సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొరియాదేశము (చరిత్ర)

కొరియాదేశము (చరిత్ర) :

ప్రాచీన చరిత్ర : కొరియా దేశము యొక్క ప్రాదుర్భావమును గూర్చి క్రీ. పూ. 2333వ సం॥ నుండియు పెక్కు గాథలు, ఐతిహ్యములు ప్రచారమందుం డెను. ఒక ఐతిహ్యము ననుసరించి, సృష్టికర్తయొక్క కుమారు డైన హ్వానంగ్ అనునతడు భూమండలమునకు దిగివచ్చి, ఎలుగుబంటుగా నుండి అప్పుడే మానవాకారమును ధరిం చిన ఒక అందగ త్తెయగు స్త్రీని వివాహ మాడగా, ఆ మెకు టాంగాన్ అను నొక పుత్రుడు జనించె ననియు, అతడే కొరియా దేశమునకు మొదటి ఏలిక యయ్యెననియు తెలియుచున్నది. ఈ రాజవంశము క్రీ.పూ. 1122వ సం॥ వరకు కొరియాను పాలించి అంతరించెను. చరిత్రాత్మక మైన మరియొక గాథను బట్టి 'కిజ' అను ఋషితుల్యుడైన ఒక చైనా విద్వాంసుడు 5,000 మంది అనుచరులతో కొరియాలో ప్రవేశించి, ప్రస్తుతము ఉ త్తర కొరియాకు రాజధాని నగరమైయున్న 'ప్యోంగ్యాంగ్ ' కేంద్రముగా కొరియాను కొంతకాలము పాలించి, రెండవ రాజవంశమునకు మూలపురుషుడ య్యెనని విదిత మగుచున్నది. ఈ రెండవ రాజవంశము క్రీ. పూ. 198 వ సం॥ వరకు కొరియాను పాలించెను. ఈ కాలమున కొరియా ఉన్నతమైన నాగరిక దశ ననుభవించినట్లు ఆధారములు కలవు. 'కిజా' రాజవంశముచే పాలింపబడిన ప్రాంతమం తయు క్రమముగా చైనా యోధుడగు 'వై మాన్' అను నతనికి అధీనమయ్యెను. అది తుదకు క్రీ.పూ. 108 వ సం॥లో చైనా ప్రభుత్వమునకు వళమయ్యెను. చైనీయు లారాజ్యమును ఉత్తర కొరియా యందలి నలుమూలల వరకు విస్తృత మొనర్చి, దానిని నాలుగు మండలములుగా విభజించిరి. 'ప్యోంగ్ యాంగ్' రాజధానిగా ఏర్పడిన 'లోలంగ్' అను మండలము ఆనాల్గింటిలోను అత్యంత వై భవమనుభవించినట్లు తెలియుచున్నది. అనంతర కాల మున, ఈ మండలము సర్వస్వతంత్రమైన రాజ్యముగా పరిణామము చెందినది. దక్షిణ కొరియా, ఆదినుండియు 'హాన్' అనబడు విభిన్నములై న మూడుజాతులచే పాలింపబడుచువచ్చినది. ఈ జాతులు చైనా వారి అధికార ప్రభావమునకు లోబడక స్వతంత్ర ప్రతిపత్తి ననుభవించుచుండినవి. ఐనను చైనావారి సంస్కృతి వలన వీరు అధికముగ ప్రభావితు లయిరి. మాహాన్, చిన్ హాన్, ప్యోన్హాన్ అను నామము

లతో ఈజాతులు వ్యవహరింపబడుచుండెడివి. ఒక్కొక్క జాతిలో పెక్కు తెగలు, కుటుంబములు గర్భితములై యున్నను, మూడును మూడు ప్రత్యేక మైన సమాఖ్యలుగా అధికారము చలాయించు చుండెను. త్రిరాజ్యయుగము : గ్రంథస్థమైన కొరియా ప్రాథమిక చారిత్రకదశ 'త్రిరాజ్యయుగమ'ని వ్యవహరింపబడు చున్నది. ఈ యుగము క్రీ.పూ. 57 వ సం. తో ఆరంభ మైనట్లు తెలియుచున్నది. కారణమేమన, ఆ సంవత్సర మందే దక్షిణకొరియా యందలి 'చిన్హాన్' మండలమున 'సిల్లా' అను పేర ఒక రాజ్యము స్థాపింపబడినది. క్రీ.పూ. 37 వ సం. లో 'ప్యోన్ హాన్' సమాఖ్య ప్రభుత్వము ‘సిల్లా’ లో విలీనమయ్యెను. ఉత్తర కొరియాలో పూర్వము చై నీయుల అధీనమందుండిన మండలమందు క్రీ. పూ. 37వ సం. న 'కోగుర్యో' అను పేరుతో మరియొక రాజ్యము స్థాపితమయ్యెను. క్రీ.శ. 800వ సం. లో 'లోలాంగ్' అను చై నావలస ప్రాంతము 'కోగుర్యో' రాజ్యము యొక్క అంతర్భాగమయ్యెను. 'పాక్చే' అను మూడవరాజ్యము నైరృతి కొరియాలోని 'మాహాన్’ మండలమందు క్రీ. పూ. 18 వ సం. లో ఏర్పడెను. కాగా, శ. 42 వ సం. నుండి, 562 వ సం.రము వరకు కొరియాయొక్క దక్షిణాగ్రమున (నేటి 'పూసాన్’ నగర పరిసరములలో) 'కరక్' అను నాల్గవరాజ్యము నెలకొని యుండెను. ఇది కొంత కాలమువరకు జపాను సామ్రా జ్యము క్రింద వలసప్రాంతముగ నుండి తుదకు ‘సిల్లా'లో లీనమయ్యెను.

ఈ మూడు రాజ్యములు 700 సంవత్సరములకు పైగా ఎడ తెగక ఒండొంటితోయుద్ధములు చేయుచునేయుం డెను. ఇట్లుండగా అదే సమయములో 'సిల్లా' పై జపాను పెరు పర్యాయములు దాడులు సల్పెను. అనంతరము 660వ సం. లో ‘పా క్చే’ రాజ్యమును, 668 లో 'కోగుర్యో' రాజ్యమును 'సిల్లా' అధికారము క్రిందికి పోయెను. సాటి రెండు రాజ్యములపై దాడి వెడలిన ‘సిల్లా' ప్రభుత్వమునకు చైనా అధికముగ సహాయమొనర్చెను. 'సిల్లా' అను పేరుతో కొరియా ద్వీపకల్పమంతయు ఒక అఖండ రాజ్య ముగ క్రీ. శ. 935 వ సం. వరకు వర్థిల్లెను. ఈ కాలమున కొరియాలో బౌద్ధమత సమన్వితమైన చైనాసంస్కృతి వికసించెను ; సాహిత్యము, వివిధశాస్త్రములు త్వరిత గతిని వృద్ధిచెం దెను. కొరియాయందు భాషగూడ దాదాపు ఏకీకరణ మొనరింపబడెను. కోర్యో : 'సిల్లా' ప్రభుత్వ సేనానులలో నొకడగు 'వాంగన్' తిరుగబడగా, 'సిల్లా' రాజ్యాధినేత అతని బలాధిక్యతను గుర్తించి, క్రీ. శ. 918 సం. లో అతనికొక ప్రత్యేక స్వతంత్ర రాజ్యమును ఏర్పరుపవలసి వచ్చెను. ఇప్పుడు 'సియోల్' నగర సమీపముననున్న 'కేసాంగ్' అను తావుననే ఈ స్వతంత్ర రాజ్యము యొక్క రాజధాని వెలసి యుండెను. క్రీ. శ. 935వ సం. లో 'సిల్లా' ప్రభు త్వమునకు చెందిన తుదిరాజన్యుడు తన అధికారమును పరిత్యజించగా, వాంగన్ ఆ రాజ్యస్థానములో 'కోర్యో' అను మరియొక నూతన రాజ్యమును నెలకొల్పెను. ఈ రాజ్యము క్రీ. శ. 1392 వ సం. వరకు నిలిచి యుండెను. 'కొరియా' యని పాశ్చాత్యులు గావించిన నామకరణము 'కోర్యో' నుండియే ఉత్పన్న మయ్యెను. 'వాంగ్' రాజ వంశ కాలమున కోర్యోలో బౌద్ధమతము ప్రబలముగా ప్రచారమం దుండెను. ఆ కాలమున చైనా దేశముతో కొరియా సత్సంబంధములనే నెరపుచుండెను. ఇట్లుండగా క్రీ. శ. 1231 లో మంగోలులు కోర్యోపై దండెత్తివచ్చి, దేశమంతయు ఆక్రమించి, 1364 వ సం. వరకు తమ అధీనమున ఉంచుకొనిరి. అదే సంవత్సరమున జనరల్ 'ఇ-టెయిజో' అను నాతని నాయకత్వమున కొరియా సైన్యములు మంగోలు మూకలను ఓడించి దేశమునుండి తరిమి పై చెను. రాజును , చోసన్ జనరల్ ఇ-టెయిజో, వాంగ్ వంశపు తుది శ. 1892 లో పదభ్రష్టుని గావించి, తన వంశమును రాజ్యాధికారమున నెలకొల్పెను. క్రీ. శ. 1910వ సం. లో కొరియాను జపాను ప్రభుత్వము తన రాజ్యములో కలిపివేసికొనువరకు ఈ వంశమే కొరి యాలో అధికారమును నెర పెను. చైనా యొక్క 'మింగ్ ' వంశసార్వభౌముడు 'ఇ' అను పై పేర్కొన్న రాజ వంశమును గుర్తించి కొరియాకు 'చోసన్' అను నూతన నామమిడెను. ఈ చోసన్ రాజ్యమునకు హాంగ్యాంగ్ (ప్రస్తుతము సియోల్) రాజధాని యయ్యెను. ఈ నూతన వంశ పాలనమున కొరియా వైజ్ఞానిక ముగను, సాంస్కృతి

కముగను, అత్యంత వైభవము అనుభవించెను. ఈ కాల మున బౌద్ధమతము అణగ ద్రొక్కబడి, బౌద్ధమ తాధి కారుల క్రిందనున్న భూములు ప్రజలకు పంచి ఇయ్య బడెను. క్రీ. శ. 1403 సం. లో శ. 1403 సం. లో ప్రప్రథమముగా చైనా భాషకు సంబంధించిన అక్షరములను అచ్చొత్తించుట సంభవించెను. క్రీ. శ. 1420 లో ప్రభుత్వక ళాశాల స్థాపింప బడెను. 'ఇ' రాజవంశము అధికారమును హస్తగత 150 సంవత్సరములలో కొరియాయందు విద్యావ్యాప్తి బహుళముగ వైద్యశాస్త్రమందును, ఖగోళశాస్త్రమందును, భూగర్భ శాస్త్రమందును, వ్యవసాయశాస్త్ర మందును, చారిత్రక విషయములందును పెక్కురు విద్వాంసులు వెలసిరి. మొనరించుకొనిన మొదటి జరగి, క్రీ. శ. 18వ శతాబ్దాంతమున ప్రప్రథమముగా కొరియా జపాను దండయాత్రకు గురియయ్యెను. శ. 1592 లో హిడెయోషి అను జపానీయుడు కొరి యాను ఆక్రమించెను. ఏడుసంవత్సరముల సంఘర్షణ అనంతరము జపాను కొరియాను విడిచి వెళ్ళవలసివచ్చెను. క్రీ. శ. 1627 వ సంవత్సరములో మంచూ జాతీయులు, చై నాయందలి 'మింగ్' వంశమునకు ప్రమాదము తెచ్చి పెట్టిరి. వీరు కొరియా నాక్రమించి, కొరియా ప్రభువుచే, తమ సార్వభౌ మాధికారమును గుర్తింప జేసికొని కొంత కాలము రాజ్యమేలినపిమ్మట ఆదేశమును వీడి వెడలిరి. ఇట్లుండగా క్రీ. శ. 1644 వ సంవత్సరములో మంచూ జాతీయమైన 'చింగ్' వంశమువారు చైనా పాలితులుగ స్థిరపడిరి. వీరి సార్వభౌమాధికారమునకు లోబడి, కొరియా సామంత రాజ్యముగ మనవలసివచ్చెను. అయి నను కొరియాయొక్క ఆంతరంగిక స్వేచ్ఛా స్వాతంత్య్ర ములలో చై నాప్రభుత్వము జోక్యము కలుగజేసుకొన కుండెను. 77 శా పాశ్చాత్యులతోడి సంపర్కము: క్రీ.శ.1880 సం. వరకు కొరియా బాహ్యప్రపంచములో సంబంధము లేక ఏకాకిగా జీవితమును గడుపుచుండెను. కొరియాకు పాశ్చాత్యులతో క్రీ. శ. 1653వ సం. లో ప్రప్రథమ ముగా సంపర్కము కలిగెను. ఆ సంవత్సరమున ఒక డచ్చి పొగయోడ 'చెజు' ద్వీపమువద్ద భగ్నమయ్యెను. అందు బ్రతికి బయటపడిన 30 మంది ప్రయాణీకులు సియోల్ నగరమునకు కొనిపోబడిరి. తదాదిగా కొరియనులకును, ఇతర ఐరోపా దేశములకు చెందిన పొగయోడల యజ మానులకును అప్పుడప్పుడు సం బంధ ములుకలుగుచుండెను. క్రీ. శ. 1830 లో మువ్వురు ఫ్రెంచి మతాధి కారులు కొరియాలో అడుగిడి కొరియనుల చేతిలో మడసిరి. శ. 1865 సం. నకు అనంతరము కొరియాతో వర్తకము నెరపదలచిన పెక్కు దేశములతో దానికి సంబంధములు మెండయ్యెను. పెక్కు పర్యాయములు ఫ్రెంచి, అమె రికా, జపాను నావికాదళములు, కొరియాతో తలప డెను. క్రీ. శ. 1876లో తనతో ఒడంబడిక గావించు కొనుటకై కొరియాపై జపాను ఒత్తిడిగావించెను. తత్ఫ లితముగ రెండు దేశముల నడుమ దౌత్యసంబంధములు (diplomatic relations) నెలకొనెను. క్రీ.శ. 1892 లో కోరియాతో ఒడంబడిక చేసికొనిన మొదటి పాశ్చాత్య రాజ్యము అమెరికాయే. వెనువెంటనే ఇతర పాశ్చాత్య రాజ్యములు కూడ కొరియాతో ఆర్థిక, రాజకీయ సంబం ధము లేర్పరచుకొ నెను. శ. 1886 వ సం. నాటికి, ఈశాన్య ఆసియాలో తమ ప్రయోజనములను సాధించు కొనియున్న అన్ని రాజ్యములతోడను కొరియాకు సంబంధ మేర జపాను ప్రాబల్యము : పాశ్చాత్యనాగరికతతో సంపర్య మేర్పడిన ఫలితముగా జపాను అభివృద్ధి చెందేనని విశ్వ సించిన కొరియనులు, తాముకూడ అదేమార్గమును అను సరింపదలచిరి. ప్రాచీన సంప్రదాయికులైన కొరియనులు ఈ భావమును వ్యతిరేకింపగా, అభ్యుదయకాములై న యువకులు శ. 1882 వ, 1884వ సం లలో జపాను సాయముతో కొరియా రాజరికము పై తిరుగబడిరి. ఈ సందర్భమున కొందరు జపానీయులు మరణించిరి. అంతట జపాను ప్రభుత్వము కొరియానుండి నష్ట పరిహారమును కోరెను. క్రీ. శ. 1884 వ సం.లో జరిగిన తిరుగుబాటు సందర్భమున కొరియా ప్రభుత్వము చైనా సహాయముతో జపాను అధికారులను తన దేశమునుండి తరిమివై చెను. జపానీయులు మరల కొరియాకు తిరిగివచ్చి మరొక సారి నష్ట పరిహారముకొరకై సంఘర్షించిరి. చైనీయులును, జపానీయులును ఎట్టెటో సమాధానపడి (టీంట్సిన్ ఒడం బడిక 1885), ఇరు రాజ్యములవారు తమ సైన్యములను

కొరియానుండి మరలించివై చుట కంగీకరించిరి. ఈ ఒడం బడిక ప్రకారము కొరియాకు తన స్వంతసైన్యమును నిర్మించుకొను హక్కు గుర్తింపబడినది. ఆంతరంగిక కల్లోలము సంభవించునప్పుడు మాత్రమే, కొరియా కోరిక పై జపానుకును, చైనాకును కొరియాలో ప్రవే శించుటకు హక్కు ఇయ్యబడినది. కాని A తొమ్మిది సంవత్సరములవరకు మాత్రమే అమలునం ఈ ఒడంబడిక దుండెను. శ. 1894 సం.లో కొరియా యందలి ‘టోంఘుకులు' అను నొక మతవర్గము వారు విదేశీయుల జోక్యమును నిరసించి తిరుగబడిరి. ఈ మతవర్గము పేద ప్రజలనుండి ఉత్పన్న మైనది. జపాను సైన్యములు, చైనా సై న్యములు కొరియాలో ప్రవేశించకపూర్వమే కొరియా ప్రభుత్వము ఈ తిరుగుబాటును అణచివై చెను. కొరియా ప్రభుత్వ విధానములో కొన్ని సవరణలు ప్రవేశ పెట్టు విషయమున తాను సాయపడుటకై, చైనా అంగీకారమును జపాను ప్రభుత్వము కోరగా, చైనా అందుకు నిరాకరించెను. జపాను సేనలు సియోల్నందలి రాజభవనముపై దాడి జరపి వెనువెంటనే చైనాపై యుద్ధము ప్రకటించెను. యుద్ధము స్వల్పకాల మేసా గెను. నూతనమైన కొరియా ప్రభుత్వము జపాను సహకార ముతో చైనీయులను వెడల నడిపించెను. క్రీ.శ. 1895లో జరిగిన 'షి మొనో సెకీ' ఒడంబడిక ననుసరించి చైనా, జపానులు రెండును కొరియా స్వాతంత్ర్యమును గుర్తించి నవి. కాని అనతికాలముననే జపాను ఈ ఒడంబడికను ఉల్లంఘించి కొరియా ప్రభుత్వమునుండి విపరీ తాధి కార ములను సంపాదించుటకై దానిపై ప్రబలమైన ఒత్తిడి తెచ్చెను. కాని కొరియా అందులకు అంగీకరింపక నిలబడి ప్రతిఘటించెను. కొరియాలోనున్న జపాను రాయబారి కుట్రపన్ని ప్రతికూలురాలుగా నున్న కొరియా రాణిని క్రీ. శ. 1895 లో చంపించి, తమ కనుకూలమగు నూతన కొరియా మంత్రివర్గమును నియమించెను. నామమాత్ర మైన ఆ కొరియా మంత్రివర్గమును అడ్డమిడుకొని జపాను ప్రభుత్వము కొరియాను క్రీ. శ. 1896 వ సం. వరకు పాలించెను. కొరియారాజు తన అనుచర మంత్రి వర్గముతో రష్యా రాయబార కార్యాలయమునకు పలాయితు డయ్యెను. పిదప కొంతకాలమునకు ఈ 78 కొరియారాజు తన అధికారమును మరల స్థాపించుకొని, జపాను అధికారులను బర్తరఫ్చేసి, వారి స్థానమున రష్యా అధికారులను, రష్యా సైనిక అధ్యాపకులను నియమించెను. జపాను సామ్రాజ్యములో కొరియా విలీనము : కొరి యాలో తమ ప్రయోజనములను రక్షించుకొనుట కై జపాను రష్యా ప్రభుత్వములు కొరియాతో సమాధాన పడుటకు యత్నించెను. ఇరుదేశములును కొరియా స్వాతంత్ర్యమునుగుర్తించుటకును, ప్రత్యక్షముగకొరియా ఆంతరంగిక వ్యవహారములలో జోక్యము కలిగించుకొన కుండుటకును అంగీకరించినవి. కాని ఈ అంగీకారము తత్క్షణమే నిరర్థకమయ్యెను. రెండు దేశములును ఒండొంటిపై క్రీ. శ. 1904వ సంవత్సరములో యుద్ధము ప్రకటించు కొనెను. జపాను కొరియాపై బడెను. కొరియా ప్రభువు జపానుతో సంధి జేసికొనవలసివచ్చెను. ఈ సంధి ప్రకారము కొరియా స్వాతంత్ర్యము మరల గుర్తింపబడెను. కాని రష్యాపై యుద్ధ మాచరించుటకు అవసరమైన సైనిక కేంద్రములను కొరియాలో నిర్మించు కొనుటకు జపాను హక్కును సంపాదించెను. యుద్ధము విరమించక పూర్వమే, ఆర్థిక, సైనిక, పై దేశిక, న్యాయ శాఖల నిర్వహణమునకై తమ సలహాదారులను అంగీక రించునటుల జపాను ప్రభుత్వము కొరియాను కోరి కృత కృత్యతనొం దెను. అంతటితో ఆగక, కొరియాలోని తంతి, తపాలా, టెలిఫోను శాఖలనుగూడ జపాను స్వాధీన మొనర్చుకొనెను. అంత, రష్యా కిక్కురు మనకుండ, కొరియాలో జపాను చలాయించదలచిన సర్వాధికార మును గుర్తించెను. ఆ విధముననే అమెరికా, బ్రిటిష్ ప్రభుత్వములు గూడ అనుసరించెను. క్రీ.శ. 1905 వ సం॥ నవంబరులో కొరియాపై రక్షణాధి కారమును (Protectorate) జపాను లాంఛనప్రాయముగ స్థాపించు కొనెను. ఈ రక్షణాధికారము 5 సంవత్సరములు కొన సాగెను. అనంతరము జపాను కొరియా సైన్యమును విచ్ఛిన్నము చేసి, ఆ దేశమును తన సామ్రాజ్యములో 1910 వ సం॥లో కలుపుకొనెను. కొరియాను పాలించుటకై జపాను నిధిని నియమించెను. ఇతడు జపాను తన రాజప్రతి ప్రభుత్వమున కే

బాధ్యుడై యుండెను. ఇతని క్రింద వ్యవహరించు సలహా వర్గముగూడ జపాను నెడల భక్తి ప్రపత్తులతో మెలగ వలెను. ఉన్నత పదవులన్నియు జపానీయులే ఆక్రమించు కొని యుండిరి. చిల్లర ఉద్యోగములలో మాత్రమే కొరియనులు నియమింపబడిరి. ఈ విధముగ జపాను నిరంకుశముగ ప్రభుత్వము కొరియాను పశుబలముచే పాలించెను. జాతీయ చైతన్యము : తన పాలనములో జపాను ఎడ తెగక కొరియనుల ప్రతిఘటనమును ఎదుర్కొనవలసి వచ్చెను. ఈ ప్రతిఘటనమును జపాను తన సైనిక బల ముచే తెగటార్చి, వేలకొలది కొరియనులను హతమొన ర్చెను. ప్రథమప్రపంచ సంగ్రామా (1914-18) నంతరము వలసరాజ్య ప్రజలలో ఉవ్వెత్తుగా విజృంభించిన జాతీయ విప్లవ చైతన్యముచే, కొరియనులు ప్రభావితులైరి. దేశ భక్తి పరాయణులైన లక్షలాది కొరియనులు బ్రహ్మాండ మైన ప్రదర్శనములు జరిపిరి. వేలాది కొరియను ప్రదర్శ కులు జపాను తుపాకులకు గురియై ప్రాణములర్పించిరి, ఈ సంఘటనమునకు జపాను ప్రభుత్వము కలవరపడి. కొరియనులకు వాక్స్వాతంత్ర్యము, అధికారవి కేంద్రీకర ణము మున్నగు సంస్కరణములను ప్రవేశ పెట్టుటకు అంగీకరించెను. కాని వీటిలో కొన్నిటిని మాత్రమే అమలు జరి పెను. ఈలోగా కొరియాలోగల పెక్కు రాజకీయ పక్షములవారు ఐక్యమై క్రీ.శ. 1919 సం॥లో ఒక రహస్య ప్రదేశమున సమావేశమై చర్చలు జరిపిన పిమ్మట తాశ్చా లిక ప్రజాప్రభుత్వ స్థాపనమును గూర్చి ప్రకటన చేసిరి. అప్పుడే పారిస్ లో సమావేశమైన శాంతిమహాసభ చేతను, వాషింగ్టన్లో సమావేశమైన, ఆయుధవిసర్జన మహాసభ చేతను, నానాజాతి సమితిచేతను, తమ తాత్కాలిక ప్రభుత్వమును గుర్తింపజేయ యత్నించిరి. కాని జపాను తన పలుకుబడిని ఉపయోగించిన కారణముగా ఈ ప్రయ త్నములు విఫలములైనవి. అయినను, కొరియా జాతీయ వాదులు తమ పోరాటమును రెండవ ప్రపంచ సంగ్రా మమువరకు కొనసాగించుచునే యుండిరి. పెక్కురు జాతీయవాదులు అమెరికా, చైనా, మంచూరియా, సై బీరియా ప్రాంతములకు పలాయనమై అచ్చటినుండి గూడ తమ పోరాటమును సాగించిరి. ద్వితీయ ప్రపంచయుద్ధము (1939 - 45) తో జపాను చైనా, పాలనము కొరియాలో అంత మొం దెను. ఇంగ్లండు, అమెరికా ప్రభుత్వములు శీఘ్రకాలములో కొరియాకు స్వాతంత్ర్య మొసగ గలమని 1943 లో ప్రక టన గావించెను. కొరియా 'తాత్కాలిక ప్రభుత్వము' ‘చుంకింగ్ ' (దక్షిణ చైనా నుంచి చైనా నాయక త్వమున 1944 సం.లో జపానుపై పోరాటము నారంభించెను. మిత్రమండలివారు 1948లో సమావేశమై 1943 లో తాము చేసిన ప్రకటనమును అమలుజరి పెదమని వాగ్దాన మొనర్చిరి. 1945 లో జపానుపై యుద్ధమునకు దిగిన సోవియట్ రష్యా కూడ కొరియా స్వాతంత్ర్య ప్రతిపాద నమును సంపూర్ణముగ బలపరచెను. సోవియట్ సైన్య ములు ఉత్తర దిశనుండి కొరియాలో ప్రవేశింపగా, దక్షిణమునుండి అమెరికా సైన్యములు గూడ ప్రవేశించి నవి. సైనిక వ్యూహ సౌలభ్యమునకై కొరియా దేశము ఉత్తర, దక్షిణ మండలములుగా విభజింపబడెను. ఈ విభ జనము 38వ అక్షాంశ రేఖ (38 th Parallel) వద్ద జరిగెను. ౨ కొరియాను ఒకే కేంద్రప్రభుత్వము క్రింద ఐక్య మొన రించుటకై ప్రప్రథమమున రష్యాచే సూచన చేయబడెను. కొరియాలోనున్న అమెరికా సైనిక నాయకులును, రష్యా సైనిక నాయకులును సంయుక్త సంఘముగా నేర్పడి కొరియా ప్రజానాయకులతో సంప్రతించిన ఫలిత ముగా కొరియాదేశ మంతటికిని ఒకే ప్రభుత్వము నేర్పాటు చేయుట సమంజసమని అమెరికా, ఇంగ్లండు, రష్యా, చైనా ప్రభుత్వములు అంగీకరించెను. కా అందులకై చేసిన ప్రయత్నములు విఫలములయ్యెను. అంతట అమెరికా ఈ ఏకీకరణ సమస్యను ఐక్యరాజ్య సమితి ముందుంచెను. ఐక్యరాజ్య సమితి ఈ సమస్యను చర్చించి, కొరియాయందు అంతటను ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సంఘముయొక్క అధ్వర్యమున ఎన్నికలు జరుపవలెనను తీర్మానమును ఆమోదించెను. ఈ తీర్మా నము ప్రకారము ఎన్నికలను జరుపుటకు ఏతెంచిన తాత్కాలిక సంఘము ఉత్తరమండలములో ప్రవేశించు టకు ఉత్తర కొరియాలోని రష్యను అధికారులు అంగీక రింపలేదు. కాని దక్షిణ కొరియాలో ఎన్నికలు జరిగి

1948 మేనెలలో జాతీయమహాసభ సమావేశమయ్యెను. సింగ్మన్ రీ దక్షిణ 'కొరియన్ రిపబ్లిక్' నకు అధ్యక్షుడుగా ఎన్నిక యయ్యెను. దక్షిణ కొరియాకు ప్రత్యేక ముగా 1948 జులై నెలలో నూతన రాజ్యాంగ మేర్పడి అమలు జరుపబడెను. ఉత్తరకొరియా ప్రజాపరిషత్తు 1948 జులై నెలలో సమావేశమై ఉత్తరకొరియాకు ఉత్తరకొరియాకు ప్రత్యేకముగా ఒక రాజ్యాంగమును ఆమోదించెను. దీనిననుసరించి ఉత్తర కొరియా ప్రభుత్వమునకు 'డెమాక్రటిక్ పీపుల్సు రిపబ్లిక్ ' అని నామకరణ మొనర్పబడెను. కిమ్ ఇల్ సుంగ్ అను నతడు మొట్టమొదటి ప్రధానిగా ఉత్తరకొరియా ప్రభుత్వ మునకు ఎన్నికయయ్యెను (1948). ఇది జరిగిన వెంటనే సోవియట్ రష్యా తన సైన్యములను ఉత్తరకొరియానుండి స్వదేశమునకు మరలించివేయగలనని ప్రకటించెను. కొరియా యుద్ధానంతర పరిస్థితి దక్షిణ ఉత్తరకొరి యాలలో వేర్వేరు ప్రభుత్వములు స్థాపింపబడిన కొంత కాలమున కే (1950 జూన్) వాటి నడుమ సంఘర్ష ణము ప్రారంభమై తుట్టతుదకు 1953 జులైలో అంత మయ్యెను. ఇరుపక్షములును ఒండొరులపై ఆరోపణ ములు, ప్రత్యారోపణములు చేసికొనిన ఫలితముగా, దీర్ఘకాలము రాయబారములు సాగినవి. తుదకు సమా ధానము కుదిరెను. కాని కొరియాయొక్క ఏకీకరణము, దేశమంతటికిని ఒకే ప్రభుత్వము, ఒకే రాజ్యాంగము ఏర్పడుట అను సమస్యలు నేటికిని అపరిష్కృతములుగ నే నిలిచిపోయినవి. కొరియా సంధి ఒడంబడిక (Peace treaty) మీద సంతకములు పెట్టకమునుపే (1958 జూన్) దక్షిణకొరియాకు అవసరమైన ఆర్థిక సైనిక సహాయ మొనర్తు నని అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ వాగ్దాన మొన ర్చేను. అనంతరమీ వాగ్దానమును అతడు చెల్లించుకొ నెను. దక్షిణకొరియాకును, అమెరికా కును నడుమ అన్యోన్య సైనికసంధి 1953 అక్టోబరులో జరిగిన ఫలితముగా, 1956 జూన్ తో అంతమైన ఆర్థిక సంవత్సరములో అమెరికా, దక్షిణ కొరియా ప్రభుత్వ మునకు 80,00,00,000 డాలర్ల మేరకు సహాయమిచ్చెను, అమెరికా ఇంతగా ఆర్థికసహాయ మొనర్చినను, దక్షిణ కొరియాయొక్క ఆర్థిక విధానము, సహజముగా లోప భూయిష్ఠ మగుటచే, అది తనకాళ్లపై తానునిలబడ లేక దివాలా స్థితికి దిగజా రెను. ఇప్పటివరకును దక్షిణకొరియా అమెరికా పైననో, మరియొక ధనిక దేశము పైననో ఆధార పడుచునే యున్నది. దక్షిణకొరియా ప్రభుత్వము ప్రకటించిన 1952-53 సం. బడ్జెటు లెక్కలే ఇందుకు నిదర్శనము. పై కారణములచే దక్షిణ కొరియాలో ద్రవ్యోల్బణము (inflation) అధిక ముగనున్నది. - రూపురేఖలు : కొరియాలో లభ్యమైన పురాతత్త్వ శిథిలములనుబట్టి క్రీ పూ. 2000 సం. క్రిందట 'హాన్' అను మంగోలు జాతికి చెందిన మూకలు మధ్య ఆసియా నుండి కొరియాలో ప్రవేశించినట్లు తెలియు చున్నది. కొరియా ద్వీపకల్పమును నివాసముగా చేసికొనిన వేర్వేరు తెగలన్నిటిలో ఈ 'హాన్' జాతీయులే అత్యధిక సంఖ్యా కులు. కొరియాభాషకు మూల పురుషులును, సృష్టి కర్తలుగూడ వీరే. చైనీయులకును, జపానీయులకును వలె వీరికిని ఒకే లక్షణము కలిగిన పూర్వజాతీయ చరిత్ర కలదు. అయితే వారికంటే భిన్నమైన కొన్ని విలక్షణ ములు మాత్రము కొరియనులకు కలవు. కొరియనుల శిరోజములు నల్లగా - నిక్కపొడుచుకొని యుండును. వీరి బుగ్గలు ఉబ్బెత్తుగా నుండును. దవడ ఎముకలు ముందునకు పొడుచుకొని వచ్చినట్లుండును. ఎత్తులో వారు ఉత్తర చైనీయులకును, జపానీయులకును మధ్య స్థముగా నుందురు. కొరియన్ భాష యూరల్-ఆబ్జెయిక్ భాషాకుటుంబమునకు చెందినది. ఈ యూరల్ –ఆల్టో యిక్ భాషాకుటుంబములోనే మంగోలు, టర్కిక్, జపాను భాషలుగూడ లీనమై యున్నవి. కాని చైనా భాష అట్టిది కాదు. కొరియా ప్రజల వ్యావహారిక (వాడుక) భాషకును, దేశీయమైన శబ్దసముదాయమున కును, పైన పేర్కొనిన యూరల్- ఆక్టెయిక్ భాషా కుటుంబములోని ఇతర భాషలకును నడుమ ఎట్టి పోలి కయు లేదు. కొరియా భాష యొక్క యు, జపాను భాష యొక్కయు వ్యాకరణ నిర్మాణవిధానము ఒకే విధ ముగ నున్నది. ఐనను ఇతర విషయములలో మాత్రము ఆ రెండు భాషలును భిన్నమైనవి. విద్య : పాలనముక్రింద విద్యాభివృద్ధి ముందంజె వేసెను. పాఠశాలల యొక్కయు, విద్యార్ధుల


యొక్కయు సంఖ్య పెరిగెను. జపాను ప్రభుత్వము తన ప్రభుత్వ యంత్రాంగములో చిల్లర ఉద్యోగములకు అవసరమైన మేరకు మాత్రమే కొరియా యువకులకు విద్యావిధానమును నిర్ణయించెడివారు. 1939 సం. లో కొరియాలో ప్రాథమిక పాఠశాలలయందు 1,200,000 మంది బాలబాలికలు విద్య నభ్యసించెడివారు. ఉన్నత పాఠశాలలయందును, వృత్తిపాఠశాలలయందును, కళా శాలలయందును, సియోల్ నగరమందుగల ఇంపీరియల్ విశ్వవిద్యాలయమునందును కలిసి మొత్తముగా 84,000 మంది జపాను విద్యార్థులును, 62,000 మంది కొరియా విద్యార్థులును ఉండిరి. ప్రభుత్వ పాఠశాలలు కాక, క్రైస్తవ మిషనరీలచే నిర్వహింపబడు పాఠశాలలును, కళాశాలలును కలవు. ఈ విదేశీయ మిషనరీ విద్యాసంస్థల యొక్క పలుకుబడి కొరియాలో పెరుగకుండ జపాను ప్రభుత్వము కఠినమైన నిబంధనలు అమలు జరి పెను. 1945 వ సం. లో జపాను పరిపాలనము అంత మగుటతో, కొరియా విద్యావిధానము పూర్తిగా సంస్క రింపబడెను. ఈ సంస్కరణోద్యమములో కొరియా విద్యా వేత్తలు ఉత్సాహముతో పాల్గొని, బాధ్యతతో, తమ కార్యక్రమమును కొనసాగించిరి. ప్రజాస్వామ్య పద్ధతి పై దేశభక్త్యుత్సాహములు ఉద్దీపించునట్లు విద్యావిధానము మార్చబడినది. పాఠ్యగ్రంథములు కొరియను భాషలో పునర్లి భింపబడినవి. శాస్త్రీయ సాంకేతిక విద్యాశిక్షణమున ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు గైకొనబడెను. ప్రాథమిక విద్య నిర్బంధము చేయబడినది. 1954 డిసెంబరు నాటికి 4,043 ప్రాథమిక పాఠశాలలలో 27,34,726 మందియు, 788 మాధ్యమిక పాఠ శాలలయందు 4,07,893 మందియు, 466 ఉన్నత పాఠశాలలలో 2,10,862 మందియు, 213 వృత్తి విద్యాలయములలో 98,281 మందియు, 71 కళా శాలలలో 98,281 మందియు, 18 నార్మల్ పాఠశాలలలో 13,217 మందియు 3,548 వయోజన పౌర విద్యాలయ ములలో 2,97,792 మందియు, విద్య నభ్యసించుచుండిరి. 1948 వ సం. లో కొరియాలో అక్షరాస్యత 70 శాత ముండెను. మతము : మత విషయమున విదేశీయుల ప్రభావము కొరియా ప్రజలపై అధికముగ ప్రసరించెను. షామియా నిజము ("సిన్‌ కో” అని నామాంతరము), 'చొన్‌ డోకోర్ట, మున్నగు ఇతర దేశీయమతములు కాక, కన్ఫూ బ్రషీయన్‌ మతము, బౌద్ధమతము, వైనా సంపర్క్మమువలన కొరి యాలో (వవేశించినవి. జపానుపాలనము ఫలితముగా “పింటో” మున్నగు పలురకముల 'బౌద్దమతాంతరశా ఖలు గూడ కొరియాలో (పచారము నొందినవి. పాశ్చాత్యుల సంపర్కముతో కై న్తృవమతము గూడ కొరియాలో వ్యాపించెను. 'షూమియానిజము* అనునది కొరియా పజల (పాచీనమతము. పూర్వ చార్మితక యుగమునుండి ఈ మతము కొరియా (ప్రజల సాంస్కృతిక _ జీవితమందు (ప్రముఖమైన పాత వహించెను. అది యొక విధమెన (వకృ త్యారాధనము. మధ్య ఆసియా యందును, వైబీరియా యందును, గీన్‌లాండ్‌ నందును, అలాస్కా యందలి ఎస్కి మోలలోను ఇట్టి (వకృతి ఆరాధన ఈనాటికిని ఆచరణమునందు కలదు. కన్ఫ్యూషియన్‌ మతము [కీ.పూ. 1వ శతాద్దిలో చైనా నుండి కొరియాలో (పవేళ పెట్టబడినది. బౌద్ధ ముతో ఈ మతము పోటీపడి (క్రీ. ళ. 182 నాటికి కొరియాలో (పాబల్యము నొంది కొరియా (వభుత్వముచే గుర్తింపబడి నది. (క్రీశ. 1బి నుండి 14వ శతాబ్దము వరకును కొరియాలో 'బౌద్ధమతము అత్యున్నత దళ ననుభవించెను. జపాను పాలన ఫలితముగా దానికి అత్యధిక మైన బలముకూడ చేకూ శఅెను.

జపానీయులు 16వ శతాబ్ద ్యంతమున కొరియా వై దండయాత్ర సలిపిరి. జపాను శై9_న్తవుల (వవేళ ఫలిత ముగా కొరియాలో (పథమముగా వెం స్తవ మతము తలయె త్తెను. అనంతరము 1686 లో శాథాలిక్‌ మతా చార్యు లయిన వైనీయులు కొరియాలో అడుగిడిరి. పిమ్మట 1880 లో (గెంచి రోమన్‌ కాథొలిక్కులు (పవే శించిరి. ఈ విధముగా కొరియాలో వ్రై9న్తవ మతము (క్రమముగా వ్యాపించి బలపడెను. విదేశీయుల పాలనము నుండి విముక్తి చెందినను కొరియాలో నేటికిని (1957 లెక్కల (ప్రకారము) 2,000,000 మంది కై్రన్తవు లున్నారు. "చొండోక్యో” లేక 'టోంఘక్‌* అను మతము “షూామియానిజము” నుండియు, కన్ఫూ్యూషియను, బౌద్ధ, క్రైస్తవ మతములనుండియు "వెక్కు. సిద్ధాంత ములను


తనలో లీనమొనర్చుకోని పరిపుస్టి చెందెను. జపానీయులచే కొరియా యందు (పవేళ పెట్టబడిన “పింటో” "యను మతము కొరియా (వజలలో కోంత (పాబళ్యము సంపా దించినను, (క్రమముగా తణించి 1945 తరువాత అంత రించెను. పరా.సు.