సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోపర్నికస్ (1473-1543)

కోపర్నికస్ (1473-1543) :

నికొలస్ కోపర్నికస్ అనునతడు పోలెండు దేశపు ఖగోళ శాస్త్రవేత్త. అతడు ప్రష్యన్ పోలెండులో థారన్ అనుచోట క్రీ. శ. 1473 వ సంత్సరము ఫిబ్రవరి 19వ తేదీన జన్మించెను. 'కాకో' పౌరుడయిన అతని తండ్రి టోకు వ్యాపారస్థుడుగా నుండెడివాడు. నికొలస్ తన మేనమామ యైన లూకాస్ వాప్టైల్ రోడ్ అను నాత నికి దత్తుడు. వాస్టెల్ రోడ్ అనంతరము ఎర్మి లెండ్ బిషప్పు అయ్యెను. క్రాకో విశ్వవిద్యాలయములో గణిత శాస్త్రమభ్యసించి, నికొలస్ యధాలాపముగా చిత్రకళ యందుకూడ కొంత నేర్పరి యయ్యెను. నికొలస్ తన 23 వ ఏట బొలానాకు పోయి మతగురు న్యాయశాస్త్ర ములను జదువుచు, అచట 'డొమెనికో మేరియా నొవారా' యొక్క ఖగోళ శాస్త్రోపన్యాసములు వినెను. రోము నగరమున 1500వ సంవత్సరములో తానే స్వయముగా ఉపన్యాసము లిచ్చి మెప్పు బడసెను. 1497వ సంవత్సర మున అతడు ఫ్రాన్బెర్గు క్రైస్తవ దేవాలయమున మత గురువుగా నియమింపబడి, సెలవు తీసికొని, 1501వ సంవ త్సరమున 'పడా'కు వచ్చి అచ్చట వైద్యపాఠశాలలో జేరెను. అతడచట 1505వ సంవత్సరము వరకు నుండెను. ఈలోగా 1508వ సంవత్సరములో 'ఫెర్రరా' అనుచోట మతగురు న్యాయశాస్త్రమున డాక్టరేటు పట్టము పొందెను. తరువాత నికొలస్ పోలెండునకు తిరిగివచ్చి హీల్స్బర్గ్ అనుచోట బిషప్పునకు సంబంధించిన రాజ గృహములో తన మేనమామకు వైద్యుడుగా నుండెను. 1512లో మేనమామ చనిపోయిన తరువాత నికొలస్ కోపర్నికస్ ఫ్రాన్ బర్గు వచ్చి తాను చేయవలసిన మత సంబంధమగు విధులను పూర్తిగా నిర్వర్తించుట మొద లిడెను. అధికార సంబంధముగను, రాజకీయముగను పరిస్థితులు అనుకూలముగ లేకపోయినను, అతడు మతాధి కారుల సభకు ప్రతినిధిగా విడువకుండ పనిచేసెను. తన కులవై ద్యశాస్త్ర ప్రావీణ్యమును ఎల్లప్పుడు బీదల సేవ యందే అతడు వినియోగించెడివాడు. ధనికు లాతనిని తరచు పిలుచుచుండెడివారు. బహురూప కార్యనిమ గ్నుడయి యుండియు కోపర్నికస్ కొంత తీరుబడి చేసి కొని, సరికొత్త ఖగోళ శాస్త్ర పద్ధతి యొకటి మిగుల శ్రమపడి తయారుచేసెను. ఆ పద్ధతి నవలంబించుటచే, ఈ విశ్వమునుగూర్చి మానవునకున్న దృక్పథము మూలా ధారములతో సహా మారిపోయినది.

ఖగోళశాస్త్ర విషయమున కోపర్నికస్ చేసిన మహో త్కృష్ట మైన కృషికి కావలసిన ముఖ్యవిషయము లాతడు హీల్స్బర్గులో నున్నపుడే నిర్ణయించుకొనెను. ఫ్రాన్ బర్గు వచ్చినతరువాత తనకు లభించిన కొద్దిపాటి పరికర ముల సహాయముతోడనే పరిశీలించి, ఆ విషయముల సత్యాసత్యములను పరీక్షింప మొదలిడెను. యొక్క సిద్ధాంతములయెడ అతని కెప్పుడో విశ్వాసము పోయినది. ఇటలీ దేశమున పై థాగరస్ అభిప్రాయములు 'సూర్యకేంద్ర సిద్ధాంతము' (heliocentric theory)ను గూర్చి విచ్చలవిడిగా చర్చింపబడుచుండుట ఆతడు చూచెను. సూర్యకేంద్ర సిద్ధాంతమును ప్రతిపాదించుచు 1530 వ సంవత్సరమున కోపర్నికస్ ఒక గ్రంథమునుపూర్తి చేసెను. దాని ముఖ్యార్థము వ్రాత ప్రతిరూపమున ఆ సంవత్సరమే అనేకులకు తెలిసినది. ఏడవ క్లిమెంటు ఆ సిద్ధాంతము నా మోదించెను. కార్డినల్షాన్బగ్గు దానిని పూర్తిగా ప్రచురింపవలసినదని చెప్పెను. కాని కోపర్నికస్ శిష్యు డగు జార్జిజాషిమ్ రెటికస్ ప్రోత్సాహముచేసి 1540 వ సంవత్సరమున కోపర్నికస్ సిద్ధాంతము యొక్క పీఠికను అచ్చువేసెను. వెంటనే కోపర్నికన్ యొక్క పూర్తి గ్రంథమును రెటికస్ న్యూరెంబగ్గులో నొక ముద్రణా లయమునకు కూడ పంపెను. ఆ గ్రంథము 1548 లో అచ్చుపడి, మొదటిప్రతి ఫ్రాన్బెర్లు చేరునప్పటికి కోపర్ని కప్ జీవితము అంత్యదశయం దుండెను. ఆ గ్రంథ మును రచయిత మరణశయ్యపై మాత్రమే ఉంచ గలిగిరి. 1542 వ సంవత్సరాంతమున రక్తజమూర్ఛ, పక్షవాత రోగములకు కోపర్నికస్ గురి యయ్యెను. అతడు 1543 వ సంవత్సరమున మే 24వ తేదీన చని పోయెను. కోపర్నికస్ యొక్క గ్రంథములోని త్రికోణ మితి భాగమును విడదీసి, రెటికస్ తన పర్యవేక్షణలో 1542వ సంవత్సరమున విట్టెన్ బర్గులో వేరుగా ప్రచు రించెను. 19 వ శతాబ్దమున నికొలస్ కోపర్నికస్ జీవిత మును గూర్చి చాలగ్రంథములు వ్రాయబడెను.

బి. వి. ర.