శ్రీమానినీ మనోహర
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
పూర్ణషడ్జము రాగం - దేశాది తాళం
- పల్లవి
శ్రీమానినీ మనోహర - చిర కాలమైన మాట యొకటిర;
వేమారు బల్క జాలర
- అనుపల్లవి
శ్రీమంతులౌ నీ సోదరులు - జేయు రీతి పాదసేవ కోరితిని
- చరణము
ధర్మాద్యఖిల పురుషార్థములు - దాశార్హుని రూపమబ్బిన
మర్మంబువేరె యున్నది - మన్నింపుమిక, త్యాగరాజనుత !