త్యాగరాజు కృతులు

అం అః

మోహన రామా
రాగం: మోహనం

పల్లవి: మోహన రామా ముఖ జిత సోమా
ముద్దుగ పల్కుమా

అనుపల్లవి:
మోహన రామా మొదటి దైవమా
మోహము నీపై మొనసి యున్నదిరా ||మోహన రామా||

చరణం:
ధర మనుజావతార మహిమ విని
సుర కిన్నర కింపురుష విద్యాధర
సుర పతి విధి విభాకర చంద్రాదులు
కరగుచు ప్రేమతో
వర మృగ పక్షి వానర తనువులచే
గిరిని వెలయు సీతా వర చిరకాలము
గురి తప్పక మైమరచి సేవించిరి
వర త్యాగరాజ వరదాఖిల జగన్ ||మోహన రామా||

"https://te.wikisource.org/w/index.php?title=మోహన_రామా&oldid=70798" నుండి వెలికితీశారు