సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొప్పులింగేశ్వర క్షేత్రము

కొప్పులింగేశ్వర క్షేత్రము : తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరమునకు కొంచె మాగ్నేయముగ పది క్రోసుల మేరలో 'పలి వెల ’ యు గ్రామము కలదు. అచట కౌసికీ నది తీరమున వెలసి యుండినవాడు అగస్త్యోపాస్యుడు, అగస్త్య ప్రతి ష్ఠితుడు నగు కొప్పు లింగేశ్వరుడు. ఈ యీశ్వరుని మొదటి పేరు అగస్త్యేశ్వరుడు ; తరువాతి పేరు కొప్పు లింగేశ్వరుడు. అగస్త్యేశ్వరుడు కొప్పు లింగేశ్వరుడగు టను గూర్చి యొక యైతిహ్యము కలదు.

చాళుక్య భీముడను రాజు (క్రీ.శ 888-918) ఆంధ్ర దేశమును పాలించు కాలమున, ఒక పూజరి అగస్త్యేశ్వరు నకు విశేషమైన భక్తి తాత్పర్యములతో పూజలు నేర పుచు, పలివెల గ్రామములో కాపుర ముం డెడి వాడు . ఇట్లుండ అతని కచట ఒక వేశ్యతో సాంగత్య మేర్పడెను. ఆమె తోడి చెలికారమున, ఆతడా వేశ్య యింట నే తరచు వసించు చుండెడివాడు. కాని అతని హృదయమున పర మేశ్వర భక్తి కేపాటియు కొఱత లేక యుండెడిది. పూజరి వేశ్యాలోలుడై యుండుట సహింపజాలని గ్రామస్థులు ఆతని వ ర్తనమును రహస్యముగ తమ ప్రభు వున కెరిగించిరి. ఆ వార్త చేరిన పిదప కొంత కాలమునకు ప్రభువు ఒక నా డాకస్మికముగ పూజరి వర్తనమును పరీ క్షించుటకై పరిమిత పరివారముతో పలివెలకు వచ్చి చేరెను.

ప్రభువు పలివెల మధ్యాహ్న మయ్యెను. చేయవలసిన పూజాది విధులను పురమును ప్రవేశించు నప్పటికి అప్పటికా పూజరి ఈశ్వరునకు నిర్వర్తించి, తాను భుజించి, వేశ్య యింటిలో సరస సల్లాపములు నెరపు చుండెను. అచట నుండగనే, ప్రభువు గ్రామములో ప్రవే శించి ఈశ్వరుని దర్శింపగోరు చుండెనను వార్త ఆ పూజ రికి వినవచ్చెను. ఆ నాటి యాచారమును బట్టి, ప్రభువు పర మేశ్వరుని దర్శనమునకై వచ్చినపుడు, శివనిర్మాల్య మైన మాలికను ఆతనికి ప్రసాదముగా నిచ్చుట యొక పరిపాటిగా నుండెను. కాని అట్లు నిర్మాల్యముగా నీయ దగిన మాలిక ఏదియు ఆ సమయ మందు గుడిలో లేదు. ఏమి చేయుటయా అని పూజరి ఆలోచించు చుండ, ఎదురుగా వేశ్య జడలో ముడుచుకొనిన దండ యాతని కంటి కగపడెను. వెంటనే ఆతడా దండ తీసికొని, ఎవ్వరి కంట బడకుండ, పదిలముగా గుడి లోపలకు తెచ్చి ఆ వెనుక పరమేశ్వరుని మ్రోల పళ్లెరమునం దుంచెను. నిలచి నమస్కా రాది విధులు నెరపి, దోసిలి యొగ్గి, నిలచి యున్న రాజు శిరముపై పూజరి పరమేశ్వరుని పాదుక యించి, చేతిలో వేశ్య జడ ముడి నుండి తాను కొని తెచ్చిన దండను శివనిర్మాల్య ప్రసాదముగా నుంచెను. తాత్కాలికముగ దొరికిపోకుండు ఉపాయమునకు వేశ్యజడనుండి దండ తీసికొని వచ్చెనేగాని, దానిలో లోప మేదైనా కలదేమో యని పూజరి చూడలేదు. ఆ మాలి కలో వేశ్య జడలోని వెండ్రుక యొకటి చుట్టుకొని యుండుట అతడు గమనించ లేదు. పూజరి రాజు చేతిలో పెట్టిన పూలదండను పుర జములు శ్రద్ధగా పరికించి, అందొక తలవెండ్రుక యుండుట చూచి, ప్రభువుతో "అయ్యా ! ఇది శివనిర్మాల్య మైన మాలిక కాదు. ఈ దండ ఈతని ప్రేయసియైన వేశ్య జడలోనిది. కాకున్న ఈ మాలికలో తల వెండ్రుక యుండును?" అని తెలిపిరి. ప్రభువును, పురజను లెరి గించిన వార్త సత్యమే యని నిశ్చయించుకొని, “ఏమయ్యా పూజరీ! నీవు వేశ్యాలోలుడవై యుండుటయే గాక, మా యెడలగూడ ఇట్టి యపచారము చేయ సాహసించి కట్టి నిన్నేమి చేయవలయును?" అని యాగ్రహ ముతో పలికెను. పూజరి బెదరక, తాను చేసిన తప్పును నవరించుకొనుటకై, “ప్రభూ! ఈ దండ వేశ్యజడలోనిది కాదు. ఈశ్వర నిర్మాల్యమగుటలో సందియము లేదు. దీనిలో తల వెండ్రుక ఏల వచ్చెనందురా ? మా స్వామికి శిరమున కొప్పు కలదు. ఈ మాలికను శివజటాజూటమునం చలంకరింపగా, అందలి వెండ్రుక యొకటి దీని కంటినది” అని నిబ్బరముగ బదులు చెప్పెను. పరిసరమందున్న పుర జను లందరు పూజరి పలుకులు అసత్యములని యొక్క పెట్టున ఘోషించిరి. పూజరి తన మాటలు ముమ్మాటికి ఇక్కములే యని వక్కాణించెను. అట్లయినచో ఈశ్వర శింగమునకు కొప్పు చూపింపగలవా యని ప్రభువడుగగా, పూజరి తప్పక అట్లే చూపింపగల ననెను. అప్పుడే నాగా కరణము తీసి లింగముపై కొప్పు చూపింపు మని 8° జడుగగా, పూజరి "ప్రభూ! ఈనాడు మా స్వామికి మాధ్యాహ్నిక “పూజాదికము నిర్వర్తించి, నాగాభరణ కూషితుని గావించి, పుష్పాదిక ముచే అలంకరించి

యుంటిని. రేపటి ఉదయమున గాని మరల ఈ నాగా భరణమును తొలగింప వలను పడదు. తమరు చూడ దలతు లేని, రేపటి ఉదయమున కొప్పు కాన్పింప జేసెద" అనెను. ప్రభువు అందులకు అంగీకరించి చ రాత్రి నిలచి పోయెను. జడముడి

పూజరి తన తలమీదికి వచ్చిన ఆపదను తప్పించుకొను టకై లింగమునకు కొప్పు కలదని అప్పటికి తప్పించుకొని నాడే కాని, శిలారూపమైన లింగమునకు యుండు టెట్లు ? పూజరి వేశ్యాలోలు డయినను అఖండ శివభక్తుడు. తన భ క్తిచే ఏ పనినైనను సాధింపగలనను ధైర్యము గలవాడు. అతడా రాత్రివేళ గుడితలుపులు బిగించి, ఆగస్త్యేశ్వరుని మ్రోల నిలచి, భ క్తితో స్వామిని ప్రార్థించి తానుచేసిన యపరాధమును అతనికి విన్నవించి, “స్వామీ ! నా యపరాధమును సైచి నీవు కొప్పు రప్పించుకొని నా మానము కాపాడకుండిన, నీ యెదు నే ప్రాణములు వదిలెదను" అని హఠము పూని యుండెను. అట్లుండగ వేగునంతకు ఆ లింగమున కొప్పు మొలతేరెను. మరునా డుదయమున ప్రభువు పౌరులతో గూడి పర మేశ్వరుని కనుగొన వచ్చునప్పటికి అగస్త్యేశ్వర లింగమున జడముడి కానవచ్చినది. ఆ వెండ్రుక లనుగూడ పూజరి లింగమునకెట్లో లింగమునకెట్లో అతికించెనను సంశయమున ప్రభువు చేసాచి పెరికి చూడగా, రోమ కూపముల నుండి నెత్తురు చిందెను. దానితో రాజు కన్నులు మసక గొనెను. ప్రభువుగూడ ఈశ్వర భక్తుడగుటచే, తన యపరాధమును క్షమింపు మని ప్రార్థింపగా, అతని దృష్టి మరల తిన్న బడెనట. ఇది అగస్త్యేశ్వరుడు కొప్పు లింగేశ్వరుడగుటను గూర్చిన ఐతిహ్యము.

పూజరి వేశ్యాలోలుడయ్యును తనభక్త్యతిశయ ముచే లింగమునకు కొప్పు కాన్పింప చేసినందుకు ప్రభు వెంతయు సంతసించి, పలివెలపురమునకు పశ్చిమమున ఒక యామడదూరములో వసిష్ఠా నదీ తీరమున ముప్పది పుట్ల భూమిని సర్వకర పరిహరముగ అతనికి మాన్య ముగా నిచ్చెను. ఆ భూమికి 'జుత్తిగపాడు' అను పేరు నాడును, నేడును గూడ నిలచియున్నది. నిన్న మొన్నటి . వరకు ఆ భూమిపై సర్వాధికారములు ఆ పూజరి వంశము వారికే చెందియుండెను. ఇది చారిత్రక సత్యమని ఈ భూమిదానము, దాని అధికారము ఆ పూజరి వంశ జులకు నిలచి యుండుటయు తెలియజేయు చున్నది. ఆ భూమికి గల పవిత్రత యెట్టిదోగాని, దానికి సమీప ముననే గల పొడగట్లపల్లి గ్రామములో నుండిన వేదా ధ్యయన సంపన్నులందరు నేటికి కూడ వసిష్ఠానదిలో గ్రుంకి, జుత్తిగపాడు భూమి నంటిన ఘట్టములో నిలచి అనుదినము ప్రశ్న ప్రయజ్ఞ విధానమున వేదపాఠము చే ఆ ప్రదేశము నంతను ప్రతిధ్వనింప జేయుచుందురు.

పలివెల గ్రామములోని శ్రీ కొప్పులింగేశ్వర క్షేత్ర మును పేర్కొనుచు, శ్రీనాథ మహాకవి ఈ క్రింది పద్య మును రచించెను: సరిసామంతుడు శ్రీ కుమారవని కా చాళుక్య భీమేశ్వరే శ్వర దేవుండుపకంఠ బాంధవుడు శ్రీ సంవేద్య రాడ్భైరవుం డిరువుం బొర్వును బిల్వలేశుడు మృకం డేశుండుగా నేలె ని ద్ధరణీ మండలి భీమనాథుడు నిరా తంక ప్రతాపోన్నతిన్.

పలివెల కొప్పులిం గేశ్వర క్షేత్రము దక్షారామ, కుమా రారామములతోడను, రాజమహేంద్రవర రుద్రపాద తీర్థ క్షేత్రము తోడను సమాన ప్రతిపత్తి గలదని ప్రాచీన శాసనములు కూడ తార్కాణించుచున్నవి,