సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడూరు-I

కోడూరు - 1 :

కోడూరు అను గ్రామము కడపజిల్లా జమ్ములమడక తాలూకాలో నున్నది. ఇది పినాకినీ నదీతీరమునగల గ్రామము. మద్రాసు - బొంబాయి రైలుమార్గమున వంగనూరు అను రైలు స్టేషనుకు ఈ గ్రామము రెండు మైళ్ళ దూరమున నున్నది. మార్గమధ్యమున పినాకినీ నదిని దాటి వెళ్లవలయును. కడపకు అరువది మైళ్ళ దూర మున ఈ గ్రామమున్నది. గండికోటకు పదునైదు మైళ్ళ దూరమున పర్వతపంక్తికి సమీపమున గలదు. ఈ గ్రామ సరిహద్దు ఉత్తరముగా ఏడుమైళ్ళవరకు వ్యాపించి, ఎర్ర మల కొండలలోనికి చొచ్చుకొని, కర్నూలు జిల్లా సరి హద్దును తాకును.

కోడూరు గ్రామమునకు ఈశాన్య భాగమున దబ్బుడు పల్లె అను గ్రామము కలదు. ఇది ఎర్రమలకొండ శ్రేణి మధ్యలో పీఠభూమియం దున్నది. ఈ పీఠభూమి భూ మ్యుపరితలమునకు నూట యేబది అడుగుల ఉన్న తాంశము (altitude) కలిగి, పర్వతశ్రేణి మధ్య గండికోట సానువు ప్రాంతమునుండి వాయవ్యదిశగా కడపమండలమునకును కర్నూలు మండలమునకును, అనంతపుర మండలమున కును కూడలి యగు ప్రదేశమువరకును వ్యాపించి యున్నది. ఉత్తరమునగల పర్వత పై భాగమునుండి కర్నూలుమండలము ; తూర్పు ఆగ్నేయమంతయు కడప మండలము ; పడమర, దక్షిణము అనంతపురమండలము గలవు. ఈ దబ్బుడుపల్లె మహాగ్రామమునకు చుట్టును బలమగు రాతికోట కలదు. కడపనవాబులు కడపను పాలించు సమయమున గండికోట దుర్గమునకు దక్షిణ ముగ నుండున ట్లేర్పరచిన దీ దబ్బుడుపల్లె రాతికోట. ఈ కోట ఇప్పుడును చూడదగినదిగా నున్నది.

కోడూరు గ్రామమున దక్షిణదిశగా పెన్న కాల్వలచే సమృద్ధములగు ఆకుతోటలును, మామిడితోటలును ఫల వంతము లగుచున్నవి. ఉత్తరమునను, తూర్పునను, పడ మటను ప్రత్తి, జొన్న, వేరుసెనగ మొదలగు పైరులు పండును. పడమట ఏడు మైళ్లు దూరముననుండు తాడిపర్తి పట్టణమునకు విక్రయార్థమై ప్రజలు తమపంటలను కొని పోవుట వాడుక. తాడిపర్తిలో ప్రత్తి ఫ్యాక్టరీలు, వేరు సెనగ ఫ్యాక్టరీలు పెక్కులు గలవు. కోడూరు నందు 103 కోడూరు - 1 చెన్న కేశవాలయము, శివాలయము, శ్రీ చౌడేశ్వరీ దేవాలయము ప్రసిద్ధములు. శ్రీ చెన్న కేశవస్వామి ఆలయ మున మూడు శిలాశాసనములు గలవు. విజయనగరమును పాలించిన సదాశివరాయల కాలమున దేవాలయమునకు గావించిన దాన విషయము లిందు గలవు. ఒక శాసన ములో తాళికోట యుద్ధమునం దోడిపోయిన ఆళియ రామరాయలకు ఏనుగుల పాపారాయుడు మంత్రిగా నుండె నని పెర్కొనబడినది. ఈ దబ్బుడు పల్లెలో ఏనుగుల వంశమువారు ఇప్పటికినిగలరు. తాము మంత్రుల వంశము వారమని వీరు తెల్పుకొందురు. "కోడూరు రెడ్లు పరా క్రమ నిధులు" అని ప్రసిద్ధి కలదు. నాచనసోమనాథుని గూర్చిన శాసనములలో ("ఎపిగ్రాఫికా కర్ణాటికా"లో జీ. డి. 46 సంఖ్యగా నుదాహృతమయిన తామ్ర శాసన ములో). తా

సోమాయ నాచనాంభోధేః సోమయామిత తేజసే గుత్తి దుర్గాభిధే రాజ్యే కోడూరాఖ్యమహీతలే, పెన్నమాగాణి విఖ్యాతే సర్వసస్యాభిశోభితే, కోడూరు నాగమల్లాఖ్య దిన్నా భ్యామపి పశ్చిమం, గ్రామో త్తమా ద్వెళుమంకూరోః ప్రాచ్యాద్దిశి సమన్వితమ్, 99 ఊరచింతల నామ్నళ్ళ గ్రామాద్దక్షిణ సంస్థితం, వంగలూరోడు తాళాభ్యా ముత్తరాశా ముపాశ్రితం, పినాకినీ తటే పెంచుకలదిన్నాహ్వయం పురా. బుక్క రాయ పురాఖ్యాత ప్రతినామ్నాచ శోభితమ్.

మొదలగు శ్లోకముల నుదాహృతమగు “ పెంచుకలది న్నె” యను గ్రామమునకు ఈశాన్యభాగమున ఈ కోడూరు కలదు. పెంచుకలదిన్నె ప్రకృతము బేచరాకై, గ్రామ స్థలము మాత్రము మిగిలియున్నది. తక్కిన యెల్లలుగా జూపబడిన గ్రామములన్నియు కోడూరు ప్రాంతముననే గలవు.

ఇచ్చట బావులనీటితో పండించు తోటలును పెక్కు గలవు. శ్రీ చౌడేశ్వరీదేవి నందవరీకులగు నియోగుల కును, తొగట, జాండ్ర కులముల వారికిని ముఖ్యదై వము. ఈ చౌడేశ్వరీ ప్రధానాలయము కర్నూలు మండలమున, నందవరమున గలదు. నందవరీకులు ఆ యగ్రహారీకులే యని యందురు. చౌడేశ్వరీదేవి యుత్సవము ప్రతివత్సర మును మహావైభముతో జరుగును. ఇందు జ్యోత్యు త్సవ మనునది చూడదగినది.

జ. వేం. సు. శ.