వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 10

పాత చర్చ 9 | పాత చర్చ 10 | పాత చర్చ 11

నకలు హక్కులు తీరిపోని పుస్తకాలపై నిర్ణయం

మార్చు

నకలు హక్కులు తీరిపోని పలు పుస్తకాలు తెవికీసోర్స్ లో ఉన్నాయి, వీటిని ఉంచటానికి డిఎల్ఐ ప్రాతిపదికగా అర్జునరావు ఉంచారు. అలా పొరపాటున నకలుహక్కులు తీరిపోని పుస్తకాలను వికీసోర్స్ ప్రధాన పేరుబరి నుండి తొలగించాలి అని ప్రతిపాదిస్తున్నాను. పేజీలు తీసివేసినా, అవి నిర్వాహకులకు అందుబాటులో ఉంటాయి కనుక భవిష్యత్తులో వాటిని తిరిగి రప్పించవచ్చు (ఆయా పుస్తకాల నకలు హక్కులు తీరిపోయాక). తీసివేయుటకు నోటీసు చేర్చి వారంలో ఆయా పుస్తకాలను తీసివేయాల్సి ఉంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:16, 3 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారికి, ఈ విషయమై కొందరు వికీమీడియా సభ్యులు వెలువరించిన అభిప్రాయాల ఆధారంగా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. దిగువ విభాగాలలో ఒకసారి చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:36, 26 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

AdvancedSearch

మార్చు

Birgit Müller (WMDE) 14:53, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కీవ్ డాట్ ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు ఆంగ్లలిపినుండి తెలుగులోకి మార్చుటకు సహాయం.

మార్చు

user:Pavan santhosh.s నాయకత్వం వహించిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ఫలితాలనుండి తెలుగు 5844 పుస్తకాల వివరాలను ఆర్కీవ్.అర్గ్ లో చేర్చాను.(మార్చిన తరువాత కనబడే పుస్తకం ఉదాహరణ). ఇంకా 17062 పుస్తకాల వివరాలను తెలుగులోకి మార్చితే విలువైన తెలుగు పుస్తకాలు తెలుగవారికి అందుబాటులోకి వస్తాయి. దానికొరకు ప్రయోగాత్మకంగా తెలుగులోకే మార్చే సాఫ్ట్వేర్ తో యాంత్రిక లిప్యంతరీకరణ సలహాలను చేర్చిన గూగుల్ షీట్ మీతో పంచుకుంటున్నాను. ఆంగ్లఅక్షరాలతో రాసిన మూలంలో కోడ్ సరిగా వాడకపోవడంతో యాంత్రిక లిప్యంతరీకరణ నేరుగా వాడలేకపోతున్నాము. దానిలో ఆకుపచ్చ రంగులో వున్న ntitle, nauthor అనే నిలువ వరుసలో ptitle, pauthor లో ప్రశ్నార్ధకంతో మొదలయ్యే వరుసలోని ఆర్కీవ్.ఆర్గ్ లింకు నొక్కి పుస్తకం తొలి పేజీలు చూసి, పుస్తకం శీర్షిక,రచయిత,ఆనువాదం, సంపాదకుల వివరాలు చేర్చాలి. ఇంకా పుస్తక ప్రచురణ సంవత్సరం సరిగా లేకపోతే pdateలో , అది తెలుగు భాషకు కాని పుస్తకం అయితే ఆ భాష కోడ్(tam tel లేక Unknown) అనేది nslang వరుసలో చేర్చాలి. ఒక అంశం దిద్దినపుడు ptitle, pauthor వరుసలో ఆ అంశం తాలూకు మొదటి అక్షరం ప్రశ్నార్ధక చిహ్నాన్ని తొలగించండి. దానితో ఇంకా చేయవలసిన అంశాల సంఖ్యలు మొదటి వరుసలోవి తాజా అవుతాయి. మీకేదైనా సందేహాలుంటే తెలపండి. తెలుగులో మంచి విలువైన పుస్తకాల వివరాలు తెలుసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. వికీసోర్స్ లో పని చేసిన రోజున 15 నిముషాలు కేటాయించగలిగితే 10 పుస్తకాల వరకు వివరాలు చేర్చగలుగుతారు. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమం పూర్తిచేయటానికి సహకరించవలసింది. వికీసోర్స్ లో కాకుండా గూగుల్ షేర్ లో ఈ పని చేయడానికి మెరుగైన సౌలభ్యం కాబట్టి అలా చేయడమైనది. మీకు గూగుల్ లో తెలుగు టైపు చేయడానికి సమస్య ఏమైనా వుంటే సంప్రదించండి. మీ ఆసక్తి మరియు స్పందనలు తెలియచేయవలసినది.--అర్జున (చర్చ) 07:12, 12 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టు చాలా విలువైనది అనంతమైనది. ఇది తొందరగా అర్ధంచేసుకుని పనిచేయుఇటకు తగిన పరిజ్ఞానంకోసం సీనియర్ సబ్యులు మాలాంటివారికి తరగతులు నిర్వహీంచుటవల్ల కొంత సహాయము చేసినవారగుదురు. ఇది అత్వవసరం.--Nrgullapalli (చర్చ) 13:06, 12 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Nrgullapalli గారి స్పందనకు ధన్యవాదాలు. కంప్యూటర్ విహరిణిలో తెలుగు టైపు చేయడం తెలుసుకుంటే ఈ ప్రాజెక్టుకి సహకరించడం చాలా సులభం. మీరు ఒకసారి గూగుల్ షీట్ చూసి మీ సందేహాలు, దానిలో వ్యాఖ్యలగానో లేక ఇక్కడో తెలియచేయండి. త్వరలో చిన్న వీడియో పాఠం చేసి తెలియచేస్తాము.--అర్జున (చర్చ) 10:17, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యత గురించి..

మార్చు

నాణ్యత గురించి గతంలో చర్చలు జరిగాయి. అచ్చుదిద్దేవారు వీటిని పట్టించుకుంటున్నట్టు లేదు. ఈ దిద్దుబాటు చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. మిగతా తప్పుల సంగతి ఎలా ఉన్నా.., కనీసం సామెతల సంఖ్య తప్పు పడినా దాన్ని పట్టించుకోలేదు. ఊరికినే "అచ్చుదిద్దబడింది" అని మార్పు చేసినట్టుగా అగపడుతోంది. నిర్వాహకులు దీన్ని ఇంకాస్త తీవ్రంగా తీసుకోవాలని మనవి. __Chaduvari (చర్చ) 05:10, 4 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గత రెండు రోజుల్లో వాడుకరి:Nrgullapalli గారు "A Collection of Telugu Proverbs.pdf" కు చెందిన 33 పేజీల్లో చేసిన "అచ్చుదిద్దుబాట్లను" పరిశీలించాను. వీటన్నిటినీ కూడా అచ్చుదిద్దినట్లుగా స్థితిని మార్చారు. అనగా నాణ్యత పరంగా పేజీ స్థాయిని ఒక మెట్టు పైకెక్కించారు. కానీ మెట్టు ఎక్కించారంతే.. నాణ్యత పరంగా ఒక్ఖ మిల్లీమీటరు కూడా మెరుగుపడలేదు. అచ్చుదిద్దినట్లు గుర్తించారంతే.. ఒక్కదానిలో కూడా ఒక్క మార్పు కూడా చెయ్యలేదు. 15 నిముషాల్లో 33 పేజీలను "అచ్చుదిద్దిపారేసారు". ఒక్క నిముషంలో రెండు పేజీలను తెరిచి, పరిశీలించి, తప్పులను సవరించి, సేవు చేసెయ్యడం! ఎంతో నిర్లక్ష్యంగా, నాణ్యత పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. గతంలో నేను మూణ్ణాలుగు సార్లు ఈ విషయాన్ని సముదాయం దృష్టికి, నిర్వాహకుల దృష్టికీ తీసుకొచ్చాను. అయినా ఏమీ ఫలితం లేదు. పై 32 పేజీల్లోనూ 16 పేజీల్లో తిరిగి తప్పులను సరిదిద్దాన్నేను.
ఈ రకం "అచ్చుదిద్దడం" వలన వికీసోర్సుకు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు సరికదా.. నష్టం. ఎంతో సమయం వెచ్చించి, ఎంతో కష్టపడి, శ్రద్ధతో టైపిస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. తాము టైపు చేసిన పేజీలను, అచ్చుదిద్దేవారు కూడా అంతే శ్రద్ధతో అచ్చుదిద్దాలని వారు కోరుకుంటారు. కానీ అచ్చుదిద్దేవారు మాత్రం నాణ్యత పట్ల చిన్నమెత్తు గౌరవం లేకుండా, ఎడాపెడా అచ్చుదిద్ది"పారేస్తూ" ఉన్నారు. వికీసోర్సులో "అచ్చుదిద్దడం" అనే దశ ఎగతాళి పాలైనట్టుగా తోస్తోంది.
వాడుకరి:Arjunaraoc గారూ, వాడుకరి:Rajasekhar1961‎ గారూ, ఈ నిర్లక్ష్యపు అచ్చుదిద్దడాలను మేమూ గమనించామని గతంలో మీరిద్దరూ రాసారు. అయినా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. నాణ్యతా హననం జరుగుతూంటే చూస్తూ ఉండాల్సిందేనా? __Chaduvari (చర్చ) 01:37, 6 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Hi. With the requirement to fix the page categorisation as notified at phab:T198470, I would like to propose to the community to have our bot run through and address the problem with the solution identified. The bot has been used to resolve issue previously on the Wikisources.

Thanks. Billinghurst (చర్చ) 12:28, 7 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పై అభ్యర్ధన సరిగా కనపించని సూచిక పేజీల సమస్యని పరిష్కరించటానికి బాటు నడపటం కోసం. సముదాయాంలో ఏమైనా అభ్యంతరాలుంటే 26 జులై 2018లోగా తెలియచేయండి.--అర్జున (చర్చ) 04:30, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Addition of teWS to global bots

మార్చు

Above I have added a bot request, as this wiki is not within the global bot project, per list m:Special:WikiSets/2. Would the community consider opting in to the global bots, so that when we have Wikisource-wide fixes for mw:Extension:ProofreadPage that is possible to organise the bots to do the jobs within Phabricator, and simply get the fix in place. Billinghurst (చర్చ) 12:28, 7 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సాంకేతిక సమస్యలను గ్లోబల్ బాటు ద్వారా సరిచేయటానికి అనుమతి. ఇప్పటికే తెలుగు వికీపీడియా, వికీకోట్ లకు అనుమతి వుంది. అభ్యంతరాలుంటే 26 జులై 2018 లోగా తెలియచేయండి.--అర్జున (చర్చ) 04:32, 19 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Global preferences are available

మార్చు

19:20, 10 జూలై 2018 (UTC)

కేతు విశ్వనాథ రెడ్డి గారి కడప ఊర్ల పేర్లు పుస్తకం రీలైసెన్సు

మార్చు

అందరికీ నమస్కారం,
ప్రముఖ కథారచయిత, పరిశోధకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి రాసిన "కడప ఊర్ల పేర్లు" గ్రంథాన్ని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులోకి పునర్విడుదల చేశారు. కడప ఊర్ల పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక స్థలనామ విజ్ఞాన పరిశోధనలకు దారిచూపిన గ్రంథం. ఇదే దాదాపు తెలుగులో టోపోనమీ విషయంలో తొలి రచన కావడంతో రచయిత పుస్తకంలో స్థలనామ విజ్ఞానానికి సంబంధించిన ప్రాతిపదికలు, మౌలికాంశాలు కూడా సుబోధకంగా రాశారు. తెలుగు వికీపీడియాలో కడప జిల్లా గ్రామ వ్యాసాల్లో ఈ పుస్తకాన్ని ఉపయోగించాలని ప్రయత్నించి, పని ప్రారంభిస్తున్న తరుణంలో ఈ పుస్తకాన్ని వికీసోర్సులో పాఠ్యీకరణకు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించగలగడం చక్కని అవకాశం. కోరగానే ప్రతిస్పందించి, విశ్వనాథరెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడి ఈ పని పూర్తికావడానికి కీలకపాత్ర పోషించిన సాహిత్యవేత్త, తెలుగు వికీపీడియన్ వాడుకరి:స్వరలాసికకు ధన్యవాదాలు. పుస్తకం ఇప్పటికే వికీమీడియా కామన్స్‌లో అప్‌లోడ్ చేసి, సూచిక పేజీ సృష్టించాం. దయచేసి పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:05, 12 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదొక ముందడుగు. కృషిచేసిన పవన్ మరియు స్వరలాసికలకు మా ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:26, 12 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

New user group for editing sitewide CSS / JS

మార్చు

కొత్త పుస్తకం కూర్పుకై ఆహ్వానం

మార్చు

ఆర్వీవ్ లో అధిక వీక్షణలుపొందుతున్న పుస్తకాలలోమూడవ స్థాయిలో వున్నసూచిక:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdfచేర్చడం జరిగింది. user:శ్రీరామమూర్తి మరియు సహసభ్యులు దీనిని పాఠ్యీకరించడంలో తోడ్పడవలసినది.--అర్జున (చర్చ) 07:12, 25 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Editing of sitewide CSS/JS is only possible for interface administrators from now

మార్చు

(Please help translate to your language)

Hi all,

as announced previously, permission handling for CSS/JS pages has changed: only members of the interface-admin (ఇంటర్‌ఫేసు నిర్వాహకులు) group, and a few highly privileged global groups such as stewards, can edit CSS/JS pages that they do not own (that is, any page ending with .css or .js that is either in the MediaWiki: namespace or is another user's user subpage). This is done to improve the security of readers and editors of Wikimedia projects. More information is available at Creation of separate user group for editing sitewide CSS/JS. If you encounter any unexpected problems, please contact me or file a bug.

Thanks!
Tgr (talk) 12:40, 27 ఆగస్టు 2018 (UTC) (via global message delivery)[ప్రత్యుత్తరం]

Sorry for writing in English. But, is {{PD-2013}} even valid? I can see a lot of copyrighted books in this list, which has been worked upon in Telugu Wikisource. I am tagging admins @Arjunaraoc, @Rajasekhar1961, @T.sujatha, @రహ్మానుద్దీన్, @రాకేశ్వర: to take necessary steps by deleting the copyrighted books and removing the invalid templates like {{PD-2013}}, {{PD-DLI}}. Thanks, -- Bodhisattwa (చర్చ) 13:24, 2 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you Bodhisattwa for your note. {{PD-2013}} was created in 2013 based on en:template:PD-1996 to include books whose copyright was freed by DLI and published on its website. Currently these books are being hosted by US based archive.org. We created a new template after that called {{PD-DLI}} for local Telugu wikisource use and we will migrate the books to this new license or appropriate license in a month's time. --అర్జున (చర్చ) 03:07, 4 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc:, thanks for your response. {{PD-2013}} or {{PD-DLI}} are invalid templates. There is no such provision in {{en:tl|PD-1996}} or URAA agreement to create template like {{PD-2013}}. For DLI books, authors have the sole copyright and as you may have known already, DLI website was taken down because copyrighted books were kept there without authors' consent. Most of the books which Telugu Wikisource has been kept under these two templates are clear copyright violations. I suggest you to please delete the books which are clear copyright violations, until the authors release the contents under CC-BY-SA license. I can help by creating a list of such books, if you want. -- Bodhisattwa (చర్చ) 03:19, 4 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Dear Bodhisattwa, I have been following DLI over all the years and am aware that DLI made several works copyright free by contacting the respective holders. You can see the copyright page of DLI archived. I tried contacting the DLI and was told that DLI will be up again, though they have not given any time frame. So far no copyright holder has raised an issue with the works on Telugu Wikisource. We had several discussions on copyright in Telugu wikisource in Telugu before(example చర్చ:సుప్రసిద్ధుల జీవిత విశేషాలు ) and our community will be able to handle the complaints if any by copyright holders in future.--అర్జున (చర్చ) 03:40, 4 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Hello to all. Sorry to intrude; this discussion came to my attention, so I would like to bring forth a few points. I am a regular editor in Bengali and English Wikisources. I can point out how we do the job in those two sites. We don't place credence on the generalised copyright claims of mass collection sites like DLI, IA etc. In these sites, there are multiple uploaders, from multiple locations, uploading as per their own perceptions of what is copyrighted and what is not. Plenty of copyrighted books abound in both sites. DLI is now closed for a detailed copyright review; when it was online it had books from even the 1990s. If book-specific copyright claim is found in the site, as in case of IA, that has more credence than a general claim as in case of DLI. Even the book-specific claims of IA are often wrong, when uploaded by individual (as opposed to institutional) uploaders. So, in English and Bengali Wikisource, we assess every book case-by-case. If the work is clearly PD, or clearly under some free license, then only it is allowed. In case of free license, it should preferably be included in the book itself, or by OTRS. If another site (like DLI) is claiming a free license, we need to determine whether the author (or copyright-holder) had indeed issued it, and whether the license to reproduce was for that particular site only or a general free license for any site, including Wikisource. The language of PD-2013 template is very improper; it claims public domain (as opposed to free license) status for the books with the year 2013 (as opposed to 1996) as the cut off year; this kind of template has no legal validity, this will certainly fail a scrutiny by WMF-Legal. PD-DLI is also improper; they had so many copyrighted books piled up (leading to their shut-down) that any general copyright claim by them cannot be considered valid. I had raised the issue of these templates (by remote) in the recent Punjabi Wikimedia Copyright Workshop in New Delhi (with the intent to use them in bnWS, if valid), where experts deemed these invalid. If the copyright status has ambiguity, the work should not be included, we should not create a situation where we will remove them if the copyright-holder objects in future, thereby nullifying so many hours of labour in proofreading, validation etc., and generally with a negative impact on the reputation of the site and its admins. Hrishikes (చర్చ) 05:54, 4 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Dear Bodhisattwa, Thank you for bringing the issue. The copyright matter in dispute has been discussed in the Telugu Wikisource community earlier. The matter was not resolved during those times. Unlike English Wikisource; many Telugu books here are manually typed (without OCR) by Bhaskaranaidu, Ramamurthy, and others. Some of the recent publications are released under CC-BY-SA licence by different authors and organizations like Syed Naseer Ahmed and Father Jojayya, Indu Gnana Vedika. The templates, you are mentioning, are developed by Arjunaraoc and I do not understand their technicalities. But I understand that they need to be reviewed again. We are on the job to resolve the matter locally. Thank you very much for intimating the matter in good spirit.--Rajasekhar1961 (చర్చ) 06:16, 4 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
All books linked to {{PD-2013}} have been moved to appropriate licenses and the template is now deleted.--అర్జున (చర్చ) 05:32, 8 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

డీఎల్‌ఐ పుస్తకాల కాపీహక్కుల ప్రశ్న

మార్చు

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ కాపీహక్కుల నోటీసుల ప్రాతిపదికన తెలుగు వికీసోర్సులో చేరిన పుస్తకాలు, వాటికి సంబంధించి నలుగుతున్న సమస్య గురించి తెలుగు వికీసోర్సు సభ్యులను చర్చకు ఆహ్వానిస్తూ ఈ పోస్టు రాస్తున్నాను. ముందుగా నాకు ఈ అంశంలో నాకు తెలిసిన మేరకు వివరణలు:

  • డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారు వేలకొద్దీ తెలుగు పుస్తకాలను తమ వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆ పెట్టేప్పుడు కొన్ని వేల పుస్తకాలను "ఔట్ ఆఫ్ కాపీరైట్" అని కాపీరైట్ స్టేటస్ కూడా తగిలించారు. తెలుగు వికీసోర్సులోకి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి పుస్తకాలను కొన్ని వారి స్టేటస్‌ను అనుసరించి తెలుగు వికీసోర్సులోకి తీసుకువచ్చాం. బహుశా ఆ సమయంలోనే వాటిలో పెట్టేందుకు పనికివస్తాయన్న ఉద్దేశంతో PD-DLI, PD-2013 మూసలు రూపొందించారు.
  • ఇలా డీఎల్‌ఐ వారి ప్రకటన అనుసరించి మనం పలు పుస్తకాలను వికీసోర్సులోకి చేర్చాం. డీఎల్‌ఐ ప్రాజెక్టు నుంచి చేర్చినవాటిలో కొన్ని భారతీయ చట్టాల ప్రకారం నిస్సందేహంగా ప్రజాపరిధిలో ఉన్నవి. కానీ కొన్ని పుస్తకాల కాపీహక్కుల స్థితిని డీఎల్‌ఐ ప్రాజెక్టు వారు చేసిన ఔట్ ఆఫ్ కాపీరైట్ సరికాదని అనుకుంటే కాపీహక్కుల పరిధిలోనే ఉన్నాయి. ఇలా కేవలం డీఎల్‌ఐ ప్రకటన ఆధారం చేసుకుంటేనే ప్రజాపరిధిలో ఉన్నాయనుకునే పుస్తకాల్లో కొన్నిటిని మన సభ్యులు శ్రమించి పూర్తిచేసి ఉన్నారు. ఏయే పుస్తకాలు అందులో ఉన్నాయో ఈ వర్గంలో చూడవచ్చు.
  • ఇటీవల బెంగాలీ/భారతీయ వికీసోర్సు సభ్యులు సందేహాలు లేవనెత్తి వ్యతిరేకించినా, గతం(2014)లో మన తెలుగు వికీసోర్సు నిర్వాహకుల్లో ఒకరైన రహ్మానుద్దీన్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించినా, తర్వాత్తర్వాత రాజశేఖర్ గారు తరచు సంశయించినా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారు ఔట్ ఆఫ్ కాపీరైట్ అని చేసిన ఈ క్లెయిం ఆధార రహితమైనదనే.
  • మరోపక్క డీఎల్‌ఐ పుస్తకాలు కాపీహక్కుల పరిధిలో లేవన్న అర్జున గారి వాదన ఇలా ఉంది. 2014లో రహ్మానుద్దీన్‌కు అర్జున గారిచ్చిన సమాధానంలో వారి వైఖరి "సమస్యగల పుస్తకాల హక్కుదారులను సంప్రదించి ఇది నిజంగానే వుల్లంఘన అని తెలిస్తే వారిద్వారా డిఎల్ఐ కి నోటీసుని పంపి ఆ నోటీసునే వికీప్రాజెక్టు నిర్వాహకులకి పంపితే" పరిశీలించవచ్చని చెప్తోంది. ప్రస్తుతం బోధిసత్వ గార్కి రాసిన సమాధానంలోని వాదన ప్రకారం "డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారు పలు పుస్తకాలు సంబంధిత హక్కుదార్లతో మాట్లాడి కాపీహక్కుల నుంచి విడిపించారన్న" వాదన ఆధారంగా ఈ పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి ప్రకటన పూచీ మీద మన వికీసోర్సులో ఉంటాయి. ఇప్పటివరకూ కాపీహక్కుల విషయమై హక్కుదారులు ఎవరూ ప్రశ్నించలేదన్న వాదన, అలానే ఒకవేళ ఏదైనా సమస్య వస్తే రచయితలు/ప్రచురణకర్తలు నేరుగా వికీసోర్సు వారిని సంప్రదిస్తే తెలుగు వికీసోర్సు సముదాయం ప్రతిస్పందించవచ్చన్నది కూడా ఇందులో ఇమిడివుంది.
  • మరోవైపు దీని ప్రతివాదన చూస్తే, రహ్మానుద్దీన్ 2014లో చేసిన వాదన డీఎల్‌ఐ వెబ్‌సైట్ వారి ప్రకటన ఏ పుస్తకానికి కాపీహక్కు స్థితి ఎలా ఉందో స్పష్టత లేదనీ, "35,733 పుస్తకాలకు గానూ 26,772 పుస్తకాల రచయితలకు, ప్రచురణకర్తలకు అనుమతి కోసం అర్జీ పంపినట్టు ఉంది. 1,016 మంది రచయితల నుండి కేవలం 6,841 రచనలకు గానూ అనుమతి లభించినట్టు తెలిపారు. ఈ పుస్తకం [మనం అప్లోడ్ చేసిన పుస్తకం] ఆ 6,841 పుస్తకాలలో ఒకటవడానికి ఆధారం ఏమిటి?" అన్న సందేహం ప్రాతిపదికపైన. ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా తెలిసిన ఉదాహరణ ప్రస్తావిస్తూ: "గత రెండు సంవత్సరాలుగా విశ్వనాథ వారి వారసులు డిఎల్ఐ కు ఎన్ని మార్లు నోటీసు పంపినా సమాధానం లేదు." అన్నారు. ఇది జరిగిన కొన్నేళ్ళకి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ కాపీహక్కుదార్ల అభ్యంతరాలను పురస్కరించుకుని వెబ్‌సైట్ తొలగించినట్టు తెలుస్తోంది. ఇంటర్నెట్ ఆర్కైవ్ వారు ఈ పుస్తకాలు డీఎల్‌ఐ కాపీరైట్ నోటీసు ప్రాతిపదికనే హోస్ట్ చేస్తూండగా 127 వరకూ పుస్తకాలు కాపీహక్కుదార్లు వచ్చి తొలగించాల్సిందిగా నిర్దేశించడంతో తొలగించారు.
  • పైన ప్రస్తావించిన వర్గంలో కుటుంబ నియంత్రణ పద్ధతులు (రచయిత గోపరాజు సమరం జీవించివున్నారు), తెలుగువారి జానపద కళారూపాలు (కాపీహక్కులు (డీఎల్‌ఐ సంగతి విడిచిపెడితే) తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఉన్నాయి, 1992లో తొలి ముద్రణ), బారిష్టరు పార్వతీశం (రచయిత 1973లో మరణించారు), మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు (రచయిత 1986లో మరణించారు, అనువాదకురాలు జీవించివున్నారు), శివతాండవము (రచయిత 1992లో మరణించారు), సుప్రసిద్ధుల జీవిత విశేషాలు (రచయిత 2014లో మరణించారు) - అన్న పుస్తకాలు పూర్తైనవి, ఒకవేళ డీఎల్‌ఐ వారి కాపీరైట్ ప్రకటన చెల్లకపోతే కాపీహక్కుల పరిధిలో ఉన్నవి. గణనీయంగా పూర్తైన మిగిలిన ఈ కోవకు చెందే పుస్తకాలు డీఎల్‌ఐ ప్రకటన మద్దతు లేకపోయినా 70, 80, 90 ఏళ్ళ క్రితం ప్రచురితం కావడం వంటి ఇతర చర్చిందగ్గ కోవకు వస్తాయి. కానీ ఆ పై 6 పుస్తకాలు డీఎల్‌ఐ ప్రకటన మద్దతు లేకపోతే నిస్సంశయంగా కాపీహక్కుల పరిధిలోనివే. పూర్తికాని పుస్తకాలను వదిలిపెట్టేశాను.

ఇవి జరగిన సంగతి సందర్భాలు. దయచేసి సముదాయ సభ్యులు ఈ అంశంపై చర్చించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:21, 4 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పైన ప్రారంభించిన చర్చకు సంబంధించి నా అభిప్రాయం ఇక్కడ రాస్తున్నాను. మన తెలుగు వికీసోర్సు మొదటి పేజీలో చూస్తే సుస్పష్టంగా "స్వేచ్ఛానకలు హక్కులున్న రచనలుగల గ్రంథాలయము" అంటే ఈ పుస్తకాలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఉన్నాయన్న విషయాన్ని మనం స్పష్టీకరిస్తున్నాం అన్నమాట. ఆ మేరకు సుస్పష్టంగా, తిరుగులేని ఆధారాలతో ప్రజాపరిధిలో ఉన్న పుస్తకాలు కానీ, స్వేచ్ఛా నకలు హక్కులైన సీసీ-బై-ఎస్‌ఎ, సీసీ-బై, సీసీ0 వంటివాటి పరిధిలో ఉన్న పుస్తకాలు కానీ ఇందులో ఉండాలి, స్పష్టత లేని సందేహాలున్న పుస్తకాలు ఉండకూడదు. సందేహాస్పదమైన పుస్తకాలను ఉంచడం, కాపీహక్కుల పరిధిలో ఉన్నాయంటూ కాపీహక్కుదారు వచ్చి ప్రశ్నించాలన్న తరహాలో మనం పనిచేయట్లేదు. ఇంటర్నెట్ ఆర్కైవ్ "we cannot give ironclad guarantees as to the copyright status of items in our Collections and cannot guarantee information posted on item details or collection pages regarding copyright or other intellectual property rights." అని చెప్తోంది, అంటే వారు బాధ్యతను వాడుకరి మీద పెట్టారన్నమాట, అవసరమైతే హక్కుదారులు వచ్చి ప్రశ్నించవచ్చన్నది ఇలాంటప్పుడు నప్పుతుంది. వికీమీడియా కామన్సు మాత్రం "...However, almost all content hosted on Wikimedia Commons may be freely reused subject to certain restrictions (in many cases)." అని చెప్తోంది. అంటే కొన్ని పరిమితులు ఉన్న సందర్భంలో తప్ప మొత్తం కంటెంట్ అంతా స్వేచ్ఛగా పునర్వినియోగించుకోవచ్చు అన్న పరిధిలో ఉంది. మనం పైన ప్రస్తావించిన పుస్తకాలకు కాపీహక్కులు సందేహాస్పదంగా ఉన్నాయన్న ఏ స్పష్టతా ఇవ్వట్లేదు, కాబట్టి నేరుగా వాడుకోవచ్చన్న పరిధిలో పెట్టాం. స్వేచ్ఛా నకలు హక్కులున్న రచనలు గల గ్రంథాలయం అన్న మూల ఆశయానికే భంగం కలిగిస్తున్నందున ఈ పుస్తకాలను డీఎల్‌ఐ ప్రకటన పూచీ మీద ఉంచడం తగదనీ, ఆ ప్రకారం ఈ విధమైన ఎక్కింపులు, పని సాగడం సరికాదని నా అభిప్రాయం. కానీ పైన ప్రస్తావించిన పుస్తకాలు మన తెలుగు వికీసోర్సు సభ్యులు శ్రమ పెట్టుబడిగా పెట్టి పూర్తిచేసినవి, వారు ఆశించినట్టు తెలుగు వారికి అందుబాటులో ఉంచేలా చూడడం మన నైతిక బాధ్యత. కాబట్టి "పైన తెలిపిన ఆరు పుస్తకాల కాపీహక్కులు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడిపించుకోవడానికి కృషి సాగించడం" అత్యంత కీలకమని అభిప్రాయ పడుతున్నాను. ఏది ఎటు వచ్చినా, ఆ ఆరు పుస్తకాలూ స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి విడిపించడం మంచిదే కాబట్టి నేను ఆ దిశగా పనిచేయడం ప్రారంభించాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:41, 4 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నకలుహక్కుల వివాదాన్ని పవన్ సంతోష్ గారు తగిన మూలాలతో పైన చక్కగా సంగ్రహం చేశారు. కాపీరైట్లు చాలా క్లిష్టమైన విషయం. కాపీరైట్లు, వ్యక్తులకు, సంస్థలకు వుంటాయి. చట్టాలు వాటికి సవరణలకి అనుగుణంగా మారుతూ వుంటాయి. మరల భారతీయ కాపీ చట్టాన్ని అమెరికా కాపీ చట్టంతో సమన్వయం చేసుకోవాలి. శ్రమకి తగ్గ ఫలితం ప్రాధాన్యత ప్రకారమైతే DLI వారికి లభించిన అనుమతుల వివరాలు DLI నుండి సంబంధిత భాగస్వామ్య సంస్థలు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాదు లాంటి వాటినుండి కనుక్కొనే దాని పై దృష్టిపెడితే ఇప్పటికే చేర్చిన పుస్తకాలకు సందిగ్ధ నివారణ మరియు ఇంకా ఎక్కువ పుస్తకాలు వికీసోర్స్ లోకి చేర్చే అవకాశం వస్తుంది.--అర్జున (చర్చ) 06:23, 5 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ! మీరన్న విధంగా కాపీహక్కుల వ్యవహారం కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైనదే, అయితే దానిమీదొక సాధారణంగా వచ్చే సమస్యల్లో ప్రశ్నోత్తరాల రూపంలో నిపుణుల నుంచి ఒక డాక్యుమెంట్ రూపొందించుకుని రిఫరెన్సు కోసం పెట్టుకుందాం. అసరమైనప్పుడల్లా దాన్ని సమీక్షింపజేసుకుని నవీకరించుకుందాం. అలానే కాపీహక్కుల అంశంపై స్పష్టత కోసం ఒక కార్యశాల నిర్వహించుకుందాం. మన ప్రాజెక్టు పరిధి ప్రధానంగా కాపీహక్కుల మీద (స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఉన్న పుస్తకాలు అనడంలో ఇది స్పష్టం) ఆధారపడి ఉండడంతో మనం కాపీహక్కుల అంశంలో స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది అలా ఉంచితే, తక్షణ పరిష్కారం కోసం స్వేచ్ఛా నకలు హక్కుల్లో పుస్తకాల విడుదల అవాంఛనీయం కాదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను. డీఎల్‌ఐ వారి సమాధానాలే సంతృప్తికరంగా లేనప్పుడు, నేరుగా కాపీహక్కుల సమస్యతోనే వారు వెబ్‌సైట్ డౌన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు - భాగస్వామ్య సంస్థలు మనకు ప్రయోజకరమైన సమాచారం అందిస్తాయని ఆశించలేం కానీ ఎందుకైనా మంచిది కనుక స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాదు వారిని కూడా సంప్రదించి ఇదే థ్రెడ్‌లో సమాధానాన్ని పొందుపరుస్తాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 10:12, 9 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు కాపీహక్కులపై జరిగిన చర్చల గురించి పెద్దగా తెలియదు. పవన్ సంతోష్ గారు వివరించిన దాని ప్రకారం నాకు అర్థమైనది ఇది:
  1. డీయెల్లై అనే వెబ్‌సైటులో పుస్తకం ఉంటే కాపీహక్కులు లేనట్టే అనే అభిప్రాయంతో అక్కడి పుస్తకాలను మనం ఇక్కడికి తెచ్చి పెట్టాం.
  2. కానీ అక్కడి పుస్తకాల్లో చాలావాటికి కాపీహక్కులు ఉన్నందున, హక్కుదారులు ఆయా పుస్తకాలను అక్కడ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఆ కారణంగా చివరికి డియెల్లై సైటును మూసేయాల్సి వచ్చింది.
  3. ఇప్పుడు మనం అక్కడి నుండి తెచ్చిన పుస్తకాల్లో వేటికి హక్కులు ఉన్నాయో వేటికి లేవో చూడాలి. హక్కులున్న పుస్తకాలు వికీసోర్సు విధానాలకు విరుద్ధం కాబట్టి వాటిని తీసెయ్యక తప్పదు.
  4. అయితే ఈ పుస్తకాల్లో కొన్నిటిపై వాడుకరులు ఎంతో శ్రమించి టైపించారు. వాటిని తొలగిస్తే వారి శ్రమ వృథా అయిపోతుంది.
నాబోంట్లకు ఆ విషయాన్ని వివరించినందుకు గాను ఆయనకు నెనరులు. నా ఉద్దేశంలో మనం చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి:
  1. ఇప్పుడు వికీసోర్సులో కాపీహక్కులకు లోబడి ఉన్న పుస్తకాలు ఏమేం ఉన్నాయో ఆ జాబితా తయారు చెయ్యాలి. పవన్ గారు అలాంటి పుస్తకాలు ఆరు మాత్రమే ఉన్నాయని రాసారు. అవేనా, ఇంకా ఇతర వర్గాల్లో కూడా అలాంటి పుస్తకాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించాలి. ఒక సంపూర్ణ "వైరస్ స్కాన్" లాంటిది చెయ్యాలి అని నా ఉద్దేశం.
  2. స్కాన్‌లో దొరికిన పుస్తకాలలో ఇంకా పని మొదలుపెట్టని పుస్తకాలను తక్షణమే తొలగించాలి.
  3. ఈ సరికే పూర్తైన పుస్తకాలు, ప్రస్తుతం పని జరుగుతూ ఉన్న పుస్తకాల విషయంలో వికీకి అనుగుణమైన పద్ధతిలో లైసెన్సు పొందగలమేమో ప్రయత్నించాలి. ఈ ప్రయత్నాలకు ఒక సమయ పరిమితి పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో ఒక నెల. రెండు వారాలు ఈపాటికే అయిపోయాయి. ఆ లోగా లైసెన్సు పొందలేకపోతే, ఆయా పుస్తకాలను తొలగించాలి. ఇప్పటి వరకూ ఎన్ని తొలగించామో నాకు తెలీదు. ఆ తొలగించిన జాబితాను సముదాయానికి తెలపాలి.
  4. ఇకముందు ఇలాంటి తప్పులు జరక్కుండా ఏం చెయ్యాలో చూడాలి.
  5. ఈ విషయంలో మనం చేపట్టిన చర్యల గురించి, చేస్తున్న పనుల గురించి పై విభాగంలో ఎప్పటికప్పుడు రాయాలి.
__Chaduvari (చర్చ) 08:01, 13 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]


  • నేను సాధారణంగా వికీసౌర్సులో తక్కువగా పనిచేస్తుంటాను. అందుకు కారణం వికీసౌర్సు అంటే ఆసక్తి లేదని కాదు. వికీపీడియాలో ఒక లక్ష్యంతో పనిని కొనసాగిస్తున్నందున ఇక్కడ అధికంగా దృష్టిసారించడానికి వీలు కావడం లేదు.
  • డి.ఎల్.ఎ. లో ఉన్న పుస్తకాలకు కాపీ హక్కుల సమస్యలు ఉండవని అందుకే వాటిని వికీ కామంసులో చేర్చగలిగారని భావించిన వారిలో నేను ఒకదానిని. కానీ ఇప్పుడు తలెత్తిన కాపీహక్కుల సమస్య పరిశీలించిన తరువాత పరిస్థితి గురించి.కొంతవరకు అవగాహన కలిగింది.
  • వికీసౌర్సు లక్ష్యం మరుగునపడుతున్న అరుదైన పుస్తకాలలో ఉన్న విలువైన సమాచారం భద్రపరచి భావి తరాలకు అందించడం అని నేను విశ్వసిస్తున్నాను. అలా చేయడం ద్వారా విలువైన సమాచారం పలువురు భాషావేత్తలకు అందుబాటులోకి వస్తుంది. అదే సమయం వికీపీడియా వంటి ఇతర సోదర సంస్థలకు విశ్వసనీయమైన మూలాధారాలు లభిస్తాయి.
  • తెలుగు మీద ఉన్న అభిమానం తీరిక సమయాన్ని మరింత ఉపయోగకరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న వికీపీడియన్లు కాపీ హక్కులను గౌరవించడం అత్యవసరం. ప్రజలకు సమాచారం అందించడం ఎంత ముఖ్యమో రచయితలు, వారి వారసుల హక్కులకు భగం కలిగించకుండా పని చేయడం అంత ముఖ్యమని అదే నా బాధ్యతగా భావిస్తున్నాను.
  • ఇప్పటి వరకు తెవికీ సభ్యుల అవగాహనా లోపం కారణంగా వికీ సోర్సులోని స్కాన్ పుస్తకాలకు డిజిటల్ రూపం అందిచడంలో తమ విలువైన సమయాన్ని ఖర్చుచేసారు. ఇప్పటివరకు జరిగిన పనిని వికీపీడియన్ల కఠిన శ్రమను దృష్టిలో ఉంచుకుని జరిగిన పనిని కాపాడడానికి ప్రయత్నిస్తాం. ఇక మీదట స్వేచ్చా నకలు హక్కులు ఉన్నాయని భావించిన పుస్తకాలలో మాత్రమే పని చేయాలని భావిస్తున్నాను.
  • తెలుగు వికీసోర్సు ప్రపంచంలో ద్వితీయస్థానంలోనూ భారతదేశంలో ప్రథమస్థానంలోనూ ఉందని సహ వికీపీడియన్లు మాటల ద్వారా తెలుసుకున్నాను. సాగించిన ప్రగతిని నిలుపుకోవడానికి మరింత ఉన్నత లక్ష్యాలు సాధించడానికి తెలుగు వికీపీడియన్లు అందరూ కృషిచేయాలని కోరుతున్నాను. మన మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను వదిలి ఒకే లక్ష్యంతో పని చేసి తెలుగు వికీసౌర్సును మరింత సుసంపన్నం చేయాలని కోరుతున్నాను.
  • ఇలా చేసినట్లైతే ఈ సమస్య కారణంగా వికీసోర్సులో పనిచేయడానికి దూరమైన వికీపీడియన్లు తిరిగి తమ విలువైన సేవలు పునరుత్సాహంతో అందిస్తారని విశ్వసిస్తున్నాను. T.sujatha (చర్చ) 18:05, 24 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
PD-DLI చర్చాపేజీ లో చాలాకాలం చర్చించిన తరువాత, ప్రతిష్ఠంబన నెలకొన్నందున, తత్కాలికంగా, మార్పులో తెలిపినట్లు {{PD-DLI}} ను {{Non-free DLI}} తో మార్చడమైనది. --అర్జున (చర్చ) 12:11, 28 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్వేచ్ఛానకలు హక్కుల్లో పునర్విడుదల - సాగుతున్న పని=

మార్చు

అందరికీ నమస్కారం,
తెలుగు వికీసోర్సులోకి నకలు హక్కుల స్పష్టత లేని పుస్తకాలను సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులోకి తీసుకురావడంపై జరుగుతున్న పని ఈ కింది విధాలుగా సాగుతోంది, కొన్ని సంప్రదింపుల స్థాయిలో లేకున్నా వివరించడం ఇతర వికీసోర్సు సభ్యులకు పరిచయాలు ఉండివుంటే సహకరిస్తారన్న ఆలోచనతో. కాబట్టి గ్రహించగలరు.:

  • కుటుంబ నియంత్రణ పద్ధతులు: విజయవాడలోని డాక్టర్ గోపరాజు సమరం ప్రచురణ వివరాలు చూస్తున్న సిబ్బందికి ఈ పుస్తకాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయమన్న విషయాన్ని నివేదించడం జరిగింది. ఈ అంశంపై సమరం గారిని నేరుగా సంప్రదించి పుస్తకం స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించడానికి అవకాశం వచ్చేవారం (సెప్టెంబరు 10-17)లో దొరకవచ్చని ఆశిస్తున్నాను.
  • గణపతిముని చరిత్ర సంగ్రహం: పోలూరి హనుమజ్జానకీరామ శర్మ గారి మనవలు పోలూరి కుమారశర్మ గారు ప్రభృతుల వివరాలను ప్రముఖ చరిత్రకారుడు, తెలుగు వికీపీడియా విస్తరణకు నెల్లూరు ప్రాంతంలో సహకరిస్తున్న సహృదయుడు కాళిదాసు పురుషోత్తం గారి ద్వారా పట్టుకోగలిగాం. అలానే పురుషోత్తం గారు కుమారశర్మ గారిని సంప్రదించి వారిని స్వేచ్ఛా నకలు హక్కుల్లో పుస్తకాన్న విడుదల చేయడానికి సుముఖులను చేశారు. స్వేచ్ఛా నకలు హక్కుల గురించి వివరించడం, ఓటీఆర్‌ఎస్ విడుదల పద్ధతికి అవసరమైన టెంప్లెట్ పంపడం వంటివి పూర్తయ్యాయి. శర్మ గారి నుంచి మెయిల్ కోసం చూన్తున్నాం. ఒక్కసారి ఈ పని పూర్తికాగానే స్థితి వివరించగలను.
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: తెలుగు వారి జానపద కళారూపాలు, తెలుగు శాసనాలు వంటి పుస్తకాల కాపీహక్కులు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఉన్నాయి. కాబట్టి విశ్వవిద్యాలయ ఉపకులపతి గారిని నేనూ, ప్రణయ్ రాజ్ గారూ వచ్చేవారంలో కలిసి ఈ అంశంపై వారికి ప్రతిపాదన సమర్పించనున్నాం.
  • శివతాండవము: పుట్టపర్తి నారాయణాచార్యుల కుమార్తెలు పుట్టపర్తి నాగపద్మిని గారితో పరోక్ష, ప్రత్యక్ష పరిచయాల దృష్ట్యా వారిని సంప్రదిస్తాను. మిగిలిన వివరాలు ఆవిడ ప్రతిస్పందన అనంతరం చెప్పగలను.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 10:07, 9 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్సు సరిదిద్దుట

మార్చు

{{PD-2013}} లో దోషమున్నదని తెలిసినందున, 1923 నకు ముందు తొలి ప్రచురితాలకు {{Pd/1923}} అని 1923 నుండి 1989 మధ్యకాలంలో ప్రచురితమైన వాటికి {{Pd/1996}} అని రచయిత మరణించిన సంవత్సరము పరామితిగా అనువైన చోట కృతి మొదటి పేజీలో మార్చండి. 1989 తరువాత ప్రచురణలకు అన్వయించిన చోట {{PD-India}} వాడండి. ఇతరాలకు {{PD-DLI}} గా మార్చండి. చివరిదానికి తప్ప మిగతా వాటికి సరిపోలిన వర్గాలలోకి కృతుల, రచయితల పేజీలు చేర్చబడుతాయి--అర్జున (చర్చ) 06:06, 5 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారికి, నేను పుస్తకాల కాపీహక్కుల మూసల్ని చేరుస్తున్నాను. ప్రచురణ తేదీ : రచయిత మరణించిన తేదీ రెండూ స్పష్టంగా తెలియజేస్తూ మరికొంచెం వివరించగలరా. ముఖ్యంగా నాకు అర్ధంగానిది {{Pd/1996}}. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:45, 5 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, ఆ {{Pd/1996}}లో లింకులు సరిచేశాను. ఇప్పడు చదివి చూడండి. 1923 మూసకు ఎక్కడైనా ప్రచురితమైన పుస్తకానికి వాడితే 1996 మూసకుఅమెరికా వెలుపల మొదటి సారి ప్రచురితమై అ తరువాత 30 రోజులలోపల అమెరికాలో ప్రచురించని పుస్తకాలకు వాడాలి.--అర్జున (చర్చ) 23:18, 5 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వికీసోర్సు:కాపీహక్కుల పరిధి దాటిన రచయితలు మరియు వర్గం:కాలరేఖ ప్రకారం రచనలు ఆధారంగా చాలా పుస్తకాలకు మొదటి పేజీలో కాపీహక్కుల టాగ్ చేర్చాను. సభ్యులు ఒకసారి చూచి; సందేహాలను ఆయా పుస్తకాల చర్చ పేజీలో తెలియజేయండి. చర్చించి ఒక నిర్ణయం తీసుకొందాము.--Rajasekhar1961 (చర్చ) 14:51, 6 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నేను వర్గం:1922 ముద్రితాలువరకు తనిఖీ చేసి అవసరమైనచోట సవరించాను.--అర్జున (చర్చ) 09:56, 7 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
{{PD-2013}} కు లింకున్నవి ఇంకా వున్నవి వాటిని సరిచేయాలి.--అర్జున (చర్చ) 09:58, 7 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
{{PD-2013}} తొలగించబడింది.--అర్జున (చర్చ) 06:19, 8 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నేను వర్గం:1927 ముద్రితాలువరకు తనిఖీ చేసి అవసరమైనచోట సవరించాను. {{PD-India}} లో రచయిత మరణం తరువాత 70 ఏళ్ల దాటిన వాటికి {{PD-old-70}} కి మార్చాలి.--అర్జున (చర్చ) 09:56, 7 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Read-only mode for up to an hour on 12 September and 10 October

మార్చు

13:33, 6 సెప్టెంబరు 2018 (UTC)

పుస్తకాల ఫైళ్లు ఎక్కించునపుడు ప్రధాన పేరు తెలుగు లిపిలో వుంచండి

మార్చు

సూచిక పేజీలు సులభంగా చదువుకోవటానికి, ఇక పుస్తకాల ఫైళ్లు ఎక్కించునపుడు ప్రధాన పేరు తెలుగు లిపిలో వుంచండి. ఎక్స్టెన్షన్ అనగా pdf, djvu లాంటివి ఆంగ్లంలోనే వుండాలి. --అర్జున (చర్చ) 07:05, 11 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాధాన్యత కోసం కొన్ని జాబితాలు

మార్చు

మనం ఉన్నది కొద్దిమందే అయినా మనం చేసిన కృషి అత్యంత ప్రభావశీలమైనది కావాలంటే ప్రాధాన్యతల నిర్ధారణ అవసరం. అందుకే కాక మన దృష్టిని నిశితం చేయడానికి, కొన్ని చిన్నపాటి లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి కూడా జాబితాలు పనికి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే తప్పక చూడాల్సిన వంద సినిమాలు, ప్రభావశీలమైన వందమంది వ్యక్తులు, తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు, చూసి తీరాల్సిన ప్రదేశాలూ వంటి జాబితాలు ఉన్నాయో తెలుగు సాహిత్య లోకంలోనూ అటువంటి జాబితాలు కొన్ని ఉన్నాయి. వాటికి ఈ శతాబ్దపు రచనా శతం ఒక ఉదాహరణ. ఒక పద్ధతి ప్రకారం, పేరు ప్రతిష్టలు, ఆ రంగంలో లోతైన అవగాహన ఉన్న బృందం ఎంపిక చేసి ఒక ప్రతిష్టాత్మకమైన పత్రికలో ప్రచురించిన ఇటువంటి జాబితాలు మనకు చాలా ఉపకరిస్తాయి. ఇందులో ఉన్న పుస్తకాల్లో అన్నిటిపైనా ఇప్పటికిప్పుడు పనిచేయలేకపోవచ్చు. కానీ కొన్ని పుస్తకాలు ఇప్పటికే సార్వజనీనమైనవి, కొన్ని ప్రయత్నిస్తే స్వేచ్చా నకలు హక్కుల్లో విడుదల కావచ్చు. ఆ కొన్నిటిపై పనిచేసినా తప్పక చదవాల్సిన పుస్తకాలు తెలుగు వికీసోర్సు ద్వారా అందించినట్టవుతుంది. తెలుగు సాహిత్య ప్రపంచంపై అది మనదైన ముద్ర వేస్తుంది. అంతేకాక పాఠకులకు మనల్ని విశిష్టంగా పరిచయం చేస్తుంది. దయచేసి ఈ అంశంపై తమ తమ అభిప్రాయాలు చెప్పగలరు. అంతేకాక ఆసక్తి ఉన్నవారు పేజీని మెరుగుపరచడం, ఆలోచనను పదునుతేరించడం వంటివి చేస్తారని ఆశిస్తూ.. --పవన్ సంతోష్ (చర్చ) 17:17, 15 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ శతాబ్దపు రచనా శతం జాబితాను వికీసోర్సు పరంగా పరిశీలించి చూస్తే ఈ కింది లెక్కలు తేలాయి.
భారతదేశంలో సార్వజనీనం అయిన పుస్తకాల సంఖ్య: 20
వీటిలో వికీసోర్సులో ఉన్నవి: 13
ఉన్నవాటిలో పూర్తైనవి: 2
సార్వజనీనం కాకుండా కాపీహక్కుల పరిధిలో ఉండి కూడా వికీసోర్సులో ఉన్నవి: 1

ఇవికాక మరో నాలుగు నెలల్లో భారతదేశంలో సార్వజనీనం అవుతున్న పుస్తకాలు రెండున్నాయి. వివరంగా కావాలంటే వికీసోర్స్:ఈ శతాబ్దపు రచనా శతం/వికీసోర్సులో పుస్తకాల స్థితి పేజీలో చూడవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 16 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి జాబితాలు చాలా అవసరం. ఇదొక మంచి విశ్లేషణగానే కనిపిస్తున్నది. మీరు చేర్చిన జాబితాకు ఇప్పటికే ఉన్న పుస్తకాల మరియు రచయితల లింకుల్ని చేర్చాను. కాబట్టి మీరు మరొక్కసారి చేర్చిన జాబితా మరియు విశ్లేషణలను తాజీకరణ చేయండి. ఇందులోని కొన్ని పుస్తకాల గురించి పనిచేయడానికి ఆసక్తి కలిగిన వికీపీడియన్లను వికీసోర్సులోకి ఆకర్షించడానికి అందులో కూడా ఒక చర్చ మొదలుపెడితే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:47, 18 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2018 అక్టోబర్ 20-21 తేదీల్లో దక్షిణ భారత వికీమీడియా కాపీహక్కుల కార్యశాల 2018

మార్చు

నమస్తే,

అక్టోబరు 19 మధ్యాహ్నం నుంచి 21 తేదీ వరకు బెంగళూరు లేదా చుట్టుపక్కల ప్రదేశాల్లో వికీమీడియా కాపీహక్కుల సంబంధిత అంశాలపై కార్యశాల జరగనుంది. దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో నివసిస్తూ క్రియాశీలంగా వికీమీడియా ప్రాజెక్టులకు కృషిచేస్తున్న వికీమీడియన్ ఎవరైనా ఈ కార్యశాలలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. User:Yann (యాన్) కార్యశాల ప్రధాన శిక్షకునిగా వ్యవహరిస్తారు.

కార్యశాలలో చర్చించే కొన్ని అంశాలు ఇవి (మరిన్ని అంశాలు చేరవచ్చు)

  • వివిధ క్రియేటివ్ కామన్స్ లైసెన్సులు (సీసీ లైసెన్సులు), సీసీ, ఎస్‌ఎ, బై, ఎన్‌డి, ఎన్‌సి, 2.0, 3.0, 4.0 వగైరా పరిభాష గురించి
  • సాధారణంగానూ, భారతదేశంలో ప్రత్యేకించీ సార్వజనీనం
  • పెయింటింగ్, శిల్పాలు, పురావస్తువులు, స్మారక కట్టడాలు, నాణేలు, బ్యాంకు నోట్లు, పుస్తకాల ముఖపత్రాలు వంటివాటి కాపీహక్కులు
  • ఫ్రీడమ్ ఆఫ్‌ పనోరమా
  • వ్యక్తి హక్కులు (పర్సనాలిటీ రైట్స్)
  • ఉరుగ్వే రౌండ్ అగ్రిమెంట్స్ యాక్ట్ (యుఆర్ఎఎ, ప్రత్యేకించి భారతీయ కృతులపై ప్రభావం)
  • గవర్నమెంట్ ఓపెన్ డేటా లైసెన్స్ ఇండియా (జీవోడీఎల్)
  • *పాల్గొనే సభ్యుల అవసరాల మదింపు ఆధారంగా అంశాలు పెరగవచ్చు*

కార్యక్రమ పేజీని ఇక్కడ చూడండి.

పాక్షికంగా పాల్గొనే వీలు లేదు. జెండర్ గ్యాప్ తగ్గించే క్రమంలో మహిళా వికీపీడియన్లు దరఖాస్తు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాం.

ధన్యవాదాలు,
--పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:51, 27 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]