యుక్తము గాదు నను రక్షించక
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
శ్రీరాగం - ఆదితాళం
- పల్లవి
యుక్తము గాదు నను రక్షించక - యుండెడిది, రామ !
- అనుపల్లవి
భక్తవత్సల ! పతితపావన ! త్రి -
శక్తులు గల్గిన దేవుడు నీవై
- చరణము 1
తొలి దుష్కృతముల నణచు నీ బిరు -
దిలను దడుసుకొనెనో ?
పలికి బొంకడను నీ కీర్తియు నే -
బాగ లేదు యనెనో; మును -
తెలిసి తెలియని నీ దాసుల బ్రోవ, -
దేవ ! దయతా రా ననెనో ?
వెలసిన భక్తులకే నీ శక్తియు -
సెలవైపోయెనో ? దెలుపుము.
- చరణము 2
వద్దయుండు జనకాత్మజ బల్క - వద్దనెనో ? లేక -
నిద్దురజితు డతికోపముతోడను - నీ కేల యనెనో ?
ముద్దు భరతు డానంద బాష్ప - ముల గనుల నించెనో ?
పద్దున పవనసుతుడు వద్దని నీ -
పదము బట్టుకొనెనో ? దెలుపుము.
- చరణము 3
చల్లని నీ భక్తియు లేదని విధి - కల్లలాడుకొనెనో ? నా -
వల్ల గాదని పల్కి చెలి మిక్కిలి - వార్త లాడుకొనెనో ?
ఉల్లమునను శ్రీత్యాగరాజు ని - న్నుంచుకొన మరచెనో ?
చెల్లెలైన ధర్మసంవర్ధని - చేర బోకుమనెనో ? దెలుపుము.