సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడూరు-IV

కోడూరు - IV :

కోడూరు గ్రామము పూర్వము గుంటూరుజిల్లా బాపట్ల తాలూకాలో నుండెడిది. ఇప్పుడు తెనాలి తాలూకాలో నున్నది. దీనికి అన వేమపురమని నామాంత రము కలదు. ఈ అనవేముడు కొండవీటి రెడ్డిరాజగు అన వేమా రెడ్డి (కి. శ. 1364-1986). దీని నిప్పుడు బ్రాహ్మణ కోడూరు అందురు. ఈ గ్రామ విస్తీర్ణము 3,27 చదరపు మైళ్ళు. 706 ఇండ్లు గలవు. జనాభా 3231 మంది. ఇందు పురుషుల సంఖ్య 1593. స్త్రీల సంఖ్య 1638. ఉండెను. ఆ

గోపరాజు రామమంత్రి తొలుత ఈ కోడూరు గ్రామ మును కౌండిన్యసగోత్రులును, ప్రథమశాఖవారును అగు బ్రాహ్మణుల కిచ్చినాడు. అందుచే దీనికి బ్రాహ్మణ కోడూరు అను పేరు వచ్చినది. ఇందు ఒక్క సంప్రతి రామయమంత్రి ఇచ్చిన కరణికములను, మిరాసులను మార్చి రెడ్డిరాజులు మరల తమ యిష్టాను సారముగ కొందరకు అగ్రహారముల నిచ్చిరి. ఆ గ్రామ ములయొక్కయు ఆ ప్రతిగృహీతల యొక్కయు పేళ్లు మున్నగు వాటిని తెలుపునట్టి పట్టికలనుబట్టి బ్రాహ్మణ కోడూరునకు తొలుత కరణములైన ప్రథమ శాఖీయ కౌండిన్య సగోత్రులకు మోటుపల్లి వర్తకాభివృద్ధియు, సముద్ర వ్యాపారాభివృద్ధి కీర్తియు గన్న అన వేమా రెడ్డి (అనపోతా రెడ్డి తమ్ముడు) "మందూరు"ను కరణిక గ్రామముగానిచ్చి, దానిని (బాహ్మణ కోడూరును) భారద్వాజసగోత్రులైన మాధవపెద్ది నాగేశ్వరశాస్త్రి గారికి ఏక భోగముగా దానముచేసినాడని, అరెడ్డి దత్త నా

అగ్రహారములనుగూర్చి చెప్పు దండక విలెయందు శ్లోకార్థ వివరణ మున్న పట్టిక యొకటి సాక్ష్య మిచ్చుచున్నది.

బొ. వేం. కు. శ.