సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కేరళదేశము (భూగోళము)

కేరళ దేశము (భూగోళము) :

భౌగోళిక పరిస్థితులు : కేరళ రాష్ట్రము భారతరాజ్యాంత ర్గతము లగు పదునైదు రాష్ట్రములలో కెల్ల చిన్నది. రాష్ట్ర పునర్నిర్మాణచట్టము ననుసరించి ఈ రాష్ట్రము

1-11-1956 వ తేదీన నిర్మాణమైనది. పూర్వపు తిరువా న్కూరు. కొచ్చిన్ రాష్ట్రముల భూభాగములును (కొన్ని మినహాయింపులతో), మద్రాసు రాష్ట్రాంతర్గతమగు మల బారు జిల్లాయు, దక్షిణ కెనరా జిల్లాలోని కాసరగోడు తాలూ కాయు ఈ కేరళ రాష్ట్ర మునచేరియున్నది. పూర్వపు తిరు వానూరు-కొచ్చిన్ రాష్ట్రమునుండి నాగర్కోయిల్, కన్యాకుమారి మున్నగు నాలుగు తాలూకాలును, షెన్ కొట్టాలోని కొంత భాగమును మద్రాసు రాష్ట్రములో చేర్పబడినవి. ప్రస్తుతము ఈ రాష్ట్రము యొక్క దక్షిణపు సరిహద్దు క న్యాకుమారికి ఉత్త రమున 35 మైళ్ళ దూరమున నున్న 'పాఠశాల' అను గ్రామము. ఉత్తరమునను, ఈశాన్యమునను మైసూరు రాష్ట్రపు సరిహద్దులను, తూ ర్పునను, దక్షిణమునను మ ద్రాసు రాష్ట్రపుసరిహద్దులను గలిగిన ఈ రాష్ట్రము అ రే బియా సముద్రతీరమున 360 మైళ్ళ వరకు ఉత్తర దక్షిణ ముగా ప్రాకుచున్నది. కేరళ రాష్ట్ర వై శాల్యము ఉత్తర రక్షిణాగ్ర భాగమున 20 మైళ్ళ నుండి మధ్యభాగ మున TS మైళ్ల వరకును వ్యాపించి యున్నది. కేరళ రాష్ట్రము 8-18' మరియు 12°-48' ఉత్తర అక్షాంశ మధ్యభాగ

, 74°-52' మరియు 77-22' తూర్పు రేఖాంశ

ముల మధ్యభాగమునను ఉన్నది.

కేరళముయొక్క విస్తీర్ణము 14,992 చ. మైళ్ళు. స్విట్జర్లాండు, ఆల్బేనియా, బెల్జియం, మున్నగు ఐరోపా కాజ్యములకంటె విస్తీర్ణమందును, జనసంఖ్య యందును కేరళ రాష్ట్రము పెద్దదని చెప్పవలసియున్నది. కొండలు : కేరళమును పరిసర ప్రాంతముల నుండి పశ్చిమ కనుమలు విడదీయుట వలన ఆ రాష్ట్రమున కొక

ప్రత్యేకత కలదు. పశ్చిమ కనుమలచే ఈ రాష్ట్రము యొక్క భౌగోళిక పరిస్థితులు ప్రభావితములై యున్నవి. పశ్చిమమున సముద్రమును, తూర్పున పశ్చిమ కనుమలును గలిగిన సన్నని భూభాగమే కేరళ రాష్ట్రము. ఈ పశ్చిమ కనునుల ఎత్తు 3000 అడుగుల నుండి 6000 అడుగుల వరకును పెరిగి, కొన్ని స్థలములందు 8000 అడుగుల వరకును అందుకొనును. కొట్టాయం జిల్లాలోని 'ఆ నెముది ' శిఖరము 8,837 అడుగుల ఎత్తుగలిగి, హిమాలయమునకు దక్షిణమునగల పర్వత పంక్తు లన్నిటికంటె ఎత్తయినదిగా పరిగణింపబడుచున్నది. నదులు : అధిక వర్ష పరి మాణమువల్లను, మిట్టపల్ల ములుగా నున్న భూమి యగుట చేతను, అనేక క మలు నదులు, వాగులు ఈ రాష్ట్ర మున ప్రవహించుచున్నవి. అవ న్నియు అరేబియా సముద్ర మున కలియుచున్నవి. పశ్చిమ ఏ ప్రదేశమునను సముద్రమునకు 75 మైళ్ళ కంటె ఎక్కువ దూరమున లేనందున ఈనదులు చిన్నవిగా నున్నవి. ఉత్తర దక్షిణముగా చూచినచో (1) వరల పట్ట ణము (70 మైళ్లు), (2) బారి యాన్ (98 మైళ్ళు), (8) కడ లుంది (75 మైళ్ళు), (4) భార తపుఝా (166 మైళ్ళు), (5) చాలకుడి (10 మైళ్ళు), (6) పెరియార్ (142 మైళ్ళు), (7) పంపా (90 మైళ్ళు), (8) అచ్చన్ కోవిల్ (70 మైళ్ళు), (9) కల్లడ (70 మైళ్ళు) అను ముఖ్యమైన నదులు ఉన్నత ప్రదేశమునుండి ప్రవహించుచు 500 అడుగులకంటే ఎక్కువ ఎత్తునుండి కొన్నిచోట్ల క్రిందికి జారుచుండును. అందుచే అచ్చట విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదనమునకును, జల సేచనమునకును ఈ నదులు మిగుల అనువగు అవకాశములు కల్గించుచున్నవి. అడవులు : కేరళ రాష్ట్రములో అటవీసంపద ప్రధాన మైనది. మొత్తము భూభాగములో 25.8 ప్రతిశతి ప్రాంతము అడవులచే ఆక్రమింపబడి యున్నది. ఈ విష యములో అస్సాము తరువాత కేరళము రెండవదిగా పరిగణింపబడుచున్నది. ఈ వనసంపత్తివలన రాష్ట్రమునకు కమునకు పదునొకండు రూపాయల ఆదా ప్రతి యము లభించును. అఖిలభారతమునందు సగటున ప్రతి యెకరమునకు నాలుగు రూపాయలు మాత్రమే అడవుల నుండి ఆదాయము లభ్యమగుచున్నది. ఆ వనములందు సంచరించు కేరళీయ వనములు వివిధములయిన మృగజాతులకు ఆలవాలములై యున్నవి. 'పెరియారు'తటాక సమీపమున గల రిజర్వు వనములు (Reserve forests) వన్యమృగ ముల కాశ్రయ మొసగుచున్నవి. ఏనుగులు, ఆబోతులు, చిరుతపులులు, సాంబర్లు, అడవి పందులు మున్నగు అనేక జాతుల మృగములు స్వేచ్ఛగా చుండును. దాదాపు 600 కంటే ఎక్కువ వృక్ష జాతులు ఈ వనములందు గలవు. టేకు, సీసము మున్నగు నల్ల మద్ది, కొన్ని తరగతులకు ఈ వనములు కేంద్రములు. కలప వ్యాపారమునకు కేరళము సుప్రసిద్ధము. కల్లాయి (Kallai) యందుగల కలప అడితి (Depot) ప్రపంచ రెండవదని ప్రశస్తి గాంచినది. మరి చలతా పరివేష్టితములైన అత్యున్నత వృక్ష రాజములు మనోహర దృశ్యములను చేకూర్చుచున్నవి. ఏనుగు దంతములును కేరళ వన్యసంపత్తులో చేరినవే. ములో ఖనిజములు : ఖనిజ సంపత్తులో కేరళ రాష్ట్రము ఏ ఇతర రాష్ట్రమునకును వెనుదీయదు. అణుయుగారంభము పిదప కేరళీయ ఖనిజములు అత్యంత ప్రాముఖ్యము వహించినవి. అణుశ క్తి కై ఉపయోగింపబడు 'థోరియమ్' (Thorium) అను పదార్థముగల 'మోచో జైట్' (Mono zite) ఈ రాష్ట్రములో విరివిగా లభించును. కొల్లము (క్విలన్) జిల్లా సముద్రతీరము మోనోజైట్ (Mono zite) ఎల్ మెనైట్ (Elmenite), రూటైల్ (Rutile), జిర్ కోసీ (Zircosi), సిలమైనైట్ (Silamenite) అను ఘన ఖనిజపదార్థములకు పుట్టినిల్లు. పోర్సిలెయిన్ తయారు చేయుటకు అవసరమయిన చీనా మన్ను ఈ రాష్ట్ర మందు పెక్కు స్థలములలో లభించును. ఇటుకలు చేయుటకు

ఉపకరించు రెండవరకము మన్ను అచట విరివిగా కలదు. షార్క్ లివర్ ఆయిల్, టర్టెల్ ఆయిల్ మున్నగు నూనె లును, నిమ్మగడ్డి (Lemon grass) మున్నగు తృణ పదార్థములును, ఓషధులకును, సుగంధ ద్రవ్యములకును ఉపకరించు ముడిపదార్థములును కేరళములో లభించును. సిమెంటు తయారు చేయుటకు అవసరమగు ముడి ద్రవ్యములుగూడ ఇందు లభ్యమగును. కేరళములో తెల్ల సిమెంటు ఫ్యాక్టరీ యొకటి కలదు. 360 మైళ్ళ పొడవు గల సముద్రతీరము కలిగి, సమీపమందలి భూమిని ఆక్ర మించుకొను సాగరజల తటాకములును, మంచినీటి చెరువులును విరివిగానున్న కేరళ రాష్ట్రములో సంబంధమగు సంపత్తుకు కొదువలేదు. జనసంఖ్య : 1. కేరళ రాష్ట్రపు మొత్తము జనసంఖ్య (1951) 1,85,51,529 66,82,861 68,68,668 1,17,66,592 17,84,987 54,73,765 80,77,764 పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్య 2. గ్రామీణులు నాగరులు 3. అక్షరాస్యులు నిరక్షరాస్యులు 1951 లెక్షలనుబట్టి జనసాంద్రత చ. మై. 1కి 904 మంది 1957 1000 మంది 99 విభాగములు : కేరళ రాష్ట్రమునకు రాజధాని నగ రము తిరువనంతపురము. ఇందు 9 జిల్లాలును, 55 తాలూకాలును, 4615 గ్రామములును, 88 నగరము లును, 22 మునిసిపాలిటీలును, 897 పంచాయితీలును కలవు. జిల్లాలు 1. తిరువనంతపురము 2. క్విలన్ 3. అల్లెప్పీ 4. కొట్టాయం 5. ఎర్నాకులం 6. త్రిచూరు 7. పాలాటు 8. కోయికోడ్ వి స్తీర్ణము 846.3 చ. 1981.9 705.3 1998.6 1558.5 1147.8 1971.7 25,55.0 99 99 99 జల 99 మై. జన సం ఖ్య 13,27,812 14,84,783 15,14,105 13,26,489 15,30,143 18,62,772 15,65,167 20,65,177 9. కన్ననూరు 22,265 1958 సంవత్సర లెక్కలను బట్టి కేరళ జనసంఖ్య ప్రధాన నగరములు : నగరము 1. తిరువనంతపురము 2. కిల 3. అలెప్పీ 4. కొట్టాయం 5. చెంగన్ చెర్రీ 8. మట్టన్ చెర్రీ 7. ఎర్నాకులం 8. త్రిచూరు 8. పాల్హాట్ 10. కోఝికోడ్ 11. కన్ననూరు 12. తెల్లి చెర్రీ 18. కొచ్చిన్ పోర్ట్ వి స్తీర్ణము 99 17.00 చ.మై. 6.15 ,, 12.50 6.25 5.50 2.69 3.37 4.78 10.27 11.18 4.88 3.00 1.01 99 99 99 99 99 39 99 13,75,081 1,52,80,000 జనసంఖ్య 1,86,931 66,126 1,16,278 44,204 36,289 71,904 62,283 69,515 69,504 1,58,724, 42,431 40,040 29,881 వాతావరణము : పల్లపు ప్రాంతములందు వాతావర ణము వేడిగాను, నిమ్నోన్నత ప్రదేశములందు ఆరోగ్య కరముగాను, చల్లగాను, ఉన్నతగిరి ప్రదేశములందు శీత లముగాను ఉండును. F90° కంటె ఉష్ణ ప్రమాణ మెక్కు వగా నుండక పోయినను, ఉక్కగానుండి, పల్లపు ప్రాంత ములలో అధికముగా చెమటపట్టు చుండును. సాగర, నదీ జలములు ఎల్లెడల ప్రవహించు చుండుటచేతను, కొబ్బరి, రబ్బరు, పోక, జీడిపప్పు, వరి పొలములు, టోపియోకా అను కర్ర పెండలము పండు భూములు మున్నగునవి ఎల్లప్పుడు పచ్చగా నుండుటచేతను, ప్రకృతి సౌంద ర్యాతి శయ సంపన్నమై అలరారుచు, 'దక్షిణ కాశ్మీరము' అని ప్రఖ్యాతి వహించినది కేరళము. వర్షపాతము : మే నెల తుదిలోనో, లేక జూన్ నెల మొదటనో గర్ణారావ సహితముగా దక్షిణ పశ్చిమ వర్షా గమన మారంభించి సెప్టెంబరు వరకు వానలు కురియు చుండును. తిరిగి అక్టోబరులో ఉత్తర పూర్వ వర్షాకాల మారంభించి, డిశెంబరునెల తుదివరకు సాగి పిదప కాలము వొప్పును. జనవరి, ఫిబ్రవరి మాసములు చల్లగా విప్పారి

యుండును. మార్చి, ఏప్రిల్, మేనెలలు వేసవికాలము కేరళము యొక్క అధికాంశ భాగమున వర్షములు అధి కముగా కురియును. కొట్టాయం జిల్లా యొక్క ఉన్నత పర్వత పక్తులలో 200 అంగుళములవరకు వర్షములు కురియును. కేరళముయొక్క వివిధ ప్రాంతములలో వర్ష పరిమాణము మారుచుండును. తిరువనంతపురములో సగ టున సంవత్సరమునకు 64 అంగుళములును, క్యాలికట్, కోఝికోడు ప్రాంతములలో 118 అంగుళములును వర్ష పరిమాణ ముండును. వర్షాభావమువలన కలుగు నష్టము కంటె, అతివృష్టివలన కలుగు నష్టమే అధికము. సంపూర్ణ మైన అనావృష్టిని కేరళ రాష్ట్రము ఎరుగదనయే చెప్ప వచ్చును. నేల : భూమియొక్క వైవిధ్యమునుబట్టి కేరళమును మూడు తరగతులుగా విభజింపవచ్చును. (1) సముద్రమునకు అతి సమీపముగా నున్న పిల్ల పు భాగము. (2) మధ్యభాగమున గల నిమ్మోన్నత ప్రదేశము. (3) రెండవ భాగమునకు తూర్పున కనుమలను ఆను కొనియున్న అడవులుగల అత్యున్నత భూభాగము . సముద్రతీరమునకు సమీముననున్న పల్లపు ప్రదేశము లందు కొబ్బరితోటలు, వరిపంట విస్తారముగా పండును. మధ్యభాగమున చిన్న గుట్టలు, లోయలు వ్యాపించి యున్నను, ఈ ప్రాంతమందే సేద్యమునకు అనువగుభూమి ఎక్కువగా కలదు. ఉన్నత ప్రదేశములు గల పర్వత భూభాగములందు విశేషముగా తేయాకు, కాఫీ, ఏలకుల తోటలు గలవు. అంతకంటే నిమ్న భాగములందు మిరియ ములు, అల్లము, రబ్బరు, పసుపు మున్నగు పదార్థములు పండును. అడవులు వన్య వృక్ష మృగజాతులకై ప్రసిద్ధి గాంచినవి. భూమి పంపిణి : కేరళరాష్ట్రములో భూమి ఈ క్రింది విధముగా పంపిణీ చేయబడియున్నది: అటవీ ప్రాంతము సాగుచేయబడిన మొత్తము 24, 82,644 యెకరములు ప్రాంతము పంటలుపండు నికరపు వై శాల్యము 54,65,424 44,76,877 ఆహార ధాన్యములు పండు వి స్తీర్ణము ఆహారేతర పంటలు పండు 38,02, 247 యెకరములు విస్తీర్ణము మాగాణి వి స్తీర్ణము(1956) 16,63,177 8,11,063 వ్యవసాయము : కేరళ రాష్ట్రీయులలో నూటికి 87 మంది వ్యవసాయము పై ఆధారపడియున్నారు. భారత దేశమున సగటున నూటికి 88 మంది ప్రజలు వ్యవ సాయమే జీవనాధారముగా కలిగియున్నారు. ఈ పరిస్థితి వలన వ్యవసాయానుగుణ్యమైన భూమిపై ఒత్తిడి మరింత హెచ్చుగానున్నది. వ్యవసాయము క్రిందనున్న భూమిని లెక్కించినచో, తలకొక 30 సెంటుల భూమి కలదని తేలుచున్నది. అందువలన నూటికి 55 వంతుల వ్యవసాయ కమతముల వైశాల్యము ఒక యెకరముకంటే తక్కు వగా నున్నది. వ్యవసాయవృత్తి గలవారి సంఖ్య 53.6% అనియు, వ్యవసాయేతరుల సంఖ్య 46.4% అనియు లెక్కలవలన తేలుచున్నది. నీటి వనరులు: కేరళ రాష్ట్రములో ఈ క్రింద ఉదహ రించిన నీటివనరులచే వివిధములైన పంటలు పండుచున్నవి: 3,27,671 కరములు ప్రభుత్వపు కాలువలు ప్రయివేటు కాలువలు 68,113 చెరువులు బావులు ఇతరములు 77,400 28,499 39 3,09,380 మొత్తము 8,11,063 యక రములు ప్రాజెక్టులు : ఈ దిగువ నుదహరించిన స్టేట్ మెంటు వలన ఆయా ప్రాజెక్టుల నిర్మాణమునకు ఎంతధనము వ్యయమయినదియు, వాటిక్రింద ఎంతభూమి లాభము పొందినదియు తెలియగలదు : ప్రాజెక్టు పేరు మొ త్తము లాభము వ్యయము పొందుభూమి (లక్షలలో) యెకరములు 1. నెయ్యార్ (మొదటితరము) 146.00 15,000 2. కుట్టినాడు (తోటపల్లి) వరద కాలువ 57.65 121,000 3. చాలకుడి (మొదటితరము) 128.25 28,400 4. పీచీ 5. వాఝూనీ 6. మల్లంపుఝూ 7. పాలయూర్ 8. మంగలమ్ 40 99 99 97.51 దాదాపు 9 కోట్ల రూప్యముల వ్యయముతో అంచనా వేయబడిన ఎనిమిది నూతన జలవిద్యుత్ప్రణాళిక.లలో 'తన్నీరు ముక్కం', 'మిన్కరా' అను నిర్మాణములు పూర్తియైనవి. విద్యుచ్ఛక్తి ప్రణాళికలలో ముఖ్యమైన 'పల్ల వాసల్' ప్రాజెక్టు క్రింద 87,500 కిలో వాట్ల విద్యు చ్ఛక్తి ఉత్పాదిత మగుచున్నది. రెండవదియైన 'సెంగు లమ్' ప్రాజెక్టు క్రింద 48,000 కిలో వాట్ల శక్తి ఉత్పా దింప బడుచున్నది. మూడవదియైన 'పారింగల్ కుత్తు' వలన 24,000 కిలో వాట్ల విద్యుచ్ఛక్తి తయారగుచున్నది. పంటలు (1955_56) : ౨ 1. వరి 2. పప్పుధాన్యములు 3. టోపియోకా 4. చెఱకు 5. మిరియాలు 6. అల్లము 7. పసుపు (కర్ర పెండలము)

235.00 46.000 107.57 12,800 528.00 47,600 116 66 8,000 6,000 13. జీడిపప్పు 14. వేరు శెనగ 15. ప్రత్తి 16. రబ్బరు 17. తేయాకు 8. నువ్వులు 18. కాఫీ 19. ఏలకులు 20. వివిధములు కేరళములో 9. నిమ్మగడ్డి (Lemongrass) పరిశ్రమలు : ఆధుని కావసరములగు పెక్కు భారీపరిశ్రమలకు సంబంధించిన రిజిస్టర్డు ఫ్యాక్టరీలు 62 కలవు. ఓడల నిర్మాణ పరిశ్రమ, కొబ్బరిపీచు పరిశ్రమ, రబ్బరు పరిశ్రమ, కలప పరిశ్రమ, షార్క్ లివర్ ఆయిల్ పరిశ్రమ, తేయాకు పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, జీడి పప్పు పరిశ్రమ మున్నగునవి ప్రత్యేకముగా పేర్కొన దగిన పరిశ్రమలు. మాతృభాషలు : మాతృభాష 1. మలయాళము 10. అరటి 11. కొబ్బరి 12. పోకలు జనసంఖ్య 1,26,65,626 కొంకణము 2. తమిళము 3. 4. కన్నడము 5. తెలుగు 6. మరాటీ 7. గుజరాతీ 8. హిందీ 9. ఇతరులు 1.02,0444 మతములు : మతముల ననుసరించి కేరళముయొక్క జనాభా ఈ క్రింది విధముగ విభజింపబడినది : జనాభా 1,35,51,529 83,60,596 29,35,385 22.02,774 308 52,466 కేరళ రాష్ట్రపు జనసంఖ్యలో ఈ క్రిందివారు చేరియున్నారు: షెడ్యూల్డ్ కులముల వారు షెడ్యూల్డ్ జాతులవారు 12,51,730 74,056 విద్య : మతము అన్ని మతముల వారు హిందువులు క్రైస్తవులు ము స్లిములు సిక్కులు ఇతరులు పాఠశాలలు ప్రైమరీ పాఠ శాలలు సెకండరీ పాఠశాలలు బేసిక్ పాఠశాలలు ట్రెయినింగ్ పాఠశాలలు టెక్నికల్ పాఠశాలలు ఫిషరీ పాఠశాలలు కళాశాలలు ఆర్ట్స్, సైన్సు కళాశాలలు బ్రెయినింగ్ కళాశాలలు మొ త్తము 5,92,968 67,688 47,468 43,576 20,203 6,036 5,920 సంస్కృత కళాశాలలు అరబ్బీ కళాశాలలు శరీర వ్యాయామ కళాశాలలు వైద్య కళాశాలలు 8666 762 104 443 50 33 10,058 44 13 3 3 2 2 41 ఇంజనీరింగు కళాశాలలు పశువై ద్య కళాశాలలు వ్యవసాయ కళాశాలలు

3 1 1 మొత్తము 72