విన నాసకొని యున్నానుర

త్యాగరాజు కృతులు

అం అః

పల్లవి

విన నాసకొని యున్నానుర - విశ్వరూపుడ ! నే | | విన | |

అనుపల్లవి

మనసారగ, వీనుల విందుగ - మధురమైన పలుకుల | | విన | |

చరణము

సీతా రమణితో నోమ - న గుంట లాడి గెల్చుట

చేతనొకరి కొకరు - జూచి యాభావమెఱిగి, సా -

కేతాధిప ! నిజమగు ప్రే - మతో బల్కుకొన్న ముచ్చట

వాతాత్మజ భరతులు విన్నటుల, త్యాగరాజ సన్నుత ! | | విన | |