సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొరవి వీరభద్రుడు

కొరవి వీరభద్రుడు :

తెలంగాణములోని పుణ్యక్షేత్రములలో - వరంగల్లు జిల్లాకుచెందిన మహబూబాబాదు (మానుకోట) తాలూకా లోని “కొరవి” మేటి యైనది. ఇది మహబూబాబాదునకు ఆరుమైళ్ళు దూరముననున్నది. ఇక్కడి జనాభా దాదాపు 5 వేల వరకుండును. ఇక్కడి దేవుడే వీరభద్రుడు. కొరవియను గ్రామము ప్రస్తుతము ఈ వీరభద్ర దేవా లయము మొదలుకొని తూర్పుగా వ్యాపించి యున్నది. పూర్వము ఈ గ్రామము దేవాలయము మొదలుకొని పశ్చిమదిశగా నుండి యుండెనట. కాని అది దగ్ధమయి పోవుటచే తూర్పుగా పెరిగినదని యందురు.

ప్రస్తుతము కొరవి యనునది గ్రామమే. కాని పూర్వ మది పెద్ద పట్టణముగా నుండెనని తెలియుచున్నది. ఈ ప్రాంతమంతయు ‘కొరవి దేశము'గా వ్యవహరింపబడు చుండెడిది. ఈ కొరవిదేశము కొరవి, గూడూరు శాసన ములలో పేర్కొనబడి యున్నది. తొమ్మిదవ శతాబ్ద ములో కొరవిదేశము వేంగీ సామ్రాజ్యభాగముగా నున్న ట్లును, అప్పుడు చాళుక్యభీమ విష్ణువర్ధనునితో (898- 918) “రణమర్దాన్వయ కులతిలకుడైన కుసుమాయుధుని పెద్ద కొడుకు అర్థరాజ్యంబు చేయుచున్నట్లు"ను కొరవి శాసనము తెలుపుచున్నది. విరియాల వంశజుడగు ఎఱ్ఱ నరేంద్రుడు బొట్ట బేత రాజు పక్షము వహించి, అతనిని కొరవి దేశమునకు ప్రభువుగా చేసినట్లును, తరువాత ఎఱ్ఱ భూపతి భార్య కామసానమ్మ బేతరాజును కాకతికి ప్రభువుగా చేసి నట్లును, పద్యమయమగు గూడూరు శాసనము తెలుపు చున్నది. ఈ బొట్ట బేతరాజు మొదటి బేతరాజుగా గను పడు చున్నాడు. మొదటి బేతరాజు కాలము క్రీ. శ. 975-1050 కాన ఈ శాసనము ఆంధ్ర మహాభారతము నకు పూర్వము పుట్టినదిగా భావింపవలెను. “కొరవి" పట్టణము రాజధానిగా నుండుటబట్టియే ఆ ప్రాంతమునకు కొరవిదేశమని పేరువచ్చియుండెను. కొరవి పట్టణనివాసులగు కొందరకు “కొరవి” అనునది గృహనామముగా ఏర్పడినది. కొరవి శాసనములో కొరవి నల్లజెజెయ, అతని కొడుకులు పెద్దన, భీముడు, గాణగయ్య అనువారినిగూర్చి ప్రశంసకలదు. పెద్దన కొరవిలో శిలా స్తంభము ప్రతిష్ఠించినట్లు ఆ శాసనము నందు గలదు. 'ద్వాత్రింశత్సాల భంజిక ' ను రచించిన కొరవి గోపనామాత్యుని ఇంటిపేరు ఈ గ్రామమును బట్టియే వచ్చియుండును. కొరవి పట్టణము తొమ్మిదవ శతాబ్దినుండి చారిత్రక ప్రసిద్ధి కలదిగా గనబడుచున్నది. కొరవి పట్టణమునుండి రాజధానిని కాక తిపురమునకు మార్చిన నాటినుండి కొరవి పట్టణ ప్రాధాన్యము క్షీణించినట్లు తేలుచున్నది. ఈశాసన ములలో ఎంతమాత్రమును వీరభద్రదేవుని ప్రసక్తి లేదు. వీరభద్ర ప్రసక్తి గల శాసన మొకటి యున్నది. కాకతీయ పురవరాధీశ్వరు డగు గణపతిదేవ చక్రవర్తి

ఖాన్సా హేబు గణపతిదేవ వేయించిన శాసన మది. వరంగల్లు జిల్లాలో తోట వద్ద అది యుండినది. దానిలో చక్రవర్తి సర్వధారి సంవత్సర శ్రావణ శుద్ధ పంచమీ యుక్త గురువారమునాడు శ్రీ వీరభద్రేశ్వర దేవరకు అంగరంగ వై భవముల నిమి త్తమయి, సరకులమీద తాను విధించిన సుంకమును అర్పణము గావించినట్లున్నది. ఆ శాసనములో నే సరకుల సుంకముల వివరములు యున్నవి. అయితే శాసనగత వీరభద్రుడే కొరవి వీర భద్రుడనుటకు ఆధార మందులో లేదు. కాని ఈ వీర భద్రునివలె సుప్రసిద్ధుడును, విశిష్టుడును అయిన మరొక వీరభద్రుడు ఎచ్చటను లేకపోవుటచే, ఈ వీరభద్రుడే శాసనగతు డయిన వీరభద్రుడని భావింపబడుచున్నది. మరియు ఈ వీరభద్రునే ఈ ప్రాంతములో కాకతీయుల నాటి వానినిగా భావించుచున్నారు. ఈ సందర్భమున ప్రస్తావింపబడతగిన విషయ మొకటి కలదు. ఇక్కడి వీరభద్ర దేవాలయమునకు వెనుక భాగ మునందు కొంచెము కుడిప్రక్కగా ప్రస్తుత మొక దిబ్బ యున్నది. దానిని ఇక్కడివారు 'త్రిశంకు దిబ్బ' లేక 'త్రిశంకు గద్దె' యని వ్యవహరింతురు. ఈ దిబ్బ చాళుక్య వంశములోని 'త్రిశంకు' డను రాజుయొక్క శిథిలమయిన దర్బారు గృహమని చెప్పుదురు. దీని కాధారముగా ఈ దిబ్బకు చుట్టు పూడిపోయిన ఒక పెద్ద పురాతనమైన ఇటికల గోడ యున్నది. మరియు ఈ దిబ్బ నానుకొని యున్న యొక కొండరాతిపై విఘ్నేశ్వర, దత్తాత్రేయ, శివ విగ్రహములును, మరి రెండు విగ్రహములును దాదాపు ఒక అడుగు వెడల్పు, మూడడుగుల పొడవుగల స్థలములో చెక్కబడి యున్నవి. (శివ విగ్రహముయొక్క వక్షము, ముఖము చెక్కి వేయబడి యున్నవి). వీటి చెక్కడము పురాతనత్వమునే సూచించు చున్నది. కాని త్రిశంకుడను వ్యక్తి చాళుక్యవంశములో గాని, ఆంధ్రచరిత్రలో గాని ఉన్నట్లు చరిత్రకు సంబంధించిన ఆధారములు కనిపించుట లేదు. అయి తే సందర్భ మిట్లయి యుండును. కార్తికేయుడు, గణపతి, వీరభద్రుడు మొదలయిన దేవతలు, శివాలయ ముతో అనుబంధము లేని ప్రత్యేక స్థలములం దుండెడి యాచారము లేదు. ఇక్కడ వీరభద్రాలయ మొక్కటే యుండవలెను. అదియుగాక ఈ యున్నది. ఇది యాచార విరుద్ధముగా కనిపించుచున్నది. కాన దీని కేంద్ర శివాలయము ఈ చుట్టుప్రక్కల నుండి ప్రక్కల శివ లింగములు పెక్కులు దొరకినవి. (ప్రస్తుతము వీరభద్రా లయములో గర్భాలయమునకు రెండు ప్రక్కల రెండు లింగములు చేర్చబడి యున్నవి.) ఈ విషయములను బట్టి ఈ త్రిశంకు దిబ్బ అనునది ఒక శివాలయమై యుండు నని తోచును. ఇక్కడి ఈశ్వరున కి పేరుండియుండవచ్చును. ఇక్కడ ఒక గాథయు నున్నది. పూర్వము వీరభద్రుడు ప్రాఙ్ముఖుడుగా నుండియుండెనట. ఒకసారి ఒక హరి జనుడు ఆ గుడిముందునకు రాగా, వీరభద్రుడు ప్రతీచీ ముఖుడై నాడట. ఈ గాథలో సత్య మెట్లున్నను, వీర భద్రుడు పూర్వము ప్రాఙ్ముఖుడుగను, ప్రస్తుతము ప్రతీచీ ముఖుడుగను ఉన్నట్లు విదితము. అనగా పూర్వము త్రిశంకుస్వామి కెదురుగా నున్న వీరభద్ర విగ్రహము తరువాతి కాలమున త్రిప్పివేయబడినట్లు తెలియుచున్నది. కావున ఆ త్రిశంకునిదిబ్బ శివుని ఆలయమునకు సంబంధించి యుండె ననియు, అనుబంధముగా ఈ వీరభద్రుడు, గ్రామ రక్షకుడుగ స్థాపింపబడి యుండెననియు భావింపబడు చున్నది. అయితే కాలక్రమమున శివాలయము మిక్కిలి శిథిలమై, దిబ్బగా నేర్పడగా వీరభద్ర భక్తులెవరో ఈ దేవునికి ప్రాముఖ్యము నిచ్చి ఈ ఆలయమును ఉన్నత స్థితికి తెచ్చియుందురు. ఈ దృష్టిని బలపరచు మరియొక విషయము కలదు. పూర్వము ప్రతి గ్రామములోను, వివిధ మతముల వారుండుటచే ఆ యా మతస్థులకు తగిన గుళ్ళు, గోపుర ములు ఉండెడివి. ఇక్కడకూడ నృసింహాలయ మొకటి అత్యంతము శిథిలమైనది కలదు. దీనిని యెనుములపల్లి పెద్దనయొక్క పూర్వు లెవరో నిర్మించినట్లు చిత్ర భారతము చెప్పుచున్నది. (ఈ ఆలయము లోని నృసింహస్వామి విగ్రహము మహబూబాబాదుకు తరలించబడినది.)అయి తే ఈ ఆలయమందు కాకతీయుల కాలపు శిల్పరీతి గోచరించు చున్నది. గర్భద్వారమున కిరుప్రక్కల సమర్పబడిన వరంధ్రక శిలా ఫలకమునందు, వరంగల్లు నందలి వేయి స్తంభాల గుడిలోని ఫలక చ్ఛాయలున్నవి. ఈ యాలయము కామప్పలోని చిన్ని చిన్ని గుళ్ళను పోలియున్నది. శిల్ప

కృత్యమంతయు నల్ల రాతిపైననే చేయబడి యున్నది. ప్రస్తుతము ఈ ఆలయము దాదాపు మూడడుగులు భూమిలోనికి కృంగియున్నది. దీనిని బట్టి చూడగా అంత ప్రాచీనుడయిన వీరభద్రస్వామి ఆలయమందును శిల్ప మావిధముగ నే ప్రాచీనమై యుండి యుండవలసినది. కాని వీరభద్ర విగ్రహమం వీరభద్ర విగ్రహమందు తప్ప ఆనాటి శిల్పమీ యాలయ మున మచ్చునకుగూడ కానరాదు. అనగా ప్రస్తుతమున్న యాలయ మర్వాచీన మైనదని తేలుచున్నది. కాగా ఇది అనుబంధాలయమే కానీ, దీనియందంత ప్రాచీన మైన శిల్పరచన లేక యొక గర్భగుడి మాత్రమే ఆనాడు నిర్మితమైనదై యుండవచ్చును. అయితే శివాలయమని భావింపబడుచున్న ఆత్రిశంకుస్వామి ఆలయనిర్మాణములో కొంత విశిష్టత యున్నదనవలెను. ఎందుకనగా అందు ఇటికల గోడలు కన్పించుచున్నవి. ఇచ్చటి ఇటికల నిర్మాణ పద్ధతి రామప్పలోను, మరికొన్ని స్థలములలోను అనుస రింపబడిన ఇటికల నిర్మాణ విధానమునకు చెందియున్నది. అట్లుకాక ఈ దిబ్బలో శిలాకుడ్యము లేవయిన నున్న వేమో తెలియదు. ఇక్కడ ధన ని శేపములున్నవనెడి ప్రథయు కలదు. సామాన్యముగా పూర్వులు ఆలయములందు ధనములు నిక్షేపించెడి వారు.

ఇక్కడి వీరభద్రుని రూపము భయంకరమైనది. ఎనిమిది చేతులతో, వివిధాస్త్ర శస్త్రములతో ఇతని మూర్తి అలంకృత మైయున్నది. కాకతీయులకు పూర్వము శివ, విష్ణు, సూర్య, గణపతి పూజలే విరివిగా నుండినవి. కాని కాకతీయుల నాటికి కాకతమ్మ, ఏక వీర, మైలారు దేవుడు మున్నగు అనుబంధ దేవతల పూజ అధిక మైనది. ఆ కాలమున నే వీరభద్ర పూజయు విజృంభించియుండును. బలమునకును, శౌర్యమునకును వీరభద్రుడు పెట్టిన పేరు. ఆ కాలము నుండియే వీరశైవుల యొక్క వీరావేశ సూచకమయిన 'వీరభద్ర పళ్ళెము' లేర్పడియుండును. శివుడు భయంకరుడు గాడు. సౌమ్యుడు, సుందరుడు, శుభంకరుడు. వీరభద్రుడు మాత్ర మట్లు కాదు. తాంత్రి కులకు, శాక్తేయులకు మాత్రమే వీరభద్రుడు అభయం కరుడు. అదిగాక వీరశబ్ద వాచ్యులు మరుత్తులు; వారే రుద్రులు కూడ. వీరభద్ర అనుదాని యందు 'భద్ర' అను పదము మంగళత్వమునే సూచించుచున్నను, తాంత్రికుల యొక్క, ఇా_క్తేయుల యొక్క ద్వారమున (ప్రచారము నందిన వీరభద్రుడు భయంకరమూ ర్షిగానే లభ్యుడగు చున్నాడు. అయితే, శివున కగ్ని సంబంధము చెప్పబడి యున్నది. తదంళ సంభూతుడయిన వీరభ దునికిని అగ్ని సంబంధ ముండును. అతడు 'రెదుడు కూడాను. అందు కనియే వీ రిద్దరి యునికి వల్లనే ఈ స్థలమునకు అగ్నిరూప మయిన 'కొరవి* యని పేరు వచ్చినట్లు భావింపబడు చున్నది. (ఒకప్పుడు దగ్ధమయినది కూడ. (వ్రస్తుత కు [గామము (పభుత్వ వ్యవహారములలోను మరికొన్ని వ్యవ వోరములలోను 'కురవి" యని యున్నను, శాసనములందు మాతము *'కొరవి* యనియే పేర్కొనబడినది.)

వీరభ్మదు డసలు [బవ్మాచారి. అతనికి. "దేవి లేదు. మొదట ఇక్కడి పూజారులు (బవ్మాచారు లై యుండిరి. కాని మధ్య కాలమున ఎక్కడినుండి యో ఒక భ[దకాళి 'యొక్క_. విగ్రవా మెవరిచేతనో కొనిరాబడ్‌ ఇక్కడ (పతిస్టితమయినది. (విిగవామునందు [పాచీనత్వము కాన ఠాదు.) నిజమునకు భదకాళి శక్సి కాదు. శ క్రియొక్క యంళము మ్మాతమే. అయితే వీరభ(దుడు, భదకాళి అను పదములయందు “భద వద సామ్యమునుఐట్టి వీరిద్దరికి భార్యాభ_ర్హృత్వ సంబంధము కల్పింపబడి యుండును. (ఇద్దరును అంళమా తులేగదా) ఈ భార్యా భ_ర్త్భత్వ సంబంధ మేర్పడినప్పటినుండి [బహ్మచారులు తప్పుకొనగా, గృవాన్టులే పూజారులయినారు,

మొదట ఈ యాలయముయొక్క పళ్చిమ ముఖముగా నుంజనట. కాని ఆలయద్వారము (గ్రామమున "కెదురుగా (వ్రన్తుత (గ్రామము కాదు, పూర్వము దగ్ధమైన [గామము) నుండుట మంచిదికాదను కొందరి ఆలోచన చొప్పున మహబూభబాబాదు నివాసి యగు శీ ఆళ్లపాటి ముత్తయ్యగారు పూర్వపుదానిని మార్చి ఉత్తర ముఖముగా సింహద్వారమును (నృసింవో లయ సింహద్వారమున కెదురుగా) నిర్మించినారట. ఈ ద్వారము వై గోపుర మాం పాంతమందువలె తికల శకమే గాని, తెలంగాణమందలి గోపురముల మాదిరిగా పక కలళ పరిళోభితము కాదు. దాదాపు తెలంగాణ మందంతటను ఏక కలళక గోపురములే కనబడుచున్నవి. ఈ నింహద్వారము దాదాపు శతాబ్ది పూర్వకాలిక మై

సింహద్వారము


యున్నట్లు చెప్పుదురు. ఆలయములోని క భ్యాణమండ పముగూడ అఆకాలమునకు ఛెందినదిగానే కనబడును. ఆ మండపమున శెదురుగ దాదాపు . పదునాలుగు అడు గుల ఎత్తయిన యొజ్ఞరాతి దీపస్తంభ మొకటి యున్నది. దీని నిర్మ్శాణమందు [పాచీనత్వమున్నది. ఆలయములో వీరభదుని కెదురుగా మూడు నందులున్నవి. కాని వాటి నిర్మాణ శిల్పమందు (పాచీనత్వము కనరాదు. గర్భా లయము నంటుకొనియున్న మండపము నందును అంతే."

ఈ యాలయములోని యం[తము అత్యంత ళ క్తిమంత మయినదట. అందుచేత అక్కడికి వచ్చిన భక్తు లా వేశితు లయి, తమ యొక్కయు, ఇతరుల యొక్కయు వోవము లను వెలిగక్కెడివారట. దానివలన అనేకములయిన సాంసారిక, సొంఘిక [పమాదము లేర్పజెడివట. అందు కని ఈ (పాంతీయుల యభ్యర్థన వై ఆంధ [(పాంతీయు లును, తాం్యతికులు నయిన (శీ ముదిగొండ కోటయ్య అను మవహానీయులు వచ్చి, ఆ యం[తముయొక్క తీవ తను తగ్గించి, దానిని సాధువుగా నొనరించినారట. అప్పటి నుండి పూర్వపు (పమాదములన్నియు చారింపబడి భక్తుల కోరికలు నెర వేరుటమాత మే జరుగుచున్నదట.

ఈ దేవాలయమునకు ధర్మకర్త అనువారు ఎవ్వరును లేరు. ఈ (ప్రాంతపు దేశముఖులుగూడ దీని విషయమున (పత్యేక శద్ధ వహించినట్లు కనిపించదు. ఈ ఆలయమునకు ఈనాముగా దాదాపు మూజడెకరముల పరిమితిగల 'తరి" భూమియు, మెట్టపొలమును ఉన్నట్లు తెలియుచున్నది. భూమికి సంబంధించిన కొన్ని పూజారుల తగాదాలవల్లి చాలకాలము కిత మే ఆ భూమి వీరభ్నదుని జ్ష్య్యాన్తి పట్టా అయిపోయినది. దానిమీది ఆదాయమును, బేవాలయము నందు వచ్చు నాదాయమును, పూజారులు తమ నిమి _త్తము, ఆలయము నిమి త్తము వ్యయ మొనరించుచుండిరి. 1950 వ సంవత్సరము వరకును ఇట్టి వద్దతియే అమలులో నుం జను.

1951 వ సంవత్సరమున [(పభుత్వానుమతితో దేవా లయ నిర్వహణము కొరకు 'కమిటే యొకటి పశ్చాటు చేయబడినది. దానికి అ ధ్యమలుగా స్టానికు లయిన తహసీలుదారుగా రుండునట్టును, (పజల పతమున ఐదు గురు సభ్యు లుండునట్లును నిర్ణయమయినది. ఆ ఐదు గురిలో నొకరు కార్యదర్శిగా నెన్నుకొనబడుదురు. దేవాలయమునకు చెందిన సర్వవిషయములను ఈకమి టీయే నిర్వహించుచున్నది. వచ్చిన ఆదాయములో మూడింట నొకవంతు పూజారులు కీయబడును. వ్యయ మంతయు కాగా మిగిలిన ధనము కమిటీ స్వాధీనములో నుండును. ఇట్టి ధనముతో క్రొత్తగదులు, దేవాలయము ముందున్న కో నేరు బావికి రాతికట్టడము, యాత్రార్థమై వచ్చిన స్త్రీలకు స్నానార్థము మరుగుగా నుండుటకు గదికివలె నిలువెత్తు గోడలు, వాటిమధ్య విశాలమయిన 'హవుజు' (తొట్టి) మొదలయినవి కట్టబడినవి. అద్దాల మండపనిర్మాణము, దేవాలయావరణ విస్తరణము, ముందు ముందొక సంస్కృత పాఠశాల నిర్మాణము, గ్రంథాలయ నిర్మితి మొదలయిన ప్రజోపయోగకరమైన కార్యములను చేయుతలంపు ఈ కమిటీవారికి కలదు.

ఇక్కడ శివరాత్రి మొదలుకొని వారమురోజులవరకు జాతర యొకటి జరుగును. కళ్యాణోత్సవములు, ఇతరోత్స వములు ఉగాదిదాక సాగుచునే యుండును. ఈ వీరభద్ర స్వామివద్దకు ఎక్కువగా రోగములుపోగొట్టుకొనుట కొర కును, సంతానము పొందుటకొరకును యాత్రికులు వచ్చు చుందురు. ఈ కోర్కెలుగల స్త్రీలు, పురుషులు స్నానము చేసి, దేవాలయమునందలి ధ్వజస్తంభమునకు ముంగిట ప్రాణాచారములు పడియుందురు. ఇది నిత్యకృత్యము. భక్తులకు స్వప్నదర్శనమువలన కాని, ఆవేశితులయిన వారి వలన కాని, స్వామి ఆజ్ఞ లభించును. ఆజ్ఞ లభించు వరకు భక్తులు తమ తమ ఇండ్లకు వెళ్ళు నాచారము లేదు.

జాతర దినములలో ఆదాయము ఎనిమిది వేలకు తక్కువ కాకుండ నుండును. ఈ ఆదాయము వస్తురూప మున, పశురూపమున, ధనరూపమునకూడ నుండును. దేవునికి మ్రొక్కుల రూపమున కోడె లెక్కువగా లభిం చుట ఇక్కడి ప్రత్యేకత. సంతానము పొందిన వారును, దేవునికి విశేషముగా కోడెలను సమర్పింతురు. కోడెలను విక్రయించుటచే వచ్చిన ధనము, 'డబ్బీ'లో పడు ధనము, హారతి పళ్ళెములో లభించుధనము చేరి పైని పేర్కొన బడిన ఆదాయము ఏర్పడుచున్నది. ఇతర దినములలో భక్తుల వలనను, ఏటేటా భూములమీదను వచ్చు ఆదా యము దాదాపు నాలుగైదువేల రూప్యముల పరిమితి కలదిగా నున్నది. అనగా సాలునకు ఈ దేవాలయాదా యము పన్నెండువేలనుండి పదిహేనువేల పరిమితిగలదై యుండును.

జాతరజరుగు దినములలో సువిశాలములును, సుదీర్ఘ ములును అయిన పందిళ్ళు వేయబడును. యాత్రికుల కొరకు కొన్ని దడులు, చలివేంద్రలును కూర్చబడును. దేవాలయమునకు ముందున్న విశాలమయిన మైదానము జాతర జరుగు సమయమున బండ్లతో నిండియుండును. ప్రకృతి సిద్ధమైన పందిళ్ళవలె పెద్ద పెద్ద వృక్షములు గూడ అచట నున్నవి. దేవాలయము మొదలుకొని దాదాపు రెండు మూడు ఫర్లాంగుల దూరమువరకు దారికి ఇరువై పులను వివిధములైన 'దుకాణములు' వ్యాపించి యుండును. కొండపల్లి నుండియు, తదితర ప్రదేశములనుండియు బొమ్మలసామగ్రి ప్రచురముగా ఇచ్చటికి దిగుమతి యగును. ఆలయమునకు కొద్ది దూరముననే ఉన్న పెద్ద చెరువు యాత్రీకుల స్నానపానములకు నీటి సమృద్ధిని కల్పించుచున్నది. తియ్యని నీటి బావులు గూడ చుట్టుప్రక్కల నున్నవి. జాతర జరుగునాడు రథో త్సవము జరుగును. ఆనాడు కొరవియంతయు జన సము దాయముతో పిక్కటిల్లిపోవును. ఆనాటి జనసంఖ్య పది వేలకు మించును. జాతరలలో రథోత్సవమునాడే అధికా దాయము లభించును. ప్రభలు కూడ ఇక్కడకు విరివిగా వచ్చును. జాతరలు జరుగునపుడు హరికథలు, బుఱ్ఱ కథలు మొదలయిన వినోదక్రియలు సాగుచుండును. కవి సమ్మేళనాది సాహిత్య సమావేశములును సాగును. ఈ జాతర జరుగు కాలమున మహబూబాబాదునుండి బస్సులు అధికముగా నడుపబడును. బండ్ల సందడికూడ అపరిమితముగనుండును. మహబూబాబాదులోని జనులెల్ల జాతర దినములలో కొరవిలోనే వసింతురు. ఇంత భవ్య మైన జాతర తెలంగాణములో మరెక్కడను జరుగదు. ఈ ఆలయాదాయ మింకను ముందు ముందు పెరిగి నచో తిరుపతివలె ఇదికూడా ఒక విద్యాపోషక సంస్థగా మారగలదని తోచును.

కె. సం. ఆ.