ముద్దుమోము యేలాగు చెలంగెనో
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
సూర్యకాంతము రాగం - ఆది తాళం
- పల్లవి
ముద్దుమోము యేలాగు చెలంగెనో ?
మునులెట్ల గని మోహించిరో ?
- అనుపల్లవి
కద్దనుచును చిరకాలము హృదయము
కరగికరగి నిల్చు వారికెదుట రాముని
- చరణము
మనసు నిర్మలమగు భూసుర కృతమౌ,
మంచి పూజా ఫలమౌ, తొలుతటి తపమౌ,
ఘననిభ దేహుని జనన స్వభావమౌ,
ధనపతి సఖుడైన త్యాగరాజార్చితుని