లోకోక్తి ముక్తావళి/సామెతలు-స


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


3250 సంగీతానికి చింతకాయలు రాలునా

3251 సంజయ రాయబారం

3252 సంతకుదొంగనైతే చీళ్లు యెక్కడామ్ముకోను

3253 సంతపాకతొత్తు సన్యాసి నెరుగున

3254 సంతమొరుగు సానిమెదుగు

3255 సంతలోకొట్తితే సాక్షులెవరు

3256 సంతోషం సగంబలం

3257 సంపన్నగృహస్తువస్తున్నాడు తప్పేలాలు ముంతలూతీసి యింట్లో వెయ్యండి

3258 సంధ్యావందనంచేస్తే పుణ్యంలేదుగాని చెయ్యకపోతేపాపం

3259 సంబరపు చలిగాలికి యెదురువాకిలి

3260 సంసారంగుట్టు వ్యాధిరట్టు

3261 సంసారి తిరిగిచెడును సన్యాసి తిరగక చెడును

3262 సంసారిబీద భూమిబీద

3263 స్సకల గుణాభిరాముడు

3264 సత్యమునావద్ద చాలవున్నది చెప్పులుతేరా మగడా నిప్పులో దూకురాను

3265 సత్యములు పొత్తుగుడుచునా బాసలు కలిచివచ్చునా

3266 సత్యహరిశ్చంద్రుడయ్యా

3267 సభలో సమస్కారమ్

3268 సభాంధ్య సాలెచాకలి పండితులమధ్య సాగదాసరి 3269 సభాఎంటే ఆరు నలలు

3270 సన్ననూలు వదుకుతున్నాడు

3271 సన్యాసం చివరికష్టం, సంసారం మధ్యకష్టం

3272 సన్యాసిపెండ్లికి జుట్టుకాడినుంచి యెరువే

3273 సమయానికిలేనిబాకా చచ్చిన వెనుకటికా

3274 సమ్ముఖానికివచ్చి రాయబారమా

3275 సముద్ర మీదవచ్చునుగాని సంసారమీదరాదు

3276 సముద్రానికి చెల్లెలికట్ట హద్దు

3277 సముద్రానికి ఏతము వేసినట్లు

3278 సరసము విరసముకొరకే

3279 సర్వఖ్కష ప్రజ్నగలవాడు

3280 సముద్రపూలలు నిలెచేదెప్పుడు స్నానమాడేదెప్పుడు

3281 సత్తెరాజువారింటికి నీవక్కదితొత్తవే

3282 సవరణ సంతకుపొతే ఏకులబుట్ట ఎదురుగావచ్చినదట

3283 స్థూలమకనుగుడ్డు సూక్ష్మము కనుపాప

3284 సంధ్యావందన హృదయపాఠ వాయుస్తుతి వుస్తకపాత

3285 సత్రపుకూటికి సర్కారు శలవెందుకు

సా

3286 సాకులు చెప్పినవానికి కాసుగాని యిల్లు కప్పిన వానికి దుగ్గాని

3287 సాక్షి కాళ్ళు పట్తుకునేకన్న వాదికాళ్లు పుట్టుటమేలు

3288 సాగితే విడవవలె జారితే వడవలె 3289 సాతానికి జంగానికీ సంధి కుదురుతుంది

3290 సారానిజుట్తుకు సన్యాసి జంద్యానికి ముడిపెట్టు

3291 సాతాని పీకులాట

3292 సామజము చెరుకు మేస్తే దోమలు యెన్నైనా తోలగలవా

3293 సాయిబుకు యెంతదౌలతు వచ్చినా బీబీకి కుట్తుపోగులే

3294 సాయిబూ చిక్కిపోయినా వేమంటే యింకా చిక్కుతాం, మరీ చిక్కుతాం, మనసువస్తే చచ్చీపోతాం నీకే మన్నాడట.

3295 సాలెకు జంగానికి సంధికుదురదు


3296 సాలె జాండ్ర సభామధ్యే సాతానికి పండితోత్తమ: వల్లీ వన సమూహేషు జోరీ: కోకిలయెతే

3297 సాలెసభకు సారాని పెద్ద, వుల్లివనానికి జోరీగ కోకిల

సి

3298 సింహము యేనుగును చంపునేగాని చచ్చిన కుక్కను తినునా

3299 సిగ్గు చిన్ననాడేపోయింది ముత్తెమంతుంటే ముహుర్తం నాడే పోయింది

3300 సిగ్గులేని అత్తకు మోతోపల్లుడు అన్నట్లు

3301 సిద్ధన్నా కవులూరు అన్నట్లు

3202 సిలార్ ! పిల్లలు నేను తయార్

సీ

3303 సీతకు వ్రాసినది సీమకు వ్రాయవలెనా

3304 సీత పుట్టుక లంకచేటుకే

సు

3305 సుకుమారి దేహానికి మెత్తటి చెప్పులు

3306 సుఖము కష్టము నకే

3307 సుఖవాసి దేహము మెత్తని చెప్పుతో కొట్టవలెను

3308 సుగ్రీవాజ్ఞ

3309 సుత్తెముందా కారుముందా

3310 సున్నంపుట్టని వూళ్ళో అన్నం పుట్టునా

3311 సున్నంలోవున్నది సూక్ష్మం సూక్ష్మంలోవున్నది మోక్షం

3312 సుపుఇత్రా కొంప చెరపుకురా

3313 సువ్వీ అంటే రోకంటి పోటు

3314 సర్పసంతానమా ! గో సంతానమా

సూ

3315 సూదికిగాను సోదికిగాను పోతే పాతకంకులు బైలు పడ్డయి

3316 సూదిగొంతు బానకడుపు

3317 సూదివలెవచ్చి దబ్బనంవలె తేలినట్లు

3318 సూదేటివాణ్ణి, సుత్తేటువాణ్ణి, కందేటువాణ్ణి నమ్మరాదు 3319 సూటిగలబంటు రోటివద్ద మాటుపెట్టెనట

3320 సూరన్న సుఖవాసి, పేరన్న పెద్దవాడు అయ్యకెత్తరా కోళ్ళగంప

3321 సూర్యోదయాన కూర్చుండి శుక్రోదయాన లేచినట్లు

3322 సూర్యోదయాన మాంగల్యధారణ సుక్రోదయాన మంగల్య విసర్జన

సై

3323 సైంధవుడడ్డ పడ్డట్టు

3324 సైలేనివాడు చెయ్యినాకినట్లు

3325 సై సారములేనివాడు సంచకారికి పోతే ముసలినక్కలన్నీ గుసగుస లాడెనట

సొ

3326 సొగసుకు సోమవారం పోతే యాయల్వారం పోయినాడట

3327 సొమ్ముపోయి దిమ్మపట్టినది

3328 సొమ్మేమిశాశ్వతం మనిషేమి పావనం

3329 సోకులాడి జొన్నచేను కోసులాడి నస్కులాడి పిస్కిల్లు బుక్కులాడి

3330 సోమార్లకు స్వయంపాకం చేసిపెట్టి వందలకు పక్కవేసినట్లు

3331 స్ధనశల్య పరీక్ష

3332 స్వకార్య దురంధరుడు స్వామి కార్యవంచకుడు

3333 స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధాముడు

3334 స్వప్నదృష్ట సౌధములు జాగ్రత్తలో యెక్కవచ్చునా

3335 సాములు కాని స్వాములకు పచ్చగడ్డి ప్రసాదమాయె

3336 స్వతంత్రము స్వర్గలోకము పారతంత్రము ప్రాణసంకటము

3337 స్వర్గానికి బెత్తేడెడం

3338 స్వర్గానికిపోయినా వడేకులు తప్పవు

3339 స్వర్గారోహణపర్వం చదువుకున్నాడు

సా

3340 స్థాన బలిమిగాని తన బలిమిగాదు

3341 స్వాతి కొంగలమీదికి సాళువం పోయినట్లు

3342 స్వాతివానకు ముత్యపుచిప్ప లెదురుచూచినట్లు

3343 స్వాతి వానకురిస్తే భీతికలుగును

3344 హరిశ్చంద్రుడి నోట అబద్ధము నానోట నిజమురాదు

3345 హరిశ్చంద్రుని లెంపకాయకొట్టి పుట్టినాడు

3346 హాస్యగాణ్ణి తేలుకుట్తినట్లు

3347 హనుమంతునెదుట కుప్పుగంతులా