పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/కల్మాషపాదుని చరిత్రము

కల్మాషపాదుని చరిత్రము

తెభా-9-236-వ.
ఆ ఋతుపర్ణునకు సర్వకాముండును, సర్వకామునకు మదయంతీ వల్లభుండైన సుదాసుండును బుట్టె, నా రాజశేఖరుని మిత్రసహుండును, గల్మాషపాదుండు నని చెప్పుదు, రా భూవరుండు వసిష్ఠుని శాపంబున రాక్షసుడయి, తన కర్మంబున నపత్యుండయ్యె,” ననిన విని పరీక్షిన్నరేంద్రు డేమి కారణంబున సుదాసునకు గురుశాపంబు ప్రాప్తంబయ్యె” నని యడిగిన శుకుం డిట్లనియె.
టీక:- ఆ = ఆ; ఋతుపర్ణున్ = ఋతుపర్ణుని; కున్ = కి; సర్వకాముండున = సర్వకాముడు; సర్వకామున్ = సర్వకాముని; కున్ = కి; మదయంతీ = మదయంతియొక్క; వల్లభుండు = భర్త; ఐన = అయిన; సుదాసుండును = సుదాసుడు; పుట్టెన్ = జన్మించిరి; ఆ = ఆ; రాజశేఖరుని = రాజశేఖరుని; మిత్రసహుండును = మిత్రసహుండు; కల్మాషపాదుండును = కల్మాషపాదుడు; అని = అని; చెప్పుదురు = అంటారు; ఆ = ఆ; భూవరుండు = రాజు; వసిష్ఠుని = వసిష్టునియొక్క; శాపంబునన్ = శాపమువలన; రాక్షసుడు = రాక్షసుడు; అయి = ఐ; తన = తనయొక్క; కర్మంబునన్ = కర్మానుసారము; అపత్యుండు = అపత్యుడు; అనినన్ = అనగా; విని = విని; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రుండు = మహారాజు; ఏమి = ఎట్టి; కారణంబునన్ = కారణమువలన; సుదాసున్ = సుదాసున; కున్ = కు; గురు = గురువుయొక్క; శాపంబు = శాపము; ప్రాప్తంబు = కలిగినది; అయ్యెన్ = అయ్యెను; అని = అని; అడిగినన్ = అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ ఋతుపర్ణునికి సర్వకాముడు. సర్వకామునికి మదయంతి భర్త అయిన సుదాసుడు పుట్టారు. ఆ రాజశేఖరుని మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడ అంటారు. ఆయన వసిష్టుని శాపంవలన రాక్షసుడై తన కర్మానుసారం అపత్యుడు అయ్యాడు.” శుకుడు అనగా విని, పరీక్షిత్తు “సుదాసుకు గురుశాపం ఎలా కలిగింది.” అని అడిగాడు. అంత శుకుడు ఇలా చెప్పసాగాడు.

తెభా-9-237-సీ.
" సుదాసుఁడు వేఁటకై వనంబున కేగి-
ర్వించి యొక్క రక్కసునిఁ జంపి
వానితోఁ బుట్టిన వానిఁ బో విడిచిన-
వాఁడును దనతోడివాని చావు
పోనీక కపటియై భూపాలుగృహమున-
డబాలతనమున ర్థిఁ గొలిచి
యుండ వసిష్ఠున కుర్వీశుఁ డొక్కనాఁ-
న్నంబు జేయంగ తనిఁ బనుప

తెభా-9-237.1-తే.
వాఁడు మానవ మాంసంబు వండి తెచ్చి
మునికి వడ్డింపఁ గోపించి ముని నరేంద్రుఁ
బిలిచి మనుజామిషంబును బెట్టి తనుచు
లుకతో రాక్షసుఁడవు గమ్మని శపించె.

టీక:- ఆ = ఆ; సుదాసుడు = సుదాసుడు; వేట = వేటాడుట; కై = కోసము; వనంబున్ = అడవి; కిన్ = కి; ఏగి = వెళ్ళి; గర్వించి = మదించి; ఒక్క = ఒకానొక; రక్కసునిన్ = రాక్షసుని; చంపి = సంహరించి; వాని = అతని; తోబుట్టినవాని = సోదరుని; పోవిడిచినన్ = పోనివ్వగా; వాడునున్ = అతడు; తన = తనయొక్క; తోడివాని = సోదరుని; చావు = మరణమును; పోనీక = వదలిపెట్టక; కపటి = మోసముచేయువాడు; ఐ = అయ్యి; భూపాలున్ = రాజుయొక్క; గృహమునన్ = ఇంటిలో; అడబాలతనమునన్ = వంటవానివలె; అర్తిన్ = కోరి; కొలిచి = కొలువులోచేరి; ఉండన్ = ఉండగ; వసిష్ఠున్ = వసిష్ఠుని; కున్ = కి; ఉర్వీశుడు = రాజు {ఉర్వీశుడు - ఉర్వి (భూమి)కి ఈశుడు, రాజు}; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; అన్నంబు = భోజనంబు; చేయంగన్ = తినుటకు; అతనిన్ = అతనిని; పనుపన్ = నియమించగా;
వాడు = అతడు; మానవమాంసంబు = నరమాంసముతో; వండి = వంటచేసి; తెచ్చి = తీసుకొని వచ్చి; ముని = ఋషి; కిన్ = కి; వడ్డింపన్ = వడ్డించగా; కోపించి = కోపముచేసి; ముని = ఋషి; నరేంద్రున్ = రాజుని; పిలిచి = పిలిపించి; మనుజామిషంబును = నరమాంసమును; పెట్టితి = పెట్టావు; అనుచున్ = అంటు; అలుక = కోపము; తోన్ = తోటి; రాక్షసుడవు = రాక్షసుడవుగా; కమ్ము = అయిపోవుము; అని = అని; శపించెన్ = శాపమునిచ్చెను.
భావము:- “ఆ సుదాసుడు వేటకి అడవికి వెళ్ళి ఒక రాక్షసుడిని సంహరించాడు. అతని సోదరుని చంపకుండా పోనిచ్చాడు. ఆ సోదరుడు పగబట్టాడు. మోసపూరితంగా వంటవానిలా వచ్చి రాజు కొలువులో చేరాడు. ఒక దినం రాజు వసిష్ఠుని భోజనానికి ఆహ్వానించాడు. భోజనం వండి పెట్టమని ఆ రాక్షససోదరుని నియమించాడు. అతడు నరమాంసముతో వంటచేసి తీసుకువచ్చి ఋషికి వడ్డించాడు. కోపగించిన వసిష్ఠుడు రాజుని “పిలిచి నరమాంసం పెట్టావు కనుక రాక్షసుడవు అయిపోమ్ము” అని శపించాడు.

తెభా-9-238-వ.
ఇట్లు శపియించి పదంపడి, రాక్షసుండు వండి తెచ్చుటయు, సుదాసుం డెరుంగమియుఁ దన మనంబున నెఱింగి, వసిష్ఠుఁడు పండ్రెండేండ్లు రక్కసుండవయి యుండుమని నియమించె; నయ్యవసరంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; శపియించి = శపించి; పదంపడి = తరువాత; రాక్షుసుండు = రాక్షసుడు; వండి = వంటచేసి; తెచ్చుటయు = తీసుకొచ్చుట; సుదాసుండు = సుదాసుడు; ఎరుంగమియున్ = తెలియకపోవుట; తన = తనయొక్క; మనంబునన్ = మనసులో; ఎఱింగి = తెలిసి; వసిష్ఠుడు = విసిష్ఠుడు; పండ్రెండు = పన్నెండు (12); ఏండ్లు = సంవత్సరములు; రక్కసుండవు = రాక్షసుడవుగా; అయి = అయ్యి; ఉండుము = ఉండుము; అని = అని; నియమించెను = కట్టుబాటుచేసెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు;
భావము:- ఈ విధంగ శపించిన తరువాత రాక్షసుడు కావాలని ఇలా వంటచేసి తీసుకవచ్చాడని, సుదాసుడికి ఇది తెలియదని వసిష్ఠుడు తెలుసుకున్నాడు. కనుక, పన్నెండు (12) ఏళ్ళు రాక్షసుడవుగా ఉండమని శాపం సవరించాడు. ఆ సమయంలో....

తెభా-9-239-మ.
గురువున్ మాఱుశపింతు నంచు జలముల్ గోపంబుతో దోయిటన్
నాథుండు ధరింపఁ దత్సతి పతిన్వారింప మిన్నుం దిశల్
యున్ జీవమయంబకా నిఖిలముం దాఁ జూచి చల్లెన్ ధరా
రుఁ డాత్మీయపదంబులం గరపుటీవాఃపూరముం బొక్కుచున్.

టీక:- గురువున్ = గురువును; మాఱు = తిరిగి; శంపింతున్ = శంపించెదను; అనుచున్ = అని; జలముల్ = నీటిని; కోపంబుతోన్ = అలుకతో; దోయిటన్ = దోసిట్లోకి; నరనాథుండు = రాజు {నరనాథుడు - మానవులకు ప్రభువు, రాజు}; ధరింపన్ = తీసుకొనగా; తత్ = అతని; సతి = భార్య; పతిన్ = భర్తను; వారింపన్ = ఆపగా; మిన్నున్ = ఆకాశము; దిశల్ = దిక్కులు; ధరయున్ = భూమి; జీవ = ప్రాణులతో; మయంబ = నిండినది; కాన్ = అయ్యుండగ; నిఖిలమున్ = సమస్తమును; తాన్ = అతను; చూచి = చూసి; చల్లెన్ = జల్లించెను; ధరావరుడు = రాజు; ఆత్మీయ = తనయొక్క; పదంబులన్ = పాదములపైన; కర = చేతి; పుటీ = పిడికిళ్ళలోని; వాఃపూరమున్ = నీటిధారను; పొక్కుచున్ = విచారించుచు.
భావము:- గురువును తిరిగి శంపిస్తాను అని రాజు సుదాసుడు అలిగి, దోసిట్లోకి నీటిని తీసుకున్నాడు. అతని భార్య భర్తను ఆపింది. స్నేహార్థ హృదయుడు కనుక భార్య మాట మన్నించాడు. ఆకాశం దిక్కులు భూమి ప్రాణులతో నిండి ఉంటాయని, దాసుడు చేతిలోని శాపజలాన్ని తన పాదల పైననే జల్లుకున్నాడు.

తెభా-9-240-వ.
ఇట్లు మిత్రసహుండు గావునఁ గళత్రానుకూలుండై శపియింప నొల్లక సుదాసుండు రాక్షస భావంబు నొంది, కల్మషవర్ణంబు లయిన పాదంబులతో నడవులం దిరుగుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; మిత్రసహుండు = స్నేహార్ద్ర హృదయుడు; కావున = కనుక; కళత్ర = భార్యకు; అనుకూలుండు = అనుకూలమైనడచువాడు; ఐ = అయ్యి; శపియింపక = శపించుటకు; ఒల్లక = ఇష్టపడకుండ; సుదాసుండు = సుదాసుడు; రాక్షసభావంబున్ = రాక్షసత్వమును; ఒంది = పొంది; కల్మష = నల్లటి; వర్ణంబులు = రంగుపొందినవి; అయిన = ఐన; పాదంబుల్ = పాదముల; తోన్ = తోటి; అడవులన్ = అడవులందు; తిరుగుచున్ = తిరుగుతూ.
భావము:- ఈ విధంగ స్నేహార్ద్ర హృదయుడు కనుక భార్యకు అనుకూలమై నడచువాడు అయ్యి శపించుటకు ఇష్టపడకుండ సుదాసుడు రాక్షసత్వాన్ని పొంది నల్లటి రంగు పాదాలతో కల్మాపాదుడై అడవిలో తిరుగుతూ....

తెభా-9-241-క.
ఆఁట మలమల మాఁడుచు
వీఁ నతం డడవి నున్న విప్ర మిథునముం
దాఁకి తటాలున విప్రునిఁ
గూఁటి చేఁబట్టి మ్రింగఁ గొనిపోవుతఱిన్.

టీక:- ఆకటన్ = ఆకలితో; మలమల = మలమల; మాడుచున్ = మాడిపోతూ; వీకన్ = విజృంభణముతో; అతండు = అతడు; అడవిన్ = అడవిలో; ఉన్నన్ = ఉండగా; విప్ర = బ్రాహ్మణ; మిథునమున్ = దంపతులను; తాకి = ఎదుర్కొని; తటాలునన్ = అతిశీఘ్రముగ; విప్రునిన్ = బ్రాహ్మణుని; కూకటిన్ = జుట్టు; చేన్ = చేతితో; పట్టి = పట్టుకొని; మ్రింగన్ = తినివేయుటకు; కొనిపోవు = తీసుకెళ్ళెడి; తఱిన్ = సమయమునందు.
భావము:- ఆకలితో మలమల మాడిపోతూన్న అతడు, ఆ అడవిలో ఒక బ్రాహ్మణ దంపతులను చూసాడు. వెంటనే వారిని అడ్డగించి, బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని తినడానికి తీసుకుపోసాగడు. అప్పుడు...

తెభా-9-242-వ.
అంత నా బ్రాహ్మణుని భార్య మోఁదికొనుచుం బెగ్గడిల్లి, డగ్గుత్తికతోఁ బతికి నడ్డంబు వచ్చి, యేడ్చుచు రాచరక్కసున కిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; బ్రాహ్మణుని = విప్రుని; భార్య = పెండ్లాము; మోదికొనుచున్ = గుండెలుబాదికొనుచు; బెగ్గడిల్లి = భయపడిపోయి; డగ్గుతిక = గద్గదస్వరము; తోన్ = తోటి; పతి = భర్త; కున్ = కి; అడ్డంబు = అడ్డము; వచ్చి = వచ్చి; ఏడ్చుచు = ఏడుస్తూ; రాచరక్కసున్ = రాజరాక్షసుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అంతట, భయపడిపోయిన ఆ విప్రుని పెండ్లాము గుండెలు బాదుకుంటూ భర్తకి అడ్డం వచ్చి ఏడుస్తూ గద్గదస్వరంతో రాజరాక్షసునితో ఇలా అన్నది.

తెభా-9-243-క.
"మానుషదేహము గలుగుట
భూనాయక! దుర్లభంబు పుట్టినమీదఁన్
దాముఁ బరోపకారము
భూనుతకీర్తియును వలదె పురుషున కెందున్?

టీక:- మానుష = మానవ; దేహము = జన్మము; కలుగుట = పొందుట; భూనాయక = రాజ {భూనాయకుడు - భూమికి ప్రభువు, రాజు}; దుర్లభంబు = చాలాకష్టము; పుట్టిన = జన్మించిన; మీదన్ = తరువాత; దానము = దానధర్మములు; పరోపకారమున్ = పరులకుసాయంచేయుట; భూ = లోకము నందు; నుత = స్తుతింపబడిన; కీర్తియును = కీర్తి; వలదె = వద్దా, కావలయును; పురుషున్ = మానవున; కున్ = కి; ఎందున్ = ఎప్పుడైనసరే.
భావము:- “ఓ భూనాయకా! మానవజన్మ పొందుటే చాలా కష్టము. మాననజన్మ అంటూ ఎత్తాక, దానధర్మాలు, పరోపకారం చేసి లోకంలో కీర్తి పొందాలి.

తెభా-9-244-మ.
వి వంశాగ్రణివై సమస్తధరణీరాజ్యాను సంధాయివై
భునస్తుత్యుఁడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై
విరంబేమియు లేక నా పెనిమిటిన్ విప్రుం దపశ్శీలు స
త్ప్రరున్ బ్రహ్మవిదున్ జగన్నుతగుణున్ క్షింపఁగాఁ బాడియే?

టీక:- రవివంశ = సూర్యవంశపు; అగ్రణివి = గొప్పవాడవు; ఐ = అయ్యి; సమస్త = సమస్తమైన; ధరణీ = లోకాన్ని; రాజ్యానుసంధాయివి = పాలించినవాడవు; ఐ = అయ్యి; భువన = లోకంచేత; స్తుత్యుడవు = కీర్తింపబడువాడవు; ఐ = అయ్యి; పరార్థ = పర లోక సౌఖ్యములను; రతివి = కోరిక కలవాడవు; ఐ = అయ్యి; పుణ్య = పుణ్యములను; అనుకూలుండవు = చేయువాడవు; ఐ = అయ్యి; వివరంబు = తప్పు; ఏమియున్ = ఏమాత్రము; లేక = లేకుండ; నా = నాయొక్క; పెనిమిటిని = భర్తను; విప్రున్ = బ్రాహ్మణుని; తపస్ = తపస్సు; శీలున్ = చేయుకొనువానిని; సత్ = మంచి; ప్రవరున్ = వంశమునపుట్టినవానిని; బ్రహ్మవిదున్ = బ్రహ్మజ్ఞానిని; జగత్ = లోకముచేత; నుత = స్తుతింపబడు; గుణున్ = సుగుణములుగలవానిని; భక్షింపగాన్ = తినుట; పాడియే = ధర్మమేనా, కాదు.
భావము:- అందులోనూ నీవు సూర్యవంశ మహానుభాడవు. లోకం అంతా ఏలినవాడవు. లోకులు అంతా కీర్తించేవాడవు. స్వర్గ సౌఖ్యాలను పొందగలవాడవు, పుణ్యాత్ముడవు, నా భర్త ఏ తప్పు చేయలేదు, సద్వంశ సంజాతుడు, మహాతాపసి, బ్రహ్మజ్ఞాని, స్తుతి పాత్ర సుగుణాలరాశి. అట్టి బ్రాహ్మణుని తినుట నీకు ధర్మం కాదు.

తెభా-9-245-శా.
తండ్రీ! మీకు దినేశవంశజులకున్ దైవం బగున్ బ్రాహ్మణుం
డండ్రా మాటలు లేవె? భూమిసుర గోత్యాభిలాషంబు గై
కొండ్రే మీ యటువంటి సాధువులు? రక్షోభావ మిట్లేల? మీ
తండ్రిం దాతలఁ బూర్వులం దలఁపవే ర్మంబునుం బోఁగదే.

టీక:- తండ్రీ = నాయనా; మీరు = మీ(వంశస్థుల); కున్ = కి; దినేశవంశజుల్ = సూర్యవంశపువారి; కున్ = కి; దైవంబు = దేవుడు; అగున్ = అయి ఉండును; బ్రాహ్మణుండు = విప్రుడు; అండ్రు = అనెదరు; ఆ = ఆ; మాటలు = మాటలు; లేవే = అబద్ధములా; భూమిసుర = బ్రాహ్మణుల; గో = గోవుల; హత్య = సంహరించవలెనని; అభిలాషంబున్ = కోరికను; కైకొండ్రే = తలచారా, లేదు; మీ = మీ; అటువంటి = లాంటి; సాధువులు = మంచివారు; రక్షస్ = రాక్షస; భావమున్ = తత్వమును; ఇట్లు = ఇలా; ఏల = ఎందుకు (ధరించెదవు); మీ = మీయొక్క; తండ్రిన్ = నాన్నగారిని; తాతలన్ = తాతలను; పూర్వులన్ = అంతకుముందువారిని; తలపవే = తలచుకొనుము; ధర్మంబునున్ = ధర్మమార్గమున; పోగదే = నడచుకొనుము.
భావము:- నాయనా! మీ సూర్యవంశంవారికి విప్రుడు అంటే దేవునితో సమానం అంటారు కదా. అది అబద్ధమా? మీ లాంటి మంచివారు ఎక్కడైనా బ్రహ్మహత్యాపాతకం, గోహత్యాపాతకం కోరి తెచ్చుకుంటారా? ఈ రాక్షసత్వం నీ కెందుకయ్యా? మీ పెద్దలను పూర్వీకులను తలచి ధర్మమార్గాన నడచుకో వద్దా?

తెభా-9-246-శా.
న్నా! చెల్లెల నయ్యెదన్; విడువు నీన్నంబు బెట్టింతు; నా
హృన్నాథున్ ద్విజు గంగికుఱ్ఱి నకటా! హింసింప నేలయ్య? నీ
వెన్నం డింతులతోడఁ బుట్టవె? నిజం బిట్టైన మున్ముట్ట నా
న్నన్ నన్ను శిరంబు ద్రుంచి మఱి మత్ప్రాణేశు భక్షింపవే."

టీక:- అన్నా = అన్నయ్య; చెల్లెలను = సోదరిని; అయ్యెదన్ = అవుతాను; విడువుము = వదలిపెట్టుము; నీ = నీ; కున్ = కు; అన్నంబు = అన్నము; పెట్టింతున్ = పెట్టించెదను; నా = నాయొక్క; హృన్నాథున్ = భర్తను {హృన్నాథుడు - హృదయమునకు ప్రభువు, భర్త}; ద్విజున్ = బ్రాహ్మణుని; గంగికుఱ్ఱిన్ = గంగిగోవులాంటివానిని; అకటా = అయ్యో; హింసింపన్ = సంహరించుట; ఏలన్ = ఎందుకు; అయ్య = తండ్రి; నీవున్ = నీవు; ఎన్నడున్ = ఎప్పుడును; ఇంతుల = స్త్రీల; తోడబుట్టవె = సోదరుడవుకావా; నిజంబున్ = నీనిర్ణయము; ఇట్టు = ఇలాగే; ఐననన్ = అయినచో; మున్నుట్టన్ = మొట్టమొదట; ఆపన్నన్ = దీనురాలనైన; నన్నున్ = నన్ను; శిరంబున్ = తల; త్రుంచి = నరికేసి; మఱి = తరువాత; మత్ = నాయొక్క; ప్రాణేశున్ = భర్తను {ప్రాణేశుడు - ప్రాణములకు నాథుడు, భర్త}; భక్షింపవే = తినుము.
భావము:- అన్నయ్యా! నీకు చెల్లెలిని అవుతాను. నాభర్తను వదలిపెట్టు. నీకు అన్నం వండి పెడతాను. బ్రాహ్మణుడిని, గంగిగోవులాంటి సాధుస్వభావిని అయ్యో! ఎందుక చంపుతావు? నాయనా! నీకు అక్కచెల్లెళ్ళు లేరా? అంతకీ నీకు చంపాలనే ఉంటే ముందు దీనురాలనైన నా తల ఖండించి, పిమ్మట నా భర్తను భక్షించు.”

తెభా-9-247-క.
ని కరుణ పుట్ట నాడుచు
నితామణి పలవరింప సుధాదేవుం
దినియె నతఁడు పులి పశువుం
దిను క్రియ శాపంబు కతన ధీరహితుండై.

టీక:- అని = అని; కరుణ = జాలి; పుట్టన్ = కలుగునట్లు; ఆడుచున్ = పలుకుతు; వనితామణి = స్త్రీరత్నము; పలవరింపన్ = బతిమాలగా; వసుధాదేవున్ = విప్రుని; తినియెన్ = భక్షించెను; అతడు = అతడు; పులి = పులి; పశువున్ = పశువును; తిను = తినెడి; క్రియన్ = వలె; శాపంబు = శాపము; కతన = వలన; ధీ = వివేకము; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి.
భావము:- అని ఆ స్త్రీరత్నం ఎంత జాలి కలిగేలా బతిమాలినా, శాపం వలన వివేకం కోల్పోయిన కల్మాషపాదుడు పులి పశువును తినున్నట్లు విప్రుని భక్షించాడు.

తెభా-9-248-వ.
అంత నా బ్రాహ్మణి గోపించి “కామార్తనయిన నాదు పెనిమిటిని భక్షించితివి గావున నీవు నెలఁతలంబొందఁ జేరినవేళ మరణంబుఁ బొందు” మని కల్మాషపాదుని శపించి, పతిశల్యంబులతో నగ్నిప్రవేశంబు జేసి సుగతికిం జనియె; నంతఁ బండ్రెండేండ్లు చనిన నా రాజు మునిశాపనిర్ముక్తుండై.
టీక:- అంతన్ = అంతట; బ్రాహ్మణి = బ్రాహ్మణస్త్రీ; కొపించి = కొపగించి; కామ = కోరికలతో; ఆర్తన్ = దుఃఖిస్తున్నదానిని; అయిన = ఐన; నాదు = నాయొక్క; పెనిమిటిని = భర్తను; భక్షించితివి = తినివేసితివి; కావున = కనుక; నీవున్ = నీవు; నెలతలన్ = స్త్రీలను; పొందన్ = కలియుటకు; చేరిన = వెళ్లిన; వేళ = సమయమునందు; మరణంబున్ = చావును; పొందుము = పొందుగాక; అని = అని; కల్మాషపాదుని = కల్మాషపాదుని; శపించి = శపించి; పతి = భర్త; శల్యంబులన్ = ఎముకల; తోన్ = తోటి; అగ్నిప్రవేశము = సహగమనము; చేసి = చేసి; సుగతి = ముక్తి; కిన్ = కి; చనియెన్ = వెళ్ళెను; అంతన్ = అంతట; పండ్రెండు = పన్నెండు; ఏండ్లు = సంవత్సరములు; చనినన్ = గడవగా; ఆ = ఆ; రాజు = రాజు; ముని = ముని ఇచ్చిన; శాప = శాపమునుండి; నిర్ముక్తుండు = విడుదలైనవాడు; ఐ = అయ్యి.
భావము:- అంతట ఆ బ్రాహ్మణి కొపగించి. “కామార్తురాలైన నా యొక్క భర్తను భక్షించేసావు. కనుక, నీవు స్త్రీసాంగత్యానికి వెళ్లావంటే మరణించెదవు గాక.” అని కల్మాషపాదుని శపించింది. పిమ్మట భర్త ఎముకలతో సహగమనం చేసి ఉత్తమగతి పొందింది. పన్నెండు ఏళ్ళు గడిచాక కల్మాషపాదుడికి ముని శాపం తీరింది.

తెభా-9-249-ఆ.
తులకొఱకు నాలి రావింప నదియును
బెదరి విప్రసతి శపించు టెఱిఁగి
గని నడ్డపెట్టి మైథునకర్మంబు
మాన్చె సతుల గోష్ఠి మానె నతడు.

టీక:- రతుల్ = సంసారసుఖము; కొఱకున్ = కోసము; ఆలిన = భార్యను; రావింపన్ = పిలిపించగా; అదియును = ఆమె; బెదిరి = భయపడి; విప్ర = బ్రాహ్మణుని; సతి = భార్య; శపించుట = శాపమిచ్చుట; ఎఱిగి = గుర్తుండి; మగనిన్ = భర్తను; అడ్డపెట్టి = వారించి; మైథునకర్మంబు = కలియుటను; మాన్చెన్ = మానిపించెను; సతులగోష్టిన్ = స్త్రీసాంగత్యమును; మానెను = వదలిపెట్టెను; అతడు = అతను.
భావము:- అలా తన రాజ్యం చేరిన ఆ రాజు సంసారసుఖం కోసం భార్యను పిలిపించాడు. ఆమె బ్రాహ్మణుని భార్య శాపం గుర్తుచేసి భర్తను వారించింది. దానితో అతను స్త్రీసాంగత్యం వదలిపెట్టాడు.

తెభా-9-250-క.
ది కారణముగఁ బుత్రా
భ్యుయము లేదా సుదాసభూపాలునకుం
నుమతి నవ్వసిష్ఠుఁడు
యంతికిఁ గడుపుజేసె దనక్రీడన్.

టీక:- అది = ఆ; కారణంబునన్ = కారణముచేత; పుత్రాభ్యుదయము = సంతానకలుగుట; లేదు = లేదు; ఆ = ఆ; సుదాస = సుదాసుడను; భూపాలున్ = రాజు; కున్ = కి; తత్ = అతని; అనుమతిన్ = అంగీకారముతో; ఆ = ఆ; వసిష్థుడు = వసిష్ఠుడు; మదయంతి = మదయంతి; కిన్ = కి; కడుపు = గర్భము; చేసె = చేసెను; మదనక్రీడన్ = రతికార్యముతో.
భావము:- దానితో సంతానం కలుగుట లేదు. ఆ సుదాసురాజు అంగీకారంతో వసిష్ఠుడు మదయంతికి గర్భాదానం చేసాడు.

తెభా-9-251-వ.
ఇట్లు సుదాసుని భార్య యగు మదయంతి వసిష్ఠునివలన గర్భిణి యై యేడేండ్లు గర్భంబు ధరించి నీళ్ళాడ సంకటపడుచున్న వసిష్ఠుండు వాఁడి యగు నశ్మంబున నా గర్భంబుఁ జీరిన నశ్మకుం డను కుమారుండు పుట్టె; నతనికి మూలకుండు పుట్టె; నతండు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సుదాసుని = సుదాసుని; భార్య = భార్య; అగు = ఐన; మదయంతి = మదయంతి; వసిష్ఠుని = వసిష్ఠుని; వలన = వలన; గర్భిణి = గర్భవతి; ఐ = అయ్యి; ఏడు = ఏడు (7); ఏండ్లు = సంవత్సరములు; గర్భంబున్ = గర్భములో; ధరించి = శిశువునుంచుకొని; నీళ్ళాడ = ప్రసవించుటకు; సంకటపడుతున్నన్ = కష్టపడుతుండగ; వసిష్ఠుండు = వసిష్ఠుడు; వాడి = సూదియైనది; అగు = ఐన; అశ్మంబున్ = రాతిచే; ఆ = ఆ; గర్భంబున్ = గర్భమును; చీరినన్ = చీల్చగా; అశ్మకుండు = అశ్మకుడు; అను = అనెడి; కుమారుండు = పుత్రుడు; పుట్టెను = జన్మించెను; అతని = అతని; కిన్ = కి; మూలకుండు = మూలకుడు; పుట్టెన్ = జన్మించెను; అతండు = అతడు.
భావము:- ఈ విధంగా సుదాసుని భార్య ఐన మదయంతి వసిష్ఠుని వలన గర్భవతి అయ్యి ఏడు (7) ఏళ్ళు గర్భంలో శిశువును ఉంచుకొని ప్రసవించుటకు కష్టపడుతుండగ వసిష్ఠుడు ఒక సూది రాయితో ఆ గర్భాన్ని చీల్చగా అశ్మకుడు అనెడి పుత్రుడు జన్మించాడు. అతనికి మూలకుడు జన్మించాడు అతడు.

తెభా-9-252-క.
వీరుఁడగు పరశురాముఁడు
ఘో కుఠారమున నృపులఁ గూలుచు వేళన్
నారీజనములు దాఁచిన
నారీకవచుం డనంగ లి నుతి కెక్కెన్.

టీక:- వీరుడు = శూరుడు; అగు = ఐన; పరశురాముడు = పరశురాముడు; ఘోర = భయంకరమైన; కుఠారమునన్ = గొడ్డలితో; నృపులన్ = రాజులను; కూలుచు = చంపెడి; వేళను = సమయమునందు; నారీజనములున్ = స్త్రీలు; దాచినన్ = వారిమరుగునఉంచగ; నారీకవచుండు = నారీకవచుడు; అనంగన్ = అని; నలిన్ = మిక్కిలి; నుతికెక్కెను = ప్రసిద్ధుడయ్యెను.
భావము:- శూరుడు, పరశురాముడు భయంకరమైన గొడ్డలితో రాజులను చంపుతున్న సమయలో, స్త్రీలు వారి చాటున ఈ మూలకుని దాచారు. అందుచేత నారీకవచుడు అని పేరు పొందాడు.