శ్రీ దేవీ భాగవతము/ద్వితీయస్కంధము
శ్రీరస్తు
శారదాంబాయై నమ:
శ్రీ దేవీ భాగవతము
______________________________________
ద్వితీయస్కంధము.
—♦♦♦♦§§♦♦♦♦—
శ్రీ వనమృదుదళపూజా | సేవనపావన నతాళి చేతోవాంఛా
భావన సస్యప్రావృ | ద్జీవన ధర సంప్రవేశ శ్రీ సోమేశా. 1
వ. అవధరింపుము సూతుం జూచి ఋషు రిట్లనిరి. 2
-: మత్స్యగంధ్యుత్పత్తి :-
తే.గీ. గర్భహేతుక మాశ్చర్యకరమునైన | నీవు సెప్పినకథ మాకు నిక్కువముగ
నమృతమునుబోలె మధురమై యతిశయిల్లెఁ | గాని సందియములు మాకుఁ గలవు కొన్ని. 3
క. ఆ సత్యవతిని శంతను | దానం బెండ్లాడి సుతుల నందెనని యుప
న్యాసము సేసితివికదా | వ్యాసుం డెపు డుదయమందె నది యెట్లొదవెన్. 4
క. వ్యాసుఁడు పుట్టినపిమ్మట | నాసతికిం బెండ్లి యెట్టులయ్యను శత్రు
త్రాసియగు శంతనునితో | నో సుగుణగణాఢ్య చెప్పు మోపికమీరన్.5
వ. అనిన సూతుండు.6
సీ. ఏదేవినామంబు నిచ్ఛతో నుచ్చరించినమాత్ర సంకల్పసిద్ధి యొదవు
ఏపుణ్యవతి కాళ్ళ కెరగినంతనె చతుర్వర్గము ల్పొసగు ననర్గళముగ
ఏయమ్మ వాగ్బీజ మెనసి స్మరించినప్పుడే సర్వకామముల్ పూర్తములగు
ఏశక్తిచారిత్ర మెఱిఁగి పఠించిననాఁడె సంసరణార్తి నాశమందు
తే.గీ. నట్టి సర్వేశ్వరికి జగదాదిమూల | జననకారణమూర్తికి జ్ఞానమయికి
సకలసంపత్ప్రదాత్రికిఁ బ్రకృతిభూతి | కేను మ్రొక్కెదఁ జెప్పెద నిటు వినుండు.7
చ. ఉపరిచరాఖ్యుఁడైన వసు వుత్తముఁ డింద్రుని వేఁడి స్ఫాటికం
బపరిమిత ద్యుతిప్రకటమైన రథంబు గ్రహించి దానిపై
నుపరిగతిం జరించుచు మహోజ్వలుఁడై కడు ధర్మశాలియై
కృపణుఁడుగాక వర్తిలుచుఁ గీర్తివహించె ధరాతలంబునన్.8
ఆ.వె. అతని భార్య గిరిక యా సుందరికి నేగు | రాత్మజులు జనించి రతనివలన
మహిని వేఱువేఱు మాగాణములకును | పతులఁ జేసె దనదు సుతుల నతఁడు.9
క. గిరిక ఋతుస్నాతయగుచు | వరునకుఁ దన వలపుఁ దెలిపి వర్తిల నపుడే
నరపతినిఁ బెతరులుం గో | రిరి మృగముల బట్టి సంహరింపు మటంచున్.10
ఆ.వె. ఇంతిమాటకేమి సంతోషమందింతుఁ | బితల ననుచు నంత వేటకేగెఁ
జిత్తమెల్ల గిరిక చిన్నారి వగలపై | బత్తి పెతరులందుఁ బట్టి యతఁడు.11
ఆ.వె. ఎంత యడచుకొనిన నింతిమీదిఁ వలపు | గంతులిడుచు వచ్చి గొంతు బట్టి
పంతమెఁసగ భూమికాంతుని రేతస్సు | వింతమీఱఁ గ్రింద విడువఁజేసె.12
సీ. అంతట రాజన్యుఁ డావీర్యమును జూచి యిది వృథాభూతమై యిచటఁ బడియె
నయ్యయో ప్రేయసి కంపిన బాగంచు మదినెంచి మఱ్ఱాకు మడఁచి కుట్టి
యందుంచి వెంటనే యచటఁ దాఁ గాంచిన డేగను బిల్చి యో డేగ నీవు
వేగమ చని నాదు వెలదికి నిది యిమ్మటంచు దెల్పిన డేగ యమ్మహీశు
తే.గీ. వచనమును విని పుట్టికను పట్టి ముక్కు | నందు గట్టిగ బొసగించి యరుగుచుండ
ఖగమొకటి దాకి పోరుచో గమ్రవర్ణ | పుటిక యమునానదిం గూలి బుటుకుమనియె. 13
సీ. ఆవేళ నద్రికయను నొక్క యచ్చర యమునలో నొక్క ధరామరుండు
సంధ్యవార్వగజూచి స్మరబాణవిద్ధయై జలకేళిలోనుండి సరగవచ్చి
బ్రాహ్మణుపాదంబు బట్ట నాతడు సూచి కోపించి పోపొమ్ము కోమలాంగి
ఆడుచేపవు గమ్మటంచు శపించిన నట్లయి నీరంబులందు నుండి
తే.గీ. వసువు వీర్యంబు మ్రింగి తావర్తిలంగ | బల్లెవాఁ డొక్కడా చేప బట్టి పొట్ట
చింపినం బుట్టి రిరువురు చిన్నబిడ్డ |లొకటి మగవాఁడు మఱియొక్క టువిదయయ్యె. 14
క. అది సూచి మత్స్యజీవియు | మది నాశ్చర్యంబు నొంది మనుజేశున కి
చ్చెదనంచు దాశనృపతికి | నెదుట నిడిన నతఁడు మెచ్చి యింటం బెనిచెన్.15
క. మగవానికి మత్స్యుండన | దగు నామమునిచ్చె వాఁడు ధర్మపరుండై
జగమున వసుతుల్యుండై , నెగడెను రాజగుచు సౌఖ్యనిరతి నతండున్.16
ఉ. ఆఁదట మత్స్యగంధియను నాఖ్యను గంధము చేత బూనె
మత్స్యోదరియంచు జన్మమున నొప్పె వసుండును గాళికాఖ్య సు
శ్రీదముగాఁగ వేగ జలజీవికి నిచ్చుట గాళిపేరు సం
సాదితమయ్యె నిట్లు నిరపాయతఁ గన్యయుఁ బెంపగాబడెన్.17
వ. అని సూతుండు చెప్పిన విని యాశ్చర్యమగ్నులై శౌనకాదు లిట్లనిరి.18
తే.గీ. అచ్చర వెలంది ముని శాపమంది యాఁడు | చేపయై మత్స్యజీవను చేతఁ జచ్చె
ననుచు జెప్పితి వద్ది యేమాయె బిదప | స్వర్గమున కేగెనో? శాపశాంతి గలిగి.19
వ. అని యడిగిన విని సూతుం డిట్లనియె 20
క. శాపానంతరమున న | చ్చేపపడతి మునిని వేఁడ శీతలుఁడై యో
చేపా! మానపు లిరువురు | నీపొట్టం బుట్టఁ గలుగు నిజరూపమొగిన్.21
వ. అని యానతిచ్చిన మునివాక్యంబు క్రమంబున పుత్త్రీపుత్త్ర జననానంతరం బది మరల
నచ్చరయై స్వర్గంబునం బ్రవేశించెనని చెప్పి మఱియు.22
ఆ.వె. మత్స్యగంధి పాల్యమానమై యా దాశ | రాజుగేహమందు రమ్యరూప
గుణగణాఢ్యయగుచు మణిబోలె నాదర | ణీయయయ్యె నెల్ల నియతులందు.23
సుగంధి. ధీరుఁడై పరాశరుండు తీర్థయాత్రఁ బోవుచో
సూరజానదీతటంబు జూచి యందునిల్చి తాఁ
జేరియప్డు భోజనంబు సేయు దాశభూపతిన్
గోరెఁ దన్ను నన్యపారగు న్బొనర్పుమం చొగిన్.24
వ. అనిన విని తాను భోజనంబు సేయు కతంబున.25
క. దాశపతి హర్షమొనయ బ | రాశరమునిఁ దెప్పనిడి కరము వేడుక ఛా
యేశ సుతం దాటింపు ని | శేశానన యంచు నానతిచ్చెను సుతకున్.26
తే.గీ. తండ్రిమాటనుఁ దలమ్రోచి దాశకన్య | యమికులోడుపు నుడుపంబునందు నిడుక
యమున దాటించుచుండంగ నతివయొడలి | కాంతిఁ గనుగొని దైవయోగమున నతడు.27
సీ. పూతమంకెన మొగ్గ పోలిక నున్నదీ మోవి నే కలువాయి ముద్దులిడునొ
తెల్లదామరతూండ్ల తీరుననున్న యీ చేతు లేమలినాంగు చెట్టబడునొ
పలుచని యపరంజి పసిడిరేకులవంటి చెక్కు లేపలుగాకి నొక్కగలఁడొ
చిన్నారి యెలమావి చిగురాకువంటి యీ యడుగు లేమ్రుక్కడి యంటగలడొ
తే.గీ. చక్కదనమెంత హొయ లెంత జగ్గులెంత | జాణతనమెంత యీ కన్నెసాటి యున్నె
యేజగానను గాన నీయోజ గాన | దీని నంటెద ననుచు నుద్రేకి యగుచు.28
క. వలవులఱేఁడు పరాశరు | తలపు తలుపుఁ బగులనేయఁ దనువునఁ బులకల్
మొలవఁగఁ దన వలచేతన్ | వెలఁదుక వలపలికరంబు విడువక పట్టెన్.29
వ. అంత. 30
ఉ. గడ్డము సూచియో జడలు గన్గొనియో నిదుగాళ్లు సూచియో
దొడ్డవిభూతిపూత పులిత్రోళ్ళను జూచియొ పట్టియున్న మేల్
బుడ్డిని గఱ్ఱనుం గనియొ పూవిలుకానికి లోగి పల్లేరా
బిడ్డ యొకింత సిగ్గుపడి మెల్లన నవ్వుచు ముద్దుముద్దుగాన్. 31
సుగంధి. దొడ్డ జాతి సుశ్రుతవ్రతుండ వీవు సూడగా
నడ్డుగాన నవ్వసిష్టు నన్వయంబు నీదకా
మడ్డిమేను చేపకంపు, మంచిదంచు నెంచితే
యెడ్డెదాన నన్నుఁబట్ట నేఁటికిం బరాశరా.32
తే.గీ. బ్రాహ్మణకులంబు నీది నేఁ బల్లెదాన | వేదవిదుఁడవు శాస్త్రార్థవేత్త వీవు
తప్పుతడక లల్లిబిల్లి యీ తెప్పపాట | లాలకింపఁగ మనసాయెనా ? మునీంద్ర.33
క. ఎన్నడు నిటువంటిది నేఁ | గన్నది విన్నదెందు గాదు కడునీచము నా
యున్నయునికి బ్రాహ్మణుఁడవు ! నన్ను స్పృశించెద విది తగునా నీకిచటన్.34
పి. అనియిట్లు పలుకుచున్న యమ్మిటారిపలుకులు విని యంతకంతకు మోహింబగ్గలంబై
యమ్మునికుల సార్వభౌముండు చేతోజాతయాతనాతిభీతిం బరవశుండై యన్నాతి కరంబు
విడువకయ తటుక్కునం బడిన నదీజలంబుల మునుంగుదుమో యని బెదరి యదరిపడి
యద్దాశమదవతి గడగడ వడంకుచు నతనితో నిట్లనియె.35
మ. సరియే మంచిది నీప్రయత్నమునకున్ పంకింతు నామేని కం
పరియౌ నిందున కేమిసేయగలవో యన్న న్మునీంద్రుండు వి
స్ఫురణంబైన నిజప్రభావమున గర్పూరంపుఁదావుల్ దిశల్
గరప న్యోజనగంధిఁ జేసె నపుడే కళ్యాణియున్ రంజిలెన్. 36
క. వనితారత్నంబును యో | జనగంధిజేసి దాని శయమును మరలం
దనచేతఁ బట్టి పలికెన్ | వనజేక్షణ నీవు సత్యవతి విఁక నంచున్.37
క. ఇదికా సమయంబని తా | మదిఁ దత్తరపడుచునున్న మౌనిని గని యా
ముదిత పలికె నోబ్రాహ్మణ ! యదనా యిది పగలు చూతు రప్పయు నితరుల్.38
ఉ. రాతిరివచ్చుదాఁక మునిరాజు తొలంగుము పాశవక్రియల్
సేత యధర్మమౌ తగదు చీకటి మే లిది నమ్ముమన్న న
త్యాతురుఁడైన బాపఁడు రయంబున మంచును గల్గజేసి యో
నాతి యిఁకేల జాల మన నవ్వి పరాశరుఁ జూచి యిట్లనెన్.39
ఉ. మంచిది తాపసేంద్ర యొక మాటను జెప్పెద నాలకింపు మీ
మంచున నన్నుఁగూడి నిజమార్గము పట్టుదు రీరు మీ రమో
ఘాంచితవీర్యు లట్లగుట నాఁదట గర్భముఁ దాల్తు నేను నే
మంచు వచింతు దండ్రికి నయప్రణయ ప్రియ దారి చూపుమా.40
వ. అనిన పరాశరుండు.41
ఆ.వె. నన్నుగూడినందున న్గన్యకాత్వంబు | నీకు బోవదింక నీకు వలయు
వరము గోరు మదియు సరగున నిచ్చెద ననిన సత్యవతియు ననుమతించి.42
క. తలిదండ్రులు కన్నెననుచు | దలప వలయు నిన్నుబోలు తనయుండును గా
వలయును మేన సుగంధము | నిలపవలయు జవ్వనము గునియవలయుసుమీ.43
వ. అనిస సంతసించి పరాశరుండు.44
క. నారాయణు నంశంబున | ధీరుండగు కొడుకు బుట్టు తెఱవా నీకున్
వేఱొకటి చింతసేయకు | మారయుమీ నీకుమారు ననఘమతినిగాన్.45
తే.గీ. కన్నె యేనాఁడు నెఱుగని కామ మొదవె | నాకు నీమీఁద నచ్చరనాతి గాంచి
కోతిగా నెంచితిని మున్ను కుసుమశరుఁడు | నేడు నామీద దండెత్తె నిన్ను గూర్ప.46
క. నీకుం గలిగెడి కొమరుఁడు | లోకైకనుతుండు నిశ్చలుఁడుసుమ్మ సువి
ఖ్యాతుఁడు వేదవిభాగ ని | రాకులుఁడు పురాణకర్తయగునో ముగుదా.47
క. ఆ నెలఁత నూరడించి య | నూనామోదమున యమున యుదకంబుల
స్నానంబు సేసి చనియెన్ మౌనీంద్రుఁడు గర్భమపుడు మానిని కయ్యెన్.48
ఆ.వె. గర్భమైన యేఁడు గడియలలోననే | కొడుకుపుట్టె మన్మథుఁడొ యనంగ
పుట్టినపుడె తల్లిమొగ మట్టె తాఁ గని ! యిట్టులనియెఁ దేనె లుట్టిపడగ.49
చ. తపమున కేసుఁ బోయెదను తల్లి సుఖంబుస నింద యుండుమీ
కపటుఁడగాను నీకు నొక కార్యము గల్గిననన్ దలంపుమీ
యపుడె బిరాన వచ్చెద నటంచుఁ జనెన్ దదనంతరంబ యా
త్మపితృగృహంబు సేరె వనితామణి నిర్మల మానసంబుతోన్.50
ఆ.వె. ద్వీపమందుఁ బడుట ద్వైపాయనుండయ్యె | కృష్ణుకళను బుట్టి కృష్ణుఁడయ్యె
నందువలనఁగాదె నతఁ డెల్లఁదీర్థముల్ | శీఘ్రమే చరించెఁ జేసెఁ దపము.51
క. ఈమాడ్కిని సత్యవతీ | భామామణికిని జనించి వ్యాసుండు కలి
వ్యామోహితులం బ్రోవ ద | యామయుఁడై సంహితల సయంబుగఁ జేసెన్.52
క. భారతముఁ జేసి శిష్యుల | కారూఢిం గ్రమముదప్ప కధ్యయనము నిం
పారఁగ జేయించెను సువి | శారదుడై శ్రుతివిభాగసరణిఁ దలిర్చెన్.53
వ. మఱియు వ్యాసునొద్ద నధ్యయసంబు సేసిన వారిలో ముఖ్యులయినవారు సుమంతుండును,
జైమినియును, పైలుండును, వైశంపాయనుండును, నసితుండును, దేవలుండును,
నిజకుమారుండగు శుకుండును నై యుండిరని సూతుండు మఱియు ఋషుల కిట్లనియె.54
సీ. వ్యాసుండు దా సత్యవతికి జన్మించిన విధమెల్ల మీరలు వింటిరీకద
సంభవంబును మీరు సంశయింపఁగరాదు గొప్పవారలయందు గుణము లెన్న
వలయును దోషముల్ వర్ణించుట యఘంబు మొదల పరాశరు ముట్టినట్టి
బోఁటి శంతనుభార్య యౌటను ధర్మంబుకానట్లు తోఁచినగాని దైవ
తే.గీ. యోగమందదుగా మన యూహలకును | కాన నీ పుణ్యచరితంబు పూని విన్న
సకలపాపంబులు దొలంగు సౌఖ్యమొదవు | దుర్గతులుదూలు బుణ్యంబు తోడదిరుగు.55
-: గం గా శా ప ప్రా ప్త్యా ది కథనము. -
వ. అని చెప్పిన సూతుం గొంచి ఋషు లిట్లనిరి.56
ఆ.వె. అమితతేజుడైన వ్యాసుని పుట్టువు | సత్యపతి చరిత్ర సత్యఫణితి
వింటి మేము మిగుల వీనులు దనియఁగా | సయిన నొక్క సందియంబు గలదు.57
వ. అది యెద్ది యనిన.58
క. ఏ పేరుగలది సత్యవ తీపుణ్యవతికినిఁ దల్లి తెలుపు మెటుల న
య్యాపగ శంతనుఁ గూడెన్ | బాపరహిత భీష్ము డెట్లు వసుసుతుఁడాయెన్.59
క. శంతనుని. మొదటఁ గలసిన | కాంత యెవతె భీష్ముఁ డేల కాంక్షలుడిగె భూ
కాంతల పై జ్యేష్టుండై | సంతతసముదారకీర్తిశాలియు నయ్యెన్.60
క. మృతుఁగు విచిత్రవీర్యుని | సతి ధర్మవిదుండు వేదసారజ్ఞుడు స
న్మతి యెట్టుల గూడెన్ ఫ | ల్గుత నెట్టుల గుండ గోళకులఁ గల్గించెన్.61
తే.గీ. తెలుపుమిది మెల్ల మునినాథ తేటపడఁగ | ననిన విని సూతుఁ డిట్లను నయ్యలార
కలఁడు తొల్లిమహాభిషుం డలఘు కీర్తి | పరమధర్మాత్ముఁ డిక్ష్వాకువంశజుండు.62
క. వేయశ్వమేధములు సు | మ్మీ యాతఁడు నూరు వాజపేయంబులు సు
మ్మీ యొనరించెను సురగణ | నాయకు నలరించి యేగె నాకంబునకున్.63
క. ప్రకటయశుండగు నాతం | డొకనాడు వెసం బితామహుని పురికేగెన్
సకల సురవరులు తత్సే వకుఁ జని రత్త రిని గంగ వచ్చె నచటికిన్.64
తే.గీ. ప్రబలవాతంబు పొడమి యా బ్రహ్మయిల్లు దూగియాడంగ విబుధు లధోముఖులయి
యుండ నిశ్శంకత మహాభీషుండు గంగ | వలచె గంగయు నాతని వలచి చూచె.65
తే.గీ. బ్రహ్మ వారల యిరుపుర పాటు చూచి | మిగులఁగోపించి పుట్టుండు మీదు భువిని
పుణ్యవశమున దివికి రాఁ బొసఁగు మీకు | బొండుపొండని శపియింపఁ బొక్కి పొక్కి.66
క. మనసులు చెడి బ్రహ్మాంతిక | మును విడిచిరి వారు రాజు పుణ్యులు రిపుసూ
దనులయిన నృపులఁ బురుకుల | జుని దన పితయౌ బ్రతీపుఁ జొప్పడఁ దలచెన్.67
క. ఆనమయంబున నిజభా | ర్యాసహితులగుచును వసువు లతిమోదమునన్
భాసిలిరి వసిష్ణాశ్రమ | వాసులగుచు నిజమనోభివాంఛలకొలదిన్.68
సీ. వారిలో ద్యౌర్నామ వసువు నతనిభార్య - ప్రేమ నీక్షించి యో ప్రియుఁడ చూడు
మా ధేను వెవ్వరి దది మనోహరరూప | మున నొప్పు చెప్పవే యనిన నతఁడు
వనితరో యిది వసిష్ఠునియావు దీనిపాల్ | చవిగొన్న పురుషులు సతులును నయు
తాయువులగుచు నిరంతర యౌవనాం గు లగుదురని చెప్పఁ గోమలాంగి
తే.గీ. ధరిణియందు శీనరు తరణి నాకు | సఖి యది శుభాంగి కావున సరగ నీవు
దూడతోఁగూడ ధేనువు దూర్ణలీల ! గొంచు రమ్మిక నా చెలికొఱకు ననిన.69
వ. పరమతపోనిధియును శాంతుఁడు నగు వశిష్ఠుని నందినీ ధేనువు నపహరించి పృథ్వాది
వసువులంగూడి ద్యౌర్నామ వసువు చనిన నప్పరమతపస్వి యాశ్రమంబునకు వచ్చి
ధేనువుం గానక చింతిల్లి యనేక దుర్గమారణ్యంబులు వెదకి వెదకి వేసారి దివ్యజ్ఞానంబున
వసువు లపహరించిరని యెఱింగి కోపించి మీరు మానవజన్మంబు లెత్తుదురుగాత యని
శపించిన నది విని వసువులు వసిష్ఠుకడకుం జని శరణుజొచ్చి శాపమోక్షంబు వేడిన
నతండు దయార్ద్రహృదయుండై మీలో బృథ్వాదులగు నేడ్వురును గ్రమక్రమంబున
నొక్కొక్కవత్సరంబున నొక్కరుగా నేడు వత్సరంబులలో శాపంబుఁ దొలంగిన వారగుదురు.
నందినిం జేతులార దొంగిలించిన ద్యౌర్నాముండు దీర్ఘకాలంబు మానుష దేహంబున
నుండునని నుడివిన విని పృథ్వాదులగు వసువులు మార్గంబునం బోవుచుండ
నంతకుమున్న బ్రహ్మచే శప్తయై దుఃఖంబున భూలోకంబున కరుగుచున్న గంగం గాంచి
తారును దీనాననులయి యిట్లనిరి.70
ఉ. గంగ దయారసంబు సెలగంగను మమ్ముల మానుషత్వమే
గంగ నుపాయమొండు కలుగంగ దలంచితి మీవు భూమికే
గం గని శంతనుం గలయం గని పుట్టుదు మేము నీకు పే
గం గడుపాసఁ బుచ్చి తొలగంగ జలంబుల ద్రోయుమీ మమున్.71
క. అందున మేము కృతార్థత | నొంది సురాలయము మరల నొందుదు మనినన్
మందాకిని యందునకు న | మందానందంబుఁ బొంచె మరలిరి వారల్.72
ఆ.వె. మున్ను బ్రహ్మశాపమున మహాభిషుడు దా | బుట్టెనొగిఁ బ్రతీప భూమీపతికి
శంతనుండటంచు జనులెల్లఁ బిలువంగ | సధిక ధర్మశాలి యయ్యె నతఁడు. 73
క. తివిరి ప్రతిప మహీపతి | రవి కర్ఘ్యం బిచ్చునపుడు రమణి యొకతె యం
బువులందు జనించి నిజో | రువునం గూర్చుండ నతఁ డురుభ్రాంతి మెయిన్.74
తే.గీ. ఓసి యెక్కడిదాన వీ వొక్కనాడు, నెరుగనైతిని యిట్లు నా కెరుక సేయ
కేల తొడకెక్కితివి చూడ నింత వింత | గలదె యింతుల చేష్ట లిక్కరణినుండు.75
క. అనిన విని యవ్విలాసిని | జనానాథా యింతి యూరుసంస్థిత యగుటే
వని కనుగొంటివి వలచితి | ననుకొనుమా యేల నీకు ననుమాన మిఁకన్.76
వ. అనిన రా జిట్లనియె.77
చ. విను మటు సుందరీ యితరభీరువులం గొనకొల్ల నేను నీ
వును గుడియూరువుం దొలఁగ చొప్పునుఁ గోడలు బిడ్డ లెంతయున్
జనువుననుండుచో టదియ చాన మదీయసుతుండు నీకునుం
బెనిమిటి గాఁగలండు చనుమీ యన గంగదు నేగె నాదటన్.78
ఆ.వె. కొంతకాలమునకుఁ గొమరుండు శంతనుం డుక్కుమై వయోమహోజ్జ్వలుండు
గాఁగఁ జూచి రాజు కడువేడ్కఁ దా దపంబునకుఁ బోవఁదలఁచి పుత్త్రుజూచి.79
క. మునుపటి గంగాగమనం | బు నుదంతంబెల్లఁ జెప్పి పుత్త్రక నివా
వనజాక్షిని నీవెవ్వతె వని యడుగక నిన్నుఁ జేరినంతన కొనుమీ.80
ఆ.వె. దాని ధర్మపత్నిగా నేలి సుఖియింపు మునుచుఁ చెప్పి యడవి కరిగి యతఁడు
ధృతినిఁ బరమశక్తి దివ్యకారుణ్యంబు | వలన స్వర్గసుఖము వడసె నంత.81
క. శంతనుఁడును రాజ్యం బ ! త్యంత నయోన్నతినిఁ జేయు చఖిల జగద్వి
శ్రాంతయశుండై మించెన్ | సంతతభాస్వత్ప్రతాపశాలిత్వమున్. 82
-: గాం గే యో త్ప త్తి :-
వ. అని మఱియు సూతుం డిట్లనియె. 83
ద్విపద. ఆ ప్రతీపుఁడు దివం బందిన వెనుక, స్వప్రతాపము పేర్మి శంతను నృపతి
దివిజ గంగానదీ తీరంబునందు, గవయ గండకమృగాకలితమై యొప్పు
నడవికి వేటకై యరిగి యందుండి విడువక తనతండ్రి వివరించినట్టి
రూపయౌవనముల రూఢిఁ జెన్నొందు, నాపె సాక్షాల్లక్ష్మి యనఁగఁ జూపట్టె.84
వ. చూచి 85
మ. మెఱుపా యేమిది! కాదు కాదు చదల న్మేఘంబులే లేవు; బం
గరువీరా యిది! కాదు కాదు కొలుముల్ కాఱుల్ కనన్ రావు; చం
దురురేకా యిది ! కాదు కాదు. దిననాథుం డెక్కె నట్టాకసం
బెఱుగంజాలకయుంటిగాఁక నవలాయే సందియం దేటికిన్.86
శా. ఔరా దీని యొయారమేమి వగలే మాహా సుధాంథోజగ
న్నారీరత్నమొ కిన్నరీమణియొ గంధర్వాంగనారత్నమో
యేరీ మధ్యమలోకమందు సరివా రీకన్నెకుం గల్గిరో
లేరో భోగవతీపురంబునఁ గన ల్లీలాకలాపంబులన్.87
క. ఎవ్వతెయో యిది యీయెల | జవ్వనమే మిట్టు లొంటి సాహసమునఁ దా
నివ్వనిఁ జొఱఁగతమేమో నవ్విన గలగలని జారు నవరత్నంబుల్.88
చ. అడిగెదఁగాక దీని నని యంగము గంపిల నోట నాల్కయున్
దడబడ గ్రుక్కమింగుచుఁ బదంపడి మ్రాన్పడి చూచిచూచి యా
యొడయఁడు నత్తినత్తి సరియో సరికాదొ యటంచు నెంచుచున్
వెడవెడబాస నీనినిని వెవ్వవవర్తెవటంచు బల్కుచున్.89
క. నీముద్దునగవు సూచిన నామీదను బ్రీతిగల్లు నటనయ తోచెన్
లేమా నను బెండ్లాడుము | లేమా యిలుసొఱుము నిలుపలే మాస లిఁకన్.90
వ. ఇట్లు పలికెనని చెప్పి సూతుండు.91
క. అది గంగ యనుచు భూపతి | మది నెరుగడుగాని యెఱుఁగు మానిని యీతం
డదిర మహాభీషుఁ డీగతి | నుదయించెన్ - శంతనుఁడయి యుర్వి నటంచున్.92
వ. ఇట్లెరింగి. 93
చ. మదవతి రాజుఁజూచి మధుమాధురి దోపగ నల్లనవ్వుచున్
బెదవిఁ గదల్పుచున్ దనదు ప్రేమ బయల్పడజేయుచు న్బదిన్
బదిగ నిజాంగకంబులను భావము లుప్పతిలంగఁ బల్కె సొం
పొదవెడి నిన్బ్రతీపతనయుండ వటంచు నెఱుంగుదున్ నృపా.94
క. నవమన్మథ నిను గని యే | నవలా మదనాశుగముల నలిబిలిగా దీ
భువిలోన నేనునట్లయి | వివరించెద నాదు నియమవృత్తులు నృపతీ.95
తే.గీ. నేనుజెప్పినపని యెపుడు నీవు సేయ | వపుడు నే నిన్ను విడిచెద నృపవరేణ్య,
ఇదియె నాసమయము దీని కియ్యకొనిన , నేను నీదాన నిఁక ననుమానమేల.96
వ. ఇట్లు పలికి వసువులకోరికయుం దనలో దలపోసి తనసమయంబునకు రాజు నియ్య
కోలుం దెలిపి మనుష్యరూపంబున రాజుం బతింజేసికొని గంగ నిజమందిరంబునకుఁ
బ్రవేశించెనంత 97
క. నారాయణ....లును బృందారక విభుడును బులోమ తనయముంబలె నా
భూరమణుండును రమణియు | మారక్రీడలను మరలు మఱిఁగిరి ప్రీతిన్.98
ఆ.వె. కడుపుదాల్చి గంగ కాదు నిర్దయాపర యగుచు గన్నబిడ్డ నంబువులను
నునిచె నిట్టు లేడ్వురను జేసె వసువులే | వారు కాన పూర్వవరమువలన.99
తే.గీ. ఇట్లుచేసిన వగచి మహీశ్వరుండు బిడ్డలేడ్వురు చని రీ వివేకహీన
క్రూరకృత్యంబువలన నా కులము నిలుచు | దారి యిఁక నేది నెవ్వరి దూరువాడ.100
తే.గీ. ఎనిమిదవగర్భ మిప్పుడే యింతి దాల్చె | నెట్టులైనను గానిమ్ము గట్టువాయి
యేమిచేసిన చేయని మ్మెదుటనిలిచి పట్టి బ్రతికింతు సతి నొక్క నెట్టునెట్టి.101
క. అని డెందము దిట్టపఱచి మనుజేశుం డుండె నంత మానిని గర్భం
బున బుట్టె వసిష్ఠుని గో వును మ్రుచ్చిలినట్టి వసువు బుడుతం డగుచున్.102
ఆ.వె. పుట్టినట్టి సుతునిఁ బురిటింటిలోఁజూచి పాపురాలు వీనిఁ బట్టి చంపు
నకట యనుచు భార్య యడుగులపైబడి | వగపుమీర దీనవచనములను.103
మత్తకోకిల. నీలకుంతల నీకు దాసుఁడ నేడు దోసిలియొగ్గితిన్
జాలి లేక జలంబులో సుత సప్తకంబును ద్రోచితీ
వేల కూల్చెద నష్టమార్భకు నింత నిర్దయురాలవై
పాలపాపఁడు వీఁడు చేసిన పాపమేమి వచింపుమా.104
క. అని పలుకుచున్న రాజు వచనము విన కతివ బిడ్డఁ జంక నిడి వెసన్
గొనిపోవుచుండగ నెదు ర్కొని నరవరు డనియె మిగులఁ గుపితుం డగుచున్.105
తే.గీ. ఓసి పాపిష్ఠురాల నీ యుల్లమునకు నల్లఱాయియే సరిపోల్పఁ జెల్లుఁగాక
కులమునిలిపెడి నా ముద్దు కొమరు నిచట | వైచి నీ యిచ్చకొలఁదిని లేచిపొమ్ము.106
వ. అనిన నయ్యువతి రాజుంజూచి యో సర్వంసహావల్లభా నేను గంగను . దేవకార్యా
ర్థంబు మనుష్యశరీరంబుతో వచ్చి భూలోకంబుస నిన్నుఁ గలిసితి నాకు జన్మించిన
వారు వసిష్ఠశప్తులగు వసువులు; అందేడ్వురు మత్కృతంబగు జలపాతంబునం
జేసి ముక్తులయిరి; యితండు నీకుం గొడుకు గాఁగలవాడని జెప్పి మఱియు.107
ఆ.వె. తల్లి పెనుపవలయుఁ బిల్లల నదిగాన, విమలవృత్తితోడ వీని బెంచి
చదువు గఱపఁజేసి సామును జెప్పించి | యౌవనమున నీకు నప్పగింతు.108
క. మనమునఁ గోపింపకు నేఁ | బనివినియెద ననుచు సమయఫక్కినిఁ జనఁగా
మనుజేశుఁడు దుఃఖితుఁడయి | చని రాజ్యము సేయుచుండె జగము పొగడఁగన్.109
ఆ.వె. అంతఁ గొంతకాల మరుగంగ నొకనాడు ! పేటతమక మాత్మ వేగిరింప
విబుధనది తటమున విపినంబులోఁ జేరి | స్తోకజలను గంగ జూచి యపుడు.110
క. వింతపడియుండఁగా నా చెంతను శరములుసు విల్లు చేఁబూని పటు
స్వాంతుఁడయి యాడు నొక ధీమంతునిఁ గని కొడుకటంచు మది నెఱుఁగ కొగిన్.111
ఆ.వె. ఓమహాకుమార యో మన్మథాకార | శరాశరాసనప్రచారధీర
చిన్నబిడ్డ నిన్ను గన్నవా రెవ్వరో | తెలుపుమయ్య, ప్రీతిఁ గొలుపుమయ్య.112
వ. అనిన విని యబ్బాలుండేమియు బలుకక శరాశరాసనంబు లచ్చటన విడిచి సాంద్ర
తర వృక్షపఙ్త్కివలన మరగి చనియె నంత రాజును మిగుల చింతాక్రాంతుడై
యుండం జూచి దివ్యనది తొల్లింటి మానుషవేషంబున జనపాలు నెదుటం బడినం
జూచి గంగయని యెఱింగి ఈబిడ్డఁ డెవం డిక్కడనుండఁ గతంబేమి యని యడిగిస
గంగాదేవి యిట్లనియె.113
క. ఈబిడ్డడు నీబిడ్డడు | నేఁ బట్టిననాడు పుట్టె నేనీతని గా
రాబమునఁ బెంచితిని విద్యాబుద్ధులు వీని కొదవె నార్యులవలనన్.114
క. నీ సుతునిం గొనిపొమ్ము, మహాసుఖముననుండు మింక ననిపల్కఁగ నా
రాసుతుఁడు హస్తిపురికిం ! జేసె బ్రయాణంబు సుతుని జేకొని కడఁకన్.115
చ. గజపురికేగి శంతనుడు కార్యమెఱింగి ధరాసురోత్తమ
వ్రజమును బిల్వనంపి శుభవాసరలగ్నము లొప్పఁ జూచి భూ
ప్రజలు నుతింప దివ్యనదిపాపని కిచ్చెను యౌవరాజ్యమున్
గజిబిజి లేక యేలెను జగంబును ధర్మముఁ దప్ప కెంతయున్.116
వ. అని చెప్పి మఱియు సూతుండు మునులారా ! గాంగేయోత్పత్తియు గంగావతరణం
బును వసుసంభవంబును వ్యాసునివలన విన్న తెఱంగున మీకు వివరించితినని చెప్పిన విని
శౌనకాదులు సూతుంగాంచి, యయ్యా మావేడినకొలంది నెల్లయుదంతంబులు
సవిస్తరంబుగా నానతిచ్చితిరి. యోజనగంధి శంతనున కెట్లు ప్రాప్తించెనో వినవలఁతు
మనిన సూతుం డిట్లనియె.117
-: సత్యవతీ శంతను సంవాదము. :-
ఉ. ధర్మపరుండు శంతనుఁడు దా మృగయార్థ మరణ్యభూమికిన్
దుర్మద భల్లుకేభకిటి ధూనన కృత్యమునం బ్రజావళీ
శర్మకరుండనౌదునని చారుశరాసశరాళితో లస
ద్వర్మము దాల్చి యేగెఁ బరివారముఁగూడి పటుప్రతాపుఁడై.118
క. రురుకరి భల్లుకగండక | హరికిరిశార్దూల వృకహయారిముఖపరం
పరఁ దునుముచుఁ గాళిందీ | వరకటముంజేరి యచట వసియింపంగన్.119
చ. గమగమఁ జుట్టు ప్రక్కలను గమ్మనితావులు గ్రమ్మ నాసికా
గ్రమునకు వచ్చి తన వివరంబులఁజొచ్చి నిమేషవృత్తి డెం
దమునకు ప్రీతినిచ్చిన నతండు వితాకున నెల్ల దిక్కులన్
నెమకుచుఁ దద్గుణిన్ దెలియ నేరక యెంతయు భ్రాంతచిత్తుఁడై.120
సీ. కస్తూరి గంధంబు కాఁబోలునందమా గంబూరవాసన వలదు కొంత
కలువపూవుల తావి కాఁబోలునందమా కమలంబుల వలపు కలదు కొంత
కనకపు గమగమల్ కాఁబోలునందమా కల్పంబు ఘుమఘుమల్ కలవు కొంత
ఘనసాంకవము గబ్బు కాఁబోలునందమా లలిచందనపుఁగంపు కలదు కొంత
తే.గీ. ఎయ్యది దలంప నయ్యదే యందుదోచు | న రయ సద్గంధ సర్వస్వహారియైన
వస్తువెయ్యెడఁ గాన నీవసుధ లోన గలదని గణింప నది యెంత వెలదియొక్కొ! 121
తే గీ. అనుచు జనిచని ముందట నవనివిభుఁడు | రమ్యతరగాత్రి శృంగారరసవిధాత్రి
లోచనానందకర్త్రి శోభాచమత్క్రి యాదిభర్త్రి నొకర్తుక నతఁడు గాంచె.122
తే.గీ. కాంచియచ్చెరువంది భూకాంతుడపుడు స్తంభమునుఁవోలె నొక్కింత దడవు కదల
మెదలఁ జాలక యుండంగ మెయిచెమర్చె గగురుపాటును దడబాటు గలిగెనంత.123
తే.గీ. పదములఁ బదేపదేసూచి పైనఁ బైన | నూరువుల నూరువలనులఁ గోరిచూచి
కాంచి గాంచి కుచద్వయి కడలఁ జూపు | లిరుకుసందునఁ గదలలే కీడిగిల్లె.124
క. రెప్పార్పక జననాధుం | డొప్పుల కుప్ప యొరపైన హొయలుంగని తాఁ
దెప్పిరిలె నెట్టకేలకు | నప్పా, కాముకుల భావ మట్టిదియకదా.125
క. ఆగంధము దానిదకా సాగరవసనావిభుండు సరగున నెఱిఁగెన్
లోఁ గొన్నవలపు బలిమిన్ | దాగన్నియఁజూచి పలికెఁ దత్తరపడుచున్.126
క. వినుమా యిటుల భవాదృశ | వనజాక్షీ ప్రాగ భావవతియగు ధరణిన్
నిను నేఁ దత్ప్రతియోగిని | వనుచున్ దలపోయుచుంటి ననుమానమునన్.127
తే.గీ. సారవాసనలెల్ల నీ చక్కినిలచెఁ | గలిగెనిది పూర్వభవవాసనలనుబట్టి
యెపుడు సంసారవాసన లెఱుఁగనట్టు | లున్నదానవు పరికింపఁ జిన్నదాన.128
ఉ. ఎవ్వతెవీవు నీ వెవని యింట జనించితి వేది కారణం
బివ్వని సంచరింపఁ జెలు లెప్వరు గానఁగరాని హేతు వే
మవ్వ యెవర్తె తండ్రి యెవఁ డా యనో లేదా వివాహమింతయున్
జివ్వునఁ దెల్పి నామనసు చిక్కును విప్పుము మ్రొక్కెదం జెలీ.129
ఉ. నావిని నవ్వి సిగ్గుఁబడి నాతియొకించుక దవ్వునందు దా
భూవిభుమోముఁ జూచి యొక పోలిక వాల్గనులార్చి దేవ దా
శావనిభర్తకూతురఁ దదాజ్ఞ జరించెద గన్య ధర్మ స
ద్భావతఁ; దెప్ప లాగెదను దండ్రి గృహంబున కేగెఁ గావునన్.130
వ. అని విరమించినఁ గాంతామణింగాంచి కురువీరుండు మనోభవుని బారింబడి నిలువలేక
యిట్లనియె.131
క. ననుఁ గురువీరుని నీభర్తనుగా గైకోలుసేసి దర్పక శరబా
ధను దీర్పుము దాసుఁడ నే | ననుకొనుమీ ధర్మపత్ని వగుమీ నాకున్.132
క. మును నాకు గల దొకర్తుక | చనియెన్ ననువిడిచి పిదవ సతి వేఱొకతెన్
గనుఁ గొనలేదో ముద్దియ ! నినుఁగాంచితి వలపు నిలుపనేరనుజుమ్మీ.133
ఉ. నావిని కన్యకామణి ఘనంబగు సాత్వికభావవైఖరుల్
త్రోవనె రా నెదుర్కొనిన దోచియు దోచని యట్లు కొంతసే
పేవిధిఁ బల్కనో యనుచు నెంచి ధృతిం దగఁ గీలుకొల్పి యో
భూవర తండ్రిచాటు పువుబోణిని నన్నడుగంగ బాడియే.134
ఉ. ఎల్లిదమైతిగాక నృప యెన్నడెఱుంగవె లోకవార్త నా
యుల్లమునందుఁ గోరిక లెటుండిన నేమి వివాహమైనచో
నల్లుడ వంచు మా జనకుఁ డంపిన నీకును ధర్మపత్నిగాఁ
జెల్లునుగాక వేఱొకటి చేసినచో నగుబాటుగాదొకో.135
ఉ. నీవును సార్వభౌముఁడవు నీకుసు నన్నొడఁగూర్ప కింక దా
నే వరు గొప్పవాని గణియించి ననుం బిత ధారవోయునో
భావజసన్నిభాంగ! మన పాలిటి దైవము మంచిదైనచో
ధీవరుడైన దాశనృపతిన్ మనవానిన చేయు నమ్ముమీ.136
ఉ. సిగ్గగుచున్నదో మనుజసింహ నినుం గని నప్పుడే యొడల్
గగ్గురుపారెఁ జెమ్మటలు గ్రమ్మె నయో మదనార్తి కెంతయున్
మ్రగ్గినదాన వెక్కసపు మోహమి దెక్కడ దాపురించే నా
యగ్గలమైనదప్పి కధరామృతధార లొసంగి ప్రోవవే.137
క. మాతండ్రి సమ్మతించినఁ | బ్రీతిన్ గళ్యాణ మొడవు పిత యొప్పనిచో
భూతలనాథ స్వయంవర | భాతిన్ సమకూర్చుకొనుము పాణిగ్రహమున్.138
క. విని రాజు దాశునింటికిఁ | జనిన నతఁడు మ్రొక్కిపలికె జననాయక దా
సుని నన్ను ధన్యుఁజేయఁగఁ | జనుదెంచితి వేది సెలవు సరగఁ దెలువుమీ.139
వ. అనిన జనవల్లభుండు.140
ఆ.వె. దాశవర్య నీదు తనయను నే ధర్మ | పత్నిఁ జేసికొనఁ బ్రయత్నపడితి
నందు కియ్యకొను మనం దాశు డారాజుఁ | జూచి యిట్టు లను నయోచితముగ.141
ఆ.వె. చేయఁ దగిన పనిన చేయవలయుఁ గాక ! చేయరానిదెట్లు చేయవచ్చు
నొక్కమాటయున్న దొప్పెదవా నీకు | గూతు నిచ్చుటకును కొఱత లేదు.142
వ. అతి యెద్దియనిన.143
క. ఈరమణికి జనియించు కుమారునకున్ రాజ్యమిచ్చి మన్నింపఁ దగున్
వేఱొక్క కుమారకునకు | నీరా దీ సత్యమునకు నియ్యకొనియెదో.144
వ. అనిన విని రాజు గాంగేయు మనంబునం దలంచుకొని యిదియెట్లు సిద్ధింపఁ గలదని
చింతాక్రాంతుఁడై గృహంబునకుఁజని నిద్రాహారస్నానపానాదులు వర్జించి కుందు
చున్న నది యెఱింగి గాంగేయుడు తండ్రికడ కరిగి. 145
ఆ.వె. నిదురలేక కుంద నీకేల నాతండ్రి | ప్రబలుఁడైన యొక్క పగతు చేత
గెలువఁ బడితె వేగఁ దెలుపు మే నిపుడేగి | గడియలోన వాని గర్వమడఁతు.146
క. తనయుఁడు పుట్టుట తండ్రిం | దనియించుట కొఱకుగాదె ధర్మజ్ఞులు చె
ప్పినదది తప్పదు ప్రాగ్భవ మునఁజేసిన ఋణముదీర్ప బుత్రుఁడుపుట్టున్.147
సీ. తండ్రివాక్యమును సత్యముసేయనేకాదె రాముండు సనియె నరణ్యములకు
తండ్రివాక్యమును దాఁ దలమ్రోచియేకాదె పరశురాముఁడు తల్లి నఱికివైచె
తండ్రివాక్యము యథార్థముసేయనేకాదె వృథివి రోహితుఁడు దాఁ గ్రీతుఁడయ్యె
తండ్రిమాటను దప్ప దగదనికా శునశ్శేపుండు యూపంబు సేరఁబోయె
తే.గీ. నాదికా దీ శరీరంబు నీది సుమ్ము | ఎందుఁ బంచిన బోయెద నేదిసేయు
మనిన జేసెదనింక నీ మనమునందుఁ దాప మేటికి శోకింప దగదు తండ్రి.148
ఆ.వె. దేహమస్థికంబు దేహి దాఁజేసిన ! పనులు నిలిచియుండు జనవరేణ్య
చింత దెలువుమయ్య చేత విల్లమ్ములు | పూని నిర్వహింతు భూమి మెచ్చ.149
ప. అని పలికిన కొడుకుమాటలు విని రాజు లజ్జపడి నాయనా నే నేమనిచెప్పెద నాకు
నీవొక్కరుండవ కుమారుండవై తివి నా జీవితంబు వ్యర్థంబుగదా నీకుఁ గీడుకల్గెనేని
నాకుం గతిఎద్ది యని వగచుచుంటి నా కొండొకచింత గలదని నేను నీయెదుట నెట్లు
వచింతునని తలవాంచి యూరకున్నంగని దేవవ్రతుండు వృద్ధబ్రాహ్మణులం బిలిపించి
తండ్రియున్న విధంబును దన కతండు లజ్జచేఁ జింతాకారణంబు దెలుపకుండుటయుం
జెప్పిన వార లరిగి భూనాయకు నడిగివచ్చి యథార్థంబు తేటపడం దెలిపిన పని
గాంగేయుండు. 150
క. భూసురులఁగూడి దివిజనదీసుతు డద్దాశుఁజేరి తేటపలుకులన్
నీసుత మాతండ్రికి ని మ్మీ సతిగా ననుచు నడుగ మేలని యతడున్. 151
క. నాసుతను నీవు కొనినన్ | భాసురముగ దానికొడుకు ప్రభువై ప్రబలున్
వాసిగలిగి నీవుండగ గాసిగదా రాజునకును గన్నె నొసగినన్. 152
ప. అనిన గాంగేయుండు.153
మ. వినుమా దాశవరేణ్య నీతనయ పృధ్వీనాధు సేవించినన్
జనదే నాకును దల్లియై పిదపఁ దజ్జాతుల్ సుతుల్ రాజ్యమున్
గొనగా నేర్తురు నేను రాజ్యమును గైకోల్సేయకుండం దలం
చినవాడ న్మది నమ్ము మేటి కిఁక నీ చింతల్ దయం బ్రోవుమీ.154
క. అనిన విని దాశుఁ డిట్లను | ననుమానయితేటు సత్య మావల నీకున్
దనయుండు కలిగి బలిమిం | గొనలేడా రాజ్యమెల్లఁ గుటిలుం డగుచున్.155
క. నావుడు భీష్ముం డిట్లను | నో వివిధవిధిజ్ఞ పెండ్లి నొల్లక ధృతిమై
గావించెద భీష్మవ్రత | మీ వింకం జిందనొంద నేటికిఁ జెపుమా.156
క. విని యంత పల్లెదొర దాఁ | దన తనయన్ శంతనునకుఁ దగ నొసఁగి సుశో
భనముగ బెండిలిఁ జేసెం | జనవిభు డెఱుగండు వ్యాసు జన్మము సుండీ.157
-: ధృ త రా ష్ట్రా ద్యు త్ప త్తి :-
సీ. మునులార యివ్విధంబున సత్యవతి శంతనుని బెండ్లియాడిన వెనుక నాపె
యిరువురు తనయుల నెనసె వారలు బోయి | రవల దద్భార్యలయందు వ్యాసు
వీర్యంబునను బుట్టె వింటిరకా ధృతరాష్ట్రుండు గృడ్డియై రాజ్యమునకుఁ
బాత్రుండు గాడాయెఁ బాండురాజును బుట్టె విదురుండు దాసియం దుదయమయ్యె
తే.గీ. ప్రథమ కన్నులుమూయుటఁ బట్టి కొడుకు చీకువాడాయెను ద్వితీయ చేరి తెల్ల
బోయె నందున శ్వేతరూపుడు జనించె మూడవది సంతసిలి కాంచె ముద్దుకొమురు.158
సీ. అంతట భీష్ముని యనుమతిఁ బాండురా | జేలె రాష్ట్రంబు నిరీతికముగ
వినుడు మేధావియౌ విదురుండు మంత్రిత్వ | మెనసి మంత్రము నిర్వహించుచుండె
ధృతరాష్ట్రుఁక నువాని కిద్దరు భార్యలు | గాంధారి సౌబలి క్రమముమీర
భామ రెండవయది కోమటి చిన్నది గార్హస్యధర్మముల్ గడుపుచుండె
తే.గీ. పాండునకు భార్యలిరువురు పరగఁ గుంతి | మాద్రియు ననంగ గాంధారి మహితులైన
సుతుల నూర్వుర గనే యుయుత్సుండనంగ , గడుపు పంటాయెఁ గోమటిపడుచునకును.160
ఆ.వె.పెండ్లిగాకమున్నె పితృగేహమున గుంతి | సూర్యునంశ మెనయ సుతునిగాంచె,
బిడ్డ కర్ణుఁ డనుచు బిలిచిరి , భూప్రజల్ పిదపఁ బాండురాజుఁ బెండిలాడె.161
వ. అనిన విని ఋషులు సూతున కిట్లనిరి.162
క. భువిపైఁ గుంతికి దివిపై | రవికిన్ సంయోగమెట్లు రహి గర్ణుని సం
భవమెట్లు కన్యయై యెటు | ప్రవిమలతం దండ్రి యింట బాల వసించెన్.163
వ. మహానుభావుండవైన నీకుం దెలియనిది లే దిది మాకుం దెలిపి కటాక్షించవే యనిన
సూతుండిట్లనియె.164
ఆ.వె. శూరసేనరాజుసుతఁ గుంతిఁ గుంతిభోజుందు పెంచుచుండి సుకృతులయిన
వారిఁబూజసేయఁ బంచిన నల్ల కా ! నించుచుండెఁ గన్య విధులెఱింగి.165
క. ఈసరణి నుండఁగా దుర్వాసుండను జటిల విధుఁడు వచ్చినం గని పూ
జాసామర్థ్యము జూపిన | దా సంతోషించి మిగుల దయదైవారన్.166
క. కన్నియ నీకొకమంత్రము | చెన్నుగఁ చెప్పెదను దానిఁ జేకొని జపమున్
గ్రన్నవ జేసిన నీకుఁ బ్రసన్నుండగుఁ గాంక్షితాభ్రచరుఁడని పలికెన్.167
చ. అతఁ డది సెప్పి యేగిన యనంతర మా కలవాణి మంత్రశు
ద్ధతఁ గనుగొందునంచు నొక దైవము నారసి యప్పుడే ప్రపూ
ర్ణత నుదయించియున్న దిననాధుఁ దలంచి జపింప మానుషా
కృత రవి భూమికం దిగియె రివ్వునఁ గన్యకయున్న చోటికిన్.168
తే.గీ. ఆ మహోనిధి నీక్షించి యబలమిగుల | సిగ్గుపడి యొక్క టనలేక చెదరిబెదరి
మూలమూలల కొదుగుచు ముఖమువాంచి | యెట్టకేలకు ధృతబూని యిట్టులనియె.169
ఆ.వె. మానకేను మంత్రమహిమంబు పరికింవ | నిను జపించినంత నీవు గరుణఁ
జేసి తింతెచాలు నా సేయు పుణ్యంబు | సఫలమాయె పొమ్ము సత్యచరిత.170
వ. అనిన విని దివాకరుఁడు.171
క. క్రన్నన మంత్రముచేతన్ ! నన్నేటికిఁ గోరితీపు నళినదళాక్షీ
నిన్నుం గలయఁగఁ గోరిక | యున్నది తీర్చెదవొ లేదో యువిదా చెపుమా.172
క. అయ్యయ్యో నేఁ గన్యక | నయ్య గృహంబుననె యుంటి నార్యులు నగరా
వేయ్యారులుగా మ్రొక్కెద | నయ్యా పోవయ్య నాకు నారడు లేలా.172
క. అనుడు దిననాథు డిట్లను | వనితా నే నిన్ను జూడవచ్చియు వృథగా
జనిస ననుఁజూచి నగరే | వినుమా యిది వినకయుందువే కీడొదవున్.173
తే.గీ. మంత్రమును నీకొసంగిన మౌనిపనియు | నీపనియుఁ జూడుమికి నేను శాప మిత్తు
జెప్పినట్లొనరించినఁ జెలియ నీకు ధర్మమెరియదు నావంటి తనయుఁ డోదవు.174
ఆ.వె. పిలువగానె వచ్చి ప్రియురాలవగుమని , తేటలైన మంచిమాటలాడ
గన్నెపడుచ ననిన గనులెఱ్ఱఁగాఁజేయఁ | బొంచి పొంచి ప్రొద్దుఁ బొలతిఁ గలసె.175
క. చెన్నుడు గిలసిన గడియన | కన్నియ గర్భంబుదాల్చె గర్భంబై తా
నున్న క్షణంబుననే యొక | చిన్న కొడుకు గనియె నిది విచిత్రముగాదే.176
ఆ.వె. దాది యొకతెదక్క దక్కినవా రేరు నెఱుగ రిద్ది పిదప నిద్ధమూర్తి
యైన బాలుఁ జూచి రా యిర్వురును దమ | కన్నులార నొక్క గడియసేపు.177
ఆ.వె. కవచకుండలములు గడుసొంపుమీరంగ భువిని బొడుచు సూర్యుపోల్కి నపర
శక్తిధరునిచాయ జను బాలకుని దాది | కరములందు నిడుక కన్య కనియె.178
క. ఎందుకు జింతించెదవో మందగమన వీని నొక్క మందసమందు
బొందింపుమమ్మ విడిచెద నెందేనిం బోవుఁ బిదప నెట్లగునొక్కో.179
వ. అనిన.180
తే.గీ. ఏమిసేయుదునమ్మ నే నిపుడు దాది | యింతముద్దులబిడ్డ నే నెట్లువిడుతు
దైవగతి యిట్టులాయె నెద్దారి నాకు | బిడ్డా బిడ్డా యనుచు విలపించె గుంతి.181
పసంతతిలక. రక్షించుమమ్మ శ్రుతిపారగ కామదాత్రీ
రక్షాకరీ జగదుదారపురాణకర్త్రీ
ప్రేక్షావళీలలితమూర్తి సమస్తధాత్రీ
పక్షీంద్రవాహన శివాబ్జకుమారభర్త్రీ.182
క. అమ్మా ముజ్జగముల గ | న్నమ్మా యీ చిన్నబిడ్డ డాకఁలి గొనుఁ బా
లిమ్మా నమ్మితినమ్మా ముమ్మాటికి నీదుపాదములె దిక్కమ్మా. 183
తే.గీ. విజనవనమందు బిడ్డని విడువనాయె నయ్యయో యెంతదౌర్భాగ్యురాల నైతి
నెంతపాపము వచ్చె నా కేదిగతియొ | యనుచు మందసమునఁ బాలు నునిచి యంత.184
ఆ.వె. దాది చేతికిచ్చి యోదేవి రక్షింపు మనుచుఁ గొంతసేపు. వనటఁగుందెఁ
బిదప దాది చిన్న బిడ్డనిఁ జాటుగా గొని చనంగ మార్గమున నెదిర్చి.185
క. సూతునివెలఁదుక రాధ మ హాతతమతి దాదిఁ జూచి యది యెద్దియనం
బ్రీతిమెయి నిజముసెప్పగ | నాతనయుని జేసికొందు నా కిమ్మనినన్.186
తే.గీ. రాధ దాఁ బెంచెఁ గర్ణుని రహి నతండు | సూతునింటను బెరిగి విఖ్యాతుఁడయ్యె
నతిబలుండని జగమెల్ల నభిసుతింప | నతని మహిమంబుఁ దెలియు భారతమునందు.187
తే.గీ. పిదప బాండుని వరియించె భీతహరిణ | నేత్ర కుంతి స్వయంవర నిపుణయగుచు
మద్రరాజు కుమారిక మాద్రియనెడు ! భామినియుఁ బాండు రెండవ భార్యయయ్యె.188
తే.గీ. వేటకని పాండురాజు దా విపినమునకుఁ బోయి మృగరూపు నొకముని నేయ నతఁడు
శాపమిచ్చెను నీకు స్త్రీ సంగమంబు గలిగినప్పుడె మరణంబు గలుగునంచు.189
క. అది విని శోకాకులుఁడై | వదిలెను రాజ్యం బరణ్యవాసము సేసెన్
మదవతు లిద్దరు దనకున్ ముదమున బరిచర్యసేయ మునుకొని యచటన్.190
సీ. మందాకినీ తీరమందు ఋష్యాశ్రమంబుల నుండి తపమును సలుపుకొనుచు
మునిముఖ్యులు పురాణములు ధర్మశాస్త్రముల్ చదువంగఁ జెవులొగ్గి చాలవినుచు
సుతులు లేకున్నను గతులు లేవను నట్టివాక్యమొక్కటి విని వనటఁ బొగిలి
అండజుండును మహితాత్మజుండును క్షేత్రజుండును మరి గోళకుండు కుండుఁ
తే.గీ. డును సహోఢుండు కానీనుఁడును దలంపఁ గ్రీతుఁడును బ్రాప్తుఁడును బరికింప దత్తు
డనెడువా రుత్తరోత్తర మల్పతరులు ననుచుఁ దా నెంచి కుంతితో ననియె నిట్లు.191
క. నా యాజ్ఞను గైకొని యో ప్రేయసి తాపసుని గూడి ప్రియపుత్రుని స
న్న్యాయమున గనుము నా విని | యాయమ యిట్లనియెను నుర్వరాధీశునకున్.192
తే.గీ. తొల్లి దుర్వాసుఁ డధిక సంతోషమునను నాకొసఁగె మంత్రమొక్కటి నాథదాని
వలనఁ గోరిన దేవుఁడు వచ్చి యిచ్చు వరమనుచుఁజెప్పి పతియాజ్ఞ వడసి పిదప.193
సీ. ధర్ముని జపియించి తద్వరంబునఁ జేసి శ్రీమంతుఁడగు యుధిష్ఠిరునిఁ గనియె
వాయువుఁ బ్రార్థించి వానివరము గాంచి పృధుబలుడైనట్టి భీముఁ గనియె
నమరేంద్రు బ్రార్థించి యతని వరంబున సుప్రభుండైనట్టి యర్జునునిఁ గనియె
వర్షవర్షంబున వరుసగా మువ్వుర సుతులను బడసి యా సుదతి యలరె
తే.గీ. నంత మాద్రియు మదిని బుత్త్రాభిలాషఁ బతినిఁ బ్రార్థించి యానతిం బడసి కుంతి
నడిగి మంత్రంబుగైకొని యశ్వినులనుదలచి నకులుని సహదేవు దాను గనియె.194
తే.గీ. ఇట్టులా కాననంబున జుట్టి తిరుగు చుండ నొకనాడు మాద్రిని పాండురాజు
వలదు వలదన్న వినక దా వలపుదగిలి | కూడె నంతట ధరణిపై గూలె నతడు.195
వ. ఇట్లు విగతాసుండైన పాండుభూపతిం గాంచి కుంతియు మాద్రియు శోకాకులలయి
యుండం గాంచి యచ్చటి ఋషులు వారి నూరడించి యుత్తరక్రియలు యథావిధి
జరిపి మాద్రి యనుగమనం బపేక్షించ నట్ల కానిమ్మని యామె బిడ్డలం బోషింప
గుంతికి నియోగించి హస్తిపురంబునకుం బంచిన వచ్చి పురంబున ప్రవేశించినం గని.196
క. త్రిదశనదీతనయుండును | విదురుఁడు ధృతరాష్ట్రుఁ డఖిల విద్వజ్జనులుం
గదియం జని యా కుంతిని మృదువుగ నడిగిన కుమారు లెవ్వ రటంచున్. 197
వ. అది విని.198
క. సురల ప్రసాదంబున బు |ట్టిరి కురుకుల ముద్ధరించుటే పనిగా నీ
చిఱుత లల సురలమంత్రము వరశక్తిం బిలువ వారు వచ్చి ముదమునన్.199
తే.గీ. వీరు మాబిడ్డ లిది సత్య మీరు నమ్ముడనుచు వచియించి సురాపగాసు
తుండు మున్నగువారు సంతోషమంది | రాజగృహముల డించి రవ్యాజలీల.200
వ. అని చెప్పి సూతుండు మరియు.201
-: యు ధి ష్ఠి రా ది చ రి త ము :-
క. ఆ పాండవులైదుగురికి ద్రౌపది సతియై పతివ్రతామహిమంబున్
జూపెన్ నరునకు దా దశరూపధీరానుం సుభద్ర ప్రోయాలయ్యెన్ 202
తే.గీ. ఆ సుభద్రకు నభిమన్యు డాయెఁ గొడుకు ద్రౌపదేయులు వాడును దరలి ...
నతని భామిని యుత్తర యాపె గర్భవతియగుచునుండె యభిమన్యు మృతికి మున్ను.203
మ. శ్రమమింతేనియులేక క్రోధమున నశ్వత్థాముఁ డత్యుగ్ర బా
ణము నేయన్ శిశు వేడ్చు గర్భమున నన్నారీవతంసంబు దుః
ఖముతోఁ గృష్ణుని వేడినం గరుణమై గాచం బరికీణభా
వము నొందం గులముద్ధరించుటను నే ర్వప్పె న్పరీక్షిత్తునాన్. 204
తే.గీ. సొరిది దుర్యోధనాదులౌ సుతులు వారి సుతులునందఱు బోవంగ శోకవార్ధి .
బడిన ధృతరాష్ట్రు గాంధారి పరిచరణము | చేసి కాపాడె రే బగల్ సేతులార.205
క. ధర్మజ్ఞుడైన విదురుఁడు నిర్మలమతి నతనియొద్దనే యుండి సదా
శర్మదమగు ప్రజ్ఞానము. | నర్మిలి బోధించె ధర్మజానుమతిఁ గడున్.206
తే.గీ. ధర్మజుండును ధృతరాష్ట్రు కర్మగతికి 1 గడువగచి వాని పరిచర్య నుడుగకుండె
పొరలికొనువచ్చు దుఃఖాంబుపూరములను | దుడిచె నబ్బబ్బ యతఁ డెంతదొడ్డవాడు.207
ఉ. గుడ్డివికావె పిండముసకుం బడియుంటివి యింట నీవు ము
న్నడ్డితివేమొ నీకొడుకులందఱు దుర్మితు లెన్నిపాట్లు మా
కొడ్డిరి మేలు మేలనుచు సూరకయుంటివి చాలు గొంగడీ
గుడ్డయుఁ గఱ్ఱయుం దమిదకూ డిపు డో ధృతరాష్ట్ర నీకునున్. 208
ఉ. తోచెనె మేలు ధర్మజుని దొడ్డతనంబు గ్రహింపలేక యా
నీచులు నీకుమారులు వని న్మము ద్రోచిననాడు, నేడు నీ
వాచవి దీర్ప రాజనపువడ్లను దంపిన బియ్యమేసుమా
చూచితివొక్కొ ధర్మజుని శుద్ధఘతిన్ ధృతరాష్ట్ర చెప్పుమా.209
చ. అలిగిననేమి యెత్తిపొడుపంచు దలంచిన నేమి దెప్పులన్
వలచితి నీవు ము న్నిటుల వచ్చునొకో యని యెంచకుంటివే
తలఁగక దుస్ససేనుఁ డటు ద్రౌపది కొప్పునుఁబట్టి లాగిన
..లఘుఁడు ధర్మజుండె గతి యాయెనుగా ధృతరాష్ట్ర నేటికిన్.210
ఉ. కాకికి వేయలేదె కణ కాండము కుక్కకుఁ బోయలేదె గం
జీకుడు పొక్క గౌరవమె యెక్కడికేగితివయ్య లక్కయి
ల్లో కురువంశవర్ధన మహోగ్రహుతాశనుపాలుచేసిన
ట్లీకడఁ బొట్టనిండ భుజియించెదె పప్పును గూడు నేయియున్.211
వ. ఇవ్విధంబున భీముండు నిష్ఠురంబులాడుచుండ వినుచు ధృతరాష్ట్రుండు పదునెనిమిది
వత్సరంబులుండి యొక్కనాడు ధర్మజుంగాంచి యిట్లనియె.212
ఉ. అన్న సమస్త మీవెఱుఁగు దందఱు వోయిరి మీరె దిక్కు నే
నున్న విధంబు సూచితి వయో వనిభూములకేగి మౌనివృ
త్తి న్నిరపాయమార్గము మతిం దలపోయఁ దలంపు పుట్టె నన్
మన్నన చేసి పంపుము శ్రమింబని యెంచక ధర్మపుత్రకా.213
తే.గీ. అందరికి వాయుజుఁడొసంగె నౌర్ధ్వదైహి| కములు నాబిడ్డలకునివ్వఁ డమితమైన
క్రోధమునఁజేసి కావునఁ గొడుకులకును। నౌర్ధ్వదైహికము లొనర్తు నచ్చోటువోయి.214
క. మనమున నలుగక చాలిన ధన మిప్పింపుమని యడుగ ధర్మజుఁడు మనం
బున నొడఁబడి తనవారల సనుమతికై యడుగ భీముఁ డతి కుపితుండై.215
శా. ఏమీ యీయఁగవచ్చు బొక్కసమునం దెంతేని మూలున్ ధనం
బామిత్రుండు సుయోధనుండు మన కత్యంతంబు మేల్సేసెఁ దే
లేమా బొక్కస ముత్తదైన బవరా ల్సేయంగలేమా చనన్
లేమా దేశము లెన్ని సంచులు వడిన్ లెక్కింపు డెక్కింపుడీ.216
సీ. పాంచాలి సిగఁబట్టి పడలాగినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట
అఖిలంబు గొని యరణ్యము నంపినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట
పొరి భాగ మడిగిన బొమ్మనినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట
పడరానిపాట్లన్నీ పడవేసినందుకా గ్రుడ్డివానికి సొమ్ము కొల్లయిడుట
తే.గీ. నీవు కంకుడవై నందుకా వలలుడ | నేనయినయందుకా కఱ్ఱి నెఱిబృహన్న
లయును నైనందుకా కవల్ హయసురథుల గాచినందునకా సొమ్ము దోచునితడు.217
క. అని ధనము నీను పో పొ | మ్మని భీముడు ననిన మువ్వురనుజుల యొడబా
టెనసి యుధిష్ఠురుఁ డిచ్చెను ధనమును ధృతరాష్ట్రునకును ధర్మజ్ఞుండై. 218
క. అదిగొని ధృతరాష్ట్రుఁడు తన | మదవతియు దాను నుచిత మార్గంబున నొ
ప్పిద మొదవ నౌర్ధ్వదైహిక | సదమల కర్మములు పుత్ర సమితికి జేసెన్.219
తే.గీ. విపినమున కేగ సమకట్టు విదురుఁ డొకడు | కుంతియొక్కతె దమవెంటఁ గూడివత్తు
మనిస వారలతోఁగూడి యతిరయమున బోయిరడవికి వైరాగ్యపూర్ణులగుచు.220
క. వలదని కొడుకులు సెప్పిన పలుకులు విన కేగెఁ గుంతి వారలతోడన్
వెలువడిరి ధర్మతనయా | దులు పౌరులఁగూడి కొంత దూరము దనుకన్. 221
తే.గీ. సురనదీతీరవసుమతివరకు బంచి | మరలివచ్చిరి హస్తినాపురికిఁ బ్రీతి
నంత విదురాదులు శతయూపాశ్రమంబు వట్టి తృణములతో నిండ్లు గట్టుకొనిరి. 222
క. వినుఁ డాఱు వత్సరంబులు చనె నిట్టుల నొక్కనాఁడు సామజపురిలో
ఘనుఁడు యుధిష్ఠిరుఁ డొక కలఁ గనియెఁ దుర్బలను కుంతిఁ గాంచిన......... 223
వ. అట్లు కలగని లేచి యుధిష్ఠిరుండు తన స్వప్నంబు భంగి దమ్ములకుం దెలిపి కుంతీ
విదుర ధృతరాష్ట్రులంజూడఁ గోరిక వొడముచున్నదనిచెప్పి మీకిష్టంబయేని యట్ల
చేయుదముని తమ్ముల నొప్పించి భీమార్జుననకులసహదేవులును సుభద్రా ద్రౌపద్యు
త్తరలును బౌరజనంబులును వెంటరా బయనంబై శతయూపాశ్రమంబుఁ బ్రవేశించి
యచట నందఱిం దర్శించి విదురుం గానక ధర్మజుం డాంబికేయున కిట్లనియె 224
తే.గీ. అంబికాపుత్ర యనఘుఁడై నట్టి విదురు | డెంతసూచినఁ గానరా డేడనున్న
వాఁడనిన నాతఁ డిట్లని పలికి ధర్మ తనయ యతఁడు విరక్తుఁడై యునికి జేసి.225
శా. ఏకాంతంబున నిస్పృహుండగుచు నెందేపోయి బ్రహ్మాహమం
చేకోహమ్మనుచున్నవాడనిన భూమీశుండు దా నంత నా
కౌకోవాహినిచెంతఁ బోవునెడ నొయ్యంజూచె క్షామాంగు న
స్తోకానందమయాత్మునిన్ విదురునిన్ శుద్ధాద్వితీయుస్థితున్.226
మ. ఆనఘాయాద్వయరూపిణే విదురనామ్నేపాయజేత్రే నమో
స్తనుచు న్మ్రొక్కిన వీనులం బడియు వి న్నట్లింతయుం గానరా
కనివార్యస్థితి సూరకుండఁగఁ దదీయాస్యంబునందుండి గొ
బ్బునఁ దేజం బొక టుద్భవిల్లి కలసెన్ భూనాధు నాస్యంబునన్.227
ఆ.వె. ధర్మతేజమపుడు ధర్మాంశజునియందు బడినయపుడ విదురు పాటు సూచి
శుద్ధమూర్తి ధర్మజుండు శోకాకుల | చిత్తుఁడగుచుఁ గొంత సేపు చూచి.228
ఆ.వె. విదురదేహదాహ విధికినై తలపోయు ! చుండ నాకసమున నొక్కపలుకు
వీనులంటె నితఁడు వినుము విరక్తుండు ! దాహవిధులు సేయఁదగ డటంచు.229
క. విని గంగాజలమున నా | తని దేహమువైచి పెద్దతండ్రికి విఙ్ఞా
పన చేసి వారలందరు | వనముననే యుండఁ గొన్న వాసరములకన్.230
వ. బ్రహ్మపుత్త్రుండును దపోనిధియు నగు నారదుండును. ధర్మకోవిదుండును, నిఖిల
తత్త్వైకవేత్తయు నగు వ్యాసుండును, మరికొందఱు తాపసులను గూడి యవ్వనంబున
వాసంబు సేయు యుధిష్ఠిరాదులం జూడ విచ్చేసినం గాంచి ధర్మజుండు వారల
యథోచితంబుగా బూజించి కూర్చుండ నియోగించియున్న సమయంబున వ్యాసుం
గాంచి కుంతి యిట్లనియె.231
ఆ. కన్ననాడు నేను కర్ణునిఁ జూచితి ! దాని మొగము చూడవలయునంచు
మసము మిగులఁ దప్యమానమౌచున్నది చూపుమయ్య, నాకు శుభచరిత్ర.232
ప. అంతట గాంధారియు నిట్లనియె.233
ఆ.వె. సమరమునకుం బోవు సమయంబునందు నా | సుతు సుయోధనాఖ్యుఁ జూడనైతిఁ
జూపుమయ్య వారి సొరిదిఁ దమ్ములతోడ | మునివరేణ్యగణ్య భూరిపుణ్య.234
వ. సుభద్రయు నిట్లనియె.235
తే.గీ. ప్రాణములకంటెఁ బ్రియుఁడయి పరగినాడు | వీరులందెల్ల గణ్యుఁడై వెలసినాడు
సూను నభిమన్యు నొక్కింత చూపుమయ్య | దివ్యగుణగేయ సాత్యవతేయ నీవు.236
క. అనిన విని వ్యాసముని దా | మనమున దేవిం దలంచి ప్రాణాయామం
బును పట్టి యుధిష్ఠిరుఁడున్ మునుగాఁగల వారినెల్ల ముదమొందింపన్. 237
క. ముని సంధ్యాకాలము రాఁ | గవి వారల, దోడికొనుచు గంగకుఁ జని యం
దున స్నాతుండై దేవి | న్మనమున ధ్యానించె నిట్లు మఱి మఱి భక్తిన్.238
ఉత్సాహ. ప్రకృతివీవ పురుషుఁడీవ పాంచభౌతికప్రపం
చకమునీవ సకలమీవ చంద్రుఁడీవ తిగ్మరో
చికుఁడవీవ నభమునీవ క్షితివినీవ నేరమెం
చకుము నన్ను బ్రోవుమమ్మ శక్తి దేవి భగవతీ.239
ఉత్సాహ. అజుఁడవీవ శివుడవీవ హరివినీవ యా హవి
ర్భుజుఁడనీవ పాశివీవ పుణ్యమీవ యాజక
వ్రజమునీవ యాజివీవ వాయువీవ కశ్యప
ప్రజవునీవ ప్రోవుమమ్మ భగవతి మహామతీ.240
కురంగప్రయాతము. మణిద్వీపనేత్రీ మహామంత్రశక్తీ
గుణోపేతగాత్రీ గురుశ్రీకమూర్తీ
ఘృణా శాలినీ నీ కిదే మ్రొక్కినాడన్
బ్రణామంబు లాధారశక్తీ సుయుక్తీ .241
భుజంగ ప్రయాతము. సమస్తంబు నీయందు సంభూతమయ్యెన్
సమస్తంబు నీముందు సంపుష్ఠమయ్యెన్
సమస్తంబు నీయందు సల్లీనమయ్యెన్
మముం బ్రోవ నీవే యుమాశక్తి రావే.242
క. మృతులం జూపుమనుచు ని య్యతివలు ప్రార్థించి రెట్టులగు నాచేతన్
గతి నీవే యని నమ్మితి చతురత జూపింపుమమ్మ చయ్యనఁ దల్లీ.243
తే.గీ. ఇట్లు వ్యాసుండు ప్రార్థింప నిద్ధ చరిత యీశ్వరేశ్వరి భగవతి కృపదలంచి
స్వర్గముననుండి కోరిన జనులఁ బిలచి | చేర రప్పించి చూపించెఁ బేరువరుస.244
తే.గీ. కుంతి సంతోషమందెను గొడుకు జూచి | చెలగె గాంధారిబిడ్డలఁ జేరి కాంచి
యలరెను సుభద్రతనయునొయ్యఁ దిలకించి దేవి మహాత్మ్యమును వ్యాసు తెలివి గనుఁడి.245
తే.గీ. మౌని ప్రార్థింప భగవతి మహిమఁ జేసి ! యింద్రజాలంబుజూపిన ట్లెల్లవారు
మరిగి రొక్కొక్క రమరేంద్రపురికి నంత బినివినిరి మునివరులును బాండవులును.246
వ. తదనంతరంబ వ్యాసమహిమ లుగ్గడింపుచు ధర్మజుండు హస్తిప్పురంబు బ్రవేశించే
నని చెప్పి సూతుండు వెండియు నిట్లనియె.247
-: ధృతరాష్ట్రాది మరణవృత్తాంతము :-
క. తరువాత మూడునాళ్లకు | సరిగిరి సురపురికి దపహుతాశనకీలా
పరివృతులయి ధృతరాష్ట్రుఁడు | మఱి గాంధారియును గుంతి మ్రగ్గుచు నొకటన్.248
ఉ. అంతకు మున్న సంజయుడు యాత్రకుదోయినవాడు గాన దా
నింతయు బ్రహ్మసూతి వచియింప నెరింగి, యుధిష్ఠిరుండు బల్
చింతవహించె నప్పటికి జేరెను ముప్పుదియారు వర్షముల్
వింతల గౌరవుల్ యముని వాసముచేరిన దాటి సేయగన్.249
వ. అది యట్లుండ ప్రభాసతీర్థంబున విప్రశాపంబునం జేసి యాదవులు క్షయించిరి. బల
భద్రుండును నిర్యాణంబు నొందె వ్యాధబాణహతుండై కృష్ణుండు దేహంబు
విడిచె. నరణ్యంబున వసుదేవుండు గాయత్యాగంబుచేసె. నంతట బార్థుండు ప్రభాస
తీర్థంబునకుంబోయి శోకాకులుండగుచు యథావిధి నెల్లరకు సంస్కారంబులు చేసి కృష్ణుని
దేహంబుతోడ రుక్మిణి మున్నగు నెనమండ్రు భార్యలం జేర్చి దాహకృత్యంబు నెరపి రేవతితో
బలభద్ర దేహసంస్కారంబుఁ గావించి ద్వారక కరుదెంచి యందున్న జనుల బహిర్నిష్క్రమణంబు
చేయించె. నంత ద్వారక సముద్రంబున మునింగెఁ తదనంతరం బర్జునుం డింద్రప్రస్థపురంబు
బ్రవేశించి యదురాజ్యంబునకు ననిరుద్ధకుమారు వజ్రు నధిపతింజేసి యది వ్యాసునకెఱింగించిన
నతండు వజ్రుంగాంచి తొల్లి శ్రీకృష్ణుండెట్టుల నట్టుల నీవుగ్రతేజుండవు కాగలవని చెప్పి చనియె.
బిమ్మట సుభద్రాప్రియుండు హస్తిపురంబు ప్రవేశించి ధర్మరాజునకు యాదవకులక్షయంబు
క్రమంబుగాఁ జెప్పి శ్రీకృష్ణుండు దేహంబు చాలించెనని చెప్పి నతం డతిదుఃఖితుండై
నిజరాజ్యంబుసకు నుత్తరాకుమారుం బ్రభువుంజేసి తాను రాజ్యంబు సేయనారంభించె నది
మొదలు ముప్పదియారవవత్సరంబుతుద హిమాచల సమీపారణ్యభూములకు ద్రౌవదియుం
దమ్ములుందోడరాఁ బయనంబుచేసి చని వనంబులం బ్రవేశించి యచట నందఱు ప్రాణం
ద్యజించిరి. ఇచట ధార్మికుండైన పరీక్షిన్నరేంద్రుం డతంద్రితుండై
యఱువదియేండ్లు ప్రజాపాలనంబుఁ జేసె నంత.250
తే.గీ. వేటవేడుక నుత్తరబిడ్డ విపిన భూములకు విల్లునమ్ములు పూనియేగి
మృగములవధించి యెండలో మిగులడస్సి , గొని యొకమునీంద్రు నాశ్రమంబునకుబోయి.251
తే.గీ. చని యచట ధ్యానమందున్న మునిని జూచి , జలము నడిగిన ముని మాఱుపలుకకున్న
గనలి మృతసర్పమును వింటికొననుఁ బట్టి | యతని మెడ నిడెఁ గలిజితప్రతిభుఁడగుచు.252
క. ఆముని ధ్యాసపరుండై యేమియు నెరుగండుగాన నింతట ఘనతే
జోమూర్తి దాంతచిత్తుడుఁ । ధీమహితుఁడు మిత్రసంగతిం దిరుగునెడన్.253
వ. అమ్ముని కుమారుండు.254
క. తనదండ్రి కంఠసీమను | జననాధుం డొకఁడు సర్పశవ మిడెనని చె
ప్పిన మిత్రుల మాటలు విని | చనుదెంచి కనంగ నద్ది సత్యంబాయెన్.255
తే.గీ. కనలి యంజలిజలమిడి కణకణయని | కనులు నిప్పులురాలంగ జనుడెవండు
తండ్రిమెడ సర్పశవమిడెఁ దప్పకతఁడు | సప్త దినములఁ జచ్చు దక్షకునిచేత.256
క. అని శపించిన వార్తను | మునిశిష్యం డొకడు వోయి భూపతికి నివే
దన సేయఁగ విని యాతఁడు । మనమును దుఃఖాంబురాశి మగ్నముసేసెన్.257
తే.గీ. అయ్యయో యనివార్య మీ యమికుమారు | శాప మిదియేమిపాపంబు సంభవించె
ననుచు మంత్రులఁ బిల్పించి యడిగె నేయుపాయ మీశాపముక్తికి ననుచు నతఁడు.258
చ. వినుఁడు వచింతు నిందును వేరొకవీలు ఘటింపనేర దే
మనిన నుపాయమార్గమున నౌరగహాలహల ప్రతిక్రియన్
గననగుఁ దొల్లి యొక్క మునికాంత భుజంగమదష్టయయ్యు దా
మనియె నటంచు బల్కుదురు మానవయత్నము కొంత కాఁదగున్.259
తే.గీ. మనుజుయత్నంబులేక యేపనియుఁ గారు | ఇలవిరక్తుండయేని దా నింటనింట
దిరుగఁదగు భిక్షకొరకునై తిరుగ కొక్క చోటఁ గూర్చున్న బోనంబు నోటబడునె.260
వ. అనిన మంత్రులు.261
క. ఆముని యెవ్వం డాతని | కామిని పేరేమి యెట్లు గరిచెను సర్పం
బామీద నేమిజరిగెను భూమీశ్వర తెలుపుమయ్య పూర్తిగ ననినన్.262
సీ. భృగుపులోమలు గన్న బిడ్డండు చ్యవనుండు పెండ్లాడె శర్యాతి బ్రియతనూజఁ
గన్య సుకన్యనా కాంతయుఁ బ్రమతిని గనియె నాతడు ప్రతాపిని వరించి
ప్రేమ మీరఁగ దానిఁ బెండ్లాడె నంతట నది రురువును గాంచె నప్పుడొక్క
స్థూలకేశుఁడను దొడ్డతపసి సత్యశీలుఁడైవర్తిల్లె నోలి నప్పు
తే.గీ. డచ్చరవెలంది మేనక యనెడి దొక్క యాపగాతీరమున గ్రీడ లాచరించి
పరగ విశ్వావసునిచేతఁ బ్రాప్తమైన గర్భమునుదాల్చి యొక వింతకళలఁ దనరి.263
సీ. తొయ్యలిమేనక స్థూలకేశుని యాశ్రమమునకుఁ బోయి సమ్మద మెలర్ప
మూడులోకములందు నీడుగానని యొక్క ముద్దుబాలిక నతిమోహనాంగి
గని యచ్చటనె డించి చన ముని దానిగైకొని గృహమును జేర్చి యనుపమమగు
ప్రేమతోఁజూచుచుఁ బెంచి ప్రమద్వరా నామంబు నునిచె నందఱునుమెచ్చ
తే.గీ. నంత నయ్యింతి నవయౌవనాంగి యగుచు | పింతవింతహొయల్ మేన విస్తరిల్ల
నప్పుడప్పుడు పూఁతోటలందుఁ జూచి, రురుడు సుమశర శరపరంపరల మునిగె. 264
—: పరీక్షిచ్ఛాప నివృత్త్యుపాయచింత :—
వ. ఇట్లు కామార్తుండై రురుండింటికిం బోయి నిద్రాహారంబులు మాని కృశించుటంగాంచి
యతని తండ్రి నాయనా యిది యేమి యని యడిగిన నతండు తండ్రి కిట్లనియె.265
శా. తండ్రీ! యేమని చెప్పుదున్ మదన సంతాపంబు లోలోనఁ దా
వేండ్రంబై నది స్థూలకేశునిసుతన్ వీక్షించితి న్వేల్పు ప్రో
యాండ్రన్ గూఢవదాంగనాజనమునం దాసొంపు నే గాని నా
తీండ్రింపు ల్కడముట్టు ముద్దియను బ్రీతిన్సుద్దులాడంగదా.266
ఉ. అంతట నేగి యాప్రమతి యత్యధికంబగు భక్తి మీర న
భ్రాంతత స్థూలకేశిపదపద్మము లంటి నమస్కరించి యో
శాంతమనస్క నీ తనయ సాధ్విఁ బ్రమద్వర నిమ్ము పెండ్లిగా
వింతము నాసుతున్ రురువుఁ బ్రీతిమెయిం బ్రతికింపు నావుడున్.267
తే.గీ. ప్రమతి దా స్థూలకేశు సంబంధమునకుఁ గడునలరి పెండ్లియత్నముల్ నడుపుచుండ
వనములో నొక్కసర్సంబు వనితపాద | మంటఁగఱచినఁ బడి సచ్చె నప్పుడచట.268
క. పడినప్రమద్వరఁ గనుగొని గడగడ వడకిన సమస్త కాంతలు పురుషుల్
గడు హెచ్చెను హాహారవ మడలెను జడదారిపల్లె యాసమయమునన్.269
క. రురుడుం జాటుగ మాటుగ నరిగి విరహవేదనాగ్ని యందుంబడి తాఁ
బొరిపొరి నేడువసాగెన్ బరిణయకాలమున నిట్టి పా టొదపుటకై.270
తే.గీ. దైవమా యేడనుండి యీత్రాచువచ్చె వచ్చెబో యేటికీ ముద్దువనితఁగఱచె
నేమిచేయుదు నిది దుఃఖహేతువయ్యె | నెందుఁజొచ్చెద బ్రాణంబు లెందుకింక.271
సీ. అయ్యయో మదిలోని యాశలెల్లను దీర నెనసి ముద్దియఁ గౌగిలించనైతి
దేవుడా పెండిలితిన్నెపైఁ గూర్చుండి పాణినైనను నేను బట్టనైతి
వగలాడితో హుతవహునిలోపల లాజహోమమైనను జేయ నోమనైతి
గొనగొన నేఁబోయి గుండ్రాతికడ నిల్చి చక్కగాఁ బదమైనఁ ద్రొక్కనైతి
తే.గీ. చెట్టనోములు నోచిన యట్టి నాకు నెట్టుల సుఖంబులబ్బు నీ పట్టునందు
నూయియో గోయియో చిచ్చొ రాయొ యురియొ విషమొ ప్రాణంబు లిప్పుడె విడుచుటకును.272
వ. అని వెండియుఁ దనలో నిట్లని వితర్కించె.273
క. మృతిచే ఫలమున్నదె దుః ఖితు లగుదురు తల్లి దండ్రి కేవల మది దు
ర్గతిహేతువు మృతయగు నియ్యతివకు మేలేమి దీన నగుఁ దలపోయన్.274
చ. అని తలపోసి స్నాతుడయి యంజలినంబువుబూని యేను జే
సిస దివిజార్చనాదికముచేఁ గలదేని యొకింత పుణ్య మా
త్మను గురుభక్తియుం జప హుతాశ విధానమునుం దపంబు సం
ధ్య నిగమపాఠముం గలదియైన మనుం జెలియంచుఁ బల్కుచున్.275
క. అని తోయము భువివిడిచెన్ మునిసుతుఁ డంత మరదూత ముఖ్యుఁ డొకడు
దా గనులకు నెదురై మునినందన .... సాహసంబు తగునే నీకున్.276
క. చచ్చిననెటనైన మరలి వచ్చునె ఇది వింతగాదె వనితారత్నం
బచ్చర కూతురు సనియన్ చెచ్చెర వేఱొక్కదానిఁ జేకాను మింకన్.277
క. అనవుడు విని మునిపుత్త్రుం డనిమిషుల కొసగ నొల్ల నిది దా
మనిన మనుగాక మనకున్నను మానెనుగాక మృతియ నాకును నిజమౌ.278
క. అనిన విని వీఁడు సాహసమును జేయక మానఁడనుచు మునితనయా నీ
కు నుపాయము చెప్పెద వినుమా కృతకృత్యులైరి విబుధులె దానన్.279
క. నీయాయువునందును సగ మీయఁగఁదగు నట్లు చేసితేనియుఁ బ్రియురా
లీయెడ మరల బ్రతికి నిను బాయక వర్తిల్లుననగ బరమ బ్రీతిన్.280
క. నాయాయువునం దర్థం బీయెడ నీ నిముషమున యిచ్చెద దడవే
లా యువతిం బ్రతికింపుము నా ........281
వ. అనిన నంత దనసుతమరణం .... స్వర్గంబు నుండి విశ్వావసుండును వచ్చినం గాంచి
దేవీభటుం డతనింగూడి యముని సమీపంబునకుం జని 282
తే గీ. రవితనూజాత పరమధర్మస్వరూప వినుము విశ్వావసుని బిడ్డ బృథిని రురుడు
వలచెఁ గన్యఁ బ్రమద్వరఁ మనమునందుఁ బాముగఱచినఁ ....నప్పడతి దలఁచి.283
తే.గీ. స్రుక్కిప్రాణంబువిడువంగఁ జూచుచున్న ! వాఁడు రురుఁ డతఁడెంతయు వగచి యాయు
వందు సగమిత్తుఁ బ్రతికింపు మనుచుఁ బలికె వలపు లట్టివ యెంతటివారికేని.284
క. కావున దానికిఁ బ్రాణం బీవలయునటన్న దూత నెఱిఁగి యముం డ
ట్లావనిత బ్రతుకుఁ బొమ్మన వేవేగమ వచ్చి దూత వెలఁది న్మనిచెన్.285
తే.గీ. ఇట్లు బ్రతికించి రురునకు నిచ్చె దూత | వెండియమ్మునిపుత్త్రుండు పెండిలికిని
శుభదినము సూచి శోభన శోభఁదనరె , నప్పుడాబాపని వినోద మడుగనేల.286
వ. అట్లా మునికుమారుండు ప్రమద్వరం బాణిగ్రహణంబు చేసికొని సుఖంబుండెం గావున
నుపాయంబుసఁ బ్రాణంబులు రక్షించుకొనవలయునని చెప్పి.287
క. ఏడంతస్తులుగల యొక మేడను గట్టించి దానిమీదను దానున్
దోడుగ మఱికొందఱునుం గూడి వసించుచును మిగుల గూఢస్థితుఁడై.288
క. మణిమంత్రధరుల నిజర క్షణమునకుం గాపువెట్టె సముచితగతి బ్రా
హ్మణులను జపముల నిడి గజ గణములతో మంత్రి పుత్త్రుఁ గాపుంచెఁ దగన్.289
తే.గీ. అలఁతి యీగకుఁ జొరరాని యట్లు లోని | మేడపై మిద్దెగది గత్తి మెట్లగద్దె
నీటెఁగమ్మి యకటకటా నిరుకుచోటఁ జాటుగాఁ గూరుచుండె భూజానియపుడు.290
తే.గీ. స్నానమచ్చట ముత్తరి సంధ్యలచట భక్ష్యభోజ్యాదులచ్చటఁ బానమచట
వంటలచ్చటఁ గథలను వింట యచట | గాఁగ భూపతి యతిరక్ష గలిగియుండె. 291
వ. ఇట్లు బహువిధంబుల రక్షితుండై పరీక్షన్నరేంద్రుండు దినంబులు లెక్కపెట్టుకొను
చుండ నొక్కనాడు ధనార్థియై కశ్వపుండను విప్రశ్రేష్ఠుండు తన గృహంబు వెడలి
మార్గంబున వచ్చుచుండ నంతకుమున్న విప్రశాపంబు యథార్థంబు సేయ నిశ్చయించి
తక్షకుండను సర్వశ్రేష్ఠుండు వృద్ధబ్రాహ్మణ రూపంబు దాల్చి యతిరయంబున నిజవాసంబు
విడచి చనుచు మధ్యేమార్గమున మంత్రవాదియగు కశ్యపుం జూచి యీ ఎవ్వండ
వతిత్వరితగతిం బోవుచున్నవాఁడ వేమి కార్యం బెక్కడికని యడిగిన విని కశ్యపుండు.292
క. తక్షకుడు గఱచువాడు ప రిక్షిర్భూవరుని దానిఁ బృధు మంత్రబల
ప్రక్షేపంబున మనుతు ని రాక్షేపణగా నటంచు నరిగెద ననినన్.293
క. నేనే తక్షకనాముఁడ | నేనే భూనేతఁ గఱప నేగెదఁ దరమౌ
నేనే గఱచినవారల | నేనేర్పున మనుతు నింటి కేగుము మరలన్.294
వ. అనిన బ్రాహ్మణుండు.295
క. పోరా పన్నగ నాతోఁ బోరా? నామంత్రశక్తి పోడిమి బ్రతుకున్
బో రాజు; నీవిషము చెడి పోరాదను శాస్త్రమొకటి పుట్టెనె యనినన్.296
వ. తక్షకుండు.297
క. వెఱ్ఱివికావో చూచెదఁ జుఱ్ఱున నేఁ బోయి కోఱ సుదలను విషముల్
బుఱ్ఱున నోడఁగ నిపు డీ| మఱ్ఱినిఁ గరచెదను దీని మనుతువె కడిమిన్.298
తే.గీ. అనిన బ్రాహ్మణుఁ డట్లకాకనుచుఁ బలుక, దక్షకుఁడుబోయి న్యగ్రోధతరువుగఱవ
భగ్గుమనిమండి యప్పుడే భస్మమాయె నది కనుంగొని బ్రాహ్మణుఁ డట్టె లేచి.299
ఉ. దిగ్గనఁ బోయి చేరువను డిగ్గియు నీళులు గొంచువచ్చి చెం
బొగ్గి జలంబులం బురిసె డొప్పుగ బోయుటఁ బట్టి మంత్రమున్
బిగ్గరగాక లోగొణిగి నేర్పున భూయని యూదియూది తా
డగ్గఱబూదిఁ జిల్కిన వటత్వము బొందె నిదెప్పటట్లుగన్. 300
క. అది గని యచ్చెరువడి యా ముదిబాపండైన పాము మోసమువచ్చెం
గద యంచుఁ గశ్యపుం గని సదయాంతకరణ నీదు శక్తిన్ గంటిన్.301
తే.గీ. ఎందుకీశ్రమ పాటుల చందమామ కోరితేనియు లక్షలకొలఁది ని త్తు
నీకుఁ గలవాంఛ సెలవిమ్ము నిక్కమపుడు నా విని ధరాసురుండు మనమ్మునందు.302
తే.గీ. ధనముగైకొని వచ్చినదారినేగ లోభమున కీర్తిచెడిపోదె లోకమందు
నృపతి బ్రతికించి యౌనెంత నిపుణుడనెడి యశమునుం బుణ్యమును గాంచి యరుగజనదె.303
తే.గీ. అల హరిశ్చంద్ర కర్ణాదు లైనవారు | కీర్తికొరకెంతలేని సత్క్రియలొనర్చి
రవని నేలెడివాడు విషాగ్నిమ్రగ్గఁ జూడు చేగుట ధర్మంబె సుజనునకును. 304
తే.గీ. రాజునే బ్రతికించిన రాణిబ్రతుకుఁ | బ్రజలు జీవించు రింతయు భయములేక
రాజు పోయినయేని యరాజకంబు వచ్చు నాకును పాపంబు వచ్చుఁగాదె.305
వ. అని బహువిధంబుల వితర్కించి యెట్టులేనియు మునిశావంబు తప్పనట్టులున్న యది
యని నిశ్చయించి తాఁ గోరినట్లు ధనంబు తక్షకునివలన సంగ్రహించి కశ్యపుండు
గృహంబునకు బోయె నంత.306
ఆ.వె. కట్టుదోతు జన్నిగట్టును బంపితి గుట్టు సెడకయుండఁ గట్టివేసి
యెట్టులైన రాజు పట్టణంబున కేగి పట్టి కఱతుఁ దపసి తిట్టుకలిమి.307
వ. అని నిశ్చయించి తక్షకుండు.308
శా. ఏడంతస్తుల మేడ పైఁ బటుతరాహీనోగ్రమంత్ర, క్రియల్
తోడౌ బ్రాహ్మణకోటికాపనుచు సందుల్ గొందులం దెల్లవా
రాడం దా వి ని తక్షకుం డిప్పుడు పోరాదందు నిందుండి వె
న్కాడం గూడ దికేమిసేయుదునటం చాత్మన్ వితర్కింపుచున్.309
క. బాపనిశాపము భూపతి | రూపడపకయుండఁజనదు రూఢిగ నాకుం
బాపములే దొక మోసపు ॥ రూపునఁ జని కఱతు నీతిద్రోచుట చనునే.310
వ. అని కృతనిశ్చయుండై తనతోడి సర్పశ్రేష్టుల మునులంజేసి వారలచేఁ గొన్ని ఫలంబు
లిచ్చి తా నొక కీటంబై యందొక ఫలంబునం బ్రవేశించి.311
క. అది సప్తమదీనమగుట | న్మదిఁ దలపోయుచును దంభమౌనులు ఫలముల్
వదలక చేతులయందిడి కదలిరి రాజగృహమునకు గడునిశ్చలులై.312
క. చని రాజగృహద్వారము | గని యచ్చట నెడములేక గాచెడివారిన్
మునులము మేము నృపాలకుఁ గనవచ్చితి మెపుడులేని కట్టడి చనునే.313
శా. మామంత్రంబులచేత రాజు బ్రతికింపెన్ పచ్చియున్నార మెం
దే మాయోగము వీటిబొవదు విప ద్భీతిం దొలంగించి భూ
స్వామి న్సంతసపెట్టి యేగెద మనిర్వార్యంబుగా మేడపై
నేముం బోవగ నిఛ్చెయించెదము పోనిం డింక నా వారలున్.314
వ. ఈనాడు రాజసందర్శనంబు మీకుం బొసంగ వెల్లిరండు విప్రశాపభయంబున ఱేఁడు మీద
మేడనున్నవాఁడు మేము పోయి నరవరునకు మీరాక విన్నవించెదమని వారట్ల చేసిన జన
పాలుండు ద్వారాపాలుర కిట్లనియె.315
క. ఈరలు దెచ్చిన ఫలములు నీరును | దుంపలును మాకు నిండుముదమునన్
వీరలచే బంపు డిపుడు తీరదు రే పిచటి కరుగుదేరుడు మీరల్.316
క. అనిచెప్పి పనుప వారలు చని తెలిపిన వార లట్ల సలిపిరి యంతన్
మనుజేంద్రుఁడు ఫలముల గొని మనమున నంశయయులేక మంత్రుల కనియెన్.317
క. మునులిచ్చిన యీ ఫలముల దినుడీ మీరెల్ల నేను దినియెద నిది యం
చును బెద్దపండు నొకదానిని గొని యిది మంచిదనుచు నృపమణి కోయన్.318
క. పుఱుగొకటి ఫలములోపల నిఱికినఁ నాఁ గాంచి కంటిరే చిన్నది యీ
పుఱుగు నలుపైన కన్నులు | నెఱుపు నెరవు నొడలు నిఱికె నీఫలమందున్.319
వ. అని వెండియు నామహీపాలుండు నాడు సూర్యుం డస్తమించె నింకఁ దనకు శాప
భయంబు తొలఁగెనకా యెంచి యిట్లనియె.320
క. మునికులవర్యుని శాపం | బునకుం గొబరాకయుండ మునుకొని కీటం
బును మెడ నుంచెద ననుచున్ జననాధుడు పురువు మెడను జయ్యన దాల్చెన్. 321
ఆ.వె. తక్షణంబ పుఱువు తక్షకుండై కాల రూపుఁ డగుచు భీతిదోప నడరి
నృపతియొడలుసుట్టి కృపలేక కోఱల నంటబట్టి కఱచె మంటలెక్క.322
తే.గీ. మంత్రివరు లప్డు విస్మయోన్మాదగరిమఁ | గడఁగి యేడ్చుచుఁ బాఱిరి కడలకొదిగి
రక్షకులు దుఃఖవివశులై యక్షులందు బాష్పములు జార హాహారవంబు లిడిరి.323
వ. వచ్చి యుత్తంకుండు రాజు నధిక్షేపించుచుఁ దన యిష్టంబు కొనసాగించుకొను తలంపున
భూపతిం జూచి యిట్లనియె.332
క. కీలెఱుఁగని రాచరికం బేలా సమయంబెఱింగి యెయ్యది సేయం
బోలు నది సేయఁడే భూ పాలకుఁడా కాడు ధేసుపాలకుఁడుజుమీ.333
తే.గీ. ఐనవారల కాకున గానివారలకును గంచానఁ గుడుపుదేలా నృపాల
మిత్రుఁ డెవ్వాడొ తనకును శత్రుఁ డెవఁడొ కనపు లబలబ దిబదిబల్ కావె తుదకు.334
క. గ్రుడ్డెద్దు చేనఁబడిన ట్లడ్డంబెడ్డములపోవు నతనికి నేలా
గొడ్డాసయు బిడ్డాసయు | దొడ్డదొరవు కలరె నీకుఁ ద్రోవలు చెప్పన్.335
క. పగఁదీర్చుకొననివానిది మగతనమో యాడుదానిమాడ్కిని గాజుల్
తగఁదొడిగించుక ప్రొయికడఁ | బొగకోరిచి వంటఁజేయ బోలదె నృపతీ.336
వ. అనిన రా జోక్కింతదడపు మారుపలుక కూరకుండి బ్రాహ్మణువచనంబులకుం గతంబు
పరికింపనేరక సందిగ్ధమానసుండై యతనిం జూచి వినయపూర్వకంబుగా మెల్లన
నిట్లనియె.337
తే.గీ. ఈ యధిక్షేపమునకు నీ వేది కారణంబుగాఁ గొంటివో కాక నాకు నెఱుక
లే దెవఁడు శత్రుఁ డే జేయలేదు ప్రతివి | ధానమెచ్చోటఁ దెలుపుమీ దానిఁగృపను.338
తే.గీ. అనుఁడు నుత్తంకు డిట్లను నవనినాధ | తెలిసికొను మింక మంత్రులఁ బిలిచి వారె
చెప్పఁగల రీవు కోరిన చొప్పుమీర దక్షకునిచేత నీతండ్రి దష్టుడయ్యె.339
ఉ. అంతట వారలం బిలచి యా నృపచంద్రుఁడు పృచ్ఛసేయఁగా
నంతయు నిక్కమే యనిన నాతఁడు బ్రాహ్మణుఁజూచి యందునన్
వింతలులేవు తక్షకుఁడు విప్రునిశాపముఁబట్టి వచ్చినా
డింతట వాని తప్పుగల దేనియుఁ జెప్పి యనుగ్రహింపుమా.340
నీ. వినుమయ్య రాజేంద్ర విప్రముఖ్యుడు కస్య పుడు నిన్నుఁ బ్రతికింప బూనివచ్చు
చుండంగఁగని తక్షకుండు వానికి నర్థ మిచ్చిపంపెను నేర మేలకాదు.
మఱియు రురుండను మౌనికుమారుండు పెండ్లాడదలచినఁ బ్రియవధూటి
పాముచేఁ గరువంగ బడియీల్గ నాతండు। బ్రతికించుకొనియె నప్పడతి దనదు.
తే.గీ. తపము పేరిమి వెండి యతండుసేసెఁ బ్రతిన జూచిన పామును బట్టి చావ
గొట్టెదనటంచు నిరీతిఁ గొంతకాల మరుగ నొకనాడు శస్త్రియై యతడు దిరుగ. 341
చ. వనమున నొక్క డుండుభము వాడు గనుంగొని కొట్టఁబోవగా
వినయముమీర నిట్లనియె విప్రకుమారక తప్పు లేని న
న్నును వధియింపనేటికి ఘనుండవు నీవన నాతడిట్లనున్
నను వరియించియున్న యొక్క నాతిని సర్పముముట్టెగావునన్.342
క. అగపడినపాములను నే దెగవైచెదననుచుఁ ప్రతిన దీర్చితిననఁ దా
వగచుచు నే నెవ్వారినిఁ | బనకొని కఱువంగలేడు పాములుకఱుచున్.343
ఆ.వె. కాళ్లులేనిమాత్రఁ గాను నే భుజగంబ | నేల నన్నుఁ జంపె దేగుమనియె
ననుచుఁ చెప్పి మరియు ననియె నుత్తంకుండు | విపులబుద్ధియైన నృవునిజూచి.344
ఆ.వె. అపుడు రురుఁడు డుండుభాలాపములు విని యెవఁడవవు నీకు నిట్టిరూప
మెట్లు గల్గెననిన నేను బూర్వము శాంతి | నమరియన్న యుర్వరామఠుఁడను.345
అ.వె. కడఁగి మిత్రుఁడైన ఖగమాభిధుం డగ్ని హోత్రగృహమునందు నుండఁజూచి
గడ్డిగట్టి పాముగఁజేసి యతనిపై వైవ భీతిచెంది వడకికొనుచు.346
క. ననుజూచి కనలి శపియించెను సర్పమవగుదుమంచు జెచ్చెర నే నా
తనికాళ్ళ కెరగినన్ నను గనుగొని యిట్లనుచు బలికె కారుణ్యమునన్.347
క. ప్రమతికొడుకు రురునాముఁడు విమలమతిని నిన్ను మరల విప్రునిజేయుం
బ్రమదంబు బొందుమనె ద త్క్రమమన నిట్లైతి విప్ర ధన్యచరిత్రా. 348
క. ఆ విప్రుఁడ నేను రురుడ | నీ వా శాపంబువలన నే నిటులై తిన్
బ్రోవుము నన్ను నహింసయె యీ ననుమతి ధర్మములకు నెల్ల మొదలగున్.349
క. దయచే సత్యవ్రతమగు దయయే ..... పెద్ద తథ్యము వినుమా
దయయే శౌచము ధర్మము దయకెక్కుడు లేదు లేదు తలపగ నెందున్.350
క. అన విని రురుఁడుం బ్రాహ్మణుఁ । గని శాపం బిపుడ విడుచుగావుత మనినన్
దనరె నతఁడు తక్షణమే మనుజుండై పిదప రురుఁడు మానెను హింసన్.351
చ. చెలగి రురుండు కోమలిని జీవితజేసిఁ వివాహమయ్యే న
య్యలఘుఁడు సర్పతండములయం దతివైరము పూనె నీవు దు
ర్బలువలెఁ దండ్రికిం బరమ బాధకవృత్తి నటించినట్టి పా
ములపయిఁ గ్రోధమింతయనుఁ బూనవు నీకిది చెల్లునే నృపా.352
మ. పితృవైరంబు దలంప విద్ది తగునే పృథ్విన్ పితృక్షోభులన్
హతి గావింపనివాడు జీవసహితుఁడె యుండఁగా నేమి దా
మృతుఁడే యండ్రదిగాక తద్రిపువులన్ హింసించకున్నేని పు
త్రతయున్లేదు తదీయదుర్గతులు దూరంబౌనె యెందేనియున్.353
శా. దేవీయజ్ఞమటంచు నొక్కసుఖ మెంతేనిం బ్రయత్నింపుమా
త్రోవంబన్ను - సర్పయాగము ననన్ దుఃఖాంబు పూరంబు కణా
గ్రేవల్ గ్రమ్మఁగ నయ్యయో జడుఁడనై కృత్యం బుపేక్షించితిన్
జేవం దండ్రికి వైరులైన భజగశ్రేణుల్ దయార్హంబులే.354
తే.గీ. నేడయజ్ఞంబు మొదలిడి నేనొనర్తు | భుజగములనెల్ల నగ్నిలోఁ బొరలఁగాల్తు
ననుచు మంత్రులఁ బిలిచి య య్యవనినాథుఁ డనియె నిట్లని తనలోని యలుకపేర్మి.355
క. జన్నము గావించెద నే। నన్నయమార్గమన మంత్రిసత్తములారా
పన్నింపుఁ డన్ని విధములఁ జెన్నుగ సంభారములను శీఘ్రమె మీరల్.356
సీ. మందాకినీతీరమందు శుభంబైన భువి జూఁడుమనుఁ చెల్లి భూసురులను
సలలితంబుగ నూఱు స్తంభముల గల మండపమును గట్టింపు డేఏర్పాటుచేసి
నేనును ధర్మపత్నినిఁగూడి కూర్చుండ నమరింపుడీ మంచి యజ్ఞవేది
పరగహుతాశన ప్రబలకాకరమురా హోమగుండముద్రవ్వుఁ డొప్పమీర
తే.గీ. దక్షకుఁడు యజ్ఞపశువుగాఁ దలపుఁడింక | హోత యుత్తంక భూసురుం డుండుగాక
విప్రవర్యుల వేదార్థ విధుల నిఖిల | మంత్రవేత్తలఁ బిలువుండు మంత్రులార.357
తే.గీ. మంత్రు లట్లనకావింప మ.... డలరి యజ్ఞమునుసేయఁ డొడగిన యపుడు సర్ప
తండములు పడె దద్దోమగుండమునను | తక్షకుడు భీతి నింద్రుని దాపు జేరి.358
క. మొరపెట్టిన నింద్రుడు దాఁ గరణన్భయముడిపి తనదు గద్ధియమీదన్
శరణమొసఁగె నది మదిలో నెఱుఁగుచు నుత్తంకుఁ డహిని సేంద్రునిఁ బిలచెన్.359
తే.గీ. అపుడు తక్షకుఁ డడలి నిజాప్తుడైన యట్టి యాస్తీకు మౌనికులాగ్రగణ్యుఁ
దలఁపగా జనమేజయు దరిసి యతఁడు దీవనలొసంగఁ గోరిక దెలుపుమనుచు.360
క. నృపుడడిగిన విప్రుడు దాఁ గృపతో యజ్ఞంబు విడువ నేఁ గోరెద నా
నపుడే సత్యము తప్పని నిపుణత యజ్ఞంబుమాని నిశ్చలబుద్ధిన్.361
క. ఘనుఁడగు వైశంపాయన | ముని దా విన్పింప వినియె ముదమున సర్వం
బును భారతమందును దన మనమునకు న్శాంతిలేక మానవపతి దాన్.362
ఉ. వ్యాసమహర్షి గాంచి నృపవర్యుఁడు నామదిశాంతి యెట్లగున్
ద్రాసము దోచెడిం బలువిధంబుల వీరులు స్వర్గలోకసం
వాసము గోరినం దనువుఁ బాయుట మేలు రణంబులో నిజా
వాసములో భుజంగవిష బాధను దండ్రి గతించె నయ్యయో.363
తే.గీ. మనముదహియించుచున్నది మౌనివర్య | యేమి సేయుదు సదుపాయ మెద్ధినాకు
దెలిపి రక్షింపపే శాంతి గలుగఁజేసి | తండ్రిదుర్గతిఁ దొలఁగెడి దారిఁచెప్పి.364
-: వ్యాసజనమేజయ సంవాదము :-
వ. అనిన విని సకల వేదవిభాగ వివిధవిన్వాసుండగు వ్యాసుండు నిఖిలశత్రుంజయుండైన
జనమేజయున కిట్లనియె.365
సీ. రాజేంద్ర వినుము సర్వపురాణములలోన బరమోత్తమంబైన భాగవతము
విన్పించెదను నీవు విను మిది మున్ను నా సుతుఁడై యెసఁగురున్న శుకమునికిన
దగఁ జెప్పితిని దీన ధర్మంబు నర్థంబు కామంబు మోక్షంబు గలుగు సకల
శుభముల నొసఁగును సుఖదంబు సర్వాగమసముద్ధృతంబు నిర్మల మనఘము
తే.గీ. నావుడు నరేంద్రు కిట్లను నమ్రుడగుచు యజ్ఞ విఘ్నార్ధ మాస్తీకుఁ డతరమయన
రాఁ గతంబేమి గూఢసాద్ద్రక్షణమున నతని కేమిప్రయోజనం బనఘ చెపుమ. 366
క. అతిమాత్రయోగమహిమా | న్వితభాగవతంబు వినఁగ ...........
దతలీల దాని వెల్పుము | శతధాకిల్బిషములెల్ల సమయఁగఁ గృపతో.367
వ. ఇట్లు దీనాననుండై వినయపూర్వకంబుగా నడిగిన జనమేజయు పలుకు లాలించి
వ్యాసుండు ఓ జనవరా! తొల్లి జరత్కారుండను ముని గృహస్థాశ్రమంబొల్లక తిరుగు
చుండ నౌక యరణ్యంబున గర్తప్రదేశంబుల స్తంభంబు లడ్డుకొని వ్రేలాడు తన
పితరులం గాంచి, యయ్యలారా! మీరిట్లిచ్చటనుండఁ గతంబేమయని యడిగిన
నోయీ! నీవు దారసంగ్రహంబుజేసినంగాని మేము తృప్తులముగాము స్వర్గప్రాప్తికి
హేతువుగా మా చెప్పిన విధంబున నీవు సదాచారపరుండవు గమ్మనిన నతండు.368
తే.గీ. సమసమాఖ్యయు ...గ యేచానయేని | నాకు లభియించెనే నమ్ముఁడట్టి
దానిఁ బెండ్లాడఁ దలచితిఁ తథ్యముగ న టంచు పనివినెఁ దా దీర్థ యాత్రకపుడు.369
తే.గీ. పన్నగంబుల నగ్నిలో బడుతటంచు దల్లి శపియించెఁ గనలి యత్తరిని సుమ్ము
తత్కథను దెల్పెదను వసుధాతలేశ వినుమనుచు బల్కె మౌని విస్తరముగ.370
సీ. మునినాథుఁడగు కశ్యపునిభార్య లిరువురు వెలయఁ గద్రువయును వినతయు సని
వారు చూచిరి సూర్యు వారువంబొకదానిఁ జూచి కద్రువ తల యూని విసత
కనియె నీసూర్యుని యశ్వ మేవర్ణంబు గలదని యది విని కలికి బలికె
తెల్లని దిదియంచుఁ దేటమీరఁగ నంతఁ గాదు నల్లనిదిని కద్రుప యన
తే.గీ. పంతములు బట్టి రొగిఁ బరస్పరము వార లపుడ కద్రువ వినతితో ననియె రేవు
వచ్చిచూతము చూచిన వన్నెయేరి దామెకును దాసిగాఁదగు నన్యయనుచు.371
సీ. ఆదటఁ గద్రువ యాత్మజులనుగొంచి తారుసూచిన హరిదశ్వునశ్వ
మును నల్లనిదిసేయుఁ డనిన వారలఁ గొంద ఱొల్లమి శపియించె నుక్కుదరిగి
యీరలు జనమేజయేలావిభునియోగమున నగ్నిలోఁ బడుడనుచుఁ గొంద
ఱంబపంపునుఁజేసి రంత గద్రువమును వినతయుఁ జని యశ్వమును గనంగ
తే.గీ. నల్లనిదియైన వినత డా డిల్లపోయి | తనకుమారుని గరుడుని గనిన నాత
డేకతంబునఁ తల్లి నీ కిట్టి దీన | భావమొదవె ననంగ నా భామ పలికె.372
క. గరుడా నేఁ గద్రువకుం బరిచర్యలు సేయవలసె బహునీచగతుల్
పరమేష్ఠి గలుగఁజేసెన్ గొఱమాలినదాన నైతిఁ గొడుకా యనుచున్. 373
వి. విలపించి సవతికిం దనకును జరిగిన పంతంబుల యువంతంబంతయుం దెలిపి పంతం
బీడేరక తాఁదాసిగావలసివచ్చిన విధంబుఁ దెలిపి రా తక్షణంబ తనుఁ జంక నెక్కించు
కొని మ్రోయమనుచుఁ గద్రువ బాధించుచున్నయది నే నేమిసేయుదుఁ దండ్రీ యని
విలపించు తల్లిం గాంచి మంచివచనంబుల నామె ననునయించి నీ వేలచింతిల్లెదవు
కద్రువ కోరినయట్ల నేన చేసెద నని యేగి కద్రువం గాంచి సమస్కరించి యమ్మా
నిన్ను మ్రోయవచ్చితి నని పల్కి యక్కుటిల జేతులపై నెత్తుకొని సముద్రతీరంబుచేరి
యచ్చట డించి తల్లీ నాయమ్మ దాసీభావంబునుడుపం గోరెద ననిని నాకద్రువ దేవ
లోకంబునుండి యమృతభాండంబు గొనివచ్చి నా కిచ్చిననాడు నీతల్లి దాసీభావంబు
విడుచు ననిన నామె పలుకులు విని తార్క్ష్యుడు తన మనంబున సంతసిల్లి 374
మ. బలవంతుండు వైనతేయుఁడు మరుత్వన్ముఖ్యదేవప్రజం
బుల నోడించి వడిన్ సుధాకలశమున్ బొల్పారఁ దాఁ దెచ్చి ని
శ్చలతం గద్రువ కిచ్చినం గని మహాశ్చర్యంబుతోఁ దల్లికిం
గల దాస్యంబును బోయే బొమ్మన విహంగస్వామి సంతుష్టుడై 375
క. చనినవెనుక నమృతంబును గొను తలఁపున భుజగవరులు గొబ్బున నీటన్
మునుగంబోయిన సమయం | బున నింద్రుఁడు దాని గొనుచుఁ బోయెం దివికిన్. 376
క. తరువాత నాగవరులం దరు నమృతముగాన కార్తిఁ దడబడి దర్భా
స్తరణము నాకిన నాలుక లిరియంగ ద్విజిహ్వలై రిలేశ్వర వారల్.377
ఆ.వె. తల్లిచేత శాప తప్తులై వాసుకి ప్రముఖు లేడ్చికొనుచు బ్రహ్మకడకు
బోయి మొరలిడంగ నాయజుం డతిదయా పరత నిట్టులనుచుఁ బలికె నపుడు.378
క. కలడు జరత్కారుండన నలరెడు ముని వానికి న్నయం బెనగఁగ బెం
డిలిసేయుఁడు వాసుకి చెలియలిని సనామకను; బుట్టుఁ నాస్తీకుఁ డనన్.379
తే.గీ వారల కతండు మీకగువాడుసుమ్ము దారుణంబైన శాపంబు దలగజేయ
ననిన విధిమాటలకు గడు నాత్మ నలరి | వాసుకియు మునిగ వనముజేరి.380
క. భగినీ సనామక నిచ్చెదఁ దగఁ బెండిలిసేసికొనుము దయతోనని వే
డగ ముని నా కప్రియమును | మగువ యెవుడు సేయు నపు డు మానెదసుమ్మీ 381
క. ఆమాట కొడంబడినన్ నే మానిని బుచ్చికొందు నెమ్మి భుజంగ
స్వామీ యటు సేయుమనిన నా ముగద నొసంగి చనియె నహిపతి వేడ్కన్.382
ఉ. ఆ రమణీమణిం గలసి యాకులపాక వసించి యా జర
త్కారుడు భార్యఁ జూచి వనితా నను లేపకు నిద్రపోయేదన్
నా రుచిరాంగి యట్లయని నాథుని లేపకయుండె నంతలో
సూరుడు పశ్చిమాంబుధిన జొచ్చిన జూచి వెలంది యాత్మలోన్.383
ఉ. లేపకయున్న సంధ్య చెడు లేపిన నాకు నపాయమౌ గదా
యేపనిఁ జేయవచ్చునని యెంతయుఁ గుందుచు నెట్టకేలకున్
లేపిన మేలు ధర్మ మొక లేశము నాశముగాదు నాకునున్
లేపకయున్నఁ గీ డదియు లెక్కగొనం బనిలేదు చూడఁగన్.384
ఆ.వె. సంజయయ్యె వేగ సామి లే లెమ్మని పిలువ నతఁడు లేచి చెలియ యేను
బోవువాడ నీవు పుట్టంటి కేగుమ | టంచుఁ బలుక భీతి నార్తయగుచు.385
ఆ.వె. ప్రాణనాథ నీకు భ్రాత నన్నిచ్చిన యర్థ మెట్లు పొనగు సనిన మౌని
యస్తియనుచుఁ బలికి యరిగె గానలకును | నాతి సొచ్చెనంత భ్రాతయిల్లు.386
సీ. వచ్చిన చెలియలి వగపు దాఁ గనుగొని వాసుకి యడిగిన పనిత సెప్పె
జరిగినపనియును వరుఁ డరణ్యములకు బోవుచో మాయన్న పూని నన్ను
నీకిచ్చుకోరిక చేకూరు విధమెట్టు లనిన నస్తి యటంచు నతఁడు సనిన
విధమును నది దాను విని సంతసించి వాసుకి యుండె నింతలో సకియ గనియె
తే.గీ. మగశిశువు వాని నామంబు జగతియందుఁ బరగె నస్తీకుఁడంచు నా బాలకుండె
యజ్ఞమందును నీకడ కరుగుదెంచి మాతృపక్షంపు భౌజగజాతిఁ బ్రోచె. 387
వ. రాజేంద్రా! నీవలన సన్మానింపంబడిన యస్తీకుండు చేసిన పని కీర్తనీయంబయగు.
నీవును భారతంబు సర్వంబును వింటివి. నీకు మేలగుఁగావుత. నీవు చేసిన పుణ్యం
బునంబట్టి నీజనకుండు సుగతిం జెందె నీకుఁ గొరంత యేమున్నది. మహాదేవి
కాయతనం బమర్చి భక్తితో సేవింపుము. నీకు సకలంబును సిద్ధించునని చెప్పి
మరియు.388
తే.గీ. భూమినాయక వినుము దేవీమఖంబు నీవొనర్పుము నిఖిలంబు నీదసుమ్ము
పరమపావనమైనట్టి భాగవతము | వినుము విన్పించు నేను సవిస్తరముగ. 389 389
తే.గీ. పరమపావనమైనది భాగవతము | రాగలోభాదుల నడంచు భాగవతము
భవభయంబులఁ దొలగించు భాగవతము | భగవతీభక్తి పలదంబు భాగపతము.390 390
క. దేవీపాదాబ్జంబులు | సేవించినవారు సుఖముఁ జెందుదురు ధరం
దేవీపాదాబ్జంబులు। సేవింపనివార లఘుముఁ జెందుదురు నృపా!391 391
చ. భగవతి విష్ణుదేవునకు భాగవతంబునుఁ జెప్పెఁ గావునన్
దగ నిదతక్క నన్యమగు దారిని బోయిన మోక్షమబ్బునేఁ
జగతి నరాధముల్ తెలియఁజాలరుగాక నరేంద్ర నీకు నే
భగవతిఁ గొల్చి చెప్పెదను భాగవతం బిది చిత్తశాంతికిన్.392 392
స్కంధాంత కృతిపతి సంబోధనము
శా. తాలక్ష్మాశతార్బుదోపమకరోద్ధండోగ్ర వేదండర
క్షోలక్ష్యాక్షిమహాశుశుక్షణిసుతేజోమాలికాపాలికా
లీలాశాలిశిలీముఖప్రకరకేలీలోలజేగీయమా
నాలీఢాజగవప్రచారసమరా యల్లూరి సోమేశ్వరా.393 393
స్రగ్విణి. సోమలేఖాజటాజూటసంభారశో
భామహోదారతా పాలితద్యోపురా
రామవిస్ఫారకల్ప ప్రసూనోత్కరా
వ్యోమగంగాధ రాల్లూరి సోమేశ్వరా!394 394
గద్య. ఇది శ్రీమదిష్టకామేశ్వరీపాదారవిందమకరందతుందిలమానసేందిందిర, దానువంశ
పయఃపారావారరాకాసుధాకర, కామాంబాకన్నయమంత్రీంద్ర కుమార, పవిత్ర హరిత
గోత్రాలంకార కృష్ణామండల మండనాయమానాల్లూరగ్రహార పూర్వార్జితధరావిరాజ
మాన, శ్రీవీరప్రతాప కోర్కొండహంవీర రామచంద్ర భూమీశ్వరదత్త గోదావరీ
మండలస్థిత సీతారామపురార్ధభాగ పరిపాలనాధీన, పూర్వోక్తోభయమండల న్యాయ
సభావాదక నియోగభారవ్యవహార, శ్రీ వేంకటేశ్వరవరప్రసాదసంభూత కవిత్వ విద్యా
విశేషబాల్యాదిరచిత త్రింశత్ప్రత్యేక గ్రంథ మతిసార, విబుధజనకరుణాసంపాదితో
భయభాషాపరిచిత ప్రచారనిత్య, శ్రీరామామాత్య ప్రణీతంబగు శ్రీ దేవీభాగవతంబను
మహాపురాణంబునం ద్వితీయస్కంధము.
ద్వితీయస్కంధము సమాప్తము.