తిక్కన సోమయాజి
LIFE OF THIKKANA SOMAYAJI
(Author of Telugu Bharatam)
BY
CHILUKURI VEERABHADRA RAO.
Author of History of Andhras, Smiles Self Help in Telugu,
Jeernakarnataka Rajyacharitram Life of Timmarusu etc,
PUBLISHED BY
SARADA PUBLISHING COMPANY.
185, Mount Road, Madras.
1917.
Copyright Registered]
[PRICE AS. 12.
ఆంధ్రభాషాభివర్ధనీసంఘము : 21
తిక్కనసోమయాజి
గ్రంథకర్త
చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు,
ఆంధ్రులచరిత్రము, స్వయంసహాయము, జీర్ణకర్ణాటక రాజ్యచరిత్రము,
తిమ్మరుసుమంత్రి మొదలగు గ్రంథములకు కర్తలు.
ప్రకాశకులు
శారదా పబ్లిషింగు కంపెనీ,
185, మౌంటురోడ్డు, మద్రాసు,
1917
[వెల రు. 0 - 12 - 0
కాఫీరైటు రిజిస్టర్డు.]
పరిశీలించిన గ్రంథములు
1. ఆంధ్రులచరిత్రము (2-వ భాగము)
2. ఆంధ్రకవులచరిత్రము (ప్రథమభాగము)
3. ఆంధ్రకవిజీవితములు
4. దశకుమారచరిత్రము (కేతనకవి)
5. నిర్వచనోత్తరరామాయణము
6. శ్రీమదాంధ్ర మహాభారతము
7. నెల్లూరుశాసన సంపుటములు
8. సోమదేవరాజీయము
9. ప్రతాపచరిత్రములేక సిద్ధేశ్వరచరిత్రము ప్రాచ్యలిఖిత పుస్తక భాండారము (చెన్నపురి)
10. కాటమరాజుకథ
11. భాస్కరోదంతము (విమర్శగ్రంథము)
12. దక్షిణహిందూదేశపు శాసనములు. సంపుటము 3.
13. ఆంధ్రపత్రిక సంవత్సరాదిసంచిక (1911) 'తిక్కనసోమయాజి చరిత్ర'మను శీర్షికతో జె. కృష్ణారావు, బి. ఏ., బి. ఎల్., గారి వ్రాసినవ్యాసము.
14. ఇండియన్ ఆంటిక్వేరీ, సంపుటము 21.
15. ఎఫిగ్రాపియా ఇండికా. సంపుటము 7.
ఇంకను దొరతనమువారిచే ప్రకటింపఁబడు ప్రతిసంవత్సర వృత్తాంతములు మొదలగునవి.
విషయసూచిక
1 |
1 తిక్కనవంశము-మంత్రి భాస్కరుడు
2 కొమ్మన దండనాధుడు
9 |
1 తెలుగు చోడరాజులు
21 |
1 తిక్కన జన్మాదికము
2 తిక్కన బాల్యదశ-వేదవిద్యాభ్యసనము
3 తిక్కన రూపము
32 |
1 మనుమసిద్ధిరాజు-తిక్కనమంత్రి
2 మనుమసిద్ధి నాటి కాలస్థితి
3 మనుమసిద్ధి శత్రురాజులను జయించుట
4 బ్రాహ్మణులకును వెలమలకును వివాదము
48 |
1 అక్కనబయ్యనల దండయాత్ర
2 విమర్శనము
61 |
1 కాటమరాజు మనుమసిద్ధి రాజుల యుద్ధము
2 ఖడ్గతిక్కన విక్రమపౌరుషాదులు
72 |
1 నిర్వచనోత్తర రామాయణము
82 |
1 కపిపండితగోష్ఠి
90 |
1 ఆంధ్రమహారతరచనము
పీఠిక.
అప్రతిమానమైన ప్రతిభా విశేషమునుజూపి శ్రీమదాంధ్ర మహాభారతమును విరచించి సర్వాంధ్రలోకపూజ్యుఁడైన తిక్కనసోమయాజి పవిత్రజీవితము ప్రత్యేకసంపుటముగా నుండుట అత్యంతోపయుక్తమను భావముతోఁ దెలిసినంత వఱకుఁగవినిగూర్చిన విషయములనుజేర్చి నేనీ చిన్న గ్రంథమును రచించినాఁడను. తెలిసినంతవఱకుఁ దిక్కనజీవితమును సులభముగా మహాజనులెల్లరును దెలిసికొనుటకొఱకే నేనీగ్రంథమునురచించినాఁడనుగాని తిక్కనసోమయాజి భారతాంధ్రీకరణమును గూర్చికాని, కవిత్వమునుగూర్చికాని విపులముగా విమర్శించి గుణదోషములను బ్రకటింపవలెననుదలంపుతో గ్రంథరచనము గావించి యుండలేదు. ఈగ్రంథమును వ్రాయుటకొఱకు నేనుబరిశీలించిన గ్రంథములపట్టికను మఱియొకతావునఁ దెలిపియున్నాఁడను. తద్గ్రంథకర్తలకును, తద్విలేఖకులకును కృతజ్ఞతావందనముల నిందుమూలముగాఁ దెలుపుచున్నాఁడను. ఈకవి బ్రహ్మనుగూర్చి నూత్నవిశేషములు పొడగట్టినప్పుడు గ్రంథము విస్తరింపఁబడు ననుటకు సందియములేదు. ఇందలిదోషములను మన్నించి గుణములనే గ్రహింపవలయునని పాఠకమహాశయులను బ్రార్థించుచున్నాఁడను. చరిత్రమునకు భిన్నముగానుండినఁ 'నన్నయభట్టు, తిక్కనసోమయాజులఁ' గూర్చినకల్పనా కథలనన్నిటిని గ్రంథవిస్తరభీతిచేనిందు విడిచిపెట్టినాఁడను. స్థలాంతరమున నుండుటచే నిందచ్చుతప్పు లచ్చటచ్చటఁబడుట సంభవించినది గావునఁ జదువరులు వానినిమన్నించి సవరించి చదువుకొనవయునని విన్నవించుకొను చున్నాఁడను.
రాజమహేంద్రపురము,
8 - 10 - 17,
చిలుకూరి వీరభద్రరావు.
భూమిక
ఆంధ్రభాషాభివర్ధనీ సంఘమువారిపక్షమున మేము బ్రకటించుటకిది మూడవగ్రంధము. వెనుకటి గ్రందములను . ప్రకటించుకొనినప్పుడు వెల లధికముగ నున్నవని విన్నవించుకొనియున్నాము. ఇప్పుడు అంతకంటెను వెలలధికమగుటయేగాక వలయు కాగితమునకుగూడ క్షామముపట్టినది. ఎట్టి కష్టములకులోనైనను గ్రంథప్రకటనమును మాననిష్టములేక .ప్రకటించుచున్నాము.
ఇప్పుడచ్చులో ఇదివరకుఆంధ్రమున ప్రకటింపబడని ఉద్గ్రంథములు రెండున్నవి. వానీలోఒకటి, ఇండియాదేశ ఐశ్వర్యమునుగూర్చిన గ్రంధము. రెండవది రెండువేలసంవత్సరముల హిందూదేశ నౌకాచరిత్రము. ఈ రెండింటిలో నొకగ్రంథమును డిశంబరునెలలో చందాదార్లకు పంపుకొనెదము. ఇట్టిసంఘములుచేయు భాషాభివృద్ది అభిమానుల యాదారముపైన నాధారపడియుండును. గనుక మంచిచెడ్డల నారసి చదువరులు మా యుద్యమమునకు తోడ్పడ ప్రార్థించుచున్నాము
శారదా పబ్లిషింగు కంపెనీ.
విషయసూచిక
మార్చువిషయసూచిక
1 |
1 తిక్కనవంశము-మంత్రి భాస్కరుడు
2 కొమ్మన దండనాధుడు
9 |
1 తెలుగు చోడరాజులు
21 |
1 తిక్కన జన్మాదికము
2 తిక్కన బాల్యదశ-వేదవిద్యాభ్యసనము
3 తిక్కన రూపము
32 |
1 మనుమసిద్ధిరాజు-తిక్కనమంత్రి
2 మనుమసిద్ధి నాటి కాలస్థితి
3 మనుమసిద్ధి శత్రురాజులను జయించుట
4 బ్రాహ్మణులకును వెలమలకును వివాదము
48 |
1 అక్కనబయ్యనల దండయాత్ర
2 విమర్శనము
61 |
1 కాటమరాజు మనుమసిద్ధి రాజుల యుద్ధము
2 ఖడ్గతిక్కన విక్రమపౌరుషాదులు
72 |
1 నిర్వచనోత్తర రామాయణము
82 |
1 కపిపండితగోష్ఠి
90 |
1 ఆంధ్రమహారతరచనము
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.