మామవ సతతం రఘునాథ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
జగన్మోహిని రాగం - ఆది తాళం
- పల్లవి
మామవ సతతం, రఘునాథ !
- అనుపల్లవి
శ్రీద ! దినాన్వయ సాగరచంద్రా !
శ్రితజన శుభఫలద ! సుగుణసాంద్ర !
- చరణము 1
భక్తిరహిత శాస్త్రవిదతిదూర !
పంకజదళ నయన ! నృపకుమార !
- చరణము 2
శక్తితనయ హృదాలయ ! రఘువీర !
శాంత ! నిర్వికార !
- చరణము 3
యుక్తవచన ! కనకచలధీర !
యురగశయన ! మునిజన పరివార !
త్యక్తకామమోహమదగంభీర !
త్యగరాజరిపు జలద సమీర !