మాటాడవేమి నాతో మాధుర్య పూర్ణాధర

త్యాగరాజు కృతులు

అం అః

నీలాంబరి రాగం - దేశాది తాళం


పల్లవి

మాటాడవేమి నాతో ? - మాధుర్య పూర్ణాధర !

అనుపల్లవి

సాటి దొరకని రామ - స్వామి ! మది రంజిల్ల


చరణము

ఎదురెదురు జూచి యెందు గానక నా

హృదయమునకెంతో హితవు లేక

సదయడని నేనుండగ సముఖము దొరికిన; నీ -

రదవర్ణ శ్రీ త్యాగరాజార్చిత ! - ముద్దుగ