రక్ష బెట్టరే దొరకు

త్యాగరాజు కృతులు

అం అః

భైరవి రాగం - ఆది తాళం


పల్లవి

రక్ష బెట్టరే దొరకు


అనుపల్లవి

వక్షస్థలమున వెలయు - లక్ష్మీ రమణునికి జయ


చరణము

సీతా కరమును బట్టి చెలగిన దొరకు

వాతాత్మజునికి జెయి వశమైన దొరకు, పురు -

హూతాదుల రక్షింప బాహుడైన దొరకు, సం -

గీతప్రియ త్యాగరాజ గేయుడైన దొర, కైశ్వర్య