వరాలందుకొమ్మని నాయందు

త్యాగరాజు కృతులు

అం అః

ఘుర్జరి రాగం - ఆది తాళం


పల్లవి

వరాలందుకొమ్మని నాయందు - వంచన సేయ న్యాయమా ?


అనుపల్లవి

సురాసురవినుత ! రామ ! నామన -

సు భక్తిని గోరి యుండగ నను


చరణము 1

మనమున నిజముగ నమ్మినవారి -

మనసుకొంచ ఫలమాశించగ రా

దనుచు - ఘనుని జేసిననీ బిరుదుకు

కనకకశిపుసుతుడు సాక్షి గాదా ?


చరణము 2

అవివేకముతో దెలిసి తెలియకను

భవసుఖముల కాశించినగాని

ధ్రువమైన ఫలమొసంగు నీ శక్తికి

ధ్రువుడు సాక్షి గాదా ? రామ నను


చరణము 3

చరాచరాత్మక ! సురపూజిత ! యిక

పరాకులేకయు సతతము నీ ద

య రావలె ననుచు కోరి శ్రీత్యా -

గరాజునిపై గృపలేక నను