సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోయలు

కోయలు:

'కోయ' అను పదమునకు 'కొండమనుష్యులు' లేక 'కొండలలో నివసించువారు' అని అర్థము. కోయలు ఆంధ్రప్రదేశములో తూర్పు గోదావరి జిల్లా మన్య ప్రదేశములోను, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో మైదానములందును, విశాఖపట్టము, గుంటూరు జిల్లాల లోను నివసించుచు గోదావరికి దక్షిణమునగల ఖమ్మం మెట్టు వరకును, ఈ నదికి ఎడమ భాగమున నాగపూరును దాటియున్న బస్తరులోనికిని, ఒరిస్సాలోని మలకనగిరి తాలూకాలోనికిని వ్యాపించియున్నారు.

కోయలు ఈ క్రింద పేర్కొనబడిన తెగలుగా భాగింప బడి యున్నారు. 1. గుట్ల (కుట్ల) కోయలు లేక రాచ కోయలు. 2. గొమ్ముకోయ (లేక దొరల చట్టము). 8. కమ్మరకోయ, 4. మూసరకోయ, 5. గంపకోయ, 6. ఒడ్డికోయ, 7. పథిడికోయ. ఈ విభాగము చాలమట్టుకు వారివారి వృత్తుల పై నాధారపడియున్నది. వారు మరల 1. బేరంబోయి లేక ఏడుగుట్ట గోత్రము, 2. బండారి లేక ఐదుగుట్ట గోత్రము, 3. సన్పాగరి లేక నాల్గుగుట్ట గోత్రము, 4. మూడుగుట్ట గోత్రము, 5. పరడిగుట్ట గోత్రము అని తరగతులుగా విభజింపబడి యున్నారు. కోయలయొక్క సాంఘిక వ్యవస్థ విశద ముగా నిర్వచింపబడి యుండలేదు. వారు సాధా రణముగా సవర్ణహిందువులుగానే పరిగణింప బడు చున్నారు.

వ్యవసాయము, అడవిలోని యితర పనులు-వారియొక్క ముఖ్య వృత్తులు. ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశమునకు మార్చబడు 'పోడు' అను వ్యవసాయ పద్ధతి కొన్ని పల్లెలలో ఇప్పటికిని ఆచరణ మందున్నది. హైద్రాబాదు రాష్ట్రములోని ఆదిమ నివాసులైన జాతులలో చెప్పుకొనదగినంతగా పరిశ్రమ లలో నియుక్తులైన వారి గుంపు ఈ కోయగుంపు కోయలు అడవిదున్నలకొమ్ములతో కూడిన శిరోలంకారములను ధరించి, మాత్రమే. వారు కొత్తగూడెము, సింగరేణి ప్రదేశము పెండ్లి లలో పనిచేయుచున్నారు. వారు ముఠాకట్టి సమష్టిగా పనిచేయుటలో కడు సమర్థులనియు, సమష్టి కృషితో యాంత్రిక మైన కార్యకలాపములు నిర్వహించుటయందు కూడ మిక్కిలి నేర్పరులనియు అందురు. అడవివస్తువు లను గూడ వీరు పోగు చేయుదురు. కొందరు వెదురుతో తట్టలల్లుట, తుంగతో చాపలల్లుట సింగారించుకొన్న కోయ యువతులు మొదలగు ప నులు చేయుదురు.వీరుమి క్రిలి పేదవారు, త్రాగు బోతులు.

కోయలు వివాహ విషయములో మత ప్రాముఖ్యమును, పు రాణగాథల ప్రాముఖ్య మును కల్పించుచుం దురు. కాని ప్రతియొక కర్మకువారికి కారణము తెలియదు. లేచిపోవుట (elopement) మొద లగు అన్ని విధములైన వివాహ విధానము లును జరుగుచున్నవి. అన్ని తరగతులకును చెందిన 'ఏలుపుదేవుడు' అను దేవత వారి కత్యంత ముఖ్యదైవము. కోయలలోని ప్రతి గోత్రము వారికిని ఆ గోత్రమునకు చెందిన ప్రత్యేక 'ఏలుపు' ఉండును. (ఏలుపు అనగా భగవంతునికిని, అతని శ క్తికిని చిహ్నముగా లోహముతో చేయబడిన ఒక గుర్తు) ఇది ఒక విధముగా పూర్వీకులను పూజించుటయనవచ్చును. ఈ పూజ ప్రతి మూడు నాలుగు సంవత్సరములకొక సారి జరుగుచుండును. వర్షాకాలము తరువాత వారుచేయు 'భూమి పండుగ' అనునది మరియొక ముఖ్యమగు ఉత్స వము. ఎద్దులను చంపి వాటిరక్తము భూమిపై చల్లె దరు. ఈ విధముగా చేసినయెడల భూమియొక్క సారము, పంట అభివృద్ధి యగునని వారినమ్మకము. ' నాలు గై దు దినములవరకు సంబరములు, త్రాగుడు, నృత్యము, విందు బ్రహ్మాండముగా జరుగును. ఏలుపు దేవు నేగాక వీరు ఏలుపు దేవు నేగాక వీరు షుమి దేవి, ముత్తాలమ్మ (కలరా జాడ్యదేవత), మైసమ్మ (మశూచికపు దేవత) అను దేవతలనుకూడ కొలిచెదరు.

కోయ, సంఘమునకు చెందిన వివాదములను తీర్చు టకు 'కులపంచాయితీ' అనునొక వ్యవస్థయుండును. 'పిన్న పెద్ద', 'కుల పెద్ద' అను వారు దీనిలో ముఖ్యులు. 'కుల పెద్దకు' ఎక్కువ అధికారముండును. ఈ యిరువురు ఉద్యోగులును వంశక్రమముగా వత్తురు. కాని ఒక 'పిన్న 'పెద్ద' చనిపోయినపుడు మరియొకనిని ఆ స్థానములో ఎన్నుకొనుట ఆచారము. పల్లెలోని వివాదముల నన్ని టిని 'కుల పెద్ద ' తీర్చును. సాధారణముగా ఇతని తీర్పే అంత్య నిర్ణయముగా నుండును. నేరస్థులు పెద్ద జరిమా నాలతో శిక్షింపబడుదురు. ఈ జరిమానాలు ఈయని వారిని వెలి వేసియు, రెండుచేతులతో చెట్లకు వ్రేలాడదీసి క్రింద ముళ్లుపోసియు కఠినముగా శిక్షింతురు. వారి నిజాయితీని పరీక్షించుటకు మరుగుచున్న నూనెలోగాని, నీటిలోగాని వారిచేతులను ముంచుట అనునది మరియొక పరీక్షా విధానము.

రా. ప్ర.