త్యాగరాజు కృతులు

అం అః

జయనారాయణి రాగం - ఆది తాళం


పల్లవి

మనవిని వినుమా, మఱవ సమయమా ?

అనుపల్లవి

కనుగొన గోరిదుష్కల్పన మానితి

కనికరమున నిను బాడుచున్న నా


చరణము

పరులకు హితమగు భావన గాని

చెరచు మార్గముల జింతింపలేను;

పరమ దయాకర ! భక్తమనోహర !

ధరాధిప కరార్చిత ! త్యాగరాజు