లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఇ


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


335 ఆకలి రుచి యెరుగదు. నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గెరుగదు

336 ఆగ్రహాన ఆనపెట్టు కున్నట్లు

337 ఆకలిగొన్నవాడు యెంగిటికి వెఱడు

338 ఆలు గుణవంతురాలైతే మేలు కలుగును

339 ఆవుల సాధుత్వము, బ్రాహ్మణుల పేదరికము లేదు

340 ఆశ లేనివారికి దేశమెందుకు

341 ఆకాశాన్ని చేతితో అందుకుంటా నన్నట్లు

342 ఇంగువ కట్టినగుడ్డ

343 ఇంటికి లక్ష్మిని, వాకిలికి చెప్పును

344 ఇంటిగుట్టు లంకకు చేటు

345 ఇంటింటికీ ఒక మట్టిపొయ్యి అయితే మాయింటికి మరి ఒకటి

346 ఇంటికన్నా గుడి పదిలం

347 ఇంటికి జ్యేష్ఠాదేవి పొరుక్కు శ్రీమహాలక్ష్మి

348 ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే మూతిమీసాలన్నీ తెగ కాలినవట

349 ఇంటిదేవర యీగిచస్తే పొలందేవర గంపజాతర అడిగిందట

350 ఇంటిదోంగను యీశ్వరుడు పట్టలేదు

351 ఇంటినిండా కోళ్ళు ఉన్నవి గాని కూ శేటందుకు లేవు (ఒక్కటిలేదు) 352 ఇంటినుండి వెడలగొట్టగా దొందులు సవరించెనట

353 ఇంటిపేరు కస్తూరివారు ఇల్లు గబ్బిలాలవసన

354 ఇంటిమీద రాయివేసి వీవు వొగ్గేవాడు

355 ఇంటివాణ్ణిచేసి గొంగ చేతికి కర్రయిచ్చినట్లు

356 ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కర్రయిచ్చినట్లు

357 ఇంటివారు వేలుచూపితే బైటవారు కాలు చూపుతారు

358 ఇంటివెనకాలకు వెళ్ళీ యిల్లుముందుకు తెచ్చినట్లు

359 ఇంటిలో పాయసమున్నూ మందలో పాలుకూడానా?

360 ఇంటిసొమ్ము ఇప్పపిండి పొరుగుసొమ్ము పొడిబెల్లము

361 ఇంట్లో పెండ్లి అయితే వూళ్ళో కుక్కలకు హడావిడి

362 ఇంట్లో ఈగ పులి బైటపెద్దపులి

363 ఇంట్లో ఈగలమోత బైట సవారీలమోత

364 ఇంతమందిదొరలూ 'చావకపోతే నేనుమాత్రం చస్తానా నాక అక్కరలేదు

365 ఇక్కడ అక్కడవుంటే యీడేరిపొతావు నాయింటికి రావే నవిశిపోదువుగాని

366 ఇరిగిపోయిన చెంఫలకు యిప్పనూనెపెట్టితే సాని దాని ముఖము నిగనిగలాడిందట

367 ఇచ్చకాలము బుచ్చకాలవారు పొట్టకొరకు పొక్కులు గోకుతాడు.

368 ఇచ్చినవాడుదాత యివ్వనివాడునాత

369 ఇంటిచక్కదనం యిల్లాలు చెప్పును 370 ఇచ్చినవాడే నొచ్చినవాడు చచ్చినవాడే అచ్చినవాడు

371 ఇచ్చిపుచ్చుకొని మొగుడివీపెల్లా తడిమినట్లు

372 ఇచ్చివచ్చే నిష్ఠు రముకన్నా యివ్వకవచ్చే నిష్టురంనయం

373 ఇచ్చుడువాడూకాదు, చచ్చుడువాడూకాదు పూట పూటకు కూటికి వచ్చుడుగాడు

374 ఇచ్చుర్ల పసుపు వేసుకొంటే వికారము ముసలివానిని చేసుకొంటే వొకారము

375 ఇచ్చేటప్పుడు కాముని పండుగ పుచ్చుకొనేటప్పుడు దీపావళి పండుగ

376 ఇచ్చేవానికి వత్రము రద్దు చచ్చేవానికి మందూవద్దు

377 ఇచ్చేవాణ్ణి చూస్తే చచ్చేవాడైనా లేచును

378 ఇటుకులాడికి రవిక పెడితే కంపకుపెట్టి చింపుకొన్నదట

379 ఇత్యవులు కూయగా కొనంగుడేయగా అప్యేకదంతుడు పున్నపుంసకమెక్కి ఆడానమ్మా

380 ఇత్యర్ధులు ఇగురు ఇతిభావాలు పులుసు

381 ఇదిగోపులి అంటే అదిగో తోకాన్నట్లు

382 ఇనప గుగ్గిళ్ళుగాని మినప గుగ్గిళ్ళు కావు

383 ఇన్నీ ఇన్నీ తిన్నమ్మ యిల్లు నాశనం ఛేసెనట

384 ఇనుము కరిగినచోట ఈగల కేమున్నది

385 ఇనుముతీట పేముపట్టిన చెయ్యి వూరకుండవు

386 ఇనుమునిగూర్చి అగ్నికి సమ్మెటపెట్లు

387 ఇనుము విరిగితే అతకవచ్చునుగాని మనసువిరిగితే అతకరాదు

388 ఇన్నాళ్లు బ్రతికి యింటివెనక చచ్చినట్లు 389 ఇప్ప పూవులకు వాసన వెతకవలెను

390 ఇరుగింటమ్మా పొరుగింటమ్మా మాయింటాయన గోడు చూడు

391 ఇరుపోటీల యిల్లు చెడును, వాత నొప్పుల వొళ్ళు చెడును

392 ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరు బండియైన బారదు

393 ఇలిటవువాడు యింటికిచేటు కొమ్ముఒలబర్రేకొట్టానికి చేటు

394 ఇల్లలుకగానే పండుగ అవుతుందా

395 ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు

396 ఇల్లు కట్టిచూడు పెళ్ళి చేసిచూడు

397 ఇల్లు కాలబెట్తి జల్లెడతో నీళ్లు పోసినట్లు

398 ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ఒళ్ళుకాలి ఓకడేడ్చినట్లు

399 ఇల్లుకాలినా యిల్లాలు చచ్చినా గొల్లుమానదు

400 ఇల్లుకాలింది జగమయ్యా అంటే నాజోలె కప్పరా నాదగ్గరున్నది అన్నాట్ట

401 ఇల్లు గాలుచుండగా వాసాలు దూసుకున్నట్లు

402 ఇల్లు గెలువలేనివాడు రచ్చ గెలుచుగా

403 ఇల్లు చొరబడి యింటి వాసాలు లెక్కపెట్టినట్లు

404 ఇల్లు తిరిగిరమ్మంటే యిలారం తిరిగివచ్చినట్లు

405 ఇల్లు మింగే అత్తగారికి యుగంమింగే కోడలు

406 ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం

407 ఇల్లుయేడ్చే అమావాస్య, యిరుగూపొరుగూ యేడ్చే తద్ధినం, వూరుఏడ్చే పెండ్లి రేపు 408 ఇల్లువిప్పి పందిరి వేసినట్లు.

409 ఇల్లు వడలగొట్టగా విడుపులశృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తలశృంగారం

410 ఇల్లు వెడలిపోరా నంబీఅంటే నామాన్యం ఎక్కడ అన్నాట్ట

411 ఇల్లెక్కి కొరవితిప్పినట్లు.

412 ఇల్లెల్లాకొట్టితే తట్టెడు పెంకులు లేవు.

413 ఇల్లేతీర్ధం, వాకిలేవారణాసి, కడుపే కైలాసం.

414 ఇవతలచేర, అవతలసార, నడుమరామరాజ్యం

415 ఇవ్వని మొండికి విడువనిచెండి

416 ఇషుంటారమ్మంటే యిల్లంతా చేసుకున్నట్లు.

417 ఇసుక తక్కిడి పేడతక్కిడి

418 ఇస్తేవాయనం పుచ్చుకుంటే వాయనం

419 ఇస్తేచెడేదిలేదు చస్తేవచ్చేదిలేదు.

420 ఇస్తేపెండ్లి ఇవ్వకపోతే పెటాకులు

421 ఇంట్లో పస్తు బైటదస్తు

422 ఇంట్లో ఇల్లాలే లేదంటే పెండ్లామా అని పిలిచాడాట

423 ఇది చలమో ఫలమో!

424 ఇంటిపిల్లికి పొరుగింటి పిల్లితోడు.

425 ఇంట్లోలింగాకారం, దోవలోచక్రాకారం, యిక్కడ జడలాకారం, యెక్కడా అన్నాకారంలేదు అన్నాడట.