మహాప్రస్థానం/వాడు
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
అందరం కలిసి చేసిన ఈ
అందమైన వస్తుసముదాయం అంతా
ఎక్కడో ఒక్కడే వచ్చి
ఎత్తుకు పోతూ ఉంటే చూచి,
"అన్యాయం, అన్యాయం!" అని మేమంటే----
"అనుభవించాలి మీ కర్మం" అంటాడు.
పొద్దుపొడిచి పొద్దుగడిచేదాకా
ఎద్దుల్లాగు పనిచేసే మమ్మల్ని
మొద్దుల్నీ మొదటుల్నీ చేసి
ముద్దకి కూడా దూరం చేశాడు.
"ఘెరం ఇది, దారుణం ఇ"దంటే---
"ఆచారం ! అడుగు దాటరా" దంటాడు.
భరించడం కష్టమైపోయి
పనిముట్లు మేము క్రిందను పడివైచి----
"చెయ్యలేం, చస్తున్నాం మేము,
జీవనానికి ఆసరా చూపించ" మంటే ----
నోరుమూసి, జోడుతీసి కొట్టి
"దౌర్జన్యానికి దౌర్జన్యం మం"దంటాడు.