శ్రీనారద నాద సరసీ రుహ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
కానడ రాగం - రూపక తాళం
- పల్లవి
శ్రీనారద ! నాద సర - సీరుహ భ్రుంగ ! శుభాంగ
- అనుపల్లవి
దీనమాన రక్షక ! జగ - దీశ ! భేష సంకాశ
- చరణము
వేద జనిత నర వీణా - వాదన తత్వజ్ఞ !
ఖేద కర త్రితాప రహిత ! ఖేచర వినుత !
యాదవ కుల జాప్త ! సదా - మోద హృదయ మునివర్య !
శ్రీద త్యాగరాజ వినుత ! శ్రీకర ! మాం పాలయ