త్యాగరాజు కృతులు

అం అః

ముఖారి రాగం - దేశాది తాళం


పల్లవి

సరసీరుహానన ! రామ ! - సమయము బ్రోవ, చిద్ఘన !

అనుపల్లవి

పరభామల నర్చించియన్నమిడి

పగలు రేయి సరస మాడు వారినొల్ల


చరణము

బ్రాహ్మణీకము బాయు నీచుల

బ్రతుకాయె నదిగక యీ కలిలో

బ్రహ్మమైన మాటల నేర్చుకొని

బరగెదరయ్యా, త్యాగరాజనుత !