లోకోక్తి ముక్తావళి/సామెతలు-వా


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


3053 వరికి వొకవాన వూదకు వొకవాన

3054 వలచివస్తే మేనమామకూరుగు వరస కాదన్నట్లు

3055 వసిష్టునివాక్కున విశ్వామిత్రుడు బ్రహ్మఋషి అనిపించు కోవలె

3056 వస్తావు వస్తావు నాకొరకు వచ్చికూచున్నా డు నీకొరకు

వా

3057 వాండ్లు పొక్కటి రాళ్ళ రీతి వున్నారు

3058 వాకిలి దాటి వరణాశి యెంతదూరమన్నట్టు

3059 వాగుదాటేదాకా వోడమల్లయ్య వాగుదాటింతర్వాత పోడిమల్లయ్య

3060 వాచినమ్మకు పాసినకూడుబెట్టితే మాఅత్త పరమాన్నం బెట్టిందని యిరుగు పొరుగింట చెప్పు కున్నట్లు

3061 వాడ మీదవుండే వరకు వొడమల్లయ్య దిగగానే బోడి మల్లప్ప

3062 వాడలో నాపోక చక్క సగంవుంది భాయి

3063 వాడవదినకేల వావివర్తనములు

3064 వాడితండ్రి మతండ్రి నయాం మగవాళ్లు

3065 వాడిపని గూట్లోకి వచ్చింది

3066 వాడిపని తెల్లవారింది

3067 వాడిమాట పిండికీ అవుతుంది పెడుకూఅవుతుంది

3068 వాడిలో నాపోక చెక్క సగంవున్నది భాయీ

3069 వాడాడినది ఆట పాడినది పాట 3070 వాడు చెడ్డాడు తాగుబోతు నాకు వొక ముంతెడు కల్లు పొయ్యి అన్నాడట

3071 వాడు చెప్పింది వసిష్ట వాక్యం

3072 వాడు వెక్కిరిస్తే నీకెక్కడ తొర్రి పోయినది

3073 వాడు పట్టినది చింతకొమ్మగాని ములగ కొమ్మగాదు

3074 వాంతోనేగి మొగుడితో రాగిలేదు

3075 వానరాకడ ప్రాణం పోకడ తెలియదు

3076 వానలకు మఖకార్తె శ్వాసములకు చిత్తకార్తె

3077 వానరం తోడి వాలంవలె

3078 వానలుకురిస్టే వాతలు మానునా బిడ్డలను కంటే రంకులుమానునా

3079 వానలు కురుస్తుంటవి కప్పలు అరుస్తుంటవి

3080 వానలేని వట్టిపిడుగు

3081 వానవుంటే కరువు పెనిమిటివుంటే పేదరికముల్/ఏదు

3082 వానికి తెల్లనివి పాలు నల్లనివె నీళ్లు

3083 వానపని యేకాధ్యర్య మాధుకరం

3084 వాని యింట్లో యిలిభిక్షం బలిభిక్షం పుట్టదు

3085 వామాక్షి చెప్పుచున్నది

3086 వాయసమును బాలలోముంచిన హంసయగునా

3087 వారిద్దరికి నిప్పు నీళ్లుగా నున్నది

3088 వాసానికితగ్గ కూసం

1089 వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే కరెడ్ల కామక్క వంకాయలభారం తూగింది

వి

3090 వింటే భారతం వినవలె తింటే గారలు తినవలె

3091 వింతలేని ఆవులింత పుట్టదు

3092 విందూమందూ మూడుపూటలు

3093 విందు మర్నాడు మందు

3094 విందులేని కూదు మందు

3095 వికారమువాడు దుకాణము పెట్టితే వచ్చినగిరాకి అటే మరలి పోయనట

3096 విక్రమార్కునివంట్ రాజు వుంటే భట్టివంటి మంత్రి వుంటాడు

3097 విగ్రహపుస్టి నైవేద్యనష్టి

3098 విఘ్నేశ్వరుడి పెండ్లికి వేయి విఘ్నాలు

3099 విడిబడితే గుఱ్ఱం గాడిదతో సమానం

3100 విడువుమంటే పాముకుకోపం కరువుమంటే కప్పకు కోపము

3101 విత్తనం వొకటివేస్తే చెట్టు వేరు మొలచునా

3102 విత్తనాలకు పోయిన రెడ్డి వోదెలెత్తుక వచ్చినాడు

3I03 విత్తము కొద్దీ వైభవము, విద్యకొద్దీ వినయము

3104 విత్తుకన్నా క్షేత్రం మెరుగు

3105 విత్తుముందా చెట్తు ముందా

3106 విదియనాడు కనపడని చంద్రుడు తదియనాడు తానె కనుపించుతాడు

3107 విధివస్తే పొదలడ్డమా

3108 వినయము లోకవస్యము, విద్య రాజవశ్యము 3109 వినాయకుడి మీద భక్తా వుండ్రాళ్ళ మీద భక్తా

3110 విని రమ్మంటే తిని వచ్చినట్లు

3111 విన్నమ్మ వీపుగాలింది కన్నమ్మ కడుపు కాలింది

3112 విన్నవన్నీ విశ్వసించవద్దు, విశ్వసించిన వన్నీ వెలిబుచ్చ వద్దు

3113 విరామము లేని పనికి వూరట లావు

3114 విల్లూరి మర్రిక్రింద విధివున్నది

3115 విశ్వమేలే నకులుడు అశ్వసిక్షకుడె నాడు

3116 విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు, ఆముదాలకు బలము

3117 విశిరినమ్మకు బొక్కినదే కూలి

3118 విశ్వాసం వున్నవాళ్ళకు చత్వారం వుంటుంది

3119 విషపాలకు విత్తు నేపాళపు గింజ

3120 విషపుంజము

3121 విషములోం పుట్టిన పుంజుకు విషము ఆహారము

3122 విస్తరి యెత్తమంటే భోంచేసిందెందుకు అన్నట్లు

3123 విస్తరి కొదువా సంసారం కొదువా తేర్చేవారు లేదు

3124 విస్సన్న చెప్పింది వేదం

వీ

3125 వీసంగల రెడ్దికి విడన ముడనా సరి

3126 వీసం యిచ్చి వాసానికి వొడ్డే వాదు

3127 వీసానికి వాసన్నర అయితే దూలన్నత యెంత

వూ

3128 వూరుకోలేక వురిపోసు కున్నట్లు

వె

3129 వెంటరా వద్దంటే ఎత్తేకోమని యేడ్చినాడట

3130 వెంట్రుకలుంటే యే కొప్పయినా పెట్టవచ్చు

3131 వెట్టికి కనివెలుగులో పారవేశారా

3132 వెట్టికిపుట్తినబిడ్డ నెత్తికిలేక యేడ్చిందట

3133 వెట్టితి గదరా పోలా అంటే యేడవక తప్పదే అయ్యా అన్నాడట

3134 వెతచెపబోతే కధచెప్పినట్లు

3135 వున్నశాంతం వూడ్చుక పోయిందిగాని కొపమే లేదు

3136 వెదుకబోయిన తీగె కాళ్ళకు తగిలినట్లు

3137 విధవకు దణ్ణంపెట్టితే నన్నుబోలె నూరేండ్లు బ్రతకమన్నదట

3138 నెధవముండా వేరుండమన్నట్లు

3139 వెనకకువెళ్ళితే తన్ను ముందుకువస్తే పోటు

3140 వెనక చింతించుట వెర్రితనము

3141 వనకాముందూ చూచిమాట్లాడు

3142 వన్న దగ్గరుంచుకొని నేతికి తడువులాదినట్లు

3143 వెన్నపుచ్చుకొని వేసినవారిని రాయిపుచ్చుకొనివేతురా

3144 వెన్నబెడితే మింగలేడు వేలుపెట్టితే కొరకలేడు

3145 వెన్నలో వెంట్రుకతీసినట్లు 3146 వెయ్యి ఆవులు గలవానికి ఒకటి తన్నుకొని పోతేయేమి

3147 వెయ్యికాళ్ళ జెర్రి

3148 వెయ్యిపుట్ల వడ్లకు ఒక్క చిలకపురుగు చాలు

3149 వెయ్యిరూపాయలు కావలెనా వెధవతో వుట్టువు కావలెనా

3150 వెయ్యివరహాలు పెట్టి యేనుగును కొనుకొని అరవీశెడు అంకుశానకు పాలుమాలనా

3151 వెర్రిముండ వేడుక చూడబోతే వెతకనిద్దరు యేడ్వనిద్దరు

3152 వెర్రిమొద్దుల కేల వేదశాస్త్రాలు

3153 వెర్రివాడిచేతి రాయి

3154 వెర్రివాడిపెండ్లాము వాడవదిన

3155 వెర్రివానివిందు పెట్టేవరకు నిశ్ఛయం లేదు

3156 వెర్రువెయ్యివిధాలు పైత్య్హం పదివేల విధాలు

3157 వెలగల జీవరత్నం వొక్కటేచాలు

3158 వెలమ వారిపెండ్లి కొడుకు మారడగ నేరడు వున్నదంతా వూడ్చిపెట్టి

3159 వెలలేని మాణిక్యం

3160 వెలసులభం ఫలమధికం

3161 వెలిపొలమును వెధవపిల్లను విడువరాదు

3162 వెలుగునీడ గ్రామంతోడు

3163 వెల్లకిలా పరుండి వుమ్మువూస్తే ముఖానపడుతుంది

3164 వెల్లకిలావేసి పొదిస్తే వొక్కదెబ్బకే చస్తుంది సన్యాసులమైన మేమెందుకు చెప్పాలె

3165 వెల్లటూరులో యెద్దును చరుచూరులో పడుచును యివ్వరాదు 3166 వెళ్ళిపొమ్మంటే చూరుపట్తుకొని వేళ్లాడినట్లు

వే

3I67 వేటుకువేటు మాటకుమాట వుందవలెను

3I68 వేడుకకు వేలలేదు

3169 వేడినీళ్ళకు చనీళ్ళు చన్నీళ్ళకు వేడినీళ్ళు

3170 వేన్నీళ్ళ కోర్వలెనమ్మ సహగమనం చేస్తాల్నన్నదట

3171 వేణ్ణీళ్ళకు వేసంగికి యెంతచలవో నీకూనాకూఅంతచలవ

3172 వేన్నీళ్ళపోస్తే యిండ్లుకాలునా

3173 వేప చాలాకాస్తి మశూచికములు మెండు

3174 వేల పిండి యెరువుకు సమానము

3175 వేగుతవ్వి వేడినీళ్లు పోసినట్లు, వేలంవెర్రి

3176 వేలుమీద గోరుమొలిచింది వేరుపోదాంరారా వెర్రిమొగుడా

3177 వేలుకు వేలడము

3178 వేలుకోసుకున్నా సున్నంపెట్టడు

3179 వేర్లతో వెంపలి కాయలతో కానుగలువేస్తే పండును

318O వేలుచూసి ఉత్తదనిపించు కున్నట్లు

3181 వేలువంగబెట్టంది వెన్నయినారాదు

3182 వేసిందే ఒకగంతు విరిగిందే వొకకాలు

3183 వేసినట్లే వేస్తే వెర్రివాడైనా గెలుస్తాడు

3184 వేసిన వెదుళ్ళల్లారా కాలినయిండ్లకు పొండి

3185 వేశ్యామోహం

3186 వేషాలమారికి వేవిళ్ళువస్తే వున్నచోటు కదలన్నదట 3187 వేషాలెల్లా గోసాలకే

3188 వేస్తివిరా కన్నం అంటే చేసివే కాపురంఅన్నట్లు

వై

3189 వైదికునిచేతి విడియంబు పవితబ్రతుకు

3190 వైద్యం నేరనివాడూ, వానకు తడియనివాడూ, రాగం తీయని వాడూ లేడు

3191 వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో

3192 వైద్యుడా నీ సంచిలో వేడినీళ్ళున్నవా!

3193 వైరికిగాని వడ్లు మెదగవు

3194 వైధ్యుని పేరుచెప్పితే రోగములు పోవునా

3195 వేషగాని అడుగులు వేట కొస్తయ్యా

3196 వ్యాధికి మందుగాని విధికి మందుందా

3197 వ్యాసప్రోక్తమా పరాశరప్రోక్తమా

3198 వ్రతం చెడ్డా సుఖం దక్కాలి

3199 వ్రాత కరణం

3200 వ్రాతగదే కూతురా అంటే కోతి మొగుడే అమ్మా అందిట

3201 వ్రాయగా వ్రాయగా కరణం దగ్గగాదగ్గగా మరణం

3202 వ్రాతరాజ్యమేమంటే గ్రహచారం గాడిదల మేపమన్నదట

3203 వ్రాసేవాణ్ణి, కోసేవాణ్ణి గీసేవాణ్ణి నమ్మరాదు

3204 వ్రైదికపుపిల్లి వ్రత్తిపలకవేఅంటే మ్రావు అందిట 3205 వాముపొచ పట్టేచోటేవుంటె ఇంకోభక్ష్యమే పట్టింతు

3206 విత్తము కొద్దీ విభవము విద్యకొద్ది వినయము

3207 వేషగాని అదుగులు వేట్లాటకు పనికి వచ్చునా

3208 శంఖలో పోస్తేగాని తీర్ధంకదు

3209 శంఖంలో పోస్తే తీర్ధము పెంకులో పోస్తే నీళ్లు

3210 శతడబ్బు సహస్రడబ్బు

3211 శనగలు తిని చేయి కదుకున్నట్లు

3212 శనివారపు వాన శనివారమే పోతుంది

3213 శని విరగడ పని వొబ్బిడి

3214 శరణార్ధిని లింగప్పా అంటే కందులు మూడు మాడలన్నాడట, చిన్నా పెద్దా బాగున్నారా అంటే పప్పులక్కవలె వుడుకుతుం దన్నాడట

3215 శల్య సారధ్యం

3216 శవానికి చేసిన అలంకారం

శా

3217 శాస్త్రుల్ల వారింట బుట్టి, సోమయాజుల వారింట జొచ్చి లవణమంటె దూడ రేణవని యెరుగనా