రారా మా యింటిదాక

త్యాగరాజు కృతులు

అం అః

అసావేరి - దేశాది


పల్లవి

రారా మా యింటిదాక రఘు -

వీరా సుకుమారా మ్రొక్కేరా | | రారా | |


అనుపల్లవి

రారా దశరథకుమారా నన్నేలు

కోరా తాళలేరా | | రారా | |


చరణము 1

కోరిన కోర్కెలు - కొనసాగకనే

నీరజనయన నీ - దారిని గని వే -

సారితిగాని - సాధుజనావన

సారివెడలి - సామి నేడైన | | రారా | |


చరణము 2

ప్రొద్దునలేచి - పుణ్యముతోటి

బుద్ధులుజెప్పి - బ్రోతువుగాని

ముద్దుగారు నీ - మోమును జూచుచు

వద్ద నిలిచి - వారము పూజించె | | రారా | |


చరణము 3

దిక్కు నేననుచు - దెలిసి నన్నుబ్రోవ

గ్రక్కునరావు - కరుణను నీచే

జిక్కియున్న దెల్ల - మరతురా యిక

శ్రీ తాయరాజుని - భాగ్యమా | | రారా | |