సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు

కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు :

కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారి వంశమునకు మూలపురుషుడు కొమఱ్ఱాజు అను పేరుగల ఒక మహా శయుడు. ఈతని పేరే ఇంటి పేరుగా మారిపోయినది. ఈ కొమఱ్ఱాజు జు అను ఆయన క్రీ. శ. 1530 వ సంవత్స రమున కృష్ణాజిల్లా నందిగామ తాలూకా ప్రోలు నివాసులుగా నుండిరి. పెనుగంచి

కొమఱ్ఱాజు వంశములో ఎనిమిదవ తరుమువా రగు నారాయణగారు చాలకాలము వరకు సంతతి లేనివా రగుటచే, శ్రీశైలమునకు మూడుసారులు ప్రద క్షిణములు చేసి, శైవమతమును స్వీకరించి లింగధారు సంగ్రహ ఆంధ్ర లయిరి. వేంకటనారాయణగారు పంచపాండవులవంటి అయిదుగురు కొడుకులకు జనకు లైరి. వారి నాలుగవ కుమారుడు రాజన్న. రాజన్న కుమారుడు లక్ష్మారాయడు. లక్ష్మారాయని కుమారుడు వేంకటప్పయ్య. వేంకటప్పయ్య కుమారుడు యీ వ్యాస నాయకుడు లక్ష్మణరావుగారు. ఈ విధముగా కొమఱ్ఱాజు వంశములో లక్ష్మణరావుగారు పండ్రెండవ తరమువా రగుచున్నారు. వీరు ఆరు వేల నియోగిశాఖా బ్రాహ్మణులు.

లక్ష్మణరావుగారి తండ్రియైన వేంకటప్పయ్యగారిది పెనుగంచిప్రోలు గ్రామకరిణికములలో (కొమఱ్ఱాజు, కొమరగిరి, పర్చావారలకు) ఒక కరణికము కలదు. వేంకటప్పయ్యగారికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య యగు గంగమాంబా గర్భమున ఒక కుమారుడును, ఒక కుమార్తెయు జనించిరి. ఆ కుమారుడే లక్ష్మణరావు గారు. ఆ కుమా ర్తెయే భండారు అచ్చమాంబ.

లక్ష్మణరావుగారు ధాత సంవత్సరమునందు, వైశాఖ బహుళ నవమి గురువారమునాడు అనగా క్రీ. శ. 1876 మే నెల, 18 వ తేదియందు జనన మొందిరి. చిన్నతనము ననే పితృపాదులు కైలాసవాసులయి యుండుటచే లక్ష్మణరావుగారు తమ మేనమామయు, అచ్చమాంబ యొక్క భర్తయు నయిన భండారు మాధవరావుగారి పోషణలో నుండిరి. మాధవరావుగారు నాగపూరులో పి. డబ్ల్యు. డి. లో ఇంజనీరుగా నుండిరి. అందుచే లక్ష్మణ రావుగారి బాల్యము మహారాష్ట్రములో గడచెను. పునహా, నాగపూరు కళాశాలల యందు విద్యా బుద్ధులను వీరు గడించిరి. వీరి విద్యా వ్యాసంగమంతయు మహారాష్ట్ర భాషయందే జరిగినది.

మహారాష్ట్ర దేశమునందున్న కాలములో మహారాష్ట్ర భాషయందే విద్యా వివాదములు లక్ష్మణరావుగారు సలిపి యుండిరి. మరాటి పత్రికలకు వ్యాసములు వ్రాయు చుండెడివారు. మరాటిభాషలో కవిత్వము గూడ చెప్పి నారు. ప్రాచీన మహారాష్ట్ర కవిపుంగవుడైన మోరో పంతు రచించిన భారత కావ్యమును పరిశోధించి, సరిదిద్ది, శుద్ధప్రతిని సిద్ధముచేసి ప్రకటించిరి. మొట్టమొదట వీరు సంపాదక పదవి వహించినది ఈ భారత కావ్యమును ప్రకటించు సందర్భముననే.

రామాయణము నందలి పర్ణశాల యనునది ఎచ్చట నున్నది? అను విషయములో మహారాష్ట్ర పత్రికలలో వాదోపవాదములు చెలరేగెను. మహారాష్ట్రములోని నాసి కాత్ర్యంబక మే పర్ణ శాలయని మహారాష్ట్రుల వాదము. ఈ వాదమునందు బాలగంగాధర తిలకు మొదలగు పండిత ప్రకాండులను ఢీకొన్న సాహసికుడు లక్ష్మణరాయడు. భద్రాచలమునొద్ద నున్న పర్ణశాలయే రామాయణము నందు వర్ణితమైన పర్ణశాల యని తర్కబద్ధముగ, సోదా హరణముగ నిరూపించి మహా రాష్ట్ర విద్వాంసులను దిగ్భ్రామ గొల్పిన ప్రతిభాశాలి లక్ష్మణ రాయడు. మహారాష్ట్ర భాష ద ఈ య సాహిత్య వ్యవసాయము అపారమని తెలియుచున్నది. ఇప్పటికిని లక్ష్మణ రాయని ప్రేమ గౌరవములతో మహా రాష్ట్ర విద్వాంసులు స్మరించు చుందురు. ఈనాటికి కూడ

చుండువారు. శ్రీ రాయసం వేంకటశివుడుగారు ప్రచు రించుచుండిన “జనానా పత్రిక"కు "విశ్వముయొక్క విరాట్ స్వరూపము", "విశ్వముయొక్క బాల స్వరూ పము" - ఇత్యాది ఘన విషయములను గూర్చి లక్ష్మణ రావుగారు వ్యాసములు వ్రాసి యున్నారు. అంతియేగాదు. లక్ష్మణరావుగారును, అచ్చమాంబయు ఆంధ్రభాషలో ప్రప్రథమమున గ్రంథ రచనకు కూడ కడగిరి. అచ్చమాంబగారు “అబలా సచ్చరిత్రమాల" అను ఉద్గ్రంథమును లక్ష్మణరావుగారు “శివాజీ చరిత్ర" మను గ్రంథ రాజ రచించిరి. మును రచించిరి. చిత్రము - 16

మహారాష్ట్ర వాఙ్మయ సం స్కృ తిలో లక్ష్మణ రావుగారికి అత్యున్నతస్థాన మున్నది. లక్ష్మణరాయడు మహా రాష్ట్రమం దున్నంత కాలము మాతృభాష యగు ఆంధ్ర భాషను విస్మరించెనని తలచ కూడదు. వీరును, వీరి అక్కగారగు భండారు అచ్చ మాంబగారును ఆంధ్రభారతిని తమ ఇంట నెలకొల్పి ఆరాధించుచునే యుండిరి. వీరిద్దరకు గల ఆంధ్ర భాషా భిమానము ఆ కాలములో పెక్కుమందికి మృగ్యమై యుండెను. పరభాషా ప్రాంతములలో నుండిన నేమి? మాతృభాష యెడ ఎట్టి అపచారమును లక్ష్మణరావు గారును, అచ్చమాంబయు సహించెడివారు కారు. కావున రిద్దరును ఆంధ్ర భాషలో విశేష విజ్ఞానమును గడింప సాగిరి. ఆంధ్ర దేశములోని ఆంధ్ర పత్రికలకు లక్ష్మణరావు గారును, అచ్చమాంబగారును వ్యాసములు వ్రాయు

చరిత్రగ్రంథ పీఠిక లో మొదటి నాలుగు పంక్తులలో పంతులుగారు తమ అభీష్ట మును ఇట్లు సూచించి యున్నారు: ఆంధ్ర భాషయందు చరిత్ర గ్రంథంబు లత్యల్ప ముగా నున్నవి. కాన చేత నైనంతవరకు మాతృభాషా సేవ చేయ వలయు నని యిచ్ఛ గలవాడను" అని మున “ఇట్లు ఆంధ్ర భాషా యిచ్ఛతో నీ చరిత్రగ్రంథంబు వ్రాసినాడ. శక్తివంచన లేక యిక ముందును ని భాషా సేవ చేయవలయునని వ్రాయుటయేగాక పీఠికాంత సేవకుడు, గ్రంథకర్త" అని సంతకము చేసి యున్నారు. ఈ ఆదర్శమును అక్షరాలా క్రియాపూర్వకముగ నెర వేర్చి జీవితపు తుది నిమిషము వరకును ఆచరణములో పెట్టిన ధన్యజీవి లక్ష్మణరావు గారు. అయితే ఈ సత్సంకల్పము లక్ష్మణరావుగారికి నాగపూరులో విద్యార్థిగా బి. ఏ. పరీక్షకో, ఎం. ఏ. పరీక్షకో చదువుకొనుచున్న రోజులలోనే ఏర్పడినది. అప్పటికే అధికారవాంఛ, ఐహిక భోగములు ఆదర్శ ములుగా పెట్టుకొని ఆకాశ హర్మ్యములను మానస వీథిని నిర్మించుకొనుచు ఉవ్విళ్ళూరు చిత్తవృత్తి లక్ష్మణ రావు గారికి లేకుండెను. మహారాష్ట్ర దేశమున విద్యాసంపాదన కృషి పూర్తి యయి, ఎం. ఏ. పరీక్షయందు కృతార్థులయినతోడ నే లక్ష్మణరావుగారు తమ కార్యరంగమును ఆంధ్రదేశము నకు మార్చిరి. కృష్ణా జిల్లాలోని మునగాల జమీందారికి లక్ష్మణరావు గారి జనకులగు వేంకటప్పయ్యగారు దివానుగానుండి కార్యదక్షతతో జమీందారీ వ్యవహారములను నిర్వహించి యుండిరి. తండ్రిగారి మరణానంతరము కొంత కాలము నకు లక్ష్మణరావుగారు తమ కార్యరంగమును మహా రాష్ట్రమునుండి ఆంధ్ర దేశమునకు మార్చినప్పుడు మున గాల పరగణా జమీందారులగు రాజా నాయని రాజా వేంకటరంగారావు బహద్దరు వారు శ్రీ లక్ష్మణరావు గారిని ఆహ్వానించి తమ సంస్థానమునకు దివానుగా నియ మించుకొనిరి. రాజు వివేకశాలి; నూత్న భావ సమన్వి తుడు. మంత్రి విద్యాధికుడు; నూత్నవిజ్ఞాన శోభితుడు. వీరిద్దరును రాజు, మంత్రివలె గాక కృష్ణుడు, అర్జునుడు వలె గాఢమైన మైత్రి కలవారుగా నుండిరి. వారు లక్ష్మణరావుగారి ఆంధ్ర వాఙ్మయ వికాసోద్య మమునకు సంబంధించిన ప్రయత్నారంభములకు విశ్రాంతి స్వేచ్ఛల నొసగుట యేగాక మానసిక ముగను, ఆర్థికము గను సంపూర్ణమైన సహకార మొనర్చిరి. లక్ష్మణ రావు సాహచర్యమున శ్రీ రాజావారు ఆంధ్ర భోజుడుగా వర్తించి కీ ర్తిసముద్రులై 8. శ్రీ రాజావారికిని లక్ష్మణ రావు గారికిని నిజాం రాష్ట్రము లోని తెలంగాణముతో పెక్కు సంబంధము లుండెను. హైదరాబాదునకు వచ్చినపుడు వీరిద్దరికిని శ్రీ రావిచెట్టు రంగారావుగారితో పరిచయము కలిగెను. ఈ త్రిమూర్తు లును తెలంగాణములోని ఆంధ్ర భాషాస్థితిని బాగుపరచు టకు మంతనములు సలిపిరి. తత్ఫలితముగా శ్రీకృష్ణ దేవరా యాంధ్రభాషా నిలయము హైదరాబాదులో 1_9_1901 లో స్థాపితమయ్యెను. అఖిలాంధ్ర దేశములో అధునాతన పద్దతులమీద స్థాపితమయిన మొట్టమొదటి ప్రజా గ్రంధాలయ మిదియే. ఈ గ్రంథాలయ స్థాపనకు స్ఫూర్తి నిచ్చినవారు లక్ష్మణరావుగారు ; ధనమునిచ్చిన

వారు శ్రీ రాజావారు; కార్య నిర్వాహకులు శ్రీ రావి చెట్టు రంగారావుగారు. శ్రీ లక్ష్మణరావుగారు ఆంధ్ర దేశ మందు అడుగిడగనే మొట్టమొదట చేసిన మహాకార్య మీ ఆంధ్ర భాషా నిలయ స్థాపనమే. ఈ ఆంధ్ర భాషా నిలయము ఈ అరువది సంవత్సరములలో క్రమాభివృద్ధి చెంది దివ్యమై, తేజోవంతమై ప్రఖ్యాతి కెక్కియున్నది. తెలంగాణము నందలి ఆంధ్రులకు కనువిప్పు చేసి విజ్ఞానభిక్ష పెట్టి మహోద్యమములకు దారి తీసినది. ఇప్పటికిని ఈ ఆంధ్ర భాషానిలయము ఆంధ్ర భారతికి ప్రధాన నర్తనశాలగా ప్రకాశించుచున్నది. ఆంధ్రభాషా నిలయ స్థాపనతో తృప్తిపడక లక్ష్మణ రావుగారు విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను కూడ హైద్రా బాదునందే ప్రారంభించిరి (1905). తరువాత హైద రాబాదులోని రాజకీయ పరిస్థితుల మూలమున మద్రాసు నకు మార్చిరి (1908). ఈ తొలి రెండు సంస్థలు చేసిన ఆంధ్రభాషా ప్రచారము నిరుపమానమైనట్టిది. లక్ష్మణ రావుగారి దూరదృష్టి ఎంత గొప్పదో చూడుడు ! ఆంధ్రులకు ఆంధ్ర బాషలో రచనా కౌశల్యము లేదను భ్రాంతిని, నిస్పృహను లక్ష్మణరావుగారు పటాపంచలు చేయ సమకట్టిరి. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను స్థాపిం చిరి. గ్రంథక ర్తలను సృష్టించిరి. ఆంగ్లేయ భాషా కోవిదు లకు ధైర్యము కల్పించిరి. గ్రంథరచనలు చేయసాగిరి. దేశ చరిత్రములు, జీవిత చరిత్రలు, పదార్థ విజ్ఞాన శాస్త్రము, రసాయనశాస్త్రము, అర్థశాస్త్రము, జంతు శాస్త్రము, భూగర్భ శాస్త్రము మున్నగు వాటిపై అపూర్వ గ్రంథములు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల యందు వెలువడెను. శ్రీ లక్ష్మణరావు గారికి ఆంగ్ల విద్యా వ్యాసంగ సంద ర్భమున “త త్త్వ శాస్త్రము” పరీక్షా విషయముగా ఉండి యున్నను, వీరికి అభిమాన విషయముమాత్రము చరిత్రయే. వీరు మొట్టమొదట 'శివాజీ చరిత్రము' ను రచించి ఆ మహారాష్ట్ర వీరునకు జోహారు లర్పించిరి. విజ్ఞానచంద్రికా గ్రంథమాలలో హిందూ మహాయుగము, మహమ్మదీయ మహాయుగము అను రెండు చరిత్ర గ్రంథములను రచిం చిరి. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలకు సంపాదకు లగుటచే అందు ప్రచురితమయిన ప్రకృతిశాస్త్రముల యందును, చంద్రగుప్త చరిత్రము నందును, విమలా దేవి అను నవల యందును శ్రీవారి లేఖనీ విన్యాసము ఎంతయో కల దనుట స్పష్టము. శ్రీ రొక జంగమ విజ్ఞాన సర్వమనుట సహ జోక్తియే. వీరికి తెలియని విజ్ఞాన విషయము ఏదియైన నున్నదా యని తర్కించినప్పుడు 'లేదు' అని గట్టిగా చెప్ప వచ్చును. శ్రీవారికి ప్రకృతిశాస్త్ర విషయములు, అర్థ శాస్త్ర విషయములు, భాషా కావ్యాలంకార విషయ ములు, లలితకళా విషయములు, చారిత్రక విషయములు మున్నగు నూరారు విజ్ఞానశాఖా విషయములలో కూలం కష ప్రజ్ఞ కలదు. అట్టి విషయములను గూర్చి నిర్దుష్టము గను, సాధికారముగను, సులలితముగను లక్ష్మణరావు గారు వ్రాయగలవారనుటకు ఆంధ్ర భాషా ప్రపంచమందు వారి పెక్కు రచనలే దృష్టాంతములు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో వీరేశలింగం పంతులుగారి స్వీయచరి త్రయు, చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రయు వెలువడుటకు శ్రీ లక్ష్మణరావుగారి ప్రభావమే ముఖ్య కారణము. శ్రీవారి సౌజన్యము, పరోపకారశీలము, ఆలోచనాసంపత్తి చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రయొక్క ఆవిర్భావమునకు ప్రధాన హేతువు లయ్యెను. ఇంతటి మేధావియొక్క సేవాసౌభాగ్యమును కోల్పోవుటచే విజ్ఞానచంద్రిక క్షీణించి క్షీణించి అంత రించినది. Q విజ్ఞానమును వెదజల్లుట కై 1910వ సంవత్సరము నందు విజ్ఞాన చంద్రికా పరిషత్తును ఏర్పాటు చేసిరి. ఈ పరిషత్సంఘపక్షమున, సాహిత్యములో, చరిత్రములో ప్రకృతిశాస్త్రములో పోటీ పరీక్షలు పెట్టి బహుమతు లిచ్చుచుండిరి. లక్ష్మణరావుగారికి గల విజ్ఞానభాండారము అపార మైనది. ఆ భాండారములోని విజ్ఞానమును ఆంధ్ర జను లకు పంచి పెట్టవలయునను ఆకాంక్ష మెండుగా నుండెను. విజ్ఞాన చంద్రికారంగము శ్రీ వారికి తగినంత వ్యాసంగము నిచ్చుట లేదు. కావున వీరు “ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ” రచనోద్యమమునకు ఉపక్రమించిరి. ఇది కడుంగడు సాహసోద్యమము. ఇది వీరి అపూర్వ రచనా విధాన సంధానమునకును, సర్వంకష ప్రజ్ఞాపాటవ ప్రకటనము

నకును గీటురాయి. అకారాదిగ విషయ నిర్ణయముచేసి నెలకు నూరు పుటల చొప్పున ప్రకటింపసాగిరి. సుమారు రెండువేల పుటల పరిమితిగల మూడు సంపుటములు ప్రకటితము అయినవి. ఈ మూడు సంపుటములలో సుమారు 1000 వ్యాసరాజములు కూర్పబడినవి. ఒక్క అను అక్షరము మాత్రమే పూర్తి అయినది. 99 లక్ష్మణ రావుగారి రచనలు ఆంధ్రవిజ్ఞానసర్వస్వము నందలి మూడు సంపుటములలో 35 కలవు. ఇందు భాషా విషయక ములు 11, గణితవిషయకములు 2, ధర్మశాస్త్ర విషయకములు 9. జ్యోతిశ్శాస్త్ర విషయకము 1, చరిత్ర 9, విషయకములు 7, ప్రకృతిశాస్త్ర విషయకములు 2, కళా విషయకము 1, రాజకీయశాస్త్ర విషయకము 1, తర్కశాస్త్ర విషయకము 1, ఈ 35 వ్యాసముల పరిమితి విజ్ఞానచంద్రికా గ్రంథముల రూపములో, 2500 పుట లగును. కొన్ని వ్యాసమంజరులుగను, కొన్ని ప్రత్యేక గ్రంథములుగను, విడివిడిగా ప్రకటించి ఆంధ్రభాషలో చిరస్థాయులుగాను నిలుపదగిన యోగ్యత కలిగి ఉన్నవి. వీ రప్పుడప్పుడు పత్రికలకు వ్రాసిన వ్యాసములలో కొన్ని “లక్ష్మణరాయ వ్యాసావళి" అను పేర గ్రంథరూపమును దాల్చి యున్నవి. వీరి రచనల నన్నింటిని పది సంపుటము లలో కూర్పనగును. ఆంధ్రభాషకు అలం కారముగా నుండు వాఙ్మయ మిది. పరిశోధన కార్యము నందు లక్ష్మణరావుగారు ప్రజ్ఞా నిధులని నుడువుటకు ఎంత మాత్రము సందేహము లేదు. ఇది ఆంధ్రులు, ఆంధేతరులు అంగీకరించిన విషయము. చారిత్రక పరిశోధనము నందు శ్రీవారు ఆరితేరిన వారు. పురాతన శాసనములను చదువుట, అందలి అంశములను చర్చించుట, పరస్పర విరుద్దాంశములను సమన్వయించుట లక్ష్మణరావుగారికి వెన్నతో బెట్టిన విద్యయా అనిపించును. శ్రీవారు చేసిన నిర్ణయములను చరిత్ర పరిశోధకులు ప్రమాణముగా అంగీకరించి ఉదాహరించు చున్నారు. తమకు తెలిసిన అంశములను బహిరంగ పరచుట వీరిలో గల విశిష్ట గుణము. సత్యాన్వేషణము చేయుటయు, సత్య మును దాచకుండుటయు, శ్రీవారి పరిశ్రమ యందు రాజమార్గములు. వీరి శాసనపరిశోధన వాఙ్మయము కూడ ఒక బృహత్సంపుటము కాగలదు. లక్ష్మణరావుగారికి తెలంగాణమునందు అభిమానము మెండు. ఇచ్చటి ఆంధ్ర చారిత్రక సంపద ఘనమైనదని మొట్టమొదట గ్రహించినవారు లక్ష్మణరావు గారే. శ్రీవారి ఆదేశ సహకారములతో హైదరాబాదులో ఆంధ్ర పరిశోధక సంఘము స్థాపిత మయ్యెను. శ్రీవారి మరణానంతరము ఆ పరిశోధక సంఘము “లక్ష్మణరాయ పరిశోధక మండలి” గా రూపొందినది. చరిత్ర పరిశోధన మొనర్చుట, శాసన గ్రంథములను ప్రకటించుట, అము ద్రిత గ్రంథము లను గూర్చియు, విస్మృత కవులను గూర్చియు వివరించుట మున్నగు విస్తృత కార్యకలాప ములను నెరపి పేరొంది యున్నది. ఈ మండలి లక్ష్మణ రావుగారికి ప్రియమైన మూడవ సంస్థ. తెలంగాణము నందలి O ధ్రులను గూర్చియు, కవు లను గూర్చియు, ప్రదేశములను గూర్చియు ఉత్తర సర్కారు లందలి ఆంధ్రసోదరులకు ఆ కాలమున అపో హలు మెండుగా నుండెను. చరిత్రకును, భూగోళము నకును సంబంధించిన విషయములను మనవారు తారు మారు చేసిరి. లక్ష్మణరావుగారి రచనలందు అట్టి పొర పాట్లు కనబడవు. శ్రీవారు సోదరాంధ్రుల అపోహలను విమర్శించి సత్యమును నిరూపించియున్నారు. ఉదాహర ణార్థమై కొన్ని వాక్యరత్నము లొసగబడుచున్నవి. (1) అర్థమువ్రాసిన వారు సగరపుర మనగా అయోధ్య యని వ్రాసియున్నారు. ఇది పూర్వము బహమనీ రాజ్య మునకు రాజధాని. సగరపట్టణ మనునది ఇప్పుడు భీమా నదికి అనతి దూరమున “సస్యతాబాద్ సాగర్" అను పేరిట గుల్బర్గాజిల్లాలో నున్నది. (2) " కెంబావి" అనగా "కెండా” పట్టణమని టీకా కారులు వ్రాసియున్నారు. కెంబావి అను గ్రామము గుల్బర్గా జిల్లాలో గానవచ్చినది. ఇది గుల్బర్గాకు నైరృతి మూలను 50 మైళ్ల మీద నున్నది. షోరాపురము, సాగర్ అనునవి దీనికి సమీపముననే యున్నవి. పైని సురపుర మని చెప్పబడిన షోరాపురమునకు కెంబావి తూర్పున 16, 17 మైళ్ల మీద నున్నది. ఈ కెంబావి విజయనగరము నకు సూటిగ ఉత్తరమున 90 మైళ్ల దూరమున నున్నది. కావున ఆముక్తమాల్యదలోని కెంబావి యిది యనియే తలంచుట న్యాయము. ఈ శోధన తోడ కెంబావి యనగా

"క్వాంబే" యగునేమో యన్న యూహ పూర్వ పక్ష మగుచున్నది. (8) “ఏకశిలా నగర మోరుగల్లే" (ఈ చర్చ విపులము గను, వినోదకరముగను ఒనర్చియున్నారు.) 46 (4) ఓరుగంటికి ముప్పది మైళ్ల దూరమున బొమ్మెర యను గ్రామము కలదు. ఇట్టి పేరుగల యూరు తెలుగు దేశమందు నెచ్చటను మరియొకటి యున్నట్లు... ప్రమాణ ములు చూపియుండ లేదు. (5) పోతన యోరుగంటివా డనియు, బొమ్మెరను బట్టియే యాతని వంశమునకు బమ్మెరవారన్న యింటి పేరు వచ్చెననియు నూహించుట సకల న్యాయ శాస్త్ర ముల సంప్రదాయము ననుసరించిన సిద్ధాంతము. (6) వెలిగందల, ఏర్చూరు అను పరిశుద్ధమైన పెళ్ళుగల గ్రామములు ఓరుగంటికి, బమ్మెరకు, ఖమ్మం మెట్టుకు సమీప మందుండగా వానిని వదలి ఏ సంబంధము లేనివియు ఏర్చూరు వెలిగందల మేనమామ పోలికగలవియు నగు ఏల్చూరు, వెలిగండ్ల గ్రామముల నెవ్వరు గ్రహింతురు? (7) త్రిలింగ సంబంధములయిన మూడు లింగములును కాకతీయ రాజ్యమునకు సంబంధించినవని స్పష్టముగ తెలియవచ్చు చున్నది. ఇచ్చట కాళేశ్వరమును గూర్చి మనవారు పడుచున్న పొరపాటు చూపవలసియున్నది. కాళేశ్వర మనగా శ్రీ కాళహస్తి యని కొందరు వ్రాసి యున్నారు. అట్లు వ్రాయుటకు భూగోళ జ్ఞానము లేమి యే కారణము. ఈ త్రిలింగ సంబంధమయిన కాళేశ్వరము నైజాము రాజ్యములో మంథెన గ్రామమునొద్ద నున్నది. దిగ్దర్శనముగా జూపుట కివి చాలును. లక్ష్మణరావుగారు మహారాష్ట్ర భాషలో అపార వై దు ష్యము కలిగి రచనాధురీణులయి యున్నారు. కావున వారు మహారాష్ట్ర భాషనుండి కొన్ని క్రొత్త పదములు తెలుగుభాషలోనికి తీసుకొనివచ్చినారు. అవి తెలుగు భాషలో స్థిరపడిపోయినవి. అట్టి పదములలో యూని వర్సిటీ (University) అను పదమునకు సర్వకళాశాల యని గాక విశ్వవిద్యాలయ మనుట; ఎడ్యుకేషన్ (Education) అను పదమునకు విద్యయని గాక శిక్షణము అనుట; ఎడిటర్ (Editor) అను పదమునకు పత్రికాధిపతి యని గాక సంపాదకుడు అనుట; ఫలాని సంవత్సరము అను పదమునందలి ఫలాని శబ్దమునకు 'అముక' అనుట - ఇత్యాదులు ఉదాహరణములు.

లక్ష్మణరావుగారు సంస్కృతము, ఆంధ్రము, మహా రాష్ట్రము, హిందీ, బెంగాలి, కన్నడము మొదలగు భాషలయందు ప్రవీణులై యుండిరి. “ద్రావిడ భాషల లోని ఉత్తమ పురుష వాచక సర్వ నామము” అను వ్యాసమువలన శ్రీవారు ఆయా భాషల మర్మములను గూడ తెలిసినవారని స్పష్టమగుచున్నది. ఈ వ్యాస చర్చ యందు తెలుగు, అరవము, కన్నడము, మలయాళము, తుళు, గోండు, కోదు, కురుఖు, సంస్కృతము, హిందీ, బెంగాలి, పాలి, ప్రాకృతము అను 14 భాషలలోని పద సామ్య విచారణ కావింపబడినది. ఇక అతి విస్తరమేల?

శ్రీ లక్ష్మణరావుగారు పూర్వుల మత విశ్వాసములను ఆ క్షేపించుటకు మనకు అధి కారము లేదని చాటియున్నారు. మత సహనము అను విషయములో లక్ష్మణరావుగారి నే ముందుగ పేర్కొనవలయును. “ఒకరి మతము లొకరికి అసమ్మతములగులు స్వాభావికము. ఇంత మాత్రముచే నొకరి నొకరు నిందింప గూడదు. మైసమ్మను బూజ సేయు వారిలో సజ్జనులు లేరా ? ఇంతయేల? నాస్తికులలోను సజ్జనులు లేరా ? అందరకును మతద్వేషా భావంబు ఉండ వలయును.” అని లక్ష్మణరావుగారు సూక్తీకరించి యున్నారు. అట్లు సూక్తీకరించుటయేగాదు. తమ రచనల యందు ఈ గుణమును ప్రస్ఫుటముగ జూపి యున్నారు. అద్వైతములు, అవతారములు, అధర్వవేదము, అష్టాదశ పురాణములు మున్నగు శ్రీ వారి రచనలు హిందూ ధార్మిక విషయములు. వీటి సందేశములు స్పెన్సరియ యజ్ఞేయ వాదుల పంథాకు చెందియున్నట్టి లక్ష్మణరావు గారికి విశ్వసనీయములు గానట్టివే. వీరు తలచియున్నచో వీటి చర్చయందు హిందూ ధర్మమును వెక్కిరించుటకు అవకాశములు దొరకకుండెడివి కావు. అట్లు వెక్కి రించుచు వ్రాసినవారు లేకపోలేదు. లక్ష్మణరావుగారు అట్టి నిరర్థక చర్చలనుమాని, తా త్త్విక దృష్టితో, శాస్త్రీయ పద్ధతిలో వాటిని చర్చించియున్నారు. లక్ష్మణ రావుగారు ఆయా మతాభిమానులు గాకపోయినను వారి విషయ వివరణ కౌశల్యము నిరుపమానమైనది. అందుచే ఆయా మతానుయాయులు తాము గూడ స్వీయమతములను గూర్చి అందరికంటే ఎక్కుడు అభిమానపూర్వకముగా, పఠపాతరహితముగా వ్రాయజాలమని తలచిమెచ్చుకొను నంత యోగ్యముగా ఆయా మత విషయక వ్యాసము లను శ్రీవారు రచించియున్నారు. సర్వజన రంజక మైనది లక్ష్మణరావుగారి రచనా పద్ధతి. సత్యాన్వేషణమే వల యును కాని పఠాభిమానము వలదు అనునదే శ్రీవారి సిద్ధాంతము.

లక్ష్మణ రావుగారు ఎప్పుడును మహారాష్ట్రుల నేపథ్య మునే ధరించెడివారు. మెడ మూసిన పొడుగుకోటు. శిరో వేష్టనము, కుడిచంక క్రింది నుండి ఎడమ భుజము మీదికి వల్లెవాటుగా ఉ త్తరీయము, లాగు లేక పిం జె పెట్టి కట్టిన ధోవతి. ఇది శ్రీవారి నేపథ్య విధానము.

శ్రీ లక్ష్మణరావుగారు పరిశోధన కార్యభారమున క్రుంగి ఆరోగ్యము చెడి రుధిరోద్గారి సంవత్సర నిజ జ్యేష్ఠ బ ౧౭ గురువారము నాడు రాత్రి (జులై 18,1928) రెండు గంటలకు భౌతిక కాయమును వీడి శివసాయు జ్యము నొందిరి.

శ్రీ లక్ష్మణ రావుగారిని గూర్చి కొందరు మహనీయుల వాక్యము లీ దిగువ పొందుపరచ బడినవి:

"ఈయన వ్యక్తి కాదు. ఒక సంస్థ అనవచ్చు.”

"లక్ష్మణరావుగారు అనే సంస్థను పూర్తిగా అర్థం చేసుకోవడం హిమాలయాలకు జాగ్రఫీ వ్రాయటం వంటిది.”

'లక్ష్మణరావుగారు నవ్యాంధ్ర సంస్కృతీప్రవర్తకులు.’