శ్రీ దేవీ భాగవతము/తృతీయస్కంధము
శారదాంబాయై నమః
శ్రీ దేవీ భాగవతము
తృతీయ స్కంధము
క. శ్రీ డ్విబుధ జ్యేష్ఠ స్వా | రాడ్వైశ్వానరపరేతరాడ్రక్షంభో
రాడ్వాయుధనదలసదవి | సృడ్వైభవ సంప్రకాశ శ్రీసోమేశా. 1
వ. అవధరింపుము భగవంతుండైన సాత్యవతేయుం జూచి జనమేజయుం డిట్లనియె.2
జనమేజయకృత దేవీస్వరూపాది ప్రశ్న
సీ. అయ్య సాత్యవతేయ యంబామఖంబని యీరు నెప్పిన యజ్ఞమెట్టిదొక్కొ
యెట్లది పుట్టెనో యెక్కడనో కతంబేమియో తద్గుణం బేమియొక్కొ
యేస్వరూపమొ విధులెవ్వియో సర్వజ్ఞ దీనదయాపర తెల్పుమయ్య
బ్రహ్మాండ మెట్టుల ప్రభవించెనో సవిస్తరనుగఁ జెప్పుమా ధర్మచరిత
తే.గీ. బ్రహ్మయును విష్ణువును శూలపాణి మువుఱు | దేవతలు సృష్టి సంరక్షణావసాన
కర్తలును సగుణులు నండ్రు కడగి వార లొగిస్వతంత్రులో తెలుపుమా యోగివర్య. 3
తే.గీ. మృత్యువున్నదో వారికి నిత్యులో యనిత్యులో సచ్చినానంద నిరతులో స
మస్త దుఃఖాది భౌతికమగ్నులో య | శనిధరాదులు కాలవశగులొ కారొ 4
క. దివిజులపుట్టువు లెట్టివొ పవిధరముఖులకును శోకభయములు కలవో
తవులునొ నిద్రాలస్యము లవి వారికి ధాతుమయములౌనో తనువుల్.5
తే.గీ. ఏద్రవంబుల దేహంబులేర్పడినవొ | యేగుణంబుల నెసఁగెనో యింద్రియములు
వారిభోగంబు లెట్టివో వారియాయు | వెంత కాపుర మెక్కడ ఋభువులకును. 6
వ. అనిన వ్యాసుండు. 7
సీ. సర్వంసహాధీశ చతురుండవగుదువు దుర్గమంబగు ప్రశ్న తోచె వీకు
బ్రహ్మాదులెట్టుల ప్రభవించి రంటివి యిది మున్ను నారదు నేనడిగితి
అడిగిన నారదుం డంతయు వివరించ నది యెట్టులనిన నే నతిముదమున
నొకనాడు నారదుండున్న గంగాతీరమున కేగి నారదమునినిఁ గాంచి
తే.గీ.యడుగులకు మ్రొక్కి తదనుజ్ఞ నతనియొద్ద నాసనంబునఁ గూర్చుండ నబ్జభవుని
కొడుకు మున్మున్న ప్రేమతో కుశలమడిగి ప్రశ్న సేసితి బ్రహ్మాండభవముఁ గూర్చి. 8
ఉ. ఎక్కడనుండి పుట్టినది యీ ద్రుహిణాండ మిదేకకర్తృకం
బొక్కొ ద్వికర్తృకంటొకొ బహూగ్రహకర్తృకమో యకర్తృకం
బొక్కొ యకర్తృకం బొకటియున్ గన మెందునుఁ గార్యసంతతిన్
జిక్కు విరోధ మట్లనిన శేముషిఁ జూడఁగ సందియంబగున్. 9
సీ. శంకరు బరమేశు శైలాధివాసుని శంభుని భూతైక సార్వభౌము
కారణకారణు గజచర్మపరిధాను గిరిజాకళత్రు సద్గీతచరితు
సుభగు నాత్మారాము సురలోకవందితు నుగ్రు శర్వుఁ గపర్ది నురగభూషు
కాలకాలుని మహాకాలు మహానటు భీము మహాదేవు గామదమను
తే.గీ. శూలపాణిని లలితార్ధసోమమకుటు। నీశ్వరు మహేశు నీశాను నిద్ధచరితు
నభవు భవు నాపగాధరు నభినుతింత్రు | కడగిఁ బ్రహ్మాండములకెల్లఁ గర్త యనుచు. 10
సీ. విష్ణు లక్ష్మీశు నుర్వీశు నారాయణు వైకుంఠు దైత్యారి వాసుదేవు
కేశవు గోవిందు నీశు హృషీకేశు మధుసూదనునిఁ గృష్ణు మాధవు హరి
నచ్యుతుఁ బద్మాక్షు నగధారి శ్రీధరు స్వభుఁ ద్రివిక్రము మురశాసి జిష్ణు
దామోదరునిఁ బరంధాముఁ దార్క్ష్యధ్వజు శేషశాయిని స్వర్ణచేలు మహితు
తే.గీ. శార్ఙ్గిజక్రి సనంతునిశ్చలు దయాళుఁ గృష్ణు దామోదరుని గుడాకేశమిత్రు
శౌరి దశరూపధరు దేవుఁ జాటుచుండ్రు|కడఁగి బ్రహ్మాండములకెల్లఁ గర్త యనుచు. 11
నీ. అమృతాశనజ్యేష్టు నంభోజగర్భు సరస్వతీ మదవతీ ప్రాణనాథు
స్రష్టనుఁ బరమేష్టి సకలలోకేశుఁ బితామహు నజుని విధాత ధాత
విధి విశ్వకర్తను వేదనిర్మాతను హంసాధిరూఢు నిత్యప్రకాశు
చతురాననుని బ్రహ్మ సౌవర్ణగర్భు ద్రుహిణు స్వయంభువు చారుగుణగణాఢ్యు
తే.గీ. నతులమతిమంతునిం బ్రజాపతిని సత్యలోకవాసుని హరిసూను శోకరహితు
బరము భూతప్రవర్తకుఁ బలుకుచుండ్రు కడఁగి కొందరు బ్రహ్మాండకర్త యనుచు. 12 .
తే .గీ. లోకదీపకు రవి నతిలోకతేజు | మిత్రు సర్యముఁ బరమపవిత్రు బూషు సూ
ర్య సంజ్ఞేశ్వరు నుషేశు జూపుచుండ్రు|కడఁగి కొందరు బ్రహ్మాండకర్త యనుచు.13
క. ధరఁ గొంద ఱింద్రు డందురు | మఱికొందరు వరుణు డండ్రు మానక యితరుల్
కరివదనుఁ డండ్రు కొందరు మరు డందు రజాండకర్త మతిమంతు లొగిన్. 14
తే.గీ. వనజరిపుఁ డండ్రు కొందరు వహ్ని యండ్రు కొందరు కుబేరుడందురు కొందరు యము
డందు రీరీతినుండగ నాత్మవిదులు భగవతి నజాండకర్త్రిగాఁ బలుకుచుండ్రు. 15
వ. మఱియు నద్దేవి యీశ్వరి యనియు, నిర్గుణ యనియు, సగుణ యనియు, వైష్ణవి యనియు,
శాంకరి యనియు, బ్రాహ్మి యనియు, వానవి యనియు, వారుణి మనియు, వారాహి
యనియు, నారసింహి యనియు, మహాలక్ష్మి యనియు, వేదమాత యనియు, నేక యనియు,
విద్య యనియు, స్థిర యనియు నానావిధంబులగు నామములం గొనియాడఁబడుచు,
భక్తులకోరికల సమకూర్చుచు, మోక్షార్థులకుం బునర్భవభయంబు లడంచుచు, ఫలార్డులకు
ఫలంబు లిచ్చుచు, నిర్గుణయయ్యు సగుణయై, నిర్వికల్పమై, నిత్యప్రకాశినియై, త్రిగుణా
తీతయై , మాయకు లోఁబడక నిరంజన నిర్వికారాది తత్వంబుల నుల్లసిల్లి, యరూపమై,
నిర్లేపమై యొప్పు బ్రహ్మ తానయై ప్రకాశించునని పెద్దలు సెప్పుదు రదియుంగాక సహస్ర
శీర్షుండై సహస్రాక్షుండై సహస్రకరుండై సహస్రకర్ణుండై సహస్రముఖుండై యలరు
విరాట్టును దానయై యుండునని బ్రహ్మవిదులు కొందఱు పలుకుదురు. మరికొందరు
నిరీశ్వరవాదులు జగంబునకుం గర్తకావలసినది లేదందురు . ఇఁకఁ గొందఱు స్వభా
వంబె కారణం బందురు. ప్రకృతి యనియుఁ బ్రధాన మనియు సాంఖ్యులు సెప్పుదురు.
కావున నాహృదయంబు నానావిధ సందేహంబులకు నిఱవై మిగుల బాధనొందుచున్న
యది, నేనేమిసేయుదు, ధర్మాధర్మంబులు రెండును నా కొక్కరూపుగాఁ దోచుకున్న
యవి. ధర్మాధర్మంబులు వేరుసేయు లక్షణంబులు ప్రత్యక్షంబునఁ గానరాకయున్నయవి.
సత్వాది గుణంబుల నించి సత్వగుణంబులం దేజరిల్లు దేవతలకు దానవులచే నానావిధముల
ప్రతిబంధంబులు ప్రాపించుకున్నయవి ధర్మమంద నిలిచి సదాచారపరులగు పాండవులకు
బహువిధ దుఃఖంబులు సంభవించుట యెరుంగమే. అదికతంబునం జేసి నా సంశయంబులు
నివారింప నీపుతక్క నన్యుఁ డోపుఁవాడులేడు . జ్ఞానంబను మంచియోడపై నెక్కించి
సంసారంబను సముద్రంబు దాటునట్లు చేసి నన్నుం గటాక్షింపవే యనుఁడుఁ గరుణార్ద్ర
హృదయుండై నారదుఁడు నాకుం జెప్పె నెట్లనిన. 16
-: దేవీభాగవతావతరణము :-
తే.గీ. వ్యాస! మును నాకు నీసందియంబ కల్గి । జనకుఁడగు ధాతఁ జేరంగఁజని యడిగితి
నాయనా జగ మేరీతి నాయె మొదలఁ | గర్తనీవొ కపర్డియో గరుడహయుఁడో. 17
క. ఆరాధనీయుఁ డెవ్వం | దీరేడు జగంబులందు నెవ్వడు సర్వా
ధారములకు నాధారో ! దారముహిముఁ డతనిఁ దెల్బు దయతో నాకున్.18
క. సందియము విడువ కుల్లం బాందోళితమయ్యె నెట్టు లాత్మను శాంతిం
బొందింతు నెవవిఁ గొలుతున్ వందనమిదె ప్రోపు మనిన వనజజుఁ డనియెన్.19
క. అతిదుర్బోధము ప్రశ్నం |బతులిత మిది నీకుఁ దెలియు నా విష్ణునకే
మతి నూహింపగఁ దుస్తర|మితరుల కేమందుఁ బుత్ర యెక్కడిమాటల్ 20
క. ఏగతి యత్నము సేసిన | రాగులకుం దెలియ దిది విరాగులు తెలియం
గాఁ గలరు వినుము చెప్పెద| సాగరమయమయ్యె మున్ను సకలము పుత్రా.21
తే.గీ. భూతపంచకమాత్రము పుట్టియుండు । నాడు నే జనియించితి నళినమందు
సూర్యుఁ జూడమఁ జంద్రునిఁ జూడ వృక్షములనుఁ జూడనుఁ బర్వతంబులనుఁ జూడ.22
ఉ. తామరపూవుమిద్దెపయి తప్పకయుండి మహార్ణవంబునం
దేమహిమం జనించితినో యేను ననుం గని ప్రోచుఁవాడు లేఁ
డో మఱి యెందునేని గలఁడో జల మెట్టుల నెందు నిల్చెనో
భూమియొకండు కాననగుఁ బోలునటంచునుఁ జింత సేసితిన్. 23
తే.గీ. వేయిహాయనములదాక వెదకి వెదకి | వేసరితిఁ గానలేనైతి వేఱుమన్ను
సరగఁ దపఁ దప యను నొక్కశబ్దమపుడు |చదలనుండి వినంబడె శ్రవణములకు 24
తే.గీ.అంత వేయేండ్లు తపము నే నాచరింప|సృజ సృజ యటంచు నొకసద్దు చెవుల బడియె
నంత నెయ్యది సృజియింతు ననుఁచుఁ బొగిలి | తెల్ల మొగమయి కూర్చుంటి డిల్ల పోయి. 25
తే.గీ. అంత మధుకైటభాఖ్యులొ నసురు లిరుపు | రాజిఁ గోరిన భయమంది యబ్జనాళ
మార్గమున డిగ్గి జూచితి మహితపురుషు | స్వప్రకాశైకశోభితు నప్రమేయు. 26
సీ. మణిదీపకాంతి గ్రమ్మఁగ వేయిపడగల పాముపై హొయలుగా బండినాఁడు
నెఱుపులొ ప్పెడి తొలుకరిమబ్బు సరి మేసఁ గనకంపుఁబుట్టంబు గట్టినాఁడు
ఆజానుదీర్ఘంబులగు చతుర్భుజములఁ బంచాయుధంబులఁ బట్టినాఁడు.
ఉరమున శ్రీ దేవి కుయ్యేల చేరునాఁ దనరెడి వనమాలఁ దాల్చినాఁడు.
తే.గీ. నగుమొగమువాఁడు జగములేలఁగలవాఁడు | నిరుపమానందకరుడయి నెగడు వాఁడు
యోగ నిద్రనుఁ గూర్చుచు నున్నవాఁడు| కదలకున్నాఁడు పురుషుఁ డొక్కరుఁడు ఘనుఁడు.27
వ. అట్టి దివ్యపురుషుండు నా కన్నులయెదుట, 28
తే.గీ. కానవచ్చిన నేమందుఁ గన్నబిడ్డ | యతితరంబగు వచ్చెరువాయె నాకు
నంత నిద్రాస్వరూపంబు నందియున్న | దేవి స్తుతియించితిని భక్తిభావగరిమ.29
తే.గీ. తక్షణంబున దేవి తత్తనువునుండి |లేచి గగనంబునందుండె లీల దివ్య
భూషణాంచితయై యంతఁ బుండరీక| లోచనుండును నిదుర చాలునని లేచి. 30
తే.గీ. మధువుతోఁ గైటభునితోడ మాధవుండు | గదన మొనరించి తొడలపై గదియఁబట్టి
రక్కసుల యొక్కసులఁ బాపి యుక్కడంచె | రుద్రుఁ డేతెంచె లీలా వినిద్రుఁ డగుచు.31
సీ. దివ్యరూపముతోడ దేవి తాఁ బొడగఁజ్జె ముగురము సూడంగ గగనమందు
చూచి మేము స్తుతింపఁ జూపుల దయగుల్క నా మహాదేవి యిట్లనుచు బల్కెఁ
గాజేశు లార మీ రోజఁ జనుండిఁక మీ మీ పనులమీద మెళకువడర
రక్కసుల్చచ్చిరి నిక్కంబు మీకొక్క భయములేదిఁకఁ బొండు భవనములనుఁ
తే.గీ. దగిన చోటులఁ బొసగించి జగము నాల్గు| విధములగు సృష్టి నలుపుండు వేగ సనిన
భగవతీవాక్యమును విని భక్తిమీర నివ్విధంబునఁ బల్కితి మృదుతరముగ 32
తే.గీ. కావలసినంత మన్నేది కన్నతల్లి| యేడజూచిన జలమాయె నేడ నిప్పు
మొదలుగాఁగల వింద్రియమ్ములును లేవు | తెలియఁ దన్మాత్రలులేవు దిక్కులేదు. 33
క. ఏలాగు సృష్టి సేయం | జాలుదు మో యమ్మ యనిన శక్తి సరగునన్
లీలా విమాన మిదిగో మేలైనది రండు దీనిమీది కనంగన్. 34
క. రతనాల విమానం బ| ప్రతిమంబునుఁ జూచి యందఱము నెక్కితి మ
ద్భుత కింకిణీనినాదాం | చితముక్తాదామ సువిలసితమై యొప్పెన్ . 35
వ. దానిపై నుండి. 36
--: బ్రహ్మాదులకు భువనేశ్వరి దర్శనమిచ్చుట :--
క. పోతిమి పోతిమి యెక్కడికో | తెలియ దదెట్టకేలకును మము నిలిపెన్
భీతాత్ముల మగు మాకున్ | జేతో మోదంబు గలుఁగఁజేసెడి భువిలోన్.37
సీ . పచ్చపచ్చవిరంగు పచ్చిక ల్కల చోట్లు ఫలరమ్యవృక్షముల్ కలుగుచోట్లు
కొదమ కోయలగుంపు కూఁతలు కలచోట్లు వివిధ పర్వతరాజి వెలయుచోట్లు
మగవారు నాడువా రొగిఁ జరించెడిచోట్లు పశువులమందలు పరగుచోట్లు
వరసరిదంభః ప్రవాహముల్కలచోట్లు వాపులుఁ గూపముల్ వరలుచోట్లు
తే.గీ. కనుచుఁ జనఁ జన నెదుట ప్రాకారరమ్య| మనుపమానమహాహర్మ్యమైనయట్టి
పురము గనవచ్చె నది సూచి సురలప్రోలు | గాఁదగును దీని నెవ్వరు కట్టినారొ.38
క' అని యచ్చెరుపడి మఱియున్ | జని చని కాంచితిమి దేహకాంతులు దెసలం
దుసుఁ గ్రమ్మ వేటకై వ | చ్చిన భూవరు నొకని నచట భూరివిలాసున్ 39
క. తడయక క్షణమాత్రంబున గడపె విమానంబు దేవి గగనమునం దా
బిడమాయ యెట్టిదో యయ్యెడ మఱియొక దేశమునకు వేగితిమి వెసన్.41
సీ కల్పకంబుల నీడఁ గామధేనువు దూడ కడ సితేభము జూడఁగాచి కాచి
మేనకాదులు క్రీడమెలసి నాట్యములాడ గంథర్వులును బాడఁ గాంచి కాంచి
మందారములవాడఁ బృందారకులతోడఁ దనరు బంగరు మేడ దాటి దాటి
గరుడపచ్చల గోడ కలచోట శచిఁ గూడఁ దెరగంటి దొరజాడఁ దెలని తెలిసి
తే.గీ. స్వర్గమిదియని యమితవిస్మయమునొంది యచటఁ గనుఁగొంటిమి కుబేరు నంబుపతివి
సూర్యదేవు విభావను సురలనెల్ల। యహహ యప్పురిసిరి నెన్న నలవియగునె.42
గీ. ఆదియు దాటించే క్షణములోనంబ తనదు। మహిమ వెండియుఁగంటిమి ద్రుహిణపురము
పురమునం దొక్క ద్రుహిణుండు బుధులు గొల్వ నడరఁగా జూచి హరిహరులబ్రపడిరి.43
తే.గీ. అతని సభయందు వేదవేదాంగములును । సాగరంబులు నదులును శైలములును
భుజగములు నిజరూపముల్ పొందియుండ | హరిహరులు నన్నుఁ జూచి యిట్లనిరి పుత్ర!44
క' ఈతం డెవ్వఁడొ యెఱుఁగుదె నీతీరున నున్నవాడు నిక్కమనిన నేఁు
జేతమునం దలపోసియు | నీతఁ డెవఁడొ నే నెవఁడనొ యెఱుఁగ నటంటిన్. 45
క. అంతట విమాన మెంతయు వింతగ మఱియొక్క చోట విడిసిన మేమున్
మంతనములాడికొనుచున్ సంతసమున దానిఁ జూచి సంభ్రమమొదవన్. 46
క. చిలుకలు గిలకలఁ గూయఁగఁ గులుకుచుఁ గోయెలలు మిగులఁ గూకూయన వీ
ణలు మ్రోయఁగ మద్దెలధ్వను లలర మునులుపాడఁ జెలియలాడఁగ నెంతే.47
క. వరమై సుఖకరమై సుందరమై వరమైందవామృతరసోపమభా
సురమై కైలాసధరా | ధరమై కనుపట్టె నున్నతశుభ శిఖరమై 48
వ. అందు. 49
సీ. ఖిణిఖిణిల్లనుచు ఱంకియలార్చు నున్నని యీటె కొమ్ముల యెద్దు నెక్కినాఁడు.
పిష్టామృతహవిస్సు లిప్టాప్తి లోఁగొను మూడుకన్నులతోడ మురిసినాఁడు
కలువకన్నియచెక్కు గిలిగింతఁ గొల్పించు దంట యౌదలపూవుఁ దాల్చినాఁడు
చాఱచాఱలకోఱ జంతువుచర్మంబు కటినిండ వలువఁగాఁ గట్టినాఁడు.
గీ. వెలయ వెనకయ్య వెనకయ్య వెనుకటయ్య | యుభయపార్శ్వంబులందుండి యొప్పినాఁడు
నిండు వేడుక నరుగుచు నిలచి యేము సూచి తలఁచితి మాతండు శూలిగాఁగ. 50
తే.గీ. అచటఁ దల్లులతో నేను నాడుచుంటి నన్ను నేనును శూలియుఁ దన్ను దాను
జూచుకొని యద్భుతరసాబ్ధిఁ జొక్కి చిక్కి యుండఁగ విమాన మింకొక్క యునికి బట్టె.51
సీ. కస్తూరికలయంపి గమగమల్వాకిళ్ళఁ గమ్మగంబుర పొళ్ళ తావినోళ్ళ
జాజిమల్లియమొల్ల సంపంగి పందిళ్ళ నునుజవాటికరుళ్ళఁ జెనకుగోళ్ళ
మంచిగందపుపూఁత మించుమేలియొడళ్ళ నెసకంపుఁ బుప్పొళ్ళ విసరుఁ గేళ్ళ
కొప్పులసిరిమించుఁ గొమరైన కురువేళ్ళ గడఁగిమర్వపుమళ్ళఁ గట్టునీళ్ళ
తే.గీ. వలపులు బయిళ్ళకెక్కి దిక్కులకు వెళ్ళ| మాకుముక్కోళ్ళలోనికిఁ బ్రాకిత్రుళ్ల
వింటిమచ్యుతు పేళ్ళ నవ్విభునికాళ్ళ | కెరఁగి స్మరియింపఁ జప్పుళ్ళ నెత్తుగుళ్ళ. 51
క. ఏమందు మాపురంబున కే మందఱ మేగి వింటి మిది వైకుంఠం
బేమందిరంబు హరికని ప్రేమం దగఁ జూచి చూచి వేడుకనుండన్. 52
సీ. నల్లయగస్తి క్రొన్ననవంటి యందంబు పూను చామనిచాయ మేనివాఁడు
విరిసిన సంపంగి విరివంటి బలుహొయల్ గలుగు దుప్పటి మేనఁ గప్పువాఁడు
నింద్రుకత్తికి నొక్క యీక నిచ్చినవాని వీపుమీదను బీట వెట్టువాఁడు
మంగళదేవతా మహితహస్తంబులు విసరు వీవనగాలిఁ గొసరువాఁడు
తే.గీ. చక్రమును శంఖమును మహాశార్ఙ్గ ఖడ్గ | గదలు నాలుగుభుజములఁ గల్గువాడు
దివ్యపురుషుఁడొకం డందుఁ దేజరిల్లఁ జేరినప్పటి మాయున్కిఁ జెప్పవశమె. 53
ఉ. అంతట దేవి దివ్యరథ మచ్చట నుంచక పాలసంద్రపుం
బ్రాంతము సేర్చె నందు నొక బంధురసుందరదేశ మొప్పె న
వ్వింతలు సూచి చూచి తని వింతయుఁదీరక యొక్కరొక్క రిం
తింతనరాని సంతసపుటేట మునింగితి మేమిచెప్పుదున్.54
మధురగతిరగడ
మందారంబులు పారిజాతములు। కుందంబులు మఱి కోవిదారములు
చందనములు సురసాల సాలములు | పొందుగ నందపుఁ బూవుఁదోటలును
నిందును నందును నెందుఁజూచినను | నందందే కడు నానందంబగు
బృందము లగుచు మిళిందము లాడఁగఁ । జిందులతో మకరందము గ్రోలఁగ
కోయెల చివుఱుల కొమ్మల మేయఁగఁ | గూయుచుఁ జిలుకల గుంపులు గదలఁగ
దేజరిల్లు నొక ద్వీపముఁ గంటిమి | రాజమణివిభారాజితమైతగు
పర్యంకంబునఁ బరిమండితమగు | నర్యము వెలుఁగుల యా స్తరణంబుల
నింద్రచాపరుచు లెల్లెడఁ గ్రమ్మఁగ | సాంద్రమహిమఁదగుఁ జక్కనిగద్దియ
యెఱ్ఱనిదండలు నెఱ్ఱనిచీరియ | యెఱ్ఱనిగంధము నెఱ్ఱనికన్నులు
చక్కనిమోమును సవరని వాతెర లెక్కింపందగు లిబ్బిచెలియ లొక
కోటియైన చిఱుఁ గోటికి సరియే | సాటిచెలువ విజ్జగమునఁ గానము
రవిబింబంబన రహిభాసిల్లుచు। వవనవయౌవన నానాగుణగతి
వరపాశాంకుశ పరదా భయముల | ధరియించి మహాదరముఖమలరఁగ
హ్రీంకారజపం బింపుగఁజేయు ని | నిరంకుశపక్షిగణార్చిత యగుచును
హొయలుగఁ జిఱునగ వొద్దిగ సూపుచు | శయములఁ గంకణ చకచకలూరఁగ
జెవులను దుద్దులు చెలువలరంగా | రవలకమ్మలొగి రాణఁదలిర్పఁగ
నంగదకేయూరాదులు గుల్కఁగఁ | బంగరుమురుగులు పాణులమెరయఁగఁ
బట్టెడ మెడలోఁ బరిఢవిల్లఁగను | బెట్టినసొమ్ముల పేళ్ళే తెలియవు
నడుమున నొడ్డాణము మురవందఁగ | నడుగులనందెలు బెడఁగు లడరఁగను
హృల్లేఖయు భువనేశియుఁ గొల్వఁగఁ | జల్లగఁను మహేశ్వరి పొగడంగను
అయ్యంగన కుసుమాదులుచుట్టును | నొయ్యారంబుగ నూడిగమియ్యఁగ
నారుకోణముల యంత్రము నడుమను | దేరిచూచితిమి దేవిని భగవతి. 55
ఉ. చూచి వితాకుఁ జెంది యిది సుందరి యెందునుఁ జూడ మిట్టి శో
భాచయ మీనహస్రకర భాసుర యీ సుసహస్రవక్త్ర స
ల్లోచన రమ్యకాంతియుత లోకవినోదిని యౌర యచ్చరల్
నీచలుగారె దీనియెడ నేర్తుమె మెచ్చ నటంచు నుండఁగన్. 56
సీ. అప్పుడు మాతోడ హరి తన తెలివిచేఁ బరికించి యిట్లని పలికెఁ బుత్ర
యీ విశ్వమోహిని యీశ్వరి భగవతి దేవి మహాశక్తి దివ్యమూర్తి
సకలకారణమును సర్వలోకాధారయును మహావిద్య మహోన్నతగుణ
పూర్ణ మహామాయ భూతధాత్రి ప్రకృతి యవ్యయ దుర్జ్ఞేయ యచ్యుతఘన
తే.గీ. శివ దురారాధ్య కల్యాణి శ్రీ యచింత్య | యిది సృజించును రక్షించు నేపుమాపు
పార్శ్వమునఁ గోటిభూతులు పరగుచుండు । ధన్యులము చేసితిమి దీని దర్శనంబు.57
తే.గీ. ఎన్నిపుణ్యము లొనరించియున్నవారు | ఎన్నిదానంబులను జేసి యున్నవారు.
ఎన్నితపములు గావించియున్నవారు | దీనిఁ జూడంగఁ గల రిది తెలియుఁ డింక.58
క. రాగులకుఁ గాన రాదీ । యోగీశి విరాగులకును నొగిఁ గనవచ్చున్
భోగించుఁ బురుషసంగతి | నీ గరితయ ప్రకృతి పేర నెసఁగునుఁజుండీ. 59
క. నీవెక్కడ నేనెక్కడ | దేవతలెక్కడ రమా సుకృదృగ్వాణీ గౌ
రీ వనితలెక్కడ నయో యీ| వెలఁదుక పాదధూళి కెనయుదు మొక్కో. 60
తే.గీ. నేను వటపత్రశాయినై వీరవిధినిఁ । బదము బొటిమనఁ గుడుచుచుఁ బండియుండ
జెలఁగి జోలలువాడుచుఁ జిచ్చిగొట్టి । చాల నీతల్లి సన్ను ముయ్యాలనూచు. 61
తే.గీ. అనుభవము నాకు నిది చిన్నతనమునాడు। తథ్య మీదేవియే నాకుఁ దల్లిసుండు
తెలిసినది చెప్పితిని మీకుఁ దేటపడఁగ । దీనిఁ జూచినమాత్రనే తెలివి పొనఁగె. 62
-: వి ష్ణు కృ త భు వ నే శ్వ రీ స్తు తి :-
క. అని భగవంతుఁడు విష్ణుఁడు । ఘనుఁడు జనార్ధనుఁడు పలికి కడఁగి మరల ని
ట్లను దేవి పార్శ్వమునకుం । జని ప్రణమిల్లుదము రండు చయ్యనమీరల్. 63
క. ఈమెకు మ్రొక్కితిమా మన । కేమేలైనను నొసంగు నేర్పడ నిచటం
గామితముఁ దెలుపుకొందము క్షేమద కొసఁగుదము వేయి చేతుల మోడ్పుల్. 64
తే.గీ. ద్వారపాలకు లెదిరిన వారితోడ । మమ్ము రక్షింపుఁ డీవేళ మాన్యులారి
భగవతీస్తుతి వేయంగ వచ్చినార । మంద మామీద వారి చిత్తానుగులము.65
క. అని చెప్పిన హరిమాటలు । విని యెక్కుడు సంతసమున వేగమ ద్వారం
బునకేగి యచట నిలచినఁ । గని భగవతి యల్లనవ్వి కరుణామయియై.66
క. ద్వారస్థలైన వెలఁదుల । వారంబుల జూచి యచటి వారలతోడ
రా రండని పలికిన య । న్నారులు మముఁ గొనుచు నేగి నయమెనయంగన్. 67
ప. అచట నిల్పిన.68
క. మేమందఱమును యువతుల । మై మించితి మచట నేమనందునుఁ గొడుకా
మామేనుల మారూపుల। మామొగముల మేమె చూడ మనసాయెఁగదా.69
క. స్త్రీరూపధారిణులమై । చారువిభూషణవిభల్దిశల్గ్రమ్మఁగ నం
బా రత్నఖచితపీఠము । చేరువఁ జని మ్రొక్క వింతఁ జెందితిమి సుతా. 70
తే.గీ. ఆమహాదేవి రచ్చలో నందరును వె | లందు లేమందు నందులోఁ గొందఱు సిత
చేల లొకకొందరును నీలచేల లింక । గొందఱునుఁ బీతచేలలు కొల్చుచుండ్రు.71
క. వారందఱును సుధాంధులు । నారీరూపముల నా సనాతనసభలో
నారదవీణాగానము । లేరీతింబాడి రహహ యెన్నఁ దరంబే. 72
సీ. వినుము నారద నీకు విన్పింతు నే మెల్ల నచ్చోటఁ గనుఁగొన్న యట్టివింత
దేవీ పదనఖంబుఁ దేరి చూచితి మొక్కరొక్కరు లోలోన నుబ్బికొనుచు |
నది మహాదర్పణంబై మాకుఁ జూపట్టె నందులో బ్రహ్మాండ మమరియుండె
స్థావరంబులు చూచి జంగమంబులు సూచి ననుఁ జూచుకొని జనార్దనునిఁ జూచి
తే.గీ. రుద్రు జూచి కవివిఁ జూచి రూఢి వాయుఁ జూచి యింద్రువిఁ జూచియు సోము జూచి
వరుఁణుఁ జూచి ధనదుఁ జూచి త్వష్టఁ జూచి గిరి నదీ వార్థి గంధర్వ వరులఁ జూచి.73
సీ. అచ్చరలనుఁజూచి యాత్మజ నినుఁ జూచి తుంబురుఁజూచి సాథ్యులనుజూచి
వెలయ హాహాహూహువులఁ జూచి విశ్వావసునిజూచి చిత్రకేతునొగిజూచి
చిత్రాంగదువిఁజూచి సిద్ధులఁజూచి యశ్వినులమజూచి యా శేషుఁజూచి
కిన్నరులసుఁజూచి పన్నగులనుఁజూచి దితిబిడ్డలనుజూచి పితల జూచి
తే.గీ. నాపురము విష్ణుపురము పినాకిపురము । శేషశాయిని విష్ణుని శేషశాయి
నాభికమలంబునను నన్ను నాముఖమున । కూలిఁజూచి మఱెన్నియో చూచిచూచి.74
ఉ. నేనును విష్ణుఁడున్ హరుఁడు నిక్కుచునిక్కుచు ఱెప్పలార్ప కెం
తేనియు వింతఁజెంది యిది యే మిదియేమని మెల్లమెల్లఁగా
లోననె లోననే గొణుఁగులోఁబడియుంటిమి గాని సత్యమున్
గానగఁ జాలమైతిమి యెగాదిగఁగన్గొను వేదురెత్తుటన్. 75
ఆ.వె. ఆడువారిపోల్కె అమరి చీరెలు కట్ట రవికముళ్ళువైవ రవణములిడఁ
గ్రక్కళించుకొనుచుఁ జక్కఁగా మాటాడ నంతలోనే నేర్పు లబ్బె మాకు. 76
క. చనుదోయి కొప్పు పిఱుఁదుల కెనసిన బరువునను మాకు నేమన జడతల్
కనుపట్టె నడతలందున్ వినుమా మాకప్పుడున్నవే యీనడుముల్. 77
వ. ఇట్లు స్త్రీత్వంబునొంది యా మహాదేవి కూడిగంపుఁ గత్తెలమై యంద యుండ
నూరుహాయనంబులు గడచె నంత మురాంతకుండు భగవతిం బహుభంగుల స్తుతి
యింపందొడంగె. 78
దండకము. జొహారమ్మదేవీ, జొహారమ్మధాత్రీ , జొహారమ్మకర్త్రీ జోహారమ్మభర్త్రీ
జొహారమ్మనేత్రీ, జొహారమ్మదాత్రీ, జొహారమ్మభోక్త్రీ జొహారమ్మ కల్యాణి
నీకుం జొహారుల్, జగంబెల్ల సంసారచక్రంబునం ద్రిప్పుచున్ జంతుకోటిం
భ్రమింపంగ నీవిట్లు సేయంగ లోకంబులెల్లం దగం బంతులై వింతగా డొల్లు
చుండంగఁ గూటస్థవై శక్తివై యుందు హృల్లేఖవున్ నీవ నీకున్ జొహారుల్
తలంపంగ సర్వంబునందుందు వీవేయటంచున్ సదాకారమున్నీవకావే చిదాకారము
న్నీవకావే మహనందమున్నీవకావే యసద్రూపమున్నీవకావే మహాపూరుషున్వశ్యఁ
గావించుకొన్నావు కల్పంబునందీవ యేకాంతభావంబును బొందియున్నావు, ధాతృం
డెరుంగండు శర్వుండెఱుంగండు నేనుం జడుండన్ జగానన్ మఱేరింకజ్ఞానుల్
భవచ్ఛక్తి నెన్నంగలారీశ్వరీ నిన్ను యాచింతు నీ పాదసేవల్సదాసేయుదుం జిత్త
మందుండుమా నీపదాంభోజయుగ్మంబు నిత్యంబు నే దర్శనం బాచరింతున్ జగత్స్వామినీ
నీ దయాపూరమేకాదె నాకు సురజ్యేష్ఠ రుద్రాది దేవాళికిం దిక్కు నీవల్ననే నేను
లోకంబు రక్షింతు ధాతృండు పుట్టించు నీశుండు గిట్టించు సూర్యుండు చంద్రుండు
వెల్గించు నిత్యత్వమెన్నంగ నీవేకదా మాకులేదద్ది జ్ఞాతంబసూ కీర్తియున్ గాంతియున్
శాంతియున్ దాంతియున్ బుద్ధియున్ వృద్ధియున్ రక్తియున్ ముక్తియున్
శక్తియున్నీవ, పూర్ణాంబురాశిం దరంగంబుల ట్లీ సమస్తాసురు ల్నీకు నంశంబులై
యుందురమ్మా ననుంబ్రోవుమమ్మా కృపంజూడవమ్మా మొరాలించవమ్మా పరా
కేలనమ్మా భవాబ్ది౦దరింపంగ బోతంబవై యుండవమ్మా నినున్నమ్మినానమ్మ
నీవాడఁనమ్మా మహాపత్తులం దోడునీడై ననుంగాచి జ్ఞానంబు నాకిచ్చి మన్నించుమమ్మా
నమో స్తంచుఁ బ్రార్థింతు శ్రీశ్రీ, శివశ్రీ, జయశ్రీ. 79
క. అని విష్ణుఁడు విరమించిన | మనసిజసూదనుఁడు భక్తి మహితుం డగుచుగాన్
గొనియాడఁదొడగె నీశ్వరి | ననుపమకారుణ్యవతి ననఘను భగవతిన్.80
-: శి వ కృ త దే వీ స్త వ ము :-
ఉత్సాహ
నీవు సర్వలోకములకు నేత్రిపై రహింప శ్రీ
మావరుండు నీకుఁగల్లె మహిమఁ జెంది వాగ్వధూ
టీవరుండు నీకుఁగల్లె ఠీకుమీఱ నేనుగౌ
రీవరుండఁ గల్గితిన్ ధరింపవమ్మ భగవతీ. 81
ఉత్సాహ
నీవె భూమి నీవె నీరు నీవె గాలి నీవె ని
ప్పీవె నింగి యీవె గంధ మీవె రనము నీవె సో
కీవె రూప మీవె శబ్ద మీవె ఘ్రాణ మీవె నా
ల్కీవె త్వక్కు నీవె కన్ను లీవె వీను భగవతీ. 82
ఉత్సాహ
నీ న్నెరుంగనట్టివారు నేరకండ్రు వేఱుగా
నన్ను బ్రహ్మఁ జక్రపాణి నాథులంచు మూఢులై
చెన్ను మీఱ నీవ మమ్ము చేసినావు తల్లివై
పన్నుగా నజాండభాండ పఙ్క్తి వేను భగవతీ.83
ఉత్సాహ
తల్లి యీప్రపంచమెల్ల రాత్రిచేతఁ గల్గునే
నీళ్ల చేతఁ గల్గునేని నిప్పుచేతఁ గల్గునే
మొల్లమౌ నణుప్రకాండము ల్స్ఫుటంబు లెట్టులౌఁ
జెల్లియుండు నీ కళావిశేషమెండు భగవతీ.84
ఉత్సాహ.
అమ్మ వీవె సర్వ మీ ధరాధరమ్ము నమ్ము మా
యమ్మ నీవెసుమ్మ బమ్మ వచ్యుతుండ వీవె నా
యమ్మ నీవె యెందరమ్మలైన సమ్ముఖమ్మునన్
బొమ్మలాటలో నివారె పొ మ్మనాది భగవతీ. 85 85
ఉత్సాహ.
నీ పదంబు లాశ్రయించి నేను శౌరి బ్రహ్మయున్
రూపునీజగంబులకును రూఢినిచ్చువేళలన్ .
కాపునీవకాదె మాకుఁ గామదాత్రివై సదా
చూపులం గృపారసంబు చూపుమమ్మ భగవతీ.86 86
ఉత్సాహ.
నీ దయారసంబు చేతనే విరించి దా రజం
బూదెనమ్మ శౌరి సత్త్వమూనె నేను నత్తమం
బాదుకొంటినమ్మ పద్మజాండకర్త్రి భర్త్రి నీ
వాదిశ క్తివమ్మ ప్రోవవమ్మ మమ్ము భగవతీ.87 87
ఉత్సాహ.
రాజటంచు నొక్కడుండు రాజునొద్ద బంటుగాఁ
దేజరిల్లు నొక్కరుండు దీనుఁ డొక్కరుండుగా
నోజ భాగ్యవంతుఁడొక్కఁ డుండునట్లు వింతగా
నీజగంబుఁ జేసితీ విదేమి తల్లి భగవతీ.88 88
క. అమ్మా నీగుణములు మూ | డిమ్మాడ్కిఁ బ్రపంచమెల్ల నృజియింపంగా
నిమ్ముగఁ ద్రోవఁగఁ ద్రుంపఁగ | మమ్మేటికిఁ చెప్పుకొండ్రు మాయాగుణమే.89 89
క. అమ్మ విమానముమీఁదన్ | మమ్మెక్కించుకొనివచ్చు మార్గమ్మున నూ
త్నమ్ములగు విష్టపమ్ములు | సమ్మతిఁ గనుఁగొంటి మెవరు సలిపిరి తల్లీ. 90 90
క. పుట్టింతువు గిట్టింతువు | నెట్టనజగమెల్ల నీకు నీవే కావే
దిట్టయగు స్వపతిఁ బురుషున్ | గుట్టెఱిఁగి వరించు పరమ కోవిద వీవే.91 91
క. మము భాగవతులఁ జేయుము | విమల భవత్పాదరజము వేడుకమ్రోయన్
రమణీరూపములను విడ | చి మఱేమి యిఁక నిట మేము చేయుదుము సతీ. 92 92
క. ఈ మేనుల మాకుఁ గొఱం | తేమున్నది నిన్ను విడచి యేగు తలంపుల్
మామనసులకుం బొడమవు | మామీఁద దయార్ద్ర దృష్టి మానకు తల్లీ. 93 93
క. భువి విభవము పరిభవమే | భవదంఘ్రిసరోజసేవ బాటిలెనేనిన్
వివిధంబులైన సుఖముల | నెవఁ డాసించినను బుద్ధిహీనుఁడు వాఁడే. 9494
క. మునియై తపములు నేసిన | నినుఁ గాంచుటకేగదా సునీతిపరుండ
య్యును లోకమేలఁ గాంక్షలఁ | గనుటయు నీపాద సేవ కలుగుటకెగదా. 95 95
క. సంసార మపార మఖిల | హింసాకర మేల మాకు నీశ్వరి నీప
త్వాంసువులం దలమ్రోచుచు | నోం సత్యమ్మనుచు నిచట నుండెదమమ్మా. 96
క. నాకున్ నీమంత్రంబే | |యేకంబగు గతి యటంచు నెప్పుడు దలఁతున్
జోక నవాక్షరమంత్రము | కైకొంటిం బూర్వభవము కాలమునందున్.97
క. కొడుకా నారదుఁ డా శం | భుఁడు దా నీరీతి వేఁడ భువనేశ్వరి యె
క్కుడు దయ సుపదేశించెన్ | గడఁగి నవాక్షరనమాఖ్య ఘనమంత్రంబున్.98
శా. ఆ మంత్రంబును నేర్చి శంభుఁడు దదీ యాంఘ్రిద్వయిన్ భక్తితోన్
వేమాఱుం బ్రణమిల్లి తజ్ఞపముఁ గావించెన్ శుభోచ్చారణ
శ్రీమీరన్ గమనీయబీజయుత మక్షీణంబు మోక్షాస్పదం
బీమంత్రంబని సంతసించుదును నే నెంతేని యుత్కంఠతోన్. 99
వ. అమ్మహాదేవి పాదంబుల కెఱఁగి యిట్లని స్తుతించితి. 100
శా. దేవీ వేదములెన్నలేని మహిమన్ దీపించె దీవెంతయున్
నీ వీ లోకవిధాత్రివం చెఱుఁగుదున్ నీవేడ నేనేడ నే
నీ విశ్వంబు సృజించు స్రష్టననుచు హేయంబుగా గర్వ స
ద్భావం బందితి నేఁడు నాకుఁ దెలసెన్ వేళా దథ్యంబు లోకేశ్వరీ. 101
చ. కొలిచెద మోహపాశములఁ గోయుము సంసృతివార్థి దాటగన్
గలమవుగానె వీచరణకంజములం గనుగొంటి నేఁటికిన్
గలిగెను నీదు సేవనము గర్వము సర్వము దూలె వైళమే
చిలుకుము నీ దయారసము సేవకరావము నిల్పు మీశ్వరీ.102
చ. తెలియనివారు నన్ను నొక దేవుఁ డటందురు స్రష్టయంచునుం
బలుకుదు రద్ది కల్ల సుమి భ క్తుఁడ నీకు దయామయీ నిరా
కులతఁ ద్వదీయనామమును గోరి జపించుచు సర్వకాలమున్
వెలయఁగఁ జేయుమమ్మ మనవి న్వినుమమ్మ సతీ దయావతీ 103
ఉ. నీ జపమాచరించుటకు నేరక యోగమటంచు యాగమం
చీజగతి విమూఢమతు లెందఱు చింతిలుచున్న వారు నా
నాజగదాదికారణఘనప్రభ నొప్పెడి నిన్నుఁ గొల్చినన్
దేజముగల్గి ముక్తిఁ గడతేరుదు రీశ్వరి వేయునేటికిన్.104
ఉ. చూచినయప్పుడే జగము శోభిలు నీదు వినోదమాత్రమై
తోఁచును భూతసృష్టి దయతో ననుఁ బ్రోవుము వేఱ నాకు నా
లోచనలేదు సంసృతివిలోలత మాన్సి భవద్విచార వి
ద్యాచతురుండఁగా నొనఁగుమా వర మీశ్వరి దివ్యసుందరీ.105
ఉ. హరిహృదయంబునం దుదయమైతిని నేను గపాలమాలికా
ధరుఁడు మదీయవక్త్రమునఁ దానుదయించెను మాస్వతంత్రతల్
తిరములె నీవు తల్లివయి త్రిప్పుచునుంటివి మమ్ముఁ కార్యబం
ధురమహిమంబు లిచ్చి దయతో నిరతంబును విశ్వపాలినీ.106
చ. పురుషుఁడు నీవినోదమును బొందును నీవు ప్రధాన వైఖరిన్
బొరసితి వింతకంటె సుతిఁ బొందుఁ ద్వితీయములేదు చూడఁగాఁ
బరమవిలాసచేష్టిత విభావవిధానములెన్నియేనియున్
నెరపెదవీశ్వరత్వమున నిండిన వానిని మాయఁ గొల్పుచున్. 107
సి. ఆరయంగ నేకమేవాద్వితీయం బ్రహ్మ యనునట్టి వేదవాక్యంబునకును
సత్యత్వమేరీతి సమకూరుఁ బ్రకృతియుఁ బురుషుండు నిరువురు బొసగుచుండ
సంశయగ్రంధి నిశ్చయముగా నాహృదయము బట్టియున్నది యనవరతము
కారణంబొక్కటా కడఁగి రెండా యనునట్టి విచార మోయంబ నీవు
తే.గీ. తెలుపఁగలదాన విది నాకుఁ దెల్పి సంశ |యంబనెడి ముడి విప్పు సిద్ధాంత సరణి
మఱియు నీవంగనవో లేక పురుషుఁడవొకొ తెలియకుంటిని చెప్పుమాదేవి నాకు. 108
క. అని నేనడిగిన దయతో | విని నా వినయంబు సూచి వివిధగతుల న
న్నునుఁ దృప్తిజేయ నీశ్వరి | పసజాసన! విమమటంచు వచియించెఁ దగన్ |. 109
'— : బ్రహ్మాదులకు భగవతి నిజరూపము నుపదేశించుట : __
'
తే.గీ. పురుషునకు నాకు భేదంబు పొఱయదెందు | సరయ నేకత్వమునకును హానిలేదు
వాఁడె నే నేనెవాఁ డనువాఁ డొకండె | ముక్తుఁ డట్టులఁ గాకున్న మూడుఁడతఁడే, 110
తే.గీ. ఆత్మ నిరుపాధికంబయి యలరునేని | అప్పు డద్వైతభావంబు తప్పకొందు
పరగ సోపాధికంబయి వరలునాఁడు ద్వైతభావంబుతోపక తప్పదెన్న. 111
తే.గీ. భేదముత్పత్తికాలంబుఁ బెనగియుండుఁ | పేర్మి సుత్పత్తి లేనప్డ భేదమగును
భేద మది కల్పితంబు నిర్వాదలీల | సత్యమేకంబు బ్రహ్మ దానిత్యమరియ.112
తే.గీ. ఒక్క దీపంబె రెండయి యొప్పినట్లు | నీడయొక్కటి యుద్దాన జోడుగాఁగఁ
దోఁచినట్టు లుపాధిచేఁ జూడఁబడును | భేదమనువది సృష్టికై పేర్మిగాంచు. 113
సీ. శ్రీనేను ధీనేను ధృతినేను స్మృతినేను కృతినేను దయనేను గీర్తి నేను
శ్రుతినేను క్షుధనేను మతినేను గతినేను శ్రద్దనునేను తృష్ణ నొగి నేను
విద్యనునేను నిద్రాద్యను నేను పిపాసను నేను విభాతినేను|
గాంతిని నే నింక శాంతిని నేను రజసునేను స్పృహనేను రక్తి నేను
తే.గీ. నేనజర నేనవిద్యను నేనుశక్తి | నేనశక్తిని మజ్జను నేను ద్వక్కు
నేను దృష్టిని బుష్టిని నేను సృష్టి | నేను బశ్యంతి నేమధ్య నేను బరను. 114
సి. బ్రాహ్మియు గౌరియు రౌద్రియు వారాహి వైష్ణవి కౌబేరి వారుణియును
నారసింహియు నను నామముల్కలవారు నారూపము లెసుమ్ము నమ్ముమింత
అందఱిఁబుట్టించి యయ్యయికార్యంబులందుంచి నే వారియందు నిలచి
పొసగింతుఁ గార్యముల్ పొరి నీట శైత్యంబు నగ్ని సుష్ణిమ జ్యోతి యబ్జు నందు
తే.గీ. హిమమునై యుంటి నెందును నేకొఱంత | లేకయుండంగ పనువైన జోకనొప్పి
నేన సర్వంబు సేయుదు నేర్పుమీర |నిందఱును భేదమందుందు రే నౌకర్త. 115
సీ. శక్తి యొకటిగల్గ శక్తుండు శంభుండు సకలజగంబులు సంహరింప
శక్తి యొకటిగల్గ శక్తుండు విష్ణుండు సకలజగంబుల సాకినిలువ
శక్తి యొకటిగల్గ శక్తుండవీవును సకల జగత్సృష్టి సలుపుటకును
శక్తి యొకటిగల్గ శక్తుండు సూర్యుండు సకలజగత్ప్రకాశకుఁడుగాఁగ
తే.గీ.శక్తి యొక్కటిగల్గగా శక్తుడింద్రుఁ | డంబుదంబులఁ బంచి తోయంబు లిడఁగ
శక్తి లేకున్న వీర లశక్తులగుచు | నోరుదెఱచుకు పడియుండ్రు పేరులేక. 116
ఆ.వె. శక్తి లేనియది యశక్తంబు శక్తి ని నేను దెలియు మీ విధానమెల్ల
నాదకాక యొండు లేదులే దిదిసత్య మిదియు సత్యమనుచు నెంచుమిఁకను.117
సీ. ద్రవ్యంబులందెల్ల తతశక్తి నిత్యంబు సత్యంబు సత్యంబు సత్యమిదియ
అరసిచూడంగఁ బదార్థంబులందును బరఁగునభావంబు ఫక్కి వినుము.
ప్రాగభావంబును బ్రధ్వంసకాభావ మననొప్పునట్టి వభావములగు
శక్త్యభావములేదు జగదభావమెకాని జగదభావము సెప్పు సరణివినుము
తే.గీ లలిని మృత్పిండములఁ గపాలంబులందు | నెన్ని చూడ ఘటాభావ మెట్లుకలదొ
యట్టులనే యదియేమన నందు నామ | రూపములు మాత్రము హుళిక్కి రూఢిఁ తెలియ.118
'
సీ. భూమిలేకుండిన భూపరమాణువుల్ లేకుండనే యతీంద్రియములైన
వృథివిలేదనుచుఁ జెప్పినమాట పరమాణ్వభావంబునం జెప్పఁబడదుసుమ్ము
శాశ్వతంబనియును క్షణికంబనియు శూన్యమనియు నిత్యంబనియు ననిత్య
మనియు సకర్తృకం బనియు నహంకార మనియును భేదంబు లయ్యె నేఁడు
తే.గీ. కన మహత్తత్వమున సహంకార మొదవు |నందు భూతంబులుదయించు నదియుగానఁ
గొనుమహత్తత్త్వమిప్పుడే వనజగర్భ | జగము సృజియింపు మిదిపూని శక్తి కొలది.119
తే.గీ. ఇంక నీకొక్క శక్తిని నేనొసఁగెద | దీని సాంగత్యముననీకుఁ దెలివిపుట్టు
చారుహాసిని యిది సరస్వతి సరూప | మంచిదిది నీకుఁ దగిన సామగ్రిఁగూర్చు.120
ఉ. తెల్లనిజీర చూడు మిది దివ్యసుమా ధరియించియున్న యీ
మొల్లపు సొమ్ములం గనుము మూర్తిఁని జూచితె ముద్దులోడు నీ
ఫుల్ల సరోజలోచనను బొందుము సత్యజగంబు జేరుమీ
వెల్లపను ల్బిరాననే గ్రహించెద వేటికి సంశయింపఁగన్. 121
క. లింగాంగంబులు జీవము | లుం గర్మలతోడ వర్తిలు వానిని బల్
రంగుగఁ జేయుము మునుపటి యంగెఱుగుదుగాదె వారిజాసన పేర్మిన్.122
తే.గీ. కాలకర్మస్వభావముల్ కారణములు వానిఁగైకొనిచేయుము పూనిజగము
పుండరీకదళాక్షుండు పూజనీయు | డతఁడు సత్త్వగుణోపేతుఁ డగుటఁజేసి.123
తే.గీ. ఎప్పుడెప్పుడు నీమది నొప్పిదోఁచు | నప్పుడప్పుడు జలశాయి యవతరణము
లెత్తి నీబాధ వారించు మత్తులైన |రక్కసులనెల్లఁ జిటికలో సుక్కడంచు. 124
క. శివుఁడును నీకు సహాయుం | డవు నితఁడు మహాబలుండు వ్యాపకుడుసుమీ
దివిజుల సృజియింపుము భూ | దివిజనృపోరుభవసృష్టి ధృతిఁజేయు మిఁకన్.125
ప. మఱియు సర్వసుఖంబులు హవిర్భాగంబులు గొంచు బృందారకులు తృప్తులగుదురుగాత.
తమోగుణప్రధానుండై పరఁగు శిపుండు మాననీయుండు సర్వప్రయత్నంబుల సవ
నంబులయం దతండు పూజింపబడుంగాత దైత్యులదాడి మీప్రయత్నంబులం దీరదేని
వారాహీ, వైష్ణవీ, నారసింహ, గౌరీ, శివాది నామంబులుగల నానారూపశక్తు
లుత్పన్నంబులై రాక్షసుల శిక్షింతురుకావుతఁ బీజధ్యాన సంయుతంబును నవాక్షరంబును
నగు నొక మంత్రరాజంబు నీకొసంగెద, దీవిం జపియించుచు నీవెల్ల కార్యంబులు
సంఘటింప శక్తుండవగుదువు. దీని సప్తకోటి మహామంత్రంబులలో నుత్తమంబగు
దానిఁగా నెఱుంగుము, నీయిష్టార్థసిద్ధి కిదియే పరమసాధనంబుగా గ్రహించి నిరంతర
జపపరాయణుండవు కమ్ము, అని చెప్పి జగన్మాత చిఱునవ్వు నవ్వుచు నారాయణుం
దిలకించి యిట్లనియె.126
సీ. వినుము నారాయణ వినుమోయి కేశవ వినుమయ్య మాధవ వినుము నృహరి
వినుము దామోదర వినుమయ్య వైకుంఠ వినుము పంకజనాభ వినుము శార్ఞ్గ్గి
వినుము దైత్యాంతక వినుమయ్య యచ్యుత వినుమయ్య దశరూప వినుము శౌరి
వినుము పద్మదళాక్ష వినుమీ యధోక్షజ వినుమయ్య వామన వినుము విష్ణు
తే.గీ. సాత్త్వికుఁడ వీవు నీ వెల్ల జగములకును| బోషకుండపుగమ్ము నీ పొందుగలయ
నీకు జోడుగ నీలక్ష్మి నిచ్చుదాన | వనితఱొమ్మున నెక్కించుకొనుము చనుము.127
క. దేవతలకు సవనంబులు। జీవనములు సేసియుంటిఁ జెచ్చెఱ శివుఁడున్
నీవును బ్రహ్మయు నైక్యం బావహిలంగూడియుండు డన్ని పనులలోన్. 128
మ. శివుఁడే విష్ణుఁడు విష్ణుడే శివుఁడు చర్చింపంగ నీయిర్వురన్
దవులంబో దొక భేద మెన్నఁడును తథ్యంబెన్నఁ బూజ్యుల్కదా
వివిధాచారములందు నిట్లనుచు నే విద్వాంసుఁ డూహించు వాఁ
డవిషాదుండగు ముక్తి నొందు నితరుం డందున్ మహాదుఃఖముల్. 129
చ. ద్రుహిణుఁడు నట్టివాఁడయగుఁ దోయజలోచన యొక్క భేద మా
వహిలెడు దానిఁ దెల్పెదను వాసిగి సత్త్వము ముఖ్యమెన్నఁగా
మహిమ రజోగుణంబును దమంబును గౌణములై తలిర్చు నీ
కహిపరతల్ప! పూనుము మహామహవాచ్యుత రాజసంబునన్. 130
సీ. వైకుంఠ నీకిదే వాగ్బీజమును గామరాజంబును దృతీయ బీజమగుచుఁ
దనరు మాయాఖ్యంబుఁ బొనరిన మంత్రంబు నిచ్చెద కైకొను మిది సమస్త
వాంఛితంబులనిచ్చు వారక యిది జపించుచు యథేష్టంబుగ సుఖముగనుము
నీకు మృత్యుభయంబు లేకుండఁ జేసితి కాని జగము నొక్కటిహరించు.
తే.గీ. నపుడు లీనుండవగుచు నాయందు నీవు | మఱువకుము మంత్రరాజంబు స్మరణపేయ
కామదము మోక్షదంబును గలిత లలిత | మతి వికాసదమై నిన్ను మనుచుగాత. 131
క. సద్గీతచరితుఁడవు నీ వుద్దీధముతోడఁ గూడి యొనరింపుము సం
పద్గరిమను వైకుంఠము తద్గతుఁడవుగమ్ము నన్నుఁ దలఁపు మనయమున్. 132
వ. ఇట్లు దేవి నారాయణునకుం జెప్పి శంకరుంజూచి యిట్లనియె.133
ఉ. శంకర నీకు నిచ్చెదను సర్వగుణంబుల నాద్య యైన యీ
పంకజనేత్ర గౌరి యిది భాసుర్ దివ్యచరిత్ర దీనితోఁ
బొంకముగా సుఖంబులను బొంది రజస్తమము ల్పొసంగఁగా
శంక యొకింతలేక సువిచారుడవై రజతాద్రినుండుమీ. 134
ఉ. నీవు తపంబు సేయునెడ నీకును సత్వగుణంబు గల్గు నా
నావిధ సంస్కృతి క్రియల నమ్ముము మూఁడుగుణంబు లేర్పడున్
వావిరి వస్తువుల్ త్రిగుణవంతములౌ గుణహీనముల్ సదా
లేవగుణంబొకండ లలిం దలఁపం బరమాత్మ శంకరా. 135
క. కలుగదు కలుగంబో దుజ్జ్వలదృశ్యము నిర్గుణంబు శంకర విను నా
విలసనము సగుణ నిర్గుణ । కలనం బిది నీకుఁ జెప్పగావలఁసె జుమీ. 136
ఆ.వె. కారణంబకాని కార్యంబ నేఁగాను । గాన నేను నగుణఁ గావలయును
బురుషునొద్ద నేను బూని నిర్గుణనౌదు। శశికళావతంస సత్యమిదియ. 137
తే.గీ. మహదహంకారత త్త్వముల్ మానితములు । శబ్దముఖములు గుణములు జనితములగు ---
కార్యకారణరూప సంగతులచేత । జరుగుచుండును జగము నా శక్తి వలన. 138
ఆ.వె. సతిని నేను నన్నె సత్తండ్రు నాయం దహంకృతియును బుట్టె నందువలన
నేనె కారణంబ నీ యజాండములకు । మూఁడు గుణములందు మొససియుందు. 139
తే.గీ. ఆ యహంకృతియందు మహత్తునింక । పంచతన్మాత్రలును భూతపంచకంబు
జ్ఞానకర్మేంద్రియమనోనికాయ మొదవె | పురుషుఁడనువాఁడు నారూపె పరుడుకాఁడు.140
తే.గీ. సంగ్రహంబుగఁ జెప్పితి జగమువిధము । పనులుగలవిఁకఁబొండు మీ మనసులందు
నన్నుమఱువక స్మరియింపు డన్నియెడల।ననుచు వీడ్కొల్పె మము దేవి యతిముదమున.141
కం. ఆయెడ నేమనిచెప్పుదు । మాయాండ్రును మేము నొక్క మాదిరిరూపుల్
పాయకయుంటిమి యచ్చెరు వాయెను । మాపొందులెట్టులగునోయనుచున్. 142
కం. ఆయెడఁ గదలికి మందఱ మాయమ వీడ్కొల్పఁ బిదప నన్యస్థలికిన్
బ్రోయాండ్రము చన నందున్ । మాయగ నడచితిమి మేము మగరూపులతోన్ 143
వ. ఇట్లు విమానంబుననుండి భార్యాసహితులమై మేము మువ్వురము చనిచని తో
ల్లింటి పంకజంబున్నచోటుం బ్రవేశించితిమని చెప్పి విరించి మఱియు నిట్లనియె. 144
బ్ర హ్మాం డో త్ప త్తి
మాలినీవృత్తము.
ఈవిధినొప్పు మహేశ్వరిఁ గంటిమి యేనును విష్ణుఁడు శంకరుడును
నా విని పల్కెను నారదుఁ డప్పుడు నాయన చెప్పుము నాకు వెసన్
దేవునిఁ బూర్ణుని నిర్గుణు నాద్యుని నిశ్చలు నవ్యయుఁ జూచితిరా ?
భావమకో య దభావమకో మదిఁ బాయుదు సంశయ మిప్పఁటికిన్. 145
తృ తీ య స్కం ధ ము
161
తే.గీ. త్రిగుణయగు శక్తి నీక్షించితిరికదయ్య |యెసఁగ నిర్గుణ యనునది యెట్టులుండు
పురుషు నీక్షించుటకు బుద్ధిపుట్టి దొడ్డ | తపము చేసితిఁ జేసితిఁ దండ్రి నేను.146
ఆ.వె. ఎంతతపము చేసి యేమిఫలముగంటి | నాత్మపరితపింప నాయెఁగాక
యేడ గోచరుండు కాడాయెఁ బరమాత్మ | యీరు కంటిరనుచు నెంతుఁ జెపుమ.147
క. కంటిరి శక్తిని సగుణను | జంటన్ నిర్గుణత నొప్పు శక్తియుఁ బురుషుం
డంటి యెటులుండుదురు మీ | కంటికిఁ గన్పడిరె వారు కాంచనగర్భా! 148
క. అవి నారదుఁ డడిగిన న |వ్వనజాసనుఁ డిట్టులనియె వదనంబున లే
తనగవు దోపఁగ నిర్గుణ | మున రూపములేదు నయనముల కగపడునే? 149
క. కనపడునది నశ్వరమగు | గనపడని దనశ్వరంబు కాదే బ్రహ్మం
బనుమానంబునఁ దెలియును | ఘనశబ్దమువలన మనము కందుము పుత్రా.150
చ. మునులకు జ్ఞానగమ్యులును బూ జ్య అనాదులు వేదవాక్కున
మ్మినను సుగమ్యులొదురుసుమీ యది నమ్మకయుంటిమేనియున్
మనకు నగమ్యులే నిజము మానక వెల్లు సమస్తమందు నే
యనువుననుండెనో యటులు నా పురుషుండును శక్తియున్ సుతా.151
క. ఆపురుషుండును శక్తియు |వ్యాపకులని యెఱుఁగు జగమునందంతట నే
రూపములేకయయుందురు | రూపింపఁగవార లేకరూపులునుమ్మీ.152
క. పరమాత్మయుఁ బరశక్తియు | నరయంగా నొకటయంచు నాత్మఁదలఁపు మం
తరమేమియులేదుసుమీ | యిరువురకును నిట్టితత్త్వ మెఱుఁగరు రాగుల్.153
క. సగుణులకు నిర్గుణుడుఁ గా |నఁగవచ్చుట యెట్లు నందనా పైత్యమునన్
బొగిలెడి రసజ్ఞ కనునా । వగరుం గారమునుఁ జేదు వైఖరి నెన్నన్. 154
క. మనసు సగుణంబుగాఁగాఁ | గనుటెట్టుల నిర్గుణంబు గతివివరింపన్
వినుమదియు సహంకారం | బుననే జనియించెఁగాదె మునువింటివకా. 155
క. ఎన్నాళ్లు గుణము విడిపో |దన్నాళ్లును నిర్గుణంబు నాలోకింపం
దన్నుకొనినఁ గాదుసుమా | యన్నా నిర్గుణము సాధ్యమా యెఱుఁగంగన్. 156
చ. అనవుఁడు నారదుండు కమలాసన సత్త్వరజస్తమంబులం
చును ద్రిగుణంబులంటివి మనోమతులంటివి తద్భవంబులే
యని యిఁక నయ్యహంకృతి తదాత్మకమంటి సవిస్తరంబుగా
వినవలఁతున్ వచింపగదె విస్ఫుటలీల సరస్వతీవరా. 157
వ. అని నారదుండడిగినం గమలగర్భుండు పుత్త్రకా! గుణంబులకును మూఁడుశక్తులు కలవు.
సాత్త్వికంబున జ్ఞానశక్తియు, రాజసంబునకుం గ్రియాశక్తియుఁ, దమోగుణంబునకుం
ద్రవ్యశక్తియుఁ గలిగియుండు. నందుఁ దామసంబునందలి ద్రవ్యశక్తి వలన శబ్దస్పర్శరూప
రసగంధంబులను నయిదు తన్మాత్రంబులు పొడమె. శబ్దమను నొక్క గుణముమాత్ర
మాకాశంబునకుం గలదు. వాయువునకు స్పర్శగుణంబును, నగ్నికి రూపగుణంబును,
జలంబునకు రసగుణంబునుఁ, బృథివికి గంధగుణంబునుఁ బొసంగియు భూతపంచకంబును
దన్మాత్రంబులుం గలసి యీపదియును ద్రవ్యశక్తులై తామసంబైన యహంకారంబునం
బుట్టినయవి. రాజసంబగు క్రియాశక్తికిఁ ద్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబులను నైదు
జ్ఞానేంద్రియంబులును, వాక్పాణిపాదపాయూపస్థలను నైదు ర్మేంద్రియంబులు
నుత్పన్నంబులయ్యెె. మరియు బ్రాణాపానవ్యానోదానసమానంబులను నైదు ప్రాణంబులు
నుఁ బుట్టె. నీ పదియేను రాజససర్గంబనంబడు. ఇవియ క్రియాశక్తి మయంబులగు సాధ
నంబులు, వీని కుపాదానంబు చిత్తునాబడు జ్ఞానశక్తి. సత్త్వంబునం దిశలును, వాయువును,
సూర్యుండును, వరుణుండును, నశ్వినులును జ్ఞానేంద్రియాధిష్ఠాన దేవతలై ప్రవర్తిల్లిరి.
బుధ్యాద్యంతఃకరణ చతుష్టయంబున కధిష్ఠానదేవతలై చంద్రుండును బ్రహ్మయు
రుద్రుండును విరాజిల్లెదరు. ఇవి మనస్సుతోఁ గూడి పదియేనును సాత్వికసర్గంబునాఁబడు.
స్థూలసూక్ష్మభేదంబులచేఁ బరమాత్మకు రెండుభేదంబులుండు, జ్ఞానరూపముమాత్రము నిరా
కారమును గారణమాత్రము నైయుండు. ధ్యానాదులయందు సాధకంబైనది స్థూల
రూపంబగు. మహాపురుషుని శరీరంబు సూక్ష్మంబగు. నిది వింటివికదా సూత్రరూపంబునం
బరఁగు మదీయ శరీర క్రమంబును వివరించెద వినుము. 158
సీ. ఐదు భూతంబులు నైదు తన్మాత్రము లైదగు జ్ఞానేంద్రియములు మఱియు
నై దగు కర్మేంద్రియము లైదుప్రాణము లీరీతినుండుట యిదియసూడ
బంచీకరణ మొనరించినఁ దెలియును దత్వంబులెల్లను దనయ నీకు
మొట్టమొదట రసమునుగొని మనసుతో నమరించి యుదకమ ట్లాత్మనెంచి
తే.గీ. వేఱువేఱుగ నందులో వివిధభూత | ములను బదనించి చైతన్యమునుగలిపిన
నేనగుదు సంశయములేదు దీనినమ్ము | తెలియుమిదిచక్కఁగా నెమ్మదిని గుమార! 159
తే.గీ. మఱియు నిందువిశేషాభిమానమహిమ | నాదినారాయణుఁడు విష్ణుఁడాయె జుమ్ము
భూతతన్మాత్రయోగంబు పొరసికాదె యీ యజాండంబులును జనియించి మించె. 160
వ. పుత్త్రకా! వెండియుం జెప్పెద వినుము. ఆకాశంబునకు శబ్దంబొక్కటియు, శబ్దస్పర్శంబులు
వాయుపునకును, శబ్దస్పర్శరూపంబు అగ్నికిని, శబ్దస్పర్శరూపరసంబులు జలంబునకును,
శబ్దస్పర్శరూపరసగంధంబులు పృథివికిని గుణంబులై సకల బ్రహ్మాండోత్పత్తి యగునని
యెఱుంగునది. తత్తదంశభేదంబులం జేసి యెనుబది నాలుగుకోట్ల జీవరాసు లుద్భవిల్లె.
నిదియె సర్గక్రమంబని చెప్పి మఱియు.161
-:స త్త్వా ది గు ణ ము ల స్వ రూ ప ము:-
ఉ. సత్త్వ రజస్తమోగుణ విచారము సేసెద నాలకింపు మీ
సత్త్వము ప్రీతిరూపమగు సౌఖ్యమునం జనియించుఁ ప్రీతి దా
సత్త్వమసంగ నార్ణవము సత్యము శౌచము శ్రద్ధయున్ క్షమా
వత్త్వము శాంతియున్ ధృతి కృపామతి లజ్జయుఁ దృష్టి లోనుగాన్.161
క. సచ్ఛ్రద్ధను బుట్టించున | సచ్ఛ్రద్ధను బోవనడఁచు సర్వము దీనిన్
ద్వచ్ఛ్రవణ గోచర సము | ద్యచ్ఛ్రేయోగరిమగలుగ నాలింపు సుతా.162
వ. సత్త్వము శ్వేతవర్ణంబు వెండియు.163
తే.గీ. శ్రద్ధ మూఁడుగుణంబుల సంభవిందు |నందు సాత్త్వికిఁ జెప్పితి నాలకింపు
మవల రాజసి రక్తవర్ణాంచితయగు దెలియ సప్రీతిజనకంబు దీని కెపుడు.164
క. పగయును జేటును మచ్చర మగచాటులు నిద్ర తమము నభిమానంబున్
దెగనీలుగు నుత్కంఠయు నగుబాటును రాజసంబునం గలవుసుమీ.165
క. నల్లనిది తమము మోహము | పెల్లంగడ తడపు జడత పేదరికము క
న్నీళ్ళు భయము కృపణత మే। లొల్లమి నాస్తిక్య మగడు నడుగును సుమ్మీ.166
క. నిలువవలె సత్వగుణమునఁ |బలువిధముల నడఁచిపట్టవలయు రజంబున్
తొలగింపవలయుఁ దమములు | సలలితముగ శుభము వాంఛ సలిపినవారల్.167
క. ఒకదానికొకటి గిట్టదు | ప్రకటిత మిది గుణములందుఁ బరికింపఁగఁ దా
రొకదాని నొకటి విడువవు తికమకలై కూడియుండుఁ దెలియుము పుత్రా.168
వ. అది గావున నారదా చెప్పెద వినుము, జ్ఞాతంబైన క్రియయందు శ్రద్ధఫలానుభూతి
దనుకం బ్రవర్తించెనేని యది పరిఙ్ఞాతంబగు. శ్రవణదర్శనాదులవలన మాత్రము పరి
జ్ఞాతంబనఁబడదు. అది యెట్లంటివేని యొకఁ డొక పవిత్రంబగు క్షేత్రంబునుం గూర్చి
విని యది సేవింపవలయునని రాజసంబగు శ్రద్ధపుట్టి తాను విన్న క్రమంబునం దత్తీర్థంబున
కేగి స్నాతుండై షోడశ మహాదానంబులంజేసి యచ్చట రజోగుణంబు విడువక
కొంతకాలం బుండి రాగద్వేషాదులవలన విడువంబడక కామక్రోధంబులు వెంబడింప
మరలం గృహంబుం బ్రవేశించి యున్నంత మాత్రంబున శ్రుతం బనుభూతంబుగాక
ఫలంబనుభవింపనేరఁడు. కృషి కన్నంబు ఫలంబైన యట్లు తీర్ధ సేవనంబునకు
నిష్కల్మషత్వంబు ఫలంబై యుండు. నట్టి ఫలంబతనికి సంభవింప నేర దెందుచేతననిన
గామక్రోధలోభాదులును దృష్టాదులును రాగద్వేషాదులును దేహి నెంతదనుకఁ బట్టికొని
యుండు నంతదనుక నతవికి నిష్కల్మషత్వంబు సంభవింపనేరదుగదా! అది యెట్లన
దృష్టాంతరూపంబున వివరించెద. నాకానొక కర్షకుండు గట్టి రేగడినేలను దున్ని దున్ని
విత్తనంబులఁ జల్లి పలుపాటులంబడి యహోరాత్రంబు దేహక్లేశంబున కోర్చి యెప్పుడు
పండునాయని యడియాసలం జిక్కియు గొంతకాలంబున కమ్మెళుఁకువలమాని సోమరి
తనంబునం బైరు కాపు దిగనాడెనేని గిరికీటపక్షిజాతంబులచే నానా విధబాధావరంపరలకు
లోనై చెడిపోయి తుదకు ఫలంబందమి కతం డెట్లు దుఃఖించువో యట్లన యగు. సత్త్వ
గుణంబు శాస్త్రప్రదర్శనాదులచేఁ బ్రవర్ధమానంపై వైరాగ్యంబు బుట్టించునది, రజస్త
మంబులవలనం బరాభూతంబగు రజంబు లోభయోగంబునం బ్రవృద్ధంబగు నిదియు
నన్యగుణ సాంగత్యంబునం బరాభూతంబగు. తమంబు మోహంబునం బెరిగియు లాతి
గొనంబుం గూడెనేని బరాభూతంబగు. సత్త్వంబు ప్రవృద్ధంపై నతఱి బుద్ధి ధర్మంబునం
బ్రవేశించు. రజస్సత్త్వతమస్సముద్భూతంబులగు బాహ్యార్థంబులం గైకొనకుండు.
యదృచ్చాలాభంబును యజ్ఞాది క్రియలునుం గోరుచుండు. ముందు రజంబునుం బిదపఁ
దమంబును గ్రమంబుగా విడనాడునప్పుడు నిర్మలంబగు సత్త్వంబు నిలచు. రజంబు
ప్రవృద్ధంబైనపుడు సనాతనధర్మంబుల విడనాడి యధర్మంబులందు శ్రద్ధప్రవేశించు.
దమంబు ప్రవృద్ధంబై నతఱి వేదశాస్త్రంబులందు విశ్వాసంబుడిగి దుష్కర్మంబులవలన
ధనంబార్జింపంగోరు. మఱియు శాంతిలేక ద్రోహచింతన పొడుగై నానాటికి రజ
స్పృత్త్వంబులు తగ్గిపోవును; గామచోరభావంబుల కిఱవై యుండు; నెప్పుడును రజస్సత్త్వ
తమో గుణంబులు ప్రత్యేకంబు ప్రవర్తింపవు. గుణంబు లన్యోన్యాశ్రితంబులు, నన్యోన్య
జనకంబులైయుండు. నొకానొకప్పుడు సత్త్వంబు రజస్తమంబుల బుట్టించు, మఱి
యొకప్పుడు రజంబు తమసత్త్వంబులం గలుగజేయు, నొకప్పుడు తమంబు రజస్స
త్త్వంబులకు జనకంబగు; నిట్లు మృత్పిండంబు ఘటంబునకుంబోలెం గారణంబులగు బుద్ధి
స్ధంబులై గుణంబులు పరస్పర కామోద్బోధకంబులగు. లోకంబున స్త్రీ పురుషులవలె
గుణంబులు పరస్పర మిధునభావంబులం బొందుచుండు. సత్త్వంబునకు రజంబుగాని
తమంబుగాని మిధునధర్మంబు సమకూర్చు. నిట్లు రజ స్తమంబులకును మిధునధర్మంబులు
ప్రాప్తించుచుండునని చెప్పిన విని నారదుండు బ్రహ్మంజూచి యిట్లనియె. 170
ఆ.వె. వనజగర్భ నీదు వదనామృతంబును | గ్రోలి తృప్తిఁజెందు బేలఁగలఁడె
గుణములెట్లు తెలిసికొనవచ్చునో చెప్పి |నన్ను ధన్యుఁజేయు మన్ననతఁడు. 171
ఉ. ఏనును నేర దీని గణియించి వచింప యథామతిన్ సతిన్
ధ్యానముచేసి చెప్పెదను నారద కేవల సత్త్వమెచ్చటన్
గానఁగరాదు మిశ్రములు గమ్యము లెట్లన సాధ్విభార్య యెం
దేనియు భర్త కూర్మి గదియించు సపత్నికిఁ బ్రీతిఁజేయునే. 172
ఆ.వె. నైజగుణము సత్త్వ నైర్మల్యమునుఁ బొంద। రజము దమము ముఱికి రాచి కలఁచు
రజము దమము కలుషరాహిత్యమునుబొందు । సత్త్వమచటఁ జేరి చక్కఁ జేయ.173
సీ. ఒకరూపతియైన యువతి సొమ్ములు దాల్చి। మధురభాషల మంచి సుధలుగుఱియ
వినయంబు గల్లి సిగ్గును గల్లి ధర్మంబు । లెఱిఁగి పాతివ్రత్య మెఱిఁగి మగవి
సేవించి రంజిల్లఁ జేయుచునుండఁగా । సవతు లేడ్చుచునుండ్రు సంతతంబు
రాజసైన్యంబు చోరజనంబులకు దుఃఖ । కరము సాధువునకుఁ గడుసుఖదము
తే.గీ. పెద్ద జడివాన కర్షక ప్రీతికరము । కప్పుబోయిన యిండ్లలోఁ గాపురములు
వేయువారికి దుఃఖంబు జేయుచుండు । కోరి పుత్త్రిక విను మింక గుణగతములు. 174
సీ. సతత లఘుప్రకాశత నిర్మలత విశదత్వంబు నివి సత్త్వ తత్త్వములగుఁ
దేలికగాఁ జూచుఁ దేలికగా లేచుఁ దేలికగాఁ బోవుఁ దెలియుమిద్ది
మనసు నిర్మలమయి కనుపట్టునత్తఱి సత్వముత్కట మంచు సాధుఁ డెఱుఁగు
గరిమదించిన జృంభికా స్తంభ చలనముల్ తొట్రుపాటును మఱి తొందరయును
తే.గీ. గలుగుఁ దమమెక్కుఁడగునేనిఁ గలిని నెమకు । జిత్తముచలింప దుష్టుల పొత్తురోయు
తల బరువుదోఁచును వివాద కెలమినుఱుకు । నింద్రియంబులు చెడు మన సిఱియుఁ బుత్ర
175
వ. అనిన నారదుండు 176
తే.గీ. పంకరుహగర్భ విను పరస్పర విరుద్ధ । ధర్మములుగల గుణములు తాముకూడి
కార్యములు సేయునంటివి కరముచిత్ర | మియ్యది సవిస్తరంబుగా నెఱుంగఁబలుకు.177
తే.గీ. వినుము నారద తెలిపెద వీని తెఱఁగు | వత్తి చమురులొగి విరుద్ధ వృత్తులయ్యు
వాని కలయిక దీపంబు వస్తువులను । గానఁ గాజేయు దృష్టాంత గతి నెఱుగుము. 178
వ. అని ఇట్లు బ్రహ్మవలన దా నెఱింగిన విధంబు సెప్పి మఱియు నారదుండు సాత్య
వతేయుఁ గాంచి. 179
తే.గీ. వ్యాస యీరీతి మును నాకు వనజభవుఁడు | చెప్పె నీకది యిప్పుడు చెప్పినాఁడ
శక్తికొలదిని నే విన్న సరణిఁ దెలసి। శంక లేదింక నీకేల సంశయంబు. 180
క. అని యిట్లు నారదుఁడు నా | కును జెప్పెను ధర్మపుత్ర గుణలక్షణముల్
ఘనమతి సృష్టిక్రమమును | గనుగొనుమా పరమశక్తి కారణ మనుచున్. 181
క. సత్తగునప్పురుషుండీ । షత్తైనను జేయఁడెపుడు సత్యుఁడు నిత్యుం
డిత్తెఱుగున దెలియవలయు న | సత్తగు మాయయె రచించు సకల జగంబున్.182
సీ.బ్రహ్మ విష్ణుండు భవుఁడు సూర్యుండును | నెలయు నింద్రుం డశ్విమలు వసువులు
త్వష్ట కుబేరుండు వాఃవతి వహ్నియు | గాలియుఁ బూషుండు క్రౌంచభేది
గణపతియును దక్కుగల దేవతలు |శక్తియుక్తులై చేయంగ శక్తులై రి
శక్తి లేకున్న నశక్తులై యుందురు | శక్తి కారణమగు జగమునకును
తే.గీ. శక్తి నర్చించు మీ శక్తి సవనమునకుఁ |బూన్కి వహియింపుమీ భక్తి పూర్తి నెఱయ
నాదిశక్తి ని బూజింప సందరాని । యర్థమెద్దియు లేదు ధరాధినాథ. 183
సీ. జననాథ. విను మహాశక్తి మహాకాళి యది మహాలక్ష్మి మహాగుణాఢ్య
యాదిసరస్వతి యాదిదేవి యచింత్య యవ్యక్త యీశ్వరి యఖిలవంద్య
యఖిలార్థదాత్రి సర్వాధారరూపిణి వేదవేద్య మహావినోదిని సతి
యఖిలవర్గద పురుషార్థ ప్రదాయిని బ్రహ్మ విష్ణు మహేశ్వరప్రపూజ్య
తే.గీ. యైన భగవతి తన నామ మన్యవృత్తిఁ | దగు ప్రసంగంబునం దైనఁ దలచెనేవి
సర్వవాంఛితములనిచ్చి శాశ్వతమగు। తనదు లోకంబు దయచేసి దయను బ్రోచు.184
క. పులి వెంబడించి వగఁ గం | పిలి దేవినిఁ దలఁచెనేని బిందురహితముగన్
బలికినను వాంఛితార్థము | కలుగంగాఁ జేయు దేవి కరుణాన్వితయై. 185
వ. ఇందునకుం బ్రత్యక్షోదాహరణం బొక్కటి కలదు. నేనును సర్వమునులును విని
యుంటిమి. మున్ను నిరక్షరుండును మహామూర్ఖుండును నగు సత్యవ్రతుండను బ్రాహ్మ
ణుండు కలఁడు. అతండు శరపీడితంబగు కోలముం గని ఐకారంబును బునఃపునరుచ్చరి
తంబుగాఁ బలుకంజొచ్చె నది బిందురహితంబైనను నిజమంత్రోచ్చారణంబున కలరి
పరమేశ్వరి దయార్ద్రహృదయమై యతని మహావిచక్షుణుం గావించెనని వ్యాసుండు
సెప్పిన విని జనమేజయుండు. 186
క. మునివర సత్యవ్రతుఁడనఁ జనువాఁ డెవ్వండు వాని జన్మమెచటఁ దా
వినియె నెటుల నేశబ్దము | విని యే మొనరించెఁ దెలుపవే దయతోడన్.187
క. దేవి యెటులు ప్రత్యక్షం । బై వెలసెన్ సిద్ధి యెట్టులాయె నతనికిన్
వేవేగ సవిస్తరముగ | నావీనులు దానియఁ దెలుపు నయగుణధుర్యా! 188
-: స త్య వ్ర తో పా ఖ్యా న ము :—
క. అనుఁడు విని వ్యాసముని యను | ననఘా నే దేశములకు నటనము సేయన్
జనునప్పుడు నైమిశమను |వనమును బావనముఁ గంటి వసుమతి నొకఁటన్. 189
క. కని యందలి మునులకు నే | వినతుఁడనై మ్రొక్కి చూడ విధిపుత్రు లటన్
గొనగొని జీవన్ముక్తత | ననుపుగ నం దుండిరయ్య యవవీనాథా. 190
వ. వారిం జూచి 191
చ. అలరి కథాప్రసంగముల నందఱ మందు వసింపఁగా వ్రతో
ద్బలుఁడయి యొప్పుపట్టి జమదగ్ని మునీంద్రుని జూచి యిట్లనున్
గలిగెను సందియం బొకటి నామది దానిని దీర్ప నీసభన్
గల మునులే సమర్థులని నాకును దోఁచెను శంకఁ దీర్పుఁడీ. 192
ఉ. వెన్నుడు బ్రహ్మ శూలి హరి విఘ్నపుఁ డగ్ని భగుండు నశ్వినుల్
వెన్నెలరేఁడు సూర్యుఁడు కుబేరుఁడు శక్తిధరుండు త్వష్టయం
చు న్నిఖిలామరు ల్కలరు చూడఁగ వీరలలోన నెవ్వఁ డ
త్యున్నతుఁ డీప్పితార్థముల నోలి నొసంగు నెరుంగ జెప్పుఁడీ.193
చ. అనవుఁడు లోమశుండను మహాముని యా జమదగ్నిజూచి యో
మునికులభూష సేవ్యతమ ముఖ్యశుభంబులఁ గోరువారి క
య్యనఘ సమస్తలోకనివహాదిమకారణ మూలశక్తియం
చును మది నెంచుమా నిజమును మ్మితిహాస మొకొండు సెప్పెదన్.194
వ. అం దక్షరోచ్చారణఫలంబు తెల్లంబగు. 195
చ. వసుమతి దేవదత్తుఁడనువాఁ డొకపారుడు గౌనలుండు దా
వెస సనపత్యుడై ద్విజుల వేదులఁ గైకొని పుత్రకాముఁడై
మనలక యిష్టిఁజేసె గరిమన్ దమసానదియొడ్డున విభా
వసులను నిల్పి యెంతయును వాసిగ వేది నమర్చి పొంగుచున్.196
మ. తనరన్ బ్రహ్మనుగా సుహోత్రుని సదధ్వర్యున్ దగన్ యాజ్ఞవ
ల్క్యునిగా హోత బృహస్పతిన్ మఱియుఁ బైలుం బేర్మిఁ బ్రస్తోత నా
ప్తనయ ప్రౌఢిమ గోబిలాఖ్యముని నుద్గాతన్ దగం జేసి వ
చ్చిన యన్యర్షులు సభ్యులై యెసఁగఁగాఁ జేసెన్ మహాయజ్ఞమున్.197
ఉ. సామగుడైనగాత స్వర సప్తకయుక్త రథన్తరంబు నా
త్మామితశక్తిఁ బాడునపు డచ్చట నచ్చట శ్వాసమిచ్చుచో
బ్రాముకవోయి కొంత స్వరభంగము గల్గిన దేవదత్తు డా
భూమిసురేంద్రుపై నలిఁగి మూర్ఖ సుతార్థసవం బెఱుంగవే.198
ఉ. అంతట గోబిలుండు కడు నల్గి యనక్షరుఁడైన మూర్ఖుఁ డౌ
క్కింతయు బుద్ధిలేని సుతుఁడే జనియించును వీకుఁ బొమ్మనన్
గంతులుమావి గోబిలుని కాళ్ళకు మ్రొక్కుచు మొఱ్ఱపెట్టుచున్
జింతిలఁజొచ్చెఁ గట్టెదుటఁ జేతులుమోడిచి దేవదత్తుడున్.200
ఉ. ఎందుకుఁ గోప మోమునికులేంద్ర దయం గనవైతి శాపమున్
బొందఁగఁజేసి నాబ్రతుకుఁ బూర్వమునట్లు యొనర్చితివిఁకన్
మందుఁడు పుత్రుఁడై జననమందిన నేమిఫలంబు బ్రాహ్మణుం
డందురె యెందునేనియు నిరక్షరకుక్షిని వేదహీనునిన్. 201
ఉ. మ్రుక్కడియైన పాఱుఁడు సముండగు శూద్రునకున్ విగర్హితుం
డెక్కడనేనిఁ బూజ్యుఁడగునే తగునే మునినాథ ఇట్లు నా
ప్రక్క దయావిసర్జనము పల్మఱుు వేఁడెద నాదరింపుమీ
యక్కట యేమి సేయుదు నహా మతిమాలినబిడ్డ యేటికిన్.202
సీ. హవ్యకస్యంబులం దాససంబీరాదు వేదంబుసదువని విప్రునకును
ధాత్రి హిరణ్యాది దానంబు లీరాదు వేదంబునదువని విప్రునకును
దగియున్న సభలోనఁ దాంబూలమీరాదు వేదంబు సదువని విప్రునకును
బదిమంది పంక్తిలోఁ బై పీట యీరాదు వేదంబు సదువని విప్రునకును
తే.గీ. కుశచటంబుననె నిరంకుశముగాఁగ | శ్రాద్ధములు సేయవచ్చు నిస్సంశయముగ
వేదపాఠంబెరుంగని విప్రువెదకి పిలిచి | శ్రాద్ధంబు పెట్టిన బితలు దినరు.203
క. ఏదేశంబునఁ జక్కగ | వేదంబులు సదువనట్టి విప్రులుగలరో
యా దేశంబున జ్ఞానులు | పాదుకొనుట చనదు విడిచి పాఱఁగ వలయున్. 204
క. చదువని బ్రాహ్మణు భూపతి | నదలింపఁగవలయు దౌలఁ బంపపలయుఁజుం
డిది తథ్యంబనుచుం జె |ప్పెదరు మహామతులు దీని భూసుర వింటే. 205
తే.గీ. వేపచెట్టెన్ని ఫలముల విస్తరిల్లి | యేమిఫల మట్ల చదువని భూమిసురుఁడు
కడఁగి మూర్ఖుండయినపుత్రుఁ గనుటకంటె | మరణమేమేలు సూడంగ మానవునకు.206
క. కృపఁజేయుము నామీఁదను | శపనమ్ము విముక్తిఁజేసి సన్మనిచంద్రా
యపరిమిత దయాపరుఁడపు | త్రప నాకుం బాపు పరమతత్త్వజ్ఞవరా. 207
'
క. ఆని పాదములకు నతుఁడై | వనటంబడు దేవదత్తు వగపుంగని య
మ్ముని కరుణారసయుతుఁడై | యనియె న్నీసుతుఁడు పిదప నగుఁ గవి యనుచున్.208
ఉ. అంతియ చాలునంచుఁ దన యాత్మను బొంగుచు యజ్ఞమంతయున్
సాంతము చేసి భూసురుల నంపి సుఖంబుగ నింటనుండఁగా
వింతగ విప్రరాడ్గృహిణి వేవిళులం గడుసొక్కిసొక్కి తా
నంతకు నంతకుం దెలియనయ్యెను గర్భిణిగా జనాళికిన్.209
ఉ. చిట్టుము లోకిరింతలును జీదరయు న్బరకాస ప్రక్క లోఁ
దట్టులఁ గల్కు నుల్కు వెలిదాళువు మైకము పాలుమాలికల్
పట్టులు నిద్రసోకు పనిపాటుల కోర్వమి యెన్నియెన్నియో
చుట్టుకొనెం బయింబయిని సూడిదబుట్టలు విప్రభార్యకున్.210
సీ. అబలనే నీవు నే డది నిక్కమే కాని ప్రమదవు కావని పలికె నొకతె
మందయానవె తథ్యమందుఁ గాని మృగేంద్రమధ్యవుకావని పలికె నొకతె
చంద్రాస్యవే నీవు సత్యమె కాని బింబఫలోష్టికావని పలికె నొకతె
గురుకుచవే నీవు తిరమెకాని తరంగవళివి కావనుచును బలికె నొకతె
తే.గీ. తోడిచెలియలు తనయొద్దఁ గూడినపుడు| పలువితాలను నవుటాలు పలుకుచుండ
దేవదత్తుని గృహిణి దా తెల్లబోవు | సిగ్గుపడి తన గర్భంపు చిహ్నములకు. 211
క. ఒక్కటై రెండై మూఁడై ప్రకటితముగ నాలుగగుచుఁ బైనైదై యె
న్నిక నాఱై మఱి యేడై | యింక నెన్మిది తొమ్మిదాయె నింతికిని నెలల్.212
క. ఆరోహిణికిని సమయగు నారోహిణి కపుడు భర్త యాత్మ ముదము పెం
పారగఁ బుంసవనంబున్ వారక సీమంతమును బ్రవర్తింపించెన్. 213
క. దినమున లగ్నము శుభగతి | నను వొందగఁ పుత్రుఁ డుదయమయ్యె నతనికిన్
మనమలర జాతకర్మం | బును బుత్త్రాలోకనంబు బొరిఁ బొనరించెన్. 214
తే.గీ. పేరిమి నుతథ్యుఁడను పేరు బెట్టిపిలిచె |నెనిమిదవవర్షమున మంచిదినము చూచి
యతని నుపనీతుఁ గావించి యధ్యయనము | నొనరఁ సెప్పంగ రాదాయె నొక్క ముక్క. 215
క. ఓయనినం బోయనె న | టాయవనీసురుని కొమరుఁ డతిమూఢుండై
వేయాఱువిధములగు గురు నాయాసమెకాని విద్య యంటకపోయెన్. 216
.
తే.గీ. పదియు రెండేండ్లు గడచిన బాలుడయ్యు | సంధ్యలో గేశవా యన జాలఁడాయె
గొనలుసాగె నతనివార్త జనపదములఁ బట్టణంబుల వ్యర్థుండు బండ యనుచు 217
క. కొందరు మూర్ఖుం డనుచున్ | గొందరు జడుఁడనుచు నింద గొలుపుచునుండన్
నిందకుఁ దాళక ధరణీ |బృందారక సుతుఁడు సనియె విపినంబునకున్. 218
క. మానక సత్యము పలుకుచుఁ గానం గంగదరి గుడిసెఁ గట్టుకొని సదా
మౌనాది నియమములతోఁ నివసించెను ద్విజుండు తాపసుఁడువలెన్ 219
సీ. అధ్యయనము లేదు ధ్యానంబులేదు జపములేదు దేవార్చనమును లేదు.
ఆసనాదులును బ్రాణాయామమును లేదు సరళిఁ బ్రత్యాహార సరణిలేదు.
మంత్రకీలకముల మాటయన్నదిలేదు గాయత్రియనెడి సంగతియెలేదు
స్నానంబులేదు శౌచములేదు సంధ్యయులేదు హోమములేదు లేదతిధియు
తే.గీ. గంగలో నాడి శూద్రునికరణి దంత ధావనము సేసి యెద్దేని తరువునుండి
ఫలములను గోసి భక్షించి బ్రతుకు ద్విజుఁడు। మాట సత్యం బదొక్కటి మానడయ్యె. 220
తే.గీ. ఇంతమూర్ఖుఁడనైన నాకేలబ్రతుకు | మృతియు రాకుండె న య్యయో గతి దలంచి
బొగులు చెట్లోర్తు నిట్లు నా పూర్వజన్మ | కర్మ ఫలనూయె దైవ మిక్కరణిఁజేసె. 221
తే గీ. ఉత్తమకులంబునందు నే నుదయమయ్యు | పరమమూర్ఖుండనై తి సుందరియు సుగుణ
యైన కామిని వంధ్యయైనట్లు నాదు | జన్మమెల్ల వృధాయయ్యె జగమునందు.222
తే.గీ. చేరి ము న్నేటికిని విద్య చెప్పనై తిఁ | బోలుఁ దత్ఫలమిప్పుడు పూని కట్టి
కుడుపుచున్నది ద్విజు డనుకొనఁగ నొక్క| లక్షణంబైనఁ గాన నేలా సహింతు.223
తే.గీ. సాటిమునిబాలకులు శ్రుతుల్ చదివి లోక | మాన్యులై యుండ జూచుచు మౌర్ఖ్యమెనసి
సకలనింద్యుండనై యుంటి నకట నేను | జేయ నెద్దియుఁ బొడకట్టదాయె మదికి. 224
క. పురుషుని యత్నము వ్యర్థము | ధర సార్థకమగుచు వెలయు దైవమెకాన
బరికింప ఫలముగలదే | కొరకొఱయే కాదె నాదు గొంతెమకోర్కిన్ . 225
క. హరివిధిరుద్రేంద్రాదులు | కరము వశగులయిర కాదె కాలంబునకున్
దురతిక్రమ మక్కాలము | నరులు గిరులు నెంతవారు నటనయకాదే. 226
ఆ.వె. ఇట్లు రేయుఁ బగలు తెగపోత దిగపోత | లుగఁ దలంపులిడుక పొగిలి పొగిలి
విజనవనమునందు విప్రబాలుఁడు విరా | గతను విడిసె విపుల వినయుఁడగుచు. 227
క. సత్యము పలికెడివాఁడని | యత్యంతము కీర్తి లోకమం దిం తేనిన్
వ్యత్యయము లేకయుండుట | సత్యవ్రతుఁ డనెడి పేరు జను లిడిరి వెసన్.228
ఉ. అంతట నొక్కనాఁడు మృగయాపరుడైన నిషాదుఁ డొక్కఁ డా
చెంతకు విల్లునమ్ములును జేతులఁ దాల్చి యరణ్యభూములం
దంతట సంచరించుచు నిజాశుగనైపుణి నొక్క కోలమున్
గంతుగొనంగ నేయ వడిగా నది బెగ్గిలి పాఱజొచ్చినన్. 229
క. భయవిహ్వలనుగు కిటిదా | రయమున మువిచాపునకుమ రా గవి యెంతే
దయదై వారెడి శబ్దము | నయముగ వాగ్బీజమును ఘనంబుగఁ బలికెన్.230 230
క. ఇది యిట్టిదనుచు నెఱుఁగఁడు। మదిలోఁ గరుణార్ద్రుఁడగుచు మఱిమఱిఁ బలికెన్
విదితమది దైవయోగము | రొద దుఃఖావేశమున్న రూఢిగ నొదవెన్.231
ఆ.వె. పంది వచ్చి యిట్లు బ్రాహ్మణుఁడున్నట్టి | యెడను గుబురుగొన్న యీరమందు
నిఱపుజేసి మఱుఁగె నెఱుకవాఁడును దాని | వెదకికొనుచు వచ్చె వేగ నటకు.232
ఆ.వె. కుశల చాపమీఁదఁ గూర్చుండియున్నట్టి | మునినిఁ జూచి యెఱుక మ్రొక్కి పలికె
పంది యేడఁబోయె బాపనయ్యా ! నీవు | బద్దులాడవను పసిద్ధి గద్దు. 233233
ఉత్సాహ.
మంచి బాపనయ్యవయ్య మాకుఁ దిండిఁ బెట్టుమీ
పంచ నేడ దాగియుండేఁ బందిపిల్ల జెప్పు పో
షించలేను గాపురంబు చివ్వలెక్కి మైకము త
ప్పించుకొన్నదయ్య నన్ను బిచ్చగానిఁ బ్రోవుమీ. 234
విచిత్రమానిని
గంపెడు పిల్లలు కావలె మూఁడుమెకా లొకనాటికిఁ గాపురమా
కొంపకుఁబోయిన గొళ్ళనిపిల్లలు కూటికి నేడ్తురు కోపముతో
సంపును బెండ్లము నడఁచఁగ లేనిఁక నాకలిఁ దీర్పుము బాపఁడి మ
న్నింపుము మా కుల మిట్టిది యీశ్వరుఁ డిట్టుగ మా బ్రతు కేర్పరచెన్. 235
ఆ.వె. అనిన యెఱుక దైన్య మాలించి విప్రుండు । మనము కడువిచారమగ్నమైన
దలఁచె నిట్టు లయయొ తథ్యంబు సెప్పెద । ననిన హింససేయు టది ఘటించు.236
ఆ.వె. పందిఁ జంపినట్టి పాపంబయేనియు । బద్దులాడినట్టి పాపమేని
వ్రాసె రెంట నొకటి యేసదుపాయంబుఁ । జేసి యిపుడు దొసఁగు సెందకుందు. 237
క. కిరికిని హితంబు సేసిన । నెఱుకకు నహితుండనగుదు నెఱుకకు హితమున్
బొరి నొనరించితినేనియుఁ । గిరి కహితుఁడ నగుదు నేది కృత్యమొ యెఱుఁగన్ .238
వ. ఇట్లు వితర్కింపుచు బాడబ కుమారుం డేమియుఁ బలుక నేరక యున్నతఱి నంతకుమున్ను
శరావిద్ధంబై చను కిటింగాంచి దయార్ద్రహృదయుండై పలికిన వాగ్బీజమహిమంబునం
జేసి దేవి బ్రసన్నయై జ్ఞానంబొసంగినఁ దత్క్షణంబ తొల్లింటి వాల్మీకింబోలెం గవియై
యా శబరుం జూచి యిట్లనియె. 239
సంస్కృ, శ్లో॥ యా పశ్యతి న సా బ్రూతే యా బ్రూతే సా నపశ్యతి
అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృఛ్చసి పునః పునః
పై శ్లోకమునకు అర్థము.
క. కనివది యన దనినది తాఁ | గన; దయయో వాంచిత స్వకార్యధురీణా
నను నీ రీతిని షుఱిమఱి | యును నీ వడుగంగనేల నోరీ శబరా! 240
క. అవిన విని శబరుఁ డూఱక |చనియెజన్ ముని యింటికఱిగి సత్యవ్రతుఁడం
చును దను లోకము పిలువఁగ | ఘనుఁడగు వాల్మీకిఁబోలెఁ గవియై తనరెన్ 241
సీ. వాగ్బీజమంత్రంబు వారక జపియించి విద్వాంసుఁడై లోకవినుతిగాంచె
సత్యవ్రతద్విజు చరితంబు ప్రతిపర్వములఁ బాడికొని విప్రముఖ్యులధిక
సంతోషముననుండ్రు సకల దేశంబుల నంతట నా ద్విజుం డరిగెఁ దొల్లి
వదలివచ్చిన నిజావాసంబునకుఁ దల్లిదండ్రులు మిగుల సంతనముపడిరి.
తే.గీ. కాన రాజేంద్ర భగవతికరుణగలుగ | నేదిదుర్లభమగుఁ జేయు మీశ్వరీ మ
హామఖంబింకఁ గామదంబగుట యరుదె | నిక్కమీది నిక్కమీది నమ్ము నీవు నృపతి242
వ. అని చెప్పి వెండియు నోజనమేజయా, భగవతీ స్మరణంబును, భగవతీ ధ్యానంబును
భగవతీ పూజనంబును, భగవతీ కీ ర్తనంబును, భగవతీనామోచ్చారణంబును, సర్వవాంఛిత
ప్రదాయకంబులని తెలియుము. మఱియు రోగులు, క్షుధితులు, నిర్దనులు, శకులు,
మూర్ఖులు, క్షుద్రులు, వికలాంగులు, మొదలగు దుర్లక్షణ లక్షితులు దేవీ కటాక్షంబు
బడయనివారలంగా నెఱుంగుము, తద్వ్యతిరిక్త లక్షణంబులు గలవారలన్ దేవీ కటాక్ష
సంపన్నులంగా నెఱుంగుము, సత్యవ్రత చరిత్రంబు బ్రాహ్మణ సన్నిధానంబున లోమశు
వలన మున్ను నే విన్నవిధంబునఁ దెలిపితి నది కావున దేవీయజ్ఞంబు చేయుమని చెప్పిన విని జనమేజయుం డిట్లనియె.243
− : దే వీ య జ్ఞ వి ధి : —
క. దేవీ యజ్ఞ విధానం | బో విమలగుణాఢ్య తెలుపు మోపికమీరన్
గావింతు శ క్తికొలఁదిని | నీవచనామృతము చెవుల నిండంజనదే.244
క. పూజావిధాన మెయ్యది | యోజ న్మంత్రంబు లెవ్వి హోమద్రవ్యం
బేజాడ విప్రులెందఱు | నా జనపతి కనియె జటిలనాథుఁడు ప్రీతిన్ 245
.
క. దేవీయజ్ఞవిధానము । నే వినిపించెదను వినుము నృపతీ మదిలో
భావింపుము త్రివిధంబరి | యై వర్తిలుననుచు వాంచితార్థదమనుచున్.246
తే.గీ. సాత్వికంబనియును రాజసంబనియును | దామసంబనియును నందుఁ దనరు సాత్త్వి
కము మునీంద్రులచేఁ జేయఁగాఁబడు మఱి | రాజసము తామసము నృప రాక్షసులకున్. 247
తృ తీ య స్కం ధ ము
173
తే.గీ. సరవితో నొప్పు దీనిని జ్ఞానులైన | వా రొనర్తురు బాహ్యార్థ వాంఛలుడిగి
వస్తుసంభారములు మాని ప్రవిమలాంత | రంగమున నిశ్చలానందసం గులగుచు. 248
వ. మఱియు దేశమును గాలమును ద్రవ్యమును మంత్రంబులును బ్రాహ్మణులును సాత్త్వికి
యగు శ్రద్ధయు నె చ్చటనుండు నది సాత్వికంబైన దేవీయజ్ఞంబగు. నిర్దేశకాల ద్రవ్యాదులకు
శుద్ధిసంపూర్ణంబై యుండెనేని సంపూర్ణఫలదంబగు. రాజేంద్రా, యిటు విను మొక యుదా
హరణంబు సెప్పెద. నన్యాయార్జితంబులగు ద్రవ్యంబులవలన యజ్ఞంబు సేసిన నైహికా
ముష్మికంబులు సమకూడవు. చూచితివకా పాండవులు రాజసూయంబను యజ్ఞం
బపరిమితదక్షిణలతోఁ జేసిరికదా! సాక్షాన్నారాయణుండైన శ్రీకృష్ణుండు వారి కెల్ల
విధంబుల బంధుండై హితుండై సహాయుండై యుండియు భారద్వాజాది విప్రులు పరిపూర్ణ
విద్యావంతులై యుండియు వారికి సంప్రాప్తంబులైన దుఃఖంబు లిన్నియని వచింపఁదరము
కాదు. ఘోరంబైన యరణ్యవాసంబును, బాంచాలీ పీడనంబును, విరటునియొద్ద దాసత్వం
బును , గీచకునివలనఁ బాంచాలికిం గ్లేశంబును సంభవించె. యజ్ఞకాలంబునందు బ్రాహ్మణుల
వలని యాశీర్వాదంబులను శ్రీకృష్ణుని తోడ్పాటును నీషన్మాత్రంబైన గార్యకారులు
కాకపోయె. నిచట నేమి విచారింపదగియున్నయది ధర్మవై గుణ్యమే యందునకుం
గారణంబని చెప్పకతప్పదుకదా. కావున న్యాయార్జిత విత్తంబువలన ధర్మంబు సేయుట
యుచితంబని చెప్పి మఱియు. 249
క. కానున్నది కాకెట్టుల | యౌననినన్ వేదసమితి వ్యర్థముకాదే
మౌనుల తపములు జ్ఞానుల | జ్ఞానము వ్యర్థంబకాదె జనలోకమణీ. 250
సీ. మనము చేసెడికర్మ మంచిదియగునేని దైవంబు తోడగుఁ దథ్యమిదియ
మనము చేసెడికర్మ మంచిదికాదేని దైవంబు కీడగుఁ దప్పదిద్ది
కావున సద్గతి గల్గినప్పుడు మన కర్మశుద్ధియై దాని కారణమగు
ఫలము కీడగునేనిఁ దలఁపంగవలె మన కర్మవైగుణ్యమే కారణమని
తే.గీ. క ర్తగుణములుకొన్నింట కారణములు | మంత్రగుణములు కొన్నింట మరియు ద్రవ్య
గుణము లొకకొన్ని యెడలఁ గారణములగును | వెలయ ఫలభేదములకు నుర్వీతలేంద్ర. 251
క. హరిహయుఁడు విశ్వరూపుని | గురువుం గావించుకొని యకుంఠితలీలన్
జరిపెను జన్నము తల్లికి | నురు సుఖములు గోరి యందు నుద్యమమలరన్.252
క. దానవులకు దేవతలకు | మానుగ స్వస్తియని పలికి మఖ మొనరింప
దానవులు మాతృపక్షము | పూనుక తద్రక్షణంబు పొందుగఁ జేయన్ .253
క. సంపుష్టులైన యసురుల । పెంపుంగని హరిహయుండు పెదవిఁ గణచి ని
ష్కంపనవృత్తిం మదిఁ గో । పంపడి పవిఁ దచ్చిరములు పగులఁగనేశన్. 254
క. ధరణిఁ గ్రియావై గుణ్యం । బరయం గారణము దీని కది యట్లుండన్
నరవర మును బాంచాలుఁడు । వరపుత్రునిఁ బడయుటకు నవన మొనరించెన్. 255
వ. అట్లుచేసిన యజ్ఞంబువలన దృష్టద్యుమ్నుండను కుమారుండును వేదీ మధ్యంబున ద్రౌపది
యుం బొడమిరి, మరియు దశరథుండు పుత్రార్థియై యిష్టిఁ గావించి రామాదుల నలుపుర
పుత్రులం బడసె. నది కతంబున నెచ్చటం గ్రియాశుద్ధికల దచ్చట ఫలంబు మేలగు.
నెచ్చటఁ గ్రియావైగుణ్యంబు కల దచ్చట ఫలంబు కీడగు. ధర్మపుత్రుండు సత్యవాదియయ్యు
ద్రౌపది పరమసాధ్వియయ్యు భీమార్జునాద్యనుజులు మహాపుణ్యులయ్యు, గుత్సిత ద్రవ్య
యోగంబునం గ్రియావై గుణ్యంబు గలుగుట నొండె, సాభిమానులై చేయుటంబట్టి క్రియా
వైగుణ్యంబు ప్రాప్తించి యొండె నశుభఫలంబులకుం గారణంబయ్యెనని చెప్పి మఱియు 256
సీ. జగతీశ సాత్త్వికమగు యజ్ఞమది దుర్లభముసుమ్ము వైఖానసమును లిట్టి
జన్నం బొనర్తురు సాత్వికంబగు భోజనము నిత్యము నొనర్తు రమితశాంతి
న్యాయార్జితంబు వన్యంబు ఋష్యము సుసంస్కృతమునైభక్త మప్రతిమమందు
మంత్రంబుగలదు యూపములేదు మఱి పురోడాశంబు నిత్యంబు నధికమైన
తే.గీ.శ్రద్ధగలదిది పరికింప సాత్త్వికంబు | రాజసం బిఁక వర్ణింతు రాజులకును
వైశ్యులకు నది సేయంగ వలసినట్టి । యజ్ఞమని చెప్పుదురు జ్ఞానులైనవారు. 257
తే.గీ.రాజసము ద్రవ్యబహుళమై రాజిలెడి సు | సంస్కృతంబులగు దాని సాభిమాన
వృత్తులగు రాజులును వైశ్యు లెలమిజేఁయు । చుందు రిఁకఁ దామసము విను మో మహీశ. 258
చ. మదమునఁ బేర్మిఁ జెంది యభిమానము క్రోధము మెండుగాఁగఁ గ్రూ
రదశల నొప్పి చేయుదురు రాక్షసు లా మఖ మెందునేనియున్
సదమలసాధనక్రియల సాధువులై తగు మోక్షకాము లిం
పొదవఁగ సర్వదా శుభము లుల్లమునం దిడి చేయుచుండ్రొగిన్. 259
వ. మునులు చేయు దేవీయజ్ఞంబు మానవయాగంబని పెద్దలు వక్కాణించెద రది విశేషంబని
తెలియుము. అది సేయు విధం బెట్టిదనినఁ జెప్పెద సావధానంబుగా వినుమని యిట్లనియె. 260
సీ. గుణముల నణఁచి యెక్కుడు శుద్ధిఁ దనరార నింపుగా మనసు శోధింపవలయు
డెందంబు పరిశుద్ధిఁ బొందుటకై బాహ్యకాయంబు పరిశుద్ధిఁ జేయవలయు
యజ్ఞంబుచేయుట కపు డధికారియై యింద్రియార్థము త్యజియింపవలయు
బహుయోజనాయతిన్ బరగు స్తంభములతో నెద మండపంబు నూహింపవలయు
తే.గీ. విశదమగు వేది నాత్మలో వేయవలయు | నట్టులనే యగ్నులం దగఁ బెట్టవలయు
కొమరుగా నట్లె ద్విజులను గోరవలయు | నాంతరంగిక యజ్ఞంబునందు భూప. 261
సీ. ప్రాణపంచకమెయ య్యజ్ఞంబునందును బావకులగుదురు భావనమునఁ
బ్రాణమెన్నఁగ గార్హపత్యం బపాన మాహవనీయ మా వ్యాన మదియ దక్షి
ణాగ్నిగాఁగ నుదాన మది సభ్యకోటిగా జను సమానం బవసధ్యకముగ
నిర్గుణమును నతినిర్మలంబును నగు దలఁపుచే ద్రవ్యంబు దగ నమర్చి
తే గీ. మన సెహోతనుగా యజమానుఁ డుగను | దెలియ నిర్గుణమగుబ్రహ్మ యలరుచుండఁ
బరమశివదేవి భగవతి ఫలదగాఁగ | నాంతరంగికియాగంబు లలరుచుండు. 262
సీ. అయ్యయిద్రవ్యంబు లాప్రాణముఖ పావకులయందు వేల్చంగపలెను జుమ్ము
కుండలిదారిని గొని శాశ్వతంబగు బ్రహ్మమం దది వేల్చి భక్తి మిగుల
స్వానుభూతియు స్వయంసాక్షాన్మ హేశ్వరి మంచిన ప్రీతి ధ్యానించి పిదప
సర్వభూతాత్మను సర్వభూతంబులఁ గారణశక్తిగాఁ గనగఁవలయు
తే.గీ. నంతటనె మాయదగ్ధమై యఖిలకర్మ | బంధములు వీడుఁ బ్రారబ్ధ మాత్రముండుఁ
బ్రతికియుండియు ముక్తుండు వాడె సుమ్ము | మానవేశ్వర జగదంబమహిమ వింటె. 263
క. మానస యజ్ఞము ముక్తిని । దానము తదితర మఖ ప్రతానము లిచ్చా
దాన చతురములు క్షయమున్ | బూనుఁ గదా కొంతకాలమున కాఫలముల్. 264
శా. జ్యోతిష్ఠోమము స్వర్గకాములకు నంచుం బల్కు వేదంబు లా
చాతుర్యం బది నిక్కమైన విను తజ్జంబై న పుణ్యంబు ని
ర్యాతంబౌ నెడ మర్త్యలోకమున కొయ్యం జొత్తురంచున్ సుధీ
వ్రాతంబుల్ వచియింప వింటిమికదా రాజేంద్ర వేయేటికిన్. 265
తే.గీ. జయమ పేక్షించు రా జిది సలుపరాదు | ముక్తిఁ గోరెడివానికే ముఖ్యమిద్ధి
మానవేశ్వర మున్ను తామసము నీవు | సలిపినాడపు సర్పయజ్ఞంబటంచు. 266
క. ఆయాగంబున రిపుజయ | మాయెన్ సర్పశతకోటు లగ్నిం బడియెన్
జేయుము దేవీయజ్ఞము | మీయయ్యకు ముక్తి గలుగు మేలిది స్పవతీ. 267
క. లిబ్బుల వెలఁదుక మగఁ డిది | యబ్బురముగ నాచరించె నా సృష్ట్యాదిన్
బ్రబ్బిన వేడుక నీవును | గొబ్బునఁ జేయు మిది మేలుకోరి నృపాలా 268
5. దేవీయజ్ఞవిధావిదు | లౌ వారలు మంత్రవేదులౌ వారలు వి
ప్రావళులు కలరు యాజకు| లై విలసిల్లుదురు నీకు నవవీనాథా| 269
క. ఆయాగము గావించి మ | హాయుక్తి ఫలము గాంచి యని నీ పిత కి
మ్మా యయ్య నుద్దరింపుము | పాయక నరకంబునుండి పార్థివముఖ్యా 270
క. శాపంబున నీతండ్రికి | బాపము ప్రాపించె సర్పబాధితుఁడై కా
టోపక జచ్చెను నింగిని | భూపాలక యతఁడు నరకమునఁ బడియెఁ జుమీ.271
సీ. భూపాల నీతండ్రి పోవునప్పుడు సర్పభీతిమై దేహంబుమీది ప్రేమ
విడలేక తడబాటుపడి యెల్ల విధముల మృతి మాన్పికొనునట్టి మతి పొసంగి
మేడలు గట్టించి మేడపై నివసించి వివిధరక్షణమార్గ వితతిఁ గూర్చి
మంత్రౌషధవితాన తంత్రంబులకుఁ జాల వివిధయత్నంబులు వెల్లికొలిపి
తే.గీ. సోహమనఁడాయె విజ్ఞాన శూన్యుఁడాయెఁ | దత్త్వమసి యను పలుకైనఁ దలఁపడాయె
నెలమి బ్రహ్మాహ మని మది నెంచఁడాయె | జెలఁగి దేవీస్మరణమేని జేయడాయె.272
క. భూశయనము లేనట్టి వి | నాశము నీతండ్రి కబ్బె నరకములోనం
బాశములఁ గట్టువడియెన్ శాపము ఫలమునంది ధరణీనాథా.273
క. అనిన విని దుఃఖితుండై | జననాధుఁడు గొంత సేపు సాశ్రునయనతన్
మునినాథునితో నేమియు | ననఁజాలక యూఱకుండి యతిదైన్యముతోన్.274
క. మునినాథ తండ్రిదుర్గతి | వినిన విషాదంబు వొడమె వేగమ యతనిన్
ఘనముగ స్వర్గపు ప్రాపున్ | బొనరించు నుపాయ మిపుడు పూని యొనర్తున్ 275
-: విష్ణుకృత దేవీయజ్ఞము :-
వ. అని మరియు నిట్లనియె.276
క. మిత్రుఁడు జగములకెల్ల ప | విత్రుఁడు పాపప్రతతి లవిత్రుఁడు పూజా
పాత్రుఁడు వికచాంబుజదళ | నేత్రుడు జన్నంబు నిటులు నెరవేర్చెఁ దమిన్.277
క. వానికి సహాయులెవ్వరు | పూనిక వహియించినట్టి భూసురు లెవ రే
మౌనులు ఋత్విజులై రి వి ॥ ధానమునుం దెలుపుమయ్య తాత యనవుఁడున్.278
చ. వినుము ధరాతలేంద్ర యతివిస్మయ మాభగవంతుడైన ప
ద్మనయనుఁ డీమఖంబు విధిమార్గము తప్పక తా నొనర్చె ము
న్ననఘులు బ్రహ్మ విష్ణు శివు లంబికవల్లను శక్తి మూర్తులన్
గొని పిదపన్ విమానము నకుంఠత నెక్కి మహాబ్ధి జేరఁగన్.279
చ. గృహములఁ గట్టికోఁదలఁచి కృత్యము లెంచి నివాసభూమి ని
ర్వహణము గోర దేవి కృప రాగిల మేదముపూని మేదినిన్
విహితముచేసె భూభృ దటవీ ప్రముఖంబులతోడ నందుఁ దా
రు హితవిలాస విస్తృతి నిరూఢి వసించిరి సంతసంబునన్. 280
ఉ. మానవనాథ! కైటభము మాధవమై తగు మేదమొందుటన్
జానుగ భూమి మేదినియనంబడె ధారణవాచ్యసంగతిన్
బూని ధరాసమాఖ్య నొగిఁ బొందె మహీయముగాగ నెందునున్
దాను మహీమహాభిధఁ గనందగె శేషుఁడు మ్రోయు ధారుణిన్. 281
తే.గీ. ఇనుపసీలలవలె ధరాభృత్తు లలరెఁ | దానజేసికదా ధరాధరములయ్యె
రత్నమయశృంగములు గల్గి రత్నసాను | వచ్చెరువుమీఱఁ గావించెఁ నంబ కృపను.282
వ. మఱియు మరీచియు నారదుండును ఆత్రియుఁ బులస్త్యుండును బులహుండును గ్రతువును
దక్షుండును వసిష్ఠుండును నను వీరు బ్రహ్మకు కొడుకులై పుట్టిరి. మరీచికిం గశ్యపు
డుదయించె, దక్షునకుఁ బదమువ్వురు కూఁతు లుదయించిరి. వారియందుఁ గశ్యపుండు
నిఖిలదేవతలను రాక్షసులను మనుష్య పశు పక్ష్యాదులం గనియె. నిదియ కాశ్యపియను
సృష్టి, పితామహుని యర్థశరీరంబున స్వాయంభువను మనుపు పుట్టె. వామశరీరంబున
శతరూపయను కన్య యుద్భవించె. సయ్యిరువురివలనం బ్రియవ్రతోత్తానపాదులనువారు...
సంభవించిరి, మఱియు మువ్వు రతిరమణీయలైన కూఁతులదయించి రిట్టు భగవంతుడైన
త్రిదశ్యజ్యేష్ఠుండు జగన్ని ర్మాణంబు గావించి మేరుశృంగంబునం బ్రహ్మలోకంబు నేర్పరచి
కొని నివసించె, విష్ణుం డెల్లలోకంబుల కుపరిభాగంబున వైకుంఠంబు నిర్మించికొని
కాపురంబు చేయుచుండె. శిపుఁడతిరమ్యంబైన కైలాసంబు మిరవు చేసుకొనియుండె. నానా
రత్నసంశోభితంబైన మేరుశిఖరంబున స్వర్గంబు గావించుకొని యింద్రుండుండె. సముద్ర
మథనంబునం గామధేనువును, నుచ్చైశ్రవంబను సశ్వంబును, నైరావతంబను గజంబును,
రంబాదులగు నప్సరః స్త్రీలను సముత్పాదితంబులు గావించుకొనియె. మరియు నా
సముద్రంబున ధన్వంతరియను వైద్యుండును జంద్రుడును నుదయించిరి. క్రమక్రమంబున
నండజ స్వేదజాదులు పుట్టె. దేవతిర్యఙ్మనుష్యాది భేదంబుల నానావిధంబగు సృష్టి యిది
యకా యెఱుంగుము. ఇట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగదండ నిర్మాణంబు చేసికొని
యథేచ్చం బ్రవర్తించుచుండ నారాయణుండు మహాలక్ష్మింగూడి నిజభువనంబునం
గ్రీడించుచు నొక్కనాఁడు.283
ఆ.వె. పాలవెల్లిఁదలచి పాలవెల్లిని | రతనాలదీవిదలచి మేలగు రత
నాలదీవిలోని నయసత్యగుణ నికు |రుంబ నంబ శ్రీధరుండు దలచె. 284
ఆ.వె. అంట పేర జన్న మాచరించెదనని | పూని డిగ్గె తనదు పురమునుండి
డిగ్గివచ్చిరి శంభు దేవతాజ్యేష్ఠుని | వరుణు ధనదు నింద్రు బావకు యము.285
ఆ.వె. దైవగురు వసిష్టు దక్షుని వామదే | పుని బిలచి సమస్తమును గొఱంత
లేకయుండఁజేసి లోకంబు గొనియాడ | సత్త్వయజ్ఞకర్మ సలుపబూనె.286
సీ. చెలువుగా శిల్పులఁ బిలిపించి వితతమండపమును గావించి డంబుగుల్క
నిరువదియేడ్వుర ఋత్విజుల పరించి చితులు వేదికలును జెన్నుమీర
నొనరించి చేయంగ నుర్వరాదేపతల్ సరగ దేవీబీజ సంయుతముగ
మంత్రముల్ చెప్పిరి మరి విధివత్తుగా హోమముల్వేల్పించుచున్న తరిని
తే.గీ. మధుర మధురాక్షరంబు సుస్వరమునగుచు । వరలునశరీరవాణి య వ్వాసుదేవు
శ్రవణయుగ్మంబునకును గోచరముగాఁగ | నిట్లువచియించెనతఁడాత్మ నెలమినెసగ.287
సీ. దామోదరా ! నీవు ధన్యుండవైతివి సురలలో నీవు శ్రేష్ఠుడవుగమ్ము
బ్రహ్మాదులును నిన్ను బ్రథమగణ్యుడవుగా నెంచిపూజించెద రెల్లయెడల
భక్తితో మానవుల్భజియించెదరు నిన్ను యజ్ఞేశ్వరుఁడవు నీ నగుము పేర్మి
ని న్నాశ్రయింతురు నిరతంబ నెల్లరు వరములిచ్చున గీర్తి వడయుమింక
తే.గీ. ధర్మమిప్పుడు చెడిచను ధరణియందు | నప్పుడీవవతరింపు మత్యాదరమున
శిష్టరక్షణమునుజేసి దుష్టశిక్ష | నొనరఁ గావించుచుండుము దనుజదమన 288
క. నీ యవతారంబులు నా| నాయోనులయందు నొదవు నమ్ముము నీవే
వేయివిథములను దేవని | కాయార్చ్యుయఁడవగుము నా సహాయతవలనన్.289
క. శ్రీ నీ సహచారిణియగు | నేనే నాయంశమునను నిర్మించెద న
మ్మానవతి నీకుఁదోడుగ | నానాకాయములయందు నంటై యుండన్.290
క. చక్రాదులాయుధంబు ల | వక్రగతిన్ నీకు గలుగు వానిం గొని యా
శక్రాదుల రక్షింపుము | సుక్రమముగ వారియందుఁ జూపుము కరుణన్.291
ఉ. కోపము గర్వమున్ వలదు గోచరు లాదరణీయు లెప్పుడున్
బాపము చేయువారలను బట్టి వధింపుము విగ్రహార్చన
వ్యాపితలీల శక్తులొని భారతవర్షము నందఁ బూజ్యులై
కాపురముండ్రు వేగిరమ కల్గును నీకు యశంబు మాధవా.292
క. నినుఁ బూజించిన మనుజులు | ఘనులగుదురు కీర్తిపరులుగా మందురు నం
దనులం గందురు మధుసూదన యిక | నినుబోలునట్టి దైవము గలదే.293
D
వ. అని కరుణార్ద్రహృదయయై దేవియిచ్చినవరంబులంది నారాయణుండు యజ్ఞసమాప్తిఁజేసి
కశ్యపాదులను వీడ్కొని గరుఁడునిపై నెక్కి వైకుంఠంబు ప్రవేశించి తాను దేవి
యనుగ్రహంబునం బడసినవరంబుల దెల్పిన నెల్ల దేవతలును బ్రముదితాత్ములై యందరును
దేవిం బూజింపదొడంగిరి. దేవియు వారికి వాంచితార్థప్రదాయినియై యుండె నని చెప్పిన విని
జనమేజయుం డిట్లనియె. 294
క. హరి దేవి యజ్ఞంబును | గరమరుదుగఁ జేసి శుభము గన్న విధము ని
స్తరముగ వింటిని మఱియున్ | మఱియున్ వినదలఁతు దేవి మహిమము లనినన్. 295
వ. వ్యాసుండు. 296
-: ధ్రువసింధూపాఖ్యానము :-
ఆ.వె. దేవదేవదేవ దేవిచరిత్రంబు | వినఁగవినగ బెఱుఁగు వినెడిబుడ్డి
మేలు మేలు నాకు మేలుగా మునిముఖ్య | తెలుపు తెలుపు మమృతమొలికి కులుక. 297
ఉ. మాన్యచరిత్ర దేవి మహిమం బితిహాసమొకొండు సెప్పి నే
ధన్యుఁడనౌదుఁ గోసలపథంబుల నర్యమవంశజుండు సౌ
జన్యగుణుం డుదారుఁడు లసద్ధ్రువసింధుసమాఖ్యుడొప్పు రా
జన్యవరేణ్యుఁ డత్యధిక శౌర్యపరాజితశత్రుసైన్యుఁడై. 298
చ. భువి నిరవద్య హృద్య ఘనభూతిఁ దలిర్చి ధరావరుండు మా
నవ పరిరక్షణక్రమమునం గులధర్మమములోలి నెప్పుడున్
లవమును బీరువోనిడక లగ్గుల యెగ్గుల నిగ్గులోపికన్
బ్రవిమలబుద్ధి నారయుచు బాలన జేసె నయోధ్య నిర్మలిన్.299
ఉ. ఆ విభు భార్య లిర్వు రిఁక నందు మనోరమ ధర్మపత్ని లీ
లావతియున్ ద్వితీయ గుణలక్షిణ మాన్యల వారి గూడి యి
చ్ఛావిధి సౌధభాగములఁ జారుతరోపవనంబు లందు నా
నావిధ కేళికావిలససంబులఁ క్రీడలు సల్పె వేడుకన్.300
చ. తనర మనోరమాభిధ సుదర్శను గాంచెను దివ్య రాజ్యలాం
ఛనయుతు సుందరున్ బరమసాధువు రెండవశోభనాంగి దా
జనవర కాంచె నొక్కసుతు శత్రుజిదాఖ్యుని రాజు వారలన్
గనియె నభేదబుద్ధిని జగంబును రంజిలెఁ బ్రీతి నెంతయున్ 301
పంచచామరము. సుదర్శనుండు మంజువాక్య శోభియై విరాజిలెన్
సదా చరించె శత్రుజిత్తు చాటు వాక్యశాలియై
యుదారుడైన రాజు ప్రీతి కొప్పినా సుదర్శనుం
డు దా సమస్తమంత్రివర్యులుం జగంబు మెచ్చఁగన్. 302
ఉ. అచట నొక్కనాఁడు మృగయార్థము భూతలనాధుఁ డేగి స
మోద మెలర్ప దుష్టమృగపుంజముల న్నిజబాణ నైపుణిన్
మోదుచుఁ బోయి పోయి తనముం దొక యీరమునందు భీతికృ
న్నాదము చేయుచున్న మృగనాయకమున్ గని క్రోధచిత్తుడై.303
ఉ. పంచముఖంబు దన్నుఁ బసిపట్టి యెగాదిగ జూచి తోక జా
డించుట కల్గి భూవిభుం డహీనశరాసమునందుఁ దూపు సం
ధించి తటుక్కున న్విడువఁ దీవ్రగతిం జెడలార్చి గాండ్రు గాం
డ్రంచు బయిం బయిం దుముక నాతఁడు గైకొనె వాలుఁ బల్కయున్.304
తే.గీ. పైకి వచ్చిన మృగరాజు పట్టె రాజుఁ |బట్టినను రాజు గుత్తితోఁ గొట్టెఁదాని
నిట్టు నట్టును బొరలాడి యెట్టులేని | రాజు చచ్చె నపుడె మృగరాజు సచ్చె 305
క. దీనాననులై భూపతి | సేనల వారెల్లఁబోయి చెప్పఁగ మంత్రుల్
మానక యుత్తర విధులన్ | బూని యొసర్పించింరంతఁ బుత్రుల చేతన్.306
తే.గీ. ప్రకృతిజనులు వసిష్ఠుండు బహువిధముల | పూని యాలోచనముజేసి పుత్రులందు
చెలువుగ సుదర్శనుని రాజు జేయదలంచి | చేరియుండంగ నయ్యుధాజిత్తు వచ్చె.307
క. లీలావతి తండ్రి యతఁడు । పాలించెడి యుజ్జయినిని మంత్రిసహితుడై
యాలించి వచ్చినను విని |యాలోనన్ వీరసేనుఁ డరుదెంచె వడిన్.308
క. ఈతఁడు కళింగ భూపతి | తాత సుదర్శనుని కిట్లు తతసైన్యగణో
పేతులయివచ్చి యిరువురు| వ్రాతలఁ గూతలను మిగుల వాదించి రొగిన్.309
క. ఇద్దరిలోపల జ్యేష్ఠుఁడు | దద్దయు నా శత్రుజిత్తు తానే రాజం
చుద్దవిడి న్వాదించును | బెద్దతనము చిన్నతనము పెరిమెల వలనన్.310
క. ఇద్దఱు భార్యలలోనన్ | బెద్దదియగు ధర్మపత్ని బిడ్డఁడు కానన్
ముద్దు సుదర్శను రాజని | గద్దించుఁ గళింగరాజు కడువాడమున్.311
క. మనముల నెటు సెప్పుటకును | ననుమానించియు సుదర్శనాఖ్యుని సింహా
సనమున నుంచఁగఁ దలఁపె | ట్టినను యుధాజితు రుషార్భటి న్సచివులతోన్.312
ఉ. పొట్టలు నించుకోమఱఁగి భూరిధనంబులు గొంచు మేడలన్
గట్టి మదించి పెద్దల ముఖమ్మున ధర్మము లొక్కనాఁడునుం
గట్టిగ విన్న మానిసులు కాపి ప్రథాసులు మీరు లంచముల్
పట్టి సుదర్శను స్నృపతి పట్టసమేతు నొనర్పఁ జెల్లునే. 313
ఆ.వె. నేను బ్రతికియుండఁగా నెవ్వఁ శ్రీ చిన్న| వాని రాజుఁజేయఁ బూసఁగలఁడు
సబలుఁడైనవాడు శత్రుజిత్తనుకొండు | కాలు దువ్వువాఁడు కదనమునకు.314
వ. అనిన వీర సేనుండు.315
ఆ.వె. ఆకట న్యాయమరయ కాడెదేటికి యుధాజిత్త వినుము శత్రుజిత్తు తాత
తాళ్ళఁదన్నె నేనిఁ దా సుదర్శనుతాత తాళదన్ను వారి తలలఁదన్ను.316
-: యుధాజిద్వీరసేనుల యుద్ధము :-
వ. ఇట్లు యుధాజిద్వీరసేనులకుఁ బరస్పర వివాదంబులు ప్రబలంబైన గని యఖిల ప్రజ
లును మునులను మనంబుల నత్యంత చింతా వేశంబులఁ దత్తరిల్లిరి. శృంగబేరపుర
వాసులగు నిషాదులు రాజవంశంబునం గలహంబులు పొసంగెననివిని రాజద్రవ్యంబు
లపహరింప దేశదేశంబుల విచ్చలవిడి దోపిడులఁ జేయందొడంగిరి. యుధాజిద్వీరసేనులు
యుద్ధ యత్నంబులు సేయుచుండి రిట్టి సమయంబున.317
సీ. సమరసన్నద్ధులై చతురంగబలములఁ జేర్చి యుధాజిత్తు పేర్చినిలచె
వీరసేనుఁడు మహావీరాగ్రణులతోడ నెదురుగాఁ దా మోహరించినిలచె
మొనసి యా రణరంగమున యుధాజిత్తుపై గిరిమీఁద వర్షంబు గురిసిసట్లు
వీరసేనుఁడు ఘోరనారాచముల నేయ నుజ్జయినీశుండు నురువడించి
తే.గీ. నిజనిశితబాణపుంజంబు నెఱసి యతని |యాశుగంబులఁ దెగటార్చి యార్చినిలువ
నంతటఁ గళింగభూపతి పంతగించి | మఱలనేయంగ నతఁడును మఱలనేసె 318
క. గజముగజము హయము హయము | ఋజుగతివిధమును రథంలు నెల్లెడలఁ బదా
తిజనముఁ బదాతిజనముం | గజిబిజియై పోర మెదడు గ్రద్దలు తినియెన్.319
సీ. గజఘటాకుంభనిర్గతమైన రక్తంబు కంఖాణకంఠనిర్ణత రుధిరము
రధిక యోధాగ్రేసరక్షతజాతంబు కాల్బలంబు నొడళ్ళ గాఱునెత్రు
సెలయేళ్లుగాఁదారి గలసి మహానదీ వితతప్రవాహంబుగతి వహించి
నరమస్తములతిట్ట లరిది సైకతభాతి శైవాలభంగిఁ కేశములు తనిర
తే.గీ. కరిశవంబులు తిములుగాఁ గానువింప । వీరికాయంబు లోగి మత్స్యవితతిఁ బోల
నేమని వచింప రణరంగభూమిఁ దొంగి ।చూచువారలకును భీతిదోచె మిగుల.320
తే.గీ. కదనమున నీల్గి యొకఁడు నాకమునకేగి | యచ్చరనుగూడి దివ్యరథాధిరూఢు
డగుచు దివినుండి యవనిపై నవిసిపడిన తనశరీరంబు సూపు నవ్వనజముఖికి.321
తే.గీ. మరియొకడు దేవతాకాంత మఱఁగి దేవ | రథముపైనుండి యాహవరంగమందు
ననుగమన మాచరించిన వనితవచ్చి | తన్నుఁగలసిన స్వీయను దవిలికులికె.322
వ. ఇట్లు దేవాంగనలు రణంబునహతులైన వీరులంగూడి యంతరిక్షంబుననుండి చూచు
చుండఁ జతురంగంబుల పాడఘట్టనంబున భూమినుండి లేచిన రజోవితానంబు దిశలం
బ్రాకి చిమ్మచీకట్లు గ్రమ్మంజేయ సతిఘోరంబుగాఁ జూపట్టు నవసరంబున యుధాజిత్తు
నిజధనుర్విద్యానై పుణిం బ్రకటించి వీరసేనుమస్తకం బూడనేసిన నతండు నేలం బొఱఁగిన
నతని బలంబులు చెల్లాచెదరై నలుదెసలం బాఱజొచ్చి రంత మనోరమ తనతండ్రిపాటు
విని తనకుమారుండు యుధాజిత్తుం జయించుమార్గంబు పలువిధంబులందలపోసియు,నెట్లుం దోచక చింతాక్రాంతయై యయ్యయో లోభంబునకంటెం బాపంబులేదు. నే నేమిచేయుదు.
లోభావిష్టుండగు పార్థివుండు సేయని పాపంబుగలదేయని వితర్కించుచుఁ దనలో
మఱియు నిట్లనియె.323
క. తల్లినిఁ దండ్రిని భ్రాతల |నల్లుండ్రను గురుల హితుల నాత్మజుల ధరన్
డొల్లింతు రాసచేతను | కల్లగునా యాశ దుఖకరి యనుట యిలన్ 324
క. చేయు నగమ్యాగమనము | పాయక సలిపెడు నభక్ష్య భక్షణ మికఁ దా
నేయది యాశాబద్దుడు | సేయఁడు లోకమున నాస చీచీ తగునా. 325
శా. ఆశారాక్షసి కుక్షి దొడ్డది సురాహార్యంబునున్ సప్తవా
రాసుల్ నాకము నాగలోకమును దా రక్షాతలంబున్ భవా
నీశస్థానము, విష్ణులోకమును లోనిడ్డన్ క్షుధాశాంతి దా
లేశంబున్ గనరాదు పిష్టఘుటికాలీలన్ వడిన్మ్రింగెడిన్. 326
نا
మ. అకటా లోభము లోభమే వితత మాయామోహినీ దేహవా
హక మత్తేభమకాక దానిఁ గడద్రోయన్ లేక సన్న్యాసులై
వికటారణ్యవిహారులై జపతపోవిస్తారులై కేళ్ళఁ గుం
డికలుం గోలలుఁబట్టి యట్టె చనరే డీకోఁ దరంబేరికిన్.327
ఉ. తండ్రియుఁబోయెఁ బెన్మిటియుఁ దాటెను బుత్రుఁడు బాలుఁడయ్యయో
సంద్రయుధాజితెట్లు బ్రతుకంగల మేము సపత్ని జొన్నపిం
డుండ్రమునైనఁ బెట్టునె నయోచితమార్గము లెంచునేనిఁ బ్రో
యాండ్రకుఁ గల్గునే సచిపు లయ్యమపక్షము పూనకుందురే.328
ఆ.వె. సపతితల్లిగర్భ మనియంగఁ దద్దత | శిశువుఁ గోసికోసి చెఱచె నింద్రుఁ
డలుక గర్భనాశనార్థంబు సవతికి | నొగివిషంబువెట్ట సగరుడొదవె. 329
ఆ.వె. కానలకును పంపెఁ గైకేయి సవతికు | మారు రాము నీతిమాలి యందు
వలనఁగాడె యీల్గెఁ బంఙ్క్తిరథుండు దా | సవతి యీసునకును సవతు గలదె.330
క. నాకొమరుని భూపతిగాఁ | గైకొనగఁ దలంచినట్టి ఘనమంత్రులు దా
రీకాలమునఁ దదీయులు | గాకుందురె యేమి సేయఁగల నిపు డయఁయో 331
తే.గీ. కాఁదలఁచినట్టిపని యెప్డు కాకపోదు | యత్నమొకటి చేసిన నవల దైవ
మెట్లుగానుండునో దోషమేమి యిందు | ననుచు మనమున నొక యూహగని వెలంది. 332
తే.గీ. సకలకార్యంబులందు విశారదుడగు | మానిసి విదల్లు నొక్కని మగువ వేగ
బిలచి యేకాంతమునఁ దన బెడదలెల్లఁ | జెప్పికొని యేడ్చెఁ గన్నీటఁ జేలదడియ.333
వ. మఱియు.334
తే.గీ. నాయనా తండ్రి కడచెను నాదుబిడ్డ | చిన్నవాఁడా యుధాజిత్తు చెడ్డవాడు
బ్రతుకు మార్గంబు నాకేది ప్రకృతమరసి | వక్కణింపుము కాళ్ళకు మ్రొక్కు దాన. 335
వ. నావుఁడు విని విదల్లుండు.336
క. నీ విచ్చట నివ్వేళం | దావొనరింపంగరాదు త్వరగా నేనున్
నీవును బాలునిఁ గైగొని | యా వారాణసికిఁ బోయి యప్పురమందున్. 337
క. నామేనమామ గలఁడా|| శ్రీమంతుఁడు మంచివాఁడు చేయంగలవాఁ
డామేంటి సుబాహుండను నామముగలవాఁడు మేటి సయ మేదేనిన్ 338
క. అనిన విని మనోరమ దా | ఘనమైన యుపాయమనుచుఁ గడునలరి తదీ
య నయంబుం గొనియాడుచుఁ | జనియెదఁ బుట్టింటికనుచు సవతికిఁ దెల్పెన్. 339
వ. ఇట్లుచెప్పి రహస్యముగా నొక రథంచెక్కి తానును సుదర్శనుండును నొకసైరంధ్రియు
విదల్లుం దోడ్కొని పట్టణబహిఃప్రదేశంబునకుం జని రణంబునం గూరియున్న తండ్రికి
సంస్కారంబులుచేసి రెండుదినంబులలో భాగీరధీతటంబు నేరిన నచ్చటి నిషాదులు సర్వ
ధనంబునుం గొనిపోవ వగచి భయాకులయయ్యు విదల్లుండు సెప్పిన నీతివాక్యంబులచే
ధైర్యం బవలంబించి తెప్పయెక్కి జాహ్నవిం దాటి భారద్వాజాశ్రమంబు ప్రవేశించి
యచ్చటి తాపసులంజూచి నిర్భయయై వసియించి యున్నతఱి మునీంద్రుం డా యంగనం
గాంచి యిట్లనియె. 340
ఉ. ఎవ్వతెవీవు నీవెవని యింతివి కష్టము చెందినట్లు నీ
నెవ్వగ తెల్పుచున్నయది నీవు సురాంగనలో వరాంగి నీ
మవ్వమునుం గనుంగొనఁగ మానవినీపంచుఁ దలంపనేర
కివ్విధి యెందువల్ల లభియించె వచించుమటంచుఁ బల్కినన్. 341 341
చ. నెగులున నేమియుం బలుకనేరక కన్నుల న వ్విదల్లునిన్
దగఁ గనుగొన్న నాతడు మనంబునఁ జింతిలి యో మునీంద్ర యీ
మగువ మనోరమాఖ్య వినుమా ధ్రువసింధుని ధర్మపత్ని భ
వ్యగుణగణాఢ్య యమ్మనుజభర్త మృగేంద్రముచేత నీలిగెన్ 342
క. ఈ కొండిక యా శైలకు | చాకాంతుని కొడుకు సుగుణసంపన్నుఁడు ని
నిర్భీకుడగు వీరసేనుం | డీకాంతకుఁ దండ్రి యాతఁ డీల్గె రణమునన్.343
క. లీలావతి ఈమె సవతి | యాలాలనకుఁ దండ్రియగుచు నలరు యుధాజి
ద్భూలోలుఁడు తన మనుమని | బాలుని శత్రుజితు భూమిపాలనిఁ జేయన్.344
ఆ.వె.పూనివీరసేను బొడిచి రాజ్యంబున | విడిసియున్నవాడు వెఱవు లేక
త్రాత యెందులేక యీతరుణీమణి | యిట్లువచ్చె నీవ ఇంక దిక్కు.345
ఆ.వె. యజ్ఞశతకమైన నార్తరక్షణమును |దొఱయ దట్లుకానఁ బరమదీన
మానవేంద్రు చాన మన్నించి యీబిడ్డఁ | బ్రీతిఁ బ్రోవుమయ్య పృథుగుణాఢ్య.346
క. నా విని మునివరుఁ డిట్లను | నో వనితా నీదు కొమరు నోఁపికమీఱన్
బ్రోవుము వెఱువకయుండుము | భూవిభుఁడై వీఁడె సుఖము పొందగలఁడుసూ 347
చ. అని విని సంతసించి జటిలాగ్రణి యిచ్చిన గడ్డికొంపలోఁ
దనయుని బ్రోచుచుంచెను విదల్లుఁడు నూడిగపుం బడంతియున్
తన కుపచారము ల్నడప దైవమునే మది నమ్మి యెంతయున్
మునివరు నంతికంబునకుఁ బోవుచు వచ్చును నూరడిల్లుచున్ 348
వ. అంత యుధాజిత్తు సంగ్రామంబునుండి వెడలి యయోధ్యకుం బ్రవేశించి సుదర్శను వధించు
తలంపుతో మనోరమం బిలువ ననేక సేవకులం బంపిన నావె గనరామి నొక
సుముహూర్తంబునఁ దనమనుమఁడగు శత్రుజిత్తునలంకరింపించి వసిష్ఠాదులును నిఖిల
మంత్రివర్గంబులును విచ్చేసియుండ నభిషిక్తుం గావించి భేరీశంఖకాహళాది తూర్యధ్వనులు
దెసలు నిండ విప్రవేదపాఠంబులును వంది స్తవంబులును జెలంగ జయజయాది మంగళ
నినాదంబులతో నుత్సవంబుజేసి పరమ సంతోషముతో నుండి.349
క. ఎక్కడికిఁ బోయినది యా |ముక్కడియయిన ధ్రువసింధు ముదిత పురమునన్
జిక్కునని తలఁచితినినే | డిక్కడ లేదాయె కొడుకు నెచ్చట నిడెనో. 350
—: యుధాజిత్తు భరద్వాజాశ్రమమునకుఁ బోవుట :-
వ. అని వితర్కించి యుధాజిత్తు తన మనుమనికి రాజ్యం బిచ్చి మంత్రులం భూపాలనంబునం
బరామరిక కలిగియుండ నియమించి తా నా రాజ్యంబు వదలి సుదర్శన వథార్థియై యతండు
ఋష్యాశ్రమంబున నుండె నని విని.351
తే.గీ. శృంగబేరపురీశుఁడై యెసఁగునట్టి | యెఱుకు దుర్ధరుఁడనువా డహీనబలుఁడు
దనకుఁ దోడయి చనుదేరఁదడవులేక | చిత్రకూటంబునకు యుధాజిత్తు సేర.352
వ. మనోరమ విని దుఃఖించుచు.353
తే.గీ. ఏమిచేయుదు మునులారా యెందుఁజొత్తు । నయ్యుధాజిత్తు నాశత్రుఁ డా నిషాద
విభుని సేనలతోఁ గూడి విడిసె విందు|నితనివలననే నాతండ్రి యీల్గెసుండు.354
క. మును పా పాండవులు వనం | బున ద్రౌపదిఁ గూడియుండ మునుకొని యా రా
ట్తనయులు మృగయలఁ దిరుగన్ | మునులే రక్షించిరనుచు మును వింటిగదా.355
వ. మునీంద్రా! య య్యాశ్రమంబున నున్న ఋషులు ధౌమ్యుండును ఆత్రియు గాలవుండును
బైలుండును జాబాలియు గౌతముండును భృగుండును చ్యవనుండును గణ్వుండును జితుం
డును గ్రతుండును వీతిహోత్రుండును సుమంతుండును యజ్ఞదత్తుండును వత్సలుండును
రాశాసనుండును గహోడుండును నవక్రియు యజ్ఞదత్తుండును మొదలుగాగలవా రింకను
భారద్వాజాదులుం గలరు. మునీంద్రులారా! యచ్చటం గొందఱ దాసీజనంబులతో
యాజ్ఞసేని నిర్భయురాలై నివసించియుండె. నంత నొకనాఁడు పాండవులు వేట
తమకంబున న య్యాశ్రమంబు విడచి యొక కాననంబునుండి మఱియొక కాననంబునకుం
జనుచుం దడవు సేసియున్న సమయంబున న య్యాశ్రమభాగంబున సైంధవుండను రాజు
నిగమధ్యానంబులు విని యందుఁ బ్రవేశించి భృత్యద్వయసమేతుండై వేదంబులు పఠించు
మునులయొద్దికి వచ్చి వారలకు నమస్కరించినం గని వా రాదరించి కుశాసనంబున నుప
విష్టుంజేయఁ గూర్చుండియున్న సమయంబునం దత్రత్యులగు నారీమణు లంతటంతట
రాజుం జూచుచున్న సమయంబున వారలలో నున్న ద్రౌపదిం జూచి జయద్రధుండు
ధౌమ్యునితో నిట్లనియె.356
సీ. ఎవ్వరె యీశ్యామ యిందుబింబానన మత్తకుంజరయాన మంజువాణి
రతియొ భారతియొ శ్రీసతియొ సురేంద్రుని యువతియో పేరేమి యునికి యేడ
ఎవ్వని కూఁతురో యెవ్వని భార్యయో రాజవల్లభభంగిఁ దేజరిల్లు
బర్బూరములను లవంగతీఁవెయుఁబోలె రక్కసులందున రంభవోలె357
తే.గీ. నీ యరణ్యంబులకు విధి యేలవచ్చె | నింతచక్కఁదనంబు నే నెందుఁజూడ
నహహ చెల్లునే దీనికి యంగలార్పు | తెలుపగదవయ్య ద్విజవర్య దీని తెఱుఁగు 357
వ. అనిన ధౌమ్యుం డిట్లనియె.
తే.గీ. పాండవులభార్య పాంచాలి పార్థివేంద్ర | యీ యరణ్యంబునను వసియించియుండు
ననినఁ బాండవు లెచ్చటి కరిగి రిపుడు | వారలు మహాబలులు నంచితోరుమతులు.
ఉ. నావుడు ధౌమ్యుఁ డిట్లను ఘనప్రతిభుల్ కురువంశమండనుల్
దేవసమానులందరును దేరులనెక్కి యరణ్యభూమికిన్
వావిరి వేటకై చవిరి వచ్చెద రింటికి రెండుజాలకున్
నా వసుధావిభుండు మది నాటిన బాళిని నిల్పనేరమిన్.
వ. సైంధవుండు మెల్లమెల్లన దారి నేర్పుమీర ద్రౌపదిం జేరి యిట్లనియె.
ఉ. ద్రౌపది। క్షేమమా కొనుము దాసునిదండము మంచిదేఁ సరే
నీ పతు లేడఁబోయిరి పనిం గడచెం బదునొక్కొ డేండ్లు మీ
కాపద లిట్లు వచ్చెనన, నంగన నీకును స్వస్తి రాజ యీ
చాపపయిన్ వసింపు మొకజామున భర్తలు వత్తు రింటికిన్.357
తే.గీ. అనిన ద్రౌపదిమాటల నాలకించి యంతలో దాని బలిమిఁ దా నపహరించె
మునివరుల నుగ్రమూర్తుల ఘనులనైనఁ జూడఁడాయెను నమ్మవచ్చునే కుజనుల 358
ప. దీనికిం దృష్టాంతంబు కలదు. 359
క. బలిచక్రవర్తి జన్నము |నలరం దాఁజేయుదుండ నబ్జాక్షుడు దా
నల వామనరూపముతో |నెలమిం జని దానమడిగి యేమియొనర్చెన్ 360
క. యోగులకు సేవ్యుఁడై తగు | భోగీశయానుండు సేసె మోసము ధరణిన్
రాగులు లోభులు సేయరె |వేగమె కనుఁగొనకయున్న విమలవిచారుల్.361
క. లోభులు మోసముచేయుచు | లాభంబులు పొందుదురు బళా వారలకున్
బ్రాభవము పాపకర్మమె | యేభయము పరమ్మునందు నిహమే చాలున్. 362
క. మనసునఁ గ్రియలన్ వాక్కుల |ననుమానములేక పరుల యర్థమ్ము లోగిన్
గొనియెదరు చెలిమి బలిమిని |గన లోభమకాదె దీని కారణము భువిన్. 363
తే.గీ. పరులయర్థంబు రాఁగోరు పాపకర్మ | కొడఁబడుచు నుందు రీభువి నున్న వారు
నమ్మికయనంగ నెయ్యదో నమ్మవచ్చు | వాఁ డెవండో కనుంగొన వశముగాదు.364
తే.గీ. అవని లోభంబు పాపఁబు యగునుజూడ లోభులగువారు లాగంగలో మునిఁగినఁ
గాశికేగినఁ దలయెత్తు కనకమిడిన స్వర్గ మేరీతిఁ గలుగు నచ్చపలులకును.365
తే.గీ. ధాన్యవస్త్రాదులను గొనఁ దలఁచినపుడు | వెలలు తగ్గంగగోరుమ బేరి యమ్మ
గోరినప్పుడు హెచ్చంగఁ గోరుచుండు | హెచ్చుతగ్గులలో మోనమింతగాదు. 371
క. కాన మునీశ్వర సుతుతో | జానకి వాల్మీకియింట సంరక్షితయై
మానితయై నట్లుండెద | వీనిం బొమ్మనుము తనదు వీటికి వేగన్.372
క. అనిన ముని యుధాజిత్తుం | గని నీ విపు డిచటనుండి కదలుము స్వగృహం
బున కేగు మీ మనోరమ | కును దుఃఖము వొడమఁజేయఁగూడునె యనినన్.373
క. విని యయ్యుధాజిత్తనియెన్ | మునివర యీముగుద నిపుడు మున్యాశ్రమమం
దుననుండి విడిచివేయుము | చన నటుగాకయున్న సైన్యయుతుండన్. 374
వ. అనిన375
క. పలుకులు వినవేనిన్ | నీవనిఁగను మ వ్వసిష్ఠనియమి కుశికజున్
ద్రోపించినట్ల చేసెద | భూపాలక మాటలేల పొమ్మీ వేగన్.376
-: సుదర్శనునకుఁ గామబీజ ప్రాప్తి :-
క. అనిన మునిపలుకులు విని బల్ |కినుకం దలయూచి లేచి యుధాజి
జ్జనఁపాఁలుడు వృద్ధసచివు | దనయొద్ధికిఁ జేరఁ బిలిచి తంత్రం బడిగెన్.377
వ. ఇట్లాలోచించి మఱియు.378
ఆ.వె. శత్రు డల్పడంచు జనుఁ డుపేక్షించిన | రాజయక్ష్మబోలె రానురాను
దుదకు మృత్యుహేతు వది కాకయుండునే | పగఱనడఁపవలయుఁ బ్రథమమంద.379
ఆ.వె. కాన విపుడు చేయు కార్యంబు పరికింప | తనయుతో మనోరమను బలిమిని
బట్టి తెచ్చువాఁడ బరులెవ్వ రెదిరింపఁ | గలరు యోధులేరి బలగమేది.380
ఆ.వె. బలిమిఁబట్టి బాలు బ్రతుకార్చి నిష్కంట | కంబు సేయువాడఁ గడగిరాజ్య
మందుమీఁద భీతి యెందును లేక ర |క్షణము సేయువాఁడు శత్రుజిత్తు.381
వ. అని పలికిన యుధాజిత్తు పలుకులు విని ప్రధానుం డిట్లనియె.382
క. మునిమాటలు విని సాహస | మును చేయకుమయ్య దృష్టమును జూపె నతం
డును విశ్వామిత్రువిఁ దా | విను మాకథ చెప్పెదను సవిస్తర ఫణితిన్.383
క. మును విశ్వామిత్రుండను | ముని దేశాటనముమీఁదఁ బోవుచును వసి
ష్ఠుని యాశ్రమంబునకుఁ దగఁ | జనినం బూజించి దర్భ చాప నతఁ డిడన్.384
క. ఉపవిష్టుండై యుండఁగ నపరిమితానందమున మహాముని నిలిపెన్
నృపతిని భోజనమునకై | సపృతనుడై కౌశికుండచట భుజియించెన్.385
క. సుందరమై కనులకు నా |నందం బై యొప్పుచున్న నందిని యను గో
పుం దివ్యభక్ష్యభోజ్యము | లందీయఁగఁజూచి దాని నడిగిన మునియున్. 386
తే.గీ. హోమధేనువు దీని నే నొసఁగననిన | పాడి మొదవుల నొకవేయి పరగ నీకు
నిత్తు నిమ్మన నేది నీ విత్తుగాక |దీని నే నీకు నీనని మౌని పలికె.387
I
తే.గీ. బలిమిఁ గొనిపోవఁగలను నే పార్థివుండ | సైన్య యుక్తుండఁ జూడుము చాలకున్న
లక్షలకొలంది ధేనువు ల్కలవు నాకు | నీకు నిచ్చెదఁ గోరితేని మునివర్య.388
వ. అనిన నమ్మునీంద్రుండు. 389
తే.గీ. బలిమి ధేనువు గైకొన్న బలగములను | గూర్చికొనివచ్చినను నేను గోవు నొపగ
నేమిచేసినఁ జేయుమీ యిచ్చకొలఁది | ననినఁ గోపించి కౌశికుం డతిరయమున. 390
క. పట్టుఁడు పట్టుఁడు నందిని । నట్టిట్టుం బోవనీక యనిన ననుచరుల్
పట్టికొన నాక్రమించిరి | పుట్టెను గంపంబు మేన ముని కవ్వేళన్.391
ఆ.వె. ఏమిచేయువాఁడ విదె విన్నుఁ గొనిపోవు చున్నవాఁడు బలిమి నుర్వరేశుఁ
డేయుపాయమైన జేయుమీ యనుచును | గోవు జేరి తనదు గొడవఁ దెలుప.391
క. శంభుసముడై న మౌని య | దంభోక్తుల నాలకించి యావుం గినుకన్
హుంభారవ మొనరించుచు |సంభూత మొనర్చె దితిజ సైన్యము మేనన్.392
తే.గీ. నందినీనందనులు సాధనములుపూని । పోకుఁడదె నిలువుండని పొడిచి పొడిచి
కౌశికుని సేనఁ ద్రుంప నిరాశుఁడగుడు | నేగి యేకాకియై యిట్టు లేడ్వఁదొడగె.393
తే.గీ. అయ్యయో పాపియీమౌని యవనిపాలు | తేజు బ్రాహ్మణు తేజుతో దీటుకొనునె
యనుచు నిందించు నేఁ దపమాచరించి | బ్రాహ్మణుఁడనౌదు నని పంతపట్టిపూని394
తే.గీ. తపము గావించి తాపసత్వము వహించె | కాన రాజన్య నీవిట్లు కదసెదేల
సాహసంబునఁ దాపసుల్ శావశరులు కూడదీబుద్ధి మానుము గోత్రహాని.395
క. మునివరునికడకు నేగుము | జనవర సాధూక్తి నతఁడు శాంతిల్లంగా
నొనరించి సుదర్శను ని | వ్వనముననే యుండనిమ్ము వగపేటికిఁకన్.396
క. ఒకచెంపఁ గొట్టినను బా | లొక చెంపను నెత్రు బాలుఁ డోపఁగలఁడె నీ
కొక యపకారము చేయఁగఁ | గృపతో రక్షింపుమయ్య క్షితితలనాథా.397
క. రంజిల్లఁగ దయయే చే | యంజనుఁ గావలసినది యది యగుఁ గాకేలా
నెంజలి నృప దైవాధీ | నం జగదఖిలమ్మనన్ వినంబడదొక్కో.398
క. ఎందేవజ్రము తృణమగు | నందే తృణలవము వజ్రమగు దైవగతిన్
గుందేలు పులినిఁ బడఁగఱ | చుం దోమయె గజముఁ గూల్చు శూరత్వమునన్ 400
వ. అనిన విని యుధాజిత్తు మునివరు సన్నిధానంబున కరిగి యతని పాదంబుల కెఱఁగి యో
యయ్యా భవదాజ్ఞానుసారినై చనియెదనని యతని వీడ్కొని నిజనివాసంబునకుం బనివినియె.
నంత మనోరమయు సుదర్శను బాలించుచు నయ్యాశ్రమంబునన యుండె, అంత నొక్క
నాఁడచ్చటి మునిబాలకుండొకండు విదల్లుంజూచి క్లీబా యని పిల్చిన విని సుదర్శనుం
డందలి ప్రథమాక్షరంబు బిందుయుతంబుగాఁ గొవి పునఃపునస్మరణంబు సేయుచుండె.
నప్పటికతండై దేండ్ల బాలుండుగునుండి పిదప పదునొకండవ వత్సరంబు ప్రాప్తంబైనం
గని నచ్చటి మునివరు లుపనీతుంజేసి వేదాధ్యయనంబు సేయించి వెంట వెంట
ధనుర్వేదంబు సాంగంబు సేయించి నీతిశాస్త్రంబు గఱపినం గుమారుండు సకలవిద్యా
పరిపూర్ణుండై యుండె నంత.మూస:Float right401
ఆ.వె. శక్తి కామబీజ శక్తిచే నొకనాఁడు | రక్తభూషణములు రహివహింప
రక్తవసనయగుచు ర క్తవర్ణముతోడ | శక్తి వైష్ణవియె ప్రసన్నయయ్యె. 402
ఆ.వె. గరుడవాహనమునఁ గదలక కూర్చున్ |న వైష్ణవినిఁ బ్రసన్న వదనఁ జూచి
యలరు బాలుఁ గాంచి యచటనేనిల్సి య । య్యంబ ప్రోల్లసద్దయారసమున.403
తే.గీ. వాడిగల్గిన యమ్ములతోడ | విల్లు గత్తళంబును బొదియును గడకనిచ్చి
జయము పొమ్మనిపల్కె నా శక్తి దాని | విని ముదమ్మునఁ గైకొని వేడ్కనుండె. 404
వ. ఇది యిట్లుండ.405
మ. కలఁ డాశాదశకాంత కాంత విమలఖ్యాచంద్రికాసాంద్రుఁ డ
త్యలఘూగ్రోరు మహో మహా శఖిశిఖావ్యాపాదితారాతి రా
డ్బలనిస్తంద్రుఁడు వైభవేంద్రుఁడు మహీభారక్రియాశక్తి భా
సిల సద్బాహుయుగోరగేంద్రుఁడగు కాశీ రాజచంద్రుం డిలన్. 406
ఉ. ఆ ధరణీతలేంద్రునకు నాత్మజ సుందరి మందయాన బిం
బాధర చారుగంధి సుగుణాఢ్య వలాహక వేణి యామినీ
నాథసమాస్య నిమ్నతరనాభి తలోదరి కంబుకంఠి వి
ద్యాధరనారి నా శశికలాభిధ యొప్పై విలాస సంపదన్. 407
ఉ. వందిజనంబు లప్డపుడు వచ్చి సుదర్శను పేరు తీరు సౌ
రుం దగఁ జెప్పఁగా వినుచు దర్పకుఁ డేయఁగ నోర్వలేక యే
చందమునం దదీయముఖచంద్రునియం దమృతాంశుబృందమున్
గందు నటంచుఁ గోరికలు కట్టలకాగక పొర్లి పారినన్. 408
ఉ. అంతట నొక్కనాఁడు జగదంబ నిశాంతరవేళ వచ్చి సీ
మంతిని స్వప్నమందనియె మానిని నీకు వరం బొసంగెదన్
భ్రాంతివహింప కిప్డుడుగుమా యనఁ జూచి ముదంబుమీఱ న
త్యంతము సిగ్గునన్ శశరశాఖడ పల్కక యూరకుండినన్. 409
తే.గీ. తరుణి నీదు తలంపు సుదర్శనుండు | వరుడు గావలెననియె నే నెరుఁగనొక్కొ
వాడు నాభక్తుడతడె నీ వరుడు సుమ్ము | మనము నందిట్లు చింతిల్ల మానుమింక.410
క. అని పల్కిన దేవి వా | క్కున సంతనమంది లేచి కోమలి తనలో
నను గిలకిల నగికొనుచు | న్నన ుదల్లి యదెల్లగాంచి నవ్వుచు ననియెన్.411
తే.గీ. ఏమి నాతల్లి మున్ను నీ కింతమొగము | లేదు వికసించినది నేడు లేఁతఁదమ్మి
సూర్యదర్శనమునఁబోలె జూడ దీని | కొక్కకారణ మెద్దేని యుండుఁ చెపుమ.412
క. అనఁ దలవంచుక యేమియు | ననజాలక వెనుకఁరిగి యనుగు జెలియతోన్
తన స్వప్న క్రమమెల్లను | వినిపించెను జెవిని పెదవిపెట్టి గుసగుసన్.413
క. తల్లియుఁ జెలులున్ మిక్కిలి | యుల్లసిలిరి యట్టులుండ నొకనాఁ డా సం
ఫుల్ల సరోజేక్షణ దాఁ | దల్లికి నిట్లనియె మృదుసుధామధురోక్తిన్. 414
క. ఈనాఁ డుపవనభూమికి | నేనును జెలికత్తియలును నేగెదమమ్మా
మానక సెలవిమ్మనినఁన్ | మానిని లగ్గనిన నేగె మంజులవనికిన్.415
క. మొల్లలు జాజులు పొగడలు | మల్లెలు సంపంగిపూలు మఱి విరజాజుల్
కొల్లలుగఁ గోసికొనుచున్ । ఫుల్లసరోజాక్షి సూచె భూసురు నొకటన్.416
వ. చూచి.417
ఉ. ఎచ్చటనుండి యెచ్చటికి నేగెదు బ్రాహ్మణ నా నమస్కృతుల్
బుచ్చికొనుం డనంగ విని భూసురుఁ డో విమలాంగి నీకు నే
నిచ్చెద దీవన ల్తడయ దింతయు నీకు వివాహ సిద్ధియౌ
నచ్చుగ నీవిభుండు సుగుణాఢ్యుఁడు నయ్యెడు నంచుఁ బల్కినన్.418
క. విని సవ్వి యత్తలోదరి | వినయాన్వితయగుచుఁ బలికె విప్రవరా యెం
దుననుండి వచ్చెదవు నా | ఘనభారద్వాజుపల్లెకడనుండి యనన్.419
క. ఆ యాశ్రమమున నద్భుత | మేయది కలదనుచుఁ జంచలేక్షణ యడుగన్
దోయజలోచన వినుమా |తోయ మొకటి యచటఁ గలదు స్తుతిపాత్రముసూ.420
తే.గీ. కొమరుగలవాఁడు ధ్రువసింధు కొడుకు వాని । నామము సుదర్శనుం డెలనాగ యతని
పేరు సార్థకమేకాని వేఱుకాదు | పొడవులై యొప్పు బాహువుల్ వెడదఱొమ్ము.421
తే.గీ. అతనిఁ జూడనివారల యక్షు । లక్షులా సమస్తగుణంబు లయ్యజుఁడుగూర్చి
చేసెఁగాఁబోలు నవి జను ల్చెప్పుకొండ్రు అమ్మ యేమందు నామాట నమ్ముమింక 422
క. అతఁడా నీకేతగు నీ । వతనికినే తగినదాన వబ్జజుఁడును మి
మ్మతికించెనేని రత్నము | సతికించుటకాదె కనకమందు వరాంగీ. 423
వ. అని చెప్పి వ్యాసుండు వెండియు జనమేజయున కిట్లనియె.424
-: శశికళా స్వయంవరము :-
తే.గీ. బ్రాహ్మణుం డట్లు చెప్పి రాఁ బనివినియెను
ముద్దులాడియు నిజగృహమునకుఁబోయి
మరునితూపులు మఱిమఱి మఱియుఁదాక
దత్క్షణము చెలికత్తియ దాపు సేరి. 425
తరువోజ. చెలియరో నేనేమి చేయుదునమ్మ వలరేడు నామీఁద వైరంబుబూని
యలరుఁదూపులనేసె నంగముల్వడఁకు నిలచిన చోటను విలువంగఁజాల
వెలఁదులతో నాడ వినుగాయెనమ్మ యలసుదర్శను విధం బవనీసురుండు
తెలిపినప్పటినుండి ధృతిదూలె నాకు కలలోనఁజూచిన కంతుడే వాఁడు.426
ఉ. ఆకలి లేదు నిద్దురయు నట్టిదయయ్యెను శారికా శుకీ
కోకిలలం గనుంగొనఁగ గోరదు నెమ్మన మేమి చెప్పెదన్
గేకులు చెంతచెంతలకుఁ గేరుచు వచ్చెడి నేలరొప్పు మీ
కూఁకలు వీనులం బడినఁ గుట్టిన సూదుల వోలెఁ దోఁచెడిన్. 427
క. ఒయ్యారంబుగ నంచలు | బయ్యెద చెఱఁగంటి తిరుగు వనితా యివియే
దెయ్యాలై తోఁచును నా। కయ్యో దూరముగఁ దోలుమమ్మా వీనిన్428
ఆ.వె. నిన్న రేయినుండి నెలఁతరో నావంత। యెంతయని వచింతు నెరుఁగ నెప్పు
డిట్టిపాటు లిపుడు పట్టె నే నేమందు | మందు దెలసెనేని మగువ చెపుమ. 429
ఆ.వె. చందమామఁజూచి సామిమోమనుకొందు మరియు బయలకేగి మండుచున్న
పెద్దయెఱగలంచు బెగ్గిలి పయ్యెదఁ జాటు జేసికొందుఁ జంద్రవదన.430
ఉ. తల్లికిఁచెప్ప సిగ్గు మరి తండ్రికిఁ జెప్పఁగ నంతకంటెనున్
బెల్లగు సిగ్గు నా యునికి భీతమృగేక్షణ యేరితోడ నేఁ
బల్లుగదల్చి చెప్పెదను బాయక నా యెడ ప్రేమతోడ రం
జిల్లెద వీవయంచు నిటు సెప్పితి నాగతి యాలకించుమీ. 431
శా. అయ్యో పూవులదండయంచు నిడితే యార్తన్ మహాసర్పమే
యయ్యో గంధమటంచలంది తిని కాదమ్మా విషం బిద్ధి యే
నుయ్యో నాకిఁక మేడలేల కలవాణు ల్వీణలేలా అప
చ్ఛయ్యాసౌఖ్యము లేల నన్ విడువుమీ చానా సరోజాననా.ం 432
క. జనవరబాలునిఁ జూచిన | దనుకన్ నే నిలువఁజాల తరుణీ నే నా
తని వలఁచి వేరొకఁడగు | మనుజవరునిఁ దలఁపఁజాల మనమునఁ జెలియా.433
ఆ.వె. జనకుఁ డిపుడు పెండ్లి సలుపండ యేనియు | నేమిసేయుదాన నేన సాహ
సించి రాజపుత్రుఁ జేరి వరించెద | ననిన నవ్వయస్య యది యెఱింగి.434
తే.గీ. నెచ్చెలీ చింత నీకేల నీజనకుఁడె | యాసుదర్శను నినుఁ గూర్చునట్టివాఁడు
వేగిరంబేల యని చెప్పి వేదురుడిపి |యతివ పరితాప మొక్కింత యడఁచె జెలియ.435
వ. అని చెప్పి వ్యాసుండు. 436
క. ఒంటరి ధనహీనుండున్ | బంటొక్కఁడు లేడు విపినవాసంబు దినన్
వంటకములు ఫలములు నిటు | వంటి మగనిఁగోరె నహహ వనితామణి తాన్437
క. అతివకు వాగ్బీజంబే | గతియై యుండంగ నేమికావలె దేవిన్
సతతంబును జపియించున్ | వితతఫలము లొసఁగుచుండు విశ్వాంబ దయన్.438
తే.గీ. ఆ సుదర్శను గన నిషాదాధిపుఁడును | శృంగబేరపురమునుండి చేరి నాల్గు
గుఱ్ఱములతేరి నొకదానిఁ గూర్చి తెచ్చి | సకలసాధనములతో నొసంగెఁ బ్రీతి.439
క. ఎఱుకు సుదర్శనుఁ జెలిమికి | మఱిమఱి ప్రార్థించి యతని మర్యాదలకున్
గర మరుదందుచుఁ జనియెన్ | బురమునకును నంత రాజపుత్త్రుఁ గని మునుల్.440
ఆ.వె. రాజపుత్ర! నీకు రాజ్యంబు సేకురు | కొన్ని నాళ్ళలోనఁ గొఱఁతలేక
యీవు దేవికరుణ నెంతయు ధన్యుండ | వైతివంబయే సహాయ నీకు.441
క. అని యాతనిఁ గొనియాడుచు | జననికడకుఁబోయి నీదు సత్పుత్త్రుం డో
వనజేక్షణ భూపాలుం | డనుకొనుమా చింత మానుమమ్మా యనినన్. 442
ఆ.వె. మీ రమోఘవాక్ప్రసారులు మీమాట | తప్ప దదియుఁ గాక తపసులార
వీఁడు మీకు దాసుఁ డీడెవ్వఁ డితనికి | నైన మదిని సంశయంబు గలదు.443
క. నాకొడుకు భూమిపాలుం | డేకరణిం గాఁగలండొ యెఱుఁగను సైన్యం
బా! కోశంబా! గుఱ్ఱాలా! కరులా! సచివులా! సహాయనృపతులా!444
క. అయినను మీదీవనలే | జయములు నిశ్చయముసుండు సర్వముఁ గూర్చున్
భయమేమి మీరలుండఁగ దయతో మముఁ బ్రోతురనుచుఁ దలఁచెద నెపుడున్. 445
వ. అని పలికి వ్యాసుండు జనమేజయుంజూచి నృపాలవర్యా! యా సుదర్శనుఁడు నిషాద
దత్త రథంబు నెక్కిన నక్షౌహిణీ సమావృతుండై నట్ల మహాతేజంబుతో నుల్లసిల్లువాఁడు.
మంత్రంబు కలిమి దేవిప్రసన్నయై కామంబులం గొనసాగఁజేయుచుండు. జగదంబాను
గ్రహంబు గలవారికి నసాధ్యంబులున్నె యని చెప్పి మఱియు.446
క. దేవినిఁ జిత్తంబున నిడి | యేవెంగళి తలఁప డట్టిఁడే దుర్భాగ్యుం
డై కడువంతలఁ జిక్కున్ | చీ కనరా దట్టివాఁడె చేటుల నొందున్447
క. ధృతియుం గీర్తియు లక్ష్మియు | నతితరశక్తియును సర్వ మంబయకాదే
వితత ప్రపంచమునకున్ గతియును మతియు నని నమ్ము గట్టిగ మదిలోన్.448
క. హరి హర విధి శిఖి రవి శశి | సురవర మరు దాదితేయ సూర్యజ ధనరా
డ్వరుణాదులు భగవతిఁ గొ| ల్తురు నరులు మనమున దేవిఁ గొలువం దగదే.449
క. పరమాత్మ నెవఁడు దెలియున్ | బరికింపఁగ దేవి కరుణ వడయకయున్నన్
సరసీజభవాండంబుల | విరచించిన తల్లి యొకతె వేఱే కలదే.450
చ. తరుణుఁడు రాజపుత్రుఁడు సుదర్శనుఁ డచ్చట దేవిఁ గొల్చుచున్
ధరణికి రేఁడనై యేపుడు చాల్చెద పట్టమటంచు నుండఁగాఁ
దరుణి సుబాహుకూఁతురు సుదర్శను నెప్పుడు సూతునంచుఁ దా
మరిమరిఁ జింతిలం దొడఁగె మన్మథుబాధల కోర్వశక్యమే.451
ఉ. అంతసుబాహుఁడాత్మభవ యాంతరముం గ్రహియించి యెంతయున్
స్వాంతమునందుఁ గొంతవడి యారసి వేగ స్వయంవరంబు సా
టింతునటంచు శాస్త్రము పఠించినవారలఁ బిల్వనంపి
యత్యంత ముదంబునన్ విధులు నారసి యిట్లను నాత్మలోపలన్452
వ. స్వయంవరంబులు మూఁడు. అందు మొదటిది యిచ్ఛాస్వయంవరము, రెండవది పణ
స్వయంవరము, మూడవది శౌర్యశుల్క స్వయంవరము. ఇం దిచ్ఛాస్వయంవరం బుత్త
మంబుగావున నట్లు సేసెద నని యూహించి శిల్పులం బిల్పించి మంఛంబులు,నాస్తరణ౦
బులును సభ్యమండపంబులును నేర్పరపించి నానావిధంబులగు వివాహసంభారంబులు సమ
కూర్చి స్వయంవర మహోత్సవంబునకు నెల్ల యెడలఁ బరామరిక కల్గి యున్నతరి శశికళ
తన ప్రాణసఖిం బిల్చి రహస్యంబున నిట్లనియె.453
తే.గీ. కలికి నీకంటే నేకాంతకార్యములకు | నేరు గల రదికావున నిపుడ నీవు
పోయి మాయమ్మతోడ నైపుణ్యమెరయ | నిట్లనివచింపఁగదవమ్మ మృదుపదముల.454
క. నేను సుదర్శనుఁడనెడిమ | హీనాయకసుతునిఁదక్క యితరుని మదిలోఁ
బూని వరియింపననుమీ | మానిని యాతండె నాకు మగఁడని యనుమీ.455
క. అనినన్ విని చెలియ సుబా | హుని నెలఁత విజనవితర్ది నుండం గాని యో
వనజాక్షి నీతనయ నీ । కునుఁ జెప్పుమటంచుఁ దెలిపెఁ గొన్నిపలుకులన్ 456
క. భారద్వాజాశ్రమమున | వీరుండు సుదర్శనుండు విడిసె నతండే
నా రమణుఁడు వరియింపను | వేెఱొక్కని నంచు జెప్పె విను మిది నెమ్మిన్ 457
తే.గీ. అనుచుఁ జెప్పిన చెలిపల్కు లాలకించి | పెనిమి టింటికి రాఁగానె వినయగరిమఁ
గూతుమాటలు విన్పింప నాతఁ డధిక |విస్మయంబంది ముక్కుపై వ్రేలిడికొని. 458
తే గీ. వింటె వైదర్భి యారాచగుంటఁ డడవి । నొంటి నిర్ధనుఁడై తేజముడిగి రాజ్య
పదము వోఁగొట్టుకొని యుండె వాఁడు నీకు | దగఁడు స్థితిమంతులగు భూమిధవులు లేరె.459
క. అని శశికళకు జెప్పుము | వినునట్టులు బోధజేసి పిన్నతనము నీ
కును మేలుగోరి చెప్పితి । ననుము సుదర్శనునిమీది యాస లుడుగుమీ.460
వ. అని కాశీరాజు సుబాహుఁడు తన భార్యయగు వైదర్భితోఁడ నీ కుమారికయగు శశికళకుం
జెప్పుమని పలికె నని చెప్పి వ్యాసుండు జనమేజయునితో నిట్లనియె.461
క. పెనిమిటి జెప్పిన రీతిన్ | దనయం దగఁ జేరి ప్రేమ దయివారంగా
నను నా సుదర్శనుడు నీ | మనమునఁ గోరంగరాని మనుజుఁడు వింటే.462
క. హితమెరుగక నన్నును నీ । పితనున్ వగఁ గుందఁజేయఁ బ్రీతియే నీకున్
మతిఁ దెలియక నిర్ధను వన | గతుఁ గోరితినంచుఁ దెలుపఁగాఁదగునే సుతా.463
తే.గీ రాజ్యమా పోయె దౌర్భాగ్యరాశి యతఁడు । ఆశ్రయము లేదు ధనము లే దన్ని గతులు
బేదయై బాంధవులనెల్ల విడిచి యాకు | అలములం దించుఁ దల్లితో నడవి నుండె 464
ఉ. ఎందఱు రాజపుత్రులు సమిద్దచరిత్రులు చారుగాత్రు ల
స్పందగుణాంచిత స్తవనపాత్రులు సజ్జనమిత్రు లున్నవా
రం దొక సుందరుం గొనఁగ హర్షము మాకగు నీజగంబులో
నందఱు మెత్తు రియ్యది యథార్థము మానుము ఛీ సుదర్శనున్. 465
చ. యువతి సుదర్శనాఖ్యునకు నొక్కఁడు భ్రాత గలండు వాఁడపో
యవనికి రాజు వింటె మఱి యాతనిఁ జంప యుధాజిదాఖ్య భూ
ధవుఁ డెపు డెప్పు డెప్పుడని తాఁ గనిపెట్టుకయుండె వాఁడె యా
హనమున వీరసేను నుసు రార్చెను మంత్రుల లోఁగొనెన్ వెసన్. 466
వ. అనినఁ దల్లిమాటలు విని కొండొకవడి చింతించి తలపంకించి మనంబు గట్టిపరచుకొని
శశికళ తన తల్లితో మెల్లన నిట్లనియె. నోతల్లీ! సుదర్శనుం డెంతనిర్ధనుండైనను
వనవాసియైనను నతని నామనం బిదివరకె వరియించియున్నయది. శర్యాతివచనంబునం
జేసి సుకన్య చ్యవనుని వరియించి పతిశుశ్రూషాపరయై ప్రవర్తించినట్లు యేనును భగవతీ
సమాధిష్టక్రమంబు విడువక సుదర్శనుం భర్త గావించుకొనియెదనకాని యితరులం గోర
నొల్లనని చెప్పి తల్లి కనేక నిదర్శనంబులు సూపిన నాపె తనయ నొడంబరపంజాలక
యాపె దృఢనిశ్చయంబు తన పెనిమిటి కెఱింగించె నంత.467
క. సరసీరుహనయన శశికళ | వరుడైన సుదర్శనునకు వార్తఁ దెలుప భూ
సురు బుద్ధికుశలు నొక్కని | దరికిం బిల్పించి మ్రొక్కి తా నిట్లనియెన్.468
ఉ. భూసురవర్య కన్నియను భూవరవంశముదాన నీకు నా
యాసము నిచ్చుదాన వినుమయ్య సుదర్శనుఁడున్న యాశ్రమా
వాసము సేరి వేళఁగని వారలు వీరలెఱుంగకుండ నా
కోసరమై వచింపు మొక కొన్ని రహస్యము లేను చెప్పెదన్. 469
ఉ. నాకు స్వయంవరమ్మనుచు నాయన దాఁ ప్రకటించె వత్తు రీ
లోకమునందునున్న జనలోకపతుల్ ననుఁ జూడవత్తు రే
నీకయియున్నదానఁ బరమేశ్వరి వాక్యముబట్టి కాన నీ
రాకనుగోరియుంటిని ధరావర రమ్ము నినున్ వరించెదన్.470
ఉ. ఈవటురాకయున్న విషమే గతియో యుఱిత్రాఁడె ప్రాప్యమో
పావకుఁడే యుపాయమొకొ బావియె మృగ్యమొ మండలాగ్రమే
పావనమైన మార్గమే కృపాకర యట్టిద కాక యన్యగో
త్రావరుల న్వరింప నిది తథ్యము నావచనంబు నమ్ముమీ.471
చ. మనసున వాక్కునం గ్రియను మానవనాయక ని స్వరించితిన్
వినుమికఁ దల్లిదండ్రుల ప్రవేశము నావరణంబునందు లే
దని మదీనెంచుమా త్రిజగదాదిమశక్తియ నీకు నాకు బో
ధనమొనరించెఁ దప్పదది తప్పదు మేలగుఁ బ్రాణనాయకా 472
వ. అని యిట్లు విన్నవించుమని బ్రాహ్మణునకుం జెప్పి దక్షిణ యిచ్చి పంపిన నతఁడు
భారద్వాజాశ్రమంబు ప్రవేశించి సుదర్శనన కేకొంతంబున శశికళాసందేశంబు సెప్పిన
నతం డలరె . నంత బ్రాహ్మణుందు తిరిగివచ్చి శశికళకావృత్తాంతంబు దెలిపి యింటికిం
జనియె నపుడు 473
క. శశికళ స్వయంవరమునన్ | గుశలత జూడన్ సుదర్శనుఁడు పూని నిరం
కుశుఁడగు ముని యానతిగొని | విశదస్థితినున్న తల్లి విని యిట్లనియెన్.474
క. కొండికపు నీవు బాసట | యొండుం గనరాదు నీవు నొంటి మనుజరా
ణ్మండలి నుండఁగలవె నీ | కండయు దండయును నెవ్వరయ్యా తండ్రీ.475
తే.గీ. ఆ యుధాజిత్తు నిను గూల్చ నన్నిగతులఁ |జూచుచున్నాఁడు ని న్నాడఁ జూచెనేని
ఊఱకుండెడివాఁడు కా డొక్కనిన్నుఁ | గన్నదానను నేను జూడుమన్నయిపుడు.476
తే.గీ. శశికళ నినున్ వరించెనే సమయమిదియె | తనయ నీకిష్ట పెండ్లేల తనువునందు
బ్రాణములు నిల్చియుండైనా బలుసు కూర | దినియయిన బ్రతుకగవచ్చు వినుము మనుము.
477
వ. అనిన విని సుదర్శనుండు.478
ఉ. రాచకులంబుగాదె నగరా ననుఁ గాంచి స్వయంవరంబు దా
జూచుటకైన రాడనుచు జూడుము నాదు మగంటిమి భువిన్
గోచనుగాను గన్నియనుగొం చనుదెంచెద లోకమాత నన్
బ్రోచెదనంచుఁ గంకణము పూనెను నాకు జయంబు గల్గెడున్.479
ఉ. తల్లి భయంబుమానుము యుధాజితు నే నొక లెక్కజేయ నీ
యల్లము చల్లఁగాఁ బగఱ నోర్చి సుబాహుని కూతుఁ చెచ్చి నే
నల్లుడనౌదు ముద్దు వగలాడిని గోడలిఁ జేసికొమ్ము నేఁ
గల్లలువల్క దేవి ననుఁ గాచు సదా కరుణార్ద్రచిత్తయై. 480
చ. అని రథమెక్కి యేగునెడ నాత్మజుఁగాంచి మనోరమాఖ్య దీ
వన లొసగెన్ బదింపదిగ వారక కంటిరె యీ జగంబునన్
జననినిఁబోలు చుట్టమును శక్తినిపోలిన దైవ మెందునుం
గనముకదా నిజప్రజ సుఖంబును గోరుచునుందు రెప్పుడున్.481
సీ. అగ్రమందును నిన్ను సంబిక రక్షించుఁ బార్వతి వెనుకఁ గాపాడుచుండు
విషమపథశ్రాంతి విడిపించు వారాహి దుర్గంబులందును దుర్గ ప్రోచు
గలహమందును నిన్నుఁ గాళిక యప్పరమేశ్వరి దేవి పాలించుచుండు
మండలంబున నిన్ను మాతంగి గనిపట్టు సత్స్వయంవరమున సౌమ్య మనుచు482
తే.గీ. భూపమధ్యంబున భవాని పుష్టిజేయు . గిరులు గిరిరాజ్కు పరిక యవయు నిన్ను చత్వరంబులఁ జాముండ జాలిచలఁచు | కాననంబులఁ గామగ పూను గరుణ విను వివాదంబులను వైష్ణవియు భరించు. క. అని దీవనలిచ్చియుఁడా॥ మనమునఁ గంపిల్లి పత్ర మానక యేసుజా నిను వెంబడించివచ్చెద నిమ నే నెడఁదాని యొక్క నిమిషము నోర్వణ. క. అని యాకెయు వాత్రేయియుఁ బనిపడి రథముపయినెక్కి బ్రాహ్మణులొని దీ పిన కొసఁగ బయలువెడలిరి | ఘనవారాణసికి శీఘ్రగమనమున స్మపా, తే.గీ. కాళిం జేరి సుబాహుచేఁ గాంచి ర ॥ పూజనంబుల విడిచిని బోనికాంత్ర సకల పరిచర్యలనుజేయు జాకి లేకి నెల్ల సమకూర్చె వారి జన్వీరుఁ చెలమి. క. తన క్షౌహిత్రునితోడను | ఘనుఁడు యుధాజిత్తు విచ్చె గర్యోచతుఁ దా తని రాక వినీ సుదర్శినుఁ చనుమానములేక జీవి నర్పించె నొగి I M 197 ويل A PR M> C B వ. మఱియు నచటికి శశికశాస్వయంవరంబునం జయంబు గాంక్షించి కూవాధన తీయ మద్రభూపాలుండును సింఘదేశీ పాలకుండును మహిష్మలి భూపిల్లమందును పొంచాల దేశపతియుఁ గర్ణాట మహివల్ల ధిండును జో ధరాకాంతుండును పై దిర్చుందును మొదలగువా రఱువనిమూ రణుల సేనలతోఁ గాశికాపురంబు నింతంజేసి రక్షియుం గాక స్వయంవరదర్శన సతూహలమాననురై వచ్చినవా రసంఖ్యాకులై పెట్టణంబున నందంచి విడిసి రంత నా రాజపుత్తులలోఁ గొండు తమలో తాము వినోదార్థంబులగు సంభాషణంబుల నిట్లని చెప్పికోసం కోడంగెర్, 88 తే.గీ. భయములేక సుదర్శన చాలఁ డిచట తిరుగుచెంచినవాఁడు స్వయంవరమ్ము నందు జయమందునో లేక యన్యులవలె నోరు వెఱుక వింతం గనోన వలచియె. రదార తే.గీ. మ్రింగ మెచుకులేదు మీసాలరాయ సం॥ పంగినూనెయన్న దంగిపోతు నడవిఁ గాయ లాకు లారగించె నిరు | పేద కాశిరాజు బిడ్డగో3, క. ఏకాకియగుచు వచ్చెను గాకుతుఁడు దల్లి ఁ గూడి కాల్బలమైన లేక రథమెక్కి యిచ్చటి కేకారణమొక్కొ కన్నె యితనిం గనునే, క. ఎంతెంత లేసిరాజులు పంతంబులతోడ నిందు వచ్చిరి సేనా + సంతతులతోడ వారల నింతి వరింపక వరించునే యీ పేద ఉ. మాటలలోనఁ దాను చౌక మాటయటంచు యుధాజీ దంతలో నేటికిఁ జూడుఁడ్ కొమరు నేనకదా వధియించువాఁడ ము మ్మాటికిఁ గన్నియం బరులమానినిఁ జేయుదునే కనుండు నా ధాటి యెరుంగ రీరలు సుదర్శనుఁ డుండునె యెల్లి యిచ్చటగా. 198 శ్రీ దేవీ భాగవతము చ. అన విని కేరళాధిపుఁడు హా : తగునా బుటులాడ బాలునిజ హనన మొన ర్త యుద్ధముననం చిది యట్టి స్వయంపుమ్ముకా దని వినలేచె కన్య తన యాత్మను మెచ్చినవానిఁ గోడటే పని మఱియొండులేదు చలపట్టిన నేమి ప్రయోజనమ్మగుణా, Y తే.గీ. కోసలాధిపుకొడుకు నాకుత మ ఉతఁడు ! వాఁడు మనయందఱికి సాటివాఁడకాడె న్యాయమునుమోనీ రాజ్యంబు రాయఁజేపీ | మరిలఁ జంపెదనందునా మదముకొలది, MY ఆ.వె. తప్పులేనివాని దండింతుననువాడు | సీతమారినట్టి నీచుఁడందు దానిఫలము వాఁడు తప్పక పొందఁడే | దైవమొకటిలేదె ధర్మమరియ. 5. ధర్మించి బయమొందు న ధర్మము జయమండదెందుఁ దలఁపఁగ సత్యం దర్మిలి జయించు ననృతము | శర్మద వెన్నఁడుసుగాదు జననక వింటే. క. పాపమతివిడిచి బ్రతుకుము | నీపోటిడుకాఁడె వాఁడు నీచులకెందుకా కోపంబు గర్వము దయా | లోపము నాశాపిశాచ లోలత గుణముల్ . క. నీకును క్షౌహిత్రుఁడయని | చుకోమనిఁ జూడు ఒంక నతఁ డిటువచ్చెవా నీకు సంతోషమకా యాకన్నియ వానిభార్య నగుదు నటన్న. క. ఎందలు వచ్చిరి భూపతు ) అందజీలోఁ గొఱఁతమేమి యతనికి వినుచూ యందమె లేదో క్షత్రియ సందిమండే కాడొ చెప్పు సకలోకపతీ. క. ఒక వేళ కన్య పీనికా ప్రకటించి వరించెనేవి మనమానసముల్ వికలంబులు కానేలా ! బెకబెకలాడంగనేల ధేశములవలెదా. ఆ.వె. వధువు మనసుపిచ్చు వరుని వరించును | నీవు నేను గూడి నీల్లులాడ నలుగు కవల నివల నవ్వుకొనుటకాక ఫలములేదు విడుము పాపబుద్ధి. క. అను కేరళనాథుని నీ | తిని వినియును గనలి దుర్మతియగు యుధాజి త్తను నోయి కేరళేశ్వర | విను నీనీతులిని వంద వినవలయుఁజుమీ. క. చూనవనాథుల సభలో సీనీతులు పనికిరావు నిజ మిటు వినుమా మానీతులగు నృపులుండం | గా నీచునిఁ గన్నెఁ గోరఁగా నరంటే. క. నీకే మనమునఁ డోవెజ్ గా ఓ సీతివినువాఁడు కందే సింగం . 1 బాకటఁ గొసఁడోపునెఱ | గో కోయని కొంకనక్క కొనినట్లయగుకా. 珍 బలమగు వేదము ద్విజునకు బలముగు సింగాణి మనుజపతులకు నా మా టలలోన ధర్మ మణువుం గలడే విసనేర్చువాఁడు గలఁడే నిచటగా.
XFE OFE 303 క. బలముగలవాఁడే కన్నియ తృతీయ స్కంధము: బలిమం గొనిపోవుగాక బలహీనులకుగా ఫలమేమి కుక్క మీ నృప్ | కులమునకు బలమెకాజ్ కుంభిని నెందుకు. 199 01.01 శా. రాజన్యుండు లణస్వయంవరము విభ్రాజతిం ఒన్న కీ యోజం బూనుట రాజధర్మమగునే యుద్ధమ్ము గావింప కే రాజేగుం దన తొంటిదారిని వృథా ప్రాగల్భ్యము ల్మానుమీ రాజై పుట్టుట వీరధ్ముములు పోరం జూపఁగా నృపా. వ. ఇట్లు స్వయంవరంబుకై వచ్చిన రాజులతోఁ బరస్పర వివాదంబులా సుబాహుండు మంత్రిమఖంబుల నెల్ల రాజుల సభామధ్యంబునకు రండని వర్తమానంబు పంపిన వారలందరు రచ్చకు విచ్చేసియున్న సమయంబున వారణాశీ విధంగాంచి తత్త్వదర్శులగు కొండలు, మానవేంద్రా॥ భవిత్కుమారీకత్నంబు నెవ్వని కీఁదలఁచితివి? నీయభిప్రాయంబు విన్నవించామనిన వారలంజూచి వినయపూర్వకంబుగా విదాహకం ' పుట్టెనని విని తే.గీ. తనయ మనమున నా నిదర్శను వరించే ) నెంతఁజెప్పిన వినము నా కేమిఱుట్టి కన్యకుశప కర్తినియుఁగాడు కనుకోరి యున్న యాతఁడు దాని కర్ణుండుకాడు. తే.గీ. అంత సంపన్న భూమిజు అతనిఁజేరఁ బిచ్చిన మదర్శినుండి మతి ఫీలిలేక శాంతి నేకాకయై వచ్చి సరసనిలువ జనపరులు పల్కి ఈ సుదర్శనునితోత. చ. పిలువని పేజటంబనక గీతల కి ఎటువచ్చి తేరు నిజా $ బిలిచిన యొంటివయ్య భటబ్బందము లేక సహాయసంపద వెలయక వచ్చి నీవు తల పెట్టిన దెయ్యది సేయ భూపకు ర్దేశములతోడ పిచ్చిలేకనా రణరంగమునందుఁ బోరిఁగణ. ఉ. వచ్చెను నీదు భ్రాత బలవంతుఁడు పోరున గెల్చువాఁడయె చెచ్చెఱ నయ్యుధాజితు విశేషసహాయుఁడు వానిఁ జూచితే వచ్చితిపో సరే మరలి వచ్చినదారిన పోవువాఁడవా క్రచ్చఱ నిచ్చట న్నించి వ్రాతకొలంది నటింపఁ జూతువా. వ. అనిన విని సుదర్శనుండు, చ. బలగము లేదు చుట్టములు పక్కములేరును లేమి భూపతు ల్కలకు సహాయుంచుఁ బలుకళా బనిలేదు ధనంబు లేశముతా దలఁపఁగరాదు కాశిపతి నందని కిపు స్వయంవరమ్మటం చరుచు వచ్చినాఁడఁ దగనా పగనా తెగనాడనేటికిు. CE Xco
- 3 200
వ. అది యట్లుండనిండు. దేవీ భాగవతము క. జగదీశ్వరి స్వప్నంబున నగపడి ప్రేరేప నిచటి కరుదెంచితి నేఁ దగ దేవికరుణ యుదయిం | పఁగ నవ్విన నాపచేలు పండకయున్నే. 1 తే.గీ. కురువఁబోయెడి కూర సొం పడుగనేల నేమి కానున్నదో చూత మిండఱమును దేవి నాపాలఁ గల్గెనే వేపు రవని పాలకులు వచ్చియును నన్నుఁ బట్టలేరు. ค F క. డైవాధీనుఁడనై నే నీ విధమున నున్నవాఁడ నేమైననుఁగా నీ పిచ్చునవీయ వచ్చు. గోవునదియ పోవు రిత్తఁబోవఁగ నొల్లు. BOX X08 వ. ఇట్లు చెప్పిన సుదర్శను మాటలు వినిన యజ్ఞులగు కొందరు అబ్బా ! యిబ్బాలున కెంత సిబ్బరంబని యబ్బుకంపడి యిట్లనిరి. తే.గీ. నీవు చెప్పినయస్యనూ నిక్కు వంబు | అయిన నుజ్జయినీనాడుఁ డతరి చందఁ గాచుకొనియున్నవాఁడు ఓ కాపుగోరి | చెప్పతమి యిచ్చపెంబడిఁ జేయు మనల. ఉ. సత్యము మీద స్నేహమునఁ జక్కటి సెప్పుట యుక్తమేకదా నృత్యయ మేమియున్నదని యావెద లోకమునందు మృత్యురా హిత్యము నొందువారు కలచే యెక్క దేవ్వనిచేత నెవ్వఁడే కృత్యమున న్నశించు నది మెల్లను జేయును గాల కర్మముల్, క. సంచితమును ప్రారబ్ధంబంచును నాగామియంచు నాత్మవిములు దా రెంచిన త్రివిధముగా స య్యంచిత కర్మమును మానవాధిపులారా, I తే,గి కాలకర్మన్వభావసంగతుల జగము | వితతమాలను మానుషకృతము నడ్యువ దైవమేనియు నేరఁడు దాని కొలుకు నేర్పడిన కాల మది సంభవించుదనుక. క. ఎస్ సింగముచే జనకుడు 1 మరిపై యుధాజిత్తుచేత మాతామహుఁడు కా వడిఁజచ్చు రక్షితుఁడు భువి : విడిసి యరక్షికుఁడు బ్రతుకు వేయేండ్లు దగ౯. సీ. పూర్వాకంబరీ పుణ్యమో పాపమో భోగింప కూటకేపోదునుండు తాను చేసినవానిఁ దాన భోగింపుడు దుఃఖింప నండేమి దొరుకు వృధయ తన కర్మఫలయోగమునఁ గీడు వాటిల్లఁ బరలతో సల్పుండు పగవహించు పై రంబు శోకంబు భయమే నెఱుంగక చనుదెంచినాఁడ నిశ్శంకమతిని తే.గీ. నాకు భయమేమి యిప్పు దేకాకిననుచు నెంచజేందరు పలుగాకు లిందు మాల కాలై యనిపేటలై కడకుఁ గాంధీ ॥ శ్రీకు లయ్యెదరో దేవిచేత బిరప. తే.గీ. ఆ యుధాజిత్తు పై నాకు నాలుకలేదు చెరిగి నామీద నయ్యుధాజిత్తునకును నలుకయేటికి నూఱకే కలిగెనేని । ఫలమనుభవింప కంతంతఁ బారఁదరమె. g f పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/244 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/245 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/246 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/247 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/248 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/249 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/250 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/251 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/252 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/253 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/254 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/255 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/256 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/257 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/258 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/259 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/260 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/261 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/262 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/263 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/264 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/265 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/266 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/267 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/268 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/269 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/270 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/271 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/272 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/273 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/274 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/275 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/276 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/277 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/278 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/279 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/280 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/281 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/282 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/283 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/284 పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/285