మరుగేలరా ఓ రాఘవ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
- రాగం - జయంతశ్రీ
- తాళం - దేశాది
మరుగేలరా ? ఓ రాఘవ ! ||పల్లవి||
మరుగేల ? చరాచర రూప ! పరా -
త్పర ! సూర్య సుధాకర లోచన ! ||అనుపల్లవి||
అన్ని నీవనుచు నంతరంగమున
దిన్నగ వెదకి - తెలుసుకొంటినయ్య;
నిన్నెగాని మదిని నెన్నజాల నొరుల,
నన్ను బ్రోవవయ్యా, త్యాగరాజనుత ! ||చరణము||