శివశివ శివయనరాదా
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
శివ శివ శివయనరాదా...ఓరీ (రాగం: పంతువరాళి) (తాళం : ఆది)
పల్లవి: శివ శివ శివయనరాదా...ఓరీ ! శివశివ శివయనరాదా?
అనుపల్లవి: భవభయ బాధలనణచుకోరాదా?
చ:కామాదుల తెగ కోసి
పరభామల పరుల ధనముల రోసి
పామరత్వమునెడబాసి అతి
నీమముతో బిల్వార్చన జేసి.. శివ
చ:సజ్జన గణములగాంచి ఓరీ
ముజ్జగదీశ్వరుల మతినెంచి
లజ్జాదుల దొలగించి తన
హ్రుజ్జాలమున తా పూజించి.. శివ
చ:ఆగమముల నుతియించి
బహు బాగులేని భాషలు చాలించి
భాగవతులతో పొషించి ఓరీ
త్యాగరాజ సన్నుతుడని యెంచి..శివశివ శివయనరాదా? https://www.youtube.com/watch?v=zQ05vleQZOQరంజని గాయత్రి పాడిన ఈ కీర్తన వినండి