మేను జూచి మోస బోకవే
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
నరసాంగి రాగం - దేశాది తాళం
- పల్లవి
మేను జూచి మోస బోకవే; మనసా !
లోనిజాడ లీలాగుగదా ?
- అనుపల్లవి
హీనమైన మూత్ర రక్తముల
కిల నెంచు మాయామయ మైన చాన
- చరణము
కనులనెడి యంప కోలచేత గుచ్చి
చనులనెడి గిరుల శిరమునుంచి
పనులు చేతురట; త్యాగరాజనుతుని బా -
గ నీవు భజన జేసుకొమ్మి; స్త్రీల