రార సీతారమణీ మనోహర

త్యాగరాజు కృతులు

అం అః

హిందోళవసంత రాగం - రూపక తాళం


పల్లవి

రార, సీతారమణీ మనోహర !


అనుపల్లవి

నీరజ నయన ! ఒక ము - ద్దీర, ధీర ! ముంగల


చరణము 1

బంగారు వల్వల నే బాగుగ గట్టెద, మఱి

శృంగారించి సేవజేసి కౌగిట జేర్చెద;


చరణము 2

సారె నుదుటకు గస్తూరి తిలకము బెట్టెద;

సారమైన ముక్తాహారములను దిద్దెద;


చరణము 3

యోగము నీపై యనురాగము బాడెద; వే

రే గతియెవరు ? శ్రీత్యాగరాజ వినుత !