. చేయకుండా ఉందామా అంటే శాస్త్ర విరుద్ధంగా వెలి... (తేర్చుకొని... చింతామగ్నత).... వివాహం జరిగి తీరవలసినదే. స్వామీ! మార్గేతరం ఏమీ లేదు కదూ?

దైవజ్ఞుడు : (ముఖదైన్యం) ఉపాధ్యాయా! కాని ఇటువంటి సందర్భంలో ముందుగా లోహ ప్రతిమకిచ్చి వివాహం శాస్త్రోక్తంగా చేసి ఆ ప్రతిమను నాశనం చేసి తరువాత వరుని కిచ్చి కల్యాణం చేస్తే దోష పరిష్కార మౌతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. పూర్వం అది ఆచారంగా కూడా ఉన్నట్లు జనశృతి.

ఏలేశ్వరుడు : అది పునర్భూవివాహం కాదా? స్వామీ! శుద్ధ శ్రోత్రియ వంశంలో పుట్టిన నేను అట్టి ప్రతిమా వివాహానంతర పునఃకల్యాణము చేస్తే ఏలేశ్వరుడు పునర్భూ వివాహానికి అంగీకరించడు తన కూతురికి చేసిన పెళ్ళి పునర్భూవివాహం క్రిందికే వస్తుంది. ప్రతిమ కేవల ప్రత్యామ్నాయం అని తాము గూడా పునర్భూ వివాహాలు చేస్తే ఆ మతధ్వంసక పాతకం నన్ను చుట్టుకుంటుంది. అపకీర్తి! వద్దు! వద్దు! భావికుల ధ్వంసానికి మార్గదర్శకుణ్ణి కమ్మంటారా? శివ! శివ! శివ శివా.... జన్మ జన్మాలకూ వద్దు!

(తలమీద చేతులు పెట్టుకొని కూర్చుంటాడు)

దైవజ్ఞుడు : స్వస్థ చిత్తులై తామింకా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. సర్వజ్ఞులు తక్కిన శాస్త్రా లేమంటున్నాయో తరచండి... మీరేది నిర్ణయించుకున్నా నా సాయ శక్తులా కార్యసానుకూలానికి ప్రయత్నిస్తాను. ఇంకా... (ఎవరో వచ్చే వానిని చూచి ఆగుతాడు)

ఆనీకస్తుడు : (వంగి ఇరువురకు నమస్కరించి) శ్రీ శ్రీ జైముని మహారాజులుంగారు తమ ఆస్థాన దైవజ్ఞయ్యను యుద్ధముహూర్త నిశ్చయం చేయటానికి కొని రావలసినదని అగత్యాన్ని బట్టి తమ అనీకస్తుని ఆజ్ఞాపించారు.

దైవజ్ఞుడు : (ఆనీకస్తునితో) బోయీలను ఆందోళిక సిద్ధపరుపమను. వారు ప్రక్క అరుగు మీద ఉంటారు... (ఏలేశ్వరునితో) చింతా మగ్నులైన లాభమేమి? కానున్న దానికి కర్తలెవరు?.... “శ్రీరవయేనమః”

(ప్రవేశము బోయీలు - అందలముతో వచ్చి నమస్కరిస్తారు)

బోయీ : స్వామీ! సిద్ధము.

దైవజ్ఞుడు : (ఏలేశ్వరునితో) ఉపాధ్యాయా! రాజాజ్ఞ తడవుండరాదు. అనుజ్ఞ? పోయి వచ్చెదను.

(అని ఆందోళికా ఆసీనుడై పోతాడు)

ఏలేశ్వరుడు : (దైవజ్ఞుని చావడిలోనే వుండి) పునర్భూవివాహాన్ని లోకంలో ప్రచారం

చేయటంగాని, కన్యా వైధవ్యం చూడటం గాని తప్ప మార్గేతరం లేదుగామాలి. కష్టకాలం వచ్చింది... విధికృతం బలీయం... (కొంచెంసేపు ఆలోచించి) ఇంకా అన్ని శాస్త్రాలు పరిశీలిస్తే... పరిశీలించి నా మట్టుకు ఒక శాస్త్రం ఇలా చెపుతుంటే మనసు కెక్కడి శాంతి. (కొంత సేపాగి) శాస్త్ర పరిశీలనం ఇంకా యెందుకు, శాస్త్రాలలో వున్న ప్రతిముక్క మీద నాకు వెర్రి నమ్మకం ఎందుకు?... అయినా చూస్తాను... ఎలా వస్తుందో వైధవ్యం... తారాబల, చంద్రబలాలన్నీ విచారించి, నిధుల చేత సుముహూర్తం నిశ్చయం చేయిస్తాను. కావలసి వచ్చునంటే నేనే నవగ్రహజపం చేస్తాను. ఇంకా వూరుకుంటే నాచీకి ఎనిమిదేళ్లు దాటుతాయి. తరువాత వచ్చే అపవాదానికి అనుకుంటే లాభం వుండదు. మానవుడు పూర్వం చేసినదానికి ఇప్పుడు ప్రతిగా చేస్తే విధి మాత్రం ఏం చేస్తుంది.

(అని లేచి నెమ్మదిగా ఇంటి మార్గం పట్టుతూ వుంటాడు) రాజవీథిని శైవ భిక్షకుడు ఒకడు,


జంగమయ్యా! గరుడ
జంగమయ్యా! శివ!
దేహధారణ నున్న
దివ్య లింగమయా!
నిఖిల లోకాధీశ
నిర్మల జోతిస్సు
నింగిలో వెలిగేను
నేలపై వెలిగేను జంగమయా

కలుష బుద్ధీ! నీవు
కనుమూయ జూడకో
ఆంతరంగిక యత్న
మాజ్యోతి కనలేదె? జంగమయా


అని పాడే భిక్షుక గీతం వినీ విననట్లుగా పోతాడు


(తెర)

(ఏలేశ్వరుడు - కృష్ణపంతు - 'భాగీరథీ' స్నానం చేసి నెత్తిమీద నీళ్ళ కడవలు పెట్టుకొని

వస్తుంటారు.) ఏలేశ్వరుడు,


అక్షయ! త్రిభువనాధ్యక్ష! సర్వజ్ఞ!
దేవ! మహాదేవ! దేవతారాధ్య!
భావజ సంహార! భక్తమందార!
భక్తవత్సల! ఈశ! భర్గ! దేవేశ!
భక్త జనాధార! భవ్య సాకార!


అనే శివస్తుతి చేస్తూ రాజవీథిలో నడుస్తూ వుంటాడు. కృష్ణపంతు, నాచీ తోడి బాలికలతో ప్రాతఃకాలం ఆడు కుంటుంటే ఇంటికి దగ్గిరగా వున్న శివాలయంలో చూచి)

కృష్ణపంతు : మహాత్మా! ఆ ఆటలో తన్మయత్వం చూచారూ? రూపం తాల్చి చిరు చెమట ముఖం మీద నాట్యం చేస్తూ ఉన్నది. ముంగురులు పవిత్ర గోదావరీ మృత్తిక శ్రమ వారితో కలిస్తే లేపనం వల్ల అతుక్కుపోయాయి. (కొంతదూరం నడచి) అదుగో! ఇంటిదారి పడుతూ ఉన్నది. ఆటగొల్లు వచ్చినట్లున్నది. అందులో అమ్మాయికి ఆవంత కూడా ఆనందం కనిపించకపోవటం అనేకమార్లు చూచాను. బిక్కమొగంలో దుఃఖమూర్తి ఆవేదన పడుతూ వుంటుంది. లోక ప్రవృత్తి కించిత్తేని తెలుసుకోలేని ఆ పసితనంలో...

(ఇంతవరకూ తలవంచుకొని చెప్పుతూ వున్న మాటలు గురువుగారి ముఖం చూస్తూ చెప్పబోతాడు. ఆయన ముఖంలో స్నిగ్ధత, కనుకొనలలో దాగులాడే దుఃఖాశ్రు కణాలు చూచి)

ముఖం వివర్ణమైన దేమి? ఆ అశ్రుకణాలకు కారణం ఏమి?

ఏలేశ్వరుడు : తండ్రీ! ఏమీ లేదు. అమ్మాయి ఆటలో మైమరుపునకు హృదయం కరిగి ఆనందాశ్రువులు కనుకొలకులనావరించాయి. అంతే.

కృష్ణపంతు : లేదు, లేదు మహాత్మా! ఏదో కలిగిన బాధను కప్పి పుచ్చుతూ ఉన్నారు. చెప్పరాని దైనందునా?

ఏలేశ్వరుడు : నీకు చెప్పరాని దేమున్నది తండ్రీ!... చెప్పేటందుకు ఏమీ లేదు కూడాను. నాకు 'జైముని' రాజాస్థాన పౌరోహిత్యము లేనప్పుడు నా ఏకైక పుత్రిని పెంచటానికి దంపతులము పడ్డ అవస్థలన్నీ అప్రయత్నంగా కళ్ళకు కట్టాయి. అందువల్లనే ముఖం వివర్ణమైంది. కృష్ణపంతు : మహాత్మా! (అమ్మాయిని చూపించి) పురాదుర్దశ జ్ఞప్తికి తెచ్చినందుకు క్షమించాలి.

ఏలేశ్వరుడు : వెర్రి తండ్రీ! నీ తప్పేమున్నది క్షమించటానికి? కన్నతల్లి నా కళ్ళముందుంటే నీ కన్న నాకే ముందు కన్పించింది. నీవు చూడలేదు గాని నీవు చెప్పకముందే ఆ యశ్రువులు వచ్చాయి. నీ మనస్సు ఇంత లేత దేమి నాయనా! (కొంత సేపాగి నడుస్తూనే) ఇంతవరకూ నీకు నేనెప్పుడూ చెప్పని సంగతి ఒకటి చెప్పాలనుకున్నాను. ఆ విషయంలో నీ సలహా కావలసి వచ్చింది.

కృష్ణపంతు : నేనా... సలహా ఆఁ! స్వామీ! ఏమి ఈ విపరీత వాంఛ. కానీ మీ ఆజ్ఞ ఉల్లంఘింపను. ఏదో కించిత్తుగా నా చిఱుత బుద్ధికి తోచినట్లుగా...

ఏలేశ్వరుడు : ఏమీ లేదు, నాచీ వివాహ విషయం

కృష్ణపంతు : అర్భకుణ్ణి నేనా జీవిత సమస్యల్లో సలహా యిచ్చేది?

ఏలేశ్వరుడు : సమస్య ఏముంది? వరుని విషయమే... ఎటువంటి వాని కివ్వమంటావు?

కృష్ణపంతు : దానికి ఆలోచన ఏమున్నది? తమ గౌరవ సంప్రదాయాలకు అనుకూలునికి - సాంగంగా వేదాధ్యయనం చేసినవానికి మీరు ప్రత్యేకంగా ఆదరించే సాహిత్య ప్రియునికి - రూపవంతుడైన యుక్త వయస్కునికి - అంతకన్నా అనుభవజ్ఞులు మహాత్ములకు నే చెప్పేదేముంది?

ఏలేశ్వరుడు : నా శిష్యకోటిలో నేను నిన్నే ప్రేమించాను. సకల విద్యావిదుణ్ణి చేశాను.

కృష్ణపంతు : సర్వదా కృతజ్ఞుడను.

ఏలేశ్వరుడు : ఆచారవంతుడివి బాగాను.

కృష్ణపంతు : తమ శిష్యులకు కించిదాచారమా!

ఏలేశ్వరుడు : యశః సంప్రదాయాలకు రెంటికీ సరిపోయావు. యుక్తవయస్కుడవు. నీకంటేనా ఇంత పాండిత్యముతో! రూపంలో వంకేమిటి?

(అభిప్రాయంకోసం కొంతసేపు ఆగుతాడు)

కృష్ణపంతు : (తలవంచుకొని సమాధానమీయడు) ఏలేశ్వరుడు : మీ మాతా పితరులకు అభియోగం పంపిస్తాను. కృతార్థుని చేయమంటాను.

కృష్ణపంతు : (మాటాడడు. తన ముఖంలో చిందులాడే సిగ్గు - ఆనందం - కనిపించకుండా చేతులో వున్న కమండలం చెంపకు ఆనిస్తాడు. పులకాంకురాలవల్ల గురువుగారు కనిపెడతారు అంతాను... మాట్లాడకుండా వీథిలో కొంత దూరం నడిచాక ఏలేశ్వరోపాధ్యాయుని గృహము వస్తుంది. ఇద్దరూ నీళ్ళ బిందెలతో ఇంట్లోకి పోతారు.)

(తెర)

(నాచీ తండ్రికి అగ్ని కార్యానికి కావలసిన ఉపకరణాలు అమరుస్తూ వుంటుంది. కృష్ణపంతు ముంగిట్లో అరుగుమీద కూర్చుంటాడు)

తల్లి : (ఇంట్లోనుంచి) అమ్మాయీ! కృష్ణపంతుకు సంధ్యా వందనానికి పంచ పాత్ర ఉద్ధరణ యివ్వమ్మా బయట వున్నాడు.

నాచీ : ఇస్తున్నానమ్మా ముందు నాన్నగారికి ఇచ్చి.

ఏలేశ్వరుడు : (నవ్వుతూ) ఇంకా సిగ్గు బిడియం నేర్పకుండా అతనికి కావలసినవన్నీ తీసుకుపోయి యివ్వమంటావు. పెళ్ళి అయిన తర్వాత ఇస్తుందిలే!

తల్లి : ఏమంటారు?... నిశ్చయించుకున్నారా ఏమిటి?

ఏలేశ్వరుడు : (సగర్వంగా) అవును.

తల్లి : సంతోషము.

నాచీ : (తలవంచుకొని స్తంభం ఆనుకొని నిలవబడుతుంది)

కృష్ణపంతు : (మనస్సులో) అడగకుండానే తండ్రిగారికి అన్నీ అమరుస్తూ ఉన్నది. నాకు కూడా ముందు అట్లాగే అమరిస్తే నేనెంతగానో ఆనందిస్తాను. హవిస్సులు పరమ పవిత్రాలౌతాయి. అమరాగ్ని హోత్రులు ఆనందిస్తారు. నాకు మాత్రం అంతకంటే కావలసిన దేముంది? కల్యాణి యింట్లో అన్ని పనులూ చక్క బెడుతూ ఉంటే అమ్మా నాన్నా పొంగిపోతారు. నే చేసుకున్న పురాపుణ్యం వల్ల గురువుగారు అనుగ్రహించారు...

నాచీ : (తండ్రి జపం చేసుకోవటం తల్లి గోదావరికి మంచినీళ్ళకు పోవటం చూచి దొడ్డి తలుపు వేసి బయట ముంగిట్లో వున్న పంతు దగ్గిరకు వచ్చి నిలుచుంటుంది)

కృష్ణపంతు : (మాట్లాడించడు) నాచీ : (సిగ్గాపుకొని) పంతూ! నీ కేమన్నా కావాలా యేమిటి? రోజుటి మాదిరిగా పిలిచి అడగటం లేదు.

కృష్ణపంతు : రోజూ ఏమని పిలిచేవాణ్ణి.

నాచీ : చెల్లీ! అని. రాత్రి నాన్నగారు నీకు 'గీత గోవిందం' పాఠం చెపుతూ వుంటే నేనే రాధికనై పోయి గేయం వ్రాశాను.

కృష్ణపంతు : చెల్లీ! ఏదీ ఆ గేయం.

నాచీ : నేను రాధికనై పోయానంటే! కృష్ణ! నీవు చెల్లీ అంటే మనసెలా వుంటుంది? చదవమంటావా?

కృష్ణపంతు : చదువు.

నాచీ : (గొంతుక సవరించుకొని)


నా వలపు పూవీథి
నవనళినివై నీవు
నటనాలు సల్పరా
నందగోపాలకా!
మెరుగు తీగలు పూయు
మిసిమి పూదామమును
అంతరాంతరములో
అంబు ముత్యములతో
కూర్చి నీ మెడవేసి
కులుకుచున్ బాడెదన్ ॥నా వలపు॥


(అని చక్రభ్రమణము)

కృష్ణపంతు : (సంతోషం లేనట్లు నటిస్తాడు నాచీ చూస్తే)

నాచీ : నీకిష్టం లేనట్లుంది, ఆపివేయమంటావా?

కృష్ణపంతు : (మాట్లాడడు)

నాచీ : (ధైర్యంగా) ముందేదో నీకూ నాకూ బాంధవ్యం కలపాలని అమ్మా నాన్నా నిన్ననే అనుకుంటే విన్నాను. నీకు కూడా తెలిసిందిగామాలి. అందుకోసమనా ఏమిటి మాట్లాడటం లేదు? కృష్ణపంతు : (చిరునవ్వు) మాట్లాడటానికేముంది?

నాచీ : నీకు చెప్పారా మరి నాన్నగారు?

కృష్ణపంతు : (తెలియనట్లు నటిస్తూ) దేని విషయం? ఏమిటి?

నాచీ : ఏమీ ఎరగవు గామాలి. అబ్బో! తెలియనట్లు నాచేత చెప్పించాలనే ఆ అభిలాషెందుకూ?

కృష్ణపంతు : నిజంగా నాకేమీ తెలియదు. నీవు మాట్లాడేది నాకేమీ అర్థం కావటం లేదు.

నాచీ : నిజంగా తెలియదు?

కృష్ణపంతు : తెలిస్తే నీ దగ్గర దాచి పెడతానా?

నాచీ : ఏమీ నామీద నీకంత?

కృష్ణపంతు : ప్రేమ!

నాచీ : మరి నీ చదువై వెళ్ళిపోతున్నావుగా నీవు! అప్పుడు నీవెక్క డుంటావో? నేనెక్కడుంటానో ఎలా ప్రేమిస్తావు నన్ను?

కృష్ణపంతు : నీవున్న వూరికే వచ్చిపోతుంటాను. నిన్ను తరుచుగా కలుసు కుంటాను. ఆవిధంగానే నా ప్రేమ వెల్లడించుకుంటాను (కాసేపాగి) నాచీ! చెప్పవు నాన్నగారు నీతో చెప్పలేదా అన్న సంగతి?

నాచీ : నీకు తెలియక పోతుందా. నాచేత చెప్పించాలని గాని.

కృష్ణపంతు : మళ్ళీ అదేమాట. పోనియ్యిలే చెప్పక పోతే మానె.

నాచీ : నీతో చెప్పకుండా ఎలా ఉంటాను? ముందు నీవెలావుంటావో అని చూచాను?

(చెప్పబోతుంది - మరింత సిగ్గు నెమ్మదిగా) నీకు... నన్నిచ్చి...

(ఇంతలో దొడ్డివాకలి చప్పుడు)

అమ్మ వచ్చింది. తలుపు తీయాలి. మళ్ళా వస్తా.

(అంటూ లోపలికి పోయింది)

(తెర)

(కళ్యాణపంతు, ఏలేశ్వరుడు ఇంటి చావట్లో కూర్చుంటారు వాళ్ళ ఇద్దరి భార్యలు

లోపల గుమ్మంలో కూర్చుంటారు)

ఏలేశ్వరుడు : బావగారూ! ఇవాళ ఇంకో గణకుని దగ్గరనుంచి వివాహ మహోత్సవ పత్రిక వచ్చింది. సర్వవిధాలా రేపటి ముహూర్తమే మంచిదన్నారు. మనం పాణిగ్రహణ మహోత్సవ ప్రయత్నాలల్లో ఉండాలి. మీ ప్రయత్నాలల్లో మీరు ఉండండి.

కళ్యాణపంతు : అన్నిటికీ మీరే వున్నారు.

కల్యాణపంతు భార్య : పెళ్ళికొడుకు వారికి ఆడపనికి వొదినగారే వున్నారు.

ఏలేశ్వరుడు భార్య : మహానందము

ఏలేశ్వరుడు : ఊళ్ళో పెద్దలందరికీ రాత్రే చెప్పాను. రాజుగారికి అంతకు పూర్వమే విన్నవించాను. నజరానా డంకా, బాకాలు పంపిస్తానన్నారు. మహారాణిగారు స్వయంగా వచ్చి వధూవరులకు కట్నాలు చదివిస్తుందట.

కళ్యాణపంతు : శుభముహూర్త నిర్ణయానికి ఘటికాయంత్రం సంగతేమి ఆలోచించారు?

ఏలేశ్వరుడు : బోయీలు కులాలుణ్ణి పిలుచుకోవచ్చి యంత్రనిర్మాణం చేయిస్తామన్నారు.

కళ్యాణపంతు : యాజ్ఞీకుడో మరి?

ఏలేశ్వరుడు : అమ్మాయి పుట్టినప్పటినుంచీ రేవణశర్మ వివాహానికి యాజ్జీకం నాదంటు న్నాడు. అతడే చేయిస్తాడు. (కాసేపాగి) సమిధలకు నిన్ననే చెప్పి పంపించాను. వచ్చాయటగానీ చెట్టెక్కినవాడు కాలు విరిగిపడ్డాడట పాపం.

కళ్యాణపంతు : ఎవరో వస్తున్నారు.

ఏలేశ్వరుడు : మా బావమరది. మీ కోడలు మేనమామ. పంపిన మనిషి వెంటవుండి తీసుకో వస్తున్నాడు.

బావమరది : (కాళ్లు కడుక్కోని) బావగారికి బాబుగారికి నమస్కారం. చాలా సంతోషం ఐంది. అమ్మాయికి మంచి సంబంధం నిశ్చ యించారు.

ఏలేశ్వరుడు : నాయనా శర్మ! ఇంట్లోకి కావలసిన వన్నీ అమర్చవోయి. బావగారూ నేనూ ఇప్పుడే వస్తాము (అంటూ లేచిపోబోతుంటే) కులాలుడు : (వచ్చి నమస్కారం చేసి) చెప్పారండి బాబు చెయ్యాల్సిన పని. అదెంతసేపు. రేపు ప్రొద్దున్నే చేసినా చెయ్యవచ్చు. అనుగ్రహం ఉంచాలి.

(అని ప్రక్కకు తొలిగి నిలవబడతాడు)

ఏలేశ్వరుడు : సరేలే. బావగారు! మనము వెళ్ళి వద్దాం ఆ పనికి.

(ఏలేశ్వరుడు, కృష్ణపంతు నిష్క్రమణ)

(తెర)

(ఆడపిల్ల వారింట్లో)

(తెల్లవారింది. పెళ్ళి పందిట్లో ముగ్గులు వేసి వుంచారు. ఏలేశ్వరుడు జపం చేస్తూ అరుగుమీద కూర్చున్నాడు. రేవణశర్మ మాంగల్యానికి పసుపు పట్టిస్తూ వివాహానికి కావలసిన వస్తువులు పందిట్లోకి తెచ్చుకుంటాడు)

రేవణశర్మ : (కులాలుని చూచి) అరే! యంత్రం నిర్మించావా?

కులాలుడు : (నీటి తొట్టిలో ఒక క్రొత్త కుండకు సున్నం వ్రాసి దాని అడుగున బెజ్జము చేసి నీరు నెమ్మదిగా కుంభంలోనికి వచ్చి అనుకున్న కాలానికి కుండ మునిగిపోయేటట్లుగా పూర్వం నిర్మించిన యంత్రాన్ని చూపిస్తూ) అదిగో! చాలాసేపైంది బాబూ నిర్మించి. కానీ ఎన్నో కుండలు వృధాగా పగిలి పోయాయి. (చివర మాట పని తొందరలో రేవణశర్మ వినిపించుకోడు)

రేవణశర్మ : (ఎటో చూస్తూ) ఐదున్నర ఘడియలకు నిండేటట్లుగా చేశావా?

కులాలుడు : అవును స్వామీ!

రేవణ శర్మ : (ఇంట్లోకి హడావిడిగా పోయి) అమ్మాయికి మంగళస్నానం చేయించారా? కానియ్యండి త్వరగా. (బయటకు వచ్చి భజంత్రీలతో) కానియ్యండిరా మంగళవాద్యం, ఉ! అనండి.

(ధ్వనిగా మంగళవాద్యాలు)

(ఏలేశ్వరునితో) బాబూ! లేవండి మధుపర్కాలు తీసికొని రాండి, పోదాం వరపూజ కోసం (ఏలేశ్వరుని భార్య పందిట్లోకి వస్తే) అమ్మా! పసుపు, కుంకుమ, గంధం, అగరు వత్తులూ మరచిపోవద్దు. తొందర చెయ్యండి. (ఎందుకో రేవణ శర్మ చేతిలో మంగళసూత్రం క్రింద పడుతుంది) ఏలేశ్వరుడు : (చూచి) అమంగళం

(అంతా వరపూజకు పోతారు)

నాచీ : (యంత్రం చూడటానికి పోతుంది. ఆమెకు తెలియకుండానే మురిడీలో ముత్యం ఒకటి జారి యంత్ర కుంభంలో పడి నీరు నెమ్మదిగా వస్తూ వుంటుంది. కాలవ్యవధి గమనించరు. ఆ మంగళవాద్య ధ్వని, ఆదుర్దాలలో)

రేవణశర్మ : (వరుణ్ణి పెళ్ళి పందిట్లోకి తీసుకొని వచ్చి కూర్చోపెట్టి మహాసంకల్పం మొదలెట్టుతాడు. ఏలేశ్వరుడు యంత్రం మీదనే కళ్ళు పెట్టుకొని సుముహూర్తానికోసం వేచి వున్నాడు. కానీ అందులో ముత్యం అడ్డుకొని నీళ్లు రాకుండా చేస్తూ వున్నదన్న విషయం తెలుసుకోలేకపోయాడు)

యంత్ర పరిపూర్తికి ఎంతకాలం పడుతుంది?

ఏలేశ్వరుడు : బహుశః ఒక ఘడియకాలం.

రేవణ శర్మ : ఇంకా ఇక్కడ కొంత ఆలస్యం వుంది. సరిగా సుముహూర్తా నికే మాంగల్యం కట్టిస్తాను.

(కృష్ణపంతుతో) నాయనా “స్వాహా” అన్నప్పుడు ఇంధనం వ్రేల్చు... నీకు తెలిసిందే గదా!

(మంగళ వాద్యాలు)

రేవణ శర్మ : అయ్యా! ఇంకా ఎంతాలస్యం ఉంటుంది?

ఏలేశ్వరుడు : అరఘడియ కాలం.

రేవణశర్మ : అయితే వధువును తీసుకొని రండి గంపలో (నాచీని గంపలో తెచ్చి మధ్య తెర అడ్డం వుంచుతారు) కొంతసేపు అయిన తరువాత బెల్లం జీలకర్ర అదిమి ఒకరి నెత్తిన యింకొకరి చేత పెట్టిస్తాడు.

అబ్బాయీ! కృష్ణపంతు! ఈ మాంగళ్యము పట్టుకొని నాచీ మెడలో కట్టు.

(కృష్ణపంతు ఆవిధంగా చేస్తాడు)

ఏలేశ్వరుడు : సుముహూర్తానికే వివాహం జరిగింది. కృష్ణపంతు : (లేచి తల్లి దండ్రులకు అత్తమామలకు నమస్కారం చేసి వచ్చి పెళ్లి పీటలమీద కూర్చొని కొంతసేపుండి)

అబ్బా! అబ్బా! బాధ! అమ్మా! (అని కేక వేస్తాడు)

(సభ నిశ్శబ్దం అవుతుంది)

కళ్యాణపంతు, భార్య : నాయనా! ఏమిరా ఇది! చెప్పు నాయనా (అని దీనంగా అడుగుతారు)

కృష్ణపంతు : (మాట్లాడడు - క్రిందకు ఒరగబోతాడు)

ఏలేశ్వరుడు, కల్యాణపంతు : (ఇద్దరు వచ్చి పట్టుకుంటారు. ఇద్దరి భార్యలు కాళ్ళ దగ్గిర నిలవ బడతారు ఏడుస్తూ)

రేవణ శర్మ : నిశ్శబ్దంగా వుండండమ్మా. ఏడ్వకండి. ఏమీ లేదు. ఆలస్యం అవటం వల్ల శోషపోయాడు. కొంచెం పాలిప్పించండి.

కృష్ణపంతు : (లోపలినుంచీ వచ్చిన పాలు త్రాగి తెప్పరిల్లి) కాలం సమీపించింది... మాతా పితృ గురు ఋణాలు తీర్చుకోలేక పోయాను. ఇంకో జన్మలోనైనా ప్రయత్నం చేస్తాను. ఈ జన్మకు నా తుది నమస్కారాలు ఇవిగో (అని నమస్కరిస్తాడు. కళ్ళు త్రిప్పుతూ) నాచీ!... నిన్ను... నిన్ను... అన్యాయం చేస్తున్నాను... కానీ ప్రేమించాను... జ్ఞాపకం ఉంచుకో... శివాజీవివిగా... ఉంటే సంతోషిస్తుంది... నా ఆత్మ.... అని ఏలేశ్వర కళ్యాణపంతుల చేతులల్లో కట్టెలాగా ఐపోతాడు... పెళ్ళి పందిట్లో గగ్గోలుగా ఏడ్పు... వినలేక ఏలేశ్వరుడు బయటికి వస్తాడు. బయట... పూర్వం భిక్షుకగీతం పాడినవాడు మళ్ళా.


జంగమయ్యా గురుడ!
జంగమయ్యా! శివ!
దేహధారణ నున్న
దివ్య లింగమయా!

పుణ్యము పాపము
పూచిన పూవుల
వాసన వదలదు
వదలదు జన్మల. ॥జంగమయా॥


ముఖమున వ్రాసిన
ముందుగతిగా మాన్ప
తరమౌనె శివునకు
తా వ్రాసి యున్నను ॥జంగమయా॥

నిజప్రజ్ఞపై మనసు
నీకేలరా జీవ!
నీ పప్పు లుడకవుర ॥జంగమయా॥


అనేగీతం పాడుకుంటా ఏడుస్తూ వున్న పెళ్ళి పందిట్లోకి వస్తాడు. ఏలేశ్వరుడు వాని తత్త్వానికి మనస్సులో నమస్క రిస్తాడు)

(తెర)

- నవ్య సాహిత్య పరిషత్తు, గుంటూరు

(ఎ.సి. కాలేజ్, గుంటూరు 1939)

ఉత్పల


(మగధ దేశంలో ఒక సంఘారామం. ప్రశాంత వాతావరణం)

నందుడు : (వీణ తంతులు 'టింగ్ టింగ్' మని సవరిస్తూ రాగాలాపన చేస్తుంటాడు)

అమితావి : తమ్ముడూ! ఈ దినం బుద్ధ పూజానంతరం ప్రత్యేకంగా ఉపాసికల కోసం 'ఖేమా భిక్కుని' కథ చెప్పి కొన్ని ధర్మ ప్రవచనాలు వ్యాఖ్యానం చెయ్యమని భదంతు సెలవిచ్చారు.

నందుడు : (వీణ తంతులు మ్రోగిస్తూ) అయితే కానివ్వనా.

అమితావి : అది... ఆ తీవలు సవరించటం కొంతసేపు ఆపలేవూ?

నందుడు : క్షమించు. నెమ్మదిగా శ్రుతి చేస్తానులే.

అమితావి : (నిశ్చలంగా జ్ఞప్తి చేసుకుంటూ)


'నగామ ధమ్మో నో నిగమస్స ధమ్మో
నచాపియం ఏకకులస్స ధమ్మో
సబ్బలోకస్స సదేవ కస్స,
ఐసేవ ధమ్మో యదిదం అనిచ్ఛతాతి'


నందుడు : తంతులు మ్రోగించటం నెమ్మదిగా ప్రారంభించి పారవశ్యంలో క్రమక్రమంగా గొంతు కెత్తి ఆలాపన చేస్తాడు.

అమితావి : (కొద్ది కోపంతో) తమ్ముడూ!... నా పని అణుమాత్రం సాగటం లేదు. ఒక్కమాటు కొన్నైనా ప్రవచనాలు జ్ఞప్తి చేసుకుంటే గాని ప్రస్తుతానికి భిక్షాటనానికి వెళ్ళటం పడదు. అయినా! ఇప్పుడా పాత వీణ సవరించక పోతేనేం.

నందుడు : బుద్ధ పూజా సమయంలో నగరం నుంచి వచ్చిన ఆమె పాడటానికి అంగీకరించింది.

అమితావి : తమ్ముడూ! ఎవరామె? నేను చూడలేదే? నందుడు : అన్నా! నీవు కేవలం పుస్తకాలల్లో పురుగువై పోతున్నావు - అతిథిగా వచ్చిన బుద్ధోపాసికను గురించి అంత శ్రద్ధ వహించావన్నమాట!

అమితావి : ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది?

నందుడు : అపర శైలం మీద ఉన్న అమితాభ దేవాలయాన్ని చూపించ టానికని ఆమెను ఆనంద భిక్షువు తీసుకోవెళ్ళాడు.

అమితావి : అలాగా! ఆమె ఎలా ఉంది?

నందుడు : చాలా చక్కంది. బుద్ధ భగవానుని తపోభంగం చేయటానికి వచ్చిన మారకన్యలా ఉంది. మన ఆరామంలో ఉన్న పారావతాలతో ఇందాకటి నుంచీ ఆడుకొని ఆట నేర్పిందన్నా!

అమితావి : నేను పెంచే వాటితోనేనా!

నందుడు : అన్నా! ఆమె పాములను పెంచుతూ ఉందట!

అమితావి : పాములే! బాబో! - మతి పోలేదు గదా?

నందుడు : అయితే సంగీతం ఎలా పాడుతానంటుంది? అడగంగానే అంగీకరించింది.

అమితావి : అతిథులు ఎవరు వచ్చినా సంగీతం పాడుతారో లేదో ఆలోచిస్తావు తమ్ముడూ!

నందుడు : తప్పేముందన్నా - సంగీతం మీద అపేక్ష ఉంటే ప్రజ్ఞ పారమితుడి అపాంగ వీక్షణం ప్రసరించదా ఏం?

అమితావి : కళలంటే - అందులోనూ సంగీతమంటే - మన భిక్షుకులకు ఇంత ఆసక్తి మంచిది కాదు.

నందుడు : అయితే నాకు 'నిర్వాణం' పొందే యోగ్యత లేదనేనా?

అమితావి : నిష్ఠతో కొంతకాలం ప్రణిధాన చర్య నడిపితే

నందుడు : సంగీతంమీద ఆసక్తి తగ్గిపోవటానికే -ఉఁ - మరి పెంపుడు పక్షుల మీద అభిమానం పోగొట్టమని ఎన్నడైనా భగవానుణ్ణి అర్థించావా?

అమితావి : అది స్నిగ్ధమైన అహింసాచరణానికి సాధనం.

నందుడు : సృష్టి రహస్య విజ్ఞానానికి సంగీతం సర్వోత్తమమైన సాధనం అమితావి : తమ్ముడూ! నీకేం తెలియదు.

నందుడు : అన్నా! నీకు అంతకంటే తెలియదు.

అమితావి : (ప్రశాంతంగా ధర్మ ప్రవచనం చదవటం ప్రారంభిస్తాడు) 'న గా మ ధమ్మో నో నిగమస్సధమ్మో

నందుడు : బాబో! ఈ రొద భరించలేను (వీణ తంతులు 'టింగ్ టింగ్' మనిపిస్తూ నెమ్మదిగా రాగాలాపన చేస్తూ వెళ్ళి పోతాడు)

అమితావి : అమ్మయ్య! 'నచా పియం ఏక కులస్యధమ్మో (ఒక నర్తకి నడుస్తూ వస్తున్న కాలిగజ్జెల చప్పుడు)

ఉత్పల : మీ ఏకాంతతకు భంగం కలిగిస్తున్నాను, క్షమించాలి.

అమితావి : అమ్మా! ఇది అతిథి గృహం. మీ సత్కారం కోసం భదంతుల వారు నన్ను ఇక్కడ ఉండమని ఆజ్ఞాపించారు. అదుగో ఆ వేదిక మీద కూర్చోండి - కొంచెం దాహం తెచ్చి ఇవ్వ మంటారా?

ఉత్పల : అవసరం లేదు. (వేదిక దగ్గిరకు నడిచి వెళ్ళిన కాలిగజ్జెల చప్పుడు)

అమితావి : అమితాభ దేవాలయానికి వెళ్ళి రావటంలో శ్రమ పడినట్లున్నారు?

ఉత్పల : అలవాటు లేక కొంచెం శ్రమ అనిపించింది. శ్రావకా! ఇంత నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉండటం మీకు కష్టమనిపించటంలేదూ?

అమితావి : అమ్మా బుద్ధ పూజలో కాలం గడిచిపోతుంది.

ఉత్పల : ఏదో చదువుకొంటున్నట్లున్నారు?

అమితావి : సాయంత్రం 'ఖేమా' భిక్కుని గాధ చెప్పవలసిందని అగ్రశ్రావకులు సెలవిచ్చారు, ఒకమాటు చూస్తున్నాను.

ఉత్పల : ఈ ఆరామంలో చిలుకలనూ, గోరువంకలనూ పెంచి ఆట నేర్పింది మీరే కదూ?

అమితావి : (సంతోషంతో) అవును నేనే.

ఉత్పల : పాటలి నుంచి ప్రస్తుతం నేను వచ్చింది మీ పారావతాల, చిలుకల ఆట చూచిపోవాలనే. అక్కడ వీటికి ఎంత పేరు ఉందో మీకు తెలియదు. అమితావి : అలాగా అమ్మా! బుద్ధభగవానుని హయరత్నం పేరు వీటికి పెట్టుకున్నాను. - మీరు పాములకు ఆట నేర్పారట!

ఉత్పల : ఎందుకా ఆశ్చర్యం? వాటిని పెంచటం చాలా సులభం.

అమితావి : మొన్న ఆరామానికి ఒక ఉపాసిక శ్రావస్తి నుంచి వచ్చింది. ఆమె పులులను పెంచిందట!

ఉత్పల : ఆమె చపలా ఏమిటి చెప్మా!

అమితావి : ఆమె ప్రాకృతంలో కవిత్వం కూడా చెప్పుతుంది.

ఉత్పల : అయితే సుజాత ఐ ఉంటుంది. ఓ సుప్రసిద్ధ రాజనర్తకి.

అమితావి : ఆమె పెంచే పులులు... అమ్మా! అరుగో భదంతులు.

భదంతుడు : అమ్మా! పూర్వ శైలం మీద ఆనందభిక్షువుతో మాటాడి రావటంలో ఆలస్యమైంది.

ఉత్పల : భదంతా! ఇక్కడ నాకే లోపమూ జరగలేదు.

అమితావి : భదంతా! కొన్నాళ్ళ క్రితం ఒక నర్తకి వచ్చిందే ఆమె పులులను పెంచుతుందట విన్నారా?

భదంతుడు : ఆమె కవయిత్రి అని మాత్రం నాకు తెలుసు. అమ్మా, నీకామె తెలుసునా? ఇప్పుడెక్కడుంది?

ఉత్పల : ఔను! ఇప్పుడామె ఊరూపేరూ లేదు. పాపము కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది

(పక్షుల కిచకిచలు, కూతలూ దూరంనుంచి వినిపిస్తవి)

అమితావి : అదిగో! కంటకాలు. ఆకాశం నుంచి దిగి వచ్చినట్లున్నవి. దాహం ఇచ్చి వస్తాను. ('గు'గ్గూ అంటూ నిష్క్రమణ)

భదంతుడు : అమ్మా! జ్ఞప్తికి రావటం లేదు, ఆమె పేరేమిటన్నారు?

ఉత్పల : సుజాత...

భదంతుడు : ఔను సుజాత... ఈ అతిథి గృహంలో ఆమె వ్రాసిన గీతం ఒకటి చెక్కించింది. అదిగో. ఉత్పల : కొంతకాలం క్రితం ఈ గీతాన్ని నగరంలోని ఓ గోష్ఠిలో పాడి వినిపించింది.

భదంతుడు : అమ్మా నీవు అది పాడగలవా?

ఉత్పల : పాడగలను...


నావికా!
బ్రతుకన ఆశయె లేదిక!
కడలిని తడబడి
కానను దారెదొ
పెనుజడి అలజడి
ననుగన రావో - ॥నావికా॥


భదంతుడు : చాలా చక్కని కంఠమమ్మా నీది! గీతం వింటున్నంతసేపూ ఏవో అవ్యక్తానుభవాలు లీలగా ద్యోతకమైనవి.

ఉత్పల : మీరు ఎన్నడైనా కొంతకాలం పాటలిలో ఉన్నారా?

భదంతుడు : అనేక మారులు మేము అక్కడనే బుద్దపూజ ఆచార్య సమితావ్రీలతో కలిసి జరిగించాము.

ఉత్పల : ఎప్పుడైనా 'ఉత్పలపర్ణ' పేరు విన్నారా?

భదంతుడు : లేదమ్మా! ఆమె అంత ప్రసిద్ధురాలా ఏం?

ఉత్పల : రాజలోకంలో ఎప్పుడూ ఆమె పేరు చెవినబడుతూ ఉంటుంది. నాగరకుల మాట చెప్పనవసరంలేదు. వారికామె దేవతామూర్తి.

భదంతుడు : (ప్రశ్నపూర్వకంగా) ఆమె....

ఉత్పల : నర్తకి... గాయని కూడాను.

భదంతుడు : నీకేమైనా స్నేహితురాలా?

ఉత్పల : కాదు గర్భశత్రువు... అయితేనేం ఆమె అంటే నాకో వెర్రి అభిమానం. ఆమె దుస్థితిని చూస్తే నాకో కనికరం!

భదంతుడు : దుస్థితా? ఉత్పల : రాచలోకాలల్లోనూ, నాగరకుల్లోనూ దేవతామూర్తి కావటమే ఆమె దుస్థితి - జీవితారంభంలో ఆమె అతి పవిత్రురాలు... దారిద్ర్యము, దాస్యము! శరీరము అమ్ముకోవలసి వచ్చింది.

శీలభద్రుడు : పాపం!

ఉత్పల : ఈనాడో ఆమె పట్టింది బంగారం. ఆమె అపాంగ వీక్షణాన్ని అర్థించే ప్రభులోకం అపరిమితం. ఒకనాడు దాహం వేస్తే మంచినీరు త్రాగటానికి మృణ్మయపాత్ర లేని ఆమె ఈనాడు హేమ చషకాలల్లో మధువు క్రోలుతున్నది.

శీలభద్రుడు : కష్టాలు కలకాలం ఉంటవా అమ్మా!

ఉత్పల : భదంతా! ఆమె అనుభవిస్తూ ఉన్న ఐశ్వర్యానికి నేను చెప్పింది అతి స్వల్పమైన ఉదాహరణ.

శీలభద్రుడు : అమ్మా! కోపగించుకోకుండా ఉంటే నేను ఒక మాట అంటాను. ఆ ఉత్పలవు నీవు కాదు గదా?

ఉత్పల : (చకిత కంఠంతో) ఎందుకలా ప్రశ్నించారు?

శీలభద్రుడు : జీవయాత్రలో పడుతూ ఉన్న యాతనలను చెప్పుకొను ఆత్మబంధువులు లేని అనేకమంది అతిథులు మొదట అన్యాపదేశంగా ప్రారంభించి మాతో చెప్పుకోవటం పరిపాటి.

ఉత్పల : భదంతా! ఒకమాటు ఆమె విషాదాన్ని అపనయించుకోలేక ఇలా అన్నది ఒక గాథలో


'ఆణత్తం తేణ తుమం పయితో పహా ఏణ పడహ సద్దేణ
మల్లిణ లజ్జసి ణచ్చసి దోహగ్గే పా అడిఙ్జన్తే' -


అయితేనేం? నా ఘోర దుఃఖాన్ని ఆమె చవైనా చూడలేదు.

అమితావి : భదంతా! బుద్ధ పుష్పులవారు మిమ్మల్ని వెంటనే ఒక్కమాటు వచ్చి పొమ్మన్నారు.

భదంతుడు : అమ్మా! మళ్ళీ మాట్లాడుకుందాం.

(నిష్క్రమిస్తాడు)

ఉత్పల : మీరు నాకా గ్రంథం ప్రతి ఒకటి వ్రాయించి పెట్టాలి. ఉదయం కొన్ని

గాథలు చదివాను. చాలా బాగున్నవి.

అమితావి : తప్పకుండా.

ఉత్పల : మీరు సాయంత్రం ఖేమా కథ చెప్పవలెనన్నారు కదూ?

అమితావి : ఔను! ఆమె, సామ్రాట్టు బింబిసారుని అగ్ర మహిషి. సౌందర్య గర్వి. బుద్ధ దర్శనానంతరం సమస్తాన్నీ త్యజించి భిక్కునీ వ్రతదీక్ష స్వీకరించింది.

ఉత్పల : జీవితాంతం వరకూ దీక్ష పాలించిందా?

అమితావి : అతినిష్ఠతో.

ఉత్పల : అనాలోచితంగా దీక్ష పుచ్చుకున్నానని తరువాత చింత పడలేదుగా?

అమితావి : లేదు. ఆమెను భిక్షుక గణం అగ్రశ్రావికగా పరిగణించింది. ఉపాసికా! ఆమె జీవితాంతంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది.

ఉత్పల : ఏమిటది?

అమితావి : ధర్మ ప్రచార యాత్రలో అరణ్య మధ్యంలో దిక్కు తెలియక వెళ్లుతూ ఉంటే కార్చిచ్చులో చిక్కబడ్డది. భగవానుణ్ణి స్మరించింది. వెంటనే ఆయన లీలగా ఆమెను నడిపించి బయటపడవేశాడు.

ఉత్పల : సత్యమేనా?

అమితావి : థేరీ గాథలు నీవు నమ్మవా? తల్లీ!

ఉత్పల : అయితే భగవానుడు కార్చిచ్చులో చిక్కిన వాళ్ళందరినీ అలాగే కనికరిస్తాడా?

అమితావి : తప్పక అమ్మా! కంటకాలు రెండూ పోట్లాడుకుంటున్నవి, చిక్కు వదిలించాలి. (గు, గ్గూ, గూ, గుగ్గూ అంటూ నిష్క్రమిస్తాడు)

ఉత్పల : (విషాదాన్ని వ్యక్తం చేసే రాగాలాపన చేస్తుంటుంది)

నందుడు : (టింగ్... టింగ్ వీణ తీగలు మోగిస్తూ) అమ్మా! నీవు సంగీతము పాడతావట! నాట్యము చేస్తావట!!

ఉత్పల : అత్యవసరమైనప్పుడు... ఇందులో మీకేది ఇష్టం? నందుడు: సంగీతమంటే మహానందము. ఆరామంలో సంగీత సాధన లుండకూడదని అగ్రశావికులు శాసించారు.

ఉత్పల : మరి ఈ వీణ...

నందుడు : ఇది లేనిది నేను బ్రతకలేనని గుర్తించి నా ఒక్కడికే అనుజ్ఞ ఇచ్చారు. అతిథులు యధేచ్ఛగా పాడుకోవచ్చును.

ఉత్పల : మీ వీణ చాలా పాతదే!

నందుడు : (దైన్యంతో) చాలా పాతది. పదేళ్ల క్రితం పాటలిలో ఒక ఉపాసిక నా చేత పాడించి సంతోషంతో ఇది సమర్పించింది. అమ్మా! అయితే నీవు ఈ పాతవీణ మీద పాడలేవా?

ఉత్పల : శక్తి కొద్దీ యత్నించి మిమ్మల్ని సంతోష పెట్ట ప్రయత్నిస్తాను. శ్రావకా! నేను ఏ పాట పాడినా మీరేమీ అనుకోవద్దు.

నందుడు : నీ ఇష్టం వచ్చిన పాట కానీ అమ్మా!


ఉత్పల : 'నడిపింపవా ఓ ప్రభూ! నీవు నా నావ,
            భారాలను దేవ! బరువు మ్రోయగ లేను నడిపింపవా ॥
            పొడుపుమల నెత్తాన
            పొలిచి తడబడి కాంతి
            విడివడెడు పొలిమేర
            నేదూర తీరాలకో... ॥నడిపింపవా॥


నందుడు : వీణ మంచిదైతే పాట ఇంకా ఎంతో బావుండేది. ఎక్కడ నేర్చుకున్నావు తల్లీ ఈ పాట?

ఉత్పల : చిన్నతనంలో కోపం వచ్చి మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది.

నందుడు : పాపం!

ఉత్పల : బహుదూరం నడిచి నడిచి అలిసిపోయి ఓ సరస్సు దగ్గిర చెట్టు నీడన విశ్రమించాను. ఒక భిక్షువు అప్పుడు ఈ పాట పాడుతుంటే విని నేర్చుకున్నాను - ఈ గీతం ఈనాడు పాటలలో, మగధలో ఇంటింటా ధనికులైన తల్లులు పిల్లలకు నేర్పిస్తున్నారు. నందుడు : అంత ప్రసిద్ధమైన పాటా తల్లీ!

ఉత్పల : ఉత్పల నిత్యమూ రాజలోకాల్నీ, నాగరకులనూ, ఈ పాటతోనే ముగ్ధులను చేస్తున్నది. పాడగల వాళ్ళకు ఈ పాట బ్రతుకు తెరువు కల్పిస్తున్నది.

నందుడు : అమ్మా! ఏమిటా వెర్రిచూపులు - అన్నా... అన్నా!

ఉత్పల : నా హృదయభారాన్ని లోకం ఎలా అర్థం చేసుకోగలుగు తుంది. నా చుట్టున్న పిశాచాలు నన్ను బంధిస్తున్నవి.

అమితావి : పిశాచాలే, బాబో !

నందుడు : అన్నా! ఈమెకు మతిభ్రంశం కలుగుతుందేమో!

అమితావి : పాములు పెంచుతున్నది కదూ?

నందుడు : 'ఇస్' - ఆమెకు వినపడితే బాగుండదు.

అమితావి : మనకు అతిథిగా వచ్చింది. - అమ్మా!

ఉత్పల : ప్రణయము! దుఃఖం - ఆశ, నిరాశ! కరుణా క్రౌర్యాల అవధులు చూచాను. మహా పట్టణంలో కంఠం కమిలిపోయేటట్లు అమృతగాన మొలికించినా కమికెడన్నం దొరకని కాఠిన్యం! బాధ! అబ్బా!

నందుడు : ఉపాసికా! నీ పాట మహాద్భుతంగా ఉంది.

ఉత్పల : (ఉద్వేగంతో) 'తుందిలా! నాకు ప్రశాంతి గంగా గర్భంలో దొరుకుతుందన్నావు గదూ? చేత చిరుపాపతో నిస్సహాయనై, నిర్ధననై, నిరాహారనై నిన్ను పాదాలంటి వేడుకొన్నానే - డబ్బు! డబ్బు!

అమితావి : ఉపాసికా! ఉపాసికా!!

ఉత్పల : మాధ్వీ! కౌముదీ జాతరంలో నా నాట్యం! త్వరగా అలంకరించు. సభ ముగ్దమై పోవాలి... అబ్బా!

నందుడు : అమ్మా! మీకు దేహారోగ్యం సరిగా లేదా?

ఉత్పల : ఔను! దానివల్ల నాకేం లోపం. 'మహాజనులారా ఉత్పలకు ఈ దినం మన స్వాస్థ్యం లేదు. నాట్యం చెయ్యదు. ..... (పెద్ద పెట్టున నవ్వుతుంది) వెళ్ళిపొండి, వెళ్ళిపోండి. భదంతుడు : నందా! ఏమిటిది?

నందుడు : నేను పాడమంటే పాడుతుండగా ఉపాసికకు మతి భ్రమణం కలిగింది.

అమితావి : అన్నీ అర్థంగాని మాటలు మాట్లాడుతున్నది.

నందుడు : భదంతా! ఇంత అందగత్తెకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో - సంపన్నురాలి వలెనే కనిపిస్తున్నదే!

భదంతుడు : నాయనా! మీరు పూజా మందిరానికి వెళ్లిపోండి. ఉపాసికా!

ఉత్పల : భదంతా!

భదంతుడు : ఈ ఏకాంత ప్రదేశం నీకు క్రొత్త చేసినట్లుంది.

ఉత్పల : సుజాత గీతం వల్ల నా పూర్వ జీవితంలో కొన్ని ఘట్టాలు, స్మృతికి వచ్చినవి. అందువల్ల మనస్సు కొంత కళవళపడి ఉంటుంది తండ్రీ! ఏడేండ్ల నాడు ఎర్రని ఎండలో తిండిలేక మలమల మాడి చనిపోయిన నా ముద్దుబిడ్డ 'ఆకలి! ఆకలి' అని కంటిముందు రోదించాడు.

భదంతుడు : అమ్మా! అతణ్ణి గురించి ఆలోచించడం మానివెయ్యి. ఇనికిల స్వర్గంలో గంధర్వుడై అతడు యథేచ్ఛగా పాడుకుంటుంటాడు.

ఉత్పల : తండ్రీ! అతణ్ణి బ్రతికించుకోటానికే ఈ సంగీతం నాట్యం నేర్చుకున్నాను. కీర్తి గడించాను - ధనం ఆర్జించాను. ఇప్పుడు ఎవరికోసం?

భదంతుడు : ఇక నీకు పిల్లలు లేరా?

ఉత్పల : (వికటంగా నవ్వి) లోకంలో అందంగా కనుపించే పిల్లలందరూ నా పిల్లలే. దరిద్రురాలైనప్పుడు, పవిత్రురాలై నప్పుడు నే పాడిన పాట, ఆడిన ఆట ఎవర్నీ ఆకర్షించలేదు. దుర్వృత్తికి అలవాటు పడి నగర నర్తనశాలలో వేసిన గంతులన్నీ శాస్త్రార్థ వ్యాఖ్యానాలైనవి. లోకం గుడ్డిది. కళను అది అందుకోలేదు. లోకం కళకు శత్రువు! ప్రబల శత్రువు!!

భదంతుడు : అమ్మా! అంత ఉద్వేగివి కాబోకు.

ఉత్పల : భదంతా! లోకానికి ప్రేమ లేదు సత్యం లేదు శౌచం లేదు. భదంతుడు : అమ్మా! అందుకనే భగవానుడన్నాడు.


'యేవా గరత్తాను పతంతి సోతం
సయం కతం మక్కట కోవ జాలం
పతంసి చేత్వ నవజంతి ధీరా
అనపేర్ధినో సబ్బ దుక్‌ఖం పహాయ'


ఉత్పల : భదంతా మీతో వెనుక ప్రసంగించిన ఆ ఉత్పలను నేనే! కడుపులో బడబాగ్నితో నిత్యమూ నాగరకలోకానికి ఆనందా మృత ప్రదానం చెయ్యవలసిన ఆ ఉత్పలను నేనే!!

(ఆరామ ఆలయంలో నుంచీ ఘంటికలు వినిపిస్తవి)

భదంతా! ఈ ఘంటికా నాదంలో ఎంత శీతలత్వమున్నది.

భదంతుడు : బుద్ధ పూజకు పిలుపు వినిపించింది.

ఉత్పల : (సోత్సాహంతో) ఈ ఆశ్రమ వాతావరణం ఎంత తాపా పనోదకంగా ఉంది.

అమితావి గొంతుక :


'నసంతి పుత్తా తాణాయ నపితా నపి బాంధవా
అంతకే నాధిపన్నస్య నవీథి జ్ఞాతిషు తాణతా
ఏతమత్ ఖవసం జ్ఞాత్వా పండితో సీల సంబుతో
నిర్వాణగమనం మగ్గగం ధిప్పామేవ విసోధయె'


ఉత్పల : భదంతా! అది అమితావి గొంతుకేనా? ఎంత అనునయంగా ఉంది

నందుని గొంతుక :


'కర్మ స్య కారకో నాస్తి
విపాకస్య చ వేదకో,
శుద్ధ ధర్మం ప్రవర్తంతి
యే వేదం సమదర్శనమ్'


ఎ.ఐ.ఆర్. హైద్రాబాద్ 7-6-1949

ఏ.క.తా.ర


కోప్పడకమ్మా! కోప్పడకు, నీవు తప్ప నాకు కలిగే అనుమానాలను తీర్చేవాళ్లు ఎవరమ్మా! నాన్న చూతామా అంటే అంత చదువుకున్నా ఆ మార్వాడీ దగ్గర గుమాస్తా. నిమిషం తీరిక లేదు. ఉదయం పోతే సాయంత్రం గాని ఇంటికి రారు. వచ్చిన తర్వాత బడలిక. ఎప్పుడు చూచినా ఏదో కష్ట సముద్రంలో ఈదుతున్నట్లు ఉంటారు. ఇక మాట్లాడించటానికి నాకు ఏమి మనస్కరిస్తుంది? అవకాశమూ ఉండదు. బళ్లో చదువుకుంటున్నామన్నమాటేగాని మా అనుమానాలను తీర్చే గురువులు కారు వాళ్లు. ఎందుకూ పనికిరాని విషయాలు ఎన్ని చెప్పినా ఫరవాలేదు. మేము ఏవన్నా ప్రశ్నలు వేస్తే అప్రస్తుతమనీ, అధిక ప్రశంసనీ, ఇప్పుడు కాదనీ చేతగాక గర్వితనం వల్లా తప్పించుకొంటూ ఉంటారు.

తల్లి : తప్పు! మేష్టర్లను నిందించకూడదు.

కొడుకు : (గడుసుగా) ఇక మాకు చెప్పేదెవరమ్మా మరి! మా భావాలను, జిజ్ఞాసను చంపుకోవలసిందేనా? మేమూ 'డూడూ వెంకన్నలము' ఐతే చూతామనేనా మీ అందరి అభిలాష... పోనీలే నీకేదైనా పని ఉంటే చూచుకో.

తల్లి : (కంటికి నీరు తిరిగి ఒక చుక్క బుగ్గమీద పడి చిందుతుంది) అంతలో ఆవేశము. అంతలో నైరాశ్యము. చెప్పుమరి ఏం కావాలో?

కొడుకు : నిమిషాల మీద అయ్యే జవాబులుండే ప్రశ్నలా! అన్నిటికీ సమాధానాలు చెప్పేంత వీలుంటే అడుగుతా! కాకపోతే మరొక తడవ అడుగుతాలే... (తదేక దృష్టి)

తల్లి : (ప్రేమార్ద్ర దృక్కులతో) పని కాలేదన్న విసుగులో ఏదో అన్నాను. దానికింత చింతామగ్నత ఎందుకు? తండ్రీ! నీ అనుమానాలను తీర్చకుండా నేను చేసే పనిమాత్రం ఏమి పాడైంది. నే చదువుకున్న చదువెందుకు! చట్టుబండలకా! మీ నాన్న వచ్చేటప్పటికి ఆ రెండు ఇళ్లూ చిమ్మి రెండు కప్పుల కాఫీ కాచలేక పోతానా!

కొడుకు : అమ్మా! అయితే అడగమంటావా? తల్లి : కానియ్యి నాయనా! నీ ఎదురుగా కూర్చొనే జవాబులు చెపుతాను - నాకు తెలిసినంతమటుకు.

కొడుకు : అందరికీ ఒకటే రకం ఇళ్లు లేకుండా ఒకళ్లకు బంగళాలు, ఒకళ్లకు పెంకుటిళ్లు, మన ఇంట్లో పనిచేసే రామి మొదలైనవాళ్లకు పూరిళ్లూ ఉన్నాయే దానికి కారణం ఏమిటమ్మా!

తల్లి : (నవ్వుతూ) చాలా చిన్న సమాధానము. డబ్బు బాగా ఉంటే బంగళాలు, కొంచెం తక్కువగా ఉంటే పెంకుటిళ్లు, అసలే లేకపోతే పూరిళ్లు.

కొడుకు : (మూతి బిగించి) నవ్వులాట కాదమ్మా. నా మనస్సు ఎంతో ఆందోళనగా ఉంది. వాళ్లకున్న డబ్బు వీళ్ళకు ఎందుకు లేదు?

తల్లి : ఎందుకు లేదు, అంటే - లేదు కాబట్టే.

కొడుకు : ఏమిటే అమ్మా ఆ పెడ సమాధానాలు!

తల్లి : అల్లాంటి ప్రశ్నలు వేస్తే మరి ఏం జవాబు చెప్పేదిరా?

కొడుకు : పుడుతూనే వాళ్లు ఏ లోకంలో నుంచైనా, తెచ్చుకున్నారా మరి!

తల్లి : లేదు. కాని వాళ్ల పూర్వులు సంపాదించి ఇచ్చిపోయినారు...

కొడుకు : వాళ్లకు మటుకూ ఇక్కడిదేగా డబ్బు సంపాదించటానికి. న్యాయాన్యాయాల భయము, పాపభీతి లేకుండా సంపాదిస్తే మటుకు వాళ్లదౌతుందా! తోడి మానవులు నీచాతి నీచంగా ఉంటే వాళ్ల హృదయం ఎలా సహిస్తుంది. అమ్మా! వాళ్ళకు హృదయం అనేది లేదేమో!

తల్లి : డబ్బు దగ్గిర నువ్వన్నవన్నీ అవసరం లేదు. దేవుడనేవాడు ఉంటే అతడు గూడా వాళ్లకే సహాయం చేస్తాడట.

కొడుకు : అమ్మా! దేవుడంటే జ్ఞాపకం వచ్చింది. నిన్న ఎవరో బ్రాహ్మడు వచ్చి కార్తిక సమారాధన చేయబోతున్నాము చందా వేయాలన్నాడు నాన్నను. ఆ డబ్బంతా పోగుచేసి మనబోటి బీదవాళ్ళకు ఎవరికన్నా ఇస్తారా ఏమే!

తల్లి : పిచ్చి నాయనా! నువ్వు చాల చిన్నవాడవు. నీకింకా ఏమి తెలియ దోయి. ఆ బ్రాహ్మలదేవుడు బీదలకు ఇవ్వమనేవాడు కాదు. వాళ్ల కడుపుకు తినమనేవాడు. కొడుకు : అమ్మా! నాకు తెలియక అడుగుతాను. బ్రాహ్మలదేవుడనీ, కోమట్ల దేవుడనీ, శూద్రుల దేవుడనీ, ఇంకోళ్ల దేవుడనీ దేవుళ్లు ఇంతమంది ఉంటారా ఏమిటే! (ఆశ్చర్యంతో) దేముడు ఒక్కడే గదమ్మా!

తల్లి : మనదేశంలో దేముళ్ళకేమి కొదవ నాయనా! కనపడ్డ చెట్టూ పుట్టా, రాయీరప్పా, గోడగొబ్బే అన్నీ దేవుళ్లే! దేముడు కాని వస్తువేమిటి? కానీ, సాటి మానవుణ్ణి వీటి అన్నిటికన్నా కనాకష్టంగా చూస్తారు. 'దేవుళ్లు ఇంత మందా'! అన్నావు? అసలు ఒకడున్నాడా ఏమిటి? ఆ విషయాన్ని గురించి పెద్దపెద్దవాళ్లకే అనుమానం. నిజంగా ఉంటే మనబోటి పేదవాళ్లకు ఎంతో మందికి ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే చేతగాని దద్దమ్మలాగా గుడ్లుమిటకరించి చూస్తూ కూచుంటాడా ఏమిటి!

కొడుకు : (మరింత ఆశ్చర్యంగా చూస్తూ)

అయితే దేముడే లేడంటావా అమ్మా?

తల్లి : ఉన్నాడేమో నీవే ఆలోచించు.

కొడుకు : అలా అయితే మరి మనం ఈ బ్రాహ్మళ్లకు సంతర్పణలకనీ, సమారాధనలకనీ, చందాలు ఇవ్వటం దేనికి, ఆ డబ్బు బీదవాళ్లకు ఉపయోగించకపోతే?

తల్లి : మనం కడుపుకు తిన్నా తినకపోయినా దేవుళ్ల పేరా, దయ్యాల పేరా జీవించే ఆ పుణ్యపురుషులకు ఈ మొక్కుబళ్లన్నీ చెల్లిస్తూ వాళ్లను పోషించాల్సిందే. లేకపోతే మనకు పాషండులనీ, చార్వాకులనీ, నాస్తికులనీ పేర్లు పెడతారు. వాళ్లకు దేముడిమీద నిజంగా గాఢమైన నమ్మకం ఉన్నా లేకపోయినా నమ్మకం లేదన్నవాళ్లను నలిపివేసి అష్టకష్టాలు పెట్టటానికి వాళ్లంతా ఒకటే అవుతారు. బీదలకు ఉద్యోగాలు దొరకవు. చాకిరీ చేసుకొని బతకడానికి కూడా చొరవ ఇవ్వకపోవటం వల్ల కూలినాలీలు దొరకవు. చిల్లిగవ్వ చేతిలో ఆడదు. ఎందుకైనా...

కొడుకు : ఉండు! అయితే ధనికులు ఎక్కువమంది ఉంటారా? బీద సాదలు ఎక్కువమంది ఉంటారా?

తల్లి : ధనికులు చాలా తక్కువ మంది. నూటికి ఏ నలుగురో ఐదుగురో ఉంటారు.

కొడుకు : అఁహ. వాళ్ళతో యుద్ధం చేసి ఓడించి ఆ డబ్బంతా బీదవాళ్లు సమంగా పంచుకుండేటట్టు ఎందుకు చేయగూడదు!

తల్లి : అది అంత సులభసాధ్యం కాదు. వాళ్లకు పోలీసుల దన్ను చాలా ఉంటుంది. కొడుకు : పోలీసులు కూడా బీదవాళ్లే కదా, వాళ్లను కూడా ధనికులు బాధ పెడుతుంటారే మరి వాళ్లకు డబ్బుగలవాళ్లంటే ఎందుకు కోపముండదో!

తల్లి : వాళ్ల సంగతి మనం మాట్లాడకూడదు. ఎవరన్నా వింటే కొంప మీదికి వస్తుంది.

కొడుకు : పోనీవే. పేదవాళ్లంతా ఒకటై ధనికులకు ఏ పనీ చేయమని అంటే వాళ్లు ఏం చేస్తారో!

తల్లి : అటువంటివాటిని 'సమ్మె'లంటారు. అవి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ పూట కూటికి లేనివాళ్లు గదూ వీళ్లు. ఇందులో కొంతమందికి మరింత డబ్బాశ పెట్టి మిగిలిన వాళ్లలో నుంచీ చీలదీస్తారు. అంతలో వీళ్ల సంఘబలం తగ్గిపోతుంది. చదువుకున్నవాళ్లు పోయి మంచి ఏదైనా చెప్పబోతే తాగి తందనాలు వేసేవీళ్లు మంచి చెడ్డలు అర్థం చేసుకోలేరు. ముందు రూపాయి వస్తుందిరా అని మనం చెప్పినా ఆ నిమిషాన 'కంటికి కల్లుకు - కావలసిన పావలా' కనిపిస్తే ధనికులకు దాసోహం చేస్తారు.

కొడుకు : అమ్మా! వాళ్లు ఉత్త అమాయకులు ఏ అన్నెం పున్నెం ఎరుగరు చదువు శూన్యం.... నా మనస్సుకు వాళ్లకేదైనా సహాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉందమ్మా! మొదట్లో ఏం జెయ్యమంటావు నన్ను?

తల్లి : ఏమిటి చేసేది! నీ మొహం, ఆ ఆలోచన మానేసి నిద్దరపో కాసేపు. ఇంతలో నాన్న వచ్చే వేళౌతుంది. లేచి కాఫీ తాగి మాట్లాడుదువు గాని తీరికగా. నేనింకా కుంపటి రాజెయ్యాలి.

కొడుకు : నిద్దర!... నిద్దరే!! పట్టదు. ఎలా పడుతుంది!? ధనవంతుల మోటార్లు అరిగిపోతాయని పేదవాళ్ల చెవులు పిండి వసూలు చేసిన డబ్బుతో వాళ్లు తినటానికి లేకుండా మలమల మాడిపోతున్నా తారురోడ్లు వేయిస్తారటగా?

తల్లి : కన్నా! ఎవరు చెప్పారురా నీకిదంతా?

కొడుకు : ఎవరైతేనేం గాని అమ్మా! నా కన్నా అందంగా లేడు. తెలివి తేటలూ లేవు ఆ కోమటివాళ్ల అబ్బాయి మహాగర్వి, టాకు-టీకుగా కారులో బడికి వచ్చి ఇంటికి పోతుంటే కడుపులో ఏమిటో మంటగా ఉంటుంది. ఇకముందు వాణ్ణి చూచి అసహ్యించుకొంటాను. ఎగతాళి చేస్తాను!! ఏడిపిస్తాను!! రాయి తీసుకొని వెనకగుండా వాడి కారు అద్దాలు పగలగొడతాను!! అద్దం పెంకులు గుచ్చుకొని తల చిల్లిపడి రక్తం కారుతుంది. అంతటితో సరిపోతుంది. వాడి రిమ్మ అణుగుతుంది... మర్నాటినుంచీ బళ్లోకి నాతోపాటే నడిచి వస్తాడు. అప్పుడు అంతా వాణ్ణి చూసి నవ్వుతారు. ఆఁ వాడికి మూడిందిలే! అంతపనీ జరిగి తీరుతుంది.

తల్లి : (ఆశ్చర్యాన్ని కప్పి పుచ్చుతూ ఉన్న ఆదుర్దాతో) ఆదిమటుకు చెయ్యవద్దు. నన్నూ నాన్ననూ చంపుకున్నట్లు.

(ప్రేమార్థ కంఠంతో)

బుజ్జీ! అలసిపోయావు. మళ్ళీ జ్వరం వస్తుందేమో! ఇక మాట్లాడకు. కాస్త నిద్దరపో నాయనా! నేను ఇంట్లో పని చూచుకోటానికి పోతున్నా. సరేనా తండ్రీ!

కొడుకు : (బలహీనత వల్ల శరీరం అలిసిపోయిందీ నెమ్మదిగా) అలాగే. (కుర్చీలోకి నెమ్మదిగా మేను వాలుస్తూ ఒరిగి నిద్ర పోతాడు. తల్లి కొంచెం సేపు చూచి నిద్ర పట్టిందని ఇంట్లోకి పని చూసుకోనుపోతుంది)

ద్వితీయ రంగము

(సమయము ఆ రోజే మధ్యాహ్నం 3 గంటలు. కొడుకు నిద్ర లేస్తాడు. కనిపెట్టుకుని కూర్చున్న తల్లి ఒక చేతిలో కాఫీ కప్పు రెండో చేతిలో సాసరు పట్టుకొని నిలవబడి ఉంటుంది. తల్లి చేతిలో కాఫీ కప్పు సాసరు పుచ్చుకొని, సాసరులో కొంత కాఫీ పోసుకుని తాగుతూ)...

కొడుకు : అమ్మా! నాన్న రెండున్నరకు వచ్చి నాతో కొంతసేపు మాట్లాడతానన్నారే! వచ్చారా?

తల్లి : వచ్చారుగాని కాఫీ తాగి వెంటనే వెళ్ళిపోయినారు.

కొడుకు : (కాఫీ త్రాగటం ఆపి) నాన్నకు నాతో మాట్లాడటమంటే విసుగు కామాలి. కంటికి కనపడకుండా తప్పించుకుని తిరుగుతుంటారు.

తల్లి : కాదు! నాయినా, కాదు. వారికి నీతో మాట్లాడటమంటే ఎంతో సరదా! ప్రక్క ఇంట్లో భూషణంగారు మీ అబ్బాయి చాలా తెలివిగల వాడండీ అని అంటే ఆయనకు ఎక్కడలేనీ ఆనందమూ కూడా. కానీ బహు కష్టజీవి. ఒకసారి అనుభవం అవటం వల్ల ఉద్యోగం విషయంలో బహుజాగ్రత్తగా ఉంటారు. మన మార్వాడీ ఎవరో రైతుకు డబ్బు అప్పు పెట్టి ఆస్తి తాకట్టు పెట్టించుకుని అతడు ఇవ్వలేకపోతే దావా వేసి రాబట్టుకుంటున్నాడట! ఆ ఆస్థిని ఇవాళ కోర్టులో వేలం వేస్తారట. అక్కడ ఉండకపోతే కొంప మునిగి పోతుందని ఆ కప్పు కాఫీ తాగి ఉరుకులు పరుగులు పెడుతూ పరుగెత్తారు కోర్టుకు. నీతో మాట్లాడుతానన్న సంగతి కూడా జ్ఞాపకం ఉంది. టైములేదని అన్నారు. వాడు అలసి నిద్దర పోతున్నాడులెండి. లేపటం ఎందుకు అని నేను కూడా అంటే ఒక ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయారు.

కొడుకు : (కాఫీ కప్పు, సాసరు తన కుర్చీకి దగ్గరగా క్రింద పెట్టి)

ఉద్యోగ విషయంలో పూర్వం నాన్న ఏదో అనుభవించారన్నావు అదేమిటమ్మా!

తల్లి : (దీర్ఘ నిశ్వాసము) నీవు పుట్టేటప్పటికి మీ నాన్న తాలూకా ఆఫీసులో హెడ్ గుమస్తాగా ఉండేవారు. నెలకు నూరు రూపాయల జీతం. అప్పుడు మన సంసారం సంగతి చాలా బాగా ఉండేది. ఏ లోటూ లేదు. నిన్ను ఎత్తుకొని ఆడించటానికి బజారునుంచీ కావలసిన సరుకులు తెచ్చి పెట్టటానికి ఇద్దరు దాసీవాళ్లు, ఇంట్లో వంటపనికి ఒక మనిషి ఉన్నారు.

కొడుకు : (ఆత్రుతతో) తరువాత ఏమి జరిగిందేమిటి?

తల్లి : (వినపడదు) నేను ఎప్పుడూ పుస్తకాలూ, పత్రికలూ చదువుకుంటూ కాలం వెళ్లబుచ్చేదాన్ని. నాన్న పేటంచు జరీపంచలు, ఖండువాలు, సిల్కు చొక్కా కోటు తప్ప కట్టేవారు కారు ఆ రోజుల్లో. ఇప్పుడు కష్టాలకు కాగి శరీరం నల్లబడి పోయింది కాని అప్పుడు వంగ పండు చాయగా ఉండేది. అంతేనా ఎంతో మంది మనకు...

కొడుకు : అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవు. చివరికేం జరిగింది.

తల్లి : వినుమరి. అన్నిటికీ తొందరేమిరా! అప్పుడు గాంధీ మహాత్ముని ప్రభ బాగా సాగుతూ ఉంది. స్వాతంత్ర్య పోరాటం కోసం ఉద్యోగస్తులందరినీ ఉద్యోగాలకు రాజీనామాలిచ్చి ఉద్యమంలో దిగవలసిందని ఉద్బోధించాడు. వేలకు వేలమంది ఉద్యోగం ఒదులుకొని మొన్న నీకు మీ నాన్న చెప్పారే, ఆ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వాళ్ళల్లో నాన్న కూడా ఒకరు. తరువాత జైలుకు కూడా పోవలసి వచ్చింది.

కొడుకు : సంతోషంగా పోయినారనుకుంటానమ్మా! చాలా మంచిపని చేశారన్నమాట. స్వతంత్రత కోసం పోరాడటానికి చేశారాపని. అందులో నష్టం ఏమిటి? తల్లి : చేసిన పని మంచిదే. కానీ తరువాత - తరువాతే ఇంట్లో జరిగే స్థితి కనిపించలేదు. అందుకోసమనే ఈ మార్వాడీ కొలువులో ఇరవై రూపాయలకు గుమాస్తాగా చేరవలసి వచ్చింది. గాడిద చాకిరి చేస్తూ ఆ నీచునికి ప్రతినిమిషమూ 'చిత్తము-చిత్తము' అనవలసి వచ్చింది. ఇంకో ఉద్యోగం ఏదీ దొరకక పోవటం వల్ల. (కన్నులవెంట అశ్రువులు కారుస్తూ)

కోమల హృదయం మొదట్లో మొదట్లో ఎంతో బాధపడ్డది... ఏం చేస్తాము

కొడుకు : అయితే అమ్మా! నాన్న ఇప్పుడు ఆ మార్వాడీ దగ్గర ఉద్యోగం ఎందుకు మానుకోగూడదు?

తల్లి : సంసారం ఎట్లా వెళ్లుతుంది. తండ్రీ! నీవు ఉత్త అమాయకుడివిరా!... మనకు పూర్వార్జితమైన ఆస్తి సెంటు భూమి కూడా లేదు.

కొడుకు : (కొంచెము సేపు ఆగి) మనకు వచ్చిన కష్టాలకంతా దయా దాక్షిణ్యం లేని ఆ ధనికుల ఇళ్లల్లో డబ్బు మూలుగుతూ ఉండట మేనా?... అమ్మా మనకు పాలించే రాజు ఆ డబ్బంతా మనకు ఎందుకు పంచి పెట్టించ కూడదు

తల్లి : (నెమ్మదిగా) ఆయన కూడా మనను దోపిడి చేసేవాడే! నిజంగా సుకుమార హృదయం కలవాడైతే సాటిమానవులను పరిపాలించ టానికి ఒప్పుకుంటాడా! రాజ్య పరిత్యాగం చేస్తాడు. ప్రభువంటే గొప్ప బందిపోటు దొంగ. బెదిరించి పన్నులు వసూలు చేస్తాడు.

కొడుకు : ధనికుల మీద తిరుగుబాటు చేస్తే బాగుంటుంది. చచ్చిపోయినా వీరస్వర్గం కదూ... డబ్బుగలవాళ్ల కూతురైనా స్వరాజ్యం ఎంతో మంచి పిల్లమ్మా! రోజూ బళ్లో నుంచి నడవలేక నడవలేక వస్తూ ఉంటే డ్రైవరు చేత మధ్యలో కారాపించి నన్ను ఎక్కమని బతిమిలాడేది చాలామాట్లు. నేను, కారంటే నాకు పరమ అసహ్యం, నడిచే వస్తాను, వంటికెంతో కులాసాగా ఉంటుందంటే నావైపు దీనంగా చూస్తూ ఉండేది. ఇంతలో వాళ్ల కారు డ్రైవరు కారు తోలుకుపోయేవాడు. ఎంతో మంచిదమ్మా! స్వరాజ్యం. (తల్లి ముఖవిన్యాసాలు పరీక్షిస్తూ) నేనంటే ఆ అమ్మాయికి అమితప్రేమ ఎందుకోననుకున్నాను!...

తల్లి : (నవ్వుతూ) ఏం చేసిందేమిటి? కొడుకు : ఒకనాడు మాకు డ్రిల్ పిరియడ్ వచ్చింది. మేష్టరుగారు చెట్టుకింద ఎవరికి తోచింది వాళ్లను ఆడుకోమన్నారు. నన్నెవరూ పిలవకపోతే దిక్కులు చూస్తూ ఉన్నాను. 'స్వరాజ్యం' నా దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని ఆడుకొందాం రమ్మని పిలిచింది. పిల్లలందరూ ఒకళ్ల వెనకాల ఒకళ్లు మా దగ్గరికి చేరటం మొదలు పెట్టారు. అప్పుడు స్వరాజ్యం మేము ఇద్దరమే ఆడుకుంటాము. మీరు పోండి, అల్లరి చేస్తే మేష్టరుగారితో చెప్పి కొట్టిస్తానని భయపెట్టి వాళ్లను వెళ్లగొట్టింది. చివరకు ఆ రోజున ఇంటికి వచ్చేటప్పుడు నన్ను కారులో ఎక్కమని ఎంతో బతిమలాడితే ఎక్కాను. దిగబోయే ముందు (దృష్టి ఇంకో వైపు మార్చి)

సుకుమార్.... నిన్నే.... పెళ్ళి.... చేసుకోవాలని... ఉంది అన్నది.

తల్లి : (నవ్వుతూ) అంటే నువ్వేమన్నావు?

కొడుకు : సరేనన్నాను.

తల్లి : పిచ్చినాయనా! ఎంత అమాయకుడివిరా! వాళ్లు ధనికులు. మనం పేదవాళ్లం. మనకిస్తారుటరా పిల్లను వాళ్లు.

కొడుకు : వాళ్లిచ్చేదేమిటి! స్వరాజ్యం నన్ను తప్ప ఇంకొకణ్ణి పెళ్ళి చేసుకోనని పట్టుపడితే వాళ్లేం చేస్తారేం!

తల్లి : (ముద్దుగా) ఏడిచావులే. వాళ్లెవరైనా మన ప్రసంగం వింటే తిడతారు.

కొడుకు : (కోపంతో) మనం ఏమి తప్పిదం చేశామని!

తల్లి : పోనియ్యరా! ఆ ప్రశంస. అదెందుకు ఇప్పుడు.

కొడుకు : ఆ మాటలు ఎందుకో మనస్సులో మెదిలితే చెప్పాను అంతేనమ్మా... నేను. తెలుసుకో...

(క్లారినట్, బ్యాండ్ వినిపిస్తుంది తల్లి కొడుకు వీథి గుమ్మంలో నిలవబడి చూస్తుంటారు. త్రివర్ణ వస్త్రఖండాలతో కుట్టిన కాంగ్రెసు జండా పట్టుకున్న నాయక ప్రముఖుడు..


జయ - జయ - జయ ప్రియభారత జనయిత్రీ - దివ్యధాత్రి!
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల!
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ!
కవిగాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!


అందరూ మళ్లీ అదే అంటూ రోడ్డుమీద పోతూ ఉంటారు) తల్లి : ఇవాళ మైదానంలో ఏదో మీటింగ్ ఉన్నట్లున్నది. వీళ్లంతా అక్కడికే పోతున్నారు. పూర్వం నేను ఇటువంటి ఉత్సవాలల్లో పాల్గొనేదాన్నే.

కొడుకు : అమ్మా! ఇప్పుడు మనం ఎందుకు పోగూడదు వినటానికి.

తల్లి : అప్పటి ఉద్రేకం కష్టాలవల్ల తగ్గిపోయింది అంతే! (కొంతసేపటికి ఎర్రటి జండా మీద తెల్లగుడ్డ పీలకలతో కొడవలి సుత్తివేసి ఉన్నదానిని పదియేండ్ల కుర్రవాడు పట్టుకొని నడుస్తుంటాడు. ముందు సామ్యవాద ప్రముఖుడు.


ఓ దివ్య కార్మికా!
ఓ భవ్య కర్షకా!
సామ్యవాదమే
సముచిత మార్గము
బీదల సాదల
పీడలు తొలగగ
ఓ దివ్య కార్మికా!
ఓ భవ్య కర్షకా!


అనే పాటను పాడి నడిచిపోతారు. తల్లి, కొడుకు వీథి గుమ్మంలో నిలబడి పాడుతున్నంత సేపు తన్మయత్వంలో మునిగి వింటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత)

కొడుకు : రెండోతడవ వచ్చిన వాళ్ళ జండాను చూస్తే నాకు భయం వేసింది. కాని మొదటివాళ్ల పాటకన్నా వీళ్ళపాట ఎంతో బాగుంది. నాకు మనస్సుకు నచ్చింది. మొదటివాళ్లంతా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడాను. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోట్లాడటానికి ఏమి పనికి వస్తారమ్మ! నా బోటి కుర్రవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే ఇంటికి పొమ్మనేటట్లు ఉన్నారే! ఆ జండా పట్టుకున్న పిల్లవాడి ముఖం ఎంత కళకళలాడుతూ ఉందమ్మా! నేను పోయి అది పట్టుకో వస్తానంటే ఒప్పుకుంటారా!

తల్లి : నీవెందుకు పట్టుకోవటము?

కొడుకు : ఆ అబ్బాయి ఎందుకు పట్టుకున్నాడో అందుకే.

తల్లి : నాన్న వింటే కోప్పడతారు. ఎవరన్నా ఆ మాటలు వింటారేమో మానేయి.

కొడుకు : (దీనంగా) సరే! వాళ్లెక్కడికి పోతున్నారో! బీదసాదలు అని పాడారు, చేసే సభలో మన కష్టాలు పోయే మార్గం ఏదైనా చెపుతారేమో! అమ్మా! నేను వాళ్ళతో పోయి వినివస్తాను. తల్లి : వద్దు! నాయనా! మళ్ళా నడిచి మైదానం దాక పోయివస్తే అలసిపోవటం వల్ల జ్వరం తిరగబెడుతుంది. బాగా నయమైన తరువాత ఎక్కడ తిరిగినా ఫరవాలేదు.

కొడుకు : అన్నీ తెలిసి కూడా అలా ఆటంకం చేస్తావేమమ్మా! జ్వరం వస్తే వస్తుంది. మళ్లీ వెనక నయమైనట్లే నయమవుతుంది. అక్కడ చెప్పే సంగతులు నాకు తెలియాలంటే ఎట్లా తెలుస్తాయి. పోతానమ్మా.

తల్లి : ఎప్పుడో నాన్న చెపుతారు విందువుగానివి. ఇప్పుడు పోవద్దు! నా మాట విను.

కొడుకు : (మాట్లాడడు).

తల్లి : ఇక్కడనే కుర్చీలో కూర్చుని ఏదైనా చదువుకుంటుండు. అయిదు కాగానే నాన్న వస్తారు., మాట్లాదువుగాని. అక్కడ చెప్పే సంగతులన్నీ నాన్నకు బాగా తెలుసు. చెపితే నేర్చుకుందువుగాని. నేను ఇంకా మడిగట్టుకోవాలి. ఇవాళ ఆరు గంటలకే భోజనం చేసి నాన్న ఎక్కడికో పోవాలట. త్వరగా వంట చేయమని చెప్పిపోయినారు.

కొడుకు : (అలోచిస్తూ వీథి గుమ్మంలో నుంచి లోపలికి వచ్చి పడక కుర్చీలో చతికిల బడతాడు. తల్లి ఇంట్లో పని చూసుకోను పోతుంది).

ఏవిధంగానైనా ఇవాళ అక్కడికి పోవాలిసిందేను. అమ్మా నాన్న మళ్ళీ నన్ను ఇంటికి రానిచ్చినా సరే రానివ్వకపోయినా సరే! వాళ్ళతో నేను మీతో కలిసి ప్రచారం చేస్తాను, నాకు తిండి గుడ్డలు ఇచ్చి మీ చదువు చెపితే చాలని బతిమిలాడితే ఒప్పుకోక పోతారా!

(లేచి నాలుగు దిక్కులూ చూచి నెమ్మదిగా ఇంట్లోనుంచి బయటికి జారతాడు)

మూడవ రంగము

(సాయంత్రం 7.30 గంటల ప్రాంతము. కుర్చీలో కొడుకు లేకపోవటం వల్ల తల్లి వీథి గుమ్మంలో నిలవబడి ఎక్కడికి పోయినాడో అని కనిపెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంతలో కొంతసేపటికి ఒక సైకిలుమీద రొప్పుతూ రోజుతూ ఒక కామ్రేడ్ దిగుతాడు ఆమె ముందు)

కామ్రేడ్ : వీరసూనుని కన్నతల్లికి నమస్కారములు.

తల్లి : (తలవంచుకొని ఉంటుంది. ఒకవిధమైన సిగ్గుతో) కామ్రేడ్ : అమ్మా మీ అబ్బాయి...

తల్లి : (వంచుకున్న తల కొంచెం పైకెత్తి) ఎక్కడున్నాడేమిటి?

కామ్రేడ్ : అక్కడ మైదానంలో జరిగే సభ దగ్గిర ఉన్నాడు. ఇందాకటి నుంచీ ఇప్పుడూ అక్కడ బల్లదగ్గిరే... ఉన్నాడు.

తల్లి : ఇంత పొద్దుపోయినా ఇంకా ఎందుకు రాలేదో!

కామ్రేడ్ : (తల వంచుకుంటాడు)

తల్లి : ఏమన్నా చేశాడా ఏమిటి?

కామ్రేడ్ : ఏమన్నా చేయటమేమిటమ్మా! మహోపకారం చేశాడు. ఏమి ధైర్యం! ఎంత వచో నైపుణ్యం! మాట్లాడటంలో కించిత్తైనా ఒడుదొడుకులు లేవు. బీదసాదల దుర్గతిని చూచి కరిగిపోయిన కోమల హృదయం! బాలహృదయం! ఎంత ఆవేశం! మనమంతా ఒక సంఘంగా చేరాలి. ఆ సంఘానికి బలం చేకూర్చుకోవాలి. బాగా ధనికుల దౌష్ట్యాలను రూపుమాపే ప్రయత్నంలో ఉండాలి. ఎప్పుడు, సమాన ప్రాభవ వైభవాలను సంపాదించుకోవాలనీ, ఉద్బోధించాడు. పేదసాదలను, ధనధాన్యాలు శాశ్వతాలు కావని, మానరక్షణ ప్రాధాన్యమట. జన్మజన్మాంతరాలనుంచీ దీర్ఘ సుషుప్తిలో ఉన్న కూలీనాలీలను, మేల్కొల్పి వారి వారి అంతరాలను విభజిస్తూ స్వతస్సిద్ధముగా లేని ధనికుల ప్రాభవాన్ని నిరసించాడు. జ్ఞానతృష్ట కలుగవలెనని హెచ్చరించాడు. అంతేనా ఇంకా...

తల్లి : ఎక్కడ మాట్లాడాడు?

కామ్రేడ్ : మైదానంలో నమ్మా!

తల్లి : (ఆశ్చర్యంతో) అక్కడికి వచ్చాడా! వాళ్ళ నాన్నకు తెలుస్తుందే?

కామ్రేడ్ : అవును. వచ్చాడు. మతులు మారిపోయేటట్లు మాట్లాడాడు. తరువాత మా అధ్యక్షుడు మహానాయకుని పోకడలున్నాయి కుర్రవాడిలో అన్నాడు కూడాను. అటువంటి పిల్లవాడు (చివర వినకుండా)

తల్లి : ఎవరు మాట్లాడనిచ్చారు?

కామ్రేడ్ : ఉత్సాహపూరితుడై తనంతట తానే మాట్లాడతానని అధ్యక్షుణ్ణి కోరాడు. సభలో ఏమి గందరగోళం చేస్తాడోనని ఆయన భయపడి మొదట్లో వీలు లేదన్నాడట. నేను బాగా మాట్లాడగలను, నాకు కడుపులో ఎన్నో సంగతులు ఉన్నాయి. నేర్చుకున్నాను. ఇవాళ నన్ను తప్పకుండా మాట్లాడనీయాలి అని కాళ్ల వేళ్లా పడి బతిమలాడితే అధ్యక్షుడు అంగీకరించాడు. అంగీకరించినందుకు సభను రసప్రవాహంలో ముంచి తేల్చాడు. కూలీ నాలీల చక్షుగోళాల వెనుక తాండవించే ఆకటి మాటలకు తాను మాడిపోయి వినేవాళ్ళను మాడ్చి వెర్రెత్తి పోయేటట్లుగా ఉర్రూత లూగించాడు. భావనలో ఎంత సాత్వికము! భాషలో ఎంత సౌమ్యత! ఉద్రేకము! అవిచ్ఛిన్న వాగ్ధారణి!

తల్లి : (సంతోషము కప్పి పుచ్చుకుంటూ) జబ్బు పడ్డాడు. అందుకోసం వెళ్ళవద్దురా నాన్నా అంటే నేను ఇంట్లో పని చేసుకుండే సమయం కనిపెట్టి జారాడు. మిమ్మల్ని మైదానంలో చేరుకున్నాడు గామాలి!

కామ్రేడ్ : లేదమ్మా! పరుగెత్తుకుంటూ రొప్పుతూ వచ్చి త్రోవలోనే కలిశాడు మొదట మా నాయకుడి పక్కన నిలవబడి ఆయనకు ఒక నమస్కారం చేసి జండా పట్టుకొని వచ్చే 'సూర్యం' ప్రక్కనే నడవటం మొదలు పెట్టాడు. మా కామ్రేడ్సంతా చిరునవ్వు చిందులాడే అతని ముఖం చూసి ఊరికే నవ్వించేవాళ్ళు. లేత బుగ్గలమీద గులాబి రంగు తరకలు కట్టేవి. నాయకుడు మెడ మీద చెయ్యివేసి, ఎవళ్ళ అబ్బాయివి నాయనా! అంటే 'ఏమండీ!' నన్ను కాసేపు ఆ జండా మోసుకో రానీయరూ అన్నాడట.

తల్లి : (చకితయై) పట్టుకొచ్చాడా ఏమిటి! వాళ్ళ నాన్న ఎక్కడైనా చూచారేమో! చంపేస్తారే!

కామ్రేడ్ : లేదమ్మా! లేదు! వచ్చేటప్పుడు మోసుకొద్దువుగానిలే అన్నాడాయన. కాదండీ ఇప్పుడే మోస్తాను అన్నాడట. దానికి మధ్యలో మార్చటానికి వీలు లేదు వచ్చేటప్పుడు నిన్ను తప్పకుండా పట్టుకు రానిస్తాను అంటే సంతోషించి అట్లాగేనని తల ఊపాడు.

తల్లి : (దృష్టి రోడ్డుమీదకు మార్చి మెడసారించి దూరంగా చూచి) మీటింగ్ ఇంకా అయిపోలేదా? అబ్బాయి ఇంకా రాలేదే!

కామ్రేడ్ : మీటింగ్ అయి చాలా సేపయింది. మీ అబ్బాయి బల్ల... దగ్గిర... ఉన్నాడు.

తల్లి : కారణం ఏమిటో! తెలియదు! కాస్తపోయి పిలిచి వస్తావా బాబు! వాళ్ళ నాన్న వచ్చే వేళ అవుతున్నది.

కామ్రేడ్ : (ముఖం ప్రక్కకు త్రిప్పుకొని దైన్య కంఠస్వరముతో) నేను పోతే మటుకు వస్తాడా అమ్మా! రాలేడు... అక్కడనే ఉన్నాడు. తల్లి : అక్కడ ఏమి జరుగుతుందేమిటి? ఇంతాలస్యానికి.

కామ్రేడ్ : (ఆగుతూ ఆగుతూ) కాంగ్రెస్ పార్టీవారు, మేము కలిసి సభ చేస్తున్నాము. సభను ఒక వృద్ధ జంబుకం అగ్రాసనాధిపత్యం వహిస్తున్నాడు. ఆయన మా సోషలిస్టును కుర్రకుంకలు అనీ, ఎడ్డిమడ్డి మృగాలట 'పేదసాదలు వాళ్ళకు పరిపాలనలో హక్కేమిటి?' వీళ్ళకు ఎలా వస్తుందో చూస్తామన్నాడు. అంటే మాకు కోపం వచ్చి ధిక్కార సూచకంగా మేము ప్రక్కనే ఇంకో సభ చేస్తున్నాము. మీ అబ్బాయి మా సభలోకే వచ్చాడు. వినటానికి వచ్చిన జనంలో చాలామంది మా సభకే వచ్చారు.

తల్లి : తప్పేమున్నది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం.

కామ్రేడ్ : కొంతసేపు సభ జయప్రదంగా సాగింది.

తల్లి : తరువాత?

కామ్రేడ్ : ఇంతలో పోలీసువాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు వెనకనుంచీ లాఠీచార్జి చేశారు. సభంతా చిందరవందర అయిపోయింది. కొంతమంది పరుగెత్తి పారిపోయి తలలు దాచుకున్నారు.

తల్లి : (రోడ్డు మీద ఎలక్ట్రిక్ లైటు వల్ల వచ్చేకాంతిలో అతని దుస్తులు పరీక్ష చేస్తూ) నాయినా! ఆ రక్తం అదేనా?

కామ్రేడ్ : (కంటికి నీరు వస్తుంది) అవును.

తల్లి : మా అబ్బాయి ఏడి మరి?

కామ్రేడ్ : ఆ బల్ల.... దగ్గిరనే.... ఉన్నాడు

తల్లి : దెబ్బలు తగిలినవా..?

కామ్రేడ్ : సభాపతి అతనికి తగలబోయే దెబ్బలన్నిటికీ తన తల అడ్డంపెట్టి శాయశక్తులా రక్షించటానికి ప్రయత్నించాడు.

తల్లి : ఎంత పుణ్యాత్ముడో గదా! ఆయనకు ఎట్లా ఉంది ఇప్పుడు.

కామ్రేడ్ : (కన్నీటి ధార) కళ్ళు మూశాడు. తల్లి : మా అబ్బాయి ఆయన దగ్గిర కూర్చున్నాడా? కామ్రేడ్ : (కొంచెము ఓదార్చుకొని) సభాపతి కళ్ళు మూయగానే ఎక్కడిదో ఒక లాటీదెబ్బ వచ్చి మీ అబ్బాయి కణతకు తగిలింది. అబ్బాయి.... బల్ల దగ్గర...

తల్లి : (తిరిగిపోతూ ఉన్న కళ్లతో) ఆఁ!

కామ్రేడ్ : (ఆమె ముఖం చూడలేక జేబు రుమాలు అడ్డం పెట్టుకొని భోరుమని ఏడుస్తూ) చనిపోయి... నేలమీద..... ఉన్నాడు.

తల్లి : (పెద్ద కేకతో వీథి గుమ్మంలో వెనక్కు పడిపోయింది. బజారులో ఎలక్ట్రిక్ లైట్లన్నీ ఒక్క తడవగా ఆరిపోతాయి. ఆనాటి అమావాస్య చీకట్లో కళ్ళు పొడుచుకొని చూచినా, కనుపించినా కనపడని ఆకాశంలో నవజీవనం వెళ్ళబోస్తూ ప్రకాశవంతంగా మెరుస్తున్నది ఒక తార).

సమాప్తము

అముద్రితం

సాక్షాత్కారము

(దృశ్యనాటిక)

పాత్రలు : పోతరాజు, శ్రీనాధుడు, మాచమ్మ, మల్లన్న

కాలము: క్రీ. శ. 15వ శతాబ్ది మధ్యభాగము

ఒకటవ దృశ్యము

(ఓరుగంటి బ్రాహ్మణవీథి పూరిల్లు. మట్టితో అలికి ముగ్గులు పెట్టిన అరుగుమీద కోదండరామస్వామి దారు విగ్రహము. న్యగ్రోధ వృక్షచ్ఛాయలో ఒక వ్యాసపీఠం మీద వ్యాస భాగవతముంటుంది. దానిముందు పరిచిన కృష్ణాజినంమీద మహాకవి పోతరాజు కూర్చొని తదేక దీక్షగా, భక్తి పారవశ్యంతో భాగవత మూలాన్ని ఆంధ్రీకరిస్తుంటాడు.)

పోతరాజు : (సంస్కృత భాగవతములో నుంచి)


“యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం
యద్వందనం యచ్ఛ్రవణం యదర్హణమ్
లోకస్య సద్యో విధునోతి కల్మషం
తస్మై సుభద్ర శ్రవసౌ నమో నమః”


(శ్లోకాన్ని పఠించి నిమీలిత లోచనాలతో రామచంద్ర విగ్రహానికి నమస్కరించి క్రింది విధంగా ఆంధ్రీకరించి తాళపత్ర గ్రంథంలో ఘంటంతో నిబద్దం చేస్తాడు)


ఏ విభు వందనార్చనము లేవిభు
చింతయు నామకీర్తనం
బే విభులీలలద్భుతము లెవ్వని
సంశ్రవణంబు సేయదో
షావళి బాసి లోకము శుభాయత
వృత్తి చెలంగునండ్రునే
నావిభు నాశ్రయించెద నఘౌఘ
నివృత్తిడు భద్రకీర్తియున్-

(నమ్రభావంతో మళ్ళీ నమస్కారం చేసి నీడ తనలో లీనమై పోతూ ఉండడం వల్ల

ఒకమాటు ఆకాశం వైపుకు చూస్తాడు. ఆదిత్యుడు గగనరంగ మధ్యంలో గంభీర నాట్య భంగిమతో ప్రకాశిస్తుంటాడు)

మాచమ్మ : (లోపలినుంచి ప్రవేశిస్తూ) ఏమండీ. మీకే వెర్రిపడితే అదే వెర్రి. తిండీ తిప్పలూ లేవా ఏమిటి? అపరాణ్హం దాటి ఎంతసేపైందో చూచారా? ఇకనైనా కనికరించి దేవతార్చనమ్ చేస్తారా?

పోతరాజు : (చిరునవ్వుతో తాళపత్రగ్రంథాన్ని కట్టి పెడుతూ) అమ్మీ! నా కాశీ కమండలం తెచ్చి పెట్టు. ఇక్కడున్నట్లుగా గంగకు వెళ్ళి వస్తాను.

(భార్య లోపలికి వెళ్ళుతుంది)

కోదండరామా! కోదండరామా!!

(వెలిగే కన్నులతో ఒక్కమాటు నాలుగువైపులా లేచి చూస్తాడు. భార్య ప్రవేశించి)

మాచమ్మ : ఇదుగో కమండలం. అదుగో అంగవస్త్రము దణ్ణెంమీద, నిన్నా మొన్నా ఉపవాసం, మరిచిపోయినారేమో! అనుష్ఠానం కొంచెం త్వరగా పూర్తిచేసుకోండి. నా ప్రాణాలు అన్నుబట్టి పోతున్నవి.

పోతరాజు : (కమండలము భార్యచేతిలో నుంచి అందుకుంటూ దణ్ణెం వైపుకు నడుస్తూ) నాలుగు దినాలైంది. ఉద్ధరిణెడు పచ్చిగంగ ఎరుగను. నిన్నా మొన్నటికే అల్లట తల్లటై పోతున్నావు పిల్లా!

మాచమ్మ : మీకేం మహాత్ములు. పవనపర్ణాంబుభక్షులు. మీతో నాకెక్కడి వంతు. మీరేమిటో మీ వ్రాసుకోవటమేమిటో. రెండో ప్రసంగం పట్టిందా? ఇతర ప్రపంచం పట్టిందా? ఈ మహాగ్రంథం ఎప్పటికి పూర్తౌతుందో గాని వేళపట్టుకు భోజనానికి నిద్రకూ మోమువాచిపోతున్నాము. మీరు మటుకు నోచుకున్నారా?


"చేసుకున్న వారికే గోవిందారామ
చేసుకున్నంతాయె గోవిందారామ”


పోతరాజు : అమ్మా మన కోదండరాముడి కృపవల్ల భాగవత సముద్రాన్ని ఈది బయటపడాలి గాని ఈ అన్నమయకోశాన్ని పోషించుకోలేక పోతామా? అదంతా ఆ మహాప్రభువు కరుణ వెంటనే వచ్చేస్తాను.

(గంగకు బయలుదేరుతాడు)

(భార్య అక్కడే చేటలో ఉన్న బాదమాకులు విస్తరి కుడుతూ గోవిందనామాల పాట

పాడుకుంటుంది.)

మల్లన్న : (ఆదుర్దాగా ప్రవేశించి ఇల్లు నాలుగు మూలలా వెతుకుతుంటాడు.)

మాచమ్మ : అబ్బాయీ! మళ్ళీ వచ్చావు మేడికోల మరిచిపోయినావా ఏమిటి?

మల్లన్న : మామ రాలేదామ్మా!

మాచమ్మ : ఏ మామ నాయనా?

మల్లన్న : శ్రీనాథుడు మామ.

మాచమ్మ : ఏడీ! రాలేదే! వాడు బతికున్నాడా? పోనీ ఇప్పటికైనా అక్కయ్య బతికున్నదని జ్ఞాపకం వచ్చింది అంతే పదివేలు.

మల్లన్న : మేనా మన ఇంటికి రాలేదూ? ఈ ఊరి పక్కగా మామ ఎక్కడికైనా వెళ్లుతున్నాడేమో!

మాచమ్మ : ఎవరినైనా జూచి మామనుకున్నావేమో!

మల్లన్న : ఎవరినో చూడటమేమిటి? అంతకథ జరిగితే ఉఁ - ఇంకా రాలేదేం.

మాచమ్మ : ఏం కథ జరిగిందేమిటి?

మల్లన్న : మామయ్య మేనా ఎక్కి

మాచమ్మ : ఆ c......

మల్లన్న : మన పొలిమేర పొలం గట్టు మీదగా వస్తున్నాడమ్మా!

మాచమ్మ : నిన్నుజూచి మేనాలో పిలిచి ఎక్కించుకోలేదురా? ఏదో సామెతలా ఉంది ఎందుకంటాడేం!

మల్లన్న : రాజాస్థానాలల్లో భట్రాజులలాగా కవిత్వం చెప్పి ప్రాభవం సంపాదించిన ఆయన కళ్లకు ఎక్కడో పొలం దున్నుకొంటూ పొట్ట పోసుకుండే మనం కనబడతామా, దానికేం కనబడక పోతేమానె-

మాచమ్మ : ఏం చేశాడేమిటి? మల్లన్న : నన్ను దూరాన్నేజూచి గుర్తుపట్టి సగర్వంగా మేనా ఆపించి పగటిదివ్వె వెలిగించమన్నాడు. ఒక పడుచు కోయపిల్ల దారిన పాడుకుంటూ పోతుంటే పిలిచి ఒక మాడ విసిరి పారేశాడు నాకు కనబడేటట్లుగా.

మాచమ్మ : వాడు రమ్మనకపోతే మాని, నీవైనా పోయి 'ఎక్కడినుంచి మామా' అని పలకరించక పోయినావా?

మల్లన్న : ఎందుకు పలకరించాలేం? నేను మటుకు తక్కువ తిన్నానా? ఆయన గొప్ప ఏమిటో కొంచెం చెపుదూ వింటాను - లేదని ఎందుకనాలి. ఉంటే ఆయన్నే ఉంచుకోమను.

మాచమ్మ : అనవసరంగా ఎందుకురా ఇంత ఉక్రోషం. నిన్నేం తక్కువ చేశాడని.

మల్లన్న : అవమానించటానికి యత్నించాడు.

మాచమ్మ : నిన్నేమన్నా మాటన్నాడా?

మల్లన్న : మాటనకపోతే సరా! నా దారిని నేను పొలం దున్ను కుంటుంటే ఇష్టముంటే మర్యాదగా పిలిచి మాట్లాడాలి లేదా తన దారిని తాను పోవాలి. వెర్రిడాంబికం నా దగ్గరనా. చూడు నా ప్రజ్ఞ అన్నట్లుగా మేనా బోయీలను ఒకవైపు మానేయించి నడిపిస్తాడా!

మాచమ్మ : నడిచిందిరా మేనా నాయనా? ఈ విద్యంతా వాడికి మీ నాన్న నేర్పిందేలే!

మల్లన్న : నాకూ మానాన్న నేర్పలేదు మరి. నేను మటుకు ఊరుకున్నానా? అరక ఎద్దును ఒకదాన్ని ఒదిలిపెట్టి పొలం దున్నించాను.

మాచమ్మ : ఆయనకు అన్ని మంత్రాలు రాబట్టేనా ఇలా ఉన్నాము - అయితే అరకవైపు మామ చూచాడా?

మల్లన్న : ఆఁ చూచి, బోయీలను రెండోవైపు కూడా విడిచి పెట్టమని మేనా నడిపించాడు.

మాచమ్మ : తరువాత నీకేం చెయ్యాలనో తెలియలేదుగామాలి.

మల్లన్న : అబ్బా! ఈపాటి క్షుద్రశక్తికే భయపడ్డాననుకుంటున్నావేం, ఒక్కమాటు భూదేవిని మనస్సులో స్మరించి రెండో ఎద్దును కూడా వదిలిపెట్టి అరక నడిపించాను - ఊరుకుంటానా మరి. మాచమ్మ : తరువాత?

మల్లన్న : ఏముంది. మేనాలో ఉన్న అంత మామా అమాంతంగా దిగివచ్చి కొంటెతనంగా వెనక ఎరగనట్లు 'ఎవరబ్బాయివిరా నీవన్నాడు' - మనస్సులో చేయిపెట్టి కలిచినట్లయింది నా పని. ఆపుకోలేక రాజాస్థానాలల్లో కవితా సేవకు కుదరలేక కేదారఖండాన్ని నమ్ముకున్న ఒక కర్షక కవి కుమారుణ్ణన్నాను - పెడసరంగా.

మాచమ్మ : ఎందుకన్నావు ఆ మాట. వాడికి కోపం రాదూ?

మల్లన్న : ఏం వస్తే? నన్నేం తలగొట్టి మొలేస్తాడా?

మాచమ్మ : అయినా వాడు కాస్తకూ కూస్తకూ కోపం తెచ్చుకునే స్వభావం కలవాడు కూడా కాదులే. ఆఁ

మల్లన్న : ఓరి నీవట్రా మల్లన్నా? ఓరి నీ తస్సదియ్య ఎంతవాడివైనావురా? నేనెవరినో ఎరుగుదువా? ఎప్పుడో చిన్నతనంలో చూచానురా? చిన్నప్పుడు నీచేత నా నైషధంలో పద్యాలు వల్లె వేయించే వాణ్ణి మా ఇంటికి వచ్చినప్పుడు అని మంచి చేసుకొని మేనాలో ఎక్కు ఇంటికి పోదామన్నాడు. నీవు పద, నేను ఎడ్లకు మేతవేసి నీడనకట్టి వస్తానన్నాను.

మాచమ్మ : పాపం. మేనాఎక్కి రాకపోయినావా? వాణ్ణి ఎంత చిన్నబుచ్చావురా?

మల్లన్న : నన్ను చిన్నబుచ్చటం నీకు నచ్చిందేం? ఇంకా ఇంటికి చేరలేదే, అరఘడియైనా. మనం పేదవాళ్ళమనీ మన ఇంట్లో మర్యాదలు సక్రమంగా జరగవనీ ఇంకెవరింట్లోనైనా విడిది దిగారేమో మామగారు.

మాచమ్మ : మల్లన్నా! మామను ఎంత అన్యాయం చేస్తున్నావురా!

మల్లన్న : ఇంతసేపైతే మరి ఎక్కడికిపోయి ఉంటాడంటావు - ఆఁ ఎక్కడికేమిటి? మరిచి పోయినాను. ఉందిగా మా అత్త భోగినీదేవి. దేశదేశాల నుంచీ తెచ్చిన చీరెలూ, సారెలూ ముందు అక్కడ చెల్లించుకోరావద్దూ?

మాచమ్మ : అది గోపాలోత్సవాలకు రాచకొండ వెళ్లిందటగా. దాని ఇంటికెందుకు వెళ్ళుతాడు. మా ఇంటావంటా లేవే అటువంటి గుణాలు. ఎందుకురా అన్యాయంగా అంతంత అభాండాలు వాడినెత్తిన వెయ్యటం? మల్లన్న : పాపం! మీ తమ్ముడు కేవలం శ్రీరామచంద్రమూర్తి - నీకేం తెలుసు దేశం ఏమని చెప్పుకుంటున్నదో మామను గురించి - పోనీ ఒక సంగతి ఆలోచించు. ఇన్ని ఆస్థానాలు తిరిగి, ఇంతమంది ధనికులను ఆశ్రయించి చేసిన సంపాదనంతా మీ తమ్ముడు కేవలం శ్రీశుకులే అయితే ఏం చేశాడంటావు.

మాచమ్మ : ఆఁ ఈలోకం చూచి వచ్చింది.

మల్లన్న : (ఉక్రోషంతో) లేదు. నన్ను చెప్పమన్నావా. లంకెబిందెలకేసి పడిపోయిన కొండవీటి కోటకొమ్మల్లో పాతేయించాడు - రాజమహేంద్రవరము నుంచీ అయ్యగారు ఎందుకు స్వస్తి చెప్పారో విన్నావో 'రన్ని' విషయంలో రాజుగారికీ ఈయనకూ రక్తపాతాలదాకా వచ్చిందట -

మాచమ్మ : పోనీ - నీవన్నట్లే అదంతా మనకెందుకొచ్చింది చెప్పు. మా నాన్నకు ఒక్కడైనా రత్నం. ఇంత వృద్ధిలోకి వచ్చాడు. పదిమంది పెద్దల్లో తిరగనేర్చాడు. తండ్రి తాతల పేరు నిలువ బెడుతున్నాడు. ఏంచేస్తేనేం. సంపాదనంతా ఏం చేస్తేనేం? నీకు పిల్లనిచ్చేటప్పుడు కట్నమివ్వలేక పోతాడనేనా నీ దిగులు, ఆ భయం పెట్టుకోకు.

మల్లన్న : పిల్లిని చంకన వేసుకొని తిప్పినట్లు ఊరూరా పిల్లను తిప్పుతున్నాట్ట. పట్టణాలల్లో నిముషానికి ఒక కొత్తపోకడతో సింగారించుకుంటూ సీతాకోక చిలుకలాగా పెరిగే ఆ అమ్మాయిని అంటగట్టుకుంటే మన కాపురం నెగ్గినట్లే.

మాచమ్మ : అయితే మేనరికం పోగొట్టుకుంటాముట్రా.

మల్లన్న : 'నందోరాజా భవిష్యతి' - ఇప్పుడెందుకా విషయం.

మాచమ్మ : వాడే వస్తే ఈ తడవ వచ్చే కార్తికమాసంలో ముహూర్తం పెట్టించమని అడుగుదామనుకుంటున్నాను.

మల్లన్న : అప్పటికిమల్లె మనకు డబ్బువస్తుందా ఏం?

మాచమ్మ : అంతగా మనకు అప్పటికి రాకపోయినా లేకపోయినా మనకయ్యేది కూడా వాడే ఎక్కడనో తెచ్చిపెడతాడు.

మల్లన్న : అంత ఖర్మం మనకేం పట్టింది. భూదేవి చల్లగా చూడాలిగాని. నవ్విన మన నాపచేనే పండదుటే-

(కాహళధ్వని ఒకటి వినిపిస్తుంది)

మాచమ్మ : గంగకు స్నానానికని వెళ్లారు మీనాన్న. ఇంతవరకు అతీగతీ లేదు. అదుగో

కోదండరామ స్వామి ఆలయంలో అర్చన అవుతున్నట్లున్నది.

మల్లన్న : (విడ్డూరంగా) అది స్వామి ఆలయంలో నుంచి కాదు వినిపిస్తున్నది. మీ తమ్ములు శ్రీనాథ కవి సార్వభౌములవారి లాంఛనం. ఈమధ్య విజయనగరంలో కర్ణాటరాజు కనకాభిషేకం చేసి ఆయనకు ఇచ్చాడులే ఈ లాంఛనం.

మాచమ్మ : అయితే మావాడు కర్ణాటక చక్రవర్తిని కూడా ఎరుగునన్నమాట! చూచావా మామయ్య పేరెత్తితే ఒంటి కాలిమీద వస్తావు గాని వాడి వెంటపోతే ఇటువంటి గౌరవాలన్నీ మీ నాన్నకు చేయించడురా మా వాడు. వాడి పొళకువంటే గిట్టదాయె ఆ మనిషికి.

మల్లన్న : రాజులను ఆశ్రయించటానికి ఆయన మనస్సే అంగీకరించాలి గాని అప్పుడు మీ వాడూ అవసరం లేదు మా వాడూ అవసరం లేదు. అయినా మహాకవులు లాంఛనాల కోసం, రాజబిరుదాల కోసం కవిత్వం చెపుతారటమ్మా. ఏనాటికైనా మహారాజులే మా నాన్నగారి కోసం మన ఇంటికి రావలసిందేగాని ఆయన వాళ్ల దేవిడీ గుమ్మాలు దాటుతారా?

మాచమ్మ : చూస్తున్నాను గదా మల్లన్నా, ఎప్పుడు బట్టినా సరిగా ఆ తండ్రికి కొడుకువనిపిస్తావురా. డబ్బున్న వాళ్ళంటే గిట్టదు. డబ్బు సంపాదించటమంటే గిట్టదు. ఒక ముచ్చటా లేదు. అచ్చటా లేదు. ఎన్నాళ్ళూ కాపురం చేసినా కట్టుకోను ఓ మంచి బట్టా పెట్టుకోను ఓ నగ! మా వాళ్ళు పెట్టిన పులిచేరు అమ్ముకున్నారు గదా? ఈ పుస్తెలతాడూ నేను మూసివాయినాల ముత్తైదులాగా మిగిలాను.

మల్లన్న : (నవ్వుతూ) అయితే నేను ఒక మాట చెప్పనా? నేను తండ్రికి తగ్గ కొడుకునైతే నీవు అక్షరాలా ఆ తమ్ముడికి తగ్గ అక్కవేనమ్మా!

మాచమ్మ : తప్పేముంది. ఎవరి వాళ్ళలాగా వాళ్లుంటారు.

మల్లన్న : ఎలాగైనా మొదటినుంచీ మీ వంశం గొప్పదే.

మాచమ్మ : మీ వంశం ఇంకా గొప్పదిగా? అంతా బ్రహ్మజ్ఞానులు. ఉగ్గుబాలతోటే వేదాంతం రంగరించి పోస్తారు. మీ ఇంట్లో- (దూరాన శ్రీనాథుణ్ణి చూచి) అడుగోరా మామయ్య. ఒక మనిషి నెత్తి మీద పెద్ద మేదర పెట్టె పూరి వసారాలో దించి వెళ్ళిపోతాడు. మాచమ్మ లోపలికి పోయి కాళ్ళకు నీళ్ళు తెచ్చి చెంబు వాకిట్లో పెడుతుంది. శ్రీనాథుడు ప్రవేశించి కుళాయి తీసి చిలక కొయ్యకు తగిలించి “ఒరేయ్. మీరు ఆ నీడలో కూర్చోండి" (నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటాడు).

మాచమ్మ : (నీళ్ల చెంబుతో) అబ్బాయీ! అక్కయ్య ఉన్నదనుకున్నావా - ఊడిందను కున్నావా?

శ్రీనాథుడు : ఏం మల్లన్నా! నాకంటే నీవే ముందు చేరుకున్నావే.

మల్లన్న : (గర్జితంగా) మీరు ఊళ్లో చూడవలసిన వాళ్లనందరినీ చూచివచ్చేటప్పటికి ఆలస్యమైనదను కుంటాను. నేను అడ్డదారిని త్వరగా వచ్చేశాను.

శ్రీనాథుడు : అక్కయ్యా! అల్లుడు బలే గట్టివాడే - మేము ఇద్దరమూ పొలిమేరలోనే కలుసుకున్నాం.

మాచమ్మ : ఏమో నాయనా మరి నీ పిల్ల వీడితో ఎలా నెగ్గుకోవస్తుందో - అయిదేళ్ళ నాడు నవమికి రావటమే తప్ప మళ్ళీ చీటి ముక్కైనా వ్రాశావు కాదు.

శ్రీనాధుడు : ఏదీ - నేను ఒకచోట స్థిరంగా ఉన్నదెప్పుడు? అమ్మ పోయినప్పటి నుంచీ మనస్థితి ఏమీ బాగాలేదు. కొంతకాలం దేశాటనం చేస్తే బాగుంటుందని కొండవీడు వదలి బెట్టాను.

మాచమ్మ : అయితే మా మేనగోడలు సరస్వతి ఎక్కడ ఉందిరా? దాన్ని ఒక మాటు తీసుకొచ్చి తలంటి పోసి పంపిద్దామంటే పడిందికాదు. పాపం తల్లి పోయిన పిల్ల. దానికి మాత్రం ఏ నూరుమంది ఉన్నారు.

శ్రీనాథుడు : అది వాళ్ల అమ్మమ్మ గారింట్లో ఉన్నది. దాన్ని చూచికూడా ఆరు నెలలు దాటింది. ఇదుగో అన్నిటికీ నేను దేశంలో లేక పోవటమే.

మాచమ్మ : నీవు ఎక్కడికో వెళ్ళేటప్పుడు పిల్లను అమ్మమ్మ గారింట్లో ఉంచకపోతే నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళకూడదూ! నీవు ఉంచకూడదా? మేము ఉంచుకోకూడదా? అవునులే - పెద్దవాళ్ళము పోషించలేము. పెద్దది ఆమె ఎప్పుడు పోయిందో నీకూ నాకు దూరమయినది.

(కంట తడి పెడుతుంది)

మల్లన్న : మామగారూ! ఏ ఏ దేశాలు చూచారేమిటి?

మాచమ్మ : 'మామగారు' అదేమిటి 'మామ' అను నాయనా! శ్రీనాథుడు : ఒక దేశమేమిటి? యావద్భారతమూ తిరిగి వచ్చాను. చూడని ఆస్థానమూ, ఆడని తీర్థమూ లేదు. మాచమ్మ : మాటమాత్రమన్నా అన్నావు కాదురా. నీతోటి వచ్చి దేశమన్నా చూచేదాన్ని. శ్రీనాథుడు : మహారాజులతో యాత్రకు బయలుదేరినవాణ్ణి 'నాకూ-నీకూ' ఎక్కడ కుదురుతుంది. మాచమ్మ : నాయనా! అన్నిచోట్లా తీర్థవిధులు జరిగించావా. శ్రీనాథుడు : అందులో లోపం చేస్తానా? అమ్మా నాన్నలకు ఏం కొదవని? మాచమ్మ : వాళ్లకే కొదువాలేదు. ఉన్నన్నాళ్లు సుఖంగా బ్రతికారు. ఆ కన్నకొడుకు చేతిమీదుగా దాటి పోయినారు. ఒక్కడివైనా ఇంత పేరు ప్రతిష్ఠలలోకి వచ్చావు. మల్లన్న మామా! ఈ దేశాలన్నీ తిరిగేటప్పుడు ఎక్కడైనా నీకు మా అమ్మ గుర్తు వచ్చేదేనా? మాచమ్మ : చూడు వాడి చమత్కారం. ఆటలు పట్టిస్తున్నాడు మామను. శ్రీనాథుడు : మల్లన్నా! కంచిలో నీకు ఒక మంచి జరీ కుళ్లాయి కొన్నాను. కాశ్మీరంలో మీ నాన్నగారికి ఒక శాలువా పట్టుకొచ్చాను. మా అక్కయ్యకు ఏవో చాలాచోట్ల చాలా చీరెలూ రవికలూ పట్టుకొచ్చాను. (మేదర బుట్టవైపు చూస్తాడు) (దొడ్డిగుమ్మం తలుపు చప్పుడు) మాచమ్మ : (శ్రీనాథుడితో అబ్బాయీ అడుగో మీ బావగారు గంగ నుంచి మడి కట్టుకొని వచ్చి దొడ్డిగుమ్మం తలుపు తడుతున్నారు. తరువాత చూపిద్దువుగాని ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మడికట్టుకో (మల్లన్నతో) అబ్బాయీ మామను భావి దగ్గరకు తీసుకొని పోయి స్నానానికి నీళ్లు తోడి అందించు. శ్రీనాథుడు : అల్లుడైనందుకు ఆ మాత్రం పరిచర్య చేయడూ? లేకపోతే పిల్ల నిస్తానా? ఏకాంకికలు 351 మల్లన్న : మామా ఇటు - (మల్లన్న దారిచూపిస్తుంటే శ్రీనాథుడు వెనుక నడుస్తాడు) (మళ్లీ దొడ్డిగుమ్మం తలుపు చప్పుడు విని మాచమ్మ తలుపు తీయటానికి వెళ్లిపోయింది). రెండవ దృశ్యము (శ్రీనాథుడు ప్రయాణ సన్నాహంలో ఉంటాడు. ప్రాతః సమయంలో మాచమ్మ గంగకు మంచి నీళ్లకుపోయే ఉద్దేశంతో చంకన బిందెపెట్టుకొని ఇంట్లో నుంచి సావట్లోకి వచ్చి! మాచమ్మ : అబ్బాయీ! ఏమిటి అప్పుడే ఆ పెట్టె సర్దించడం వచ్చినట్లా పెట్టినట్లా. అంత తీరుబడి లేకపోతే ప్రస్తుతము రావటమే మానుకోక పోయినావూ? వచ్చినందుకు రెండు దినాలైనా.... శ్రీనాథుడు : ఇవాళటికి నాలుగో నాటి సాయంకాలానికల్లా రాచకొండ చేరుకోవాలి. ఈతడవకు నన్ను ఆపకక్కయ్యా! మాచమ్మ : ఏమంత అవసరము. రెణ్ణాళ్ళు ఆలస్యమైతే ముంచుకోబోయ్యేది ఏమన్నా ఉన్నది గనుక. శ్రీనాథుడు : (అవీ ఇవీ సర్దుకుంటూ) రాచకొండలో గోపాలోత్సవాలకు సింగభూపతి ఆహ్వానిస్తే నేనూ తిప్పయసెట్టీ విక్రమ సింహపురం నుంచి బయలుదేరి వెళ్లుతున్నాము. అతడు అలాగే వెళ్ళిపోయినాడు. నేను నిన్ను చూచి వెంటనే బయలుదేరి వస్తానని చెప్పి ఇలా వచ్చాను. మాచమ్మ : పోనీ ఇవాళ సాయంత్రందాకా నైనా ఉండకుండా అదేమిట్రా - ఆగర్భ శ్రీమంతు అతగాణ్ణి కూడా మన ఇంటికి తీసుకోరాక పోయినావూ, మీ బావగారికీ అతనికీ పరిచయం ఉంటే ఎన్నిటికైనా మాకు ఉపయోగించేది. శ్రీనాథుడు : నిజమే, నాకు ఆ ధోరణే లేకపోయింది. ఔను అతని పరిచయము సామాన్యులకు లభించటము చాలా దుర్లభము. అతడు కేవలం ఆగర్భ శ్రీమంతేకాదు. మంచి రసికుడు. విశేషించి కవితాభిమాని. అయినా ఇంతలో ముంచుకో పోయిందేముంది. మరిచిపోయినాను బావగారు కూడా రాచకొండ గోపాలోత్సవాలకు వస్తారుగా. అక్కడ అతని పరిచయభాగ్యం కలిగిస్తాను. రాజు ఆహ్వానం పంపించాడా? మాచమ్మ : వచ్చినట్లు లేదురా అబ్బాయీ? 352 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 శ్రీనాథుడు : ఇంకా గడువు చాలా ఉన్నదిగా. మొదటినుంచీ సింగభూపతి ఆశ్రయంలో ఉన్న కవిగూడానై పోయె బావగారు. ఆహ్వానం పంపించకుండా ఉండరు. మాచమ్మ : ఏమో నాయనా? మొదటి మాట మీ బావగారికి ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో కూడా తెలియదు. భోగినీ విషయంలో ఎవరితోనో ఈన ఏదో అన్నాడనీ దానిమీద భూపతి మందలిస్తే ఈన ఏదో పెడ సమాధానం చెప్పాడట. బాగా మనస్పర్థలు ఏర్పడ్డట్లున్నవి. ఈన మాటలను బట్టి చూస్తే ఆహ్వానం వస్తుందో రాదో! శ్రీనాథుడు : సింగభూపతి ఇలాటి చిన్నవిషయాలు మనస్సులో పెట్టుకుండేవాడు కాదు. పైన బావగారంటే విశేషాభిమానం ఉన్నట్లు విన్నాను కూడా. ఆయన మనస్సులో స్పర్ధ ఉంటుందని అనుకోను - నేను ఇవాళనే బయలుదేరి వెళ్లుతున్నానుగా. భూపతితో మాట్లాడి బావగారికి వెంటనే ఆహ్వానం వచ్చేటట్లు చేయిస్తానుగా. మాచమ్మ : ఒకవేళ వచ్చినా ఈన బయలుదేరవద్దూ. - శ్రీనాథుడు : దానికి ఎవరేం చేస్తారు పోనీ మరొక సమయంలో తిప్పయసెట్టి పరిచయం చేస్తాను. మాచమ్మ : అబ్బాయీ! అయితే ఉత్సవాలలో ఆధ్వర్యం నీదేనా ఏమిట్రా. శ్రీనాథుడు : అందుకనే తిప్పయసెట్టి నేనూ ఇంతముందుగా బయలుదేరి రావటము. ఉత్సవ కలాపాలన్నీ వచ్చే పౌర్ణమికి పూర్తి కావాలి. మల్లన్న ఏడిఅక్కయ్యా! బావగారితో వాడుకూడా వస్తే ఎంతో బాగుంటుంది. ఏదో సందర్భంలో సెట్టికీ, సింగభూపతికీ మా కాబోయే అల్లుడని చూపిస్తాను. (దొడ్లో నుంచి మల్లన్న పొలానికి పోవటానికి సిద్ధపడి బయటికి వచ్చి) మల్లన్న : మామా! పొలిమేర చేలో గుంటక తోలటం కొంత మిగిలిపోయింది. త్వరగా పూర్తి చేసుకువస్తాను. శ్రీనాథుడు : అబ్బాయీ! నేను ప్రయాణమౌతున్నాను. నీవు కూడా మీ నాన్నగారితో పాటు రాచకొండ గోపాలోత్సవాలకు తప్పకుండారావాలి. నడిపించేది నేనే. మల్లన్న ఇంత ఆలస్యం చేశావేం మామా! నిన్న సాయంత్రమే బయలుదేరక పోయినావేం. ఏకాంకికలు 353 మాచమ్మ : ఏమో! నాయనా, చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వచ్చాడు. వెళ్లక తప్పదట. మల్లన్న: వెళ్లక తప్పదూ? ఎందుకు తప్పదో చూతాం. ఉత్సవాలెప్పుడో ఇంకా మాసం పై చిలుకుంటే వీరంతా ఎంత కార్య నిర్వాహకులైనా ఇప్పటినుంచే ఏం చేస్తారేం. ఆయన ఉండదలచుకోక ఇదొక సాకుచెప్పుతున్నాడు గాని. శ్రీనాథుడు కాదులే మల్లన్నా, నన్ను బలవంతం చెయ్యవద్దు. నేను ఒక్కణేకాదు, తిప్పయ్యసెట్టి కూడా బయలుదేరి వచ్చాడు. అతడు నాకంటే ముందే రాచకొండ చేరుకుంటాడు. మాచమ్మ : అబ్బాయీ! తిప్పయసెట్టి అంటే నీకు తెలుసునా మామకు చిన్నప్పటి నుంచీ స్నేహితుడు. గొప్ప శ్రీమంతుడు. మల్లన్న : మనిషినైతే చూడలేదుగాని తిప్పయ్య పేరు వినకపోవటమేం. తిరగటి కల్లులాగా దేశదేశాలూ తిరిగి కర్పూరం, చందనం, పునుగు జవ్వాజి అదే పేర్లతో రాజుల నందరినీ దోచుకుంటుంటాడు. ఆ రాజులు మనబోటి కర్షకులను దోచుకుంటుంటారు. శ్రీనాథుడు : మల్లన్నా! అది దోపిడీ ఏమిటి, వ్యాపారానికి లక్షణం. వాళ్ళు ధనవంతులు కాక పోతే దేశానికి వస్తు సంభారాలు వచ్చే వీలేలేదు. రాజులు ప్రజల మీద పన్నులు వేసి గ్రహించక పోతే పరిపాలనే లేకుండా అరాజకమైపోతుంది దేశం. మాచమ్మ : మల్లన్నా! ఎలాగైన మామను ఇవాళ పోనీయకుండా ఆపే భారం నీది. శ్రీనాథుడు : అక్కయ్యా! ఎందుకీ నిష్ఠూరం వృథాగా! రానా పోనా? మల్లన్న : అమ్మా! ఎలా పోతాడో చూస్తాను. నేను పొలం పని మానుకుంటాను. పోనీ రేపొతుంది. నీవు త్వరగా గంగకు వెళ్ళి రాపో మడికట్టు కుందువుగాని. మాచమ్మ : అబ్బాయీ, పొద్దున్నే మీ నాన్న పోతవరం వెళ్లారు. ఆయన వచ్చేలోపల మామయ్యకు మీ నాన్నగారు వ్రాసిన కవిత్వం వినిపించు తప్పులుంటే దిద్ది సరిచేస్తాడు. (బిందెతో గంగకు బయలుదేరుతుంది) శ్రీనాథుడు : మల్లన్నా! అనవసరంగా ఇక్కడ నేను ఆగిపోటమూ, అక్కడ మానెత్తిన తలకు మించిన బరువు కాచుకో కూర్చోటమూ. మల్లన్న : కొంత కాలంనుంచి మా నాన్నగారు భాగవతము ఆంధ్రీకరిస్తున్నారు. అది నీవు వినకుండా పోవటానికి వీలులేదు. 354 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 శ్రీనాథుడు : ఆఁ..... సాహసమో...... శక్తి... మల్లన్న : సాహసమో, శక్తి.... వినాలి. ఇప్పుడే వస్తాను. (లోపలికి పోయి ధావళీకట్టుకొని భాగవతము తీసుకోవస్తాడు. శ్రీనాథుడు ఈ లోపల అటూ ఇటూ పచారు చేస్తూ ఆలోచిస్తుంటాడు) (కృష్ణాజినం మీద మడికట్టు కొని కూర్చొని మల్లన్న గ్రంథ ప్రారంభం చేయబోతూ) మల్లన్న : మామా! మొదలు పెట్టమన్నావా? శ్రీనాథుడు : (పచారుచేస్తూనే) అబ్బాయీ! మీ నాన్న కవితా ధోరణి ఏమన్నా మారిందా? లేకపోతే వెనకటి వేళ్ళలోనే నడుస్తున్నదా బండి. మల్లన్న : వెనుకటి వేళ్ళలోనంటే? శ్రీనాథుడు : భోగినీ దండకమా, వీరభద్ర విజయమూ రెండు నడిచిన వేళ్లు- మల్లన్న : ఏమో అదంతా నీవే చెప్పాలి. శ్రీనాథుడు : శైలిలో మార్పేమీ నీకు కనిపించలేదా! ఔచిత్యాన్ని ఆదరించటమూ, అనౌచిత్యాన్ని పరిహరించటమూ, భావాన్ని ఉపలక్షించటమూ వీటికేమన్నా ప్రయత్నించాడా. 'ముక్కస్య ముక్కారః' కాదుగదా? మల్లన్న : ఆయనకు ఈ విషయమైన భ్రాంతే ఉన్నట్లు నాకు తోచలేదు. శ్రీనాథుడు మరి? మల్లన్న : ఒకనాడు ప్రాతఃస్నానం చేసి గంగ నుంచీ యింటికి వచ్చి 'మల్లన్నా ఘంటం తాళపత్రం త్వరగా తీసుకోరా అన్నారు. తీసుకోవచ్చాను. తదేక దృష్టితో ఏ విధమైన స్మరంతీ లేకుండానే చెప్పేది వ్రాయమన్నారు. వెంటనే చెప్పండి అన్నాను. ఆయన - "పలికెడిది భాగవతమట. పలికెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ పలుకునేలా” అని చెప్పి దేవతా ప్రార్థనము చేశారు. నేను వ్రాశాను. ఏకాంకికలు 355 శ్రీనాథుడు : వీరభద్ర విజయం వంటి వీరశైవ కావ్యాల మీద నుంచి ఒక్కమాటుగా మనస్సు భాగవతం మీదికి ప్రసరించి వేదాంతవీథి విహారం చేయటానికి సంకల్పించింది. మల్లన్న : ఏమో మామా! ఈ పద్యమేమిటి ఈ దైవప్రార్థన మేమిటి నాన్నా అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే - స్నానంచేసి గంగ ఒడ్డున తారకమంత్రం జపించుకుంటూ కూర్చున్నానురా అబ్బాయీ, ఇంతలో కనుచూపు మేరలో మెరపుచెంగట ఉన్న మేఘములాగా ఒక దేవతా స్త్రీతో ఒక శ్యామసుందర మదనమోహనమూర్తి నా కళ్ళకు కట్టింది. అటే తదేక దృష్టితో చూస్తూ ఉండగా కొంతసేపటికి ఎక్కడో చూచినట్లు అనుమానం కలిగింది. స్మరణకు వచ్చి ప్రభూ! అని కేక వేసేటప్పటికి శ్రీ సీతారామ పరబ్రహ్మము నా చేరువకు వచ్చి 'పోతన్నా ఏ మహాకవి చేతనైనా భాగవతము ఆంధ్రీకరణము చేయిద్దామనే సంకల్పంతో వచ్చాను. నీవు చేస్తే బాగుంటుందని కోరటానికి వెతుక్కుంటూ వచ్చాను. నాకు బాసట ఇస్తేగాని వెళ్ళిపోనని చేతులో చేయివేయించు కుని తిరోహితుడై నాడురా ప్రభువు' అని చెప్పారు. శ్రీనాథుడు : (వ్యంగ్యగర్భితంగా) ఒక కావ్యమన్నా కవి సమాజాల నోట పడకుండానే, మహారాజుల మన్నన పొందకుండానే బావగారు రామచంద్రమూర్తి మమతతో ఆర్థించి కావ్యాన్ని వ్రాయించుకోదగ్గ మహాకవి ఐనారు. అందుకు సంతోషము. మల్లన్న : ఈ రాజులూ తరాజులు మన్నిస్తేనేం మన్నించకపోతేనేం, చూస్తున్నాంగా లోకంలో ప్రచారంలో ఉన్న కవి సమాజాలన్నిటినీ, చిత్తచాంచల్యంతో చెలరేగుతూ ఉన్నవి. కవి సమాజాలంటే బాగుంటుంది. అటువంటి వాటి నోటికెక్కితేనేం ఎక్కకపోతేనేం. రాజాధిరాజు, రాజ పరమేశ్వరుడు రామచంద్రమూర్తి స్వయంగా వచ్చి అర్థించిన తరువాత. శ్రీనాథుడు : (గర్భితంగా) తనను మహాకవిని చేసిన రామచంద్రమూర్తిని బావగారు కృతిపతినైనా చేయటానికి సంకల్పించుకున్నారా? మల్లన్న : మామా అది వేమభూపతి కృపావీక్షణం లేనిదే ఘంటం బెత్తెడు సాగని నీకది నచ్చుతుందా. శ్రీనాథుడు : (చిరునవ్వుతో) మల్లన్న - మీనాన్న నిరాశలో పడ్డారు. నిరాశకు పుట్టిల్లు భ్రాంతి. భ్రాంతి తన్నాశ్రయించిన వాళ్లకే కాదు వాళ్ల మాటలు వినేవాళ్ళకు కూడా మతి పోగొడుతుంది. 356 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 మల్లన్న : ఆ విభ్రాంతాత్మతోనే నాన్నగారు భాగవతము పూర్తి చేస్తున్నారు. ఆత్మీయతతో అతిశయించే ఈ భాగవతమంటే భ్రాంతి నీ మతినికూడా పోగొడుతుందో లేదో చూదము. శ్రీనాథుడు : ఈపాటికే మామతి పొయ్యెటట్లయితే ఈ దిగ్విజయాలేం చేస్తాము. ఈ కనకాభిషేకాలేం చేయించుకుంటాం. మల్లన్న : మామా! ప్రారంభించమన్నావా. ఈ కూశాస్తరణం మీద కూర్చొని వింటే ఎంతో బాగుంటుంది. శ్రీనాథుడు : ఇలాగే తిరుగుతూ వింటుంటే విశేషాలు త్వరగా తల్లో ప్రవేశిస్తవి. కానీ. మల్లన్న : (గొంతు సవరించి వ్యాసపీఠానికి నమస్కారం చేసి) శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్ దానవో ద్రేక స్తంభకు, (అని వరుసగా చదువుతూ ఉంటాడు) - మూడవ దృశ్యం (సాయం సమయం వేదికమీద సంధ్యారుణ కిరణ ప్రసారం వల్ల కిమ్మీరిత మౌతుంటుంది. శ్రీనాథ మహాకవి నీలాకాశం వైపు చూస్తూ ఆలోచించుకుంటూ మధ్య మధ్య బంగారపు టొరలోనుంచి ఘంటం బయటకు తీస్తూ తాళపత్ర గ్రంథం మీద వ్రాసుకుంటుంటాడు. మల్లన్న అప్పుడే పొలం నుంచి తిరిగి వచ్చే వేషంతో ముల్లుగర్ర, చెన్నకోల దూరంగా పెట్టి దగ్గరికి వచ్చి కూర్చొని) మల్లన్న : ఏమిటా గ్రంథం మామా! శ్రీనాథుడు : కాశీఖండం మల్లన్నా - వచ్చే వసంతోత్సవాలల్లో రాజమహేంద్రవరం వీరభద్రారెడ్డికి కృతి ఇవ్వాలి. మొన్న మేమంతా కాశీయాత్రకు వెళ్ళినప్పుడు ప్రసంగవశాత్తూ ఆయనకు ఆ క్షేత్ర మాహాత్మ్యం చెప్పవలసి వచ్చిందిలే. ఏకాంకికలు 357 మల్లన్న : ఓహో! అప్పుడు ఈ బేరం తగిలిందన్న మాట! ఊఁ శ్రీనాథుడు : బేర మేమిటిలే. ఆ మహారాజు కోరటమే కాదు. నాకు చిన్నతనం నుంచీ కాశీఖండం కూడా అనువాదం చెయ్యాలనే అభిలాష కూడా ఉందిలే. అయితే ప్రస్తుతం ఆ మహారాజు కోరిక ఉద్బోధనమైంది. అంతే. మల్లన్న : మంచిది. బాగుంది మామా! 'కాశీఖండ మయః పిండం నైషధం విద్వ దౌషధం' అన్నారు పెద్దలు. అయితే ముందే ఏదో ఒక ఆంధ్రరాజుచేత ఆ అయః పిండాన్ని మింగించి తరువాత నైషధ విద్వదౌషధాన్ని ప్రసాదించవలసింది. సమంజసంగా ఉండేది. శ్రీనాథుడు : ముందు ఔషధం చేతిలో లేందే, ఏమోతుందో చూద్దామని ఇనపముద్ద మింగిస్తే, రోగి అస్తుబిసైతే తరువాత గుడ్లు మిటకరించాలిసిందే వైద్యుడు. ఆయన చేతి మాత్ర వైకుంఠ యాత్ర ఔతుంది మన పని. మల్లన్న : అందుకని ముందే నైషధవిద్యదౌషధాన్ని కనిపెట్టి ఇప్పుడు ఆయు: పిండం మింగబోతున్నావన్న మాట - అయితే ఇది స్కాంద పురాణాంతర్గతం కదూ! మామా సగానికి పైబడ్డదా? శ్రీనాథుడు : పంచమాశ్వాసంలో ఉన్నాను. కానీ ఇవాళ ఉదయం నుంచీ ఘంటం సాగటం లేదోయ్- మల్లన్న : కారణం? శ్రీనాథుడు : మీ నాన్నగారి అనువాద పద్ధతి చూచిన తరువాత కావ్యమంతా మరొక దృక్పథంతో ఆంధ్రీకరిస్తే బాగుంటుందేమోననిపిస్తున్నది. మల్లన్న : మా నాన్న పద్దతి నిన్నాకర్షించిందా? చిత్రమే - వెనుక ఒక మాట అన్నావు జ్ఞాపకముందో లేదో! శ్రీనాథుడు : ఏమన్నానేమిటి? మల్లన్న : కొత్తగా ఛందస్సు నేర్చుకున్న వాళ్ళు చెప్పినట్లుందన్నావు. శ్రీనాథుడు : ఎప్పుడు? మల్లన్న : ఆయన నీకు వెనక వీరభద్ర విజయం వినిపించినప్పుడు. 358 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 శ్రీనాథుడు : ఏమో! అంటే అనే ఉండవచ్చు - అప్పుడు నైషధం సింగామాత్యున కంకితమిచ్చాను. అత్తలేని కొత్త కోడలి కాపురంలా ఉండేది నా పని. నన్ను మహాకవి అని పొగడినా నాకు మనస్సుకు తృప్తిగా ఉండేది కాదు. ఇంకొకడు కవి అంటేనే సహించేవాణ్ణి కాదు. ఛందస్సు కొత్తగా నేర్చుకున్న వాళ్లు చెప్పినట్లుందనన్నా అన్నాను. అప్పటికి విశేష గౌరవమిచ్చి మాట్లాడినట్లే - నా స్థితిని బట్టి - మల్లన్న : అంతేకాదు. పాండిత్యము ఏ మాత్రమూ లేదన్నావు. శ్రీనాథుడు : ఆ మాటా అని ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు అంగీకరించ టానికి ఏ అభ్యంతరమూ లేదు. అయినా పాండిత్యానికీ కవిత్వానికీ చుక్కెదురు. లక్ష్మీ సరస్వతులకున్నంత సంబంధం, సహవాసం. మల్లన్న : మామా, నిన్న రాత్రితో మా నాన్న భాగవతమంతా విన్నావు గదా, నీ వెనకటి అభిప్రాయమేమన్నా సడలిందా? శ్రీనాథుడు : అబ్బాయీ, బావగారి భాగవత శ్రవణం నాకేదో చెప్పరాని నూతనోత్తేజం కలిగించింది. లేఖిని, వెనక నడచిన నడక నడవనని మొరాయిస్తున్నది. మల్లన్న : లోపాలేమన్నా ఉంటే దాచకుండా నాతో చెప్పు మామా, నాన్నకు చెప్పి సవరణ చేయిస్తాను. శ్రీనాథుడు : లోపాలకేం లేవోయ్. వెదకటం మొదలు పెడితే లోపాలు కవికుల గురువు కాళిదాసు కావ్యాలలోనే కనిపిస్తవి. కావలసినన్ని అపాణినీయ ప్రయోగాలు. వాటిజోలెందుకు. మల్లన్న : మామా ఏమిటాలౌక్యము - రాజా స్థానాలల్లో అలవాటు పడ్డందుకు అది నిన్ను వదిలిపెట్టదా ఏం ఆప్తులతో మాట్లాడేటప్పుడు కూడా! - శ్రీనాథుడు : అయినా బావగారు నిర్దుష్ట, నిర్గద్య నిరోష్యాలే వ్రాస్తానని ప్రతిజ్ఞ చేయలేదుగా అదీకాక మహానుభావుడు ఆయన భాగవతం వింటున్నప్పుడు ఈ చెదపురుగు చేసే పని చెయ్యటానికి మనస్సుకు ఆసక్తే కలగలేదు. వెనుక బావగారి కవిత్వమంటే నాకు గౌరవ ముండేది కాదు. మనస్ఫూర్తిగా చెప్పుతున్నాను. నిన్నటితో నా విశ్వాసం మారిపోయింది. మల్లన్న : ఆయన ఆశించడు. కాని భవిష్యత్తులో మా నాన్నగారికి ఆంధ్ర కవికుల సార్వభౌముల్లో ఏమన్నా స్థానముంటుందా? ఏకాంకికలు 359 శ్రీనాథుడు : ఆయనది ఒక అద్వితీయస్థానము. భావి విమర్శకులు ఆయనను సారస్వతాకాశ శీతమయూఖుడిగా పరిగణిస్తారు. ఆంధ్ర జాతికెంత వయస్సున్నదో ఆంధ్రభాగవత కన్యకకూ అంతవయస్సు. బావగారు ఆంధ్రభాషను పునీతం చేయటానికి పుట్టిన పుణ్యమూర్తి. కవిత్రయం ఏ మహోన్న తాశయాలతో కవితా వ్యవసాయం సాగించారో, ఆ దృక్పథంతో కావ్య రచనకు పూనుకున్నది మళ్ళీ బావగారే - మల్లన్నా! ఆయన చెప్పుకున్నాడే - 'నా జతనంబు సఫలంబు సేసెద పునర్జన్మంబు లేకుండగన్' అని ఆ విధంగానే ఆయనకు పునర్జన్మ లేదనే నా నిశ్చయము. తన తరణోపాయం చూచుకొని కాలం వెళ్ళబుచ్చుకు పోదలుచుకున్న కవి సామాన్యుడు కాడు ఆ వ్యక్తి. తనతో పాటు ఆంధ్రజాతినంతటినీ మోక్షమార్గ సాంయాత్రికులను చేసుకుంటేగాని సంతృప్తి కలగనట్లుంది ఆయన ఆత్మకు. ద్వైపాయనతుల్యుడు గాని సామాన్యుడా? మల్లన్న : మామా! నీ వింత భావోద్వేగివని నేను ఎన్నడూ అనుకోలేదు. శ్రీనాథుడు : ఈ మాటలన్నీ శిలాక్షరాలు మల్లన్నా! సమస్త కవితా సాగరాలలోనూ నాకు అందుకోలేని అగాధ జలధిలా ఉన్నది మీ నాన్నగారి కవితాత్మ. - ఇదంతా సత్యమని నమ్ము. మల్లన్న సత్యం కాదని కాదు. నీకు అభిమానం కలిగితే అది అవధులు దాటిపోతుందేమోనని నా భయం. లేకపోతే - అష్టాదశ మహాపురాణాలను ఆపోశనం పట్టిన ద్వైపాయన మహర్షికీ మా నాన్నగారికీ ఎక్కడి సామ్యం - ఆయన ఋషిత్వం..... శ్రీనాథుడు : (సోద్వేగంగా) ఆయన ఋషిత్వమేమిటి? ఆయన దార్శనికస్థితిని తలతన్ని పోయినారు బావగారు. మల్లన్న : ఏమో! శ్రీనాథుడు : ద్వైపాయనమహర్షికంటే బావగారిలో ఇంకో విశేషగుణమున్నది. భక్తి భావ పారవశ్యము. మల్లన్న ఒకటి మాత్రం సత్యము. మహర్షిని కవితా వైదగ్ధ్యంలో మా నాన్న మించుతాడు. శ్రీనాథుడు : ఏ మహారాజుకో అంకితమిచ్చేనాడు కవిపండిత సమాజాలు ఏమంటవో వింటావుగా. మల్లన్న : నరాంకితం చెయ్యటానికి నాన్న అంగీకరిస్తాడా? 360 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 శ్రీనాథుడు లేకపోతే గత్యంతరమేముంది. ఈ ఘోర దారిద్ర్యాన్ని ఎన్నాళ్ళు అనుభవిస్తారు. మల్లన్న : మేమేం దారిద్ర్యాన్ని అనుభవించటం లేదే! కష్టపడిపొలం దున్నుకుంటాం. పండిన దేదో వండుకొని సుష్టుగా భోజనం చేస్తాము. పత్తి పండించుకొని వడికి నేయించుకొని బట్టలు కట్టుకుంటాం. మాకేం లోపము? దేనికీ లోపము? శ్రీనాథుడు : బాగుంది పద్ధతి. ఏముంది. గురివెంద చేరులు పెట్టుకొని కులికే కోయపిల్లకు కంసాలితో పనేముంటుంది. సుఖపడటమంటే ఏమిటో ఎరగని వాళ్ళకు తమకేం కావాలో, ఏం లోపమో ఏం తెలుస్తుంది. మల్లన్న : భౌతిక జీవితానికి అవసరమైనంత వరకు కోరుకుంటాం. కష్టపడి సంపాదించుకుంటాం. కోరికల కళ్ళాలు సడిలిస్తే మళ్ళీ చేతికి చిక్కుతాయా? ఏదో పరమేశ్వరుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి గాని ఊరికే కోరికలు పెంచుకుంటే మానవజీవితం ఎంత దుర్భరమై పోతుందో ఆలోచించావా? శ్రీనాథుడు : మేము కష్టపడుతున్నామంటావు. అదంతా వృథా శ్రమ. మనకు కాని శ్రమ. లేకపోతే కవులకు కర్షక వృత్తేమిటి? ఎందుకు - మల్లన్న : స్వేచ్ఛను చంపుకోకుండా కాపాడుకోటానికి, సత్యాన్ని రాజభయం లేకుండా బహిర్గతం చేసే స్వాతంత్ర్యాన్ని రక్షించుకోటానికి - శ్రీనాథుడు : స్వనాశన సమయంలో కూడా స్వాతంత్ర్య రక్షణ మనబోటి సంసారులకేం సాగుతుంది. మహాత్ములైన మహర్షులకు గాని. మల్లన్న : మామా! అయితే నీవు మా నాన్నను ఏ మహారాజునైనా ఆశ్రయించి ఒక అగ్రహారం సంపాదించమంటావు. అంతేనా? శ్రీనాథుడు లేకపోతే జీవన సముద్రాన్ని తరించేదెట్లా? దారిద్య్ర నౌక నెక్కితే దరిజేరటానికి అవకాశం ఉందో లేదో ఆలోచించుకోకపోతే ఎలా? మల్లన్న : 'పునరపి జననం, పునరపి మరణం'గా జీవయాత్ర సాగిద్దామనుకుంటే మటుకు యీ సాంయాత్రికతకు అంతెక్కడో, అవధియెక్కడో కూడా ఆలోచించుకోవాలి కదా? ఏకాంకికలు 361 శ్రీనాథుడు : బాగున్నది వేదాంతము. దాని మెళ్ళో మేం పెట్టిన పులిచేరుతాడు పోయినంతకు అమ్ముకుతిన్నారు. పుస్తెల తాడూ అదీ మిగిలింది. సంసారాన్ని ఇంత అయోమయంలో పడేస్తే తరువాత సాగేదెట్లా? (లోపలినుంచి మాచమ్మ ఎందుకో పని ఉన్నట్లుగా బయటికి వస్తుంది) మాచమ్మ : ఏమో నాయనా, బాగా నచ్చచెప్పిపో తండ్రీ వీడికైనా. ఆయనకు పట్టిన పిచ్చే వీడికి పట్టింది. సంసారం గొడవ ఆ తండ్రికీ పట్టదు ఈ కొడుక్కూ పట్టదు. పొద్దున లేచింది మొదలు పూజా పునస్కారాలతో ఆయనా, పొలం పనితో వీడూ- శ్రీనాథుడు : అయితే-ఇంకేం బాగుపడ్డట్టే. మాచమ్మ : మీ బావగారితో ఏం చెప్పుతావో ఆలోచించుకో. వియ్యానికీ, కయ్యానికీ సరిసాటి కావాలిగా, సాటివాళ్ళనుగా చేస్తావో సంబంధమే మాను కుంటావో. నేను ఎన్ని తడవలు నెత్తిన నోరు పెట్టుకొని కొట్టుకున్నా, ఆ తండ్రి తండ్రే, ఈ కొడుకు కొడుకే - సంగతులన్నీ ఒక్క మాటు నీవు మాట్లాడితేగాని తేలదు. ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట. శ్రీనాథుడు : ఆయనకు నా మాటమీద కొంత విలువ ఉన్నదనుకుంటాను. మాట్లాడి చూస్తాను. మాచమ్మ : చూస్తానంటే కాదు. అదుగోనంటే ఆయన ఆరు నెలలకు మనిషి. నీ యిష్టం ఏమైనా చెప్పు. ఒప్పించి ఇప్పుడే నీ వెంట ఎక్కడికైనా తీసుకోపోతే సరిగాని లేకపోతే నా కాపురం వల్లకాడే. శ్రీనాథుడు : ఇప్పుడే నా వెంట బయలుదేరుతానంటే నాకు మరీ సంతోషము. రేపటి గోపాలోత్సవాలలోనే భాగవతము సింగభూపతికి ఇప్పించి బావగారికి ప్రత్యేకంగా ఒక ఖండ్రిక శాశ్వతభోగం చేయించనూ. మల్లన్న : అమ్మా! అదుగో నాన్న (లేచి దూరంగా వస్తూ ఉన్న పోతన్నకు ఎదురుపోయి నెత్తిమీద మూట అందుకొని తీసుకువచ్చి సావట్లో దించుతాడు. మల్లన్న వెనుక పోతన్న నేలచూస్తూ అలసిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ వేదికమీదకు వచ్చి కూర్చుంటాడు. 362 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 పోతన్న : (మోకాళ్ల మీద చేతులు పెట్టుకొని కూర్చోబోతూ) రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో (నెమ్మదిగా కూర్చున్న తరువాత) శ్రీనాథుడు : బావగారూ.... ఎక్కడ నుంచి? పోతన్న : అదుగో! పోతవరం పొలిమేరలలో పెద్ద మర్రిచెట్టు నాయనా, విస్తరాకుల కోసమని వెళ్ళి వస్తున్నాను. శ్రీనాథుడు : మీకు వృద్దాప్యం వచ్చేసింది. పోతన్న : రాకేముంది. షష్టిపూర్తికి నాలుగో మెట్టులో ఉన్నాను? - ఇదుగో ఈ పని బడి నీతో పగలు భోజనం చేసిన తరువాత మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. ఊఁ ఇప్పుడేమన్నా కొత్తకావ్యం చెపుతున్నావా? శ్రీనాథుడు : రాజమహేంద్రవరం రెడ్డిరాజు వీరభద్రారెడ్డికి వచ్చే వసంతోత్సవాలల్లో కాశీఖండం అంకితమివ్వాలి. పోయిన ఆషాఢారంభంలో కర్పూరపు తాంబూలము అందుకున్నాను. వ్రాస్తున్నాను. - పోతన్న : గ్రంధం సగభాగమైనా అయిందా? మొదటినుంచీ నీ కావ్యకన్యకు ప్రౌఢతేనోయ్ - శ్రీనాథుడు : ప్రౌఢలను మహారాజులుగాని ఏలుకోలేరని నా అభిప్రాయం. పోతన్న : నీ ఛలోక్తి నేను ఉద్దేశించలేదు.... నాయనా! శ్రీనాథుడు : బావగారూ! మల్లన్న వినిపిస్తే మీ భాగవతము విన్నాను. పోతన్న : నా భాగవతమా! నాదేముంది నాయనా! అది వ్యాసభగవానులు భాగవతము. శ్రీనాథుడు : మీరు వారి అపరావతారము. మీ ఆంధ్రీకరణమార్గం అన్యకవిపాంథగమ్యం కానిది. పోతన్న : ఆ ఆంధ్రీకరణములో నా ప్రతిభ ఏముంది తండ్రీ! ఆ రామచంద్రమూర్తి నా జిహ్వాగ్రంలో నిలిచి ఏం పలికిస్తే అది వ్రాశాను - భాగవతకర్త శ్రీరామచంద్రమూర్తి కాని మరెవ్వరూ కాదు. ఏకాంకికలు 363 శ్రీనాథుడు : మీరెలా భావించినా లోకం భవిష్యత్తులో భాగవతము పోతనామాత్యులదనే చెప్పుకుంటుంది. పోతన్న : లోకం ఏమని చెప్పుకుంటే నాకెందుకు శ్రీనాథుడు : బావా, మీరు చాలా అదృష్టవంతులు. కాబట్టే భాగవతము ఆంధ్రీకరించే మహాభాగ్యం మీకబ్బింది - అంతకంటే మరొక విధంగా - భాగవతాంధ్రీకరణము మీ చేతుల్లో పడటము వల్ల ఆంధ్రులు అదృష్టవంతులనటం మరీ సమంజసమైన అభిప్రాయము. పోతన్న : ఆంధ్రుల అదృష్టముమాట నాకు తెలియదు గాని ఒక విధంగా నేను అదృష్టవంతుడననే భావించుకుంటున్నాను. నా పురాకృత శుభాధిక్యం కాకపోతే రామచంద్రమూర్తి భాగవతం నా నోట పలికించటానికి సంకల్పిస్తాడా? శ్రీనాథుడు : నన్నయాది మహాకవులు పురాణాలు తెలుగుచేస్తూ భాగవతం తెలిగించక పోవటము నా పురాకృతపుణ్యమని వ్రాసుకున్నారు గానీ ఆ మహాకావ్యానికి అవసరమైన శక్తి సంపన్నత వారికి లేదని నా అభిప్రాయం. పోతన్న : ఎంతమాట! ఆంధ్రకవితా విశ్వానికి త్రిమూర్తులు మహాత్ములు నన్నయాదులకు భాగవతాంధ్రీకరణానికి అనుయోగ్యమైన శక్తిలేదని నా అంతరాంతరాలల్లో కూడా అనుమానం లేదు. అవిరళ జప హోమ తత్పరుడూ, సంహితాభ్యాసి, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాననిరతుడూ అయిన నన్నయ్యభట్టారుడికి భాగవతాన్ని తెలిగించే ప్రజ్ఞ లేదనుకోటం భావ్యంకాదు. ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడూ శిల్పపారకుడూ, తను కావించిన సృష్టితక్కొరులచేత కాదనిపించుకున్న తిక్కన మహాకవికి ఎదురుతిరిగే వస్తువెక్కడ ఉంటుంది. ఎర్రన్న మాత్రం - సామాన్యుడా. ఆదిగురువులు నడిచిన అనన్య సాధ్యమార్గద్వయంలో అందెవేసిన చేయి - భాస్కరాదులు. శ్రీనాథుడు : మీ భాగవత కన్యకకు తగ్గ వరుణ్ణి ఊహించాను, బావగారూ! పోతన్న : మా కన్యకకు సమస్త విధాలా తగ్గవరుణేనా? శ్రీనాథుడు : అవును - మదన మోహనుడు, సర్వజ్ఞుడు పోతన్న : రసార్ణవ సుధాకరుడు! శ్రీనాథుడు : సింగభూపతి, ఔను రసార్ణవ సుధాకరుడు. 364 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 పోతన్న : (చెవులు మూసుకొని) ప్రభో! రామచంద్ర ప్రభో! శ్రీనాథుడు : మీరు కోరుకున్నది ఇప్పిస్తాను. పోతన్న : మా 'ఓలి' ఈ మండలాధిపతులు ఏమివ్వగలుగుతారు. శ్రీనాథుడు : మీరు కోరినది ఇప్పించే భారం నాది. పోతన్న : నాకొక శాశ్వత మహాదానం చేయించాలి. శ్రీనాథుడు మీరు కోరిన గ్రామం శాశ్వతవృత్తులతో దాన మిప్పేంచేటట్లు - అంగీకరిస్తారా. పోతన్న : శాశ్వత వృత్తులతోనా! - కల్ల నాయనా! పిచ్చివాడా, సగరుడు, మాంధాత, నహుషుడు, నాభాగుడు - ఎంతెంత మంది మహాచక్రవర్తులు ఈ లోకంలో జన్మించారో మృత్యువులు తప్పించుకొని చిరంజీవులైన వాళ్లే అరుదు. అంతటివారే అశాశ్వతులైనప్పుడు ఈ సామాన్య మహా మండలాధిపతులు శాశ్వతులా - వీరు నాకేవిధంగా శాశ్వతదానం చేస్తారు. ఆ శాశ్వతమైన బ్రతుకుతో నేను శాశ్వత దానానికి ప్రతిగ్రహీతను ఎలా కాగలను. శ్రీనాథుడు : బావగారూ, మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు పోనీ కర్ణాట చకవ్రర్తిచేత కనకాభిషేకం చేయిస్తాను - ప్రతిగ్రహీతలుకండి. కావ్యకన్యక నిచ్చి కల్యాణం చేయించండి. పోతన్న : నాయనా! శ్రీనాథా! కర్ణాటభూపతి చేత కనకాభిషేకం చేయించినా - కేవలం కనక కల్పితమైన అగ్రహారం దానం చేయించినా అతడు నా కావ్యకన్యకను వరించటానికి తగ్గ వరుడు మాత్రం కాలేదు. అయినా నాకీ రాజుల వివక్షతో పని ఏముంది. ఆమెను ఎన్నడో పురుషోత్తముడి కిచ్చి ధారవోసి తరించటానికి నిశ్చయించుకున్నాను. శ్రీనాథుడు : ఇంత వృద్ధాప్యంలో కూడా మీరు ఈ దారిద్య్ర దేవతకు స్వస్తి చెప్పటానికి సంకల్పించుకోలేదన్నమాట. పోతన్న : అబ్బాయీ! అనిత్యాలైన ఈ శరీరాలకు ఈ దారిద్ర్యమెన్నాళ్లు, ఈ సుఖాలెన్నాళ్లు, క్షణకాలం అయినా నా దారిద్య్రం ఎవరినీ బాధపెట్టేది కాదే. శ్రీనాథుడు : ఇదివరకు బాధ పెట్టకపోయినా ఇక ముందు బాధపెట్టక మానదు. పోతన్న : అంటే- ఏకాంకికలు 365 మాచమ్మ : (ప్రవేశించి) అంటేనా మల్లన్నకు మావాడు పిల్లనివ్వ దలచుకున్నాడు. చూడబోతే మన ఇంట్లో సూర్యచంద్రాదులు తప్ప ఏమీ లేకపోయెను. ఏమని ఇస్తాడు. వాణ్ణయినా వాడివెంట పంపిస్తే ఇంత పెద్దవాణ్ణిచేసే వాడనుకుంటే అదీ ఆలోచించకపోతిరి. వాడి మెడకు వ్యవసాయం గుదిగొయ్య తగిలించి ఒక వేదాంతిని చేసి కూర్చోపెడితిరి. పోతన్న : అయితే ఏతావత మల్లన్న పెళ్ళికోసం నాకు ఏ మహారాజుకో కాళ్ళుకడిగి కన్యక నర్పించుకోటం తప్పదన్నమాట! అదేనా మీ అభిప్రాయం. రామచంద్ర ప్రభో, రామచంద్ర ప్రభో! (మల్లన్న ప్రవేశిస్తాడు) శ్రీనాథుడు : ఏదో నాకూ కొంత బాధ్యత ఉండబట్టి చెప్పదలచుకున్న మాట లేమిటో నాలుగూ బయట పెట్టాను. తరువాత మీ ఇష్టం. మాచమ్మ : మన బాగు కోరే గదా వాడు ఏదిచెప్పినా? అంత మీకు తలకు ఎక్కకపోతే ఎవరేం చేస్తారు. ఏమిటా విస్తుపోయి దొంగలు పడి కొంప దోచుకుపోయినట్లు ఆ దిగులూ మీరూ, ఎందుకా తలపట్టుకొని కూర్చోవటం - ఏమిరా మల్లన్నా! మామ ఏమన్నాడో వింటున్నారా? మల్లన్న : వినకేం, అన్నిమాటలూ లోపలికి వినిపిస్తూనే ఉన్నవి. మాచమ్మ : అయితే నీ యభిప్రాయమేమిటో స్పష్టంగా మామతో తేల్చిచెప్పు. - మల్లన్న : నా కోసమని ఆయన మనస్సుకు నచ్చని పని బలవంతం చేసి ఆయనచేత ఒప్పించటానికి నేను ఎంత మాత్రమూ అంగీకరించను అయినా నా పెళ్ళికీ - ఆయన గ్రంథం ఏ రాజుకో అంకితమివ్వటానికి ఎక్కడి సంబంధం? మాచమ్మ : అయితే మామతో సంబంధం వదులుకోటానికే నిశ్చయించుకున్నావన్న మాట. మల్లన్న : భాగవతాన్ని మానాన్న మహారాజుకు అంకితమివ్వకపోతే నాకు పిల్లనివ్వటానికి వీల్లేదన్న మాట! శ్రీనాథుడు : ఏం చూచి ఇవ్వమంటావు? పోతన్న : సంప్రదాయం చూచి - సౌశీల్యం చూచి. 366 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 శ్రీనాథుడు : అవేం నా పిల్లకు అచ్చటా ముచ్చటా తీరుస్తవా? అన్నం పెడతవా అయినా ఒక మాట అడుగుతాను మీకు కోపం రాకుండా ఉంటే. మహారాజులంటే మీకు తృణప్రాయంగా ఉన్నది గాని మీరేం మహాకవులు. తిక్కనాదుల కంటే ఎక్కువా? ఆయన మనుమసిద్ధికి కావ్యం అంకితమివ్వలేదా. ఆయనచేత 'మామా' అని పిలిపించు కోటానికి మనసు పడలేదా- పోతన్న : చిన్నతనంలో చేసిన తప్పిదాలను చెరిపేసుకోటానికే యజ్ఞం చేసి సోమయాజిగా మారి భారతాన్ని హరిహరనాథాంకితం చేసి అమృతమూర్తి అయినాడు. శ్రీనాథుడు : మీ కుటుంబ స్థితితో ఈ ఆశయాన్ని ఎంతకాలం నెగ్గించుకుంటారో చూడాలి. పోతన్న : అదంతా ఆ మహానుభావుడి కృప. (దారువిగ్రహం వైపు చూపిస్తాడు) మల్లన్న : మామా! నీకు ఈ విషయంలో ఇంతపట్టుదల ఎందుకు - పిల్లనిచ్చేది నాకు గాని, మా నాన్న సంపాదించి యిచ్చే నా అగ్రహారానికి కాదుగా. అధవా నా దురదృష్టం వల్ల అది పోగొట్టుకుంటాననుకో - అప్పుడేం చేస్తావు? శ్రీనాథుడు : అందుకని చూసి చూసి పిల్లకు స్వయంగా నా చేతులతో గొంతుకు ఉరిబోసి గోతిలో దించుతానా- మాచమ్మ : (పోతన్నతో) ఏమండీ! ఏమీ మాట్లాడరేం. పోతన్న: నన్నేం మాట్లాడమంటావు? మాచమ్మ : మా వాడు చెప్పిన మాటకు మీరేం సమాధానం చెపుతారు? పోతన్న : కంఠంలో ప్రాణమున్నంతవరకూ నా కావ్య కన్యకను శ్రీరామచంద్ర మూర్తికి తప్ప ఇతరులకిచ్చి వివాహం చేయలేను. మాచమ్మ : మా పుట్టింటితో సంబంధం వదులుకుంటానికే సంసిద్ధులై నారన్నమాట. మల్లన్న : ఎందుకాయనకు ఊరికే ఒత్తిడిచేసి బాధ పెట్టటము. శ్రీనాథుడు : (లేస్తూ) అక్కయ్యా! వారి దృష్టి వేరు నా దృష్టి వేరు. ఇంక నీకూ - నాకూ ఇంతటితో సంబంధం తీరిపోయినట్లే. మల్లన్నా! నీవైనా నావెంట బయలుదేరి రావటానికి ఏమైనా అభ్యంతరమున్నదా? ఏకాంకికలు 367 మల్లన్న : తల్లీతండ్రిని ఒంటరిగా విడిచిపెట్టి - స్వర్గమిచ్చినా బయలుదేరను మామా. శ్రీనాథుడు : ఈ పండీ పండని పొలాలను నమ్ముకొని దున్నుకుంటూ కర్షక వృత్తితోనే జీవిస్తావన్నమాట. మల్లన్న : ఈ వృత్తిలో ఉన్న స్వాతంత్య్రం సౌఖ్యం రాజ సౌధాలల్లో కూడా లేదనే నా నమ్మకము మామా! శ్రీనాథుడు : సరే బాగుంది. వినని వాడికి చెప్పేదెవరు? (లేస్తాడు) అక్కయ్యా! వీడి వ్యవహారం కూడా తేలిపోయింది. బావగారూ సెలవు. పోతన్న : చీకటిపడబోతుంటే ఇప్పుడెక్కడికి పోదామని. మాచమ్మ : అన్నం తిని పోదువుగాని - పండువంటి సంబంధం పోతే పోగొట్టుకున్నాను గాని. శ్రీనాథుడు : నన్ను అనవసరంగా బాధపెట్టవద్దు - (బోయీలను ఉద్దేశించి) ఒరేయ్! పోతన్న : శ్రీనాథా! శ్రీనాథా! (చకచకా నడిచిపోతాడు) మాచమ్మ : తరతరాల నుంచీ వచ్చే సంబంధం చేతులారా పోగొట్టుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా, ఈనాటితో నాకూ నా పుట్టింటికి ఋణం తీరిపోయింది. (కన్నీళ్లతో) మల్లన్నా నీవైనా వాడివెంట వెళ్లరా? మల్లన్న : నీవు వెళ్లు - ఇక్కడ కష్టపడకపోతే- మాచమ్మ : ఇంతకూ నేను చేసుకొన్న ప్రారబ్దం - ఈ ఘటం కాస్తా హరీ ఎవరు పట్టుకొని పాకులాడుతారు. ఎవరికి ఏం పట్టింది. అన్నా వాళ్లు మల్లన్న : అమ్మా! ఏం ప్రయోజనం ఈ మాటలతో - పోయి త్వరగా మడికట్టుకో - మాచమ్మ : నా కడుపులో ఎంత మండిపోతున్నదో నీకేం తెలుసు - ఎవర్నీ ఏమీ అడగరట! మల్లన్న : వంటకానివ్వు పోవే - మాచమ్మ : ఏం బెట్టి - చేతులూ, కాళ్లు, నా కెందుకొచ్చింది. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి - ఈ పూటకు బియ్యం లేవు, ఉప్పులేదు, పప్పు లేదు. 368 (సురాళించుకొంటూ వెళ్ళిపోతుంది) వావిలాల సోమయాజులు సాహిత్యం-2 నాలుగవ దృశ్యం (ఒక మంచం మీద పోతన కూర్చొని చెపుతూ ఉంటే మల్లన్న వ్రాస్తూ ఉంటాడు. చెప్పలేక చెపుతూ మధ్యమధ్య పోతన్న జ్వరంతో దగ్గుతూ బాధపడుతూ ఉంటాడు) పోతన్న : ఖోర్, ఖోర్... ఘోర్ (దగ్గుతాడు) మల్లన్న : నాన్నా! అంత ఆయాసపడుతూ ఇప్పుడు చెప్పలేక చెప్పలేక చెప్పకపోతే ఏం ముంచుకు పోతున్నది గనుక - పరిసమాప్తం చేయలేక పోతారా, పోనీ జ్వరం బాగా నయమైన తరువాత వ్రాయకూడదూ, ప్రస్తుతము కట్టిపెడదామా? పోతన్న : అలా కాదులే ... నా మాట విను నాయనా, ఏం వ్రాశావు. ఖోర్, ఖోర్, ఖోర్ - (దగ్గుతాడు) మల్లన్న : అదుగో అదేకొంప తీసేది. నిన్నా మొన్నా లేదు. మళ్ళీ వెంట పడ్డది. చాలా చెడ్డదని వైద్యుడు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నా వినిపించుకోకపోతే ఆయన ఏం చేస్తాడు. విశ్రాంతి అవసరం మీ నాన్న గారికని ఇందాక రామస్వామి ఆలయం ముందు కనిపించి మళ్ళీచెప్పాడు. పోతన్న : (దగ్గుతూనే బాధతో) నన్నేం చేయమంటావురా, నేనేం ఈ దగ్గును రమ్మని పిలిచిపీట వేశానా? మల్లన్న : కావాలని తెచ్చి పెట్టుకోడం కాకపోతే ఏమిటిది. ఈ విధంగా మనస్సుతో శ్రమచేస్తే ఎంత ప్రమాదం. పోతన్న : ఖోర్, ఖోర్, ఖోర్ - పరిగెత్తే మనస్సును ఎంత పట్టుకుందామన్నా చేత... కావటం లేదు. మల్లన్న : పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఉంటుందా? పోతన్న : (దగ్గుతూ) ఆ కొరత కొంచెం పూర్తి అయితేగాని నాకు నిద్రపట్టదురా మల్లన్నా, నన్నెందుకు బాధ పెడతావు. నా మాట విని... కట్టిపెట్టకు... నశ్వరమైన ఈ దేహానికి ఎప్పుడేదో, రామచంద్రమూర్తికి బాస ఇచ్చాను. చెల్లించుకోలేక పోతే చివరకు ఆ ప్రభువుకు - ఖోర్... ఖోర్... ఖోర్... నాయనా ఏదీమూలం? కానివ్వు ...(తల పట్టుకొని) రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో! ఏకాంకికలు 369 (లోపల నుంచి మాచమ్మ తలకు పట్టువేసి ప్రవేశించి) సీతమ్మ తల్లి! సీతమ్మ తల్లి!! ఈ చెరలు నేను పడలేకుండా ఉన్నానమ్మా... ఈ సంసారంతో నేను వేగలేకుండా ఉన్నానమ్మా... నాకు ఏ నుయ్యో గొయ్యో చూపించు తల్లీ - మల్లన్న : ఇప్పుడేమొచ్చిందమ్మా? మాచమ్మ : ఎప్పుడూ వచ్చేదే ఇప్పుడూ వచ్చింది. గొంతుకు ఉరి పెట్టుకుందామన్నా ఊపిరాడదు గదా! ఏ మహాపాపం చేశానో కాని, అన్నిటికీ ఒక్కతెను ఆడపక్షిని. అటు పొలం పోయి గడ్డే తెచ్చేదా ఇటు పొయ్యి మీది పనే చూసేదా... ఈ పూట నాకు కూడా కాక తగిలినట్లుంది. మల్లన్న : ఊఁ-కానీ నువ్వుకూడా మంచమెక్కు. మాచమ్మ : (పోతన్నను చూస్తూ) మహారాజులు ఎక్కేవాళ్ళు ఎక్కితే సరిపోతుంది గాని నేనెక్కితే ఊరుకుంటారా. మెడబెట్టి గెంటుతారు. మల్లన్న : అమ్మా! ఏం తలనొప్పి వచ్చిందా ఏం - దుప్పికొమ్ము గంధం పట్టేశావు. కాసేపు అలా వెన్ను వాల్చరాదూ తగ్గుతుంది. మాచమ్మ : ఆ అంత అదృష్టం కూడానా ఆ మోపెడు అంట్లూ ఎవరుతోముతారు. నా తాత వెనక వాళ్ళూ, అబ్బ వెనక వాళ్ళూ- మల్లన్న : అమ్మా! నీకేం కష్టం వచ్చిందనమ్మా అనవసరంగా అనని మాటలు అనుకోటం. అవతల ఆయన లేవలేకుండా బాధపడుతుంటే ఉత్త అఘాయిత్యం తప్ప. మాచమ్మ : అంతే.... అంతకంటే ఇంకేమయింది అయ్యకు చేతనైనపని. ఆయనను వెనక వేసుకోరావటం అయినదానికీ, కాని దానికీ. కష్టపడి కనిపెంచినందుకు - అమ్మకు చేసే సాయం బాగుంది నాయనా. బాగుంది. మల్లన్న అమ్మా! ఇప్పుడెందుకు అనవసరంగా అంత గొంతు పెట్టుకొని అరవటం. మాచమ్మ : ఔవ్వ..... నోరు నొక్కేసుకోమన్నావా? మల్లన్న : అసలు విషయమేమిటమ్మా! మాచమ్మ : (పోతన్నను చూస్తూ) ఊ, ఆ, అనకుండా చేసే పని చేసి బెల్లం కొట్టిన రాయిలాగా ఊరుకోటం. 370 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 మల్లన్న ఎవరు చేశారు. ఏం చేశారు. మాచమ్మ : చేసిన వాళ్లను అడుగు. మల్లన్న ఈ గొడవంతా ఏమిటి నాన్నా! పోతన్న : (భార్యతో) ఆ భట్రాజువాణ్ణి ఇంతకూ ఇక్కడ యీ పూట భోజనం చేసి పొమ్మన్నందుకేనా ఈ వషట్కారాలన్నీ - ఖోర్, ఖోర్, ఖోర్. - నేనూ -- మాచమ్మ : ఒక్కపూట పాలుమాలితే సోలెడు గింజలు ఉడకవేసే ఆడదిక్కు లేదు. కాపరానికి వచ్చింది మొదలు నా వంట ఇల్లూ ఆడదానికష్టం తెలుసుకోలేకపోతే సరి. ఒకరో ఇద్దరో ప్రతిదినం పైమనుషులైతే ఎక్కడ చచ్చేది. పోనీ పంక్తికి భోంచేసి పోయే వాళ్ల అంటే అంతా మా అమ్మ వెనుక చుట్టాలూ, నాన్న వెనుక చుట్టాలూ. మల్లన్న : ఏదో ఎరిగిన వాడని ఆశిస్తే అంతఅన్నానికి ఏం పోయిందని ఆయన ఉండమన్నారేమో దానికెందుకింత రాద్ధాంతాం. అయినా లేనివాళ్ళకు పెడితేనే ఏమన్నా, ఉన్నవాళ్ళకు పెడితే ఏం వస్తుంది. మాచమ్మ : లేనివాళ్లకు ఇంతమందికి పెట్టబట్టే మనకింత (నేలచూపిస్తూ) వచ్చింది. అబ్బో! సంస్థానం బమ్మెరవారి సంస్థానం. ఇంటి పేరు కస్తూరి వారు. ఇంట్లో గబ్బిలాల కంపు. పోతన్న : రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో!! భోర్... ఖోర్... ఖోర్ (దగ్గుతాడు) మాచమ్మ : అయినా నాకెందుకు వచ్చింది. రెక్కల్లో సత్తువున్నంత వరకూ ఇంత ఉడకవేసి పెడతాను. నా మొర ఆలించే వెళ్ళా పాలించే వాళ్ళా - మల్లన్నా! నువ్వు కూడా ఇంత పట్టించుకోక పోతే ఏం చేసేదిరా (కంటతడి పెడుతూ) గింజలు నిండుకున్నవని చెప్పి నాలుగు దినాలైంది కదా... నువ్వు ఏం చేసినట్టు. మల్లన్న : మొన్న పోటు వేసిన కొర్ర బియ్యం అయిపోయినవా ఏం? మాచమ్మ : ఇంకా ఎన్నాళ్లువస్తవి నాయనా, అంత అక్షయంగా గడపటానికి నేనేం అనసూయనా! నాటి పుణ్యమా అంటూ అక్కడికి వారం రానే వచ్చినవి. మల్లన్న : మధ్యాహ్నం ఆ ఉన్న కాసిని సజ్జలూ పోటు వేస్తాను. తరువాత సంగతి తరువాత చూచుకుందాం. ఈ పూటకు ఎక్కడన్నా అప్పు పుచ్చుకో. ఏకాంకికలు 371 మాచమ్మ : ఎవరిస్తారు? మన పేరు చెపితే ఎక్కడ పట్టినా భగ్ధం పాడే. మల్లన్న అడుగో ఆ దారిన మారన్న మూటనెత్తిన పెట్టుకు వస్తున్నాడు. మరిచి పోయినాను. వెనుక మన కళ్లంలోనే పది మానికలు అప్పు తీసుకున్నాడు. ఇవ్వటానికి వస్తున్నాడనుకుంటాం. నువ్వు త్వరగా మడి కట్టుకొని ఆయనకు ఇవాళనైనా ఇంత ధారకం పోసేటట్టు చూడు. (మాచమ్మ నిష్క్రమిస్తుంది) (భార్య వెళ్ళిపోతుంటే) ఖోర్, ఖోర్ ఖోర్ మల్లన్నా! అనేక మాట్లు పరీక్షిస్తున్నాడు, ప్రభువు నన్నెంత అగ్నిపరీక్ష చేస్తున్నాడురా. తీరా సమయం వచ్చేటప్పటికి తానే ఆదుకుంటున్నాడు. మల్లన్న : మన దగ్గర అప్పు తీసుకున్న గింజలు ఇప్పించటమూ కూడా ఆదుకోటమేనా ఏమైనా ఆయన పరిపూర్ణ కటాక్షాన్ని ఆశించుకొని కూర్చుంటే. పోతన్న : రామచంద్ర ప్రభో - రామచంద్ర ప్రభో - జగద్రక్షకా తండ్రీ - (లేస్తాడు) మల్లన్న నాన్నా! ఏమిటా మంచంలోంచి లేచి పోవటం. నాలుగు లంఘణాలతో పైత్యించి ఆ కాస్తా విరుచుకుపడితే (దగ్గిరికి వచ్చి చేయిపట్టుకొని) దేహం ఇంత కాకెక్కుతున్నదేం (నాడి చూచి) జ్వరం మళ్లీ వచ్చేస్తున్నది. అంతర్గతం పూర్తిగా వదలలేదు మీకు. పోతన్న : జ్వరం కాదు... చట్టు బండలూ కాదు. మల్లన్న : మీకీ జబ్బుచేయటమూ నా దరిద్రమే. పోతన్న : లోకం దృష్టిలో నాకంటే పరమ దరిద్రుడెవ్వడున్నాడు. నాయనా - (మానసిక స్థితిలో మార్పు చూపిస్తూ) అబ్బాయీ, మల్లన్నా చూస్తున్నావా... అదుగో ఎక్కడిదా శతపత్ర సితాంబుజము.... పరిశీలిస్తున్నావా - ఆ అరుణారుణ పాదపల్లవ కాంతులు - నా మీద కనికరించి ప్రభువు వస్తున్నట్లున్నాడురా నేను దరిద్రుడననుకున్నానని ఆఁ కాదు కాదు నా ప్రభువు కాదు. అయితే ఆ అందెలచప్పుడు వినిపించదే కాంచీదామాన్ని చూస్తున్నావా... కాదురా సీతమ్మ తల్లిరా అయోధ్య నుంచి భక్తుణ్ణి చూచి పోదామని బయలుదేరి వచ్చినట్లుంది - - మల్లన్న : నాన్నా! మీకు బాగా పైత్యస్తున్నది. కాసేపు కళ్లు మూసుకొని పడుకోండి. నేను ఇంతలో కాస్త తేనె పట్టుకొస్తాను. 372 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 పోతన్న : ఎవరురా యీ తల్లి - ఎక్కడో చూచినట్లే ఉంది కాని గుర్తురావటం లేదు. ఓహో నీవా తల్లీ! మల్లన్న అమ్మా! అమ్మా!! పోతన్న : అమ్మా! రాతల్లీ - అంబుజగర్భురాణీ, నవాంబు జోజ్వల కరాంబుజ - ఈ పేదవాడి కుటీరం మీద ఈనాటికైనా ప్రసరించింది తల్లీ నీ అమృతమయ వీక్షణం ధన్యుణ్ణి. (మంచంలో నుంచి లేచి ఊహాకల్పిత మూర్తికి నమస్కరిస్తాడు మోకరిల్లి) (తలపైకెత్తి) మల్లన్నా అమ్మను పిలూ అర్ధ్యం తీసుకురమ్మను. పాద్యం తీసుకు రమ్మను. తల్లి వచ్చింది. త్వరగా అమ్మను రమ్మను. మల్లన్న : (భయంతో వెనకటికంటే పెద్ద గొంతుకతో) అమ్మా! అమ్మా!! పోతన్న : తల్లీ! కవుల జిహ్వాగ్రంలో నాట్యమాడినంత మాత్రానే వాచాలురను చేసే నీకు నోటిమాటే రావటము లేదు తల్లీ - అదీ నా దారిద్ర్యమే కాబోలు - మల్లన్న : నాన్నా! (మాచమ్మ లోపలనుంచీ అబ్బాయీ ఏమిట్రా ఈ గొడవంతా అంటూ ప్రవేశిస్తుంది) మల్లన్న పైత్యంచిందని ఎంతచెప్పినా వినకుండా అమాంతం ఒకమాటు మంచంలోనుంచి లేచేటప్పటికి నాన్న ఆస్తు బిస్తయిపోయి ఏవో అర్థంగాని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. - ఒక పని మాచమ్మ : అయ్యో! అయ్యో! - త్వరగా వైద్యుణ్ణి పిలుచుకురా పోరా చేస్తారా - ఒకటే మూర్ఖం. ఆ మనిషి పట్టిందేపట్టు - నేను ఆ నొసటి కుంకుమకు కూడా నోచుకోలేదు కామాలి. మల్లన్న : అమ్మా! నీవేం భయపడనాకు. ఇదుగో ఆయన్ను కదిలించకుండా అలాగే విసనకర్రతో విసురుతూ ఉండు - (నిష్క్రమిస్తాడు) నీ పోతన్న : (దీనంగా) అమ్మా! నీ ముఖచంద్రుణ్ణి ఏవో కారుమేఘాలు కప్పేస్తున్నవి తల్లీ - అమ్మా కన్నీరా.... ఎందుకు తల్లీ - ఇలారా అమ్మా నన్ను తుడవనీ - నీ శతపత్ర నేత్రాలు వాడి పోనీయకమ్మా నా సర్వస్వమూ నీది. ఒక్కమాటు ఆ కారుమేఘాలన్నీ విరిసి పోయేటట్లు తరిపి వెన్నెలలు కాయించుతల్లీ నీ చిఱునవ్వుతో. ఏకాంకికలు - 373 మాచమ్మ : ఎప్పుడూ మేఘాలు - మట్టీ మశానం తీసినవి పిచ్చెక్కినా కవిత్వం మానలేదుగదా బ్రాహ్మణుడు. ఈ పిచ్చే అందువల్ల అయితే అదెక్కడికి పోయింది. పోతన్న : (ఎవరి ప్రశ్నలతో సమాధానమిస్తున్నట్టు). ఔను.... ఆ.... నిరుపేదనే నీవన్నట్లు.... నా జీవనమా? నీ కృపవల్ల... రాజుల నెవరినైనా ఆశ్రయించమంటావా. నా కంఠంలో ప్రాణముండగా.... లేదు తల్లి.... నాకు ఏకోశానా ఆ ఊహలేదు.... ఇదుగో నీవన్నట్లు రామచంద్రమూర్తికే నిన్నిచ్చి కల్యాణం చేస్తాను - వాగ్దానమూ. (చేతిలో చేయివేస్తున్నట్లుగా చేయి ఉంచి) కాటుక కంటినీరు చను కట్టుపయింబడ నేల యేడ్చెదో కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల, ఓ మదంబు, ఓ హాటక గర్భురాణి నిను నాకటికిం గొనిపోయి అల్ల క ర్ణాట కరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ - సంతోషం తల్లీ - తిరోగమిస్తున్నావా - నామాట ఏం చెప్పినట్లు - ఊః సరే- మాచమ్మ : వెర్రి వేయి విధాలంటారు - ఇది ఆ వేయిలో చేరుతుందో లేదో! ఇటువంటి వాళ్ళు వెనక పుడితేగా చేరటానికి - ఊ చేరదు. - పోతన్న : (అమితానందంతో కళ్ళు.... ముడిచి మళ్ళా తెరిచి) అమ్మా - అమ్మాయి తీరా వెళ్ళి పోయిన తరువాత వచ్చేశాం అభయమిచ్చేశాను. ఆమె ఆ రామచంద్రమూర్తికే తన్నిచ్చి వివాహం చేయమంది - రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో!! (విగహ్రం వైపు చూస్తూ పరమానందంతో) త్వరలో నీ వివాహం తండ్రీ . అమ్మాయి వచ్చి స్వయంగా నిన్నే వరించింది తండ్రీ - (దారు విగ్రహం ముందు మోకరిల్లి) నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానా వాదానురోధాయ వాచ్య వాచక శక్తయే - (సాష్టాంగ ప్రణామం చేస్తాడు. వెనుక మాచమ్మ ఆశ్చర్యంతో ముక్కుమీద వేలు వేసుకొని చూస్తూ నిలబడుతుంది. 374 (సమాప్తం) (ప్రజావాణి - 7-10-62 - 28-10-62) వావిలాల సోమయాజులు సాహిత్యం-2 కజ్జల పూర్వార్ధము ప్రథమ దృశ్యము (రాజాంతఃపుర సౌధోపరిభాగం. సౌధం చుట్టూరా నగర ప్రజలంతా 'యువరాజు' ముఖ దర్శనార్థం నిరీక్షిస్తూ హర్ష ధ్వనులతో, కేరింతలతో, గుమికూడి ఉంటారు. సౌధోపరి భాగంలో కాబొయ్యే యువరాజుకు నీళ్ళు పోసి, అగరు ధూపాలతో కురులారుస్తూ స్త్రీలు మంగళహారతు లెత్తు తుంటారు. అతడు అక్క సారంగదేవి చేతుల్లో హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఒక మూలన బంగారు గొలుసులు ఉయ్యెల. రెండువైపులా దీపపు సెమ్మెలు - కర్పూరపు వాసనలు - అగరుధూప పాత్రికలు ప్రస్తుతము మహారాణి అనే పేరుతో వ్యవహరిస్తూ ఉన్న కజ్జల (దేశాధిపతి ఉంపుడు కత్తె) రాజసంతో ఒకమాటు పసిబిడ్డనూ, మరొకమాటు జన సమూహాన్ని చూస్తూ మంగళగీతం వింటూ ఆనంద పరవశురాలై అలసటవల్ల నిట్టూరుస్తూ ఉంటుంది. సారంగ దేవి చేతుల్లో నుంచి పిల్లవాడిని ఉయ్యాలలో నిద్రపుచ్చుతూ జోలపాట పాడుతుంటారు. చత్వర నుంచి సౌధం ముందు గుమిగూడి "కజ్జల మహాదేవికీ జై” అనే సంతోష సూచక ధ్వనులతో ఉప్పొంగిపోతూ ఉన్న ప్రజలను చూస్తూ నిలుచున్న కజ్జల మంగళగీతం పూర్తికాగానే ఒక మాటు హఠాత్తుగా వెనకకు తిరిగి కుమార్తె సారంగదేవితో) కజ్జల : ఒకమాటు కుమారుణ్ణి ప్రజలకు చూపించు. సారంగదేవి : (పసిబిడ్డను కంచుకి చేతికిస్తుంది) కజ్జల : అమ్మాయీ! నీవే తమ్ముణ్ణి ప్రజకు చూపించు. సారంగదేవి : (అనుమానిస్తూ) నేనా! కజ్జల : అవును నీవే. ఈ దినంకూడా నిన్ను చూడటానికి ప్రజ తహతహ పడుతూ ఉంటుంది. ఏకాంకికలు 375 సారంగదేవి : (కొంతదూరం పసిబిడ్డను అందుకొని నడుస్తుంది. ప్రజ "కుమార మహాప్రభువుకు జై" అని కేకలు వేస్తూ ఉంటారు) కంచుకి : (సారంగదేవిని అనుసరిస్తూ) అమ్మాయీ! సారంగదేవి, అటు చూడు. ఎంత ఆనందకరమైన దృశ్యమో చూడు. సమస్త కాశ్మీర ప్రజానీకం నీ తమ్ముణ్ణి దర్శించటానికి వచ్చారు. ఉత్కంఠతో ఎంత ఉత్సాహాన్ని ప్రకటిస్తున్నారో చూడు. నీ అదృష్టాన్ని ఏమని కొనియాడాలో తల్లీ ... అమ్మా ఎప్పుడూ ఏమిటా అర్థం కాని అయోమయ చింతారేఖలు నీ ముఖం మీద. సారంగదేవి : (పసిబిడ్డను చత్వరం దాకా తీసుకు పోయి పెద్ద పెట్టుగా) అబ్బా బాధ కంచుకీ - నీవు చూపించు. (వెనుకనే నిలుస్తుంది) కంచుకి : (పిల్లవాణ్ణి తీసుకుపోయి చూపిస్తుంటే ప్రజలు జయఘోషలు చేస్తారు కజ్జలా దేవితో) - అమ్మా! ప్రజలెంత ఆనందంతో అబ్బాయికి జయపెడు తున్నారో వింటున్నారా! వాళ్ళకు ఆయనమీద ఎంత అనురాగమో చూస్తున్నారా. అదుగో! ఆవైపు చూడండి ఉత్సాహాధిక్యంలో ఉత్తరీయాంశుకాలు ఎలా ఎగుర వేస్తున్నారో! ఆ కుంకుమ కేసరాలు చల్లుకోటం చూస్తున్నారా? చిందులేసి నృత్యం చేసే ఆ చిన్నవాళ్ళ గుంపును చూడండి. ఆబాలగోపాలమూ ఎంత అనురాగాన్ని ప్రకటిస్తున్నారో మీకు అవగతమౌతున్నదా? ఏ రాజకుమార దర్శనానికి... కజ్జలాదేవి : ఇంకా నా మనస్సుకు సంతృప్తి కలుగలేదు కంచుకీ - మా రాజమహిషి బంధులుణ్ణి కన్నప్పుడు ప్రజ చూపించిన అతిశయానురాగానికి ఇది సాటి వస్తుందా? ఒక వసంత మన్నా బ్రతకకపోయినా ఆ బంధులుడు అతని దర్శనార్థం విచ్చేసి ప్రజలు చూపించిన ఆనంద రసావేశం నా జీవితంలో మరచిపోలేను. వారి సంతోష సూచకధ్వనులు ఈనాటికీ నా చెవుల్లో రింగుమని మార్మోగుతూనే ఉన్నవి కంచుకీ! ఈ ఉత్సాహంతో నా మనస్సు శాంతి పడటం లేదు. సంతృప్తి కలగటం లేదు. బిడ్డను నా చేతికిచ్చి ఒక్కమాటుగా ఆ బొక్కెనలు విప్పి రౌప్యఖండాలను ప్రజల లోకి వెదజల్లు - ఆ కాంచన కుంభాలలో పన్నీరు చిలకవోయ్ - ఆ గులాబీ కుంకుమతో ఒక్కమాటు వాళ్ళందరినీ గప్పివేయ్. - 376 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 కంచుకి : (కుమారుణ్ణి కజ్జలాదేవి చేతి కందిచ్చి చెప్పినట్లు చేస్తాడు. మాటిమాటికీ ప్రజలలో హర్షధ్వనులు చెలరేగుతూ వినిపిస్తవి. కజ్జలాదేవి పట్టరాని సంతోషంతో దీర్ఘంగా నిశ్వాసిస్తూ కొంతసేపు నిలవబడి పసిబిడ్డతో వెనకకు వచ్చి పర్యంకం మీద కూర్చొని) కజ్జల : అమాత్య కంచుకీ - కంచుకి : ఆమె ఎవరు? తల్లీ కజ్జల : మన మహారాణి. కంచుకి : మొగం చెల్లలేదేమో. ఆమె ఇంకా పిల్లవాణ్ణి చూచిపోవటానికి రాలేదు. - (మహారాణి వస్తూ ఉన్నట్లు సూచించే ప్రాసాద ఘంటికలు వినిపిస్తవి) (ప్రవేశము రాణి. కంచుకి తదితరులూ ప్రక్కకు తప్పుకుంటారు. కజ్జల లేచి సగౌరవంగా ఆర్ధాసన మిచ్చి, గౌరవించిన తరువాత) రాణి : కజ్జలా! నిన్న సాయంత్రం నిన్ను గురించి ఎంత ఆదుర్దా పడ్డానో విన్నావా? ఇంకేముంది అయిపోయిందన్న వార్త వినేటప్పటికల్లా నా గుండె గుభేలు మన్నది. ఇంతకు పరమశివుడి కృప నీ మీద ఉన్నది. యముడి నోట్లో గడ్డకొట్టి బ్రతికావు. అంతటి క్రితం రాత్రి నీ మీద పీడకల కూడా వచ్చింది సుమా. కజ్జల : మీ ఆదరానురాగాలకు ఎంతో కృతజ్ఞురాలను. అనవసరమైన పీడకలలతో మీ నిద్రకు నావల్ల ఏమీ భంగం రాలేదు కద. రాణి : ఉహూ - బలే మంచి సందేహమే కలిగింది కజ్జలా! లోకమంతా ఒక్కమాటుగా తారుమారైనా ప్రస్తుత స్థితిలో నా నిద్రకు ఏ విధమైన భంగమూ కలగదు. పట్టుపట్టి ప్రయత్నించినా ఏ పరమ దౌర్భాగ్యుడూ పంతం చెల్లించుకోలేడు. (కజ్జల ముఖం కేసి చూస్తూ) అయినా ఒకప్పుడు మాత్రం ప్రతినిత్యమూ నా పర్యంకం దుఃఖభాష్పాలతో పంకిలమైపోయినమాట వాస్తవము. అయినా ఏం ప్రయోజనం... నిద్ర పట్టించుకొనక తప్పింది కాదు. తరువాత క్రమక్రమంగా అలవాటు పడ్డాను. ఆ కజ్జల జలమూ ఇంకి పోయింది. నా పర్యంకం పంకిలం కావటమూ మానివేసింది. (ఆ ప్రసంగాన్ని తుడిచివేసినట్లుగా చప్పరించి) కజ్జలా, ఏదీ ఒకమాటు ఇలారా. (తానే దగ్గరికి పోయి) ఏకాంకికలు 377 ఒక్కమాటు నీ ముఖం చూడనీ - (ముఖం చిట్లిస్తూ) శరత్కాల చంద్రుణ్ణి పరిహసించే అంత చక్కని నీ ముఖం ఇలా అయిపోయిందేం కజ్జలా. ఎంత పాలిపోయింది నీ శరీరం. కామదేవుణ్ణి తప్ప కొలవలేనన్న నీవు నీకు తెలియకుండానే విభూతి ధారణం చేసి శివదీక్ష పుచ్చుకున్నావనిపిస్తున్నదే నీ దేహం. ఏదీ నీ చెయ్యి (అందుకొని) కాక తగిలినట్లున్నది... ఎందుకో నీవు బాగా లేవు. నీ మనస్సు బాగా లేదా? కజ్జల : తాము నా ఆరోగ్య విషయంలో అతిశ్రద్ధ వహిస్తున్నారు. నాకేమీ జబ్బులేదు. ఈ ప్రజల సంతోష కోలాహలము కనులార చూచి ఆనందిస్తూ ఉన్న నా మనస్సు బాగా లేకపోవటానికి అవకాశం కూడా లేదు. రాణి : కజ్జలా! ఏ విధమైన అనుమానం ఉన్నా దాచిపెట్టవద్దు. నాతో చెప్పటానికి నీకేం దాపరికం గనుక... ఈనాడే నా దగ్గరికి ఒక మానస శాస్త్రవేత్త వచ్చాడు. పంపనా! భూతవైద్యులలో ప్రఖ్యాతి గన్న పశుపతినాథుడు ప్రస్తుతం మన శ్రీనగరములోనే ఉన్నాడట - ఎందుకు వృధాగా రోగాన్ని కప్పిపెట్టి తరువాత ఎందుకు అపమృత్యువును ఆహ్వానిస్తావు కజ్జలా! నీ వియోగాన్ని నేను భరించగలుగు తానా? ఎలా భరించటం. భరించలేను కజ్జలా! కజ్జల : (వ్యంగ్యోక్తిగా) తమ సేవకు నా బ్రతుకు ఇంత అత్యంతావశ్య కమని ఎన్నడూ గుర్తించలేకపోయినాను. తాము క్షమించాలి. రాణి : అదే కాదు నేను అలవాటుపడ్డ వాళ్ళలో తప్ప మెలగలేను. అయిష్టమైన వాళ్ళను ఆదరించగలుగుదును గాని కొత్త మొగాలతో పరిచయమంటే నాకేమిటో భయమేస్తుంది కజ్జలా! - చూడలేను. కజ్జల : (రాణి మాటలను జాగరూకతతో అవగతం చేసుకుంటున్నట్లు వర్తిస్తుంది) రాణి : నీకూ నాకూ ఉన్న అనుబంధం ఈనాటిదా అలా అనుకోగానే తెంచి వేసుకోటానికి. నీ ప్రాణానికి ఏదైనా అపాయం కలిగితే అది నా ప్రాణానికీ అపాయమే. నా మంచికోసం, ఆత్మరక్షణ కోసం నిన్నర్థిస్తున్నాను కజ్జలా! నీవు ఈ విధంగా బాగా లేకపోవటానికి కారణమేమిటో బయటపెట్టు. ఎంత ఆదరానురాగాలతో ప్రజలు నీకు జయపెడుతున్నారో వింటున్నావా? ఆ జయఘోషలవల్ల నీకు వెర్రెత్తటం లేదూ? కజ్జల : అది నాకు సంతృప్తి కలిగించలేదు. సంతృప్తికి మించిన తరువాత గదా ఉన్మాదం ఉత్తమాత్మలకు తను యూహాగానం వినటం కన్నా వేరే సంగీతమే లేనప్పుడు... 378 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 రాణి : నేను బంధులుణ్ణి ప్రసవించినప్పుడు కూడా ప్రజలు ఇంత ఉత్సాహాన్ని ప్రకటించలేదు. అయినా అది మాకు అనవసరం కూడాను. కజ్జల : కారణం. రాణి : ప్రజ ప్రేమించినా ప్రేమించకపోయినా వాడు యువరాజు కాక తప్పకపోవటం. అతని ఆజ్ఞానుసారంగా వాళ్లు నడవక తప్పకపోవటం. కజ్జల : దేవీ! రాజ్యార్హత కేవలం పుట్టుకతోటి వచ్చే శాశ్వత భోగం కాదు. ప్రేమ మూలకంగా రాజ్యాన్ని సంపాదించుకొని ప్రజలను సంతుష్టి పరచిన రాజులదే ప్రజ్ఞ. చరిత్రల్లో వన్నె కెక్కిన రారాజు లందరూ ఇటువంటివారే. రాణి : నీవన్నమాట సత్యమే కజ్జలా! ఈ విషయం నాకిప్పుడు కాదు, ఈ కాశ్మీరంలో కాలు పెట్టినప్పుడే తెలిసింది. సీతాకోక చిలుకల్లా చిందులేసే చేటికలకే ఈ దేశంలో పరమ పతివ్రతలకన్నా ప్రాభవం, విస్తారం. గౌరవం అత్యధికము. మొదట మొదటా నా మనస్సుకు ఎంతో కష్టం వేసేది. కాని తరువాత తరువాత మెట్టిన చోటు ఎంత నికృష్టమైనదైనా ఆ దేశాచారాన్ని మన్నించక తప్పదని మనస్సును సమాధాన పరిచాను. కజ్జల : పాతివ్రత్యం బహూకృతి కోరదుగదా! ఒక వేళ వాంఛించినా అది అందులోనే ఉంది. రాణి : అదొక్కటే సంతృప్తి పతివ్రతలకు. కానీ ప్రాభవం కోసం ఒకప్పుడు కొందరు పతివ్రతలు తమ పాతివ్రత్యాన్ని కూడా బలి ఇవ్వటానికి వెనుకాడరు. కజ్జల : బలి ఇవ్వటమనటంలో మీ అభిప్రాయం? రాణి : (అర్ధోక్తిగా) కజ్జలా! మనకెందుకిప్పుడీ అనవసర ప్రసంగం. ఆ విషయాన్ని ఇకపోనీ - అనవసరంగా తరచకు. మన సంభాషణ విషయాలు ఎన్నడూ శివదేశికుల చెవిన పడ నీయకు - మన వయస్సులో ఉన్నవాళ్ళు మభ్యపెట్టి ఇంకొకళ్ళ మనస్సును ఆకర్షించాలని పూనుకోటం ఎంత పొరబాటు. ఇన్నేళ్ళు వచ్చిన తరువాత మనకు మదనుడు ఏ ఊహలు ప్రసాదిస్తే ఏం ప్రయోజనం. పతివ్రతలంగా ఉండటం తప్ప మరొక పని చెయ్యలేం గదా! ఆ మాటని ఊరుకుంటామా అంటే ఊరుకోనూ లేము. మధ్య మధ్యా మన్మథ బాణాలకు గురికావటం తప్పించుకోలేము. అటువంటి సమయాలల్లోనే మనం జాగరూకత వహించాలి. చిత్త చాంచల్యానికి చోటివ్వకూడదు. చితిమంటలు ఎక్క వలసి వచ్చినా శీలం కాపాడుకోవాలి. ఏకాంకికలు 379 కజ్జల : దేవీ! మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. రాణి : పాపం! పిచ్చిదానివి. నీ చుట్టూ ఎన్ని కుట్రలు జరుగుతున్నవో నీకేం తెలియటం లేదు? మహారాజు మాటమాత్రం నీ చెవిలో వేయలేదూ?... (అటూ ఇటూ చూస్తూ) ఎప్పుడైనా సరే జ్ఞప్తికుంచుకో... చుట్టూ మాంత్రికులు. మధ్య మనం. వాళ్ళ తంత్రాలల్లో నుంచీ ఎవరూ తప్పించుకోలేరు. కాల్చినా మళ్ళీ పుట్టుకువచ్చే వీళ్ళను కాలుడే జయించలేకపోతున్నాడు. ఒక్కొక్క మాంత్రికుడి చేతిలో ఎన్నెన్ని పిశాచాలున్నవో నీకు తెలియలేదన్నమాట! ఎంత మంది రాజులు వాటి కాహుతై పోతున్నారో నీవు ఎరగవన్నమాట!! - అదేం కజ్జలా అలా చల్లబడిపోతున్నావు? కజ్జల : లేదు దేవీ. కానివ్వండి మీరు దయ ఉంచి మరికొంత ప్రస్ఫుటం చెయ్యాలి మీ ప్రసంగం. రాణి : ఆ పిశాచాలు మన ఆస్థానమంతటా వికృతనృత్యం చేస్తున్నవి. ధనార్జనకోసం కొందరూ, గౌరవవాంఛతో కొందరూ, ప్రేమ పేరుతో మరికొందరూ వాటికి తమ పవిత్రాత్మలను అమ్మేసుకుంటున్నారు. పాపం! అభీరుడు ఎంత మంచివాడో నీవు ఎరుగుదువా? ఎరక్కపోవటమేమిటి? తన భార్యను ఒక పురుష పిశాచానికి ప్రీతిపూర్వకంగా అర్పించాడు. ఆ పిశాచాలల్లో కల్లా నాయకురాలు తనను ప్రేమించిన మహారాజుకు విషమిచ్చి చంపేసిందట. విషము! అమ్మయ్యో విషము!! ఏది ఏది తాగబోయినా విషం. దాని చెల్లెలు మళ్ళీ పెళ్ళి ముట్టుకోబోయినా విషం - చేసుకోటానికి అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్తకు పాషాణం పోసింది. పురుషుల్లో క్రౌర్యముంటుందంటే వెనక నమ్మేదాన్ని. స్త్రీలల్లో క్రౌర్యం. కుసుమ కోమలులా! గండశిలా కర్కశలు! స్త్రీలు! స్త్రీలు కూడా విషప్రయోగం. కజ్జల : మీరు ఇంతగా ఎందుకు ఆశ్చర్య పడుతున్నారో నాకవగతం కావటం లేదు. రాణి : అంటే స్త్రీలు కూడా విషప్రయోగం చేస్తారన్నమాట. కజ్జల : ఎందుకు చెయ్యరు, కోరికలు సిద్ధించటమే ప్రధానంగా పెట్టుకున్నవాళ్ళు. కోమలాంగులయితే ఆ సాధనను స్వీకరించటానికి మరీ త్వరగా లొంగుతారు. రాణి : నరకం మాటే మరచిపోతారా ఆ సమయంలో, కజ్జల మరవకు రానూవచ్చు పోలిస్తే నరకం ఏపాటిది? 380 రాకపోనూ వచ్చు. అయినా క్రౌర్యానురాగంతో వావిలాల సోమయాజులు సాహిత్యం-2 - రాణి : క్రౌర్యంగానీ, అనురాగం గానీ కలకాలం అనుభవించేది కాదుగా అందుకోసమని కలకాలం యుగయుగాలు, తరతరాలు గౌరవాది నరకాలల్లో రాక్షసబాధలనుభవిస్తారా? కజ్జల : (ఉద్వేగంతో) ఒకనాటి దైతేనేం - ఒక క్షణకాలానిదైతేనేం విజయం విజయమే దోషానికి మొగ్గలేక జీవితాన్ని తొలగదోసుకోబోయే పిరికిగుండె ఎవరికో గాని ఉండదు. అందులో ప్రేమకోసం క్రౌర్యం - ఈర్ష్య ఎంత గొప్ప విశేషాలు. ఎన్ని జన్మలకైనా సాధించతగ్గవి. దేవీ - ప్రేమించ లేని ఆత్మ జీవించటమే లేదన్నమాట. ప్రేమించిన తరువాత సాధించలేకపోవటం మరీ చవటతనం. నా దృష్టిలో ప్రేమ విజయమే ప్రధానం గాని పరమపాపిష్ఠి నరకమన్నా భయంలేదు. ఆ సాధనలో చరమ సోపానాన్ని చేరుకొని పడిపోయినా భయం లేదు. ఆ సాధనలో ప్రాప్తించిన నరకంలోనే స్వర్గ సౌఖ్యమున్నదని నా ఆశయం. రాణి : కజ్జలా! ఎందుకంత ఆవేశం. ఏమిటా దీర్ఘ నిశ్వాసాలు. ఉం... ఆ పిశాచాలను పూజించేవారంటే నీకూ అభిమాన మన్నమాట. ఈ మాటకు అంగీకరిస్తావా? కజ్జల : : అంగీకరించటమూ కాదు. అంగీకరించకపోవటమూ కాదు. వారి మనస్సులను అర్థం చేసుకొని వాళ్ళ దైన్యానికి చింతిస్తున్నాను. కాదు కాదు. వాళ్ళ సాహసాన్ని అభినందిస్తున్నాను. పాపం చెయ్యడానికి ప్రయత్నించాడని రుజువు కావాలనే పరమ దౌర్భాగ్య దండన విధించుటకేనా? పాపం చెయ్యటానికి ఎంతటి వీరగుణం కావాలో ఆలోచించాలి. అంత సాహసానికి పూనుకోవలసిన ఆగత్యమేమిటో అవగతం చేసుకొని దోషి అని తోస్తే దండన విధించడం ఎంత సమంజసము! రాణి : కజ్జలా! నేను ఎవరినీ ఉద్దేశించి ప్రసంగించటం లేదు. దూషించటం లేదు. ఏమిటీ ఉద్వేగం. నా మాటలు నిన్ను ఇంత కలవరపెడుతవని కలలో కూడా భావించలేదు - వృధాగా ఎందుకు శరీరానికి అలసట తెచ్చి పెట్టుకుంటావు. పచ్చి వళ్లు బహు జాగ్రత్తగా పథ్యం చేయాలి సుమా! ఇంత లోనే ఎంత చెమట పోసింది అంత ఇష్టం లేకపోతే ఆ ప్రసంగం నేను మటుకెందుకు చేస్తాను - కజ్జలా! నా పతకాన్ని ఏం చేశావు? కజ్జల : మీ పతకము? రాణి : అవును. నా పచ్చల పతకము. కజ్జల : మీ అభిప్రాయము? ఏకాంకికలు 381 రాణి : మహారాజు రాత్రి నన్ను అడిగి పుచ్చుకొని వెళ్ళారు. నీకోసమే ననుకున్నాను కజ్జలా! ఎంత సంతోషంతో తీసి ఇచ్చానను కున్నావు. అయితే ఆ కానుక నీకు కాదన్నమాట. ఇంకెవరికిచ్చి ఉంటారబ్బా (యోచన) ఉంః... నమ్మలేను. ఉఁ నమ్మలేను. కజ్జల : వారి మెడలోనే ఉండి ఉండవచ్చు. వచ్చి కొడుకును ముద్దాడి నా కంఠసీమను అలంకరించవచ్చు. రాణి : ఆ కంఠసీమను అలంకరించటం గత రాత్రే జరిగిపోయినది. నీ కంఠసీమను కాదని ఇప్పుడు నాకు అవగతమౌతున్నది. - మీరిచ్చిన బహూకృతికి ప్రియ సంతోషించిందా అని ప్రశ్నిస్తే మహానందపడ్డదని ప్రభువు సమాధానం చెప్పి నప్పుడు నాకెంత ఆహ్లాదం కలిగింది కజ్జలా! నీవంటే నాకు మొదటినుంచీ అదేదో అర్థంకాని అనురాగమూ, అనుబంధమూ ఏర్పడ్డవి... పోనీలే దిగులు పడవద్దు. నేను ప్రత్యేకంగా నీకివ్వమని మరొక పతకం అంతకంటే చాలా విలువగలది - మా తండ్రిగారు నాకు వివాహ సమయంలో బహూకరించింది - ప్రభువుచేత పంపిస్తాను దిగులు పడకు. కజ్జల : నాకేమీ అవసరం లేదు. రాణి : నేను తప్పకుండా పంపిస్తాను. నీవు ఇంత చిన్నబుచ్చు కోవటం వల్ల నా మనస్సుకు ఎంత బాధగా ఉన్నదో నీకేం తెలుసు... ఉఁ ఇంతకూ మహారాజు నిన్ను మోసగించారన్న మాట - ఇక బయలుదేరనా... వెంటనే పతకం పంపిస్తాను. (లేవబోతుంది) కజ్జల : (యోచనాపూర్వకంగా) దేవీ - మీరు పంపవద్దు. నాకు అనవసరం. ముమ్మాటికీ నేను స్వీకరించను. రాణి : స్వీకరించవూ? ఏమిటా కలవరము కజ్జలా? ఈ దినము ప్రతి చిన్న విషయమూ నిన్నింతగా కలతపెడుతూ ఉన్నదేం? పోనీ. పంపనులే. నీ మనస్సుకు అంత కష్టంగా ఉంటే నేనుమాత్రం బలవంతం చేస్తానా. ఎందుకీ బాధ పడటం. ఏం ప్రయోజనం. మహారాజు చిత్తవృత్తి ఎరుగని దానివి కావుగా... ఆయన ఎప్పుడూ కొత్త కొత్త సీతాకోక చిలుకలను వెతుకుతూ ఉంటాడుగదా. నూతన ప్రియుడు ఈ పతాకాన్ని తన్నుకుపోను పరసీమనుంచి ఏదో ఒక సీతాకోకచిలుక మన రాజు సౌధాగ్రం మీద వ్రాలిందన్నమాట. కజ్జల: (దీర్ఘ నిశ్వాసంతో) దేవీ నేను అలసి పోయినాను. క్షమించాలి. 382 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 రాణి : అవును. అవును. నీ ముఖ వర్చస్సును బట్టే అవగతమౌతూ ఉన్నది. కొంచెం విశ్రాంతి తీసుకో - నేనూ బయలుదేరనా (రెండడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనుకకు వచ్చి ఆప్యాయంగా) నీ రూపం ఎంత చెడి పోయింది కజ్జలా! గుర్తుపట్టలేకుండా ఎలా మారి మారి పోయినావు. ఆరోగ్య విషయంలో అతిశ్రద్ధ వహించు సుమా! ఇది నాకోసం చెపుతున్నమాట. మనం వయస్సులో ఉన్న వాళ్ళము. బహు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ధైర్యం పోగొట్టు కోకు. మహారాజు మన్ననా మళ్ళకేం చేస్తుంది. పుష్టిగా తిను. ప్రసవాసవాలు సేవించు, దీర్ఘ నిద్ర అవసరం. దేన్ని గురించీ అట్టేసేపు ఆలోచించవద్దు. (కజ్జల వాడిపోయిన ముఖంతో లేచి వణికిపోయే చేతులతో రాణికి నమస్కరిస్తుంది. రాణి నిష్క్రమిస్తుంది.) కజ్జల : కంచుకీ! కంచుకి : (ప్రవేశించి) అమ్మాయీ! కజ్జల : (అతనిచేయి ఊతగా తీసుకొని మయూరాసనం మీద విశ్రమిస్తూ) విన్నావా? మహారాజు నన్నెలా మోసగిస్తున్నాడో. ఇంకొతెను ప్రేమిస్తున్నాడు. అనన్య సాధ్యమైన నా స్థానాన్ని మరెవరో ఆక్రమించారు... నా పారితోషికాలు మరొకతె స్వీకరించి అలంకరించుకుంటున్నది. ఇంత వరకూ ప్రభువు ఇక్కడికి రాకపోవటానికి ఇదే కారణం. పసిబిడ్డను చూడకుండా ఆ పాపిష్ఠి కళ్ళు ఎలా ఉండగలిగాయో? సౌధాలల్లో తిరిగేటప్పుడు నాకంటపడి కూడా చూడనట్లు తప్పించుకు తిరుగుతున్నాడు. ఛీ! అన్యాయంగా ఆయనమీద అపనిందలు వెయ్యటమెందుకు? రాణి చెప్పిన మాటల్లో సత్యమెంతో... ఈర్ష్యపరురాలు! అలా జరగటానికి అవకాశమెక్కడిది? ఇదంతా నా ప్రాభవాన్ని చూచి ఓర్వలేని ఈ కుతంత్రురాలు పన్నిన పన్నాగమై ఉంటుంది. ఈ ఉత్సాహ సమయంలో కాసేపైనా నన్ను బాధపెట్టి మనస్సులో సంతోషించటానికి. అబ్బా! ఇది ఎంత కథ పన్నింది! కంచుకి : అమ్మాయీ! ఆమె చెప్పిన మాటల్లో అణుమాత్రం అసత్యం లేదు. నీకు నిజంగా ఎవరో శత్రువు మొలకెత్తింది. కజ్జల : ఓరి సాహసీ! నీకు తెలుసునన్నమాట. ఇన్నాళ్ళబట్టీ నాకెందుకు ఎరుక పరచలేదు పాపీ. ఏకాంకికలు 383 కంచుకి : అమ్మాయీ! మరొకమాట రానియ్యకు. నేను వెళ్ళిపోతాను. (బయలు దేరతాడు) కజ్జల : ఆగక్కడ. ఎవరా వ్యక్తి? ఇంతకు ముందెందుకు చెప్పలేదు? కంచుకి : నీవే తెలుసుకుంటావని. నీవు గ్రహించలేకపోవటం నా దోషమా? కజ్జల : నమ్మి నా గుట్టంతా నీ చేతుల్లో పెడితే నీవు చూపించవలసిన కృతజ్ఞత ఇదేనా? కోరుకున్నదల్లా ఇచ్చి నిన్ను సంతృప్తి పరిచానే - ఇదేనా నీ సానుభూతి? కంచుకి : నామీద నీ నేరము. నీవీ స్థితికి రావటానికి కారకులెవరో మరిచిపోయి మాట్లాడకు. పదిహేను వసంతాలపాటు మహారాజు మనస్సు నీకిప్పించిన నా మీదనా నీ నేరము. కజ్జల : (తప్పిదాన్ని గ్రహించినట్లు) అవును నిజమే. అందుకు నేను కృతజ్ఞురాలను. కానీ కంచుకీ, నా జీవితంలో నిమిషం సుఖం లేదు. ప్రతి దినమూ ఏదో ఒక ప్రళయము. మిన్ను విరిగి మీద పడటము. చిట్టచివరకీ మోసము. నా విజయశ్రీ ఎంత చంచలమైంది కంచుకీ - జయించి సుస్థిరమనుకున్న విజయం ఇన్నిమార్లు చేయి జారిపోతుంటే ఎన్ని ప్రయత్నాలు చేసేది. కంచుకి : రూపంతో మురిపించి నన్నాళ్ళు మురిపించావు తల్లీ - ప్రణయ సామ్రాజ్య జయపతాకవైనావు. ఆ రూపం అనిత్యం. అందువల్ల చేకూరే విజయమూ అనిత్యం. నిన్ను మించిన సౌందర్యం నిన్ను త్రోసి రాజన్నది. అది పరిపూర్ణ విజయం పొందటం భావ్యం కూడా. నీవు అనుసరించే మార్గము ఇంత కంటే సుస్థిరమైన విజయాన్ని ప్రసాదించలేదని చెప్పిన నా మాటలు నీకు వెనుక నచ్చినవా? కజ్జల : ఆ శాశ్వత విజయానికి మార్గమేమిటో? కంచుకి : (చిత్రంగా కజ్జల కళ్ళల్లోకి చూస్తూ) వెనుక విన్నవించిందేగా నీకే తెలుసు. కజ్జల : (కోపంతో) ఛా! నోరు ముయ్. కంచుకి : నేను ఎవరి క్షేమం కోరి మాట్లాడుతున్నానో గ్రహించావా? అతి స్వల్పతంత్రం. కజ్జల : ఆ ప్రసంగం మరొకమాటు రానిస్తే మన్నించను కంచుకీ! 384 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 కంచుకి : కజ్జలా! కోపం తెచ్చుకోకు. శాక్తేయపంక్తి కంఠస్వామి ప్రజ్ఞ - అసామాన్యంలో యావద్భారతంలో ప్రఖ్యాతి పొందింది. అంతటి మహాత్ముడి అండ ఉండి కూడా ఆశ్రయలోపం వల్ల ఆశయ సాఫల్యం పొందలేకపోవటం మన దురదృష్టం - అవ్యక్తత. కజ్జల : సమస్త శక్తులూ నాకరాగతాలౌతవా? కంచుకి : ఇంకా సందేహమా? కజ్జల : (యోచనాపూర్వకంగా) నా ఆత్మ మహారాజుది. పంక్తికంఠ స్వామి నీచ కైంకర్యానికి కాశ్మీర రవికిరణ సంఫుల్ల కైరవం ఈ దేహాన్ని ఉపహారం చేయగలుగుతానా? - కంచుకి : మనస్సులో మహారాజును స్మరించుకుంటూ, కాసేపు కళ్ళు మూసుకొని... కజ్జల : నగ్నంగా... శక్తి ముందు నేనూ నా మీద భయంకర శాక్తేయకరాళ హస్తాలు - నా జీవధనాన్ని నిమిషంలో దోచుకుంటాడా... బాబో మనస్సు అంగీకరించటంలేదు. కంచుకి : ఆశయంతో పోలిస్తే నీ త్యాగమెంత? శక్తికి దేహాన్ని ఉపహారంగా ఇవ్వలేని నీకు మహత్తరమైన ఈశ్వితశక్తి ఎలా వస్తుంది. సాధనను బట్టే గదా సిద్ధి. కజ్జల : కంచుకీ! నన్నేదో మోహ మహాసముద్రంలో ఈదించబోతు న్నావు. ఉంః... విజయం హస్తగతం కాకపోయినాసరే. ఈ నీచమార్గాన్ని అనుసరించలేను కంచుకీ. నా పవిత్రదేహాన్ని బలిపీఠం ఎక్కించలేను కంచుకీ (రెండు చేతులతో తల పట్టుకుంటుంది) కంచుకి : శుభాశుభాలనే అవధులందని జలధుల్లో మానవులు తట్టాడుతుంటారు. ఎవరో సాహసికులు కాని ఆ మహా సాగరాన్ని తరించి బయటపడలేరు తరించినవాళ్ళకు ఈశిత్వమూ! వశిత్వమూ! త్రిలోక ప్రాభవమూ! కజ్జలా! కరతలామలకాలు కాబోతూ ఉన్న మహత్తర సౌఖ్యాన్నీ విజయాన్ని చేతులార చెడగొట్టుకోవద్దు. ఆలోచించుకో! కజ్జల : రుగ్మత నా గుండెలు బ్రద్దలు చేస్తున్నది. ఈ క్రూర కర్మకు ఎదురు నిల్చే ధైర్య సాహసాలు దానికి లేవు. కంచుకీ ఆ ప్రసంగమిక చాలించు. అనుభవించిన సౌఖ్యం చాలు. వెనక హస్తగతమైన విజయం చాలు. మోహానికి నిముషం లొంగానా నా జీవనావ మునిగిపోతుంది. ఏకాంకికలు 385 కంచుకి : ఆ నిమిషమే నిన్ను జగజ్జేతను చేస్తుంది. నీ పతనానికి నీవే కారణభూతు రాలవు కావద్దు కజ్జలా! ఆలోచించుకో - (వెళ్ళబోతాడు) కజ్జల : (నీరస కంఠంతో) కంచుకీ! కోపం వద్దు. నన్ను ఒంటరిగా విడిచిపోవద్దు. ఈ జబ్బు నన్ను పీల్చి పిప్పి చేసి సగం చేసింది. నాలో శక్తి ఏదో నన్ను వదలి పెట్టిపోయింది. స్వయంగా ఆలోచించలేను. కన్నబిడ్డలా చూస్తూ ఉన్న నీవే నన్ను కాపాడాలి. ఆ భారం నీది... కంచుకీ - కాసేపు నన్ను విశ్రమించనీ. చేయి ఊత ఇచ్చి పాన్పు మీదికి చేరుస్తే ఆమె పవళిస్తుంది.) ద్వితీయ దృశ్యము - (కంచుకి (రాజసౌధంలో కజ్జలాదేవి మందిరం. కజ్జలాదేవి గాఢంగా నిద్రిస్తూ ఉంటుంది. కుమార్తె సారంగదేవి ఒక ప్రక్కన వీణా నాదం చేస్తూ ఆలోచనా నిమగ్నురాలై ఉంటుంది.) షట్పది : అమ్మాయీ! కజ్జలాదేవి గాఢనిద్రలో ఉన్నది. మనం ఇక్కడ పాడుకుంటూ ఆమె సుషుప్తికి భంగం కలిగించటం భావ్యం కాదు. ఎప్పుడూ ఏదో అవ్యక్తమైన బాధ అనుభవిస్తూ ఉంటుంది. ఈ దినం చాలా నీరసించిపోయింది. సారంగదేవి : నిజమే! షట్పదీ తోచక ఏదో పాట పాడుతున్నాను గాని, ఆమె నిద్రకు అంతరాయం కలిగించటము ఏమాత్రమూ నాకు ఇష్టం లేదు. నీవన్నట్లు ఆమె ఎప్పుడే ఏదో అవ్యక్తమైన వేదన అనుభవిస్తూ ఉన్నది. నేను పుట్టినది మొదలు చూస్తూనే ఉన్నాను. ఆమె జీవితంలో సుఖంగా గడిచిపోయింది ఒక దినమూ నాకు కనిపించలేదు. షట్పది : (పెదవి విరుస్తూ) పాపం! ఆమె ఎన్నడూ సుఖంగా లేదు. అందులో ఈ ఉదయం. (వాతాయనంవైపు నడిచి చూచి వచ్చి దీర్ఘంగా నిశ్వాసిస్తుంది) సారంగదేవి : ఎందుకో దీర్ఘంగా నిశ్వాసిస్తున్నావు షట్పదీ! షట్పది : కజ్జలదేవి జీవితంలో ఇది ఎంత మహోత్సాహసమయం. సమస్త కాశ్మీరమూ సాదర గౌరవం చూపించటానికి ఈనాడు ఆమె సౌధం చుట్టూ చేరింది. మహారాణి 386 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 స్వయంగా ఎవరి సౌధానికి వచ్చి ఆదరించింది? అమ్మాయీ! ఇది నీకూ కజ్జల దేవికి ఎంత శుభదినం... ఎందుకో నీవు కూడా సంతోషంగా లేవు తల్లీ - సారంగదేవి : నా ఆనందాన్నంతా నీకిస్తాను, మనః పూర్వకంగా అనుభ వించి ఆనందించు. పరమాత్మను నా పునర్జన్మలోనైనా ఇటువంటి శుభదినాన్ని నాకు ప్రసాదించవద్దని ప్రార్థిస్తు న్నాను. నా పరిస్థితిలో మీరుండి ఈ ఆనంద సమయాన్ని అర్థం చేసుకుంటే నేను సంతోషంగా లేకపోవటానికి కారణం అవగతమౌతుంది. షట్పది : అంటే - నీ అభిప్రాయము. - సారంగదేవి : (కంట తడితో) ఏమీ లేదు. షట్పది : అమ్మాయీ! ఏమీ లేకపోతే ఏమిటా కంటతడి. సారంగదేవి : ఏమీలేదు షట్పదీ. (కంటతడి తుడుచుకుంటుంది) షట్పది : అమ్మాయీ! నీవు కూడా కొన్నాళ్ళనుంచీ ఏదో అర్థంగాని బాధ అనుభ విస్తున్నావు. నేను వినగూడని అంశమేదన్నా నిన్ను కలవరపెడుతున్నదా? సారంగదేవి : నీవు వినగూడనిది నా జీవితంలో ఏదన్నా ఇంతవరకూ ఉన్నట్లు విన్నావా? షట్పది : కానప్పుడు నీ చింతకు కారణమేమిటో నాకు బోధపడటం లేదు - చెప్పు తల్లీ! అనవసరంగా మనస్సులో పెట్టుకొని ఎందుకు కృశిస్తావు. నేనంటే నీకు అనురాగం తప్పి పోయిందా? అయితే బ్రతిమాలనులే. సారంగదేవి : షట్పదీ ఏమిటా నిష్ఠూరం. నన్ను మళ్ళా అనవసరంగా ఏడిపించటానికి ప్రయత్నించవద్దు. నేను ప్రస్తుతం మాట్లాడకుండా ఉండటం తప్ప మరొక పని చెయ్యలేను. షట్పది : ఇప్పుడు దుఃఖించావన్నమాట. సంగతేమిటో బయటపెట్టు తల్లీ! అంత దుఃఖించవలసిన అగత్యమేమి వచ్చింది - నీ ప్రియుడేమైనా నిన్ను మోసగించాడా? సారంగదేవి : (దుఃఖంలో నవ్వుతూ) లేదు. షట్పది : మరి - సారంగదేవి : నే నీ నీచమైన బ్రతుకు గడపలేకుండా ఉన్నాను. షట్పది : అంటే నీ అభిప్రాయం ఏకాంకికలు 387 సారంగదేవి : నే నీ పాపాన్ని భరించలేను. ఈ పాపంలో బ్రతకలేను. ఈ పాపవాయువు క్రమక్రమంగా నా ప్రాణాన్ని హరిస్తున్నది. అనేక రాత్రులనుంచీ నాకంటికి కునుకు లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్తంభించినా బ్రతుకుతున్నాను. నా ఇంట్లో ఏ వస్తువును ముట్టుకున్నా కళంక భూయిష్ఠం పాప పంకిలము. ఎన్నాళ్ళబట్టో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. కొలది కాలం క్రితం దర్శనమిచ్చింది. ఆనాటినుంచి ఆమె వికట నృత్యాన్ని దర్శిస్తూ ఆనందిస్తున్నాను. చివరకు ఆమె చిన్మయహాసంలో నురుగునై పోవటానికి నిశ్చయించుకున్నాను. ఇక జీవించ లేను షట్పదీ! జీవించను - షట్పది : అమ్మాయీ! ఏమిటా లేనిపోని పిచ్చి ఊహలు. నీకేం శరీర స్వస్థత లేదా? సారంగదేవి : షట్పదీ! ఎందుకు నాచేత చెప్పించటము. ఇందులో నీవెరుగని దేమున్నది. నా అవమానపు బ్రతుకును చూస్తుంటే నీకు అసహ్యం కలగటం లేదూ. నాతో మాట్లాడేటప్పుడు నాచుట్టూ ఉన్న వ్యభిచార వాయువు మీమీద సోకటం లేదూ? (కంటికి గుడ్డ అడ్డం పెట్టుకొని దుఃఖిస్తుంది) షట్పది : తల్లీ! సారంగీ! సారంగీ! సారంగదేవి : షట్పదీ! (నిద్రలో ఉన్న కజ్జల దేవిని చూచి) నా మాటలన్నీ అమ్మ విన్నదా? లేదు. ఇంకా దీర్ఘనిద్రలోనే ఉన్నది. ఆమె వినకూడదు. నా హృదయంలో ఏమున్నదో ఆమెకు తెలియ కూడదు. తెలిస్తే నేను బ్రతకను. అప్పుడు నా దుఃఖమే నాకు దహనాగ్నిగా మారిపోతుంది. (కజ్జలను చూపిస్తూ) ఆమె వివాహిత. వితంతువైనా మహారాజు అనేక వివాహాలు చేసుకున్నాడు. ఇద్దరికీ సంతానం ఉన్నది. కానీ వీరి వ్యభిచారం లోకంలో ఏ మహాభావమూ ఆపలేకపోతున్నది. వృద్ధాప్యానికి చేతగానప్పుడు... ఈ పాపపంకిలంలో ప్రాణాలు ఉగ్గబట్టుకొని బ్రతుకుతూ ఉన్న నేను చాలక - ఈ పాప కారాగారంలో ఈ పాపకూపంలో నాకు తోడుగా మరొక ప్రాణిని పంపించాడు బ్రహ్మ. అమాయక ప్రజ! దానికేం తెలుసు, తమ్ముణ్ణి పొగడటానికని వచ్చారు. కజ్జలా దేవి మహారాణి అని వారి విశ్వాసం. కాబొయ్యే యువరాజని తమ్ముడికి జయ పెట్టవచ్చారు. ప్రజదేముంది, అమాయక ప్రజ. ప్రజలకు తమ్ముడు యువరాజు, అమ్మ మహారాణి నేను రాజకుమార్తెను, ప్రభు వర్గంలో అమ్మ... చెప్పలేను - మేము తొత్తు సంతానము, (ఏడుస్తూ) నా యీ దేహం, దానికి సంబంధించిన సమస్తమూ పాపానివి, మహా పాపానివి, నా తండ్రి వ్యభిచారి, తల్లి వ్యభిచారణి. ఈ కళంకాన్ని కడిగి వేసే దివ్యహస్తాలు ఏ దేవతాలోకంలో ఉన్నవో! 388 (కజ్జల నిట్టూరుస్తుంది) వావిలాల సోమయాజులు సాహిత్యం-2 షట్పది : (పెదిమల మీద చేయి పెట్టి నివారిస్తూ) ఇష్-ఇష్. సారంగదేవి : (కజ్జలాదేవిని చూస్తూ) కలలు కంటున్నావా తల్లీ! నీ స్థితిని నీవు అర్థం చేసుకోలేని దుస్థితిలో పడ్డావు. నీ లోపాలను చెప్పే పెద్దలెవరూ నీకు లేరు. అందరూ నిన్ను జూచి అడుగులకు మడుగులొత్తే వారే. అమ్మా! నీ చుట్టూ ప్రసరించే గాలి, వెలుతురు, పాపభూయిష్ఠం! పాపభూయిష్ఠం నీవల్ల కాశ్మీరంలో నీతి అవినీతి అవినీతి నీతిగా మారిపోతున్నది. అమ్మా నేనీ సౌధంలో విశేషకాలం సంతోషంగా బ్రతకలేను. షట్పది : సర్వసంగ పరిత్యాగం చేసుకొని భిక్షుక సంఘంలో చేరిపోవాలని నీకు ఎన్నడైనా కోరిక కలిగిందా ఏమిటి? సారంగదేవి : ఎందుకలా ప్రశ్నించావు షట్పదీ. నా హృదయం ఎపుడో నీకు అర్థమైనట్లు మాట్లాడావు. ఈకోరిక ఎప్పుడో ఒకప్పుడు కాదు. అనేకమార్లు కలిగింది. మన జీవితాలకు శాంతి మహాయానంలో తప్ప దొరకదని అమ్మకు ఎన్నో మాట్లు మనవి చేశాను. ఆమె ఈ సౌధాన్ని వదలిపెట్టలేదు. భ్రమ పడ్డా ఈ సౌఖ్యాలకు స్వస్తి చెప్పలేదు. అందుకు ఎన్నడూ అంగీకరించింది కాదు. షట్పది : అందులో ఆమె దోషమేమీ లేదు. నీ మేలుకోరి చేసింది ఆ పని. సారంగదేవి : ఇకముందు నేను పరిపూర్ణానందాన్ని అనుభవిస్తానన్నమాట కల్ల. ఆమె మటుకు ఏమి సుఖపడుతూ ఉన్నది. ఎప్పుడూ కన్నీళ్ళలో కరిగిపోతున్నది. ఆమెకు బ్రతుకులో సుఖస్వప్నం వంటి ఒక్క నిమిషమైనా ఉన్నదెప్పుడో చెప్పు షట్పదీ! షట్పది : ధర్మాధర్మాలు నీ వనుకున్నంత నిశ్చితాలు కావు తల్లీ! ఒకరి నొకరు ప్రేమించుకోవటం పాపం కాదు. ప్రేమ అమృతం వంటిది. రాహు కేతువులు ఆ అమృత పానం వల్లనే కదా దేవతలను క్షణకాలమైనా జయిస్తున్నారు. ఆ ప్రేమ ముగ్ధ. యౌవనంలో ఉన్నప్పుడు వ్యక్తి ఒక పాపమైనా చేయలేక పోవటం పాపము! సారంగదేవి : షట్పదీ వెనుకటినుంచీ నీకూ ఈ వెర్రి సిద్ధాంతాల మీద అభిమానం ఉన్నదా? షట్పది : పురుష హృదయాలను చేత జిక్కించుకొని వాటికి అధిష్ఠాన దేవతలమై పాలించటం! కీర్తితో లోకాన్ని వ్యామోహ పెట్టటం!! కాంక్షలో కైపు!!! ప్రణయ కోపాలతో ఎంతంత మహాప్రభువులను పాదదాసులను చేసుకోవటం ఉజ్జ్వల యౌవనానికి ఏకాంకికలు 389 లక్షణాలు. ఎంత అదృష్టవంతులకో గాని, పూర్వజన్మలో ఎంతో మహాపుణ్యం చేసుకున్న వాళ్ళకు గాని లభించని లక్షణాలు! అందుకోలేని ఆశయాలు! ప్రభువులను ప్రేమించి వారు ప్రణయ భుజ పంజర కీరాలై శుకానువాదం చేస్తున్నప్పుడు కలిగే పరితృప్తి, మహాప్రభువులు మనసారా ప్రేమిస్తే వారి ఆజానుబాహువులను ఆధారం చేసుకొని అల్లుకుపోయే ప్రణయ లతికలమై ఆనందరసోన్మత్తతలో 'ప్రభూ' అని పలవరించుటము ఒక జీవికి ఎన్ని జన్మలకో!... మహాప్రభువు కలశ భూపతిది ఎంత జాలిగుండె తల్లీ - ఆయన ఎంత చక్కనివాడు ఎంత రసికుడు. (తన మెడలో ఉన్న హారాన్ని చూచుకొని సవరించు కుంటుంది) సారంగదేవి : షట్పదీ! నీ ప్రసంగం ఇక చాలించు. నా మనస్సుకు బాధ కలిగిస్తున్నది. షట్పది : అమ్మాయీ! మీ తండ్రిని ప్రేమమూర్తి అని అభినందిస్తుంటే నీకు బాధేందుకు తల్లీ! సారంగదేవి : ఆయన ప్రేమమూర్తి కాడని కాదు. ఆయన ప్రేమమూర్తని ఎరగక కాదు ఆయన ప్రేమమూర్తని నీవు చెప్పే లక్షణం నాకు నచ్చలేదు. నాకు మహా బాధ కలిగించింది. షట్పది : (సారంగదేవి చేతులు స్పృశిస్తూ) అమ్మాయి! వెర్రిదానా. నీమీద అనురాగం లేకనా ప్రభుహృదయాన్ని గురించి నీతో ప్రసంగించటం. సారంగదేవి : (బిగ్గరగా) షట్పదీ. నా కోపం అధికమౌతున్నది. మరొక మాటు మహారాజు ప్రశంస రానిచ్చావా నీకు మర్యాద దక్కదు... (షట్పది మెడలో హారాన్ని నిర్దేశిస్తూ) నీకెక్కడిదా హారము? ఎవరిచ్చారు? ఇదివరకు నీ మెళ్ళో లేదే! ఇది మహారాణిది కదూ. నీకెలా వచ్చింది. చెప్పవూ? చెప్పవూ? (కజ్జలాదేవి ఈ సంభాషణ వింటూ ఒక్కమాటున కదిలి లేస్తుంది) షట్పది : చెప్పకూడదు. సారంగదేవి : నాదగ్గిర దాపరికమా షట్పదీ! ఉఁ హారమెవరిచ్చారు? కజ్జల : మహారాజు! మహారాజు!! 390 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 షట్పది : (ఉక్కిరి బిక్కిరైపోతూ మొగం ప్రక్కకు తిప్పుకొని వెళ్ళిపోబోతుంది) కజ్జల : షట్పదీ! ఆగక్కడ. సారంగీ నీవు బయటికి వెళ్ళి జనసమూహాన్ని చూచి ఆనందించు. వారిని తృప్తి పరచటము మన కర్తవ్యము. (సారంగదేవి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతుంది. షట్పది తలవంచుకొని నిలవబడుతుంది) కజ్జల : ఒకమాటు మొగం పైకెత్తి నన్ను చూడు షట్పదీ! షట్పది : (మాట్లాడదు) కజ్జల : నా ఆజ్ఞ పాలించవన్నమాట షట్పదీ! షట్పది : దేవీ! నన్ను బాధపెట్టవద్దు. కజ్జల : ఉఁ.... షట్పది : (కొంచెం పక్కకు పోయి ఆలోచనచేసి) కజ్జలా! మహారాజు నాకీ హారమిచ్చి గౌరవించారు. కజ్జల : (ఆవేశంలో) ఎప్పుడు? ఎక్కడ? షట్పది : (ఠీవితో) నిన్న సాయంత్రం. తామ్రస్వామి ఆలయంలో. కజ్జల : రాజు నిన్ను ప్రేమిస్తున్నాడన్నమాట! షట్పది : అవును. కజ్జల : నీకెలా తెలుసు? షట్పది : నాతో చెప్పారు. కజ్జల : రాజు! నీతో చెప్పాడా? షట్పది : అవును నిన్న రాత్రి శంపా ప్రాసాదంలో. కజ్జల : (దీర్ఘంగా నిట్టూర్చి వెనకకు పోయి పర్యంకం మీద వెన్నువాల్చి మళ్ళా కూర్చొని) ఉఁ ఇంతకూ నిన్ను ఆయన ప్రేమించాడన్నమాట. షట్పది : (తలవంచి సగర్వంగా ) ఔను. కజ్జల : ఎప్పటినుంచి? ఏకాంకికలు లేచి 391 షట్పది : గత వసంతారంభంనుంచి. కజ్జల : నాకు ఋగ్మత ప్రారంభించినప్పటి నుంచీ - మీ ఇద్దరికీ ప్రథమ పరిచయం ఎలా జరిగింది? షట్పది : (మాట్లాడదు) కజ్జల : చెప్పవా? చెప్పలేవు. మోసము. అతడు నిన్ను మనసిచ్చి ప్రేమించలేదు. కేవలం ఆటవస్తువుగా గ్రహించాడు. షట్పది : ప్రేమించటంలేదూ? శుద్ధ అబద్ధం. ప్రథమ పరిచయంనాడు నీమీద చూపించిన అనురాగం చాలదని చెప్పాడు మహారాజు. నీ కళ్ళను మించిన కాంతులు నా కళ్ళల్లో తొణికిస లాడుతున్నవని పొగిడాడు. కన్నీటితో నా చేతులు కడిగి వేశాడు. పాదదాసుడై ప్రణామం చేశాడు. కజ్జల : (రాని నవ్వు తెచ్చుకుంటూ) షట్పదీ రాజు నిన్ను మోసగించాడు. నీవు మోసపోయినావు. ఎవరైనా మోసగించే వాళ్ళు ప్రేమించటంలేదని చెపుతారా? కన్నీళ్ళతో కడి గేయరూ? కేవలం పాదదాసు కావటమే కాదు. పాద దాసానుదాసు లౌతారు ఆ సమయానికి. షట్పదీ వెర్రిదానా ఎంత మోసపోయినావు. పాపం! వృద్ధాప్యం రాజ్యమేలుతూ ఉన్న ఆ ముదనుగ్గు హృదయంలో ఇంకా ప్రేమకు స్థాన మున్నదా? మనసారా నీకు పాదదాసుడైనాడనేనా నీ భావం. ఆ కన్నీళ్ళు కాలుష్యం లేనివనేనా నీ ఆనందం - వెర్రిదానా? పోనీ... ఆ పుంజును ఏ మదనమంత్రంతో బుట్టలో వేశావు షట్పదీ. షట్పది : కామదేవాలయములలో, ఉద్యానవనాలల్లో నీమాదిరి కన్నులు కలుపలేదులే - మహారాజును నేనేమీ కవ్వించలేదు. మనఃపూర్వకంగా ఆయనే ప్రణయార్థిగా నా కన్యాప్రణయాన్ని అర్థించాడు. (మెళ్ళో హారాన్ని సవరించుకుంటుంది) కజ్జల : (శయ్య మీదనుంచి లేచిపోయి షట్పది మెళ్ళో హారాన్ని గుప్పిటితో పట్టుకొని) ఇది నాకు ఇచ్చేయ్! షట్పది : ఇవ్వలేను. కజ్జల : నాకు కావాలి. షట్పది : ఇది నాది (పెనుగులాడుతూ తెగిపోతుందేమో నన్న భయంతో) నేను నీకివ్వను. 392 వావిలాల సోమయాజులు సాహిత్యం - 2 కజ్జల : నీ చేతులు విరిచేస్తాను. (ఎడం చేతితో షట్పది చెయ్యి మెలి త్రిప్పుతుంది) షట్పది : ఏమిటీ దౌర్జన్యం... ప్రభువుతో చెప్పి. కజ్జల : (ఈర్ష్యతో) శిక్ష వేయిస్తావా! (హారం తెంచి) కృతఘ్నురాలా! ఇదిగో హారం - బలవంతంగా తీసుకున్నావు. ఎవరితో చెప్పుకుంటావో. షట్పది : నా హారం నాకివ్వు. కజ్జల : నా సౌధంలో నుంచి బయటికి కదులు. షట్పది : నీవు దొంగవు... అందరికీ చెపుతాను. బలవంతంగా నా హారాన్ని కాజేశావు. కజ్జల : నిజంగానా, దొంగనా. ఇదిగో నీ హారం తీసుకో... ఇచ్చే స్తున్నానుండు. (హారాన్ని తెంచి దానిలో పచ్చరాయిని బల్లమీద పెట్టి చిన్నరాతితో ముక్కలు ముక్కలుగా కొట్టేస్తుంది) షట్పది : ఆఁ... ఆఁ ఘనకార్యం చేశావు. అశక్తురాలవు. అంతకంటె నన్ను ఏం చేస్తావు పాపం! నీ కళ్ళమంట తీరిందా. ఎంత అఘాయిత్యమే జంతువా? మహారాజు యిలాంటి నిన్ను ఇంకా ఎలా ప్రేమిస్తాడు? నాతో ఏమని చెప్పాడో చెప్ప మన్నావా? కజ్జల : (ఉరోభాగాన్ని నిక్కించి రాజసంతో) నోరు ముయ్యి. షట్పది: నాకేం అవసరం. నువ్వే ముయ్యి. నిన్నూ నీ దురవస్థనూ చూచి రాజూ నేనూ ఇప్పుడే నవ్వుకుంటాము. ఆయన నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. నాకు యౌవనముంది నీవు ముదివగ్గువు. నీలో ఈర్ష్య చావలేదు యౌవ్వనం చచ్చినా - కజ్జల : (కలవరపాటుతో) (లేచి పక్క గుడ్డలు అటూ ఇటూ విసరి పారేసి తలగడ క్రింద కత్తి తీసి) ఏదీ మళ్ళీ అను ఆ మాట (షట్పది మీదికి పొడవటానికి వస్తుంది) షట్పది : (భయంతో) అమ్మయ్యో! రాక్షసీ! రజా, రుజా, కజ్జా!! కజ్జల : ఒళ్లు దగ్గిర పెట్టుకొని బ్రతుకు. నాతోనా నీకు. జాగ్రత్త తులువా! (కత్తి విసరి క్రింద పారవేయబోతూ) ఈటిముండ - మెడబెట్టి గెంటిస్తాను. పాలుపోసి పెంచినందుకు పాము వనిపిస్తున్నావా జాగ్రత్త (తలుపులలోనుంచి రజా, కజ్జా తొంగి చూస్తారు. “ఎవరా పక్షులు" అనే కజ్జలాదేవి ఉన్మత్తకంఠం విని, బయటికి వెళ్ళిపోతారు) కదలు అవతలికి. (షట్పది నెమ్మదిగా కన్నీటితో వెళ్ళిపోతుంది) పాపిష్ఠిముండ - బంధకి (కత్తి నేలమీద పారేసి పర్యంకం మీద వాలిపోతుంది) ఏకాంకికలు 393 చతుర్థ దృశ్యము (కజ్జలాదేవి తన మందిరంలో నిద్రిస్తుంటుంది. సారంగదేవి, షట్పది మాట్లాడుకొంటుంటారు) సారంగదేవి : ఔను! నిజమే. మనోవేదనను ఎన్నాళ్ళు దాచుకోవటం. బయట పెట్టవలసిందే. లేకపోతే బ్రతకటం కష్టం. షట్పదీ! నాకెందుకీ కంపం! ఎందుకీ భయం!! అమ్మా!... అబ్బా! (నెమ్మదిగా నేలమీదికి ఒరిగిపోతుంది) కజ్జల : (మేల్కొని, వేగంతో) అమ్మా! సారంగీ! సారంగీ!! సారంగదేవి : (తెప్పరిల్లి నెమ్మదిగా తల్లి దగ్గరకు చేరి) 'అమ్మా!' అని పిలుస్తూ ముట్టుకో బోతుంది. కజ్జల : నన్ను ముట్టుకోవద్దు. సారంగీ! తల్లీ నా ముఖాన్ని చూడలేక పోతున్నావా? ఏమిటి నీకీ భయం. కళ్లెత్తు - ఒక్కమాటు నీ కన్నీళ్ళను తుడవనీ - - సారంగదేవి: వద్దు - నేను చూడలేను తల్లీ నా దగ్గిరికి రావద్దు. ఒంటరిగా నన్నిలానే బాధపడనీ. మీరంతా వెళ్ళిపోండి. ఏకాంతంగా కాసేపు నన్ను శ్రమ తీర్చుకోనీయండి. కజ్జల : (నాలుగు దిక్కులూ పరిశీలిస్తూ) సారంగీ, ఒక్కమాటు నావైపు కన్నెత్తి చూడు తల్లీ! సారంగదేవి : అమ్మా నన్ను మాటాడించవద్దు - పోనీ నన్ను వెళ్ళిపోనీ. నిన్ను చూడలేను. కజ్జల : తల్లీ! నీ కంటికి నేనంత వికృతంగా కనిపిస్తున్నానా! అసహ్యించు కుంటున్నావా? నిజమే కావచ్చు - తప్పులేదు. నన్ను నేనే అసహ్యించుకుంటున్నాను. నాకంటే నీవు నన్ను అసహ్యించుకో లేవు. దీనికి నీకు భయం అవసరం లేదు. అమ్మా! కలశరాజు నీచుడు - నన్నీ నీచకృత్యానికి పురి కొల్పాడు. (దగ్గరకు వచ్చి సారంగదేవి తల పైకెత్తమని కోరుతుంది) సారంగదేవి : (వేదనతో) అమ్మా! నన్ను ఒక్కసారి మనసార కౌగలించుకో - తాపం! బాధ! అబ్బా! కజ్జల : తల్లీ! ఈ పాపి నిన్ను ముట్టుకోదు. నా స్పర్శవల్ల ప్రతిదీ పంకిలమై పోతుంది. దూరంగా ఉండనీ. ఈ అపవిత్ర దేహాన్ని ఏమి చేయటమో! పాపిష్ఠి పంక్తి కంఠుడి 394 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 హస్తాలకు లొంగిపోయింది ఈ దేహం. ఆ కుహనా గురువు కరకు చూపులకు గురై పోయింది. ఈ దేహం... అబ్బా! బాధ - ఉం. సారంగదేవి : అమ్మా! నీవీ పని ఎలా చేయగలిగావు కజ్జల : తల్లీ! నాకిప్పుడు అర్థం కావటం లేదు. నేనేం చేశానో నాకు తెలియటం లేదు. అమ్మా! నేనిప్పుడెక్కడున్నాను. నా సౌధంలోనేనా... అమ్మాయీ ఇప్పుడిక్కడి కెందుకు వచ్చాను. మతి భ్రమిస్తున్నది. నేను పిచ్చిదాన్నై పోతున్నాను. సారంగదేవి : అమ్మా! నీవు సంపాదించిన సౌఖ్యం, ఇదేనా? - కజ్జల : సౌఖ్యం! శక్తి!! జగత్తులో ఈ రెంటికే స్థానము లేదు. పాలనా కాంక్షలో సౌఖ్యం ఎక్కడుంది తల్లీ! అయినా పాలించలేనిది బ్రతకలేం. - ఇదంతా నీకు అర్థం కాదు. ఎందుకు పాలించాలో నీవు అవగతం చేసుకోలేవు. భిక్షుకుల మధ్య బ్రతక వచ్చు. కానీ ప్రభువులూ, పశువుల సాంగత్యంలో ప్రాణాలు నిలుపుకోలేము. మన కులం మానవ సౌఖ్యమనే కసాయి కత్తులకు కంఠాలర్పించే కంచి మేకలం. జనసామాన్య జీవితంలో శాంతి సౌఖ్యాలు దొరకవని భ్రాంతి పడ్డాను. ప్రభుసౌధ పర్వతాగ్రమెక్కి పదిహేనేండ్లు పరిపాలించాను. ఈనాటికి, ఈ వయస్సున నాకు పతనం! భరించలేను. మళ్ళీ సామాన్య జనసాంగత్యం! అబ్బా బాధ భరించలేను. సారంగదేవి : సామాన్య జనజీవిత మెంత సౌఖ్య ప్రదమయిందో నీవు గుర్తించలేదు తల్లీ. వారి ఆనందం మనకు అనంత లోకాలు వెదికినా దొరకదు. కజ్జల : కాదు! కాదు పొరబాటు!! అమ్మాయీ! వాళ్ళు పాలింపబడటానికి పుట్టారు. నేను పాలించటానికి జన్మించాను. సారంగదేవి : నీవు పాలించటానికి ఎవరవని తల్లీ! లోకంలో ఒకరిని ఒకరు పాలించలేరు. పాలిస్తున్నామని భ్రమపడతారు. కాని - పాలించేది పరమ శివుడొక్కడే. కజ్జల : తల్లీ! జనసామాన్యం కెంధూళి. నాబోటి ఉత్తమ జన్మలు తారాపథ మంటేటట్లు దాన్ని తరిమివేసే జంఝూమారుతాలు. సారంగదేవి : అమ్మా! పాలనాకాంక్ష ఆత్మను పతితం చేస్తుంది. కజ్జల : అది వట్టి భ్రమ. పతితం చేయదు. పవిత్రం చేస్తుంది. మలినం చేసేది మనస్సులుగాని మరేమీ కాదు. పాలకులతో భ్రమపడి సంధి చేసుకుంటే ఆత్మ పతితమౌతుంది. లోకంలో ఉన్నదల్లా ఒకటే పాపం! ఆత్మను గుర్తించలేకపోవటం. ఏకాంకికలు 395 అది మహాపాపం!! జన్మతః కొందరు ప్రాభవం సంపాదించ కుండానే అసహ్యించుకొని, నేను విశ్వప్రయత్నం చేసి విజయం పొంది అనేకమంది వ్యక్తులను పాలించాను. సాధనలో నాకు ప్రతి మెట్టునా ప్రత్యర్థులే! నాతో ఏ కోశానా సాటిరాలేని ప్రతిభా శూన్యులే నాకు ప్రత్యర్థులు!! నా సేవకురాలు గాయనే నాకొక ప్రత్యర్థురాలు. నా మహోన్నత పదవిని ఊపిరి ఉండగానే దానికి కరస్థం చేసి నేను ఎలా జీవించ గలుగుతాను, దక్కించుకొని తీరవలసినదే. సారంగదేవి : (దీనంగా) నీ వనుసరిస్తూ ఉన్న మార్గాలు నిన్ను ఏ లోకాలకు నడిపిస్తున్నవో గుర్తిస్తున్నావా? కజ్జల : అదంతా మరొక జన్మం మాట! మరొక లోకం మాట!! ఈ జన్మలోనే అపజయం పొందుతూ ఉన్నప్పుడు ఎప్పటి మాటో నాకెందుకు? ఈ అపజయాన్ని భరించలేను - ఇక మృత్యువు మాటా? అది నాకు ఎంతో దూరాన ఉంది. దాన్ని గురించి ఇప్పుడు నేను ఆలోచించవలసిన ఆగత్యమే లేదు. సారంగదేవి : ఆ వేయి కళ్ళ తల్లి ఎప్పుడూ మనను వెన్నాడే ఉంటుంది. కాలం గడిచి పోతున్నది. వయస్సు ముదిరి పోతున్నది. ఇంకా మృత్యువు ఎంతో దూరాన ఉన్నదని ఎందుకు భ్రమపడతావు తల్లీ! కజ్జల : (తన శరీరాన్ని ఒక్కమాటు కలయ చూచుకుంటూ) వృద్ధాప్యము! మానవ లోకానికి ఎంత దారుణమైన శిక్ష! నరకము లేదు. ధైర్య స్థైర్యాలు లేని దద్దమ్మల సృష్టి అసహజము అసత్యము! కానీ యౌవన సౌందర్యానికి ఇన్నాళ్ళు మురిసిపోయిన యీ కళ్ళు సడలిపోతూ ఉన్న ఈ శరీరాన్ని ముందు ఎలా చూచి భరించగలుగుతవో! ఒకప్పుడు అలంకారం చేసుకున్న నన్ను నేనే అద్దంలో చూచికొని మురిసి పొయ్యేదాన్ని - నేనే పురుషుడనై నా యౌవనాన్ని అనుభవిస్తే ఎంత ఆనందముంటుందోనని ఊహించేదాన్ని. అటువంటి యౌవ్వనం ఏమైపోతున్నట్లు? ఎక్కడికి పోతున్నట్లు!! సౌందర్యం ముదిమి చేతుల్లో ఏనాటి కైనా ముక్కి పోవలసిందేనా? తప్పదా- తప్పదు. జరామరణ భయాలు ప్రాణికి సహజం తప్పదు. ప్రప్రథమంలో పలితకేశాన్ని చూచినప్పుడు నా పంచప్రాణాలు పోయి నట్లైంది. అయినా ఈ ముసలితనం ఏం జేయగలుగుతుందో చూస్తాను. దాన్నీ జయించటానికి ప్రయత్నం చేస్తాను. సారంగదేవి : అమ్మా! ఎంత వెర్రిన పడుతున్నావు. జర మానవలోకానికి కా సమస్త ప్రాణి లోకానికీ సహజధర్మం. దానిమీద విప్లవం చెయ్యలేము. 396 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 కజ్జల : సహజ ధర్మం కాబట్టే విప్లవం. నేను సహజ ధర్మాలకు లొంగలేదు. ఎదుర్కొనలేని సామాన్య జనాన్ని జరామరణా లకు స్వాగతమిచ్చి ఆహ్వానించనీ - నేను మాత్రం జయించటానికి ప్రయత్నించవలసిందే. సారంగదేవి : అమ్మా! ఈ ప్రపంచ పరిణామంలో ఏదీ స్థిరమైంది కాదు. సమస్త వస్తువూ నశించేదే - అలాగే వృద్ధాప్యం కూడా. కజ్జల : అమ్మాయీ! నీవు చెప్పేది నాకేదీ తలకెక్కదు. నేను అదంతా నమ్మలేను. సారంగదేవి : నమ్మనంత మాత్రంలో అనేవి సత్యాలు కాకపోవు. కజ్జల : భగవంతుడు కూడా సత్యమేనా? సారంగదేవి : భగవంతుడుంటే ఏమిటో గ్రహించే స్థితికి వచ్చిన తరువాత సత్యమే - కజ్జల : నా అభిప్రాయమేమిటో చెప్పమన్నావా? భగవంతుడనే ఒక నపుంసకుణ్ణి సృజించి యీ ప్రవక్తలందరూ లోకాన్ని మోసపుచ్చుతున్నారు. మభ్య పెడుతున్నారు. నా దృష్టిలో అతడు ఎంతో నీచుడు. హృదయం లేని జంతువు! అమాయకమైన ప్రాణాలకు దేహం కల్పించి అవి జీవయాత్రలో అల్లట తల్లటై పోతుంటే చూచి లీలగా ఆనందిస్తాడట! ఎంత అభూత కల్పన! సౌందర్యమంటే ఎరగని ఆ రసికుడు ప్రపంచంలో ఎన్నెన్ని ఏహ్య వస్తువులు సృజించాడు. యౌవనాన్ని సృజించిన చేతులతోనే వృద్ధాప్యాన్ని ఎలా సృష్టించాడు. సుందర మూర్తులను ఊహించిన మేధాశక్తితో అందవికారుల రూపకల్పన మెలా చేయగలిగాడు. ఆ భగవంతుడు ప్రేమ ఎరుగని పీనుగ. కేవలం సృష్టిలో కదల మెదల లేని భయంకర జడవస్తు సమూహంలాగానే అతనూ ఒక అవ్యక్త, అద్వైత, అనంత, జడపదార్థం. అంతేనా? సారంగదేవి : అమ్మా! నీ మాటలు నా గుండెలు బ్రద్దలు చేస్తున్నవి. (తల్లి నోరు చేత్తో మూయబోతుంది) కజ్జల: (వారిస్తూ చిరునవ్వుతో) అమ్మాయీ! నీ యౌవనరూపం ఎంత నయనానంద కరంగా ఉంది. నేనే అనుభవిస్తే... సారంగదేవి : అమ్మా! నిన్ను చూస్తుంటే నాకేదో భయం వేస్తున్నది. అలా ఆకలిడేగ కళ్ళతో నన్ను చూచి భయపెట్టకు. నామీద కలిగే ఈర్ష్యకు మనస్సులో స్థానం కల్పించకు ఏకాంకికలు 397 కజ్జల : అమ్మాయీ! నీ ఉజ్జ్వలరూపాన్ని నాకు ప్రసాదిస్తావా! మరికొంత కాలం లోకాన్ని పరిపాలిస్తాను. సారంగదేవి : అవకాశం ఉంటే అవశ్యం ఇచ్చేస్తాను. నాకు ఎంత అసహ్యంగా ఉన్నదో నీకు అర్థంకాదు ఈ సుందరరూపం, ఈ యౌవన నవకం నా ఆత్మకు ఎంతో భారమనిపిస్తున్నవి. కజ్జల : అమ్మాయీ! జీవమధువు నీకు విషప్రాయమైపోయిందా? ఆనందించలేకుండా ఉన్నావా? సారంగదేవి : మహావెగటుగా ఉంది తల్లీ! కజ్జల : దానికి నేనే కారణం! సారంగదేవి : నీవొక్కతెవే కాదు. కజ్జల : ఏమిటి? "నీవొక్కతనే కాదు” సారంగదేవి : (పొరపాటున నోటివెంట జారి రానిచ్చినట్లుగా) ఆఁ ఆఁ అది కాదు. కజ్జల : (దీనంగా) తల్లీ! నేను నీ మనస్సును బాధ పెడుతున్నానా? సారంగదేవి : (నేలమీద చూస్తూ) ఔను. కజ్జల : నీ మనస్సులో ఏమున్నదో ఒక్కమాటుగా నన్ను అర్థం చేసుకోనీ తల్లీ! సారంగదేవి : నేను చెప్పలేను. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువుల కంటే విశేషంగా అన్యోన్యం ప్రేమించుకుంటూ ఉన్న మనం దూరమైపోతాము. కజ్జల : (యోచనా పూర్వకంగా) మంచిది. సారంగదేవి : (మాట్లాడదు. కొద్దిసేపు నిశ్శబ్దం) కజ్జల : అమ్మాయీ! ఏమిటీ మూకీభావం! ఇది నాకు బాకుకంటే కఠోరంగా... సారంగదేవి : అమ్మా! పొరబాటు పడవద్దు. నిన్ను ప్రేమించినట్లు ఈ ప్రపంచంలో నేను ఎవరినీ ప్రేమించలేదు. కజ్జల : నీ మనస్సును సంక్షుభితం చేసే నన్ను ప్రేమిస్తున్నావా!

సారంగదేవి : మనఃపూర్వకంగా - ఆత్మసాక్షిగా - 398 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 కజ్జల : ఎలా ప్రేమించగలిగావో నాకు అర్థం కావటం లేదు. నిన్ను నే నెన్నడూ ప్రేమించలేదు. నీకోసం నేనేమాత్రమూ శ్రమపడలేదు. సారంగదేవి : నా బాల్యావస్థలో నీవు నాకోసమేమి శ్రమపడ్డావో నేను చూడలేదు. నన్ను నీ దగ్గర లేకుండా మరొకచోట ఉంచినా నీ చిత్రపటాన్ని చూచి కలలు కంటూ ప్రేమించి అర్పించే దాన్ని. కజ్జల : నీకు నన్ను దూరంచేసి నిన్ను ఎంతో బాధపెట్టాను. సారంగదేవి : నీవు నన్ను చూడటానికి వచ్చేదినం నా మనస్సుకు పట్టరాని సంతోషం కలిగేది. కాని నీ ప్రక్కన నిలువబడితే నాకే భయమేసేది. ప్రతివాళ్ళూ నిన్ను ప్రేమిస్తుంటే నాకు ఎంతో ఆనందం వేసేది. లోకానికి నీమీద అంత ఆదరం, ప్రేమా ఎందుకో అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని. పూలమొక్కలతో తోటలో ఒక దినం ఆడుకుంటుంటే ఇద్దరు పెద్ద మనుష్యులు నిన్నుగురించి ఏమేమో చెప్పుకున్నారు. వాళ్ళు మనకు ఆప్తులనుకుంటాను. కజ్జల : (ఆపుకోలేక) ఏమని చెప్పుకున్నారు? సారంగదేవి : నాకు జ్ఞాపకం లేదు. కజ్జల: వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు కాదుగదా! సారంగదేవి : కాదు. ఎవరో చెప్పలేను. వాళ్ళేదో నిన్ను గురించి అసహ్యమైన సంభాషణ చేశారు. ఆనాటినుంచీ నాకు జీవితమంటే సహించరానిదై పోతున్నది. ఏకాంతంగా నీవు కార్చే కన్నీటికి ఆ పెద్దమనుష్యుల సంభాషణకు ఏదో సంబంధమున్నట్లు నాకు మధ్యమధ్య అర్థమయ్యేది. అమ్మా! లోకం రకరకాలుగా నిన్ను గురించి చెప్పుకుంటుంటే వింటూ ఉన్న నేనే భరించ లేకపోతున్నాను. ఇంత గర్వివికదా ఎలా బ్రతక గలుగుతున్నావు? కజ్జల : అయితే నన్నేమి చెయ్యమంటావు తల్లీ! సారంగదేవి : ఈ రాజ బాంధవ్యాన్ని త్యజించు. ఈ లోకాన్ని ఈ నిమిషం నుంచీ మరిచిపో. మనమిద్దరమూ 'మహాయానాన్ని' స్వీకరించి బౌద్ధారామాలలో ప్రశాంతంగా పునీతులైన 'భిక్కుణీ' సంఘమధ్యంలో జీవిద్దాము. సంఘసేవలో నిన్ను భయపెట్టే ముదిమి లేదు. ఆత్మ నిర్వాత దీపాంకురంలాగా భాసిస్తుంది. మనను ఏకోశానా ఏకాంకికలు 399 మోసగించని ప్రేమ లభిస్తుంది. నాగరిక లోక వాసనే లేని ఆ ప్రపంచం ఎంత మధురమైనదమ్మా! దివ్య సుమగంధాలతో వాసించే ఆ కళ్యాణభవనాలను ఒక్కమాటు ఈ రాజభవనాలతో పోల్చి చూచుకో- గుండె చెరువైపోవటం లేదూ! కజ్జల : ఎంత అమాయకురాలివి తల్లీ. నీవన్నీ వట్టి పిచ్చికలలు. వెర్రిదానా! నీ ప్రేమ సత్యం. నీ కన్నీరు సత్యం. నీ కలలు అసత్యాలు, నీ ఆదర్శాలు అసత్యాలు - కానీ నీ సరస హృదయం నన్నొక రసస్రవంతిని చేస్తున్నది. ఒక్కమాటు నాదగ్గిరకి ఇలా రా తల్లీ! నిన్ను మనసార ఈనాడైనా ఈ పాపిని ప్రేమించు నీ - (స్పృశిస్తూ) నీ సర్వాంగాలు శతపత్ర కోమలాలు తల్లీ! ఈ ముదివగ్గు కన్నీటిని వాటిమీద హిమ బిందువులుగా వెలువనీ - నాకిప్పుడు నీవంటే ఈర్ష్య చచ్చిపోతున్నది - ఈ భిన్న హృదయానికి ఎన్నాళ్ళకు నీదగ్గిర ప్రశాంతి దొరికింది సారంగీ! చింతాజడం కాబోకు. కిలకిలా నాతోబాటు నవ్వుతూ ఉండు. ఇతరులను నవ్వించు. ఆనందించు. నీలో ప్రతిబింబిస్తూ ఉన్న నా యౌవనరూపాన్ని చూచి ఆనందిస్తూ కాలం వెళ్ళబుచ్చుతాను తల్లీ! సారంగదేవి : నా కోరికను అనుసరిస్తావా? కజ్జల : రేపే బయలుదేరుదాము. సారంగదేవి : (పట్టరాని సంతోషంతో) అమ్మా! కజ్జల : (ప్రగాఢంగా) తల్లీ! (ఇద్దరూ ఒక కౌగిలిలో ఒదిగిపోతారు) (బయట కలకలం 'పట్టుకొండి' 'తన్నండి') సారంగదేవి : ఏమిటది? కజ్జల : అమ్మాయీ! నీవు త్వరగా ఇక్కడనుంచి వెళ్ళిపో. సారంగదేవి : (కదలదు) కజ్జల : ఊఁ త్వరగా సారంగదేవి : నీవో! కజ్జల : నాకేమీ భయం లేదు. నేను ఒంటరిగా ఉండగలను. కంచుకి : (వణికిపోతూ ప్రవేశించి) సంగతి బయటపడ్డది తల్లీ! 400 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 కజ్జల : ఏమిటి? కంచుకి మనకోసం రక్షకభటులు వచ్చేస్తున్నారు. ఈనాటితో మన జీవితాలు అయిపోయినట్లే! కజ్జల : నీవిక్కడికి రావటం రక్షకభటులు చూచారా? కంచుకి : చూడలేదు. కజ్జల : అయితే భయమెందుకు? కంచుకి : పంక్తి కంఠస్వామి పట్టుబడ్డాడు. ఆయన పళ్ళు ఊడకొడతారట. అప్పుడు మన సంగతి కూడా బయట పెడతాడు - ఇక మనం బ్రతకము. కజ్జల : ఓరి పాపిష్ఠి పక్షీ! చివరకు నా బ్రతుకు నిలా చెడగొట్టావు. ఇందుకేనా నన్ను పంక్తి కంఠస్వామి పాదదాసిని చేసింది! శక్తి!! నా దేహానికి తీరని కళంకాన్ని తెచ్చి పెట్టావు. నీ మూలకంగా... ఛీ నీ మొగం చూడకూడదు వెళ్ళిపో! కంచుకి : అమ్మాయీ! ఇంకా నన్ను నిందిస్తావేం. నీ మూలకంగా నాకు ప్రాణాలు పోవటానికి సిద్ధంగా ఉన్నవి. (తెరలో 'పొడవండి', 'రాళ్ళు రువ్వండి' అని కేకలు) కజ్జల : (లేచి వాతాయనం నుంచి తొంగిచూస్తూ) చంపండి ద్రోహి! పాపి! చండాలుడు చంపండి. So: esc ec... కజ్జల : నీ పాపాలకు ప్రతిఫలం! కూలిపో!! కంచుకి : (దూరంనుంచి) ఏమైంది తల్లీ! కజ్జల : (కోపంతో) మీ గురుదేవులు నరకస్థులౌతున్నారు. కంచుకి : ఆఁ ఆఁ - పంక్తి కంఠస్వామి ప్రభూ! (నేలమీద ఒరిగి పోతాడు) కజ్జల : ఈ కలకలానికి రాజు నిద్ర మేల్కొంటాడు. అంతా తెలుసుకుంటే గాయనీ షట్పదీ తెల్లవారి నేను లేని నీకు పండుగ - మహాపండుగ (కంచుకి దగ్గరకు వచ్చి) కంచుకీ! నీ చేతిలో ఇంకా మాంత్రికులున్నారు గదా! తప్పించుకోవటానికి మరేమైనా తంత్ర క్రియలు చేయిద్దామా? ఏకాంకికలు 401 కంచుకి : గురుస్వామి సిద్ధిపొందిన తరువాత ఇంకా మన మాట ఎవరు వింటారు? ప్రయత్నం నిష్ఫలం. మన దేహాలమీద మమతను వదులుకోవటమే మంచిది. కజ్జల : పోనీ మనమైనా తప్పించుకొని కాశ్మీరం నుంచి వెళ్ళిపోయే మార్గం ఆలోచించు. కంచుకి : ఏం ప్రయోజనం? మనం రక్షకభటుల బారి పడకుండా బయటపడలేం... (ఏడుస్తాడు) కజ్జల : ఏడ్చి ఏమి సాధిస్తావు? కంచుకి : అమ్మా! రేపు ఉదయం నాకేమి శిక్ష విధిస్తారో నీవు ఊహించావా తల్లీ! కజ్జల : దుఃఖిస్తే శిక్ష తప్పుతుందా? లే సాహసం వహించు. కంచుకి : నీకేం ఏమైనా చెపుతావు తల్లీ! నాబోటి అల్పులకు ఆ సాహసమంటేనే అదురు. కజ్జల : సాహసించక తప్పదు. ముందెన్నడో రాబొయ్యే శిక్ష కంటే వేయిరెట్లు శిక్ష అనుభవిస్తున్నాను. ఈ శిక్షవల్ల కలిగే బాధ కరకు కసాయికత్తి కూడా ఊహ చేయలేదు. కంచుకి : తల్లీ! ఒకవేళ నీవు చిక్కినా దేశంలో నుంచీ వెళ్ళగొడతారు. నన్నో! కజ్జల : నా అంతట నేను పారిపోను. పొమ్మంటే వెళ్ళేదాన్ని అంతకంటే కాదు. ఉండి సాధించంది వదలను. చనిపోవటానికైనా సిద్ధపడతాను గాని లొంగిపోను. కంచుకి : ఈ మాటలకేంలే తల్లీ - దండనాయకుడు ముందు నిలబడితే అప్పుడు... కజ్జల : నా సంగతి నీకింకా బాగా అర్థం కాలేదు. క్రొత్తవాడివి. కంచుకి : ఈ సమయంలో ఏం జరిగితే మన దుఃఖం నశిస్తుంది కజ్జల : ఆఁ ఆయన చనిపోతే. కంచుకి ఆయనెవరు? కజ్జల : రాజు! కంచుకి : ఘోరము - రాజు చనిపోవటమే! కజ్జల : ఏం వణికి పోతున్నావు. కంచుకి : తరువాత కారకులకు శిక్ష - చిత్రవధ. 402 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 కజ్జల : తప్పించుకోవటానికి అనేక మార్గాలున్నవి. కంచుకి : చంపటానికి మార్గమో! కజ్జల : ఉదయమే రాజు లేస్తూనే ప్రసవాసవాన్ని సేవిస్తాడు. అది కలిపి ఇచ్చేది చిత్రరథుడు. అతన్ని నేను బాగా ఎరుగుదును. నా మాట జవదాటడు వెళ్ళు అందులో (దగ్గిరకి పిలిచి చెవిలో ఏదో చెప్పి) కలిపి ఇవ్వమను. బయలుదేరు. ఆలస్యం చెయ్యకు. మళ్ళీ నా మనస్సు యీ మాటకే వ్యతిరేకంగా తిరగవచ్చు - ఆశ కూడా పెట్టు. కంచుకి : గాయని ఎక్కడ ఉంటుందో జాగ్రత్త. కజ్జల : ఆమె విషయం నేను జాగరూకత వహిస్తాను. కంచుకి : (నిష్క్రమిస్తాడు) కజ్జల : ప్రభూ! నన్ను ఎక్కడికి నడిపిస్తున్నావో. (తెర) పంచమ దృశ్యము (రాజాంతః పురములో ఒక ఏకాంత విశ్రాంతి మందిరము) ధర్మాధిపతి : ప్రభూ! రాజద్రోహుల విషయం మీకు విన్నవించుకోటానికి... రాజు : నేను స్వస్థ చిత్తంతోటే ఉన్నాను. నివేదించవచ్చు. ధర్మాధిపతి : ప్రభూ! మా సాహసానికి క్షమించాలి. రాజు : ధర్మవివక్షలో మీ సాహసమేముంది? ధర్మాధిపతి : ఈనాడు మీకీ విషయం నివేదించటానికి నాకు భయం వేస్తున్నది. రాజు : కారణం? ధర్మాధిపతి : ధర్మద్రోహులూ, రాజద్రోహులూ, మీకు సన్నిహితులు కావటమే రాజు : న్యాయము న్యాయమే! బాంధవ్యము బాంధవ్యమే!! - ధర్మాధిపతి : ద్రోహులు రాజబంధువులైనా ధర్మశాస్త్రాన్ని వ్యతిక్రమించటానికి వీలు లేదన్న శ్రుతి ప్రమాణాన్ని అనుసరించే ఈ సాహసానికి పూనుకున్నాను. ఏకాంకికలు 403 రాజు : ద్రోహులు తమ తప్పిదాన్ని ఒప్పుకున్నారా? ధర్మాధిపతి : అర్ధ నిశా సమయంలో ద్రోహి కంచుకిని బందీ చేశాము ప్రభూ! రాజు : కంచుకి రాజద్రోహాన్ని తలపెట్టాడా? ధర్మాధిపతి : కంచుకి భయపడి రక్షకభటులు బాధలకు తాళలేక సమస్తమూ నివేదించాడు. రాజు : ఏమని? ధర్మాధిపతి : రాజద్రోహానికి తాను కేవలమూ ఉపాదాన కారణమని. రాజు : మూలమెవరు? ధర్మాధిపతి : (జంకుతూ) క... జ్జ.... లా... దేవి. రాజు : కంచుకి నోటివెంట కజ్జల రాజద్రోహి అనేమాట వచ్చిందా? ధర్మాధిపతి : ప్రభూ క్షమించాలి! ప్రస్తుతము కజ్జలాదేవి హృదయం వెనుకటివలె స్వచ్ఛమైనది కాదు. కలుషితమై పోతుందని కంచుకి మాటలవల్ల వ్యక్తమౌ తున్నది. రాజు : సాధారణంగా ద్రోహం తలపెట్టి పట్టుపడ్డవాళ్ళు తమ నేరాన్ని ఇంకొకళ్ళ మీద ఆరోపణ చేయటానికి పూనుకుంటారు. ధర్మాధిపతి : అతని మాటల్లో ఏవిధమైన అపనమ్మకానికి స్థానం లేదు ప్రభూ! తదితరులను కూడా ప్రశ్నించి కజ్జలాదేవి కలుష హృదయాన్ని గుర్తించగలిగాను. రాజు : వారూ కంచుకి మాటలనే స్థిరపరిచారా?... కజ్జల చాలా కాలం నుంచి జబ్బుగా ఉన్నది. ఏ విధమైన ద్రోహానికీ ఆమె అనర్హురాలు. ధర్మాధిపతి : గత మాసం నుంచి పంక్తి కంఠుణ్ణి ఆశ్రయించి ప్రభువారికి కళంక మాపాదిస్తున్నది. మాంత్రికుల చేత అభిచారిక క్రియలు చేయిస్తున్నది. రాజు : ఎవరికీ నాటివల్ల బాధ కలుగనంతవరకూ ఆమె దోషి కాదుగదా? ధర్మాధిపతి : మందుమాకులతో ప్రభువారి పానీయాలను మలినాలను చేస్తున్నది. రాజు : ఎందుకోసమని? ధర్మాధిపతి: తమను వశపరచుకోవటానికి... రాజు : నేను నమ్మలేను. 404 వావిలాల సోమయాజులు సాహిత్యం-2 ధర్మాధిపతి : ప్రభూ! ఆమె అపకీర్తి దేశమంతటా వ్యాపించింది. రాజు : ఏమో! ధర్మాధిపతి : న్యాయ నిశ్చయం చేయబోయేముందు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. నా స్థితిలో ఉండి నీవే నిశ్చయం చేయమన్నాను. ఒక దివ్యవాక్కు నా నిశ్చయాన్నే ధ్రువపరిచింది. తమకా దేవనిర్ణయం వ్యతిరేకంగా ఉన్నా తప్పదు. దేవ వార్తాహరుడనైన నన్ను క్షమించాలి. (పాదాభివందనము చేస్తాడు) రాజు : (లేవదీస్తూ) నీ కీ మహారాజు అభయమిస్తున్నాడు. ధర్మాధిపతి : ప్రభూ! నిజస్థితిలో అనేకమంది పైకి కనబడేటంత ఉదాత్తులు కారు. కజ్జలదేవి తమ ప్రాణాలకే అపచారం తలపెడుతుందని ఈ కాశ్మీరంలో ఏ ఒక వ్యక్తి అయినా చివరకు కలలోనైనా భావించాడా? (దూరంగా వచ్చే కజ్జలను చూచి ధర్మాధిపతి నెమ్మదిగా నిష్క్రమిస్తాడు) రాజు : (కోపంతో) కజ్జలా! పిలిపించందే అకారణంగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? కజ్జల : నా మనస్సు నన్నిక్కడికి వెళ్ళమని ప్రేరేపించింది. రాజు : నీవు ఇక్కడికి రావటానికి నైతికాధికారం కూడా లేదు. తప్పిపోయింది. కజ్జల : సమస్తాధికారాలు నాకు సంబంధించినంతవరకు నా హస్తగతమై ఉన్నవి. మీ అధికారం మీద నేను ఆధారపడను. రాజు : నీ సమస్తాధికారాలు నేను పూర్వమిచ్చినవే కాని అన్యమైనవి కావు. కజ్జల : మీరివ్వటమేమిటి? నేను జయించుకున్నాను. ఇప్పుడు నిలుపు కుంటాను. రాజు : నీవెంత దుస్థిలో ఉన్నావో నీకు తెలుసునా? ఏమిటీ వెర్రి ధైర్యము? కజ్జల : నా స్థితీ, మీ స్థితి ఒకేవిధంగా ఉన్నది. నేను ఇప్పుడు నామీద జరిగిన నిందారోపణను తీర్చుకోవటానికి రాలేదు. మీమీద నాకున్న ప్రేమను ఒకమారు వెలిబుచ్చటానికని వచ్చాను... ప్రభూ! వృధాగా కోపించవద్దు. హృదయ స్వాస్థ్యం తెచ్చుకోండి. ఇతరులమాట నమ్మవద్దు. నా మనస్సును గ్రహించండి. రాజు : కజ్జలా! నీ దోషాలు నాకు తెలియలేదనుకుంటున్నావా? ఏకాంకికలు 405 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/406 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/407 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/408 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/409 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/410 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/411 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/412 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/413 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/414 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/415 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/416 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/417 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/418 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/419 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/420 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/421 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/422 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/423 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/424 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/425 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/426 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/427 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/428 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/429 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/430 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/431 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/432 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/433 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/434 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/435 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/436 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/437 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/438 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/439 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/440 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/441 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/442 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/443 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/444 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/445 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/446 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/447 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/448 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/449 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/450 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/451 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/452 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/453 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/454 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/455 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/456 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/457 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/458 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/459 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/460 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/461 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/462 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/463 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/464 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/465 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/466 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/467 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/468 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/469 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/470 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/471 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/472 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/473 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/474 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/475 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/476 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/477 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/478 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/479 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/480 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/481 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/482 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/483 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/484 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/485 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/486 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/487 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/488 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/489 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/490 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/491 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/492 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/493 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/494 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/495 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/496 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/497 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/498 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/499 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/500 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/501 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/502 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/503 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/504 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/505 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/506 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/507 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/508 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/509 పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/510

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.