పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/భూభారంబువాపుట

భూభారంబు వాపుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


తెభా-11-3-మ.
"వత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
నన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.

టీక:- బలవత్ = బలవంతమైన; సైన్యము = సేనలసమూహము; తోడన్ = తోటి; కృష్టుడు = శ్రీకృష్ణుడు; మహా = గొప్ప; బాహాబల = భుజబలము; ఉపేతుడు = కలవాడు; ఐన = అయ్యి; కలనన్ = యుద్ధరంగములో; రాక్షస = రాక్షసులైన; వీర = వీరులలో; వర్యులన్ = ఉత్తములను; వడిన్ = వేగంగా; ఖండించి = సంహరించి; భూ = భూలోకమునకు; భారమున్ = బరువుచేటు; ఉజ్జ్వలము = విజృంభించినది; ఐ = అయ్యి; ఉండగన్ = ఉండుటచేత; ద్యూత = జూద; కేళి = క్రీడ; కతనన్ = కారణంగా; చావంగన్ = మరణించునట్లుగా; కౌరవ్య = కౌరవులయొక్క; సద్బలమున్ = సైన్యాలను; పాండవ = పాండవుల యొక్క; సైన్యమున్ = సైన్యాలను; అడచెన్ = అణచివేసెను; భూభాగంబు = భూమండలము; కంపింపగన్ = అదిరిపోయేలా.
భావము:- “శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు.

తెభా-11-4-వ.
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- అప్పుడు....

తెభా-11-5-క.
మునివరులు సంతసిల్లిరి
యము నందాదులకును ర్షం బయ్యెం;
నిజభక్తులు యాదవ
వీరసమూహ మపుడు డు నొప్పెసఁగెన్‌.

టీక:- ముని = మునులలో; వరులు = ఉత్తములు; సంతసిల్లిరి = సంతోషించిరి; అనయమున్ = మిక్కిలి; నంద = నందుడు; ఆదులు = మున్నగువారి; కునున్ = కి; హర్షంబు = సంతోషము; అయ్యెన్ = కలిగెను; తన = అతని యొక్క; నిజ = స్వంత; భక్తులు = భక్తులు; యాదవ = యదువంశస్థులైన; ఘన = గొప్ప; వీర = వీరుల; సమూహమున్ = అందరికి; అపుడు = అప్పుడు; కడున్ = మిక్కిలి; ఒప్పు = చక్కగానుండుట; ఎసగెన్ = అతిశయించెను.
భావము:- మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు.

తెభా-11-6-మ.
విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మ సంయుక్త వసుంధరాధిపతులన్‌ ర్దించి, కంసాదులం
దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
దుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై.

టీక:- విదితుండు = ప్రసిద్ధుడు; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; అమరుల్ = దేవతలు; కొలువన్ = సేవించుచుండగా; ఉర్వీభారమున్ = భూభారమును; మాన్పి = తగ్గించి; దుర్మద = చెడ్డగర్వముతో; సంయుక్త = కూడియున్న; వసుంధరాధిపులన్ = రాజులను {వసుంధరాధిపుడు - భూమికి అధిపతి, రాజు}; మర్ధించి = శిక్షించి; కంస = కంసుడు; ఆదులన్ = మున్నగువారిని; తుదిముట్టన్ = సమూలంగా; వధియించి = సంహరించి; కృష్ణుడు = కృష్ణుడు; అతి = మిక్కిలి; సంతుష్టాత్ముడు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; ఉన్నచోన్ = ఉండగా; యదు = యాదవ; సైన్యంబులున్ = సేనలు; భూమి = భూదేవి; మోవగన్ = మోయుటకు; అసహ్యంబు = రానివి; అయ్యెన్ = అయినవి; అతి = మిక్కిలి; ఉగ్రము = భీకరమైనవి; ఐ = అయ్యి.
భావము:- దుర్మదాందులైన రాజులను మర్దించి, కంసుడు మొదలైనవారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది

తెభా-11-7-సీ.
రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా-
కట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక-
దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి-
టమీఁదఁ గురుబలం ణఁచి మఱియు
ర్మజు నభిషిక్తుఁ నరఁగాఁ జేసిన-
తఁడు భూపాలనం మరఁ జేసె

తెభా-11-7.1-తే.
క్తులగు యాదవేంద్రులఁ రఁగఁ జూచి
"న్యపరిభవ మెఱుఁగ రీ దువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంరమునందు. "

టీక:- ఈ = ఈ; రీతిన్ = విధముగ; శ్రీ = గొప్పవాడైన; కృష్ణుడు = కృష్ణుడు; ఏపారన్ = అతిశయించి; పూతనా = పూతన; శకట = శకటాసురుడు; తృణావర్త = తృణాసురుడు; సాల్వ = సాల్వాధిపుడు; వత్స = వత్సాసురుడు; చాణూర = చాణూరుడు (మల్లుడు); ముష్టిక = ముష్టికుడు (మల్లుడు); ధేను = ధేనుకాసురుడు; ప్రలంబకదైత్య = ప్రలంబాసురుడు; అఘ = అఘాసురుడు; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్ర = దంతవక్త్రుడు; కంస = కంసుడు; పౌండ్రక = పౌండ్రకవాసుదేవుడు; ఆదికన్ = మున్నగువారిని; ఖండనంబు = సంహారము; ఒనరించి = చేసి; అటమీద = ఆ తరువాత; కురు = కౌరవుల యొక్క; బలంబున్ = సైన్యాలను; అణచి = అణచివేసి; మఱియున్ = మరియు; ధర్మజున్ = ధర్మరాజును; అభిషిక్తున్ = చక్రవర్తిగా అభిషేకము; తనరగన్ = చక్కగా; చేసినన్ = చేయగా; అతడు = అతను; భూ = రాజ్యము; పాలనంబున్ = పరిపాలించుట; అమరన్ = చక్కగా; చేసె = చేసెను.
భక్తులు = తన భక్తులు; అగు = ఐన; యాదవ = యాదవులలో; ఇంద్రులన్ = ఉత్తములను; పరగన్ = ప్రసిద్ధులగుట; చూచి = చూసి; అన్య = ఇతరులచే; పరిభవమున్ = ఓటమిని; ఎఱుగరు = పొందరు; ఈ = ఈ ప్రసిద్ధులైన; యాదవులు = యాదవులు; అనుచు = అని; వీరిన్ = వీరిని; పరిమార్చన్ = సంహరించుటకు; నేన్ = నేనే; తక్క = తప్పించి; వేఱొకండు = మరొక; దైవము = దేవుడు; ఇక = ఇక ఎవరును; లేదు = లేడు; త్రిభువన = ముల్లోకముల; అంతరమునందు = లోను.
భావము:- ఇలాగ, మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి; పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూర, ముష్టికులను; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేని వారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు” అని ఆలోచించాడు