లోకోక్తి ముక్తావళి/సామెతలు-అ


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


తెనుగు సామెతలు

1.అంగటి వీధిలో అబ్బాఅంటే ఎవరికి పుట్తినావురా కొడకా అన్నట్టు

2.అంగటి వీధిలో ఆలిని పడుకోపెట్టి వచ్చేవారు పొయేవారు దాటిపోయినా రన్నట్టు

3.అంగట్లో అన్నీ వున్నవి అల్లుని నోట్లో శనివున్నది.

4.అంగిట బెల్లము ఆత్మలో విషము

5.అంగట్లో బెల్లము గుళ్ళోలింగానికి నైవేద్యము

6.అంగిట విషము మున్నాలికను తియ్యదనము

7.అంటక ముట్టక దేవరకు పెడుతున్నాను. ఆశపడకండి బిడ్డలారా, ఆవలికి పొండి అన్నదట

8.అంటా ముట్టరాని ఆగ్రహారము

9.అంటూ సంటూ ఆసాది వానిది రట్టూరవ్వా గంగానమ్మది

10.అంటూ సంటూ లేని కొడలి దాని మేనమామ కొడుకు చిక్కుడు చెట్టుక్రిందికి పోయి పక్కలు యెగరవేసినాడట 11. అండలేనివూళ్ళో ఉండదోషము, ఆశలేని పుట్టింట అడుగ దోషము.

12.అంతకు నోచి పుట్టినావురా! అవుసల తొర్రివాడా!

13.అంతమాత్రమా కొడకా చెవులు పట్టుకొనితడ వేవ అన్నట్టు

14. అంతమాత్రం వుంటే దొంతులతో కాపురచెయ్యనా

15.అంత్యనిష్ఠురముకన్న ఆదినిష్ఠురమే మేలు

16.అందని పూవులు దేవునకు అర్పణము

17 అందని మానిపండ్లకు ఆశపడ్డట్టు

18.అందని మ్రానిపండ్ల కర్రులు జాచుట

19.అందము చిందినట్టు నాగరకము నష్టమైనట్టు

20.అందములో పుట్టిన గంధపుచెక్క ఆముదముతో పట్టినట్లు

21.అందరికి నేను లోకువ నాకు నంబిరామాయ లోకువ

22.అందరికి శకునము చెప్పేబల్లి కుదితి తొట్టిలో పడినదట

23.అందరూ అందలమెక్కితే మొసేవారు యెవరు?

24.అందరూ వకయెత్తు అగస్త్యుడు ఒక యెత్తు, ఆతని కమండలము ఒక యెత్తు.

25.అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు ఎగిరిపోతున్నై

26.అందానికు పెట్టినసొమ్ము ఆపదము అడ్డంవస్తుంది.

27.అందానికి రెండుబొందలు ఆటకు రెండుతాళాలు

28.అందినజుట్టు అందుకున్న కాళ్ళు 29. అందులో పసలేదు, గంజిలో వార్చమన్నట్లు

30.అంధునకు అద్ధము చూపెనట్లు

31.అంబటికి ఆశ మీసాలకు ఆశ

32.అంబటియేరు వచ్చినది అత్తా అంటే కొలబుర్ర నాచేతిలో ఉన్నది కొడలా అన్నదట

33.అంబలి తాగేవారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

34.అందము చందము లేనివాడు సందెకావలి పోయినాడు

35.అకట వికటపు రాజ, అవివేక ప్రధాని, చాదస్తపు పరివారము

36.అక్కన్న మాదన్న గార్లు అందలమెక్కితే సాటిసరప్ప చెరువుకట్ట యెక్కినాడట

37.అక్క మనది అయితే బావ మనవాడా?

38.అగడ్తలోపడ్డ పిల్లికి అదే వైకుంఠము

39. అగ స్త్యభ్రాత

40.అగ్నికి జల్లదనము వచ్చినట్లు

41.అగ్నిలో నొకకాలును గంధములో నొకకాలును ఉంచి తగవుతీర్చినట్లు

42.అగ్నిలో మిడుత పడ్డట్లు

43.అగ్నికి వాయువు సహాయమైనట్లు

44.అగ్ని శేషము, ఋణశేషము, వ్రణ శేషము, శత్రుశెషము, నుంచరాదు. 45.అగ్నిహోత్రమునకు పోయిన సోమిదేవమ్మ ఆరునెలలు గర్భముతొ వచ్చినది.

46.అగ్నిహోత్రములో ఆజ్యము పోసినట్టు

47.అచ్చం తిరుమణిధారి అయితే పుల్ల పట్టడంలోనే తెలుస్తుంది

48.అచ్చి పెండ్లి బుచ్చి చావుకు వచ్చినది

49.అచ్చివచ్చిన భూమి అడుగెడేచాలు

50.అటైతే కందిపప్పు యిటైతే పేసరపప్పు

51.అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరణి గోదానం

52.అట్టుపిట్ట ఆసాదివానిది రట్టురవ్ఫ గంగానమ్మది

53.అట్లు సండే ఆమెకు అరవైఆరుగురు అందియ్యాలి

54..అట్లు వండే ఆమకు ఆర్గురు అమర్చవలెను

55.అడకత్తిలోని పోక

56.అడగనేరను వూడ్చి పెట్టనున్నట్టు

57.అడ్డగోడమీది పిల్లి

58.అడవికాచిన వెన్నెల

59.అడవి యుసిరికాయకు సముద్రపు ఉప్పుకు సంబంధం

60.అదవిలో నక్కలకు గొత్వాలాజ్ఞా?

61.అడిగినగాని అమ్మయైనా పెట్టదు

62.అదిగేవానికి చెప్పేవాడు లోకువ

63.అడియాశ పొడియాశ దు:ఖానకు కారణం 64.అడుగులోనె హంసపాదము

65.అడిసిత్రొక్కనేల? కాలుకడుగనేల?

66.అడుసులో నాటిన స్తంభము

67.అడ్డంపడితే గడ్డంలోతు

68.అడ్డగోడమీద పిల్లి

69.అడ్డాగోడామీద ఆదీరోటేవుండాది, అతడువస్తేఖావుఖానా ముంగిట్లో యేమేమో మూలుగుతూవుండాది మూలఉన్న మునగాకర్ర లావుకనా.

70.అడ్డెడుతవ్వెడు బియ్యంయిచ్చి అమ్మా నీ ప్రసాదమన్నట్టు.

71.అతడువుంటే మగలవాణ్ణి అయినా పిలచును.

73.అత్తకొట్టినకుండ ఆడుగోటికుండ. కోడలు కొట్టినకుండ కొత్తకుండ

74.అత్తగారి సాధింపు.

75.అత్త చచ్చిన ఆరుమాసాలకు కోడలికంట నీరువచ్చినదట.

76.అత్త చస్తే కోడలు ఏడ్చినట్లు.

77.అత్తచేపట్టిన కోడలు ఔసులవాడు చేపట్టిన బంగారం.

78.అత్త చేసిన పనులకు ఆరళ్ళు లేవు.

79.అత్తతొ చెప్పి అషు అనిపించలేడుగాని లంకించడానికి బ్రహ్మకొడుకు.

80.అత్తపేరుపెట్టి కూతుర్ని కుంపటిలో వేసినట్లు 81.అత్తమంచి వేముల తీపూలేదు.

82.అత్తలేనికోడలు త్తమరాలు, కోడలు లేనిఅత్త గుణవంతురాలు.

83.అత్తవల్ల దొంగతనమున్నూ మగనివల్ల రంకున్నూ నేర్చుకొన్నట్లు.

84.అత్తవారింటి సుఖము మోచేతి దెబ్బవంటిది.

85.అత్తసొమ్ము అల్లుడు ధారపొసినట్లు.

88.అత్తా వకరింటికోడలే.

87.అత్యాశ నిత్యనాశనం.

88.అత్తిపండు పగులగొట్టితే అన్నీపురుగులే.

89.అత్తి పూచినట్లు

90.అదంత్రునికి ఆశపెట్టారాదు. బలవందునికి చోటుయివ్వరాదు.

91.అదికుమ్ము, ఇదిదుమ్ము, పదరా పందిట్లోకి.

92.అదుగో అంటే ఆరు నెలలు

93.అద్దెకువచ్చిన గుర్రాలు అగడ్తలు దాటునా?

94.అదే పతకమైతే మనం బ్రతకమా

95.అదేమిరెడ్డీ వంగివంగి నడుస్తానంటే ఎప్పటికాలు అట్టట్టే అన్నాడట.

96.అదే వూరయితే కోళ్లు కుయ్యవా?

97.అదృష్టం కలిసివస్తే ఆలు పెండ్లామవుతుంది. 98 అదృష్టంచాలని ఆడబిడ్డను అక్కరలేని అల్లునికిచ్చి అమావస్యా ఆదివారంనాడు ఆర్ధ్రానక్షత్రాన అతి వైభవంగా వివాహం జరిపినట్లు.

99.అద్దముమీద పెసరగింజ పడ్డట్టు

100 అద్దములోని ముడుపు

101 అద్దె పేరంటము, సిద్ది మురికి

102 అధమునికి ఆలి అయ్యేకంటే బలఫంతునికి బానిస అయ్యేది మేలు.

103 అధిక ఆషాడం

104 అధికాశ లోకదారిద్ర్యము

105 అని అనిపించుకోవాలా అత్తగారు

106 అనుమానము ప్రాణసంకటము.

107 అనువుగాని చోట అధికుల మనరాదు

108 అన్నంపెట్టేతే అరిగిపోతుంది చీరయిస్తే చిరిగిపోతుంది వాతపెట్టితే కలకాలం వుంటుంది.

109 అన్నం పెట్టినవారి యింటికి కన్నం పెట్టును.

110 అన్న చొరవేగాని అక్షర చొరవలేదు.

111 అన్నదీక్షయేగాని అక్షరదీక్ష లేదు.

112 అన్నప్పుడల్లా ముద్దు పెట్టుకోనిచ్చే ముగ్ధయెవరు.

113 అన్నమదముంటే అన్ని మదాలు వుంటవి

114 అన్న దేవరసన్నగిల్లితే అన్ని సన్నగిల్లుతవి. 115 అన్నము లేకపోతే వరిన్నం బట్టలేకపోతే పట్టుబట్ట.

116 అన్నరసముకన్న ఆదరణ రసము మేలు

117 అన్నానికి అఫశ్యకత పనికి మీ అదృష్టం పరగడుపున పని చెప్పకు పంటే లేవకు.

118 అన్నాలన్నీ సున్నాలు, అప్పాలన్నీ కప్పాలు.

119 అన్యాయపురిలో ఆలీమొగుడికి రంకు.

120 అన్న బొండాల నీళ్ళు నీవే తాగరా అయ్యల్లా.

121 అన్ని యిచ్చినవాడు అక్కడుండగ ఒకటిచ్చినవాడు పెచ్చు అడిగెనట

122 అన్నియు తెలిసింవాడు లేదు. యేమియు తెలియని వాడు లేదు

123 అన్నియునున్న ఆకు అణగి యుండును. ఏమియు లేని ఆకు ఎగిరిపడును.

124 అన్నియునున్నవి అయిదవతనము లేదు.

125 అన్నిరుచులూ సరేగాని, అందులో ఉప్పులేదు.

126 అపకారికైనా ఉపకారమే చెయ్యవలెను.

128 అప్పటి మాటలకు దుప్పటి యిచ్చినారు గాని, కలకాలము కప్పుకొనిచ్చినానా.

129 అప్ప వంక బావ చుట్టం, ఆళ్లవంక తిరగలి చుట్టము. 130 అప్పమనదైతే, బావ మనగాడా !

131 అప్పు అదనుకు వచ్చునా !

132 అప్పు ఆకటికి వచ్చునా !

133 అప్పుదొరికెతే పప్పుకూదు.

134 అప్పు ముప్పు.

135 అప్పుయిచ్చినవాడు బాగు కోరును. తీసుకున్నవాదు చెడు కోరును.

136 అప్పు లేకపోతే ఉప్పుగంజిమేలు.

137 అప్పులున్నవారితో చెప్పులున్నవారితో పోగూడదు.

138 అప్పు లేని గంజి దొప్పెడే చాలును.

139 అబద్దమాడినా గోడ పెట్టీనట్లుండవలెను.

140 అబద్ధాలకు అర్ధంలేదు.

141 అబద్దాల పంచాంగమునకు అరవై ఘడియలు త్యాజ్యము.

142 అబ్బిగాడు చస్తే ఆ పంచనాదే యన్నాడట.

143 అబ్బితే సిగ అచ్చకపొతే కాళ్ళు.

144 అబ్బురాన బిడ్డపుట్టెను గడ్డపారతేరా చెవులుకుట్టుతాను.

145 అభ్యాసము కూసువిద్య.

146 అభ్యాసములేనిరెడ్డి అందలమెక్కితే అటూయిటూ అయిందట.

147 అభిషేకంచేసిన అగ్నివలె వున్నాడు.

148 అమర్చినదాంట్లో అత్తగారు వేలుపెట్టినది.

149 అమావాస్యకు అట్లు పున్నానికి బూరెలు.

150 అమావాస్యకూడు నిత్యం దొరుకునా? 151 అమావాస్య ప్రొద్దుకు వంగలు కాచునా

152 అమ్మగా మిగిలిన మేక

153 అమ్మ గృహప్రవేశము, అయ్య స్మశానప్రవేశము.

154 అమ్మ చేడ్డచేటకు ముసుగు ఒకటా

155 అమ్మ తాను పెట్టదు. తెచ్చుకు తిననివ్వదు.

156 అమ్మదగ్గర కింద పడుకొన్నాఒకటే అబ్బదగ్గర నేలపడుకొన్నా వకటే

157 అమ్మ పెట్టేనాలుగూ అప్పుడేపెడితే చయ్యనా.

158 అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.

159 అమర్చించానిమీద అత్తగారిచేయి.

160 అయితంపూడి ఉద్యోగం అయితేగియితే ఆరావుల పాడి చేస్తే గీస్తె పరుగూ పాలు మీవారికి పోస్తావా మావారికి పోస్తావా

161 అయితే ఆడుబిడ్డ, కాకుంటే మొగబిడ్డ.

162 అయితే ఆదివారం కాకుంటే సోమవారం

163 అయితే ఆరుగ కాకపోతే కంది.

164 అయినపనికి చింతించేవాడు అల్పబుద్ధివలవాడు.

165 అయినవారందరు ఆత్రోవనుపోగా జంగాన్నిపట్టుకొని జాము ఏడ్చినాడు.

166 అయ్యకుదురవలె అమ్మకుదురవలె

167 అయ్యకు విద్యాలేదు, అమ్మకు గర్వములేదు.

168 అయ్యకు రెండుగుణములు తక్కువ, తనకు తోచదు, ఒకడు చెప్పిన వినడు. 169 అయ్యకు రెండో పెండ్లి అని సంతొషమే గాని అమ్మకు సవతిపోరని యెరుగడు.

170 అయ్యనీటు అడిగితీరదు, అమ్మ దంచుకొని త్రాగుచున్నది.

171 అయ్య దాసండ్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టినది.

172 అయ్య రాకుంటే, అమావాస్య అట్టేవుంటుందా?

173 అయ్య వాతపెట్ట బర్రె బ్రతకనా?

174 అయ్యవారిని చెయబొతే కోతి అయినట్లు.

175 అయ్యవారు అటికంత, అయ్యవారి పెండ్లాము పుటికంత పుటికెతీసుకపోయి మూలయింట్లోపెట్టితే నక్క ఎత్తుకపొయింది నారాయణా.

176 అయ్య సవాశేరు లింగం అరవీశెడు

178 అయ్యో అంటే ఆరునెలల పాపంవస్తుంది

179 అరచేకుక్క కరవనేరదు.

180 అరతేరికి పండ్లు వచ్చుట

181 అరఛెతి రేగిబంటికి అద్దముకావలెనా?

182 అరచేతిలో ఉప్పుపెడితే ఆరునెలలు తలచుకోవలెను

183 అరచేతిలో వెన్నపెట్టుకొని నేతికి ఏడ్చిచినట్లు

184 అరచేతిలో వైకుంఠం చూపుతారు.

185 అరవ యేడుపు

186 అరవై యేండ్లయితే అరులుమరులు

187 అరవైయేండ్లవ తర్వాత అమ్మా అన్నాడట 188 అరవైయేండ్లయినవి చదువుకోక మన్నుగొట్టుకుంటాగా అన్నాడట

189 అరవై వరహాలిచ్చినా అత్తవంటిది దొరకదు

190 అరిటాకువచ్చి ముంటిమీదపడ్డా ముల్లువచ్చి అరటియాకుమీదపడ్డా, అరటిఆకుకే నష్టం

191 అరటిపండువలిచి చేతిలో పెట్టినట్టు

192 అరుంధతీ కనపడదు అద్ధానము కనపడదు అరవై వేల అప్పుమాత్రం కనపడుతున్నది

193 అరువంటే అరవై ఏనుగులను కట్టివేయమన్నట్లు

194 అర్ధమూప్రాణము ఆచార్యాధీనము, తాళము దేహమూ నా అధీనము

195 అర్ధములేనివాడు నిరర్ధకుడు

196 అర్దరాత్రివేళ అంకమ్మ సివాలు

197 అర్ధరాత్రివేళ మద్దెల దరువు

198 అర్జున భర్జున పడేర పిడుగు అన్నాడట

199 అలవాటులేని ఔపోసనంచేయబోతే మూతిమీసాలన్నీ తెగకాలినవి

200 అలివిగాని ఆలిని చేసుకొని మురిగిచచ్చేరా ముండాకొడుకు

201 అవలక్షణములుగల వానికి అక్షతలుఇస్తే అవతలికిపోయి నోట్లో వేసుకొన్నాడాట

202 అల్లి అడిగినది, ఇల్లి యిచ్చినది, మల్లి మాయం చేసినది

203 అల్లు డలిగితే కూతుర్ని తీసుకపోతాడు

204 అత్త ఎత్తుకొనీ తింటుంటే అల్లునికి మనుగుడుపా 205 అరే గడ్దితినే కోమటీఅంటే యోమూయి బెల్లంతినే సాయబూ అన్నాడట; అట్లా అంతావేము కోమటీ అంటే అతనికి అది వాడుకు, నాకు యిది వాడుకు అన్నాడట

206 అల్లుడికి నెయ్యూలేదు ఆయన తోటివారికి నూనెలెదు.

207 అల్లుడికి వండిన అన్నం కొడుకుకు పెట్టుకున్నట్లు

208 అల్లుని మంచితనము వేముల తీసియులేదు

209 అల్లుల్లో మల్లు పెద్ద

210 అల్పునికి ఐశ్వరంవస్తే అర్ధరాత్రి వేళగొడుగు తెమ్మన్నాడట

211 అవధాన్లు గారు, ఆ కూర్చున్న వెధవావిడ తమరిభార్యా లేక అన్నగారిభార్య అంటే నా మొఖానికి అంతమాత్రం కూడానా అన్నట్లు

212 అవసరానికి ఆకులోపెట్టి నాకు నేలను పెట్టి

213 అవి వేకితో స్నేహముకన్నా వివేకితొ విరోధము మేలు

214 అవ్వను పట్టుకొని వసంతమాడినట్లు

215 అవ్వ వడికిననూలు తాత మొలత్రాటికి సరి

216 అవ్వాకావలెను బువ్వా కావలెను

217 అవ్వా గుర్రము ఒకటి అయినట్లు

218 అశ్రద్ధపితర్లకు యేతాం తర్పణం

219 అసలు సోమిదేవమ్మ అందులో వేవిళ్ళు

220 అన్నదానం చేసే మహారాజులు అన్నీ సప్లైచేసినా వడ్డింఛేవాడి చెయ్యి వెనక్కే

221 అడ్డాలనాదు బిడ్డలుగాని గడ్డాలనాడు బిడ్డలా

222 అచ్చివస్తేహనుమంతుడిమోఱ అచ్చిల్రాకుంటే కోతిమోర 223 అవ్వపేరే ముసలమ్మ

224 అల్పుడిని బలుపువాడుకొట్టితేనే బలుపుడిని బ్రహ్మకొట్టుతాడు

225 అరకధ అరిగితే గరిక విరుగును

226 అరణ్య రోదనము

227 అవలక్షణాలు గలవానికి అక్షతలు వేసే అవతలికుపోయి నోట్లో వేసుకొనెనట

228 అన్నీ తెలిసినవాడూలేదు ఏమీ తెలియనివాడూ లేడు

229 అర్ధము లేనివాడు వ్యర్థుడు

230 అల్లికాయలసందడిని పెండ్లి మరచినాడు

231 అశ్వత్ధ ప్రదక్షిణముచేసి కడుపు పట్టిచూచు కొన్నదట

232 అంపబోయిన అల్లిసాహేబు పిలవబోయిన పీరూసాహెబు మాయమయ్యారు

233 "ఆ" అంటే అపశబ్దము, నారాయణ అంటే బూతుమాట

234 ఆకలిఆకలి అత్తగారూ అంటే, రొకలిమింగవే కోడలా అన్నదట.

235 ఆకలి ఆకాశమంత గొంతు సూది బెజ్జమంత

236 ఆకలి కాకుండా నీకు ఔషధమిస్తాను. నీయింట్లో చద్ది నాకు పెట్టు.

237 ఆకలికాని భోజనం ఆలిమీద లంజరికిం

238 ఆకలిగొన్న కరణం పాతకవిలె తీసినట్లు.