మోక్షము గలదా భువిలో

త్యాగరాజు కృతులు

అం అః

సారమతి రాగం - ఆది తాళం


పల్లవి

మోక్షము గలదా ? భువిలో జీవ - న్ముక్తులుగాని వారలకు


అనుపల్లవి

సాక్షాత్కార నీ సద్భక్తి - సంగీత జ్ఞాన విహీనులకు


చరణము

ప్రాణానల సంయోగము వల్ల

ప్రణవ నాదము సప్తస్వరములై బరగ

వీణా వాదన లోలుడౌ శివమనో

విధ మెఱుగరు, త్యాగరాజ వినుత !