లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఏ


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


625 ఏకముండం గృహచ్చిద్రం ద్విముండం గృహనాశనం త్రిముండం గ్రామనాశంచ చతుర్కుండంచ పట్టణం అధవా పంచముండంచ బ్రహ్మపట్ల వినశ్యతి

626 ఏకాదశ బ్రాహ్మడా అంటే కాలేకొరివి యెగసన తోస్తావా అన్నాడట ద్వాదశ బ్రాహ్మడా అంటే ఆపదలు కాపురాలు చేస్తవా అన్నాడట

627 ఏకాదశినాడు కాలు అంటుకుంటా వేమి అంటే అది నిత్యవ్రతము నేడే ఆరంభము అన్నాడట. మర్నాడు తల యెందుకు అంటుకోలేదు అంటే నిన్నటితో వ్రతసమాప్తి అన్నాడట

628 ఏకాలు జారినా పిఱ్ఱకే మోసము

629 ఏకులవంటి మెతుకులు పోసుకుని యెనుప పెరుగు నేను కొని యవరాలిని గనుక తింటున్నాను గాని దగ్గరకు రాకండి పిల్లల్లారా జడుసుకునేరు

630 ఏ#కులు వుంచితే బుట్ట చిరుగుతుందా

631 ఏగాలికి ఆ చాపయెత్తినట్లు

632 ఏటి అవతలి ముత్యములు తాటికాయలంతేసి

633 ఏటికి యెప్పుడు పోయినావు, యిసుక యెప్పుడు తెచ్చినావు అంటే ఆడువారు తలిస్తే అది యెంతసేపు అన్నదట. మగవారు తలిస్తే యిది యెంత సేపు అని నాలుగు బాదినాడట. 634 ఏటిదరి మ్రానికి ఎప్పుడు చలనము

635 ఏటి యీతకు లంకమేతకు సరి

636 ఏటివద్ద నక్కకాగానే పాటిరేవు ఎరుగునా

637 ఏటివొడ్డు చేను

638 ఏట్లోవంకాయలు కాస్తవా అంటే కాస్తవి అన్నట్లు.

639 ఏట్లో వేసినా యెంచి వేయవలెను

640 ఏడిచేదాని మొగుదువస్తే నమొగుడు వస్తాడు

641 ఏడిచే బిడ్డకు అరటిపండు చూపినట్లు

642 ఏడుపులో ఏడుపు యెడమచెయ్యి బయట పెట్టాన్నట్టు

643 ఏడుస్తూ యేరువాక సాగితే కాడిమోకులు దొంగలెత్తుకపోయినారట

644 ఏదుకు పెడతల బుద్ధి

645 ఏతాంపాటకు యెదురుపాట లేదు

646 ఏదీకానివేళ గేదెయీనినట్లు

647 ఏట్లోనా రేనీళ్ళు యెవరుతాగితేయేమి

648 ఏట్లో ఉదకమున్నది సూర్యదేవా

649 ఏట్లోకలిపిన చింతపండు

650 ఏట్లోపడ్డవానికి యెన్నో యెన్నికలు

651 ఏనుగంత తండ్రి యుండుట కంటె యేకంత తల్లి యుండుటమేలు

652 ఏనుగు యెత్తుపడితే దోమ దొబ్బసాగెనట

653 ఏనుగుకుకాలు విరగడము దోమకురెక్క విరగడము సమము

654 ఏనుగకు ఒకసీమ, గుఱ్ఱానికి ఒకవూరు, బఱ్ఱెకు ఒక బానిస 655 ఏనుగు వెలక్కాయ లొటలొట

656 ఏనుగ దాహమునకు చూరునీళ్లు

657 ఏనుగనుచూచి కుక్క మొరిగినట్లు

658 ఏనుగనుతెచ్చి యేకులబుట్టలోపెట్టి అది నెత్తిన బెట్టుకొని తన్నుయెత్తుకో అంటాడు

659 ఏనుగు నెక్కినవారు కుక్క కూతకు జడియరు

660 ఏనుగు పడుకొన్నా గుఱ్ఱము మంత యెత్తు

661 ఏనుగు మింగిన వెలగపండు

662 ఏనుగుమీద పోయేవాణ్ణి సున్నమడిగినట్లు

663 ఏనుగులు తినేవాడికి పీనుగులు పిండివంటా

664 ఏనుగుమీద దోమవాలితే యెంతబరువు

665 ఏనుగుమదిస్తే నెత్తినమన్ను వేసుకుంటుంది

666 ఏనుగుల పోట్లాటకు యెట్రింత రాయభారం

667 ఏపాటుతప్పినా సాపాటు తప్పదు

668 ఏపుట్టలో యేపామున్నదో

669 ఏమి అప్పాజీ అంటే కాలంకొద్ది రాయాజీ అన్నాడట

670 ఏమిచేసినా సమకాలంవారు మెచ్చరేకదా!

671 ఏమీతోచకపోతే యెక్కిరించినాడట

672 ఏమిపోలిశెట్టి అంటే యెప్పటి మొత్తుకోళ్ళే అన్నాడట

673 ఏమీలెనమ్మకు యేడ్పులశృంగారం కలిగినమ్మకు కడుపుల శృంగారం

674 ఏమీలేని ఆకులు యెగిరిపడితే అన్నీవున్న ఆకులు అణిగివుంటవి 675 ఏరు ఏడామాడవుండగానే చీరవిప్పి చంకన బెట్టుకొని పోయినట్లు

676 ఏరుకొని తినే పక్షి ముక్కున ముల్లు విరిగినట్లు

677 ఏరు తీసినట్లు

678 ఏయెండ కా గొడుగు

679 ఏరు నిద్రపోయినట్లు

680 ఏరు మూరెడు తీస్తే కయ్య బారెడు తీస్తుంది.

681 ఏరెంత పారినా కుక్కకు గతుకు నీళ్ళే

682 ఏరెన్ని వంకలు పోయినా సముద్రములోకే

683 ఏరుదాటి తెప్ప కాల్చినట్లు

684 ఏదుముందా ? ఏరువాక ముందా!

685 ఏరైనా మూడు నేరాలు కాస్తుంది

686 ఏలినవారికి వూళ్లు లేకపోతే ఎత్తుకు తినడానికి లేవా?

687 ఏలుకోవడానికి వూళ్లు లేకపోతే ఎత్తుకు తినడానికి లేవా?

688 ఏలేవాని యెద్దు పోతేనేమి, కాచేవాని కన్ను పోతేనేమి?

689 ఏవూరు యేతము అంటే, దువ్వూరే దూలమా అందిట

690 ఏపాటా చావకపోతే బాపట్లపంపండి

691 ఐశ్వర్యానికి అంతంలేదు

692 ఐసా పైసా