మహాప్రస్థానం/గర్జించురష్యా!
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
గర్జించు రష్యా:
గాండ్రించు రష్యా:
పర్జన్యశంఖం పలికించు రష్యా:
దౌర్జన్యరాజ్యం ధంసించురష్యా:
లేలే, రష్యా:
రారా, రష్యా:
రష్యా: రష్యా: రష్యా: ఓ రష్యా:
వ్యక్తిసతస్సిద్ధ సాతంత్రదాతా:
పతిత నిర్గతిక ప్రపంచత్రాతా:
భావికాల స్వర్ణ భవన నిర్మాతా:
లేలేలే రష్యా:
రారారా రష్యా:
రష్యా: రష్యా: రష్యా: రష్యా
పుష్కిన్, గోగోల్, షెకోవ్, టాల్‌స్టాయ్,
డోస్టోయ్‌వస్కీ, గోర్కీ, కూప్రిన్
శిల్పసమ్రాట్టులై
జీవితంమథియించి,
పాపపంకం నుండి పద్మాలు పుట్టించి,
కార్మిక స్వర్గాన్ని కలగన్నరష్యా:
రష్యా: రష్యా: రష్యా: నా రష్యా:
మార్క్స్, ఎంగెల్స్ మహాప్రవక్తలై
మానవపురోగమన మార్గాలు తెరువగా
లెనిన్ తపస్సు.
స్టాలిన్ సేద్యం
జలించిన, ఫలించిన సముజ్జ్వల తేజం:
యునైటెడ్ సోవియట్ సోషలిష్ట్ రాజ్యం
సాతంత్ర శత్రువుల గుండెల్లో బల్లెం:
వరపీడనాపరుల ప్రాణాల భైరవి:
రారారా, రష్యా:
లేలేలే, రష్యా:
రష్యా: రష్యా: రష్యా: ఓ రష్యా:
ఈఅగ్ని వర్షాలు,
ఈ రక్తపాతాలు,
ఎలాగూ వచ్చాయి, ఏమయితే కానీ:
ఈసవన రంగంలో ఎగరనీజీవాలు:
ఈసమయం తుది చూడక
ఇక నిలిచిపోరాదు:
తిరుగులేనిప్రతిజ్ఞ తీసుకోరష్యా:
పెట్టుబడి కూటాలు కట్ట కడుతున్నాయి:
కుట్రలు, కుహకం చెలరేగుతున్నాయి
అసత్య ప్రచారపు రేడియో బాకా:
రాజకీయాలలో రంగుల వేషాలు,
మరఫిరంగులు తెచ్చిమందిచ్చి రష్యా:
విమాన బాహువులువిసురుతూ, రష్యా:
అనంతప్రపంచం అంతటానీవై
నీగొడుగు నీడల్ని సాగించురష్యా:
సతంత్రత, సమానత సాధించురష్యా:
రష్యా: రష్యా: రష్యా: ఓ రష్యా:
సుప్తకంకాళాలు మేలుకొంటున్నాయి:
ప్రపంచపడగెత్తి బుసకొట్టిలేచింది:
కార్మికులు, కర్షకులు, తాడితులు, పీడితులు
---
కెరటాలుగా పొంగి తిరగబడుతున్నారు:
ప్రపంచం నీ కోసం పరిపక్వంగా వుంది:
కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి:
కోటిచేతులు నిన్నుకౌగలిస్తున్నాయి:
సైఅంటూ రష్యా:
జైఅంటూ రష్యా:
లేలేలేరష్యా:
రారారారష్యా:
రష్యా: రష్యా: రష్యా: ఓ
రష్యా: