సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కేశవచంద్ర సేను (1838-1884)

కేశవచంద్ర సేను (1838-1884) :

కేశవచంద్ర సేను ఐశ్వర్యము గల కుటుంబమునందు జన్మించి, చిన్న నాటినుండియు అసాధారణమైన తెలివి తేటలు, నియమ నిష్ఠలు, మిత భాషిత్వము, వైరాగ్య సంపద గలిగి పెరుగుచుండెను. లేత వయస్సునం దే ముగ్గురు తేజోమయపురుషులు అతని దృక్పథమున పొడ ' కట్టిరి. స్నాతకుడైన జాను (John the Baptist), జీససు, సెయింటు పాలు - ఈ ముగ్గురును అతనికి పశ్చా త్తాపము యొక్క ఆవశ్యకతను, వైరాగ్య విశ్వాసముల యొక్క ప్రాశ స్త్యమును బోధించిరి. సంఘ శ్రేయస్సు నకై బహువిధము లయిన సమాజములను స్థాపించి, నిరంతర కార్యదకుడైన యువకుడు కేశవచంద్రుడు, రాజు నారాయణ బోసు వ్రాసిన 'బ్రాహ్మధర్మ లక్షణ' మను చిన్న గ్రంథమును చదివి, తన ఆంతరంగిక భావముల కది ప్రతిబింబముగా నుండుటకు సంతసించి, 1858 సం.న బ్రాహ్మ సమాజమున సభ్యుడుగా చేరెను. ఆతని ఉజ్జ్వల విశ్వాసమును, కార్యదీక్షను చూచిన మహర్షి దేవేంద్రనాథ టాగూరు, అతనిని తన సాంగ త్యములోనికి తీసికొనెను. అంతరాత్మ ప్రబోధము ననుస రించుటయే జీవిత ప్రధానసూత్రముగా చేసికొన్న కేశవ చంద్రునకు ఈశ్వర దర్శన భాగ్యము సులభమగు చుండెను. 1861 సం.న ఉద్యోగమునుండి విరమించుకొని ఏకేశ్వరో పాసనా వ్యాపనమునకై తన శక్తి సామర్థ్యముల నుప యోగింప నారంభించెను. ఈతని భక్త్యావేశమును అత్యు త్సాహముతో గ్రహించిన మహర్షి ఈశ్వర ప్రేరితుడై, 1862 ఏప్రిల్ లో జన్మతః బ్రాహ్మణేతరుడైన కేశవ చంద్రుని బ్రాహ్మ సమాజమున కాచార్యునిగా స్వీకరించి, 'బ్రహ్మానంద" అను సార్థక నామము అతని కొసంగి, "బ్రహ్మజ్ఞాన, బ్రహ్మధ్యాన - బ్రహ్మానంద రసపానము లే ఆతని జీవిత లక్ష్యములని ఆదేశించెను. అత్యంత సన్నిహితసంబంధము గలిగిన మహర్షి, బ్రహ్మా నందుల మధ్య ధర్మసాధనమును గూర్చిన అభిప్రాయ భేద ములు ఏర్పడుటచే, వారు వేర్వేరుమార్గము అవలంబించిరి. బ్రాహ్మధర్మము హిందూధర్మ సంస్కరణ మని మహర్షి భావించెను. అది సర్వమత సంప్రదాయముల నవలంబిం చిన విశ్వజనీన ధర్మమని కేశవచంద్రుడు నిర్ధారణ చేసెను. 1862 సం. న "శ్లోక సంగ్రహ” మను గ్రంథ మును ప్రకటించినపుడు పండిత గౌరీ గోవింద రాయలు ఈ క్రింది శ్లోకమును ఆ గ్రంథము యొక్క ముఖపత్రమునందు కేశవచంద్రు డచ్చొత్తించెను :

శ్లో. సువిశాల మిదం విశ్వం, పవిత్రం బ్రహ్మ మందిరం రచించిన ఈ చేతస్సునిర్మలం తీర్థం, సత్యం శాస్త్రమనశ్వరం. మ విశ్వాసో ధర్మమూలంహి, ప్రీతిః పరమ సాధనం స్వార్థనాశస్తు పై రాగ్యం, బ్రాహ్మైరేవం ప్రకీర్త్యతే.

ఈ సువిశాల విశ్వధర్మము ననుసరించి కేశవచంద్రుడు, ఇతర అభ్యుదయ బ్రాహ్ములు, తమ తమ వ్యక్తి సమష్టి జీవితముల సంస్కరించుట కారంభించిరి. “సాధు సమా గమము” “సర్వ మతగ్రంథ సామరస్యము” వారికి సాధన విషయము లయ్యెడివి. బాల్యము నుండియు కేశవుడు వి శేషముగా ప్రార్థనాశీలుడు. ఈశ్వరుని స్నేహితునివలె ముఖాముఖి చూచుట, కష్టసుఖముల నాతనితో నివేదించు కొనుట అతని కలవాటు. మానవ హృదయ మాక్రంద నముచేయ ఈశ్వరు డాకర్ణించు ననియు, కరుణాళువగు ఈశ్వరుని వాణిని విని మానవుడు శిరసావహించుననియు కేశవచంద్రునికి అచంచలమైన విశ్వాసముండెను. ఈశ్వర దర్శనము త్రివిధములచే ప్రాప్తించునని కేశవ చంద్రుడు ప్రబోధించువాడు. ఆత్మ జీవితము నందును, ప్రకృతి చిత్రముల యందును, మానవకోటి యోగ క్షేమ ములందును ఆయనను దర్శింపనగును. వేదాంత యోగము, వైదిక యోగము, పౌరాణిక యోగమని ఆతడు వాటికి నామకరణము చేసెను.

సర్వధర్మ సమన్వయ సాధనమును కేశవచంద్రుడు ప్రతిష్ఠించెను. యథార్థ బ్రహ్మోపాసకుడు సోక్రటీసు యొక్క మేధస్సును, జీససు యొక్క హృదయమును, చైతన్యుని యొక్క జిహ్వను, మహమ్మదు యొక్క ఉత్సాహమును, హోవర్డు (Howard) సంబంధ మైన ధైర్య శీలమును- అన్నిటిని సమన్వయము చేసి, సమగ్ర జీవితమును పొందునని కేశవచంద్రుని దృఢవిశ్వాసము.

సర్వధర్మ సంప్రదాయములును ఎక్కడి కక్కడ సత్యములే. విశాల, సమగ్ర, విశ్వజనీన సంప్రదాయము నందు వాటిని సమన్వయము చేయుట ఆత్మాభివృద్ధికి ప్రధానము. అది బ్రహ్మోపాసకుని కర్తవ్యము.

బ్రహ్మానంద రసపానముచే మ త్తతచెందిన బ్రహ్మానంద కేశవ చంద్ర సేనునకును శ్రీరామకృష్ణ పరమహంసకును మధ్య అత్యంతము ఆధ్యాత్మిక మైన మైత్రి పొసగుట యం దాశ్చర్య మేమున్నది! ఇగువురును ఉగ్రమైన సాధన సంపత్తిగలవారలే. ఇద్దరును జగజ్జనని సందర్శనానంద మున నోలలాడినవా రే. విశ్వజనని సాన్నిధ్యమున ఆనంద పారవశ్యముచే పరస్పరాలింగనము చేసికొనుచుండిరన్న “భక్తానాందళ మేకమ్” అనియే అనుకొనవలసినది. సిద్ధాం తము లందలి భేదములచే కలహించునది సామాన్యులు. దర్శన భాగ్యముచే జనించిన ఆనందముచే భక్తులు కర చాలనముచేసి నృత్యము సల్పుదురు. అట్టి వారి యందు ప్రేమయు, వినమ్రభావము అనునవే కాని ద్వేషము, అసహనము అనునవి గోచరింపవు.

కేశవచంద్రుడు భక్తాగ్రేసరుడు. ఏకేశ్వరోపాసనను వ్యాప్తికి దెచ్చుటకై, అంతరాత్మ ప్రబోధమును జీవిత సూత్రముగా ప్రతిష్ఠించుటకై, సర్వమత సమన్వయమును సాధించుటకై, విశ్వమానవ సౌభ్రాత్రము నెలకొల్పు టకై యావచ్ఛ క్తిని వినియోగించి, సార్థక జీవి యైన వాడు. భారతరత్నము. సమగ్ర మానవుడు.